రియాలిటీ షోల వల్ల సెలబ్రిటీలకు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వస్తోంది. అందుకే ఏదో ఒక షోతో సరిపెట్టుకోకుండా వీలైనన్నిచోట్లా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అషుతోష్ కౌశిక్ కూడా అదే చేశాడు. ఎమ్‌టీవీ రోడీస్ ఐదో సీజన్ (2007)లో పాల్గొన్న ఇతడు ఆ షో టైటిల్ విజేతగా రూ.2.5లక్షలు గెలుచుకున్నాడు. అయితే ఇందులో మెజారిటీ భాగం టాక్స్ కట్టడానికే పోయిందట.
రూ.1 కోటి ప్రైజ్‌మనీ
ఆ మరుసటి ఏడాది అంటే 2008లో హిందీ బిగ్‌బాస్ రెండో సీజన్‌లో పాల్గొన్నాడు. ఈ షోలో ఏకంగా రూ.1 కోటి గెలుచుకున్నాడు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైందట.. దీని గురించి అషుతోష్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షోలో నేను రూ.1 కోటి గెలుచుకున్నాను. అందులో రూ.30 లక్షలు తమకు ఇవ్వాలని ఎమ్‌టీవీ డిమాండ్ చేసింది. అదేమంటే నేను రుణపడి ఉన్నానంది. వారి అగ్రిమెంట్ ప్రకారం రెండేళ్లపాటు నేను సంపాదించినదానిలో 30 శాతం ఎమ్‌టీవీకే ఇవ్వాలి.
డమ్మీ వీజేగా పెట్టి..
నాకు పెద్దగా చదువు రాదు. దీంతో అగ్రిమెంట్ చదవకుండానే సంతకం చేశాను. కానీ బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ గిఫ్ట్ కిందకు వస్తుందని, అది జీతం కిందకు రాదని వాదించాను. పైగా బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినప్పుడే ఎమ్‌టీవీ వాళ్లను సంప్రదించాను. వాళ్లు నాకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదు. అసలు పట్టించుకోలేదు. చివరగా ఓ ఒప్పందానికి వచ్చాం. వారికోసం రెండేళ్లపాటు వీజేగా పని చేశాను. అప్పుడు నాకు నెలకు రూ.1.5 లక్షలు ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment