Good Luck Sakhi Pre Release Event: Shravya Varma Interesting Comments On Suma, Charge For Event - Sakshi
Sakshi News home page

Anchor Suma: సుమ‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..స్టేజీపై వెల్ల‌డించిన స‌హ‌నిర్మాత‌

Published Thu, Jan 27 2022 7:47 AM | Last Updated on Thu, Jan 27 2022 12:14 PM

Shravya Varma Says Anchor Suma Did Not Charged Sinle Rupee For Good Luck Sakhi Prre Release Event - Sakshi

టాలీవుడ్‌ టాప్ యాంక‌ర్‌గా సుమ‌కు తిరుగే లేదు. కొన్నేళ్లుగా ఆమె త‌న స్థానాన్ని ప‌దిలంగా కాపాడుకుంటోంది. ఎంత‌మంది కొత్త యాంక‌ర్లు వ‌చ్చినా స‌రే యాంక‌రింగ్ త‌న‌ అడ్డా అన్న‌ట్లుగా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతూ వ‌స్తోంది. త‌న‌కున్న పాపులారిటీకి త‌గ్గ‌ట్లే ఒక్కో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా ల‌క్ష‌ల్లోనే తీసుకుంటుంది. అయితే సినిమా రేంజ్‌ను బ‌ట్టి, హీరోల‌ను బ‌ట్టి ఇది కొంత మారుతూ వ‌స్తోంది.

తాజాగా ఆమె గుడ్ ల‌క్ స‌ఖి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించింది. కీర్తి సురేశ్ లీడ్ రోల్‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో వ‌ర్త్ ఏ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తుండ‌గా శ్రావ్య వ‌ర్మ స‌హ‌నిర్మాత‌గా ఉన్నారు. బుధ‌వారం జ‌రిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో శ్రావ్య వ‌ర్మ మాట్లాడుతూ కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్లడించింది.

'చిరంజీవిగారిని క‌లిస్తే ఆయ‌న వ‌స్తాన‌ని చెప్పారు, కానీ కోవిడ్ వ‌ల్ల రాలేక‌పోయారు. రామ్‌చ‌ర‌ణ్‌ను పంపించారు. మీరు వ‌చ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్‌. ఇక సుమ విష‌యానికి వ‌స్తే శ్రేయాస్ మీడియా ఆమెను క‌ల‌వ‌గానే స‌రేన‌ని అంగీక‌రించింది. ఆమె ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చి ఈ సినిమాకు స‌పోర్ట్ చేసింది' అని చెప్పుకొచ్చింది. దీంతో కంగారు ప‌డిపోయిన సుమ‌ శ్రావ్య స్పీచ్ ముగించి వెళ్లేట‌ప్పుడు కౌంట‌ర్ వేసింది. 'ఇంకాసేపు ఉంటే నా ఆస్తి వివ‌రాల‌న్నీ కూడా చెప్పేలా ఉన్నావే.. నెక్స్ట్ సినిమాలు చేస్తావ్ క‌దా, అప్పుడు అన్నీ క‌లిపి తీసుకుంటానులే' అని సెటైర్ వేసింది సుమ‌.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement