సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు.
తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన మమ.. మహేశా, కళావతి, పెన్నీ సాంగ్స్ సోషల్ మీడియాను ఎంతలా షేక్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుమారు రెండున్నరేళ్ల తర్వాత మహేశ్‌బాబు సినిమా థియేటర్లలో రిలీజవడంతో ఫ్యాన్స్ హడావుడి అంతాఇంతా కాదు. మరి అభిమానులకు సర్కారు వారి పాట నచ్చిందా? సినిమాపై వాళ్ల అభిప్రాయం ఏంటి? అన్నది సాక్షి ఆడియన్స్ పోల్‌లో తెలుసుకుందాం..
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment