Ninnu Kori
-
ఆ పాయింట్‌తో ఖుషి తీశామనేది అవాస్తవం
‘‘నిన్ను కోరి, మజిలీ’ వంటి నా గత చిత్రాల్లో విఫలమైన ప్రేమకథలను చూపించాను. కానీ, ఈసారి పూర్తి స్థాయి వినోదం, ఉత్సాహంగా ఉండే ప్రేమకథ తీయాలని ‘ఖుషి’ చేశాను’’ అన్నారు శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శివ నిర్వాణ చెప్పిన విశేషాలు. డైరెక్టర్ మణిరత్నంగారి ఫ్యాన్‌గా ఆయన దగ్గర చేరాలనుకుని చెన్నై వెళ్లాను. కానీ ఆయన్ను కలవడానికి కుదరలేదు. మణిరత్నంగారి సినిమాలను ఇష్టపడతాను కానీ ఆయనలా తీయాలనుకోను. ఆయన తీసిన ‘సఖి’ లాంటిపాయింట్తో ‘ఖుషి’ తీశామనే వార్తలు అవాస్తవం. ప్రస్తుత సమాజంలోని ఒక సమకాలీన అంశాన్ని విజయ్, సమంతలాంటి స్టార్స్ ద్వారా చూపిస్తే బాగుంటుందని నమ్మాను. ప్రేమకథను ఎంత కొత్తగా చెప్పాలనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ నేపథ్యం. ఈ చిత్రంలో విజయ్‌పాత్ర అమ్మాయిలకు, కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సమంత వాస్తవ జీవితానికి, ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలు నవీన్, రవిశంకర్‌గార్లు డైరెక్టర్స్‌కు స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి సంతోషంగా సినిమా చేసుకోవచ్చు. హేషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేను డైరెక్ట్ చేసిన ‘నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్’ సినిమాల్లో కొన్నిపాటలు రాశాను. కానీ, ‘ఖుషి’కి అన్నిపాటలు రాయాల్సి వచ్చింది.. రాశాను. మనంపాన్ ఇండియా సినిమా చేయాలని ముందే అనుకుని, కథ రాసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం.‘బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2’ వంటి సినిమాలన్నీ మన నేటివిటీకి నచ్చేలా చేసుకున్నవి. ఇతర భాషల వాళ్లు కూడా వాటిని ఇష్టపడ్డారు కాబట్టిపాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చిపాన్ ఇండియా మూవీ అవుతుందన్నది నా అభిప్రాయం. -
కన్నడంలో నిన్ను కోరి
నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ముఖ్య తారలుగా 2017లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘నిన్ను కోరి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతోంది. అథర్వా మురళి, అనుపమా పరమేశ్వరన్ జంటగా ‘తలళ్లి పోగాదే’ టైటిల్‌తో ఈ రీమేక్ తెరకెక్కుతోంది. తాజాగా కన్నడంలోనూ ‘నిన్ను కోరి’ రీమేక్ కాబోతోందని సమాచారం. కన్నడ పాపులర్ నటుడు ధృవ్ సార్జా ఈ రీమేక్‌లో హీరోగా నటించనున్నారు. నంద కిశోర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. -
ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదు
సినిమా: ఏ రంగంలోనైనా, ఎంత ప్రతిభ ఉన్నా, అదృష్టం చాలా ముఖ్యం. ఇప్పుడు తమ వృత్తుల్లో రాణిస్తున్న వారంతా ప్రతిభావంతులని, ఇతరుల్లో ప్రతిభ లేదని చెప్పలేం. సినిమారంగంలోకి వస్తే నటి సమంత, జ్యోతిక లాంటి తమ కంటే ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారన్న విషయాన్ని చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. నటి అనుపమాపరమేశ్వరన్ పరిస్థితి ఇక్కడ ఇదే. ఈ మలయాళ కుట్టి ప్రేమమ్ వంటి హిట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత కోలీవుడ్, టాలీవుడ్ భాషల్లోనూ అవకాశాలు వరించాయి. అలా తమిళంలో ధనుష్ వంటి స్టార్ హీరోతో కొడి చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ చిత్రం బాగానే ఆడింది. అయితే ఆ తరువాత ఈ అమ్మడికి కోలీవుడ్‌లో ఒక్కటంటే ఒక్క అవకాశం రాలేదు. ఇక తెలుగులో మాత్రం అవకాశాలు వరుస కడుతున్నాయి. అలాంటిది చాలా కాలం తరువాత తమిళంలో రెండో అవకాశం వచ్చింది. దీంతో ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. ఆ వివరాలు చూద్దాం. తెలుగులో నాని, నివేదాథామస్ కలిసి నటించిన చిత్రం నిన్నుకోరి. ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ అవుతోంది. లక్కీగా ఇందులో నటి అనుపమపరమేశ్వరన్ నాయకిగా నటించే అవకాశం వరించింది. అధర్వ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో నటించడం గురించి నటి అనుపమపరమేశ్వరన్ మాట్లాడుతూ కొడి చిత్రం తరువాత తమిళంలో మంచి అవకాశం రాలేదని చెప్పింది. ఇన్నాళ్లకు నిన్నుకోరి రీమేక్‌లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని అంది. ఎందుకంటే ఇందులో కథానాయకి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. అయితే తెలుగులో నటి నివేదాథామస్ చాలా బాగా నటించిందని, ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదని అంది. తనదైన స్టైల్లో తాను నటించినట్లు తెలిపింది. ఇందులో తాను భరత నాట్య కళాకారిణిగా నటిస్తున్నట్లు చెప్పింది. క్లాసికల్ డాన్స్‌ను నేర్చుకున్న తనకు ఈ చిత్రంలోని పాత్ర ప్లస్ అవుతుందని భావిస్తున్నానని అంది. పాత్రలో ఎమోషనల్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని వాటిని అర్థం చేసుకుని నటిస్తున్నట్లు అనుపమా పరమేశ్వరన్ చెప్పింది. చూద్దాం ఈ చిత్రం అయినా ఈ భామను కోలీవుడ్‌లో నిలబెడుతుందేమో. -
వైభవ్ కోరి...
‘అర్జున్ రెడ్డి, అత్తారింటికి దారేది, ఆర్ఎక్స్ 100’ తర్వాత మరో తెలుగు సినిమా తమిళంలోకి ఎగుమతి కానుంది. 2017లో రిలీజ్ అయిన ‘నిన్ను కోరి’ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో వైభవ్. దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ్ అనే సంగతి గుర్తుండే ఉంటుంది. ‘గొడవ’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తమిళంలో బిజీ ఆర్టిస్ట్‌గా ఉన్నారు. శివా నిర్వాణ దర్శకత్వంలో నాని, ఆది పినిశెట్టి, నివేథా ముఖ్య పాత్రల్లో కనిపించిన చిత్రం ‘నిన్ను కోరి’. తెలుగులో నాని పోషించిన క్యారెక్టర్‌ను తమిళంలో వైభవ్ చేస్తున్నారు. ఆది పినిశెట్టి, నివేథా పాత్రలను ఇంకా ఫైనలైజ్ చేయాల్సి ఉంది. ఈ రీమేక్‌ను కాస్మో కిరణ్ నిర్మించనున్నారు. ఇంకా దర్శకుడు ఎంపిక పూర్తి కాలేదు. -
క్యాబ్ డ్రైవర్‌గా సమంత!
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లైతే హీరోయిన్ కెరీర్ ముగిసినట్టే అని భావిస్తారు. కానీ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం పెళ్లి తరువాత కూడా వరు సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పెళ్లి తరువాత రంగస్థలం, అభిమన్యుడు లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న సమంత త్వరలో డిఫరెంట్ జానర్లో తెరకెక్కుతున్న యు టర్న్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే భర్త నాగచైతన్యతో కలిసి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సమంత క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నారట. పెళ్లి తరువాత చైతూ, సమంతలు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్వకుడు. -
అఫీషియల్ : చైతూ ప్రేయసి ఆమే..!
ఆన్ స్క్రీన్ బెస్ట్ పెయిర్ అనిపించుకున్న అక్కినేని నాగచైతన్య, సమంతలు రియల్ లైఫ్‌లో కూడా బెస్ట్ జోడి అనిపించుకున్నాడు. ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట మరోసారి వెండితెర మీద సందడి చేసేందుకు రెడీ అవుతుంది. నాని హీరోగా నిన్నుకోరి లాంటి క్లాస్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈసినిమాలో నాగచైతన్యకు జోడి సమంత నటిస్తున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. షైన్ స్క్రీన్స్ సంస్థ రెండవ ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రేయసి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్న చైతూ.. ఆ సినిమా తరువాత మారుతి దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. -
పెళ్లి తరువాత తొలిసారి..!
అక్కినేని యువ హీరో నాగచైతన్య, అందాల నటి సమంతలది సక్సెస్ఫుల్ జోడి అన్న సంగతి తెలిసిందే. ఏం మాయ చేసావే, మనం లాంటి సినిమాల్లో అలరించిన ఈ జంట నిజజీవితంలోనూ ఒక్కటయ్యారు. పెళ్లి తరువాత ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీ అయిన చైతూ, సమంతలు త్వరలో కలిసి నటించేందుకు అంగీకరించారట. నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివ నిర్వాణ నాగచైతన్య హీరోగా ఓ సినిమాను చేసేందుకు అంగీకరించాడు. నిన్నుకోరి సినిమాను నిర్మించిన దానయ్య, కోన వెంకట్లే నాగచైతన్య, శివ నిర్వాణ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్గా సమంత అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట దర్శకుడు శివ. నాగచైతన్య హీరోగా కావటంతో సమంత కూడా కాదనదన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు పూర్తయిన వెంటనే కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
నాని డైరెక్టర్‌తో మెగా హీరో
ఫిదా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న వరుణ్, మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పాడు. మాస్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన ఈ యువ నటుడు ముందు లవర్ బాయ్ గా ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే వరుసగా రొమాటింక్ ఎంటర్టైనర్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అదే బాటలో యువ దర్శకుడు శివ నిర్వాణతో ఓ సినిమాకు అంగీకరించాడు. నాని హీరోగా నిన్నుకోరి లాంటి మెచ్యూర్డ్ లవ్ స్టోరిని తెరకెక్కించిన శివ నిర్వాణ వరుణ్‌తో తెరకెక్కించబోయే సినిమాలో మాత్రం కాస్తం ఎంటర్టైన్మెంట్ కూడా జోడిస్తున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ను డీవీవీ దానయ్య నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న వరుణ్, సెట్స్ మీద ఉన్న సినిమా పూర్తయిన తరువాతే కొత్త సినిమాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
ముంబైకి నిన్ను కోరి!
‘‘... కానీ నేను అలా కాదుగా బ్రదర్... తననే ప్రేమించాను.. తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. చావైనా బతుకైనా తనతోనే అనుకున్నాను’’.. ఈ డైలాగ్ ‘నిన్ను కోరి’ సినిమాలో నాని చెప్పిందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో శివనిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్టయింది. ఇప్పుడు ఇలాంటి డైలాగ్స్‌నే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హిందీలో చెప్పబోతున్నారట. ‘నిన్ను కోరి’ హిందీ రీమేక్‌లో ఆయనే హీరోగా నటించనున్నారని సమాచారం. రీమేక్ విషయమై తెలుగు వెర్షన్ నిర్మాతలు కోన వెంకట్, డీవీవీ దానయ్యలతో బాలీవుడ్ దర్శక–నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీ చర్చలు జరుపుతున్నారట. నాని చేసిన ఉమ పాత్రకు వరుణ్ ధావన్ సూట్ అవుతారని భన్సాలీ భావించారట. ఇక్కడ కథానాయికగా నివేదా థామస్, హీరోలాంటి రోల్‌ను ఆది పినిశెట్టి చేశారు. మరి.. ఈ రెండు పాత్రలకు హిందీలో ఎవర్ని ఎంపిక చేస్తారో చూడాలి. -
బాలీవుడ్లో నాని సినిమా..!
నాని , ఆది, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ నిన్నుకోరి. డి.వి.వి దానయ్య , కోన వెంకట్ సంయుక్తగా నిర్మించిన ఈ సినిమా జులై 07 తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు ప్రేక్షకునలు ఆకట్టుకున్న ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్నాలీ నిన్ను కోరి సినిమాను రీమేక్ చేయ్యాలని డిసైడ్ అయ్యాడట. అయితే కథ మీద ఉన్న నమ్మకంతో తెలుగులో నిర్మించిన డివివి దానయ్య, కోన వెంకట్ లు బాలీవుడ్ చిత్రానికి కూడా భాగస్వాములుగా ఉంటామని చెప్పారు. అందుకు బాలీవుడ్ నిర్మాతలు కూడా ఓకె చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. యంగ్ హీరో వరుణ్ ధావన్ అయిన నాని పాత్రకు సూట్ అవుతాడని సంజయ్ భావిస్తున్నాడు. అయితే ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. -
నిన్నుకొరి జైత్రయాత్ర సెలబ్రేషన్..
-
మేకింగ్ ఆఫ్ మూవీ - నిన్ను కోరి
-
నిన్నుకోరి బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్
-
నిన్నుకోరి బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్
నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ డి.వి.వి దానయ్య నిర్మించిన చిత్రం నిన్నుకోరి. ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ సూపర్‌హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్లకు పైగా వసూళ్లు సాదించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను దాటేసింది. ఓవర్ సీస్లోనూ మిలియన్ డాలర్ల క్లబ్లో చేసి మరోసారి నాని మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసింది. ఈ చిత్రానికి అపూర్వ ఆదరణ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు జూలై 16 సాయంత్రం 6 గంటలకు విజయవాడ బందర్ రోడ్‌లోని ఎ-1 కన్వెన్షన్ సెంటర్లో నిన్నుకోరి బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ సెలబ్రేషన్స్‌లో హీరో నాని, ఆది పినిశెట్టి, హీరోయిన్ నివేదా థామస్, నిర్మాత దానయ్య, దర్శకుడు శివ నిర్వాణ ఇతర యూనిట్ సభ్యులు పాల్గొననున్నారు. -
నీ కోసం పాత్రలు సృష్టిస్తారు : స్టార్ డైరెక్టర్
గత శుక్రవారం రిలీజ్ అయిన నిన్నుకోరి సినిమాపై ఇప్పటికీ ప్రశంసల జల్లు కురుస్తోంది. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ లు లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఈ ట్రయాంగ్యులర్ లవ్ స్టోరి, సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. రిలీజ్ సమయంలో కేవలం క్లాస్ ఆడియన్స్‌ను మాత్రమే అలరిస్తుందని భావించినా.. ప్రస్తుతం అన్ని సెంటర్ల నుంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయని సంబరపడిపోతున్నారు చిత్రయూనిట్. ఇటీవల నాని నటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్, ప్రశంసలు కురింపించటం తెలిసిందే. తాజాగా మరో సెలబ్రిటీ ఈ లిస్ట్ చేరిపోయాడు. వరుస బ్లాక్ బస్టర్లను అందిస్తున్న దర్శకుడు కొరటాల శివ నిన్నుకోరి యూనిట్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. 'నిన్ను కోరి సినిమా చూశాను. మంచి ఎంటర్టైనర్. సినిమాలో ప్రతీ సన్నివేశం ఆకట్టుకుంది. దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత డివివి దానయ్య, కోన వెంకట్‌లకు శుభాకాంక్షలు. నాని నటన సూపర్బ్. కామెడీ, ఎమోషన్స్ చాలా బాగా పండించాడు. నివేదాథామస్ ఇక నుంచి నీకోసం రచయితలు పాత్రలు సృష్టిస్తారు' అంటూ ట్వీట్ చేశాడు. Watched #NinnuKori.An amazing entertainer.Loved every moment of it.Congrats to dir shiva nirvana @DVVEnts,@konavenkat99 and the entire team — koratala siva (@sivakoratala) 11 July 2017 Commendable job by @NameisNani.Be it fun, be it emotions,u just excelled in all. And @i_nivethathomas, many will start writing great for u. — koratala siva (@sivakoratala) 11 July 2017 -
'నిన్ను కోరి' మూవీ రివ్యూ
టైటిల్ : నిన్నుకోరి జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్, మురళీ శర్మ, పృథ్వీ సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : శివ నిర్వాణ నిర్మాత : డివివి దానయ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని, మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివ నిర్వాణ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డివివి దానయ్య నిర్మించిన నిన్నుకోరి, నాని జైత్రయాత్రను కొనసాగిస్తుందా..? నిన్నుకోరి హీరోగా నాని స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందా..? కథ : ఉమా మహేశ్వరరావు (నాని), వైజాగ్ ఆంధ్రయూనివర్సిటీలో పి.హెచ్.డీ చేసే అనాథ కుర్రాడు. ప్రొఫెసర్ మూర్తి సాయంతో చదువుకునే ఉమా.. గీతమ్స్ కాలేజ్ లో చదువుకునే పల్లవి(నివేదా థామస్) తో ప్రేమలో పడతాడు. పల్లవి ఇంట్లోనే పెంట్ హౌస్ లో అద్దెకు దిగుతాడు. అదే సమయంలో పల్లవి తండ్రి(మురళీ శర్మ) జీవితంలో సెటిల్ అవ్వని వాళ్లకు ఏ తండ్రీ తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడు అని చెప్పిన మాటలతో.. ఎలాగైన జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందామని పల్లవిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. తన పిహెచ్ డీ కోసం ఢిల్లీ వెళ్లిపోతాడు. పల్లవి తన పేరెంట్స్ చూసిన అరుణ్ (ఆది పినిశెట్టి)ని పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెటిల్ అవుతుంది. అంతా మరిచిపోయి హాయిగా జీవిస్తున్న పల్లవి జీవితంలోకి ఉమా ఎందుకు తిరుగొచ్చాడు..? పల్లవి దూరమయ్యాక ఉమా ఏమయ్యాడు..? ఉమాని తిరిగి కలిశాక పల్లవి అరుణ్‌కు దూరమైందా..? లేక ఉమానే పల్లవికి దూరమయ్యాడా...? అన్నదే మిగతా కథ. నటీనటులు : నేచురల్ స్టార్ నాని నటుడిగా మరోసారి తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు. తన స్టైల్ అల్లరి సీన్స్ గిలిగింతలు పెట్టిన నాని, చాలా సీన్స్ లో ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు. విలన్ లేని సినిమాలో అక్కడక్కడే తానే విలన్ బాధ్యత తీసుకొని కథను ముందుకు నడిపించాడు. మరో హీరో ఆది ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. తక్కువ మాటలతో సెటిల్ ఫర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఆది నటన సూపర్బ్. హీరోయిన్ గా నివేదా బెస్ట్ చాయిస్ అనిపించుకుంది. ఇప్పటికే జెంటిల్‌మేన్ సినిమాతో నానికి జోడిగా నటించిన నివేదా మరోసారి మంచి కెమిస్ట్రీతో అలరించింది. ఫస్ట్ హాఫ్ లో అల్లరి అమ్మాయిగా కనిపించిన నివేదా, సెకండ్ హాఫ్ లో హుందాగా కనిపించి మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ లో నివేదా నటన ప్రతీ ఒక్కరి గుండె బరువెక్కిస్తుంది. తండ్రి పాత్రలో మురళి శర్మ మరోసారి ఆకట్టుకోగా, తనికెళ్ల భరణి, పృథ్వి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : తొలి సినిమాతో దర్శకుడు శివ నిర్వాణ అందరి దృష్టిని ఆకర్షించాడు. కథా ,కథనాలను అతను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ ట్రయాంగులర్ లవ్ స్టోరిని మూడు గంటలపాటు కదల కుండా కూర్చో బెట్టే ఎమోషనల్ జర్నీగా మార్చటంలో శివ సక్సెస్ సాధించాడు. సినిమా అంతా ఎంతో జాగ్రత్తగా నడిపించిన దర్శకుడు క్లైమాక్స్ మాత్రం హడావిడిగా ముగించినట్టుగా అనిపించింది. ఈ సినిమాకు సహ నిర్మాతగాను వ్యవహరించిన కోన వెంకట్ అందించిన స్క్రీన్ ప్లే సినిమా స్థాయిని పెంచింది. దర్శకుడు శివతో కలిసి కోన అందించిన మాటలు సినిమాకు మరో ఎసెట్. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి, వైజాగ్ అందాలతో పాటు ఫారిన్ లోకేషన్స్ ను అద్భుతంగా చూపించాడు కార్తీక్. గోపిసుందర్ సంగీతం ప్రతీ సీన్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే చేసింది. ప్లస్ పాయింట్స్ : నాని, ఆది, నివేదాల నటన ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : హడావిడిగా ముగిసిన క్లైమాక్స్ నిన్ను కోరి.. నాని విజయయాత్ర కొనసాగిస్తుంది. - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
కథే వారిని ఎంచుకుంది : రానా
ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న నిన్ను కోరి సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి లాంటి స్టార్స్ సినిమా కోసం ఎదురుచూస్తున్నామంటూ ప్రకటించటంతో నిన్నుకోరిపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా సినీ ప్రముఖుల కోసం వేసిన ప్రత్యేక షో చూసిన రానా.. చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. 'అద్భుతమైన నటులు కలిగిన గొప్ప సినిమా చూశాను. అలాంటి గొప్ప నటులున్న సమయంలో నేను సినీ రంగంలో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా.. దర్శకుడు మంచి సినిమా కోసం ఈ కథను ఎంచుకోలేదు.. ఆ కథే ఈ యూనిట్ ను ఎంచుకుంది. నివేదా.. ఇటీవల తెలుగు సినిమా వెతికి పట్టుకున్న గొప్ప నటివి నువ్వు' అంటూ ట్వీట్ చేశాడు రానా. రానాతో పాటు సినిమా చూసిన మంచు లక్ష్మీ, మనోజ్‌లు కూడా నాని, ఆది, నివేదా థామస్‌ల నటనపై ప్రశంసలు కురిపించారు. Saw a beautiful film with some exceptional performers #NinnuKori @NameisNani @i_nivethathomas @AadhiOfficial — Rana Daggubati (@RanaDaggubati) 5 July 2017 So happy and proud that I'm working in a time of such brilliant people #NinnuKori @NameisNani @i_nivethathomas @AadhiOfficial — Rana Daggubati (@RanaDaggubati) 5 July 2017 "A storyteller doesn't find the story it's the story that finds them" @i_nivethathomas you are Telugu cinema's best find in recent times. — Rana Daggubati (@RanaDaggubati) 5 July 2017 #NinnuKori one of the most sensible loving movies I've seen in the recent times.@NameisNani, @AadhiOfficial #NivedaThomas BRILLIANT. — Lakshmi Manchu (@LakshmiManchu) 5 July 2017 -
మరో విభిన్న పాత్రలో నాని..?
వరుస సక్సెస్‌లతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ శుక్రవారం నిన్ను కోరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేచురల్ స్టార్, మరో మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. ఇప్పటికే దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరాం దర్శకత్వంలో ఎమ్సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా స్టార్ చేశాడు నాని. ఈ సినిమాతో పాటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. నాని డ్యూయల్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ సినిమా తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ విభిన్న చిత్రానికి ఓకె చెప్పాడు. ఈ సినిమా మిలటరీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నితిన్ హీరోగా 'లై' సినిమాను తెరకెక్కిస్తున్న హను రాఘవపూడి, లై రిలీజ్ తరువాత నాని సినిమా పనులు ప్రారంభించనున్నాడు. -
‘నిన్నుకోరి’ ప్రీరిలీజ్ వేడుక
-
రెండు పాత్రల్లో మూడో సారి..!
నిన్నటితరం హీరోలు ద్విపాత్రభినయం చేసిన సందర్భాలు ఎక్కువే. అయితే ఈ జనరేషన్ హీరోలు మాత్రం అలాంటి పాత్రలపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. అయితే ఈ జనరేషన్లో కూడా ఒకరిద్దరు తారలు డ్యుయల్ రోల్లో అలరిస్తున్నారు. ఈ లిస్ట్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు నేచురల్ స్టార్ నాని. వరుస సక్సెస్‌లతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన నాని ప్రయోగాలకు కూడా ముందే ఉంటున్నాడు. తొలిసారిగా జెండాపై కపిరాజు సినిమాలో డ్యుయల్ రోల్లో కనిపించాడు నాని. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్మన్ సినిమా కోసం మరోసారి ద్విపాత్రాభినయం చేశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అదే రిస్క్‌కు రెడీ అవుతున్నాడు నాని. త్వరలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు నాని. ఈ సినిమాలో మరోసారి డ్యుయల్ రోల్లో నటించేందుకు ఓకె చెప్పాడట. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న నిన్నుకోరి, ఎమ్సీఏ సినిమాల తరువాత మేర్లపాక గాంధీ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఓ పల్లవి... రెండు చరణాలు!
పాట పల్లవితో మొదలవుతుంది. పల్లవి వెంట చరణాలు వస్తాయి. అది తెలిసిందే. ‘నిన్ను కోరి’ అనే కవితాత్మక టైటిల్‌తో వస్తున్న సినిమా కథలో హీరోయిన్ నివేదా థామస్ పల్లవి అయితే.. ఆమెను రెండు చరణాలు వెంటాడతాయి. మరి, ఆ చరణాలు ఎవరంటే... హీరోలు నాని, ఆది పినిశెట్టి. ఓ చరణం (నాని) విశాఖలో పల్లవి చదువుతున్నప్పుడు వెంట పడితే... రెండో చరణం (ఆది) అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు వెంట పడుతుంది. మరి, జీవితం చివరి వరకు ఏ చరణంతో అడుగులు వేయాలని పల్లవి నిర్ణయించుకుందనేది జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా చూసి తెలుసుకోమంటున్నారు నిర్మాత డీవీవీ దానయ్య. శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. ఈ నెల 29న ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు. అన్నట్టు... సినిమాలో హీరోయిన్ పేరు పల్లవి. -
రాజమౌళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాడట..!
తనకు నచ్చిన సినిమాలపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించే స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశాడు. నాని హీరోగా కొత్త దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన నిన్ను కోరి సినిమా టీజర్ ను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన జక్కన్న ఈ సినిమాను తొలి రోజు ఫస్ట్ షో చూడాలనుందంటూ కామెంట్ చేశాడు. నాని తన కెరీర్ లోనే టాప్ ఫాంలో ఉన్నాడంటూ కితాబిచ్చాడు రాజమౌళి. రాజమౌళి ట్వీట్ పై స్పందించిన హీరో నాని..'సార్ నాకు సినిమా సగం హిట్ అయిపోయినట్టే అనిపిస్తుంది.థాంక్యూ సో మచ్.. ఫస్ట్ డే ఫస్ట్ షోలో కలుద్దాం..' అంటూ రిప్లై ఇచ్చాడు. ఈగ సినిమాలో నటించిన దగ్గర నుంచి నాని, రాజమౌళి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇటీవల నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాలో కొన్ని సెకన్ల పాటు తెర మీద కనిపించాడు జక్కన్న. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో ఈగ సీక్వల్ కూడా సెట్స్ మీదకు వెళ్లనుందన్న ప్రచారం జరుగుతోంది. Ninnu Kori trailer has "I want to watch it FDFS" painted all over it. @NameisNani is in top form. https://t.co/HjkABup4iQ — rajamouli ss (@ssrajamouli) 18 June 2017 Sirrrrrrr .. This felt like half the success is achieved ...Thank you so much -
వైజాగ్ బీచ్ రోడ్డులో 'నిన్ను కోరి'
వరుస సక్సెస్‌లతో సూపర్ ఫాంలో ఉన్న నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా నిన్ను కోరి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. నాని సరసన నివేదా థామస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 7న రిలీజ్ అవుతోంది. -
ఇంటివాడైన యంగ్ హీరో..!
వరుస సక్సెస్ లతో మంచి జోరు మీదున్న యంగ్ హీరో నాని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటికే ఓ బిడ్డకు తండ్రైన నాని ఇప్పుడు ఇంటివాడవ్వటం ఏంటి అనుకుంటున్నారా..? అదేనండి చాలా కాలంగా సొంతింటికి మారిపోవాలన్న ఆలోచనలో ఉన్న నాని ఇటీవలో గచ్చిబౌలిలోని ఓ కాస్ట్లీ ఏరియాలో పెద్ద విల్లాను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం కొడుకు పుట్టిన ఆనందంలో ఉన్న నాని త్వరలోనే గృహప్రవేశానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ విల్లా ఖరీదు దాదాపు 5 కోట్ల వరకు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నిన్ను కోరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు నాని. నాని సరసన నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత దిల్ రాజ్ బ్యానర్ లో తెరకెక్కనున్న MCA( మిడిల్ క్లాస్ అబ్బాయి) షూటింగ్ లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
మనసు కోరి...
అతడి ప్రతి ఊహలో... ఊసులో... వెతికితే గుండె లోతుల్లో ఓ అమ్మాయి కనిపిస్తుంది. ఆమెతో అతడిది స్నేహమా? ప్రేమా? అమ్మాయి దూరమైతే అతడి మనసు ఏం కోరింది? ఈ ప్రశ్నలకు సమాధానాలను జూలై 7న విడుదలయ్యే ‘నిన్ను కోరి’ చూసి తెలుసుకోమంటున్నారు నాని. ఆయన హీరోగా శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ, డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. డీవీవీ దానయ్య మాట్లాడుతూ – ‘‘నానితో పాటు హీరోయిన్ నివేదా థామస్, కీలక పాత్రధారి ఆది పినిశెట్టి పాత్రలు సినిమాకు మెయిన్ పిల్లర్స్. ఓ ఇంట్రెస్టింగ్, సెన్సిబుల్ పాయింట్‌తో కొత్త దర్శకుడు శివ నిర్వాణ చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇటీవల విడుదలైన ‘అడిగా అడిగా..’ ప్రమోషనల్ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 9న టీజర్‌ను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే–మాటలు: కోన వెంకట్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, శ్రీజో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గోపీసుందర్. -
నాని కొత్త సినిమా లాంచింగ్ డేట్
యంగ్ హీరో నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. వరుస విజయాలతో సత్తా చాటుతున్న ఈ యువ కథానాయకుడు, ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా ప్రారంభిస్తున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడితో నిన్నుకోరి సినిమా చేస్తున్నాడు నాని. ఎక్కువ భాగం ఫారిన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకొస్తున్నాడు నాని. దిల్ రాజు నిర్మాణంలో నాని హీరోగా తెరకెక్కనున్న ఎమ్సిఏ సినిమాను ఈ శనివారం(06-05-2017) లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన మలయాళీ బ్యూటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే కొత్త రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నానికి షాక్ ఇచ్చిన అల్లు అర్జున్
వరుస సక్సెస్‌లతో సూపర్ ఫాంలో ఉన్న నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా నిన్ను కోరి. శివ నిర్మాణ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సమ్మర్లోనే రిలీజ్ అవుతుందని భావించారు. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో పాటు భారీ చిత్రాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో నిన్నుకోరి రిలీజ్‌కు సరైన సమయం దొరకటం లేదు. ముందుగా ఈ సినిమాను మే నెలలోనే రిలీజ్ చేయాలని భావించారు. అయితే అప్పటికి అన్ని కార్యక్రమాలు పూర్తి కావన్న ఆలోచనతో మహేష్ కాలీ చేసిన జూన్ 23న రిలీజ్ అంటూ ప్రకటించారు. కానీ కొద్ది గంటల్లోనే మరోసారి నాని సినిమా వాయిదా వేయక తప్పలేదు. అదే రోజు అల్లు అర్జున్ డీజే దువ్వాడ జగన్నాథమ్ రిలీజ్ అవుతున్నట్టుగా ప్రకటించటంతో నాని తన సినిమాను మరోసారి వాయిదా వేశాడు. నాని సరసన నివేద థామస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మరో రెండు వారాలపాటు వాయిదా వేసి జూలై 7న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సరైనోడు సినిమాతో విలన్‌గా ఆకట్టుకున్న తమిళ నటుడు ఆది ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. -
కొత్త లుక్‌లో...
లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్... ఏదైనా చేసి ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకోగల నటుడు ఆది పినిశెట్టి. ‘వైశాలి’, ‘గుండెల్లో గోదారి’, ‘మలుపు’ సినిమాల్లో హీరోగా, ‘సరైనోడు’లో విలన్‌గా మెప్పించారు. నాని హీరోగా నటిస్తున్న ‘నిన్ను కోరి’లో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. తాజాగా మరో సినిమా అంగీకరించారు. ‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి హిట్ సినిమాలు తీసిన ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ‘‘ఈ చిత్రంలో ఆది కొత్త లుక్‌లో కనిపి స్తారు. లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్... ఇలా అన్ని అంశాలున్న సినిమా’’ అన్నారు దర్శకుడు. నిర్మాత డీఎస్ రావు ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు వహిస్తారు. -
నాని హీరోగా త్రివిక్రమ్ సినిమా
డబుల్ హ్యాట్రిక్ సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో నాని. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ మంచి విజయాలు సాధిస్తున్న ఈ యంగ్ హీరో ఓ స్టార్ డైరెక్టర్‌తో కలిసి పని చేయబోతున్నాడు. ఇప్పటికే రాజమౌళి, గౌతమ్ మీనన్ లాంటి టాప్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేసిన నాని, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈసినిమాను త్రివిక్రమ్ నిర్మాతగానే వ్యవహరించనున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్‌తో కలిసి నిర్మాణ సంస్థను స్థాపించిన త్రివిక్రమ్ ఇప్పటికే నితిన్ హీరోగా సినిమాను ప్రారంభించాడు. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందు నాని హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శివా నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి సినిమాలో నటిస్తున్నాడు నాని. ఆ తరువాత కూడా మరో రెండు మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. మరి వీటిని పక్కన పెట్టి అవసరాల సినిమాను స్టార్ట్ చేస్తాడా..? లేక అవన్నీ పూర్తి చేసే కొత్త సినిమా ప్రారంభిస్తాడా..? తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరుకు వెయిట్ చేయాల్సిందే. -
నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు
నేచురల్ స్టార్ నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకొని జోరు మీద ఉన్న ఈ యంగ్ హీరో అదే ఊపులో మరిన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి సినిమాను ప్రారంభించిన నాని, మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. తన పుట్టిన రోజు సందర్భంగా నాలుగు సినిమాలకు సంబంధించి అఫిషియల్ ఎనౌన్స్మెంట్స్ ఇచ్చేశారు. మరోసారి దిల్ రాజు నిర్మాణంలో నటించేందుకు అంగీకరించాడు. 'ఎంసీఏ' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేణు శ్రీ రామ్ దర్శకుడు. వీటితో పాటు తనకు కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి బిగ్ హిట్ అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో వరుస సక్సెస్‌లు సాధించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూడో సినిమాలో కూడా నానినే హీరోగా నటించనున్నాడు. జెట్ స్పీడుతో సినిమాలను పూర్తి చేస్తున్న నాని ఈ నాలుగు సినిమాలను రెండేళ్ల లోపు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. -
నిన్ను కోరి...
నాని హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘నిన్ను కోరి’. శివనిర్వాణ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ ఎల్.ఎల్.పి పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. వచ్చే నెల 10 వరకూ అక్కడే చిత్రీకరిస్తారు. నేడు నాని పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. హను రాఘవపూడితో.. గతేడాది హను రాఘవపూడి దర్శకత్వంలో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ వంటి విజయవంతమైన చిత్రంలో నాని నటించిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రం నిర్మించనున్నారు. ‘‘ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలందిస్తారు. ఈ ఏడాది ఆగస్టులో షూటింగ్ మొదలుపెడతాం’’ అన్నారు నిర్మాతలు. -
ఫస్ట్ లుక్కే ఫుల్ మార్క్స్
యంగ్ హీరో నాని ఇప్పుడు ఫుల్ ఫాం లో ఉన్నాడు. మాస్ ఇమేజ్ కోసం పాకులాడకుండా.. తనకున్న లవర్ బాయ్ ఇమేజ్ తోనే వరుస సక్సెస్ లు సాధిస్తున్నాడు. అదే సమయంలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ లతో సత్తా చాటిన నాని, తన నెక్ట్స్ సినిమాను కూడా వేగంగా రెడీ చేస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న సినిమాలో నాని హీరోగా నటిస్తున్నాడు. నేను లోకల్ రిలీజ్‌కు ముందే ప్రారంభమైన ఈ సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ లను గురువారం రిలీజ్ చేశాడు. నాని ట్విట్టర్ ద్వారా రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్‌తో మరోసారి ఫుల్ మార్క్స్ కొట్టేశాడు నాని. 'నిన్ను కోరి' అనే టైటిల్‌తో పాటు నాని లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Vizag nunchi USA varaku. Chinna pillalanunchi pedha valla varaku. Lovers nunchi pellainavalla varaku.#NinnuKori#letsWelcomeLife 😊 pic.twitter.com/vHWbi26jKB — Nani (@NameisNani) 23 February 2017