‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎంసీఏ’ చిత్రానికి కాస్త గ్యాప్ వచ్చింది. ఆ మధ్యలో రెండు సినిమాలు ఫైనలైజ్ అవుతాయనుకున్న తరుణంలో చేజారాయి. వాటి కోసం మూడేళ్లు వృథా అయ్యాయి’’ అని శ్రీరామ్ వేణు అన్నారు. నాని, సాయిపల్లవి జంటగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ‘ఎంసీఏ’ ఇటీవల విడుదలైంది. శ్రీరామ్ వేణు మాట్లాడుతూ– ‘‘కొన్ని విషయాలు ఎన్నిసార్లు చెప్పినా బాగానే ఉంటాయి. మిడిల్ క్లాస్ అలాంటిదే. నేను, మా బ్రదర్ క్లోజ్‌గా ఉండేవాళ్లం. నాకు పెళ్లయిన తర్వాత మా బ్రదర్ కొంచెం ఫీలయ్యాడు. ఆ స్ఫూర్తితోనే ఈ కథ రాశా. కథ అనుకున్నప్పుడే నాని అనుకున్నాం.
‘ఎంసీఏ’ రిలీజ్ అయ్యాక సుకుమార్‌గారు మొదట ఫోన్ చేశారు. కొరటాల శివగారు మెసేజ్ చేశారు. ఓ సినిమా కోసం టైమ్ వెచ్చించాక అది ఓకే కాకపోవడంతో రెండు, మూడు రోజులు పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లి, బయటపడ్డాను. మంచి సినిమా చూసిన ప్రతిసారీ నేను స్ఫూర్తి పొందేవాణ్ణి. ఎందుకంటే.. మాది మధ్యతరగతి కుటుంబం. ఓ పెద్దాయన సలహా మేరకు వేణు శ్రీరామ్‌గా ఉన్న నా పేరుని శ్రీరామ్ వేణుగా మార్చుకున్నా. న్యూమరాలజీ కోసం కాదు. రవితేజగారికి కథ చెబుతా. ఆయనకు నచ్చితే చేస్తా. రాజుగారికి ఆరో హిట్ ఇవ్వాలనే టెన్షన్ ఉండేది. నేను హిట్ ఇవ్వకపోతే ఆయన ట్రాక్ దెబ్బతింటుందని జాగ్రత్తగా పనిచేశా’’ అన్నారు.
ఆ హిట్ ట్రాక్ కంటిన్యూ అవ్వాలనుకున్నా!
Published Fri, Dec 29 2017 1:09 AM | Last Updated on Fri, Dec 29 2017 1:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment