వాగులో బోల్తాపడిన లారీ
మద్నూర్ :
పెద్ద ఎక్లార గేటు సమీపంలోని రాజుల్లా వాగులో ఓ లారీ బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి మద్నూర్ వైపునకు వస్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి వాగులో బోల్తాపడిందని పేర్కొన్నారు. సంగారెడ్డి నుంచి నాందేడ్ వరకు ఉన్న జాతీయ రహదారిపై గల కల్వర్టులు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఈ రహదారిని వెడల్పు చేసినప్పటికీ కల్వర్టులు మాత్రం అలాగే ఉన్నాయన్నారు. ఈ కల్వర్టులు ఒకేసారి ఒక్క వాహనమే వెళ్లడానికి అనువుగా ఉన్నాయని, ఎదురుగా ఎదైనా వాహనం వస్తే వాటిని తప్పించబోయి వాగులో పడిపోతున్నాయని పేర్కొన్నారు. కల్వర్టులను వెడల్పు చేయాలని ప్రజలు కోరుతున్నారు.