నాని కొత్త సినిమా లాంచింగ్ డేట్
యంగ్ హీరో నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. వరుస విజయాలతో సత్తా చాటుతున్న ఈ యువ కథానాయకుడు, ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా ప్రారంభిస్తున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడితో నిన్నుకోరి సినిమా చేస్తున్నాడు నాని. ఎక్కువ భాగం ఫారిన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకొస్తున్నాడు నాని.
దిల్ రాజు నిర్మాణంలో నాని హీరోగా తెరకెక్కనున్న ఎమ్సిఏ సినిమాను ఈ శనివారం(06-05-2017) లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన మలయాళీ బ్యూటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే కొత్త రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.