వైఎస్సార్ జిల్లా: భారీ వర్షాల కారణంగా ఓ మహిళ వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటు చేసుకుంది. చుండుపల్లి మండలం వడ్లపల్లి గ్రామానికి చెందిన పెనుబాలి రెడ్డమ్మ (58) గ్రామం సమీపంలోని వాగు దాటే క్రమంలో సోమవారం రాత్రి గల్లంతైంది. ముమ్మర గాలింపు చర్యలతో మంగళవారం ఉదయం ఆమె మృతదేహం బయటపడింది.
బహుదానది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రం నుంచి వడ్లపల్లికి వెళ్లేందుకు సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.