Spy Bahu Actress Sana Sayyad Interesting Unknown Facts In Telugu - Sakshi
Sakshi News home page

Sana Sayyad Unknown Facts: వెబ్‌ స్క్రీన్‌పై బాగా వినిపిస్తున్న ఈ హీరోయిన్‌ గురించి తెలుసా ?

Published Sun, Jun 26 2022 10:39 AM | Last Updated on Sun, Jun 26 2022 11:15 AM

Spy Bahu Actress Sana Sayyad Interesting Details - Sakshi

ఈ నటి పేరు సనా సయ్యద్‌. టీవీ ప్రేక్షకులకు .. మరీ ముఖ్యంగా ఎమ్‌టీవీ అభిమానులకు ఆమె బాగా సుపరిచితం. ఎమ్‌టీవీ రియాలిటీ షో 'స్ల్పిట్స్‌విల్లా' సీజన్‌ 8 ఫస్ట్‌ రన్నరప్‌ సనా సయ్యద్‌. ఆ షోనే ఆమెను పాపులర్‌ చేసింది. ఇప్పుడు వెబ్‌ స్క్రీన్‌ మీదా వెలుగుతోంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సనా సయ్యద్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు చూసేద్దామా !

సనా సయ్యద్‌ పుట్టింది, పెరిగింది ముంబైలో. బికామ్‌ గ్రాడ్యుయేట్‌. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్, యాక్టింగ్‌ అంటే ఆసక్తి. స్కూల్‌ డేస్‌లో రన్నింగ్, సైక్లింగ్‌లో చాంపియన్‌. పుస్తకాలు కూడా బాగా చదువుతుంది. అందులో విజయం ‘జానా నా దిల్‌ సే దూర్‌’ అనే సీరియల్‌లో నటిగా చాన్స్‌నిచ్చింది. ఈ సీరియల్‌ అనంతరం ఆమె యాక్టింగ్‌ షెడ్యూల్‌ బిజీ అయిపోయింది. స్పోర్ట్స్‌ పట్ల ఆమెకున్న ఆసక్తి చూసి సనా అథ్లెట్‌ అవుతుందని అనుకున్నారట ఆమె కుటుంబ సభ్యులు. వాళ్ల అంచనాలకు అందకుండా యాక్టర్‌ అయింది. 

(చదవండి: నడిరోడ్డుపై యంగ్‌ హీరోయిన్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌)

యాక్టింగ్‌లో కెరీర్‌ కోసం ముందు మెడల్‌గా మారింది. మోడలింగ్‌ చేస్తున్నప్పుడే ‘స్ల్పిట్స్‌విల్లా’ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. సనాను అభిమాన టీవీ నటిగా చేసింది మాత్రం ‘దివ్యదృష్టి’ అనే సీరియలే. ఆ ఫేమ్‌.. నేమ్‌ ఆమెకు వెబ్‌ స్క్రీన్‌ అప్పియరెన్స్‌నూ ఇప్పించింది. ‘లాక్‌ డౌన్‌ కి లవ్‌ స్టోరీ’, ‘స్పై బహు’ వంటి సిరీస్‌లో ప్రధాన భూమికల్లో మెప్పిస్తూ వీక్షకుల ప్రశంసలకు పాత్రురాలవుతోంది.

 'నా హాబీ.. ప్రొఫెషన్‌.. అన్నీ కూడా యాక్టింగే. సో.. సెట్స్‌ మీద లేకపోయినా.. ఇంట్లో అద్దం ముందు నిలబడి నా నటనకు మెరుగులు దిద్దుకుంటూ ఉంటా. సినిమా క్రాఫ్ట్‌కి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటా. జయాపజయాలను స్పోర్టివ్‌గా తీసుకుంటా.. ఎంతైనా స్పోర్ట్స్‌ పర్సన్‌ను కదా!' అని అంటోంది సనా సయ్యద్‌. 

(చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement