Nani Dasara Movie Pre Release Event, Date And Venue Locked, Deets Inside - Sakshi
Sakshi News home page

Dasara Pre Release Event: నాని 'దసరా' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎక్కడంటే..

Published Sat, Mar 25 2023 1:25 PM | Last Updated on Sat, Mar 25 2023 3:01 PM

Nani Dasara Pre Release Event Date And Venue Locked - Sakshi

నాచురల్‌ స్టార్‌ నాని, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం దసరా. రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ట్రైలర్‌, పాటలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి.

మార్చి 30న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌, వెన్యూ ఖరారైంది. అనంతపూర్ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఈనెల 26న ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement