కొత్త లుక్‌లో...
లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్... ఏదైనా చేసి ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకోగల నటుడు ఆది పినిశెట్టి. ‘వైశాలి’, ‘గుండెల్లో గోదారి’, ‘మలుపు’ సినిమాల్లో హీరోగా, ‘సరైనోడు’లో విలన్‌గా మెప్పించారు. నాని హీరోగా నటిస్తున్న ‘నిన్ను కోరి’లో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. తాజాగా మరో సినిమా అంగీకరించారు.
‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి హిట్ సినిమాలు తీసిన ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ‘‘ఈ చిత్రంలో ఆది కొత్త లుక్‌లో కనిపి స్తారు. లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్... ఇలా అన్ని అంశాలున్న సినిమా’’ అన్నారు దర్శకుడు. నిర్మాత డీఎస్ రావు ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు వహిస్తారు.