
పోటీ స్టార్ట్ అయ్యేటప్పుడు గెట్ సెట్ గో అంటారు. కీర్తీ సురేష్ కూడా పోటీకి సై అన్నారు. కాకపోతే గెట్ షూట్ గో అంటున్నారు. ఎందుకంటే ఆమె రైఫిల్ షూటర్. నగేష్ కుకునూరు దర్శకత్వంలో కీర్తీ సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గుడ్‌లక్ సఖి’. ఇందులో ఆది పినిశెట్టి, జగపతిబాబు ఇతర ప్రధాన పాత్రధారులు.
ఈ చిత్రంలో రైఫిల్ షూటర్ పాత్రలో కీర్తి, కోచ్ పాత్రలో జగపతిబాబు కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. శ్రావ్యా వర్మ సహనిర్మాతగా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త.