మెగా అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఆదివారం ( మార్చి 18) నాడు విశాఖలోని ఆర్కే బీచ్‌లో మెగా అభిమానుల మధ్య సందడిగా రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చారు. ట్రైలర్ లాంచ్ నంతరం మెగాస్టార్ చిరు ప్రసంగిస్తూ.. పుత్రోత్సాహమో మరేమో కానీ రంగస్థలంలోని ట్విస్ట్ చెప్పేశాడు.