Bhoomika
-
చిన్న వయసు.. పెద్ద మనసు
వయసులో ఆమె చాలా చిన్నది.. కానీ గొప్ప మనసుందని ప్రపంచానికి చాటి చెప్పింది.. తాను మరణిస్తున్నానని తెలిసి.. మరో ఐదుగురి ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకుంది. అంతేకాదు..మరణానంతరం మరో ఐదుగురికి ప్రాణంపోయడమే కాదు.. వారి రూపంలో తాను జీవించి ఉందనేలా.. ఆమె తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. అవయవ దానంపై ఆమె నిర్ణయం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు కొనియాడుతున్నారు. ఇంతటి గొప్ప త్యాగానికి.. రూపమిచ్చిన ఆమె పేరు డాక్టర్ భూమికారెడ్డి.. యువ డాక్టర్ నంగి భూమికారెడ్డి (24) స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం, తలుపుల మండలం, నంగివాండ్లపల్లి. నంగి నందకుమార్ రెడ్డి, లోహిత దంపతుల ఏకైక కుమార్తె. ఇటీవలే వైద్య విద్యను పూర్తి చేసి హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా వైద్య సేవలను అందిస్తోంది. ఫిబ్రవరి 1న తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు తాను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని అనుకోకుండా ప్రమాదానికి గురైంది. అపస్మారక స్థితిలో ఉన్న భూమికారెడ్డిని సమీపంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని న్యూరో సర్జన్ డాక్టర్ శివానందరెడ్డి నేతృత్వంలో వైద్య బృందం చికిత్సలు చేసింది. క్రానియోటమీ సర్జరీ చేసినా ఫలితం లేకుండా పోయింది. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఆదివారం తుది శ్వాస విడిచింది.బిడ్డ మాట కోసం.. భూమికారెడ్డి తమతో పదే పదే అవయవదానం గురించి మాట్లాడుతుండేదని, ఆ మేరకు తమ బిడ్డ మాట కోసం భూమికారెడ్డి అవయవాలను దానం చేయడానికి తమ కుటుంబ సభ్యులతో చర్చించి చివరకు అంగీకరించారు తల్లిదండ్రులు. మృతదేహం వద్ద తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ గుండెలవిసేలా రోదిస్తుంటే.. ఆస్పత్రిలోని సందర్శకులు, ఇతర రోగుల కళ్లు చెమ్మగిల్లాయి. బిడ్డను కోల్పోయిన బాధను దిగమింగుకుని మరో ఐదుగురి ప్రాణాలను నిలబెట్టాలనే నిర్ణయానికి వచి్చన భూమికారెడ్డి తల్లిదండ్రులను అక్కడి డాక్టర్లు అభినందించారు. అనంతరం భూమికారెడ్డి మృతదేహానికి కాంటినెంటల్ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనం చేశారు.భూమికారెడ్డి త్యాగం వెలకట్టలేనిది.. యువ డాక్టర్ భూమికారెడ్డి మన మధ్య లేకపోయినా ఆమె చేసిన త్యాగం వెలకట్టలేనిది. ఆమె, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు సమిష్టిగా నిర్ణయించి అవయవదానం చేయడానికి ముందుకురావడం కలకాలం గుర్తిండిపోతుంది. భూమికారెడ్డి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం. వైద్య రంగం ఓ మంచి వైద్యురాలిని కోల్పోయింది. – కాంటినెంటల్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ గురు ఎన్ రెడ్డిఅవయవదానం వివరాలు.. డాక్టర్ భూమికారెడ్డి అవయవాల్లో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, రెండు కిడ్నీలను అవయవదానం చేశారు. ఇందులో భాగంగా ఊపిరితిత్తులను కిమ్స్ ఆస్పత్రికి, గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి, కాలేయం కాంటినెంటల్ ఆస్పత్రికి, కిడ్నీల్లో ఒకటి నిమ్స్ ఆస్పత్రికి, మరొకటి కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. -
భూమిక, యోగిబాబు 'స్కూల్' మొదలైంది
నటి భూమిక, యోగిబాబు, దర్శకుడు కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న స్కూల్ చిత్రం బుధవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. క్వాంటమ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఆర్కే విద్యాధరన్, మంజు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఆర్ కె విద్యాధరన్ నిర్వహిస్తున్నాడు. బక్స్, శ్యామ్స్ ముఖ్యపాత్రలు పోసిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్యన్ గోవిందరాజన చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తిగా స్కూల్ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. పాఠశాలలో జరిగే అవినీతి అక్రమాలను ఆవిష్కరించే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథా చిత్రం స్కూల్ చిత్రం అని చెప్పారు. విద్యార్థుల దృష్టిలో సమాజంలో జరిగే ఆత్మహత్యలు, ప్రమాదాలు, అన్యాయాలు వంటి పలు ఆసక్తికరమైన సంఘటనతో చిత్రం సాగుతుందని చెప్పారు. ఇందులో విద్యార్థులను శారీరక రీత్యా పరిశోధించే ప్రధాన అధ్యాపకులుగా నటి భూమిక, విద్యార్థుల సంరక్షణ బాధ్యతలను నిర్వర్తించే పాఠశాల ఉపాధ్యాయుడిగా యోగిబాబు నటించారని చెప్పారు. పాఠశాలలో జరిగే క్రైమ్ థ్రిల్లర్ అంశాలను ఇన్వెస్టిగేషన్ చేసి అధికారిగా దర్శకుడు కేఎస్‌రవికుమార్ నటించారని తెలిపారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి మొదలవుతుందని దర్శకుడు చెప్పారు. -
Bhumika Chawla: వ్యాపారంలోకి అడుగుపెట్టిన భూమిక.. అదేంటో తెలుసా? (ఫొటోలు)
-
డబ్బు కోసం ఆ పని చేశా.. సీక్రెట్‌గా ఉంచాల్సిన వీడియో లీక్..
బిగ్‌బాస్, స్ప్లిట్స్‌విల్లా, ఎంటీవీ రోడీస్, ఇన్ రియల్ లవ్, లాకప్.. ఇలాంటి రియాలిటీ షోలకు కొదవే లేదు. ఇక్కడ సెలబ్రిటీలు ఎలా ఉంటారు? వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? అన్నది చూపించడంమే రియాలిటీ షోలో కామన్ పాయింట్‌గా ఉంటుంది. ఈ క్రమంలో వారి వ్యక్తిగత విషయాలను కూడా బయటపెడుతుంటారు తారలు. తాజాగా ఎంటీవీ రోడీస్ కొత్త సీజన్ శనివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. స్ప్లిట్స్‌విల్లా కంటెస్టెంట్ భూమిక వశిష్ట్ ఈ షోలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వెల్లడించింది నటి. వీడియో లీక్.. డిప్రెషన్ 'డ్యాన్స్ రియాలిటీ షో తర్వాత నేను సెలబ్రిటీలాగే ఉండిపోవాలనుకున్నాను. కానీ సెలబ్రిటీ లైఫ్ అనేది డబ్బుతో కూడుకున్న పని. ఫేమ్, గ్లామర్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకని నా లైఫ్‌స్టైల్ కోసం అప్పు తీసుకున్నాను. ఆ అప్పు తీర్చేందుకు దుస్తులు విప్పుతున్న వీడియోను ఒక యాప్‌లో అప్లోడ్ చేశాను. సీక్రెట్‌గా ఉంచాల్సిన ఆ వీడియోను ఎవరో ఆన్లైన్లో లీక్ చేశారు. దీంతో నాపై చాలా విమర్శలు వచ్చాయి. డిప్రెషన్‌కు వెళ్లిపోయాను' అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది భూమిక. ఆమె మాటలు విన్న గ్యాంగ్ లీడర్స్(జడ్జిలు) రియా చక్రవర్తి, ప్రిన్స్ నరూలా.. భూమికను ఓదార్చారు. రియా ఆమెను వెళ్లి హత్తుకోగా.. నరూలా.. దాని గురించి పట్టించుకోవాల్సిన పనే లేదని, ధైర్యంగా ఉండమని చెప్పాడు. హోస్ట్‌గా సోనూసూద్ కాగా ప్రస్తుతం సోనూసూద్ ఎంటీవీ రోడీస్ షో వ్యాఖ్యాతగా పని చేస్తున్నాడు. ఈ షోలో ప్రిన్స్ నరూలా, రియా చక్రవర్తి, గౌతమ్ గులటి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ, పుణె, ఇండోర్ నగరాల్లో ఆడిషన్ నిర్వహించగా ఇందులో కొంతమంది యంగ్‌స్టర్స్‌ను సెలక్ట్ చేసుకుని షోలో ప్రవేశపెట్టారు. View this post on Instagram A post shared by MTV Roadies (@mtvroadies) View this post on Instagram A post shared by MTV Roadies (@mtvroadies) చదవండి: నా మాజీ భర్త ఎంతోమంది అమ్మాయిలను మోసం చేశాడు: నటి -
గోపీచంద్ 'సీటీ మార్' మూవీ స్టిల్స్ ఫోటోలు
-
కబడ్డీ బయట ఆడితే వేట : సీటీమార్ టీజర్
సాక్షి,హైదరాబాద్: యాక్షన్ హీరో గోపీచంద్ తాజా చిత్రం ‘సిటీమార్’ టీజర్ వచ్చేసింది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ సోమవారం రిలీజ్ చేసింది. కబడ్డీ నేపథ్యంలో సంపత్‌నంది దర్శకత్వంలో రానున్న మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ‘మైదానంలో ఆడితే ఆట... బయట ఆడితే వేట’ అంటూ కార్తీ పాత్రలో గోపీచంద్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. (లూసిఫర్: మరో ఇంట్రస్టింగ్ అప్డేట్) స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతున్న ‘సీటీమార్’ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా, తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా నటింస్తోంది. సూర్యవంశీ, భూమికా చావ్లా, రెహ్మాన్, రావు రమేష్, తరుణ్ అరోరా, పోసాని కృష్ణ మురళి, రోహిత్ పాథక్, అంకూర్ సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీకి, సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. -
లాక్డౌన్లో ఏం చేస్తున్నారు?
నెలరోజులయింది అందరం లాక్డౌన్లో ఉండి. గృహ నిర్భందనను, ప్రభుత్వ నిబంధనలను క్రమంగా పాటిస్తూ కరోనా దరి చేరకుండా పోరాటం చేస్తున్నాం. ఈ 30 రోజుల్లో ఏం చేశాం? ఏం నేర్చుకున్నాం? ఈ లాక్డౌన్ పూర్తయ్యేలోగా ఎలాంటి విషయాలు నేర్చుకొని బయటకు రావాలనుకుంటున్నాం? ఒక్కసారి అందరం స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ఇవే ప్రశ్నలను కొందరు స్టార్స్‌ని అడిగితే ఇలా సమాధానమిచ్చారు. అంత్యక్రియలకు కూడా అడ్డుపడుతోంది - భూమిక ‘‘ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సమానమే. మన కులం, మతం, స్టేటస్ ఇవేమీ మనల్ని ఎక్కువ... తక్కువ చేయవు. ఈ విషయం కంటికి కనిపించని ఒక్క సూక్ష్మ జీవి మళ్లీ మనందరికీ గుర్తు చేస్తోంది’’ అన్నారు భూమిక. లాక్డౌన్ సమయంలో ఏం చేస్తున్నారు అనే విషయం గురించి ఈ విధంగా చెప్పారు. కరోనా వైరస్ మనకు తెలియకుండానే దాడి చేస్తుంటుంది. చివరకు మనకు సరైన అంత్యక్రియలు కూడా జరగనివ్వకుండా చేస్తోంది. గోల్డెన్ టెంపుల్లో ఆధ్యాత్మిక గీతాలు ఆలపించే నిర్మల్ సింగ్ కల్సా పద్మశ్రీ పొందారు. ఆయన ఇటీవలే కరోనాతో మరణించారు. ఆయన అంత్యక్రియలు ఊరి స్మశానంలో జరపొద్దని, వైరస్ వ్యాప్తి చెందుతుందని గ్రామ ప్రజలు అడ్డుపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో టైమ్ గడుపుతున్నాను. ఇంటి పని, వంట పని, మా పిల్లాడిని చదివిస్తూ, వాడితో ఆడుకుంటున్నాను. మొక్కల్ని పెంచుతున్నాను. మా కుక్కల్ని చూసుకుంటున్నాను. కరోనా నిజంగా మ్యాజిక్ చేసింది. అందరూ తమ ఇంటి సభ్యులతో ఎక్కువసేపు గడిపేలా చేస్తోంది. వ్యాయామం చేస్తున్నాను. పంజాబీ మాట్లాడటం వచ్చు కానీ రాయడం, చదవడం రాదు. ప్రస్తుతం పంజాబీ నేర్చుకుంటున్నా. అలాగే కరోనా మనందరిలో క్రమశిక్షణ, కంట్రోల్‌ను చాలావరకూ నేర్పింది. సాధారణంగానే నేను చాలా పరిశుభ్రతను పాటించే వ్యక్తిని. అందుకని శుభ్రం గురించి కొత్తగా నేర్చుకున్న విషయాలే లేవు. మానవత్వం మీద గౌరవం పెరిగింది - మధుబాల ‘‘ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే మానవత్వం, కృతజ్ఞతాభావం వంటి వాటి పట్ల నాకు ఉన్న గౌరవం పెరిగింది. ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న ఈ కరోనా గడ్డు పరిస్థితుల నుంచి మనందరం త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నటి మధుబాల. ఇంకా పలు విషయాలను ఇలా పంచుకున్నారు. ప్రస్తుతం అందరం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. సాధారణంగా నా భర్త, పిల్లలు చాలా బిజీగా ఉంటారు. నిజానికి ఒక రోజులో మేం అందరం ఇంట్లో కలుసుకునే సందర్భాలు కూడా తక్కువ. ప్రస్తుతం అందరం ఇంట్లోనే ఉంటున్నాం. రోజంతా మా ముఖాలు మేమే చూసుకుంటున్నాం. నా భర్త, నా పిల్లలు కొంచెం ఆన్లైన్ వర్క్ చేస్తున్నారు. నాకు అలా కుదరదు కాబట్టి వ్యాయామం, యోగ, డ్యాన్స్, రీడింగ్ వంటివి చేస్తున్నాను. రోజులో సమయం కుదిరినప్పుడు అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు చూస్తున్నాను. వ్యాయామానికి, రీడింగ్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను మానసికంగా ధృడంగా ఉండాలని కోరుకుంటాను. నా బాడీ, మైండ్ ఆరోగ్యంగా ఉండేందుకు శ్రమిస్తాను. నేను బుక్స్ ఎక్కువగా చదువుతాను. ప్రస్తుతం ఫిక్షన్‌కి చెందినవి కాకుండా కొన్ని సీరియస్ బుక్స్ చదువుతున్నాను. దీని వల్ల నాకు తెలియని విషయాలను తెలుసుకోగలుగుతున్నాను. నాలెడ్జ్ పెంచుకుంటున్నాను. శారీరకంగా, మానసికంగా మరింత స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఈ లాక్డౌన్ సమయాన్ని ఉపయోగించు కుంటున్నాను. ప్రకృతిని గౌరవించడం మర్చిపోయాం - తేజ ‘‘మనుషులందరం ప్రకృతిని గౌరవించడం మర్చిపోయాం. ఆ వైఖరి మారాలి’’ అంటున్నారు దర్శకుడు తేజ. లాక్డౌన్ సమయాల్లో ఆయన ఏం చేస్తున్నారు? అనే విషయాలు పంచుకున్నారు. ‘‘ఈ లాక్ డౌన్ వల్ల మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. భూమి కేవలం మనకు (మనుషులకు) మాత్రమే కాదు. భూమి మీద నివశించే ప్రతీ ఒక్కరికీ అంతే హక్కు ఉంటుంది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ పుస్తకాలు చదువుతున్నాను, రాసుకుంటున్నాను, గిన్నెలు శుభ్రం చేస్తున్నాను, మా కుక్కపిల్లలకు స్నానం చేయించడం, మొక్కలకు నీళ్లు పోయడం, గార్డెనింగ్ చేయడం, మా ఆవిడ నిత్యావసర సరుకులు కొనడానికి బయటకు వెళ్లినప్పుడు తనకు డ్రైవర్‌గా ఉండటం వంటి పనులు చేస్తున్నాను. లాక్డౌన్ పరిస్థితుల ఆధారంగా ఓ కథ రాస్తున్నాను. గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థలో కోర్స్ నేర్చుకుంటున్నాను. ఇది ఎలా వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను అవగాహన చేసుకుంటున్నాను. ఈ కోర్స్ పాస్ అవుతాననే అనుకుంటున్నాను. తేజ, అల్లరి నరేష్ వంట చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు - అల్లరి నరేష్ ‘‘లాక్డౌన్లో భాగంగా గడిచిన ఈ 30 రోజులు ఓ వినూత్నమైన అనుభవాన్నిస్తున్నాయి. కరోనా కారణంగా మనకంటే తీవ్రంగా నష్టపోయిన కొన్ని దేశాల్లోని ప్రçస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి’’ అన్నారు ‘అల్లరి’ నరేష్. ఇంకా పలు విషయాలను పంచుకున్నారు. మనం ఆగర్యోం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక దూరం, ఐసొలేషన్ వంటివాటితోనే మనం కరోనాను కట్టడి చేయగలం. ప్రస్తుతానికి దీనికి ప్రత్యామ్నాయం లేదు. ఇలాంటి సమయాల్లో మన మానసిక ఆరోగ్యం, సహనం కూడా ముఖ్యమే. మన ఇంట్లో చిన్నారులు ఉన్నప్పుడు రోజును తప్పనిసరిగా ఓ క్రమపద్ధతిలో ప్లాన్ చేసుకోవాల్సిందే. మా దినచర్య మా మూడున్నరేళ్ల పాప సమయపాలనను బట్టి ప్రారంభం అవుతుంది. నా భార్య (విరూప) నా కూతుర్ని ఎప్పుడూ అంటి పెట్టుకునే ఉంటుంది. అందుకే నా భార్య ఈ లాక్డౌన్ పరిస్థితులను బాగా బ్యాలెన్స్ చేస్తోంది. మా చిన్నారికి పాఠాలు చెప్పడం, ఆడుకోవడం, కథలు చెప్పడం వంటివి చేస్తున్నాం. అయితే లాక్డౌన్ వల్ల మన రోటీన్ లైఫ్ తప్పక ప్రభావితం అవుతుంది. నేను వంట చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ రెండు వారాలుగా అదే పనిలో ఉన్నాను (సరదాగా). వంట చేయడం అంటే రెసిపీని ఫాలో కావడమే కాదు. తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నేను వంట చేయడాన్ని నా భార్య, నా కుమార్తె బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో ముగ్గురం కలిసి వంట పనులు చేయాలనుకున్నాం. మా పాప వెల్లుల్లి తొక్క తీయడం, ఆకుకూరలను తుంచడం వంటి పనులు చేస్తుంటే చాలా సరదాగా అనిపిస్తోంది. నాకు హలీమ్ అంటే ఇష్టం. ప్రస్తుతం లాక్డౌన్ వల్ల బయటకు వెళ్లి తినలేం. అందుకని ఈ ఏడాది నేనే స్వయంగా హలీమ్ చేయడం నేర్చుకోవాలనుకుంటున్నాను. -
మిడిల్ క్లాస్ ముచ్చట్లు
-
కంటతడి పెట్టించిన దుర్ఘటనలు
-
నాని సినిమాలో సీనియర్ హీరోయిన్
త్వరలో నిన్ను కోరి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న యంగ్ హీరో నాని.. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం దర్శకత్వంలో ఎమ్‌సిఎ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రలో ఓ సీనియర్ హీరోయిన్ కనిపించనుంది. టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేసిన భూమిక చావ్లా నాని కొత్త సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. స్టార్ హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైన ఈ బ్యూటి రీ ఎంట్రీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే లాంగ్ గ్యాప్ తీసుకున్న భూమిక, నాని సినిమాతో రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఈ సినిమాలో భూమికతో పాటు మరో సీనియర్ నటి ఆమని కూడా నటిస్తోంది. -
ఆ ట్రైలర్ లో భూమికను చూశారా?
ఖుషీ, ఒక్కడు, అనసూయ లాంటి సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన భూమిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె హిందీ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో మెరవనుంది. రెండు రోజుల క్రితం రిలీజై ఇప్పటికే 40లక్షల మంది వీక్షకులను మెప్పించిన 'ఎమ్మెస్ ధోనీ' చిత్ర ట్రైలర్లో తళుక్కుమంది భూమిక. సాధారణ రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన ధోనీ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని 'ఎమ్మెస్ ధోనీ' పేరుతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. యువనటుడు సుశాంత్ రాజ్‌పుత్ టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ధోనీ సోదరిగా భూమిక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఇక మీదట ఆమె క్యారెక్టర్ రోల్స్ కు ఓకే చెబుతారేమోననే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే.. తిరిగి భూమిక తెర మీద కనిపించాలని కోరుకునే ఫ్యాన్స్‌కు పండుగే. -
ఆ ట్రైలర్ లో భూమికను చూశారా?
-
నదియాను ఫాలో అవ్వాలనుకుంటున్న భూమిక ?
-
లాయర్‌తో లవ్
‘‘ఒక లాయర్‌కి, జర్నలిస్ట్‌కి మధ్య సాగే ప్రేమకథ ఇది. లాయర్‌గా జగపతిబాబు, జర్నలిస్టుగా భూమిక అద్భుతమైన నటన కనబర్చారు. ప్రముఖ హిందీ నటుడు గుల్షన్ గ్రోవర్ ఇందులో కీలక పాత్ర పోషించారు’’ అని ‘ఏప్రిల్ ఫూల్’ చిత్ర దర్శకుడు కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పారు. జగపతిబాబు, భూమిక, రణధీర్, సృష్టి ముఖ్య తారలుగా జీఎల్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ - ‘‘ఇందులో తాగుబోతు రమేశ్, ధనరాజ్ పాత్రలు ఆద్యంతం అలరిస్తాయి. సంగీత దర్శకుడు డా. బంటి చక్కటి పాటలిచ్చారు’’ అన్నారు. -
సినిమా రివ్యూ: లడ్డుబాబు
నటీనటులు: అల్లరి నరేశ్,భూమిక, పూర్ణ, కోట శ్రీనివాసరావు, మాస్టర్ అతుల్, గిరిబాబు నిర్మాత: రాజేంద్ర త్రిపురనేని సంగీతం చక్రి దర్శకత్వం: రవిబాబు సినిమా రివ్యూ: లడ్డుబాబు ప్లస్ పాయింట్స్: ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఏమి లేవు మైనస్ పాయింట్స్: స్టోరీ, స్క్రీన్ ప్లే డైరక్షన్ ముష్టి కిష్టయ్య (కోట శ్రీనివాసరావు) కుమారుడు లడ్డుబాబు (అల్లరి నరేశ్). ఆఫ్రికాకు చెందిన ఓ దోమ కుట్టడం వల్ల సన్నగా ఉండే లడ్డుబాబు లావుగా తయారవుతాడు. ఆస్థి అంతా అమ్మేసి పిసినారి కిష్టయ్య గోవాలో స్థిరపడాలనుకుంటాడు. అయితే ఆస్తి అమ్మడానికి లడ్డుబాబు పెళ్లికి ఓ లింక్ ఉంటుంది. దాంతో కొడుకుకు పెళ్లి చేయాలని చేసిన ప్రయత్నాలన్ని బెడిసి కొట్టడంతో విసిగిపోయిన కిష్ణయ్య.. లడ్డూని ఇంట్లోంచి తరిమివేస్తాడు. ఇంట్లోంచి వీధిలోకి వచ్చిన లడ్డుబాబుని మూర్తి (అతుల్) అనే పది పన్నెండేళ్ల మధ్య వయస్సు ఉన్న కుర్రాడు చేరదీసి.. తన ఇంటికి తీసుకుపోతాడు. లడ్డుబాబుని మూర్తి ఇంట్లోకి తీసుకురావడాన్ని తల్లి మాధురి (భూమిక) ఒప్పుకోదు. అయితే లడ్డూని ఇంట్లో ఉండేలా తన తల్లిని మూర్తి బలవంతంగా ఒప్పిస్తాడు. ఇంట్లోకి వచ్చిన లడ్డూబాబుని పెళ్లాడాలని ఓ సమయంలో తన తల్లికి మూర్తి సూచిస్తాడు. మూర్తి చేసిన ప్రపోజల్ ను తల్లి అంగీకరించిందా? ఒకవేళ అంగీకరిస్తే ఎందుకు లడ్డుని పెళ్లాడాలనుకుంది? లడ్డూబాబుని తన ఇంటికి తీసుకురావడం వెనక మూర్తి ప్లాన్ ఏంటీ? కిష్ణయ్య ఇళ్లు అమ్మి గోవాలో సెటిల్ అయ్యాడా? ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానమే లడ్డూబాబు కథ. విశ్లేషణ: లడ్డుబాబుగా కష్టమైన మేకప్ చేసుకుని అల్లరి నరేశ్ చేసిన ఓ విభిన్న ప్రయత్నం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అల్లరి నరేశ్ లోని కమెడియన్, హీరో అంశాలను మేకప్ డామినేట్ చేసింది. అది అల్లరి నరేశ్ లోపమని చెప్పడానికి వీల్లేదు. గతంలో రాజేంద్ర ప్రసాద్ కొబ్బరి బోండాం చిత్రంలో ఇదే మాదిరి పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఆ చిత్రంలో శరీరం చాలా లావుగా ఉన్నా.. ముఖంలో పెద్దగా మార్పులు లేకపోవడంతో ఫేసియల్ ఎక్స్ ప్రెషన్స్ ద్వారా రాజేంద్ర ప్రసాద్ కు నవ్వించడానికి వీలు కలిగింది. అయితే ఈ సినిమాలో ముఖం కనిపించకుండా మేకప్ తో సీల్ చేయడంతో నరేశ్ హావభావాలు ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయాయి. దాంతో నరేశ్ నవ్వించడానికి చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. చాలా కష్టపడి నరేశ్ చేసిన ప్రయత్నం మేకప్ మాటున వృధాగానే మిగిలి పోయింది. ముష్టి కిష్ణయ్య పాత్రలో కోట శ్రీనివాసరావు అహనా పెళ్లంట చిత్రంలో పిసినారి పాత్రను గుర్తుకు తెచ్చింది. అహనా పెళ్లంట చిత్రానికి కిష్టయ్య పాత్ర ఎక్స్ టెన్షన్ గా ఉంది. కోట కామెడీ అంతో ఇంతో ఊరట కలిగించే అంశం. ఈ చిత్రంలో భూమికకు ఇంపార్టెన్స్ ఉన్నా.. క్యారెక్టర్ డిజైన్ చేయడంలో అనేక లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. దాంతో భూమిక క్యారెక్టర్ కూడా రిజిస్టర్ కాలేకపోయింది. మూర్తి పాత్రను పోషించిన అతుల్ పర్వాలేదనిపించాడు. మరో హీరోయిన్ పూర్ణ కూడా ఆకట్టుకోలేకపోయింది. కథలో బలం లేకపోవడం, కథనం పేలవంగా ఉండటంతో మంచి సంగీతాన్ని అందించడానికి చక్రీకి పెద్దగా పని లేకపోయింది. చక్రీ పాడిన ఓ పాట విసుగు తెప్పించేలా ఉంది. సిరిమల్లే పాట పిక్చరైజన్ ఆకట్టుకుంది. ఫోటోగ్రఫి ఓకే. ఇక డైరెక్టర్ రవిబాబు కథను ఎంచుకోవడంలోనే విఫలయ్యాడని చెప్పవచ్చు. సాదాసీదా కథను ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంలోనూ తడబాటుకు గురయ్యాడు. క్లైమాక్స్ కోసమే కథను సాగదీసి నడిపించాడా అనే సందేహం సహజంగానే వస్తుంది. ఇక బ్రహ్మనందం, ఆలీ, వేణుమాదవ్ తదితర కమెడియన్ల గెస్ట్ అప్పీయరెన్స్ తో షాక్ ఇచ్చిన రవిబాబు.. వారితో కూడా ప్రేక్షకులకు ఓ మాదిరి సంతృప్తిని ఇవ్వలేకపోయారు. లడ్డుబాబుని చూసి నవ్వుకుందామని థియేటర్ కు వెళ్లిన కామెడికి బదులు ఎక్కువ మోతాదులో విషాదానే పంచాడని చెప్పవచ్చు. ట్యాగ్: లడ్డుబాబు కాదు.. ప్రేక్షకులకు లడ్డుబాంబు!