stream
-
జలపాతంలో ఇద్దరి మృతదేహాలు లభ్యం
మారేడుమిల్లి: అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని పర్యాటక ప్రదేశమైన జలతరంగిణి జలపాతంలో ఆదివారం గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం వేకువజామున జలపాతం సమీపంలోని తుప్పల మధ్య కె.సౌమ్య (21), బి.అమృత (21) మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. గల్లంతైన మరో విద్యార్థి సీహెచ్ హరదీప్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఏలూరు ఆశ్రం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సెకండియర్ విద్యార్థులు 14 మంది ఆదివారం మారేడుమిల్లి వచ్చారు. జలతరంగిణి జలపాతంలో దిగి స్నానాలు చేస్తుండగా జలపాతం ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఒక్కసారిగా వాగు ఉప్పొంగింది. ప్రవాహంలో సీహెచ్ హరదీప్, కె.సౌమ్య, బి.అమృత కొట్టుకుపోగా.. గాయత్రీపుష్ప, హరిణిప్రియ అనే విద్యార్థినులు జలపాతానికి 6 కిలోమీటర్ల సమీపంలో చెటుకొమ్మకు చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.లభ్యమైన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. హరదీప్ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ, అటవీ, పోలీస్ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోపాలకృష్ణ తెలిపారు. -
ఓటేయాలంటే..వాగు దాటాలె
కొండాయి గ్రామ జనాభా 1860 ఓటర్లు: 1220 నివాస గృహాలు: 418 బతకడం వేరు. జీవించడం వేరు. వాళ్లు కేవలం బతుకుతున్నారంతే.. జీవించడాన్ని మన పాలకులు వాళ్లకింకా అలవాటు చేయలేదు. ప్రభుత్వాలు మారుతున్నా.. పాలకులూ మారుతున్నా.. ఆవిష్కరణలు ఆకాశాన్ని చుట్టేస్తున్నా.. ఇప్పటికీ ములుగు జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వాగులు దాటుతున్నారు. ఈ ఏడాది జూలై 27న వరద ఎనిమిది మందిని మింగింది. ఇప్పటికీ ఆ గ్రామాల్లో ఏ మనిషిని కదిలించినా రోదనలే. అంతుచిక్కని వేదనలే. వారిని ‘సాక్షి’ పలకరిస్తే వాగంత దుఃఖాన్ని వెళ్లబోసుకున్నారు. వారి ఎజెండా.. ఏమిటో చెప్పుకొచ్చారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది మా అమ్మగారింటికి(కొండాయి) తొలుసూరు కాన్పు చేయించుకునేందుకు వచ్చిన. వాగుపై బ్రిడ్జి కూలింది. నొప్పులు రావడంతో వాగులో నుంచి నడుములోతుల్లో దాటుకుంటుపోయిన. దొడ్లకు చేరుకొని అక్కడి నుంచి ఏటూరునాగారం, ములుగు వెళ్లేసరికి బిడ్డ అడ్డం తిరిగింది. పెద్దాపరేషన్ చేసి డెలివరీ చేసిండ్లు. మళ్లీ బాలింత నొప్పులతో ఉంటే.. మా అమ్మనాన్న, వాళ్లు మరో పదిమంది కలిసి డొల్ల కట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. – మానేటి సంధ్యారాణి, బాలింత, కొండాయి ఐదు నెలల నుంచి అంతులేని వ్యథ ఈ ఏడాది జూలై 27న అకాల వర్షాలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండల పరిధి హైలెవెల్ బ్రిడ్జి కూలింది. జంపన్న వాగు ఉధృతికి కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఆయా గ్రామాల ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. కొండాయి గ్రామంలో వరద 8 మందిని జల సమాధి చేసింది. బ్రిడ్జి కొట్టుకుపోవడంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీకి పూర్తిగా రాకపోకలు నిలిచాయి. ఐదు నెలల నుంచి ఆయా గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్నారు. గర్భిణులు ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డొల్లాలు కట్టి వాగు దాటిస్తున్నారు. రేషన్ బియ్యం కోసం సైతం కొండాయిలో వేలి ముద్రవేసి.. వాగుదాటి దొడ్లకు వెళ్లి అక్కడి నుంచి బియ్యాన్ని మోసుకుంటూ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఎరువు అందుతలేదు.. పొలం పనుల కోసం కావాల్సిన ఎరువు బస్తాలు, ఇతర సామగ్రిని తెచ్చుకునేందుకు నరకం కనిపిస్తోంది. ఎరువు బస్తాలను వాగులో నుంచి తలపై పెట్టుకొని దాటించడం కష్టంగా మారింది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇలా వ్యవసాయ పనిముట్లకు కష్టాలు పడుతూ వాగుదాటాల్సి వస్తోంది. –బొచ్చు ఉపేందర్, రైతు ఇంటికి మగదిక్కు లేకుండా పోయింది ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాం. నా భర్త, కొడుకు జంపన్నవాగు ప్రమాదంలో చచ్చిపోయిండ్లు. ఇంటికి మగదిక్కులేకుండా పోయింది. ఇప్పుడు ఒక్కదాన్నే ఉంటున్నా. నాకు ఏ అవసరం వచ్చినా.. ఆదుకునే వారే లేరు. బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న. – మున్నిబేగం, కొండాయి ఒక్క కొండాయి గ్రామమే కాదు... ఏజెన్సీ పరిధిలోని అనేక ఆదివాసీ గూడేల ప్రజలు వంతెనలు లేక నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో, పోటీలో ఉన్న నేతల హామీల్లో వీరి సమస్యలు ఎక్కడా కనిపించవు. ఏజñ న్సీ వాసుల ఇబ్బందులు ఇలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది బీడీ కార్మికులు ఏళ్ల తరబడి సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. వీరి వెతలు నేతల చెవికెక్కుతాయన్న ఆశతో ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల వేళ...ఈ పీపుల్స్ ఎజెండాకు మోక్షం లభిస్తుందని వారు ఎదురుచూస్తున్నారు. - అలువాల శ్రీనివాస్ -
నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు మరో షాక్!
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) యూజర్లకు మరో షాక్ ఇవ్వనుంది. ఇదివరకే పాస్వర్డ్-షేరింగ్‌పై పరిమితి తీసుకొచ్చిన ఈ స్ట్రీమింగ్ దిగ్గజం ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చార్జీలు పెంచేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పాస్వర్డ్-షేరింగ్‌ను కట్టడి చేసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ మూడవ త్రైమాసికంలో సుమారు 6 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను పెంచుకుంది. తాజాగా ఆదాయాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో సబ్స్క్రిప్షన్ చార్జీలు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాల్ట్ డిస్నీ వంటి ప్రత్యర్థులు ఈ ఏడాది యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ చార్జలు పెంచినప్పటికీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం పెంచలేదు. కేవలం పాస్వర్డ్ షేరింగ్‌పై మాత్రమే పరిమితి విధించింది. ఈ ప్రయత్నం విజయవంతమై సుమారు 6 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను పెంచుకోగలిగింది. హాలీవుడ్ నటీనటుల సమ్మె ముగిసిన తర్వాత ధరలను పెంచే అవకాశం ఉందని అక్టోబర్‌లో ఓ మీడియా నివేదిక తెలిపింది. హాలీవుడ్‌ను గందరగోళంలో ముంచెత్తిన సమ్మెకు పిలుపునిచ్చిన ఐదు నెలల తర్వాత, రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా గత వారం ప్రధాన స్టూడియోలతో కొత్త ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ క్రమంలో రానున్న నెలల్లో నెట్‌ఫ్లిక్స్ యాడ్‌ఫ్రీ సబ్స్క్రిప్షన్ల చార్జీలు పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాస్వర్డ్ షేరింగ్ కట్టడి తర్వాత నెట్‌ఫ్లిక్స్‌కు సభ్యత్వం పొందిన చాలా మంది యూజర్లు యాడ్-ఫ్రీ ప్లాన్లను ఎంచుకున్నారని విశ్లేషకులు తెలిపారు. ప్రకటనలతో కూడిన దాని ప్రామాణిక ప్లాన్‌కు నెలకు 6.99 డాలర్లు ఉండగా ప్రకటన రహిత ప్లాన్లు 15.49 డాలర్ల నుంచి ప్రారంభమవుతున్నాయి. -
కన్నీటి వాగు
కెరమెరి(ఆసిఫాబాద్): పత్తి చేనులో పురుగు మందు పిచికారీ చేస్తూ విష ప్రభావానికి గురైన లక్మాపూర్ రైతు మాలోత్ లక్ష్మణ్ (50)ను వాగు దాటించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో మృతి చెందాడు. లక్ష్మణ్ శుక్రవారం తన పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా విషప్రభావంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. గమనించిన సమీప రైతులు ఆయనను ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కష్టంగా దాటించి.. కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఉట్నూ ర్ సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా.. అర్ధరాత్రి 12 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందాడు. శనివారం కూడా వాగు ఉధృతి తగ్గక పోవ డంతో మృతదేహాన్ని మంచంపైనే వాగు దాటించారు. కాగా ఈ నెల 8న ‘ప్రాణాలు పోయా కా స్పందిస్తారా..?’ అన్న శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన రోజే మృతి చెందడం గమనార్హం! ఆలస్యం కాకుంటే.. లక్ష్మణ్ తన చేనులో పడిపోగా.. వాగు దాటించి కెరమెరి పీహెచ్‌సీకి చేర్చడానికి రెండు గంటల సమయం పట్టింది. దీంతో ప్రాథమిక చికిత్స అందడం ఆలస్యమైంది. అక్కడి నుంచి ఉట్నూర్, ఆ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్‌కు చేరేసరికి లక్ష్మణ్ పరిస్థితి విషమించింది. రిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. సకాలంలో తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని రిమ్స్ వైద్యులు పేర్కొన్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. -
చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి
కెరమెరి(ఆసిపాబాద్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం లక్మాపూర్‌లో బాహుబలి సినిమాలో జరిగినట్లు ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ సినిమాలో మహేంద్ర బాహుబలిని శివగామి తన చేతిలో పట్టుకుని నదిని దాటినట్లుగా.. లక్మాపూర్ వాగులో ఓ వ్యక్తి చంటి బిడ్డను ఇలా చేతుల్లో పట్టుకుని వాగు దాటాడు. గ్రామానికి చెందిన రాథోడ్ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మరోవైపు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగుతోంది. దీంతో పాపను ఆస్పత్రికి తీసుకెళ్లే వీల్లేక మూడు రోజులు వేచి చూశారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. సాయంకోసం కృష్ణ తన తమ్ముడు సాయిప్ర కాశ్‌ను తీసుకుని బయల్దేరారు. అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సాయిప్రకాశ్ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని గొంతు వరకు నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటారు. తర్వాత చిన్నారి తల్లిదండ్రులు కూడా వాగుదాటారు. అనంతరం ముగ్గురూ కెరమెరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. తిరిగి ఇదే రీతిలో వాగుదాటి ఇంటికి వెళ్లారు. కాగా, ఈ వాగుపై 2016లో వంతెన నిర్మాణం ప్రారంభించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని ఆ ప్రాంతవాసులు చెపుతున్నారు. దీంతో ఏటా వానాకాలంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని లక్మాపూర్ వాసులు వాపోతున్నారు. చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి -
కొనసాగుతున్న గోదావరి వరద
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/చింతూరు/ సాక్షిప్రతినిధి,ఏలూరు: గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం ఎగువున తెలంగాణలో వరద కొనసాగగా, దిగువున ఏపీలో తగ్గింది. పోలవరం ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 6 గంటలకు 6,33,474 క్యూసెక్కులు చేరుతుండగా.. 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. నీటి మట్టం ప్రాజెక్టు స్పిల్ వేకు ఎగువన 32, దిగువన 23.5, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 32.7, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 23.07 మీటర్లుగా నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజ్ లోకి 8,68,285 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 12,100 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 8,56,185 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువున తెలంగాణ లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1,57,496 క్యూసె క్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 56.94 టీఎంసీలకు చేరుకుంది. మరో 34 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండిపోతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1,92,529 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 20 గేట్లు ఎత్తేసి 2,55,320 క్యూసెక్కులను దిగువకు వదులుతు న్నారు. కాళేళ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడి గడ్డ(లక్ష్మీ) బ్యారేజ్ నుంచి 6,10,250 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్ నుంచి 8,79,450 క్యూసె క్కులు దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు భద్రాచలం, పోలవరం మీదుగా ధవళేశ్వరం బ్యారే జ్ నుంచి కడలిలో కలవనున్నాయి. కాగా, శని వారం సాయంత్రం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.80 అడుగులకు తగ్గింది. ఇక్కడ ఆది వారం వరద స్వల్పంగా పెరుగుతుంది. భద్రాచలం వద్ద తగ్గుతూ.. పెరుగుతూ.. భద్రాచలం వద్ద శుక్రవారం నాటికి 44.30 అడుగు లకు చేరిన నీటిమట్టం, శనివారం ఉదయానికి 39.4 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో మళ్లీ పెరగడం ప్రారంభమై శనివారం సాయంత్రానికి 40 అడుగులకు చేరుకుంది. విలీన మండలాలైన కూనవరం, వీఆర్‌పురంలో ప్రస్తుతం వరద ప్రభావం తగ్గుతున్నా తిరిగి పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ముంపు గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు పారిశుధ్య పనులు చేపడుతున్నారు. దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం వద్ద గోదావరి వరదనీరు రెండు అడుగుల మేర తగ్గింది. పశ్చిమగోదావరిలోని యలమంచిలి మండలం కనకాయలంకలో వరద పరిస్థితిని కలెక్టర్ పి.ప్రశాంతి పడవలో వెళ్లి పరిశీలించారు. అలాగే ఏలూరు జిల్లాలోని ముంపు మండలాల్లో వరద పరిస్థితిని నూజివీడు అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ భరత్ పరిశీలించారు. -
వాగు అవతల తల్లి.. ఇవతల కొడుకు
కొందుర్గు (రంగారెడ్డి జిల్లా): వరదనీరు తల్లీకొడుకుల హృదయాలను తల్లడిల్లేలా చేసింది. బేకరీలో పనికి వెళ్లిన ఓ తల్లి వర్షం కారణంగా మధ్యాహ్నమే తిరిగి ఇంటికి పయనంకాగా దారి మధ్యలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగుకి ఇవతలే ఆగిపోయింది. కాగా, తల్లి వాగు వద్దే ఆగిపోయిందని తెలుసుకుని కంగారుపడ్డ కొడుకు అక్కడకు చేరుకుని తల్లిరాక కోసం తల్లడిల్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెర్కుపల్లికి చెందిన గుర్రంపల్లి చిన్నమ్మ శుక్రవారం యథావిధిగా షాద్‌నగర్‌లోని ఓ బేకరీలో పనికి వెళ్లింది. అయితే వర్షం కారణంగా మధ్యాహ్నమే తిరిగి ఇంటికి పయనమైంది. ఈ క్రమంలో కొందుర్గులో బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికివెళ్తుండగా శివారులోని వాగు ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆమె అక్కడే ఒడ్డున ఆగిపోయింది. చిన్నమ్మ వాగు వద్ద ఉందని తెలుసుకున్న కుమారుడు రోహిత్ వాగు వద్దకు వచ్చి తల్లిరాకకోసం తల్లడిల్లిపోయాడు. సుమారు మూడు గంటల ఉత్కంఠ అనంతరం వాగు ఉధృతి తగ్గుముఖం పట్టడంతో చిన్నమ్మను స్థానికులు నెమ్మదిగా అవతలి ఒడ్డుకు చేర్చారు. దీంతో తల్లీకొడుకుల నిరీక్షణ ఫలించింది. -
ఓటీటీలో గుడ్ లక్ సఖి.. ఎప్పటి నుంచంటే
కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నగేష్‌కుమార్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. శ్రావ్యా వర్మ సహనిర్మాతగా వ్యవహరించారు. జగపతి బాబు మరో కీలక పాత్రలో నటించారు. జనవరి28న ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా సినిమా ఓటీటీలోకి రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రేపట్నుంచి(ఫిబ్రవరి12) స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లో మెప్పించలేకపోయిన ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుంది అన్నది చూడాల్సి ఉంది. -
'శ్యామ్ సింగరాయ్'.. ఇప్పుడు ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. నాని సరసన కృతిశెట్టి, సాయిపల్లవి జంటగా నటించారు. దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలో నటించింది. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో రేపటి నుంచే(జనవరి21)నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో శ్యామ్ సింగరాయ్‌కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది చూడాల్సి ఉంది. -
వాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. వీడియో వైరల్
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్లల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆకస్మికంగా వచ్చిన వరదకు వాగులో నుంచి వెళుతున్న ట్రాక్టర్ కొట్టుకుపోయింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం సర్పంచ్ తండా గ్రామ పంచాయతీకి చెందిన బట్టు రంపాల్ కొండాపూర్ గ్రామం నుంచి ట్రాక్టర్లో ఫ్రిజ్, కూల్ డ్రింక్స్ డబ్బాలు తీసుకుని వెళ్తుండగా మొండి వాగులో ట్రాక్టర్ దిగబడింది. అదే సమయంలో అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి భారీగా వరద వచ్చింది. ట్రాక్టర్ వాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్ ట్రాక్టర్ దిగి ఒడ్డుకు చేరడంతో ప్రమాదం తప్పింది. -
మానేరు వాగులో ఆరు గంటలు..
మానేరు వాగులో చేపల వేట కు వెళ్లిన ముగ్గురు యువకులు ఒక్కసారిగా వచ్చిన వరదకు అందులోనే చిక్కుకుపోయారు. చెట్టును పట్టుకుని ఇద్దరు, పైపును పట్టుకుని మరొకరు సుమారు ఆరు గంటలు నరకయాతన పడ్డారు. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు రెస్క్యూటీం సహకారంతో ముగ్గురినీ ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటన వీణవంక మండలం చల్లూరు వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. సాక్షి, వీణవంక(హుజూరాబాద్): చల్లూరు గ్రామానికి చెందిన నేదురు రవి, నేదురు శ్రీనివాస్, మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన తిరుపతి ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో మానేరు వాగులో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో వాగులో ఉధృతి ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ కొట్టుకుపోయారు. వాగు ఒడ్డు నుంచి 600 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టును నేదురు శ్రీనివాస్, తిరుపతి పట్టుకున్నారు. నేదురు రవి వాగు ఒడ్డు నుంచి కిలోమీటర్ దూరం కొట్టుకుపోయి అక్కడ ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావి పైపు కనిపించడంతో దానిని పట్టుకున్నాడు. సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తుండగా వాగు ఒడ్డు నుంచి వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కిరణ్‌రెడ్డి, సర్పంచ్ పొదిల జ్యోతిరమేశ్, ట్రస్మా అధ్యక్షుడు ముసిపట్ల తిరుపతిరెడ్డి వెంటనే వాగు వద్దకు చేరుకుని స్థానికుల సహాయంతో రక్షించేందుకు ప్రయణ్నించారు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఫలితం లేకుండా పోయింది. ట్రస్మా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కలెక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో రెస్క్యూటీం రంగంలోకి దిగింది. చదవండి: (ఒక్కసారిగా పెరిగిన వరద, ముగ్గురూ వాగులోనే..) వాగులో ఆరుగంటలు... సాయంత్రం 4 గంటలకు గల్లంతైన యువకులు రాత్రి 10 గంటల వరకు సుమారు ఆరు గంటలు వాగులేనే బిక్కుబిక్కు మంటు గడిపారు. కాపాడాలంటూ నేదురు శ్రీనివాస్, తిరుపతి రోదిస్తూ వేడుకున్నారు. నేదురు రవి అచూకీ కనుక్కోవడం కొంత ఆలస్యమైంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వారిని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సాయంత్రం 7 గంటలకు కరీంనగర్‌కు చెందిన రెస్క్యూటీం సభ్యులు వాగు వద్దకు చేరుకుని మొదటగా రవిని రక్షించేందుకు ప్రయణ్నించారు. మూడుసార్లు రవి వద్దకు వెళ్లి వెనక్కు వచ్చిన సిబ్బంది చివరకు తాడు సహాయంతో రాత్రి 9.40 గంటలకు రక్షించగలిగారు. మిగిలిన ఇద్దరినీ 10 గంటల సమయంలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో చచ్చి బతికామంటు వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఎల్ఎండీ గేట్లు మూయడంతో... కరీంనగర్ ఎల్ఎండీకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పెరుగడంతో అధికారులు సాయంత్రం నీటి విడుదలను పెంచారు. సుమారు లక్ష క్యూసెక్కులు దిగువకు వదలడంతో మానేరు వాగు ఉప్పొంగి ప్రవహించింది. వరదను అంచనా వేయకుండా యువకులు చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. యువకుల గల్లంతు విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ ఎల్ఎండీ గేట్లు మేసివేయాలని ఎస్సారెస్పీ అధికారులను ఆదేశించారు. దీంతో హుటాహుటిన గేట్లు మూసివేయడంతో వాగులో వరద ఉధృతి తగ్గుముఖంపట్టింది. దీంతో యువకులను కాపాడడం రెస్క్యూ సిబ్బందికి సులువైంది. హెలిక్యాప్టర్ తెప్పిస్తే బాగుండేది... ముగ్గురు యువకులు ఆరు గంటలపాటు ప్రాణాపాయ స్థితిలో వాగులో కొట్టుమిట్టాడారు. హెలిక్యాప్టర్ సకాలంలో తెప్పిస్తే యువకులను త్వరగా కాపాడేవారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆరు గంటల జాప్యంలో యువకులు పట్టు కోల్పోతే ప్రాణాలు కోల్పోయేవారని పేర్కొంటున్నారు. వరదలో ఆరు గంటలు చుక్కలు చూశామని, అసలు ప్రాణాలతో బయటపడుతామని అనుకోలేదని బాధితులు తెలిపారు. తహసీల్దార్ కనకయ్య, ఎస్సై కిరణ్‌రెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సర్పంచ్ పొదిల్ల జ్యోతిరమేశ్కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఒక్కసారిగా పెరిగిన వరద, ముగ్గురూ వాగులోనే..
-
ఒక్కసారిగా పెరిగిన వరద, ముగ్గురూ వాగులోనే..
సాక్షి, కరీంనగర్: చేపల వేటకు వెళ్ళిన ముగ్గురు వ్యక్తులు వాగు మధ్యలో చిక్కుకుపోయారు. జిల్లాలోని వీణవంక మండలం చల్లూరు వద్ద మానేరు వాగులో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితులను శ్రీనివాస్, రవి, తిరుపతిగా గుర్తించారు. వారిని రక్షించేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మానేరు వాగులో చేపలు పడుతుండగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిందని, దాంతో ముగ్గురూ చిక్కుకుపోయినట్టుగా స్థానికులు వెల్లడించారు. శ్రీనివాస్, రవి సురక్షిత ప్రాంతంలో ఉండగా, తిరుపతి ప్రమాదకరమైన ప్రదేశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ నుంచి రెస్క్యూ బృందాన్ని రప్పిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, ఎడతెరిపిలేని వర్షాలతో దిగువ మానేరు నిండుకుండలా మారింది. 8 గేట్లు ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో చల్లూరు వద్ద మానేరు వాగులో వరద ఉధృతి పెరిగింది. మానేరు వాగులో వరద ఉధృతిని తగ్గించేందుకు దిగువ మానేరు గేట్లను అధికారులు మూసివేశారు. (చదవండి: వాగు మధ్యలో ప్రసవం.. ) -
వాగు మధ్యలో ప్రసవం..
కేవీబీపురం: ఆ గ్రామం ఏర్పడి 70 ఏళ్లు అవుతోంది. గ్రామానికి వెళ్లాలంటే మార్గమధ్యంలో వాగు దాటాల్సిందే. వర్షాలు వస్తే సుమారు 20 అడుగుల వరకు వాగు పారుతుంది. కొద్దిరోజుల వరకు బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోతాయి. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం అంజూరు పంచాయతీ జయలక్ష్మీపురం గ్రామం పరిస్థితి ఇది. ఈ క్రమంలో ఆదివారం గ్రామానికి చెందిన సునీత (25) అనే గిరిజన గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు వాగు దాటిస్తుండగా మధ్యలోనే ప్రసవించింది. మొదట సునీతకు పురిటినొప్పులు రాగా బంధువులు స్థానిక వలంటీర్ సహాయంతో 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే గత రాత్రి కురిసిన వర్షాలకు వాగు నిండుగా ప్రవహిస్తుండటంతో 108 వాహనం వాగు దాటే పరిస్థితి లేదు. స్థానికులు ఆటోలో కొబ్బరి మట్టల సహాయంతో గర్భిణిని గ్రామం నుంచి తీసుకొచ్చి వాగు దాటించే ప్రయత్నం చేశారు. పురిటినొప్పులు అధికమవ్వడంతో వాగు మధ్యలోనే గర్భిణికి కాన్పు చేశారు. ఆపై 108లో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. -
చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు..
జనగామ: జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ వద్ద ఆకేరు వాగులో చేపల వేట కోసం మంగళవారం ఉదయం 9 గంటలకు నలుగురు యువకులు వెళ్లారు. ఈ నేపథ్యంలో నలుగురు యువకులు చెక్ డ్యామ్ వద్ద చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు 23 సంవత్సరాల ఆరూరి వంశీ గల్లంతయ్యాడు. ఈ క్రమంలో ఆరూరి వంశీని కాపాడడానికి అతని వెంట ఉన్న ఆరూరి శ్రవణ్, పాశం సందీప్, శాగంటి ప్రమోద్ ప్రయత్నించారు. కానీ ఆరూరి వంశీ ఆచూకీ దొరకలేదు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం, కలెక్టర్, డీసీపీ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ఆరూరి వంశీ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపట్టిన ఇంకా వంశీ ఆచూకీ దొరకలేదు. -
వాగు మింగేసింది
సాక్షి, నాదెండ్ల(గుంటూరు) : మండలంలోని సంక్రాంతిపాడు వద్ద నక్కవాగులో గల్లంతైన యువ రైతు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. సంక్రాంతిపాడు గ్రామానికి చెందిన ప్రత్తి సాంబశివరావు కుమారుడు శ్రీకాంత్ (29) రెండేళ్ల క్రితం గుంటూరు సమీపంలోని బుడంపాడు గ్రామానికి చెందిన స్వప్నతో వివాహమైంది. అరెకరం సొంత భూమికి తోడు మరి కొంత కౌలుకు తీసుకుని తండ్రితో కలిసి పంటలు సాగు చేస్తున్నాడు. గురువారం ఉదయం తండ్రితో కలిసి బ్రిడ్జి మీదుగా పొలానికి వెళ్లి తిరిగి వస్తూ వాగు దాటేందుకు ప్రయత్నించాడు. వాగు ఉధృతికి అదుపుతప్పి పడిపోయాడు. అదే సమయంలో ద్విచక్రవాహనాలపై వెళ్తున్న రైతులు చూసి రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. నాదెండ్ల ఇన్చార్జి తహసీల్దార్ నాంచారయ్య, డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఎస్ఐ చెన్నకేశవులు, అగ్నిమాపక దళ అధికారి చంద్రమౌళి సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను తెప్పించారు. ఈలోగా రైతులే శ్రీకాంత్ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలతోనే ప్రమాదాలు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు అడ్డగోలుగా ఇసుక, మట్టి తవ్వకాలు జరిపారు. నక్కవాగులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వటంతో గుంతలు ఏర్పడ్డాయి. వాగు ఉధృతి కారణంగా శ్రీకాంత్ ఈ గుంతల్లో పడి మృతి చెందాడు. గల్లంతైన బాలిక మృత్యుఒడికి.. సత్తెనపల్లి: మండలంలోని పాకాలపాడు వాగులో గల్లంతైన విద్యార్థిని పెరవల్లి భువనేశ్వరి (11) మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని గురువారం రెంటపాళ్ళ వద్ద వాగులో పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు గుర్తించారు. చందవరం గ్రామానికి చెందిన బాలిక ఐదో తరగతి చదువుతోంది. అమ్మమ్మ పార్వతితోపాటు దుస్తులు శుభ్రం చేసేందుకు పాకాలపాడులోని శివాలయం వెనుక ఉన్న వాగుకు బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో వెళ్లింది. కాలు జారి వాగులో పడి కొట్టుకుపోయింది. బాలిక మృతితో అమ్మమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటన పలువురిని కలిచివేసింది. మృతదేహాన్ని అధికారులు పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. -
చిన్నారులను మింగిన వాగు
సాక్షి, రాజోళి (అలంపూర్): స్థానిక శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన ముగ్గురు స్నేహితులు ఆదివారం సెలవు రోజు కావడంతో సమీపంలోని పెద్దవాగు వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షానికి అందులో నీరు చేరింది. సమీపంలో ఉన్న కుంటలూ నిండాయి. ఆదివారం ఉదయం ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారుల్లో కొందరు వెనక్కి రాగా.. శివయ్య (10), సాయి చరణ్ (9), యుగంధర్ (7) మధ్యాహ్నం 12 గంటలకు పెద్దవాగు వద్దే ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు తమ పిల్లలు కనిపించడం లేదని గ్రామంలో అంతటా వెతికారు. చివరకు రాత్రి పది గంటలకు వాగు వద్ద ఉన్న ముగ్గురు చిన్నారు చెప్పులను చూసి అనుమానం వచ్చిన స్థానికులు మత్య్సకారులతో గాలించారు. చివరికి మృతదేహాలు బురదలో ఇరుక్కుపోగా వాటిని బయటకు తీశారు. వారిని చూసిన కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. తల్లిదండ్రులు, స్థానికుల రోదనలతో ఆ ప్రాంతంలో నిండిపోయింది. ప్రతిరోజూ తమ మధ్యనే తిరుగుతూ, తమ పిల్లలతో కలిసి ఆడుకునే ముగ్గురు చిన్నారులు ఆకస్మికంగా మృత్యువాత పడటంతో గ్రామస్తులను కలిచి వేసింది. కడుపుకోత ఈ ఘటనలో మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మేమేమి పాపం చేశాం దేవుడా, వారి కి బదులు మమ్మల్ని తీసుకోవచ్చు కదా.. ముక్కు పచ్చలారని పిల్లలను చంపావ్ అని తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరు అక్కడి వారిని కలచివేసింది. మాకు ఎందుకు ఇంత కడుపుకోత మిగిలిల్చావ్ అని కన్నీరుమున్నీరయ్యారు. మూడు ఇళ్లలో కొడుకులే మృతి ఆదివారం జరిగిన ఘటనతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతిచెందిన వారు మూడు కుటుంబాల్లో ఒక్కో కుమారుడే కావడంతో తమ వారసుడిని కోల్పోయామని గుండెలవిసేలా రోదించారు. బజారి ఇంటిలో పెద్ద కుమారుడైన శివయ్య మృతి చెందగా వారికి కూతురు ఉంది. వెంకప్పకు ముగ్గురు అమ్మాయిల తర్వాత కుమారుడు సాయిచరణ్ జన్మించగా.. ఈ ఘటనలో ఆ బాబు మృత్యువాతపడ్డాడు. కుర్వ ఎల్లప్ప కుమారుడు యుగందర్ మృతి చెందగా.. కుమార్తె ఉంది. ఇలా మూడు కుటుంబాల్లో ముగ్గురు కుమారులే చనిపోయారు. సంఘటనా స్థలానికి శాంతినగర్ సర్కిల్ సీఐ గురునాయుడు, ఎస్ఐ మహేందర్ చేరుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
వాగులో కొట్టుకుపోయిన తల్లీకూతుళ్లు
తల్లి మృతదేహం లభ్యం కొప్పళ జిల్లాలో విషాదం సాక్షి, బళ్లారి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొప్పళ జిల్లా కుష్టగి తాలూకా బొమ్మనాళ గ్రామం వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులో తల్లీకూతుళ్లు గల్లంతయ్యారు. శనివారం సాయంత్రం పొలం పనులకు వెళ్లిన హెగ్గప్ప, అతని భార్య హనుమవ్వ(45), కుమార్తె పార్వతి(22), కుమారుడుతోపాటు ఎద్దుల బండిపై వస్తుండగా గ్రామ శివార్లలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఎద్దులబండి బోల్తా పడింది. హెగ్గప్ప, అతని కుమారుడు ఈదుకుంటూ గట్టుకు చేరగా తల్లీకూతుళ్లిద్దరూ వాగులో కొట్టుకుపోయారు. వారి ఆచూకీ కోసం రాత్రంతా వాగు వెంట తీవ్రంగా గాలించారు. ఆదివారం ఉదయం హనుమవ్వ మృతదేహాన్ని వెలికితీశారు. అయితే పార్వతి ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఆమె మృతదేహం ఆచూకీ కోసం పోలీసులతో పాటు సంబంధిత అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇటీవలే కూతురికి వివాహం.. వాగులో కొట్టుకుపోయిన పార్వతికి రెండు నెలల క్రితమే వివాహమైంది. భర్త బసవరాజు సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు. బసవరాజు ఇటీవలే విధుల కోసం జమ్ముకశ్మీర్‌కు వెళ్లడంతో పార్వతి పుట్టింటికి చేరింది. తల్లిదండ్రులతో పాటు పొలం పనులకు వెళ్లగా వాగులో గల్లంతైంది. ఘటనతో బొమ్మనాళ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై హనుమసాగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ పర్యటనలో విషాదం
విశాఖపట్టణం: విశాఖ జిల్లా పర్యటనలో విషాదం నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంనకు చెందిన 14మంది మినీ బస్సులో సోమవారం విశాఖ జిల్లా డుంబ్రిగూడకు వెళ్లారు. అక్కడ చాపరాయి తదితర ప్రదేశాలను చూసేక్రమంలో బొడబడగెడ్డ వద్ద విశ్రాంతి తీసుకునేందుకు ఆగారు. అందులోని ముగ్గురు వ్యక్తులు పక్కనే ఉన్న వాగులోకి దిగారు. వారిలో ఎస్.శ్రీనివాసరావు(35) అనే వ్యక్తి కాలు నీటిలోని రాళ్ల మధ్య ఇరుక్కుంది. కాలిని లాక్కునే క్రమంలో అతడు వాగులో కొట్టుకుపోయాడు. తోటి వారు రక్షించేలోగానే చనిపోయాడు. దీంతో మృతుని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
వాగులో బోల్తాపడిన లారీ
మద్నూర్ : పెద్ద ఎక్లార గేటు సమీపంలోని రాజుల్లా వాగులో ఓ లారీ బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి మద్నూర్ వైపునకు వస్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి వాగులో బోల్తాపడిందని పేర్కొన్నారు. సంగారెడ్డి నుంచి నాందేడ్ వరకు ఉన్న జాతీయ రహదారిపై గల కల్వర్టులు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఈ రహదారిని వెడల్పు చేసినప్పటికీ కల్వర్టులు మాత్రం అలాగే ఉన్నాయన్నారు. ఈ కల్వర్టులు ఒకేసారి ఒక్క వాహనమే వెళ్లడానికి అనువుగా ఉన్నాయని, ఎదురుగా ఎదైనా వాహనం వస్తే వాటిని తప్పించబోయి వాగులో పడిపోతున్నాయని పేర్కొన్నారు. కల్వర్టులను వెడల్పు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉధృతంగా ప్రవహించిన పాకాల వాగు
ఖానాపురం : మండలంలోని అశోక్‌నగర్ శివారులోని పాకాల వాగు బుధవారం ఉదృతంగా ప్రవహించింది. మత్తడి ద్వారా వచ్చే నీరు పాకాల వాగుద్వారా అశోక్‌నగర్ శివారులోని రోడ్డుపై నుంచి ప్రవహించడంతో నర్సంపేట నుంచి కొత్తగూడ వైపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్కూల్ బస్సులు, ఇతర వాహనాల డ్రైవర్లు కొందరు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు పైనుంచి దాటిం చగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై దుడ్డెల గురుస్వామి వాగువద్దకు చేరుకోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. -
మంజీరా నది వాగులో వ్యక్తి గల్లంతు
-
వాగులో దిగబడిన బస్సు
కంగ్టి: వాగులో బస్సు దిగబడటంతో నాలుగు గంటల పాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మంగళవారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన బస్సు కంగ్టి మండలం చాప్టా(కె) సమీపంలోని వాగులోంచి వెళుతోంది. వంతెన నిర్మాణంలో భాగంగా వాగులోంచే బైపాస్ రోడ్డు వేశారు. 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులో వరద నీరు ప్రవహిస్తోంది. పైగా గుంతలు ఏర్పడ్డాయి. ఇది గమనించని డ్రైవర్ నడిపిస్తున్న క్రమంలో బస్సు దిగబడిపోయింది. ఆ దారిలో రాకపోకలు స్తంభించాయి. దాదాపు నాలుగు గంటల పాటు పోలీసులు శ్రమించి బస్సును ఒడ్డుకు చేర్చారు. -
వాగులో కొట్టుకుపోయి మహిళ మృతి
వైఎస్సార్ జిల్లా: భారీ వర్షాల కారణంగా ఓ మహిళ వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటు చేసుకుంది. చుండుపల్లి మండలం వడ్లపల్లి గ్రామానికి చెందిన పెనుబాలి రెడ్డమ్మ (58) గ్రామం సమీపంలోని వాగు దాటే క్రమంలో సోమవారం రాత్రి గల్లంతైంది. ముమ్మర గాలింపు చర్యలతో మంగళవారం ఉదయం ఆమె మృతదేహం బయటపడింది. బహుదానది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రం నుంచి వడ్లపల్లికి వెళ్లేందుకు సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
వాగులో పడి చిన్నారులు మృతి
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా వై రామవరం మండల కేంద్రంలో బుధవారం ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు వాగు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. మండల కేంద్రానికి చెందిన వంతాల సత్తిబాబు, సీతమ్మ దంపతులకు నానిబాబు(4), మేఘన(2)అనే పిల్లలున్నారు. దంపతులు బుధవారం ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లారు. దాంతో ఇద్దరు పిల్లలు సత్తి బాబు తల్లి నీలమ్మ వద్దకు వెళ్లారు. దుస్తులు ఉతికేందుకు నీలమ్మ సమీపంలోని కొండవాగు వద్దకు వెళ్తూ ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లింది. ఆమె దుస్తులు ఉతికే పనిలో నిమగ్నమై ఉండగా... చిన్నారులిద్దరూ ఆడుకుంటూ నీటిలో పడి మునిగిపోయారు. నీలమ్మ కొద్దిసేపటి తర్వాత చూసే సరికే పిల్లలిద్దరు కనిపించకపోవడంతో కంగారు పడి పరిసర ప్రాంతాలలో గాలించింది. కానీ ప్రయోజనం లేకపోయే సరికి వాగులో వెతికింది. ఆ క్రమంలో నీటిలో పడి ఉన్న చిన్నారుల మృతదేహలను గుర్తించి కేకలు వేసింది. దాంతో స్థానికులు వచ్చి వాగులో పడి ఉన్న మృతదేహలను వెలికి తీశారు.