Sarkaru Vaari Paata OTT Release Date And Platform Details In Telugu - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata OTT Release Date: ఓటీటీలో సర్కారు వారి పాట.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే..

Published Sun, May 15 2022 9:28 AM | Last Updated on Thu, Jun 9 2022 3:39 PM

Mahesh Babu Sarkaru Vaari Paata To Stream On This Ott Platform - Sakshi

Sarkaru Vaari Paata OTT Platform: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా నటించిన తాజా చిత్రం​ 'సర్కారు వారి పాట'. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సంబంధించిన తాజాగా ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.  భారీ మొత్తంలో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో థియేట్రికల్‌ రన్‌ పూర్తైన నాలుగు వారాల తర్వాత ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement