డబ్బు కోసం ఆ పని చేశా.. సీక్రెట్‌గా ఉంచాల్సిన వీడియో లీక్‌.. | Bhoomika Vasishth Talks about Her Leaked Videos | Sakshi
Sakshi News home page

Bhoomika Vasishth: అప్పు తీర్చేందుకు దుస్తులు విప్పుతూ వీడియో.. లీక్‌ చేశారన్న కంటెస్టెంట్‌

Jun 4 2023 6:13 PM | Updated on Jun 4 2023 6:47 PM

Bhoomika Vasishth Talks about Her Leaked Videos - Sakshi

బిగ్‌బాస్‌, స్ప్లిట్స్‌విల్లా, ఎంటీవీ రోడీస్‌, ఇన్‌ రియల్‌ లవ్‌, లాకప్‌.. ఇలాంటి రియాలిటీ షోలకు కొదవే లేదు. ఇక్కడ సెలబ్రిటీలు ఎలా ఉంటారు? వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? అన్నది చూపించడంమే రియాలిటీ షోలో కామన్‌ పాయింట్‌గా ఉంటుంది. ఈ క్రమంలో వారి వ్యక్తిగత విషయాలను కూడా బయటపెడుతుంటారు తారలు. తాజాగా ఎంటీవీ రోడీస్‌ కొత్త సీజన్‌ శనివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. స్ప్లిట్స్‌విల్లా కంటెస్టెంట్‌ భూమిక వశిష్ట్‌ ఈ షోలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వెల్లడించింది నటి.

వీడియో లీక్‌.. డిప్రెషన్‌
'డ్యాన్స్‌ రియాలిటీ షో తర్వాత నేను సెలబ్రిటీలాగే ఉండిపోవాలనుకున్నాను. కానీ సెలబ్రిటీ లైఫ్‌ అనేది డబ్బుతో కూడుకున్న పని. ఫేమ్‌, గ్లామర్‌ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకని నా లైఫ్‌స్టైల్‌ కోసం అప్పు తీసుకున్నాను. ఆ అప్పు తీర్చేందుకు దుస్తులు విప్పుతున్న వీడియోను ఒక యాప్‌లో అప్‌లోడ్‌ చేశాను. సీక్రెట్‌గా ఉంచాల్సిన ఆ వీడియోను ఎవరో ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారు. దీంతో నాపై చాలా విమర్శలు వచ్చాయి. డిప్రెషన్‌కు వెళ్లిపోయాను' అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది భూమిక. ఆమె మాటలు విన్న గ్యాంగ్‌ లీడర్స్‌(జడ్జిలు) రియా చక్రవర్తి, ప్రిన్స్‌ నరూలా.. భూమికను ఓదార్చారు. రియా ఆమెను వెళ్లి హత్తుకోగా.. నరూలా.. దాని గురించి పట్టించుకోవాల్సిన పనే లేదని, ధైర్యంగా ఉండమని చెప్పాడు. 

హోస్ట్‌గా సోనూసూద్‌
కాగా ప్రస్తుతం సోనూసూద్‌ ఎంటీవీ రోడీస్‌ షో వ్యాఖ్యాతగా పని చేస్తున్నాడు. ఈ షోలో ప్రిన్స్‌ నరూలా, రియా చక్రవర్తి, గౌతమ్‌ గులటి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ, పుణె, ఇండోర్‌ నగరాల్లో ఆడిషన్‌ నిర్వహించగా ఇందులో కొంతమంది యంగ్‌స్టర్స్‌ను సెలక్ట్‌ చేసుకుని షోలో ప్రవేశపెట్టారు.

చదవండి: నా మాజీ భర్త ఎంతోమంది అమ్మాయిలను మోసం చేశాడు: నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement