MTv
-
రూ.1 కోటి ప్రైజ్‌మనీ.. అగ్రిమెంట్ ప్రకారం 30 శాతం ఇచ్చేయాలట!
రియాలిటీ షోల వల్ల సెలబ్రిటీలకు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వస్తోంది. అందుకే ఏదో ఒక షోతో సరిపెట్టుకోకుండా వీలైనన్నిచోట్లా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అషుతోష్ కౌశిక్ కూడా అదే చేశాడు. ఎమ్‌టీవీ రోడీస్ ఐదో సీజన్ (2007)లో పాల్గొన్న ఇతడు ఆ షో టైటిల్ విజేతగా రూ.2.5లక్షలు గెలుచుకున్నాడు. అయితే ఇందులో మెజారిటీ భాగం టాక్స్ కట్టడానికే పోయిందట. రూ.1 కోటి ప్రైజ్మనీఆ మరుసటి ఏడాది అంటే 2008లో హిందీ బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొన్నాడు. ఈ షోలో ఏకంగా రూ.1 కోటి గెలుచుకున్నాడు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైందట.. దీని గురించి అషుతోష్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షోలో నేను రూ.1 కోటి గెలుచుకున్నాను. అందులో రూ.30 లక్షలు తమకు ఇవ్వాలని ఎమ్‌టీవీ డిమాండ్ చేసింది. అదేమంటే నేను రుణపడి ఉన్నానంది. వారి అగ్రిమెంట్ ప్రకారం రెండేళ్లపాటు నేను సంపాదించినదానిలో 30 శాతం ఎమ్టీవీకే ఇవ్వాలి.డమ్మీ వీజేగా పెట్టి..నాకు పెద్దగా చదువు రాదు. దీంతో అగ్రిమెంట్ చదవకుండానే సంతకం చేశాను. కానీ బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ గిఫ్ట్ కిందకు వస్తుందని, అది జీతం కిందకు రాదని వాదించాను. పైగా బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినప్పుడే ఎమ్‌టీవీ వాళ్లను సంప్రదించాను. వాళ్లు నాకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదు. అసలు పట్టించుకోలేదు. చివరగా ఓ ఒప్పందానికి వచ్చాం. వారికోసం రెండేళ్లపాటు వీజేగా పని చేశాను. అప్పుడు నాకు నెలకు రూ.1.5 లక్షలు ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వెబ్ స్క్రీన్‌పై బాగా వినిపిస్తున్న ఈ హీరోయిన్ గురించి తెలుసా ?
ఈ నటి పేరు సనా సయ్యద్. టీవీ ప్రేక్షకులకు .. మరీ ముఖ్యంగా ఎమ్‌టీవీ అభిమానులకు ఆమె బాగా సుపరిచితం. ఎమ్‌టీవీ రియాలిటీ షో 'స్ల్పిట్స్‌విల్లా' సీజన్ 8 ఫస్ట్ రన్నరప్ సనా సయ్యద్. ఆ షోనే ఆమెను పాపులర్ చేసింది. ఇప్పుడు వెబ్ స్క్రీన్ మీదా వెలుగుతోంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సనా సయ్యద్ గురించి పలు ఆసక్తికర విషయాలు చూసేద్దామా ! సనా సయ్యద్ పుట్టింది, పెరిగింది ముంబైలో. బికామ్ గ్రాడ్యుయేట్. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్, యాక్టింగ్ అంటే ఆసక్తి. స్కూల్ డేస్‌లో రన్నింగ్, సైక్లింగ్‌లో చాంపియన్. పుస్తకాలు కూడా బాగా చదువుతుంది. అందులో విజయం ‘జానా నా దిల్ సే దూర్’ అనే సీరియల్లో నటిగా చాన్స్‌నిచ్చింది. ఈ సీరియల్ అనంతరం ఆమె యాక్టింగ్ షెడ్యూల్ బిజీ అయిపోయింది. స్పోర్ట్స్ పట్ల ఆమెకున్న ఆసక్తి చూసి సనా అథ్లెట్ అవుతుందని అనుకున్నారట ఆమె కుటుంబ సభ్యులు. వాళ్ల అంచనాలకు అందకుండా యాక్టర్ అయింది. (చదవండి: నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్) యాక్టింగ్‌లో కెరీర్ కోసం ముందు మెడల్‌గా మారింది. మోడలింగ్ చేస్తున్నప్పుడే ‘స్ల్పిట్స్‌విల్లా’ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. సనాను అభిమాన టీవీ నటిగా చేసింది మాత్రం ‘దివ్యదృష్టి’ అనే సీరియలే. ఆ ఫేమ్.. నేమ్ ఆమెకు వెబ్ స్క్రీన్ అప్పియరెన్స్నూ ఇప్పించింది. ‘లాక్ డౌన్ కి లవ్ స్టోరీ’, ‘స్పై బహు’ వంటి సిరీస్‌లో ప్రధాన భూమికల్లో మెప్పిస్తూ వీక్షకుల ప్రశంసలకు పాత్రురాలవుతోంది. 'నా హాబీ.. ప్రొఫెషన్.. అన్నీ కూడా యాక్టింగే. సో.. సెట్స్ మీద లేకపోయినా.. ఇంట్లో అద్దం ముందు నిలబడి నా నటనకు మెరుగులు దిద్దుకుంటూ ఉంటా. సినిమా క్రాఫ్ట్‌కి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటా. జయాపజయాలను స్పోర్టివ్‌గా తీసుకుంటా.. ఎంతైనా స్పోర్ట్స్ పర్సన్‌ను కదా!' అని అంటోంది సనా సయ్యద్. (చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం) -
Eksha Hangma Subba: సూపర్ ఉమన్!
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు విమానాలను కూడా అవలీలగా నడిపేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో నైపుణ్యంతో రాణిస్తూంటే ‘ఇక్షా హంగ్మా సుబ్బ’ మాత్రం నాలుగు నైపుణ్యాలతో వందమందిలో ఒక్కటిగా దూసుకుపోతుంది. ఇక్షా హంగ్మా సుబ్బ.. ఏంటీ అనిపిస్తుంది కదూ! అవును ఈ పేరు పలకడానికి, వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నట్టుగానే ఇక్షా వృత్తినైపుణ్యాలు ఒకదానికి ఒకటి పొంతన లేకపోయినప్పటికీ, తనదైన శైలిలో రాణిస్తూ అందరిచేత సూపర్ ఉమన్ అనిపిస్తోంది. బోల్డ్ అండ్ బ్యూటిపుల్‌గా పేరొందిన ఇక్షా.. సిక్కిం పోలీస్ ఆఫీసర్, జాతీయ స్థాయి బాక్సర్, బైకర్, ఎమ్‌టీవీ సూపర్ మోడల్. సిక్కిం రాష్ట్రంలోని పశ్చిమ జిల్లా సొంబారియా గ్రామంలో ఐతరాజ్, సుకర్ణి సుబ్బా దంపతులకు 2000 సంవత్సరంలో ఇక్షా జన్మిచింది. ఒక సోదరుడు ఉన్నాడు. ప్రైమరీ,సెకండరీ విద్యాభ్యాసం అంతా సొంతూరులోనే పూర్తి చేసింది. తరువాత గ్యాంగ్‌టక్‌లోని బహదూర్ భండారీ కాలేజీలో డిగ్రీలో చేరింది. ఈ సమయం లోనే ఎన్ఎస్ఎస్లోలో చేరింది. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే ఇక్షాకు నటన అన్నా... మోడలింగ్ అన్నా అమితాసక్తి. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల మూలంగా డిగ్రీ చదువుతూనే పోలీసు ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో సిక్కిం పోలీస్ విభాగంలో చేరింది. 14 నెలల శిక్షణ తరువాత ‘యాంటీ రైట్ ఫోర్స్’ విభాగంలో పోలీస్ ఆధికారిగా చేరింది. ఉద్యోగంలో చేరి, కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతున్నప్పటికీ చిన్నప్పటినుంచి ఉన్న మోడలింగ్ ఆసక్తి వెలితిగా తోచింది తనకు. మిస్ సిక్కిం.. పోలీస్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్కూల్లో ఉన్నప్పుడు వివిధ మోడలింగ్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లలో పాల్గొని గెలిచిన సందర్భాలు, కాలేజీలో ‘మిస్ ఫ్రెషర్’గా టైటిల్‌ను గెలుచుకున్న సందర్భాలు తనకి గుర్తొచ్చేవి. తన గ్రామం నుంచి రాష్ట్రస్థాయి మోడలింగ్ పోటీలలో పాల్గొని మిస్ సిక్కిం టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఇక్షాకు మోడలింగ్‌లోకి వెళ్లేందుకు నమ్మకం కుదిరింది. అక్కడి నుంచి వివిధ రకాల మోడలింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఎమ్‌టీవీ సూపర్ మోడల్ –2 రియాల్టీ షో ఆడిషన్స్‌కు హాజరై సెలక్ట్ అయింది. ఈ సెలక్షన్స్ ద్వారా ఇక్షా గురించి అందరికీ తెలిసింది. మొత్తం పదిహేనుమంది పాల్గొన్న ఈ షోలో మొదట టాప్ నైన్లో చోటు సంపాదించుకుని పాపులర్ అయ్యింది. పోటాపోటీగా జరుగుతున్న ఈ షోలో ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతూ అందర్ని ఆకట్టుకుంటోంది. టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా సూపర్ మోడల్‌గా ఇక్షాను పొగుడుతూ ట్వీట్ చేయడం, షో న్యాయనిర్ణేతలు కూడా ఇక్షాను అభినందిస్తుండంతో అంతా ఆమెను అభినందనలలో ముంచెత్తుతున్నారు. ఇక్షా ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు ఆటలు బాగా పనికొస్తాయని ప్రోత్సహించడంతో స్థానికంగా నిర్వహించే బాక్సింగ్ తరగతులకు హాజరై బాక్సింగ్ నేర్చుకుని జాతీయస్థాయి బాక్సర్‌గా ఎదిగింది. అలా ఒకపక్క బాక్సింగ్ చేస్తూనే మరోపక్క ఉద్యోగం చేస్తూ తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ సూపర్ ఉమన్‌గా నిలుస్తోంది. ఇక్షాకు మోడలింగ్‌తోపాటు డ్రైవింగ్ కూడా చాలా ఇష్టం. అందుకే ఆమె కేటీఎమ్ ఆర్సీ 200 మోటర్ బైక్ నడుపుతూ లాంగ్ రైడ్స్‌కు వెళ్తుంటుంది. చిన్న వయసులో ఇన్ని రకాల నైపుణ్యాలతో దూసుకుపోతూ ఎంతోమంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తోంది ఇక్షా. -
టీవీ సిరీస్‌లో సానియా మీర్జా
ముంబై : ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మొట్టమొదటిసారి టీవీ సిరీస్‌లో నటించబోతున్నారు. క్షయ వ్యాధి (టిబి) పట్ల అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఎమ్‌టివి నిషేద్ అలోన్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సిరీస్‌లో సానియా మీర్జాగానే ఆమె కనిపించనున్నారు. దీనిపై సానియా మీర్జా మాట్లాడుతూ.. ‘టీబీ మన దేశంలో అత్యంత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ మహ్మరి బారినపడ్డ వారిలో సగానిపైగా 30 ఏళ్లలోపు వారే ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దాని చుట్టూ ఉన్న అవాస్తవాలను పరిష్కరించడానికి, అవగాహన కల్పించటానికి, ప్రజల్లో మార్పును తీసుకురావాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. కాగా, ఐదు ఎపిసోడ్ల ఈ సిరీస్ ఎమ్‌టీవీ ఇండియా, ఎమ్‌టీవీ నిషేద్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా వేదికల్లో విడుదల కానుంది. నవంబర్ చివరి వారంలో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది నాకు తెలిసిన అత్యంత నిస్వార్థమైన ప్రేమ: సానియా -
నా పేరు చెప్పుకోండి చూద్దాం!
‘సృజనాత్మకత చిగురులు తొడిగే క్షణంలో నేను పుట్టాను... కాంతిలా.. ప్రేమలా విశ్వంలో వ్యాప్తి చెందుతాను... జీవన ప్రవాహపు ప్రతీ అలలోనూ నేను కనబడతాను... ప్రతీ హృదయపు లయలో.. ప్రతీ పాటలో నేను వినిపిస్తాను.... వాన చినుకులు ముఖాన్ని తాకుతున్నపుడు.. ఆస్వాదించే స్వర్గంలో... రుతువులు మారే సమయంలో కనిపిస్తాను... నేను ఏ ఒక్క సంస్కృతికో పరిమితం కాను... దేశాలు.. ఖండాలను దాటి ఉంటుంది నా పరిధి.... నేను ప్రపంచ వ్యాప్తం... నన్నెవరూ నిర్వచించలేరు... నేను అమరం.. నేను రిథమ్’ అంటూ ప్రముఖ రియాలిటీ షోలు రోడీస్, స్ల్పిట్స్విల్లాల రూపకర్త, ప్రొడ్యూసర్ రఘురాం దంపతులు తమ కుమారుడిని ప్రపంచానికి పరిచయం చేశారు. తన తొలి ఫొటోను షేర్ చేస్తూ.. అతడి పేరును కవితాత్మకంగా అభిమానులతో పంచుకున్నారు. కాగా ఎమ్‌టీవీ రియాలిటీ షోల ద్వారా గుర్తింపు పొందిన రఘురాం.. కెనడియన్ సింగర్ నటాలియో డి లూసీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట జనవరి 6న కుమారుడికి జన్మనిచ్చింది. అతడికి రిథమ్‌గా నామకరణం చేసిన వీరు.. శుక్రవారం తొలిసారిగా తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క్రమంలో ఈ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తన కొడుకుకు రిథమ్ అనే పేరును ఎంపిక చేయడం గురించి రఘురాం మాట్లాడుతూ... ‘ విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న భాషలతో ముడిపడి... మా కలయికను ప్రతిబింబించేలా ఉన్న పేరు కోసం అన్వేషించాం. రిథమ్ అనే పేరు సరిగ్గా సరిపోతుందని భావించాం. ముఖ్యంగా ఇది ఏ మతంతోనూ ముడిపడిన పేరు కాదు’ అని పేర్కొన్నాడు. కాగా రఘురాం 2006లో నటి సుగంధ గార్గ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2018లో సుగంధతో విడాకులు తీసుకున్న రఘురాం.. ఆ తర్వాత నటాలియోతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక రియాలిటీ షోలతో పాటు తీస్మార్ ఖాన్, జూటా హై సాహి వంటి సినిమాల ద్వారా రఘురాం నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram I am Rhythm. I was born at the moment of creation. I permeate the universe. Like light. Like love. I am present in the very ebb and flow of life. I can be felt in every heart beat. You can hear me in every song. I can be found in the changing of seasons and in raindrops falling on a face turned up to the heavens. I cannot be contained in any one culture. I transcend countries and continents. I am global. Nay, I am Cosmic. Eternal. I am Rhythm. Hello World! 🤗 A post shared by Raghu Ram (@instaraghu) on Jan 9, 2020 at 7:00pm PST -
తమ్ముడి దుర్మరణం; నటుడి భావోద్వేగం
‘రూపేశ్ అమెరికాలో సెటిలయ్యాడు. తన పెళ్లై రెండు నెలలు కూడా గడవలేదు. తన వయస్సు 25 ఏళ్లు. ఇంకొన్ని రోజుల్లో తన భార్య కూడా అమెరికాకు వెళ్లాల్సింది. కానీ ఇంతలోనే తను శాశ్వతంగా మమ్మల్ని విడిచివెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఇంకా నమ్మలేకున్నా’ అని టీవీ నటుడు, నాగిన్ 3 సీరియల్ ఫేం ప్రిన్స్ నరులా భావోద్వేగానికి లోనయ్యాడు. తన సోదరుడి ఆకస్మిక మరణం ఎంతగానో వేదనకు గురిచేస్తోందన్నాడు. ప్రిన్స్ సోదరుడు రూపేశ్ కెనడాలో దుర్మరణం చెందాడు. ప్రస్తుతం అతడి శవాన్ని భారత్‌కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వద్దన్నా వినకుండా.. ఈ క్రమంలో ప్రిన్స్ మాట్లాడుతూ.. ‘తను ప్రస్తుతం టొరంటోలో ఉన్నాడు. గత సోమవారం స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. నిజానికి తనకు సిమ్మింగ్ రాదు. స్నేహితులు వద్దని వారించినా తను వినలేదు. వాళ్లను అక్కడి నుంచి వెళ్లమని చెప్పి నీటిలో దిగాడు. దురదృష్టవశాత్తూ అందులోనే మునిగి చనిపోయాడు. మునిగిపోతున్నా కాపాడండి అన్న తన మాటలు తమకింకా వినిపిస్తున్నాయని తన ఫ్రెండ్స్ చెప్పారు. అన్నీ సక్రమంగా ఉంటే రూపేశ్ భార్య తన దగ్గరికి వెళ్లి కొత్త జీవితం ప్రారంభించేది. వీసా రానందున మాతో పాటు ఇక్కడే ఉంది. కానీ ఇంతలో ఇలా జరిగింది. అమ్మానాన్న తన శవాన్ని ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక రూపేశ్ భార్యను యువికా(ప్రిన్స్ భార్య) ఓదారుస్తోంది’ అని స్పాట్బాయ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా ఎంటీవీ రోడీస్ 12, ఎంటీవీ స్పాట్విల్లా 8, బిగ్‌బాస్ 9 తదితర రియాలిటీ షోల విజేతగా ప్రిన్స్ నరులా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. -
సింగర్‌తో ప్రొడ్యూసర్ ఎంగేజ్మెంట్
ప్రముఖ రియాలిటీ షోలు రోడీస్, స్ల్పిట్స్విల్లాల రూపకర్త, ప్రొడ్యూసర్ రఘురాం తన గర్ల్‌ఫ్రెండ్ నటాలియో డి లూసీతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. టొరంటోలో అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగిన వీరి నిశ్చితార్థ వేడుకకు టీవీ నటుడు కరణ్వీర్ బోహ్రాతో పాటు అతడి భార్య తీజాయ్ కూడా హాజరయ్యారు. రఘురాం, నటాలియోతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసిన తీజాయ్..‘ మేము ఈ రోజు టొరంటోలో ఉండటానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. మాకెంతో ప్రియమైన స్నేహితుల కోసం ఇక్కడికి వచ్చాం. రఘు.. చాలా స్వీట్, ఇంటెలిజెంట్ పర్సన్. అన్ని రకాల సంతోషాలు పొందడానికి నువ్వు మాత్రమే అర్హుడివి. మీ ఇద్దరి(రఘు, నటాలియో)ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. కెనడియన్ అమ్మాయిలు ఎప్పుడూ ప్రత్యేకమే కదా’ అంటూ క్యాప్షన్ జత చేశారు. ఎమ్‌టీవీ రియాలిటీ షోల ద్వారా గుర్తింపు పొందిన రఘురాం 2006లో నటి సుగంధ గార్గ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో సుగంధతో విడాకులు తీసుకున్న రఘురాం.. గత కొంత కాలంగా కెనడియన్ సింగర్ నటాలియోతో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. The main reason we were in Toronto - to see two of our dearest friends get engaged. :) Raghu - You have always been one of the people I love most - so sweet, so kind, so intelligent, and so funny (especially at 8am!!) 😄 If anyone deserves happiness, it's you and I'm so glad you found it with Natalie. (Aren't Canadians awesome?) ;) You guys are so great together! 😍 Biggest hug ever to you.. ❤ @instaraghu @nataliediluccio A post shared by Teejay Sidhu (@bombaysunshine) on Aug 4, 2018 at 11:40am PDT -
’ట్రోల్’ తీసింది..
-
దవడ పగులుద్ది: హీరోయిన్ వార్నింగ్
సాక్షి, ముంబై: ‘నువ్వు కచ్చితంగా నీ తల్లిదండ్రులను గౌరవించవు. నీకు పూర్తిగా పిచ్చి పట్టింది. నీ గురించి ఏమనుకుంటున్నావ్? నువ్వు ఎవరికి తెలుసు? ఇప్పుడే ఇక్కడే చెంపదెబ్బ కొట్టమంటావా? నా చెయ్యి చూశావా? ఇది నీ ముఖం కంటే పెద్దదిగా ఉంది. ఈ చేతితో దెబ్బ కొడితే నీ దవడ పగలడం ఖాయమ’ని బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ టీవీ కార్యాక్రమంలో గట్టి హెచ్చరిక చేసింది. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 23 ఏళ్ల యువకుడికి ఎంటీవీ ‘ట్ర్రోల్ పోలీస్’ షోలో వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి బ్రెయిన్‌వాష్ చేస్తున్నారు. ‘ట్ర్రోల్ పోలీస్’లో తాప్సి ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంటీవీని సంప్రదించి తాను ఈ షోలో పాల్గొనట్టు జరీన్ ఖాన్ వెల్లడించింది. సోషల్ మీడియాలో అకారణంగా తమపై దూషణలకు దిగేవారికి తగిన గుణపాఠం చెప్పేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలు చేసే వారు దాక్కోలేరని, ఎక్కడున్నా దొరికిపోతారని ‘హేట్ స్టోరీ 3’ హీరోయిన్ హెచ్చరించింది. అనవసర విషయాల్లో తలదూర్చి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఇకనైనా బుద్ధిగా ఉండాలని సలహాయిచ్చింది. జరీన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ వీడియో వైరల్‌గా మారింది. -
మీ నట్టింట్లోకి వస్తానంటున్న సన్నీ లియోన్
బాలీవుడ్‌కు వచ్చిననాటి నుంచి తీరిక లేకుండా గడుపుతోంది సన్నీ లియోన్. ఇటు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలుకరిస్తూనే.. అటు టీవీలోనూ హల్చల్ చేయడానికి సిద్ధమవుతోంది ఈ హాట్ భామ. త్వరలో ఎంటీవీలో ప్రసారం కానున్న 'స్ప్లిట్స్‌విల్లా సీజన్ 9' హోస్ట్‌గా, మెంటర్‌గా సన్నీ టీవీ వీక్షకుల ముందుకురానుంది. ఎంటీవీలో వచ్చే ఈ కార్యక్రమం పట్ల యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. తన రాకతో ఈ షో మరింత ప్రేక్షకాదరణ పొందుతుందని సన్నీ ధీమాగా ఉంది. 'యువతను ఎక్కువగా ఆకర్షించాలని నేను కోరుకునేదానిని. ఎంటీవీ షోలో హోస్ట్‌గా యువత ముందుకు రానుండటం ఎక్సైటింగ్‌గా ఉంది' అని ఆమె తెలిపింది. 'నా వరకు ఈ షో ద్వారా కొత్త మార్కెట్‌కు నేను చేరువ అవుతాను. ఆ మార్కెట్ యువత. సినిమాల్లో నేను పోషించే పాత్రల వల్ల ఒక విభిన్నమైన అభిప్రాయం కలుగవచ్చు. కానీ టీవీలో ఈ షో ద్వారా నేను యువతను రిప్రజెంట్ చేస్తూ ప్రజల నట్టింట్లోకి వెళ్లే అవకాశం కలుగుతుంది' అని సన్నీ పేర్కొంది. -
ఆటను మార్చగల యువకుడు!
‘ఇండియాలో కూడా గూగుల్ స్థాయి కంపెనీ ఒకటి ప్రారంభం అయినా పెద్దగా ఆశ్చర్యపోవద్దు...’ అని అంటాడు అంకిత్ ఫదియా. సెర్చింజన్ దిగ్గజం గూగుల్స్థాయి గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా అంకిత్ కామెంట్‌ను విని ఆశ్చర్యపోతారు. మనకంత దృశ్యం ఉందా? అని సందేహాన్ని వ్యక్తం చేస్తారు. అయితే అంకిత్ ఫదియా లాంటి ప్రతిభ ఉన్న వాళ్లకు తగిన ప్రోత్సాహం, కాలం కలిసొస్తే సెర్చింజన్గానో మరో విధంగా ఇంటర్నెట్ పనులకు ఉపయోగపడే సంస్థను స్థాపించడం, దాన్ని ‘గూగుల్’ స్థాయికి తీసుకెళ్లడం పెద్ద విశేషం కాదు. ఎథికల్ హ్యాకర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకొని, హ్యాకింగ్ ట్రైనర్‌గా 27 యేళ్లకే 16 పుస్తకాలను రాసి, ఎమ్టీవీలో యూత్‌కు ఇంటర్నెట్ గురించి టిప్స్ అందించే కార్యక్రమానికి హోస్ట్‌గా పనిచేసిన ఘనత అంకిత్ ది! పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే కొన్ని గిప్ట్స్ వారి జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయి. వాటిని ఉపయోగించుకొనే తీరును బట్టి వాళ్ల జీవితాలు మలుపు తిరిగే అవకాశం ఉంది. అలా జీవితాలను మలుపుతిప్పగల సాధనం కంప్యూటర్. ఇప్పుడు కాదు దాదాపు 17 యేళ్ల కిందట అంకిత్‌కు పదేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులు అతడికి కంప్యూటర్ను బహుమతిగా ఇచ్చారట! కంప్యూటర్ కొద్ది సేపు ఆటగా అనిపించిందట. తర్వాత... ఈ పిల్లాడికి కంప్యూటర్ ఎలా పనిచేస్తోంది, ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ అవుతోంది అనే విషయం గురించి ఆలోచన మొదలైందట. దీంతో మొదలైంది ఇతడి పరిశోధన. అలా పరిచయం అయ్యింది నెట్వర్కింగ్. అటు నుంచి హ్యాకింగ్ ప్రమాదం.. దాన్ని అధిగమించేదే ఎథికల్ హ్యాకింగ్. కంప్యూటర్ పదేళ్ల వయసులో పరిచయం అయితే ఎథికల్ హ్యాకింగ్ గురించి 12 యేళ్ల వయసులో తెలుసుకొన్నాడట. 14 యేళ్ల వయసులో ఏకంగా ఎథికల్ హ్యాకింగ్ గురించి పుస్తకమే రాసేశాడు! కాపీ బుక్స్ రాసుకోవాల్సిన వయసులో ‘ఎథికల్హ్యాకింగ్ గైడ్’ పేరుతో పుస్తకం రాశాడు! ఆ పుస్తకం పబ్లిష్ అయ్యింది. పలు భాషల్లోకి అనువాదం అయ్యింది. తలపండిన నిపుణులు ఎంతోమంది ఉన్నా.. ఎథికల్ హ్యాకింగ్‌లో అప్పటికి పుస్తకాలు రాసే ఐడియా ఎవరికీ లేదో ఏమోకానీ అంకిత్ పుస్తకం బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. 14 యేళ్ల కుర్రాడు రాసిన పుస్తకంగా కాక ఎథికల్ హ్యాకింగ్ విషయంలో మంచి గైడ్‌గా గుర్తింపు తెచ్చుకొంది అది. అక్కడే నిపుణుడిగా అంకిత్ తొలి విజయం సాధించాడు. పుస్తకంతో అపరిచితుడుగానే ఎంతోమందికి ఎథికల్ హ్యాకింగ్ ద్వారా అవగాహన కల్పించిన అంకిత్ తొలిసారి పోలీస్ డిపార్ట్మెంట్కు ట్రైనర్‌గా మారడం ద్వారా మరో రకమైన గుర్తింపు సంపాదించుకొన్నాడు. అనేక రాష్ట్రాల పోలీస్డిపార్ట్మెంట్లకు ఎథికల్ హ్యాకింగ్ విషయంలో ట్రైనర్‌గా మారాడు. సైబర్ క్రైమ్‌కు పగ్గాలు వేయడంలో సహకరించే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. అప్పటికి అంకిత్ వయసు 16 సంవత్సరాలు.రెండేళ్లు అలాగడిపేసిన తర్వాత సొంతంగా ఎథికల్ హ్యాకింగ్ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను మొదలు పెట్టాడు. తనే ఒక బ్రాండ్‌గా మారాడు. ఇన్స్టిట్యూట్ ద్వారా సర్టిఫికేషన్ కోర్సును ప్రారంభించి వివిధ శాఖల ద్వారా దాదాపు 25 వేల మందిని ఎథికల్హ్యాకింగ్ నిపుణులుగా తీర్చిదిద్దాడు. ఈ విధంగా ట్రైనర్‌గా దూసుకుపోతున్న ఇతడిని ఎమ్‌టీవీ గుర్తించింది. యూత్‌కు ఎంతో ప్రియమైన ఇంటర్నెట్ గురించి కిటుకులను చెప్పే ప్రోగ్రామ్‌ను ప్రారంభించాలనుకొన్న ఆ ఛానల్ అంకిత్‌ను అందుకు తగిన వ్యక్తిగా భావించింది. అతడే హోస్ట్‌గా ‘ వాట్‌ద హ్యాక్’ అనే కార్యక్రమం మొదలైంది. ఎమ్టీవీలో యాంకర్లు అంటే ఎంత గుర్తింపు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అవకాశం గొప్ప లాంచింగ్ ప్యాడ్. అంకిత్‌కు కూడా అది అలాగే ఉపయోగపడింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వరకూ ఇతడి పేరు వెళ్లింది. ఒకవైపు ఈ కెరీర్లను కొనసాగిస్తూ ఎథికల్ హ్యాకింగ్ గురించి పుస్తకాలు రాస్తూ వచ్చాడు. దీంతో ఇతడిని డబ్ల్యూఈఎఫ్ ‘గ్లోబర్ షేపర్’గా గుర్తించింది . అవార్డును ఇచ్చి సత్కరించింది. ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన ఎథికల్ హ్యాకర్లలో అంకిత్ ఒకరు. ఎథికల్ హ్యాకింగ్ గురించి 16 పుస్తకాలను రాశాడు. దాదాపు 25 దేశాల్లో వివిధ సమావేశాల్లో ప్రసంగించాడు. అనేక అవార్డులను అందుకొన్నాడు. దాదాపు 25 వేల మందిని ఎథికల్ హ్యాకింగ్ రంగంలోనిపుణులుగా తీర్చిదిద్దాడు. అనేక కార్పొరేట్ కంపెనీలకు సలహాదారుగా ఉన్నాడు. ఉత్తమ ప్రసంగకర్తగా నిలిచాడు. ఇండియా టుడే వాళ్లు ఇతడిని ‘గేమ్ ఛేంజర్’గా గుర్తించారు. భారత ప్రభుత్వం కూడా పలు అవార్డులను ఇచ్చింది. మరి ఇప్పుడు, ఇతడి ప్రొఫైల్‌ను పరిశీలించాక... ‘ఇండియాలో గూగుల్ స్థాయి కంపెనీ ఒకటి ప్రారంభం అయినా పెద్దగా ఆశ్చర్యపోవద్దు...’అన్న ఇతడి మాటను మరోసారి ప్రస్తావించుకొంటే... ఎథికల్ హ్యాకింగ్‌లో ప్రపంచ స్థాయి వ్యక్తులు వస్తున్న మన దేశంలో ‘గూగుల్’ స్థాయి కంపెనీ స్థాపించగల సమర్థులూ ఉంటారనిపిస్తుంది!