నాని సినిమాలో సీనియర్ హీరోయిన్ | Bhoomika key role in Nani New Movie MCA | Sakshi
Sakshi News home page

నాని సినిమాలో సీనియర్ హీరోయిన్

Published Sat, Jun 17 2017 1:32 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

నాని సినిమాలో సీనియర్ హీరోయిన్

నాని సినిమాలో సీనియర్ హీరోయిన్

త్వరలో నిన్ను కోరి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న యంగ్ హీరో నాని.. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం దర్శకత్వంలో ఎమ్సిఎ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రలో ఓ సీనియర్ హీరోయిన్ కనిపించనుంది.

టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేసిన భూమిక చావ్లా నాని కొత్త సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. స్టార్ హీరోయిన్గా కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకొని  సినిమాలకు దూరమైన ఈ బ్యూటి రీ ఎంట్రీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే లాంగ్ గ్యాప్ తీసుకున్న భూమిక, నాని సినిమాతో రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఈ సినిమాలో భూమికతో పాటు మరో సీనియర్ నటి ఆమని కూడా నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement