Good Luck Sakhi OTT Release Date Locked, Details in Telugu - Sakshi
Sakshi News home page

Good Luck Sakhi: ఓటీటీలో గుడ్‌ లక్‌ సఖి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Published Fri, Feb 11 2022 3:41 PM | Last Updated on Fri, Feb 11 2022 5:37 PM

Good Luck Sakhi to Stream on Amazon Prime Video OTT Check Details - Sakshi

కీర్తి సురేష్‌, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గుడ్‌ లక్‌ సఖి'. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి నగేష్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. దిల్‌ రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించారు. శ్రావ్యా వర్మ సహనిర్మాతగా వ్యవహరించారు. జగపతి బాబు మరో కీలక పాత్రలో నటించారు. జనవరి28న ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

తాజాగా సినిమా ఓటీటీలోకి రానున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా రేపట్నుంచి(ఫిబ్రవరి12) స్ట్రీమింగ్‌ కానుంది. మరి థియేటర్‌లో మెప్పించలేకపోయిన ఈ సినిమా డిజిటల్‌ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement