Mahesh Babu Sarkaru Vaari Paata Movie Trailer Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata Trailer Release: మహేష్ ఫ్యాన్స్ బీ రెడీ, ట్రైలర్ రిలీజ్‌ ఎప్పుడంటే..

Published Thu, Apr 28 2022 4:54 PM | Last Updated on Thu, Apr 28 2022 5:05 PM

Mahesh Babu Sarkaru Vaari Paata Trailer Release Date Fix - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరుశురామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. మే12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ రిలీజ్‌ కోసం మహేశ్‌ ఫ్యాన్స్‌ సహా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్‌ షేర్‌ చేశారు.

మే2న ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన పోస్టర్స్‌, పాటలు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ చేశాయి. కాగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

చదవండి: అర్థరాత్రి 12 గంటలకు.. సమంతకు విషెస్‌ చెప్పిన హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement