హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'శబ్దం'. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే 'వైశాలి' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆది పినిశెట్టి చాలా ఏళ్ల తర్వాత అరివళగన్ డైరెక్షన్‌లో 'శబ్దం' సినిమాలో నటించాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 7జి శివ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.
ఆది పినిశెట్టితో పాటు ఈ చిత్రంలో లక్ష్మీ మేనన్, సిమ్రాన్, లైలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా క్రేజీగా ఉన్న ఈ ట్రైలర్‌ను తాజాగా విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ చిత్రం ఆత్మల వల్ల జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుందని టీజర్‌తో దర్శకుడు హింట్ ఇచ్చాడు. ఆత్మల గురించి పరిశోధించే పాత్రలో ఆది కనిపించాడు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా రూపొందుతోంది. హాంటెడ్ హౌస్‌లో అతీంద్రియ సంఘటనలు చుట్టూ టీజర్ నడిచింది.
ముఖ్యంగా టీజర్‌లో థమన్ అందించిన ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయాని చెప్పవచ్చు. ఇందులోని బీజీఎమ్ చాలా కొత్తగా థమన్ అందించాడు. ముంబై, మున్నార్, చెన్నై తదితర ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం రూ.2కోట్ల బడ్జెట్‌తో 120ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించామని గతంలో చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పుడు అది టీజర్‌లో ప్రధాన హైలెట్‌గా నిలిచింది. టీజర్‌లో కెమెరామెన్ అరుణ్ బత్మనాభన్ ప్రతిభ మెరుగ్గానే ఉంది. ఈ సమ్మర్‌లోనే శబ్దం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment