Good Luck Sakhi Trailer: Keerthi Suresh New Movie Good Luck Sakhi Trailer Released - Sakshi
Sakshi News home page

Good Luck Sakhi : మీరంటే నాకు అసహ్యం వేస్తుందన్న కీర్తి సురేష్‌

Published Mon, Jan 24 2022 10:45 AM | Last Updated on Mon, Jan 24 2022 5:32 PM

Keerthy Suresh Good Luck Sakhi Trailer Is Out - Sakshi

Keerthy Suresh Good Luck Sakhi Trailer Is Out: కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గుడ్‌ లక్‌ సఖి'. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రైఫిల్‌ షూటర్‌ పాత్రలో కీర్తి సురేష్‌, కోచ్‌ పాత్రలో జగపతిబాబు నటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను తాజాగా ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నేడు(సోమవారం) ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. మనదేశం గర్వపడేలా షూటర్స్‌ని తయారు చేయబోతున్నాను అంటూ జగపతి బాబు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో బ్యాడ్‌ లక్‌ సఖి నుంచి గుడ్‌ లక్‌ సఖిగా ఎలా మారిందన్న నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించారని ట్రైలర్‌ చూస్తే స్పష్టమవుతుంది.

ఆదిపినిశెట్టి కీలక పాత్రలోకనిపించనున్నారు. దిల్‌ రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించారు. శ్రావ్యా వర్మ సహనిర్మాతగా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement