Good Luck Sakhi
-
ఓటీటీలో గుడ్ లక్ సఖి.. ఎప్పటి నుంచంటే
కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నగేష్‌కుమార్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. శ్రావ్యా వర్మ సహనిర్మాతగా వ్యవహరించారు. జగపతి బాబు మరో కీలక పాత్రలో నటించారు. జనవరి28న ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా సినిమా ఓటీటీలోకి రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రేపట్నుంచి(ఫిబ్రవరి12) స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లో మెప్పించలేకపోయిన ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుంది అన్నది చూడాల్సి ఉంది. -
నన్ను ఐరన్ లెగ్ అన్నారు.. అవమానాలు ఎదుర్కొన్నా: స్టార్ హీరోయిన్
Keerthi Suresh Reveals About Her Struggles At Her Movie Career Early Days: టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరు. ప్రస్తుతం స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా మారిపోయింది. అయితే కెరీర్ ఆరంభంలో తాను కూడా అవమానాలు ఎదుర్కొన్నాని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఈ విషయాలను ప్రస్తావించింది. 'హీరోయిన్గా నా కెరీర్ మలయాళ చిత్ర పరిశ్రమతో మొదలైంది. నా ఫస్ట్ మూవీ సెట్స్ మీదకి వెళ్లిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. రెండవ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. దీంతో నాది ఐరన్ లెగ్ అని ప్రచారం చేశారు. తర్వాత కొన్ని అవకాశాలు కూడా చేజారాయి. ఇలా అవమానాలు ఎదుర్కొన్నా. అయినా ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్లా. నా పనితీరే నాకు విజయాన్ని అందించింది. సక్సెస్ మాత్రమే అవమానాలను ప్రశంసలుగా మార్చగలదని నేను భావించాను' అంటూ చెప్పుకొచ్చింది.ఇటీవలె గుడ్‌లక్ సఖితో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో మహేశ్‌బాబుతో సర్కారు వారి పాట, చిరంజీవితో భోళా శంకర్ చిత్రాలు చేస్తుంది. -
గుడ్ లక్ సఖి మూవీ ట్విటర్ రివ్యూ
‘నేను శైలజ’మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయింది అందాల భామ కీర్తి సురేశ్. తొలి సినిమాతోనే తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’మూవీతో కీర్తి సురేశ్ జాతకమే మారిపోయింది. ఆ సినిమా తర్వాత కీర్తి వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఒకపక్క స్టార్ హీరోలతో నటిస్తూ.. మరో పక్క లేడి ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన మరో లేడి ఓరియెంటెడ్ మూవీ ‘గుడ్ లక్ సఖి’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన మూవీ పాటలు, ట్రైలర్ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ. . కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం (జనవరి 28)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్.. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. #GoodLuckSakhi Overall A Mostly Lackluster Sports Drama! Keerthy did her best and the film had lscope for comedy and emotion but could not engage with a flat screenplay The makers did not even finish dubbing and the dialogues were hard to understand throughout Rating: 2/5 — Venky Reviews (@venkyreviews) January 28, 2022 సినిమా యావరేజ్‌గా ఉందని, కానీ కీర్తిసురేశ్ నటన మాత్రం అద్భుతంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. గుడ్ లక్ సఖి కాదు బ్యాడ్ లక్ కీర్తి అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూడతగ్గ సినిమా అని మరికొంతమంది చెబుతున్నారు. జగపతి బాబు ఆదిపినిశెట్టి పెర్ఫార్మన్స్ కూడా ఈ కథకి ప్లస్ అయిందని చెబుతున్నారు. #GoodLuckSakhi..! Solo release aithe kalisochindi kani NO Luck! Everything happens and ends abruptly with no reason..! Lacks the punch that is needed in sports drama..! Even shooting scenes did not have impact..! Feels like DSP is the only technician that worked honestly..! 2/5.! — FDFS Review (@ReviewFdfs) January 28, 2022 Papa account lo inkokati #GoodLuckSakhi pic.twitter.com/zmFHDvWDI2 — Kaushik🔔 (@ahvkboon) January 28, 2022 -
గుడ్ లక్ సఖి ప్రీరిలీజ్ ఈవెంట్లో కీర్తి సురేశ్, రామ్‌చరణ్ 'నాటు' స్టెప్పులు
-
‘గుడ్ లక్ సఖి’ వేడుకకి నేను ముఖ్య అతిథిగా రాలేదు: రామ్‌చరణ్
‘‘గుడ్ లక్ సఖి’ చిన్న సినిమా అని శ్రావ్య అనడం నాకు ఇబ్బందిగా అనిపించింది. మహానటి కీర్తీ సురేష్, నగేష్ సార్ వంటి జాతీయ అవార్డు గ్రహీతలు, దేవిశ్రీ ప్రసాద్‌గారు ఈ సినిమాకి పనిచేసినప్పుడు ఇది చిన్న సినిమా ఎలా అవుతుంది? చాలా పెద్ద సినిమా’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాత ‘దిల్’రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రామ్‌చరణ్ మాట్లాడుతూ–‘‘గుడ్ లక్ సఖి’ వేడుకకి నేను ముఖ్య అతిథిగా రాలేదు. మా నాన్నగారికి(చిరంజీవి) ఒక మెసెంజర్‌గా వచ్చాను. ఈ వేడుకలో ఆయన లేని లోటు తీర్చలేనిది.. కానీ నేను ఇక్కడికొచ్చినందుకు ఎంతో ఆనంద పడుతున్నాను.. గర్వపడుతున్నాను. సుధీర్, కావ్యలు ఈ స్థాయికి రావడం మామూలు విషయం కాదు. నగేష్ సార్ ‘ఇక్బాల్’ సినిమా చూసి చాలా స్ఫూర్తి పొందాను. ప్రస్తుతం సినిమా అన్నది తెలుగు, హిందీ, తమిళ్ అనే ఏ సరిహద్దులు లేకుండా రాజమౌళిగారి వల్ల ఇండియన్ సినిమా అనే పేరు తెచ్చుకుంది. ‘గుడ్ లక్ సఖి’ కి ఎక్కువ మంది మహిళలు పనిచేశారని మళ్లీ మళ్లీ చెప్పొద్దు. ఇండస్ట్రీలో మహిళలు, పురుషులు అనే తేడా ఉండకూడదు.. అందరూ ఒక్కటే. ‘అజ్ఞాతవాసి’ లో కీర్తీ సురేష్ నటన బాగుందనుకున్నా. ‘మహానటి’ చూశాక ఆమె అభిమాని అయ్యాను. ‘గుడ్ లక్ సఖి’ లాంటి స్ఫూర్తిదాయక కథలు ఆమె ఇంకా చేయాలి. ఈ సినిమాకి సోలో రిలీజ్ కుదరడం అదృష్టం. మా అభిమానులతో పాటు కీర్తి ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని చూడండి.. ఒక మంచి సినిమాని ఆదరించండి.. ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావాలి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘గుడ్ లక్ సఖి’ చిత్రానికి తొలుత ‘బ్యాడ్ లక్ సఖి’ అనే టైటిల్ అనుకున్నారు. ఈ విషయాన్ని దేవిశ్రీ చెప్పాడు. కథ విన్నాక మంచి కాన్సెప్ట్ అనిపించి సపోర్ట్ చేయాలనిపించింది. అయితే టైటిల్ మార్చమని చెప్పడంతో ‘గుడ్ లక్ సఖి’ అని పెట్టారు’’ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కీర్తీ సురేష్ మాట్లాడుతూ–‘‘మహానటి’ లాంటి సీరియస్ ఫిల్మ్ తర్వాత సరదాగా ఉండే సినిమా చేయాలని ‘గుడ్ లక్ సఖి’ కి సైన్ చేశా. ఇండస్ట్రీలో నాకున్న మంచి ఫ్రెండ్ జగపతిబాబు సార్. చరణ్‌గారి ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. మీరందరూ ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు. నగేష్ కుకునూర్ మాట్లాడుతూ–‘‘నేను తెలుగువాణ్నే. హైదరాబాదీ అయినందుకు గర్వపడుతున్నా. ‘హైదరాబాద్ బ్లూస్’ తర్వాత ‘గుడ్ లక్ సఖి’ వంటి పక్కా తెలుగు సినిమా చేయడానికి ఇన్నేళ్లు పట్టింది. ఈ సినిమాని వినోదాత్మకంగా తెరకెక్కించడానికి దర్శకులు కె.విశ్వనాథ్, జంధ్యాలగార్లే నాకు స్ఫూర్తి’’ అన్నారు. ‘‘గుడ్ లక్ సఖి’ కోసం యూనిట్ బాగా కష్టపడ్డారు.. అందరూ ఆదరించాలి’’ అన్నారు సుధీర్ చంద్ర పదిరి. ఈ వేడుకలో చిత్ర సహ నిర్మాత శ్రావ్య వర్మ, నిర్మాత అట్లూరి నారాయణరావు పాల్గొన్నారు. -
'యాంకర్ సుమ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు'
టాలీవుడ్ టాప్ యాంకర్‌గా సుమకు తిరుగే లేదు. కొన్నేళ్లుగా ఆమె తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటోంది. ఎంతమంది కొత్త యాంకర్లు వచ్చినా సరే యాంకరింగ్ తన అడ్డా అన్నట్లుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తోంది. తనకున్న పాపులారిటీకి తగ్గట్లే ఒక్కో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా లక్షల్లోనే తీసుకుంటుంది. అయితే సినిమా రేంజ్‌ను బట్టి, హీరోలను బట్టి ఇది కొంత మారుతూ వస్తోంది. తాజాగా ఆమె గుడ్ లక్ సఖి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించింది. కీర్తి సురేశ్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తుండగా శ్రావ్య వర్మ సహనిర్మాతగా ఉన్నారు. బుధవారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో శ్రావ్య వర్మ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 'చిరంజీవిగారిని కలిస్తే ఆయన వస్తానని చెప్పారు, కానీ కోవిడ్ వల్ల రాలేకపోయారు. రామ్‌చరణ్‌ను పంపించారు. మీరు వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ఇక సుమ విషయానికి వస్తే శ్రేయాస్ మీడియా ఆమెను కలవగానే సరేనని అంగీకరించింది. ఆమె ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చి ఈ సినిమాకు సపోర్ట్ చేసింది' అని చెప్పుకొచ్చింది. దీంతో కంగారు పడిపోయిన సుమ శ్రావ్య స్పీచ్ ముగించి వెళ్లేటప్పుడు కౌంటర్ వేసింది. 'ఇంకాసేపు ఉంటే నా ఆస్తి వివరాలన్నీ కూడా చెప్పేలా ఉన్నావే.. నెక్స్ట్ సినిమాలు చేస్తావ్ కదా, అప్పుడు అన్నీ కలిపి తీసుకుంటానులే' అని సెటైర్ వేసింది సుమ. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'గుడ్ లక్ సఖి' మూవీ స్టిల్స్
-
అమ్మాయిలు షూటింగ్ చేయడం కరెక్ట్ కాదు: నటుడు
Keerthy Suresh Good Luck Sakhi Trailer Is Out: కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రైఫిల్ షూటర్ పాత్రలో కీర్తి సురేష్, కోచ్ పాత్రలో జగపతిబాబు నటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను తాజాగా ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(సోమవారం) ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. మనదేశం గర్వపడేలా షూటర్స్‌ని తయారు చేయబోతున్నాను అంటూ జగపతి బాబు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో బ్యాడ్ లక్ సఖి నుంచి గుడ్ లక్ సఖిగా ఎలా మారిందన్న నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించారని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ఆదిపినిశెట్టి కీలక పాత్రలోకనిపించనున్నారు. దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. శ్రావ్యా వర్మ సహనిర్మాతగా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.