ఒంటిమిట్ట రామయ్య హుండీ లెక్కింపు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఆగస్టు నెలకు సంబంధించి నెల వారి హుండీ ఆదాయం రూ. 7 లక్షల 83 వేల 142 వచ్చినట్లు సోమవారం ఆలయ టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ రంగమండపంలో టీటీడీ సిబ్బంది ద్వారా హుండీలోని కానుకలను లెక్కించారు.
నిత్యపూజ స్వామి ఆలయంలో..
సిద్దవటం : వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల్ల అడవుల్లో వెలసిన శ్రీ నిత్య పూజస్వామి హుండీ ఆదాయం రూ.1,76,803 వచ్చిందని ఆలయం ఈఓ మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జూలై 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను దేవదాయ శాఖకు చెందిన కడప సూపర్వైజర్ ఎస్. జనార్దన్ ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో సోమవారం మధ్యాహ్నం లెక్కించామన్నారు. రూ. 1,76,803 నగదు, 191 గ్రాముల బంగారం, 1.700 గ్రాముల వెండి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండారెడ్డి, ఆలయ సిబ్బంది చంద్ర, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
రెడ్డెమ్మకొండ ఆదాయం రూ. 7 లక్షలు
గుర్రంకొండ : మండలంలోని సంతానదేవత శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి హుండీ ద్వారా రూ.7,00,121 ఆదాయం సమకూరింది. సోమవారం స్థానిక ఆలయంలో మదనపల్లె దేవదాయశాఖ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో మూడు నెలల కాలానికి సంబంధించి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదు రూపంలో రూ. 7,00,121, బంగారు నగలు 20 గ్రాములు, వెండికానుకలు 489 గ్రాములు వచ్చినట్లు లెక్కతేల్చారు. హుండీ ఆదాయాన్ని గుర్రంకొండ గ్రామీణబ్యాంకులో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, ఈఓ మంజుల, ,సిబ్బంది పాల్గొన్నారు.