సాక్షి,హైదరాబాద్: యాక్షన్ హీరో గోపీచంద్ తాజా చిత్రం ‘సిటీమార్’ టీజర్ వచ్చేసింది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ సోమవారం రిలీజ్ చేసింది. కబడ్డీ నేపథ్యంలో సంపత్‌నంది దర్శకత్వంలో రానున్న మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ‘మైదానంలో ఆడితే ఆట... బయట ఆడితే వేట’ అంటూ కార్తీ పాత్రలో గోపీచంద్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. (లూసిఫర్: మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్)
స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతున్న ‘సీటీమార్’ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా, తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా నటింస్తోంది. సూర్యవంశీ, భూమికా చావ్లా, రెహ్మాన్, రావు రమేష్, తరుణ్ అరోరా, పోసాని కృష్ణ మురళి, రోహిత్ పాథక్, అంకూర్ సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీకి, సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment