Adi pinisetti
-
'శబ్దం' టీజర్ విడుదల.. మరో హిట్ ఖాయం
హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'శబ్దం'. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే 'వైశాలి' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆది పినిశెట్టి చాలా ఏళ్ల తర్వాత అరివళగన్ డైరెక్షన్లో 'శబ్దం' సినిమాలో నటించాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 7జి శివ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఆది పినిశెట్టితో పాటు ఈ చిత్రంలో లక్ష్మీ మేనన్, సిమ్రాన్, లైలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా క్రేజీగా ఉన్న ఈ ట్రైలర్‌ను తాజాగా విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ చిత్రం ఆత్మల వల్ల జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుందని టీజర్‌తో దర్శకుడు హింట్ ఇచ్చాడు. ఆత్మల గురించి పరిశోధించే పాత్రలో ఆది కనిపించాడు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా రూపొందుతోంది. హాంటెడ్ హౌస్‌లో అతీంద్రియ సంఘటనలు చుట్టూ టీజర్ నడిచింది. ముఖ్యంగా టీజర్లో థమన్ అందించిన ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయాని చెప్పవచ్చు. ఇందులోని బీజీఎమ్ చాలా కొత్తగా థమన్ అందించాడు. ముంబై, మున్నార్, చెన్నై తదితర ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం రూ.2కోట్ల బడ్జెట్‌తో 120ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించామని గతంలో చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పుడు అది టీజర్లో ప్రధాన హైలెట్‌గా నిలిచింది. టీజర్లో కెమెరామెన్ అరుణ్ బత్మనాభన్ ప్రతిభ మెరుగ్గానే ఉంది. ఈ సమ్మర్లోనే శబ్దం విడుదల కానుంది. -
Birthday Special: హీరోయిన్ నిక్కీ గల్రానీ బర్త్ డే స్పెషల్.. (ఫొటోలు)
-
ఆన్‌స్క్రీన్‌పై మరోసారి జత కట్టనున్న రియల్ కపుల్.. పెళ్లయ్యాక తొలిసారి!
తమిళసినిమా: నటుడు ఆది పినిశెట్టి నటి నిక్కి గల్రాణి జంటగా నటించిన చిత్రం మరకత నాణయం. ఈ చిత్రం ద్వారా ఏఆర్కే శరవణ్ దర్శకుడుగా పరిచయం అయ్యారు. 2017లో విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. నటుడు ఆది పినిశెట్టి కెరీర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోయింది. దర్శకుడు ఏ ఆర్ కె .శరవణ్ కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా ఈయన సుమారు ఐదేళ్ల తర్వాత ఇటీవల హిప్ హాప్ తమిళా ఆది హీరోగా వీరన్ అనే సోషియో ఫాంటసీ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా ఓటిటిలోనూ వీక్షకుల విశేష ఆదరణతో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ప్రస్తుతం దర్శకుడు ఏ ఆర్ కె శరవణ్ తన తాజా చిత్రాల పనిలో చాలా బిజీగా ఉన్నారు. దీని గురించి ఆయన పేర్కొంటూ తన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించటం సంతోషంగా ఉందన్నారు. వీరన్ చిత్రం తర్వాత పలు అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. 2023– 24 లో తాను చాలా బిజీగా ఉంటానని చెప్పారు. ముఖ్యంగా ఇంతకుముందు ఆది పినిశెట్టి, నిక్కి గల్రాణి జంటగా తాను దర్శకత్వం వహించిన మరకత నాణయం చిత్రానికి సీక్వెల్ కు దర్శకత్వం వహించనున్నట్లు చెప్పారు. ఇందులోనూ అదే జంట నటిస్తారని తెలిపారు. ఆ తర్వాత విష్ణు విశాల్ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు దీన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించనుందని తెలిపారు. ఇది ఫాంటసీ కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు ఏఆర్కే శరవణ్ చెప్పారు. -
టచ్ చేసేందుకు ఒప్పుకోలేదు.. హీరోయిన్ తీరుపై నటుడు కామెంట్స్!
ప్రియుడితో పెళ్లి తర్వాత హీరోయిన్ హన్సిక మోత్వానీ నటిస్తోన్న చిత్రం 'పార్ట్నర్'. తమిళంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఆది హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రోబో శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో రోబో శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. (ఇది చదవండి: ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!) అయితే ఈవెంట్లో నటుడు రోబో శంకర్ వివాదస్పద కామెంట్స్ చేశారు. హన్సిక మోత్వానీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ మూవీ షూటింగ్లో హన్సిక తన కాలును తాకేందుకు నిరాకరించిందని ఆరోపించారు. దర్శకుడు ఆమెను ఎంత బతిమాలిని ఒప్పుకోలేదని.. ఆమె తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. దీంతో రోబో శంకర్ చేసిన కామెంట్స్ వివాదస్పదమయ్యాయి. దీంతో రోబో శంకర్ చేసిన కామెంట్స్‌పై ఈవెంట్‌కు హాజరైన మీడియా ప్రతినిధులు మండిపడ్డారు. రోబో శంకర్‌కు మర్యాద, వృత్తి నైపుణ్యం లేవంటూ ఓ మహిళ జర్నలిస్ట్ ఆయన ప్రవర్తనను తప్పబట్టారు. అయితే రోబో శంకర్ ఆరోగ్యం బాగోలేదని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అతనికి జాండిస్ నిర్ధారణ అయిందని.. అందుకోసం చికిత్స పొందుతున్నాడని రోబో శంకర్ భార్య వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మానసికి పరిస్థితి బాగాలేదని ఆమె అన్నారు. (ఇది చదవండి: గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్‌తో మళ్లీ కనిపించిన హీరోయిన్! ) -
ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!
ఏదైనా సినిమా జనాల్లో క్లిక్ అయిందంటే చాలు అందులో నటించిన హీరోహీరోయిన్ల పెయిర్ బాగుందని మెచ్చుకుంటారంతా! వాళ్లిద్దరూ మళ్లీ కలిసి నటిస్తే చూడాలని తహతహలాడుతారు అభిమానులు. అయితే ఆన్‌స్క్రీన్‌పై కలిసి ఉండే సెలబ్రిటీలు ఆఫ్‌స్క్రీన్‌లోనూ అదే విధంగా ఉంటారనుకుంటే పొరపాటే! చాలామటుకు ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులనే పెళ్లి చేసుకుంటారు. అయితే కొందరు మాత్రం షూటింగ్లో ప్రేమలో పడి నెక్స్ట్ సినిమాకు పెళ్లితో ఒక్కటవుతారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న తారలు చాలామందే ఉన్నారు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి కూడా త్వరలో ఈ జాబితాలో చేరనున్నారు. ఈ సందర్భంగా ప్రేమపెళ్లి చేసుకున్న జంటలను, వారి ప్రేమాయణాలను పారాయణం చేద్దాం.. కృష్ణ-విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణ అందగాడు. ఎంతోమంది హీరోయిన్లతో ఆడిపాడిన ఆయన 1961లో మరదలు ఇందిరను పెళ్లాడారు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో విజయ నిర్మలతో జోడీ కట్టారు. షూటింగ్లో మనసారా ఆమెను ప్రేమించారు. ఆమె కూడా కృష్ణను ప్రేమించారు. దీంతో 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లే అయినప్పటికి ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాంత్-ఊహ ‘ఆమె’ సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. అలా మరింత క్లోజ్ అయ్యారు. తన ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు ఊహను పిలిచేవాడు శ్రీకాంత్. దీంతో శ్రీకాంత్ కుటుంబసభ్యులకు ఊహ అలవాటయ్యారు. ఆ తరువాత ఇరువురి ఇంట్లో ఒప్పుకోవడంతో శ్రీకాంత్ - ఊహ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి రోషన్, మేధా, రోహన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. జీవిత-రాజశేఖర్ ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ జంట ప్రేమ, పెళ్లి అంతా విచిత్రంగానే జరిగింది. ఓ తమిళ నిర్మాత తన సినిమాకోసం రాజశేఖర్‌కు జోడీగా జీవితను తీసుకున్నారు. మొదటిసారి జీవితను చూసిన రాజశేఖర్ ‘ఈమెను తీసేయండి అని చెప్పారు. కానీ దర్శకనిర్మాతలు రాజశేఖర్‌కు షాకిస్తూ అతడినే తొలగించారు. తరువాత ఈ ఇద్దరూ కలిసి ‘తలంబ్రాలు’ సినిమాలో కలిసి నటించగా అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమాలోను కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్లో రాజశేఖర్ గాయపడగా జీవిత ఆయనను కంటికి రెప్పలా చూసుకున్నారు. రాజశేఖర్‌పై జీవితకి ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వీరిద్దరి పెళ్ళికి అంగీకరించారు. 1991 జూలై 10 చెన్నైలో వివాహం చేసుకున్న ఈ జంటకి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. నాగార్జున- అమల తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్‌గా వెలుగొందుతున్న సమయంలో నాగార్జున, అమల ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధంతో ఒకటయ్యారు. నాగార్జున - అమల జంట'ప్రేమయుద్ధం', 'కిరాయి దాదా', 'శివ', 'నిర్ణయం' సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కాగా 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే నాగార్జునకు వెంకటేశ్ సోదరితో వివాహం జరగ్గా విడాకులు తీసుకున్నారు. మహేశ్‌బాబు-నమ్రత అమ్మాయిల కలల రాకుమారుడు ప్రిన్స్ మహేశ్ బాబు. కానీ ఆయనకు మాత్రం భార్య నమ్రత అంటే వల్లమాలిన ప్రేమ. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత 2005లో వివాహ బంధంతో భార్యాభర్తలుగా మారారు. వీరికి గౌతమ్, సితార అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాలిని- అజిత్ చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు షాలిని. బేబీ షాలినిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. తరువాత హీరోయిన్‌గానూ నటించారు. 2000 సంవత్సరంలో కోలీవుడ్ స్టార్ అజిత్‌ని వివాహం చేసుకున్నారు షాలిని. వీరిది కూడా అన్యోన్య దాంపత్యం. సూర్య- జ్యోతిక తమిళంలోనే కాకుండా సౌత్ మొత్తం మీద పాపులారిటీ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. సమయం దొరికితే చాలు ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక సూర్య కూడా హీరోయిన్ జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006 లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప ఒక బాబు సంతానం. పాప పేరు దియా కాగా బాబు పేరు దేవ్. నయనతార- విఘ్నేశ్ శివన్ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో పడ్డ ఆమె ప్రియుడితో సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఏళ్లు గడిచినా నోరు విప్పని నయన్ 2022, జూన్ 7న విఘ్నేశ్‌తో ఏడడుగులు వేసింది. మహాబలిపురంలోని ఓ హోటల్లో గ్రాండ్‌గా వీరి పెళ్లి జరిగింది. ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ కొన్ని ప్రేమకథలు గొడవలతో మొదలువతాయంటారు కదా! ఆ జాబితాలోకే వీరి లవ్ స్టోరీ కూడా వస్తుంది. ఆది-నిక్కీ మలుపు సినిమాలో కలిసి నటించారు. మొదట్లో స్నేహితులుగా ఉన్న వీరికి ఈ సినిమా షూటింగ్ సమయంలో గొడవలు, మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలం పాటు మాట్లాడుకోలేదు కూడా! షూటింగ్ చివర్లో మళ్లీ కలిసిపోయిన వీరిద్దరూ ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. ఈ ప్రయాణంలోనే ప్రేమలో పడ్డారు. గతేడాది మే 18న మూడుముళ్ల బంధంతో ఆఫ్‌స్క్రీన్ జంటగా స్థిరపడిపోయారు. ఇక వీరే కాక శివ బాలాజీ - మధుమిత, వరుణ్ సందేశ్-వితిక, రాధిక-శరత్ కుమార్, ఆర్య-సాయేషా సైగల్ ఉండగా ఇక బాలీవుడ్లో బిగ్ బీ- జయా బచ్చన్, అభిషేక్- ఐశ్వర్య, కరీనా-సైఫ్ అలీ ఖాన్, దీపికా- రణ్వీర్ దంపతులు కూడా ప్రేమించి పెళ్లిచేసుకున్న జంటలే! ఇప్పటికీ వీరంతా కొత్త జంటగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చదవండి: కోలీవుడ్ నుంచి పిలుపు, నో చెప్పిన శ్రీలీల -
కీర్తి సురేశ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు వచ్చేస్తుంది..
Keerthy Suresh Good Luck Sakhi All Set To Release: కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది.తాజాగా ఎట్టకేలకు గుడ్ లక్ సఖి సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈనెల 28న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు ఆదిపినిశెట్టి కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. -
పవర్ఫుల్ పాత్రలో రామ్ పోతినేని.. టైటిల్ రివీల్
Ram Pothineni New Movie The Warrior Title Revealed: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో మరోసారి విలనిజం చూపించనున్నాడు ఆది పినిశెట్టి. సరైనోడు తర్వాత రెండోసారి పూర్తి స్థాయి ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ది వారియర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ టైటిల్‌తోపాటు రామ్ పోతినేని ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీస్ రోల్లో రామ్ చేయలేదు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. #RAPO19 is #𝐓𝐇𝐄𝐖𝐀𝐑𝐑𝐈𝐎𝐑𝐑 🔥#RAPO19FirstLook pic.twitter.com/dedw7G3SBD — RAm POthineni (@ramsayz) January 17, 2022 ఇదీ చదవండి: హీరో రామ్‌కు గాయాలు.. షూటింగ్‌కు బ్రేక్ -
'గుడ్‌లక్ సఖి' వచ్చేస్తుంది..
పోటీ స్టార్ట్ అయ్యేటప్పుడు గెట్ సెట్ గో అంటారు. కీర్తీ సురేష్ కూడా పోటీకి సై అన్నారు. కాకపోతే గెట్ షూట్ గో అంటున్నారు. ఎందుకంటే ఆమె రైఫిల్ షూటర్. నగేష్ కుకునూరు దర్శకత్వంలో కీర్తీ సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గుడ్‌లక్ సఖి’. ఇందులో ఆది పినిశెట్టి, జగపతిబాబు ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రంలో రైఫిల్ షూటర్ పాత్రలో కీర్తి, కోచ్ పాత్రలో జగపతిబాబు కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. శ్రావ్యా వర్మ సహనిర్మాతగా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
ఆ ట్విస్ట్ తెలిసి వావ్ అనుకున్నా!
‘‘భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ స్పోర్ట్స్ బేస్డ్ ఫిలిం ప్రేక్షకులను నిరాశపరచలేదు. ‘క్లాప్’ టీజర్ చూస్తుంటే అథ్లెట్ ఫిలిం అనిపిస్తోంది. ఈ సినిమా ఘనవిజయం సాధించాలి’’ అన్నారు హీరో చిరంజీవి. ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘క్లాప్’. ఐబీ కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, రాజశేఖర్ రెడ్డి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ‘క్లాప్’ సినిమా టీజర్‌ను చిరంజీవి విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ఆది పాత్ర చాలెంజింగ్‌గా ఉంటుందనిపిస్తోంది. తన పాత్రలో ఉన్న ట్విస్ట్ తెలిసి ‘వావ్’ అనుకున్నాను. ఇళయరాజాగారు సంగీతం అందించిన ఈ సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. -
తెలుగులో తొలిసారి
‘హైదరాబాద్ బ్లూస్’, ‘ఇక్బాల్’, ‘లక్ష్మీ’ వంటి చిత్రాల ద్వారా బాలీవుడ్లో మంచి పేరున్న దర్శకుల్లో ఒకరిగా నిలిచారు ప్రముఖ దర్శకుడు నగేశ్ కుకునూర్. దాదాపు 20 ఏళ్లుగా హిందీ సినిమాలకే పరిమితమైన ఈ హైదరాబాదీ తెలుగులో మొదటిసారి ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కీర్తీ సురేశ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన తారాగణంగా ఈ సినిమా రూపొందుతోంది. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడీ జోనర్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వికారా బాద్, పూణేల్లో షూటింగ్ జరుగుతోంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రం ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2019లో విడుదల చేయడానికి దర్శక–నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వర్త్ ఏ షార్ట్ మోషన్ పోస్టర్ పతాకంపై ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా, ప్రముఖ డిజైనర్ శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇ. శివప్రకాశ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ‘తను వెడ్స్ మను’ ఫేమ్ చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. -
మళ్లీ గీతాంజలి
దాదాపు నాలుగేళ్ల క్రితం అంజలి ముఖ్య తారగా ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి బ్యానర్‌పై రూపొందిన హారర్ కామెడీ చిత్రం ‘గీతాంజలి’ ప్రేక్షకులను మెప్పించింది. కోన వెంకట్ స్థాపించిన నిర్మాణ సంస్థ కోన ఫిలిమ్ కార్పొరేషన్ పతాకం (కేఎఫ్‌సీ)పై వచ్చిన ‘అభినేత్రి, నిన్నుకోరి’ చిత్రాలు విజయం సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ దిశగా కేఎఫ్‌సీ సంస్థ ముందుకు వెళ్తోంది. ఎం.వి.వి, కేఎఫ్‌సీ సంస్థల కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘నీవెవరో’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు. మళ్లీ ఈ రెండు నిర్మాణ సంస్థల కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం ‘గీతాంజలి 2’. కథానాయిక అంజలి ముఖ్య తారగా నటించనున్నారు. నటుడు ప్రభుదేవా ఈ సినిమా టైటిల్ లోగో అండ్ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. త్వరలో మొదలుకానున్న ఈ సినిమాకు భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ దర్శకత్వం వహించనున్నారు. ‘‘థ్రిల్లర్ కామెడీ జానర్లో ఈ సినిమా రూపొందనుంది. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు కోన వెంకట్. -
నీవెవరో?
‘రంగస్థలం’ మంచి సక్సెస్ సాధించడంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు హీరో ఆది పినిశెట్టి. అదే స్పీడ్‌తో తన నెక్ట్స్ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఆది పినిశెట్టి హీరోగా తాప్సీ, రితికా సింగ్ హీరోయిన్లుగా ‘లవర్స్’ ఫేమ్ హరినా«ద్ దర్శకుడిగా కోనా వెంకట్ సమర్పణలో ఎమ్వీవీ సత్యనారాయణ ఓ సినిమా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘నీవెవరో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్‌ను గురువారం ట్వీటర్లో అనౌన్స్ చేశారు హీరో నానీ. ‘‘నీవెవరో’ నా నెక్ట్స్ మూవీ. అందరి సపోర్ట్, బ్లెస్సింగ్స్ కావాలి’’ అన్నారు హీరో ఆది పినిశెట్టి. ఈ సినిమాకు కెమెరా:సాయి శ్రీరామ్. -
రంగస్థలం ట్విస్ట్ లీక్ చేసిన చిరు
-
ఫుల్ జోష్
గ్రౌండ్లో దుమ్ము దులిపి, గోవాలో న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పి హైదరాబాద్‌కి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ తాప్సీ. బీటౌన్‌లో షాద్ అలీ దర్శకత్వంలో హాకీ ప్లేయర్ సందీప్‌సింగ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘సూర్మ’ చిత్రంలో హాకీ ప్లేయర్ హర్‌ప్రీత్ పాత్రలో నటిస్తున్నారు తాప్సీ. సందీప్ పాత్రలో దిల్జీత్ కనిపించనున్నారు. రీల్ౖలైఫ్లో సెర్బియా గ్రౌండ్లో హాకీ ప్లేయర్‌గా రెచ్చిపోయిన తాప్సీ న్యూ ఇయర్‌కు గోవా చేరుకుని రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు నూతనోత్సాహంతో షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అయ్యారు. అందుకే హైదరాబాద్ వచ్చారు. ఈ రోజు నుంచి తెలుగులో ఆమె నటించబోయే సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. మరి ఈ చిత్రంలో హీరో ఎవరు? అంటే కథే హీరో... ఇలాగే ఆన్సర్ చెప్పారు తాప్సీ. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికాసింగ్ ముఖ్య తారలుగా హరి దర్శకత్వంలో రచయిత కోన వెంకట్ ఓ నిర్మాతగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే తాప్సీ హైదరాబాద్ వచ్చారు. -
రెండోసారి
‘గుండెల్లో గోదారి’ చిత్రంలో అలరించిన ఆది పినిశెట్టి–తాప్సీ మరోసారి జోడీ కడుతున్నారు. ‘లవర్స్’ ఫేమ్ హరి దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో ‘గీతాంజలి‘ చిత్రనిర్మాత ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. విభిన్నమైన కథతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 21న ప్రారంభం కానుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో తాప్సీతో పాటు మరో ప్రముఖ కథానాయిక నటించనున్నారు. ‘సరైనోడు, నిన్ను కోరి’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన ఆది ప్రస్తుతం ‘రంగస్థలం, అజ్ఞాతవాసి’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ వైపు మంచి పాత్రల్లో నటిస్తూనే మరోవైపు కథానాయకుడిగానూ నటిస్తున్నారాయన. ‘వెన్నెల’ కిశోర్, శివాజీరాజా, తులసి, సాయిచంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కెమెరా: తోట రాజు (‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్), సంగీతం: గోపీసుందర్. -
టెన్ డేస్ బ్రేక్... సైరా
ఇప్పుడంటే బ్రాండెడ్ బట్టలు, బోలెడన్ని డిస్కౌంట్లు, ఫెస్టివల్ బంపర్ ఆఫర్లు ఉన్నాయి. కానీ, 30 ఏళ్ల క్రితం సీన్ వేరు. బ్రాండెడ్ ఉన్నప్పటికీ.. అందరికీ అందుబాటులో ఉండేవి కావు. ముఖ్యంగా పల్లెల్లో నేత దుస్తులే వాడేవారు. ఇప్పుడు టాప్ టు బాటమ్ బ్రాండెడ్ వేర్ వాడుతున్న రామ్‌చరణ్ నేత దుస్తుల గురించి తెలుసుకుంటున్నారు. ఒక్కసారి ఇన్సెట్లో ఉన్న ఫొటో చూడండి! పోగు.. పోగు కలిపి నేత బట్టలను ఇలా నేస్తారా? అని రామ్‌చరణ్ తెలుసుకుంటున్నట్లు ఉంది కదా! ఇది ‘రంగస్థలం’ సినిమా కోసం అని ఊహించే ఉంటారు. 1985 బ్యాక్‌డ్రాప్‌లో సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం తాజా స్టిల్ ఇది. అదిరింది కదూ. ఇంతకీ ‘రంగస్థలం’ ఎందాకా వచ్చిందంటే.. ప్రస్తుతం ప్యాచ్‌వర్క్ జరుగుతోంది. హైదరాబాద్‌లో వేసిన విలేజ్ సెట్లో చిత్రీకరిస్తున్నారు. వచ్చే సోమవారం వరకూ ఈ షూట్ జరుగుతుంది. ఆ తర్వాత చిన్న బ్రేక్. టెన్ డేస్ రామ్‌చరణ్ వేరే సిన్మా ప్లాన్స్‌తో బిజీగా ఉంటారు. అంటే... ఇంకో సినిమా ఏమైనా కమిట్ అయ్యారనుకుంటున్నారేమో? హీరోగా కమిట్ అయ్యారు కానీ, ఈ బిజీ మాత్రం నిర్మాతగా. చిరంజీవి ‘సైరా’ ఈ నెల 6న ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసమే టెన్ డేస్ బ్రేక్. ‘రంగస్థలం’ కెమెరామేన్ రత్నవేలు ‘సైరా’కి కూడా వర్క్ చేయనున్నారు. పది రోజులు షూట్ తర్వాత ‘సైరా’కి చిన్ని బ్రేక్. వెంటనే ‘రంగస్థలం’ మొదలవుతుంది. ఆ షెడ్యూల్లో చిత్రీకరించే మూడు పాటలతో సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ఆది పినిశెట్టి నటిస్తోన్న విషయం తెలిసిందే. చరణ్‌కి బ్రదర్‌గా నటిస్తున్నారని వార్త షికారు చేస్తోంది. ‘అది నిజమే. ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ సూపర్’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
అభిమానులకు ‘స్వీటీ’ గిఫ్ట్
అరుంధతిలో జేజేమ్మగా, బాహుబలి చిత్రంలో దేవసేనగా తన నటనతో అందరి అనుష్క... తాజాగా భాగమతి ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. స్వీటీ (మంగళవారం) పుట్టినరోజు సందర్భంగా ...భాగమతి ఫస్ట్‌లుక్‌ను ‘షీ ఈజ్ కమింగ్’ అంటూ చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ‘జట్టు విరబోసుకుని....చేతిలో రక్తమోడుతున్న సుత్తితో’ కనిపిస్తున్న అనుష్కకు అప్పుడే ప్రశంసలు కురుస్తున్నాయి. హీరో రాణా దగ్గుబాటి ..అవుసమ్’ అంటూ భాగమతి ఫస్ట్‌లుక్ ను ట్విట్ చేశాడు. కాగా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన భాగమతి చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించగా, ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక బాహుబలి -2 చిత్రం తరువాత అనుష్కను మళ్లీ తెరపై చూడలేదు. ఆమె తర్వాత చిత్రం కోసం అభిమానులు తహతహలాడుతున్నారనే చెప్పాలి. భాగమతి చిత్రాన్ని ముందు డిసెంబరు నెలలో విడుదల చేయాలనుకున్నా, తాజాగా జనవరిలో విడుదల చేయనున్నట్లు . అయితే ఆ చిత్ర ఫస్ట్‌లుక్‌ను అనుష్క పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసి ఆమె అభిమానులకు గిఫ్ట్‌గా అందించారు. She is coming! Presenting #BhaagamathieFL starring #Anushka#Bhaagamathie #HBDAnushkaShetty pic.twitter.com/mlL94ohN4m — UV Creations (@UV_Creations) 6 November 2017 -
కొత్త లుక్‌లో...
లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్... ఏదైనా చేసి ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకోగల నటుడు ఆది పినిశెట్టి. ‘వైశాలి’, ‘గుండెల్లో గోదారి’, ‘మలుపు’ సినిమాల్లో హీరోగా, ‘సరైనోడు’లో విలన్‌గా మెప్పించారు. నాని హీరోగా నటిస్తున్న ‘నిన్ను కోరి’లో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. తాజాగా మరో సినిమా అంగీకరించారు. ‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి హిట్ సినిమాలు తీసిన ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ‘‘ఈ చిత్రంలో ఆది కొత్త లుక్‌లో కనిపి స్తారు. లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్... ఇలా అన్ని అంశాలున్న సినిమా’’ అన్నారు దర్శకుడు. నిర్మాత డీఎస్ రావు ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు వహిస్తారు. -
సాహసం... వినోదం!
‘వైరం’ ధనుష్ గుర్తుండే ఉంటాడు. హీరోకి ధీటైన విలన్ అని ‘సరైనోడు’ చిత్రంలో ఆ పాత్రలో ఆది పినిశెట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు. హీరోగా చేస్తున్నప్పటికీ వైవిధ్యమైన పాత్రల పట్ల మక్కువ ఉండటంతో ఆది ఈ విలన్ పాత్ర చేశారు. ఇప్పుడు ‘మరకతమణి’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి , నిక్కి గర్లాని జంటగా రిషి మీడియా, శ్రీచక్ర ఇన్నోవేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎ.ఆర్.కె శర్వనణ్ దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అడ్వెంచరస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. తమిళ, తెలుగు భాషల్లో ఈ నెలలోనే రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ‘కబాలి’ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ అసిస్టెంట్ దిబు థామస్ పాటలు స్వరపరిచారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం మంచి పాత్రలు చేశారు’’ అని రిషి మీడియా–శ్రీ చక్ర ఇన్నోవేషన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
ఆయనలా వంద మందిని కొట్టాలనుకునేవాణ్ణి!
బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడంలేదు ఈసారి పుట్టినరోజు జరుపుకోవడంలేదు. ఆ డబ్బును చెన్నై వరద బాధితుల సహాయార్థం ఖర్చు చేస్తాను. చెన్నైలో విష్ణు, విశాల్, లక్ష్మీరాయ్, వెంకట్ ప్రభు, సూరీ.. మేమంతా ఒక గ్యాంగ్. గతంలో నేపాల్‌లో ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు సహాయం చేశాం. ఇప్పుడు చెన్నైకి మా వంతు సహాయం చేస్తున్నాం. ‘‘నేను పుట్టింది గుంటూరులో అయినా పెరిగింది చెన్నైలోనే. అక్కడ ఉన్నందువల్ల తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నా. ఇకనుంచీ తెలుగు చిత్రాలపై దృష్టి పెడతా’’ అని ఆది పినిశెట్టి అన్నారు. దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు అనే ముద్ర నుంచి బయట పడి తమిళంలో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆది. ‘గుండెల్లో గోదారి’ తర్వాత ఆయన హీరోగా నటించిన ‘మలుపు’ విడుదలకు సిద్ధంగా ఉంది. నేడు ఆది పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మనోభావాలు ఈ విధంగా... ‘మలుపు’ని తెలుగు, తమిళ భాషల్లో మా అన్నయ్య సత్యప్రభాస్ దర్శకత్వంలో మా నాన్నగారు నిర్మించారు. తమిళంలో ప్రేక్షకాదరణ పొందింది. మంచి సినిమా కిల్ కాకూడదని తెలుగు రిలీజ్ కోసం మంచి తేదీ చూస్తున్నాం. జనవరిలో దొరికింది. ఈ చిత్రం తెలుగులో నాకు మంచి మలుపు అవుతుందనే నమ్మకం ఉంది. కాలేజీ ఫోర్త్ ఇయర్ ఎండింగ్లో ఈ కథ స్టార్ట్ అవుతుంది. స్టయిలిష్‌గా కనిపించడం కోసం బరువు తగ్గాను. నార్మల్‌గా వచ్చే సినిమాల కన్నా డిఫరెంట్‌గా ఉంటుంది. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీనుగారు దర్శకత్వం వహిస్తున్న ‘సరైనోడు’లో విలన్‌గా చేస్తున్నాను. మామూలుగా విలన్ అంటే అరవడం, పొడవడం అలా ఉంటుంది. కానీ, ఈ చిత్రంలో విలన్ చాలా డిఫరెంట్‌గా ఉంటాడు. అందుకే అంగీకరించాను. చిన్నప్పుడు చిరంజీవి అంకుల్ సినిమాలు చూసి, ఆయనలా మనమూ వందమందిని కొట్టాలి అనుకునేవాణ్ణి. కానీ, యాక్టింగ్‌ని సీరియస్‌గా తీసుకోలేదు. ఒక్కో ఆర్టిస్ట్‌కీ ఒక్కో శైలి ఉంటుంది. అమితాబ్బచ్చన్గారిదో స్టైల్. షారుక్‌ఖాన్, అక్షయ్ కుమార్లది మరో స్టైల్. తెలుగులో పవన్ కళ్యాణ్‌కీ ఓ స్టైల్ ఉంది.