Larry
-
తండ్రీకొడుకులను కబళించిన లారీ
దుబ్బాక : ఒడి బియ్యం పోసుకునేందుకు సంతోషంగా అత్తగారింటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని లారీ రూపంలో మృత్యువు కబలించింది. ఇద్దరు కుమారులతో కలిసి తండ్రి స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, పెద్ద కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన శనివారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీరాం ప్రేమ్‌దీప్ కథనం మేరకు.. దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్‌కు చెందిన చిట్యాల వేణు(41) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం వేణు ఇద్దరు కుమారులు శివ (15), విష్ణును స్కూటీపై ఎక్కించుకొని ఒడి బియ్యం పోసుకునేందుకు అత్తగారి గ్రామమైన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధరిపల్లికి బయలుదేరాడు. దౌల్తాబాద్ మండలంలోని చెట్టనర్సంపల్లి బైపాస్ రోడ్డు వద్దకు రాగానే గజ్వేల్ వైపు నుంచి అతి వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి వేణు, పెద్ద కుమారుడు శివ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్న కుమారుడు విష్ణు గాయాలతో బయటపడ్డాడు. తండ్రీకొడుకుల మృతదేహాలు రోడ్డుపై గుర్తు పట్టరాకుండా పడిపోయాయి. మృతుడు శివ తిర్మలాపూర్ జెడ్పీహెచ్ఎస్లో పదవ తరగతి చదువుతున్నాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ ముత్యంరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. -
అన్నమయ్య జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, అన్నమయ్య జిల్లా: మదనపల్లి-బెంగుళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఐదుగురి మృతి చెందారు. మదనపల్లి మండలం బార్లపల్లి వద్ద ఘటన జరిగింది. -
డౌనింగ్ స్ట్రీట్ మార్జాల మిత్రుడు
నిష్క్రమించే ప్రధాని వీడ్కోలు కార్యక్రమ గౌరవ ఆహ్వానితుల జాబితాలో ‘ల్యారీ’ ఎందుకు కనిపించడు అని బ్రిటన్ ప్రజలు తరచూ ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఆహూతుల అందరి దృష్టీ తన వైపు మళ్లేందుకు ల్యారీ ఎప్పటికప్పుడు కళాత్మకమైన మార్గాలను కొనుగొంటూ ఉండడం అందుకు కారణం కావచ్చు. అవడానికి అది మామూలు మార్జాలమే అయినప్పటికీ దానిని ‘సివిల్ సర్వెంట్’గా పరిగణించాలని 2016లో నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరున్ పార్లమెంటులో ప్రకటించారు. ప్రస్తుతం చీఫ్ మౌజర్ హోదాలో ఉన్న ఆ సివిల్ సర్వెంట్ పేరే ‘ల్యారీ’. 2011 నుంచి ల్యారీ బ్రిటన్ ప్రధాని నివాసంలో ఉంటోంది. డేవిడ్ కామెరున్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రుస్, రుషి సునాక్... ప్రధానులుగా ఇంతమంది మారారు కానీ, ల్యారీ అక్కడే ఉంది. కాలధర్మం లేదా వృద్ధాప్యం మాత్రమే ల్యారీని డౌనింగ్ స్ట్రీట్ నుంచి కదలించగలవు. పెంపుడు కుక్కలపై మక్కువ కలిగిన వారిగా బ్రిటిషర్లు లోక విదితం అయినప్పటికీ, వారి ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ప్రాముఖ్యం పొందే చతుష్పాదం మాత్రం మార్జాలమే. పిల్లిది అక్కడ ‘చీఫ్ మౌజర్’ హోదా. చీఫ్ మౌజర్ ప్రధాన విధి డౌనింగ్ స్ట్రీట్‌లో ఒక్క ఎలుకైనా లేకుండా చూడటం. డౌనింగ్ స్ట్రీట్‌లోనే ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయాలు ఉంటాయి. అవడానికి అది మామూలు మార్జాలమే కానీ, దానిని ‘సివిల్ సర్వెంట్’గా పరిగణించాలని 2016లో నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరున్ పార్లమెంటులో ప్రకటించారు. ప్రస్తుతం చీఫ్ మౌజర్ హోదాలో ఉన్న ఆ సివిల్ సర్వెంట్ పేరు ‘ల్యారీ’. ‘బ్యాటర్‌సీ డాగ్స్ అండ్ క్యాట్స్ హోమ్’ నుంచి తప్పించి, దానిని అక్కడికి తెప్పించారు. 2011 నుంచి ల్యారీ బ్రిటన్ ప్రధాని నివాసంలో ఉంటోంది. డేవిడ్ కామెరున్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రుస్, రుషి సునాక్... ప్రధానులుగా ఇంతమంది మారారు కానీ, ల్యారీ అక్కడే ఉంది. కాలధర్మం లేదా వృద్ధాప్యం మాత్రమే ల్యారీని డౌనింగ్ స్ట్రీట్ నుంచి కదలించగలవు. జీవిత చరిత్రల రచనలో ప్రావీణ్యం కలిగిన నా మేనకోడలు నారాయణీ బసు బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక మార్జాలాల జీవిత చరిత్రను సంక్షిప్తంగా సంకలన పరిచారు. ఎనిమిదవ హెన్రీ చక్రవర్తి కాలం నాటి బ్రిటిష్ ప్రభుత్వ మార్జాల జీవిత చరిత్రతో సంకలనం మొదలౌతుంది. ఆ కాలపు రాజనీతిజ్ఞుడు, క్యాథలిక్ బిషప్ అయిన లార్డ్ ఛాన్స్లర్... థామస్ వోల్సే దగ్గర ఆ మార్జాలం ఉండేది. 1929కి ముందే బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా పిల్లి సంరక్షణ బాధ్యతలను చేపట్టినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. పిల్లి పోషణ, పాలన కోసం రోజుకు ఒక పెన్నీ కేటాయించినట్లు అప్పటి బడ్జెట్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. నాటి నుంచి పిల్లి ఖర్చు క్రమంగా పెరుగుతూ వచ్చి 21వ శతాబ్దానికి ‘చీఫ్ మౌజర్’ బ్రిటిష్ ఖజానాకు పెట్టిస్తున్న ఖర్చు 100 పౌండ్లకు చేరుకుంది. డౌనింగ్ స్ట్రీట్ వెబ్సైట్ ప్రకారం ల్యారీ విధులు ఇలా ఉన్నాయి: ఇంటికి వచ్చే అతిథులను పలకరించడం, భద్రతకు ఉద్దేశించిన రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేయడం, కునుకు తీయడానికి పురాతన ఫర్నిచర్ ఏ మాత్రం నాణ్యతను కలిగి ఉన్నదో పరీక్షించడం. అలాగే, భవంతిలో ఎలుకలు చేరకుండా ఉండేందుకు పరిష్కారం ఆలోచించడం కూడా చేస్తోందనీ, ఆ పరిష్కారం ఇంకా వ్యూహాత్మక ప్రణాళిక దశలోనే ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లిందని కూడా వెబ్సైట్లో ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ల్యారీ తన బాధ్యతల కంటే కూడా ప్రధాని కార్యాలయ అవసరాలను చూడ్డానికే ఎక్కువ ఇష్టపడుతుంది. నారాయణి పరిశోధనను బట్టి కామెరున్ దగ్గర తన తర్వాత వచ్చిన ప్రధానుల కంటే కూడా ల్యారీ గురించి చెప్పడానికే ఎక్కువ సమాచారం ఉంది. ఆ పిల్లి గురించి సునాక్ అభిప్రాయాన్ని నారాయణి ప్రస్తావించలేదు. కనుక ల్యారీని అర్థం చేసుకోవాలంటే మనం కామెరున్ మీద ఆధారపడాలి. ఆయన చెబుతున్న దానిని బట్టి ల్యారీ పురుషుల సమక్షంలో కాస్త బెరుకుగా ఉంటాడు. అయితే అందుకు బరాక్ ఒబామా మినహా యింపు. ‘‘తమాషా ఏంటంటే ఒబామాను ల్యారీ ఇష్టపడతాడు. ఒబామా అతడికి మృదువైన చిన్న తాటింపు వంటి స్పర్శను ఇస్తాడు. దాంతో ల్యారీ ఒబామా దగ్గర సౌఖ్యంగా ఉంటాడు. అయితే ల్యారీ ప్రధానమంత్రుల సతీమణులను కలవరపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ల్యారీ ఒంటి వెంట్రుకలు తన భర్త సూట్లపై కనిపించడంతో సమంతా కామెరున్ ల్యారీని ప్రధాని నివాసంలోకి అడుగు పెట్టనివ్వకుండా చేశారు. అంతెందుకు, పక్కనే ఉండే విదేశాంగశాఖ కార్యాలయంలోకి ల్యారీని ప్రవేశించనివ్వకుండా క్యాట్–ప్రూఫ్‌ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. విదేశాంగ కార్యదర్శి విలియం హేగ్ దానిని కిందికి తీసుకెళ్లండి అని కోరారు. అయితే హేగ్‌కి ల్యారీ పట్ల కొంత ఆపేక్ష ఉండేదట. కఠోర వాస్తవం ఏంటంటే ల్యారీకి ఉన్న ప్రజాదరణ కారణంగా తరచూ ప్రధాన మంత్రి కంటే కూడా ఎక్కువగా ల్యారీకి భద్రతా బలగం అవసరం అయ్యేది. కామెరాన్ దంపతులు ఆ పిల్లిని ఇష్ట పడటం లేదని కథలు వ్యాప్తి చెందడం ప్రారంభవమడంతో ల్యారీ, తను ‘పర్–ఫెక్ట్లీ వెల్’ అని ప్రధాని కామెరున్ తప్పనిసరై ట్వీట్ చేయవలసి వచ్చింది. ఆ ట్వీట్ బ్రిటిష్ ప్రభుత్వానికి భరోసాను ఇచ్చింది. నిష్క్రమించే ప్రధాని వీడ్కోలు కార్యక్రమ గౌరవ ఆహ్వానితుల జాబితాలో ల్యారీ ఎందుకు కనిపించడు అని బ్రిటన్ ప్రజలు తరచూ ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఆహుతుల అందరి దృష్టీ తన వైపు మళ్లేందుకు ల్యారీ ఎప్పటికప్పుడు కళాత్మకమైన మార్గాలను కనుగొంటూ ఉండడం అందుకు కారణం కావచ్చు. 10 డౌనింగ్ స్ట్రీట్ ప్రవేశ ద్వారం వద్ద ట్రంప్‌తో కలిసి థెరెసా మే, ఆమె భర్త ఫొటోలు దిగుతున్నప్పుడు ల్యారీ వారి వెనుక కిటికీ అంచుపై నిలబడి ప్రతి ఫొటోలోనూ కనిపించింది. తర్వాత వర్షం నుంచి తలదాచుకోడానికి సాయుధుల కనురెప్పల కాపలాలో ఉన్న ట్రంప్ క్యాడిలాక్ కారు కింద దూరిన ల్యారీని ఎంత నచ్చచెప్పీ బయటకు రప్పించలేక పోయారు. బి.బి.సి.కి చెందిన జోన్ సోపెల్ ఆ ఘటనను... ‘‘బ్రేకింగ్ న్యూస్: ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనకారులు డొనాల్డ్ ట్రంప్ వాహన శ్రేణిని నిలువరించడంలో విఫలమయ్యారు. కానీ 10 డౌనింగ్ స్ట్రీట్ పిల్లి ఆ పని చేయగలిగింది’’... అని ట్వీట్ చేశారు. కొంతకాలంగా ల్యారీపై మునుపెన్నడూ లేని విధంగా తరచూ విమర్శలు వినవస్తున్నాయి. ల్యారీ స్వభావం, పనితీరు చుట్టూ కేంద్రీకృతం అయిన విమర్శలవి. వేటాడి చంపే క్రూర స్వభావం ల్యారీలో విస్పష్టంగా లోపించడాన్ని డౌనింగ్ స్ట్రీట్ అధికారులు గమనించారు. ‘‘ఎలుకల్ని వేటాడడం కన్నా ఎక్కువ సమయం ల్యారీ నిద్రలోనే గడుపుతున్నాడు’’ అని కొందరు ఫిర్యాదు చేశారు. అయితే నేను విన్నదేమంటే సునాక్ అతడిని విధుల నుంచి విరమింపజేసే ప్రమాదం లేదని. ఏ విధంగా చూసినా కూడా సునాక్ దంపతులకు వీడ్కోలు పలికి, కొత్తగా వచ్చేవాళ్ల మెప్పు పొందే వరకైనా ల్యారీ అక్కడ ఉంటాడు. ల్యారీ మాంసం కూరను ఇష్టపడతాడా లేక పప్పూ, అన్నం అంటాడా అనేది బహుశా అప్పుడు మనం తెలుసుకోవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సినీ ఫక్కీలో ఛేజింగ్... లారీ పట్టివేత
రాయదుర్గం: కేరళ నుంచి న్యూఢిల్లీకి లోడ్‌తో వెళుతున్న ఓ లారీ శుక్రవారం రాత్రి కర్ణాటక జీఎస్టీ అధికారుల కళ్లు గప్పి తప్పించుకుని ఆంధ్రలోకి ప్రవేశించింది. ఆద్యంతం సినీ ఫక్కీలో సాగిన ఛేజింగ్‌లో చివరకు ఆంధ్ర ప్రాంతంలో లారీ టైర్ బరస్ట్ కావడంతో కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. వివరాలు... కేరళ నుంచి వస్తున్న లారీని కర్ణాటకలోని హనగల్ వద్ద జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ముందుకు దూకించడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని తమ వాహనాల్లో వెంబడిస్తూ మొలకాల్మూరు పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 14 కిలోమీటర్ల మేర ఛేజింగ్ చేసినా లారీ వేగాన్ని పోలీసులు, జీఎస్టీ అధికారులు అందుకోలేకపోయారు. చివరకు రాయదుర్గం పట్టణ సమీపంలో నిర్మాణంలో ఉన్న బైపాస్ వద్దకు చేరుకోగానే టైర్లు బరెస్ట్ అయ్యాయి. వెనుకనే వెంబడిస్తూ వచ్చిన కర్ణాటక పోలీసులు, జీఎస్టీ అధికారుల వాహనాలు లారీని చుట్టుముట్టాయి. లారీ క్యాబిన్లో పరిమితికి మించి వ్యక్తులు ఉండడంతో అనుమానం వచ్చి వెంటనే రాయదుర్గం అర్భన్ సీఐ లక్ష్మన్నకు సమాచారం ఇస్తూ తమకు భద్రత కల్పించాలని కోరారు. ఘటనాస్థలానికి ఆగమేఘాలపై సిబ్బందితో చేరుకున్న సీఐ లక్ష్మన్న జరిగిన అంశాన్ని అడిగి తెలుసుకున్నారు. అయితే ఏపీ పరిధిలోకి రావడంతో లారీని స్వాధీనం చేసుకుని తామే కేసు నమోదు చేస్తామని సీఐ తెలపడంతో కర్ణాటక అధికారులు వీల్లేదన్నారు. చివరకు విషయాన్ని తెలుసుకున్న జిల్లా డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి సుదర్శన్, డీసీటీఓ రమణ రాయదుర్గం చేరుకుని బళ్లారి జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ ఇనామ్‌ధీర్, అసిస్టెంట్ కమిషనర్ అభిషేక్‌తో చర్చించారు. లారీలో ఉన్న సరుకుపై ఆరా తీశారు. వక్కలోడుతో వెళుతున్నట్లుగా డ్రైవర్, అతడి సహాయకులు తెలిపారు. ముందుగా గుర్తించిన కర్ణాటక జీఎస్టీ అధికారులకే కేసు నమోదు బాధ్యతలు అప్పగించేలా అంగీకారానికి వచ్చారు. అయితే రికార్డుల్లో మాత్రం ఇరు రాష్ట్రాల అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్టు పొందుపరిచారు. ఇదిలా ఉండగా లారీలో వక్క కాకుండా గంధం చెక్కలు ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లోడ్ తీసి చూపకుండా లారీని కర్ణాటకకు జీఎస్టీ అధికారులు తరలించారు. -
కారు, లారీ ఢీ..9 మంది దుర్మరణం
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి సమీపంలో ఆదివారం రాత్రి 7.10 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 9 మంది ఇన్నోవా వాహనంలోనే మరణించగా.. దాన్ని నడుపుతున్న పెళ్లికుమార్తె తండ్రి, బీజేపీ నేత కోకా వెంకటప్పనాయుడు (58) ఆస్పత్రిలో ప్రాణాలొదిలారు. అనంతపురం–బళ్లారి జాతీయ రహదారిపై ఇన్నోవా వాహనం, ఇనుప ఖనిజం లోడుతో వెళుతున్న పెద్దలారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. పోలీసులు, బంధువుల కథనం మేరకు.. ఉరవకొండ మండలం నింబగల్లుకు చెందిన వెంకటప్పనాయుడు కుమార్తె వివాహవేడుక ఆదివారం కర్ణాటక బళ్లారిలో జరిగింది. పెళ్లి ముగిశాక వెంకటప్పనాయుడు, ఆయన బంధువులు 8 మంది ఇన్నోవా వాహనంలో నింబగల్లుకు బయలుదేరారు. వెంకటప్పనాయుడు డ్రైవింగ్ చేయసాగారు. బూదగవి వద్ద వీరి వాహనం, అనంతపురం నుంచి బళ్లారి వైపు ఇనుప ఖనిజం లోడుతో వెళుతున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు రోడ్డుపక్కనున్న పొలంలోకి దూసుకెళ్లాయి. ఇన్నోవా ముందుభాగం నుజ్జునుజ్జయింది. మృతదేహాలన్నీ ఛిద్రమై.. ఇన్నోవాలోనే ఇరుక్కుపోవడంతో జేసీబీ సాయంతో వెలికి తీయాల్సి వచ్చింది. చదవండి: చిన్నారిని లాక్కొని గొంతు నులుముతూ.. గొలుసివ్వకపోతే.. చంపేస్తాం! అంతా బంధువులే.. ప్రమాదంలో కోకా వెంకటప్పనాయుడుతో పాటు బంధువులు బొమ్మనహాళ్ మండల కేంద్రానికి చెందిన సరస్వతి(60), ఆమె కుమారుడు అశోక్(35), కుమార్తె స్వాతి(38), స్వాతి కవల పిల్లలు జాహ్నవి (12), జశ్వంత్ (12), కణేకల్లు మండలం హనుమాపురానికి చెందిన రాధమ్మ(48), రాయలప్పదొడ్డికి చెందిన సుభద్రమ్మ(60), పిల్లలపల్లికి చెందిన శివమ్మ (35) మృతిచెందారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఇన్నోవా వంద కిలోమీటర్లకుపైగా వేగంతో వెళుతున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదస్థలాన్ని ఎస్పీ ఫక్కీరప్ప, గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప తదితరులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రి మార్చురీలోని మృతదేహాలను మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పరిశీలించి, మృతుల కుటుంబాలను ఓదార్చారు. కాగా మృతుల కుటుంబాలకు ఎంపీ తలారి రంగయ్య సానుభూతి తెలిపారు. -
షావోమికి షాక్: సెల్ ఫోన్లతో వెళ్తున్న లారీనీ దోచేశారు
కోలారు: చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి-75పై దోపిడీదారులు చెలరేగిపోయారు. కంటైనర్ లారీని అడ్డుకుని రూ.6.4 కోట్ల విలువైన సెల్ఫోన్లను దోపిడీ చేశారు. ఈ ఉదంతం కర్ణాటకలోని కోలారు జిల్లా, ముళబాగిలు తాలూకాలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. చైనా మొబైల్ కంపెనీ షావోమికి చెందిన ఎంఐ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్లతో బయలుదేరిన కంటైనర్‌ను వెంటాడి మరీ దోచుకున్న వైనం కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ముళబాగిలు పోలీసుల కథనం మేరకు...చెన్నై నుంచి బెంగళూరుకు ఎంఐ కంపెనీకి చెందిన సెల్ఫోన్ల లోడ్‌తో గురువారం సాయంత్రం పీజీ ట్రాన్స్పోర్ట్కు చెందిన కంటైనర్ లారీ (నం.కేఏ01ఏపీ6824) బయల్దేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ముళబాగిలు తాలూకా దేవరాయసముద్ర గ్రామ సమీపంలోకి చేరుకోగానే కారులో వెంటాడిన 8 మంది దుండగులు లారీని అడ్డగించారు. డ్రైవర్‌ను తాళ్లతో బంధించి నిర్జన ప్రదేశంలో వదిలేసి సెల్ఫోన్ల లారీతో ఉడాయించారు. నేర్లహళ్లి గ్రామం వద్ద సెల్ఫోన్లను మరో లారీలోకి తరలించి తీసుకెళ్లారు. తెల్లవారుజామున డ్రైవర్ కట్లు విప్పుకుని ముళబాగిలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెంట్రల్ జోన్ ఐజీ చంద్రశేఖర్, కోలారు ఎస్పీ కిశోర్‌బాబు, డీఎస్పీ గోపాల్ నాయక్, ముళబాగిలు ఎస్ఐ ప్రదీప్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ గోపాల్‌నాయక్ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. సెల్‌ఫోన్ బాక్స్‌లు ఎత్తుకెళ్లిన తర్వాత ఖాళీగా ఉన్న కంటైనర్ -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, ప్రకాశం: అద్దంకి పట్టణంలోని గరటయ్య కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కూలీలు ఆటోలో గరటయ్య కాలనీ నుండి పంగులూరు మండలం చందలూరు మిర్చి కోతకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.మృతులను కాకానిపాలెనికి చెందిన అనసూయ (55), మౌలా నగర్‌కు చెందిన షేక్ కరీమున్ (44) గా గుర్తించారు. చదవండి: తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి మహమ్మారిని జయించిన ఆనందం.. అంతలోనే విషాదం -
దారుణం: లారీతో తొక్కి చంపేశాడు..
బొబ్బిలి/బొబ్బిలి రూరల్(కృష్ణా జిల్లా): బొబ్బిలి మండలం మెట్టవలస సమీపంలో గ్రోత్ సెంటర్ వద్ద ఈ ఏడాది సెప్టెంబర్ 6న గుర్తు తెలియని మృతదేహం నుజ్జయి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెప్టెంబర్ 5న అర్ధరాత్రి దాటాక వాహనాలు ఢీకొని మృతి చెంది ఉంటాడని భావించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు. ఇంతలో కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కంచికచర్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు కనిపించడం లేదని, సెపె్టంబర్ 5న అతని సెల్ సిగ్నల్ బొబ్బిలిలో చూపించిందని అక్కడి పోలీసులు బొబ్బిలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు గుర్తు తెలియని మృతదేహంపై విచారణ మొదలుపెట్టారు. దీంతో తీగ లాగితే డొంక కదిలింది. చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులు హత్యగా గుర్తించి నిందితుడు తోట నాగేంద్రబాబును పట్టుకుని శనివారం డీఎస్పీ జె.పాపారావు, బొబ్బిలి రూరల్ సీఐ పి.శోభన్‌బాబు విలేకరులకు వివరాలు అందజేశారు. (చదవండి: వన్ సైడ్ లవ్ ఉన్మాదం.. అందర్నీ తగల బెట్టేస్తా..) ఆగస్టు 26న ఏపీ 39యూ6499 నంబరు గల లారీలో డ్రైవర్ తోట నాగేంద్రబాబు అలియాస్ చంటి, క్లీనర్ వెంకటేశ్వరరావు కంచికచర్లలో బయలుదేరి స్థానికంగా కొన్ని లోడులు వేసుకుని తిరిగి కంచికచర్ల వచ్చారు. నాగేంద్రబాబు స్నేహితుడు ఆ్రస్టేలియా నుంచి వచ్చి ఉంటున్న మాలుపూరి రాంగోపాల్‌ను లారీలో తీసుకుని గుజరాత్ టైల్స్ లోడుకు వెళ్లారు. రాంగోపాల్ తన ఇంట్లో ఆగస్టు 28న తాను హైదరాబాద్ వెళ్తున్నట్టు చెప్పి వెళ్లాడు. ఈ విషయాన్ని రాంగోపాల్ తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి సీతమ్మ ధ్రువీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మధ్యలో లారీ క్లీనర్ వెంకటేశ్వరరావు డ్యూటీ మారి పి.సాయితేజ క్లీనర్‌గా వెళ్లాడు. టైల్స్ లోడుతో బొబ్బిలి వచ్చి అన్లోడ్ చేసి సెప్టెంబర్ 5న బొబ్బిలి గ్రోత్ సెంటర్లో సిమెంట్ షాపు వద్ద రాంగోపాల్‌కు లారీ డ్రైవర్ నాగేంద్రబాబు మద్యం పట్టించాడు. నాగేంద్రబాబుకు మద్యం అలవాటున్నా సేవించకుండా జాగ్రత్త పడ్డాడు. క్లీనర్ సాయితేజను క్యాబిన్లో పడుకోమని చెప్పి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాంగోపాల్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అతనితో వాదులాటకు దిగి పూటుగా తాగించాడు. మద్యం మత్తులో స్పృహ కొల్పోయిన రాంగోపాల్‌ను జాతీయ రహదారిపై పడుకోబెట్టి రాత్రివేళ తన లారీతో తొక్కించి నుజ్జునుజ్జు చేశాడు. విశాఖ వైపు వెళ్లాల్సిన లారీని తిరిగి బొబ్బిలి వైపు తిప్పి ఎవరికీ అనుమానం రాకుండా కంచికచర్ల వెళ్లిపోయి లారీతో గుజరాత్ వెళ్లిపోయాడు. క్యాబిన్లో పడుకున్న క్లీనర్ సాయితేజ రాంగోపాల్ ఎక్కడని ప్రశి్నస్తే రూ.3వేలు తీసుకుని బంధువుల వద్దకు వెళ్లాడని ఒకసారి, బొబ్బిలిలో టిప్పర్ ఢీకొందని మరోసారి చెప్పి ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే చంపేస్తానని నాగేంద్రబాబు బెదిరించాడు. ఇంతలో తమ కుమారుడు కనిపించకపోవడంతో రాంగోపాల్ తల్లిదండ్రులు కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ చేసి సెల్ సిగ్నల్ ఆధారంగా బొబ్బిలి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది. ఈ మేరకు నిందితుడు తోట నాగేంద్రబాబును పలు సెక్షన్ల కింద శనివారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి పలు విషయాలు రాబట్టాల్సి ఉందని, క్లీనర్లను విచారించాల్సి ఉందని డీఎస్పీ పాపారావు తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో ఎస్ఐలు వెలమల ప్రసాదరావు, చదలవాడ సత్యనారాయణ పూర్తి స్థాయిలో సహకరించారని వారిని అభినందిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఫేక్ ఆడియోతో పక్కతోవ పట్టించే యత్నం... కాగా నిందితుడు కంచికచర్లలో తన సోదరికి ఫోన్ చేసిన రాంగోపాల్‌ను టిప్పర్ ఢీకొందని, తనకు భయం వేస్తోందని ఫొన్లో చెప్పి రికార్డు చేసి, స్నేహితుల ద్వారా రాంగోపాల్ బంధువులకు పంపాడని, తమకు అనుమానం వచ్చిందని కంచికచర్ల నుంచి వచ్చిన మృతుడి కుటుంబ సభ్యులు రఘునాథ్, రామగోపాల్ విలేకరులకు తెలిపారు. నిందితుడిని, ఇంకా సంబంధం ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. -
వదినపై మరిది కర్కశం
మేడికొండూరు(గుంటూరు): చెల్లెలి కాపురాన్ని సరిదిద్దేందుకు వచ్చిన మహిళపై మరిది కర్కశం చూపిన ఘటన మేడికొండూరు మండల సమీపంలో డోకిపర్రు కాలువ వద్ద బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుంటూరు కొరిటెపాడుకు చెందిన వీరేంద్ర డోకిపర్రు సమీపంలోని క్వారీలో గ్రావెల్ మట్టి తోలుతుంటాడు. వీరేంద్ర కొంత కాలంగా తన భార్య మేరీతో గొడవ పడుతున్నాడు. వీరేంద్రకు సర్ది చెప్పేందుకు వదిన మీరాబి, మేరీ ఆటోలో వీరేంద్ర ఆచూకీ కోసం క్వారీ వద్దకు బయలు దేరారు. దారిలో వీరేంద్ర టిప్పర్‌లో గ్రావెల్ మట్టి లోడు చేసుకుని వెళుతున్నాడు. (చదవండి: బెజవాడలో హవాలా దందా..) ఈ సందర్భంగా మీరాబి వీరేంద్ర లారీని ఆపే ప్రయత్నం చేసింది. వీరేంద్ర కర్కశంగా ఆమెను లారీతో తొక్కించి కొద్ది దూరంలో లారీ ఆపి పరారయ్యాడు. టైరు కింద పడి రెండు కాళ్లు కోల్పోయిన మీరాబి అచేతనంగా పడి ఉండటంతో స్థానికులు మేడికొండూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని మేడికొండూరు ఎస్ఐ నూతక్కి నరహరి పరిశీలించి తీవ్ర గాయాలతో పడి ఉన్న మహిళను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మేడికొండూరు సీఐ ఆనందరావు కేసు నమోదు చేసి పరారైన నిందితుడు వీరేంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
బైక్ లారీ ఢీ ముగ్గురు యువకులు మృతి
-
ముప్పై ఏళ్ల విషాదం
1983 జూలై 23న ఓ లారీ.. ఉప్పొంగిన వరద కారణంగా కరీంనగర్ జిల్లా ఇరుకుల్ల వాగులో గల్లంతయ్యింది. లారీలో ఉన్న 12 మందిలో నలుగురు కష్టంగా ఒడ్డుకు చేరారు. మరో నలుగురి మృతదేహాలు అప్పట్లోనే లభించాయి. మిగిలిన నలుగురు ఏమయ్యారో, ఎక్కడున్నారో ఆచూకీ దొరకలేదు. సుమారు ముప్పై ఏళ్ల కిందటి మాట ఇది! వారం రోజుల కిందట.. ఇసుక తవ్వకాల్లో భాగంగా ఇరుకుల్ల వాగులో ఓ లారీ క్యాబిన్, ఆ క్యాబిన్లో అస్థిపంజరాలు, కపాలాలు బయటపడ్డాయి! ఏళ్ల తరబడి తమ వాళ్ల కోసం ఎదురు చూస్తున్న మృతుల కుటుంబాలు వెంటనే ఇరుకుల్ల వాగుకు చేరుకున్నాయి. అక్కడి అస్థి పంజరాలు, కపాలాలు, లారీ క్యాబిన్లో బయటపడిన ప్లాస్టిక్ బ్యాగులు, పాలిస్టర్ దుస్తుల ఆనవాళ్లను చూసి తమ వాళ్లుగా గుర్తించాయి. ఇరవై తొమ్మిదేళ్ల కిందట ఆచూకీ లేకుండా పోయిన తమ వాళ్ల కోసం తిరిగి తిరిగి అలసిపోయిన ఆ కుటుంబాలు.. తమ వాళ్లు లేరని తెలిసే లోగా ఆర్థికంగా చితికిపోయాయి. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. ఆ ఒక్క ప్రమాదం ఆ కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఇదో అత్యంత విషాద ఘటన. ఇరుకుల్ల వాగులో చేదు జ్ఞాపకం ఆ ఘటన జరిగిన రోజు.. భారీ వర్షం వరదలతో ఇరుకుల్ల వాగు పొంగిపొర్లింది. ఇరుకుల్ల బ్రిడ్జిపై వరద పోవడంతో పెద్దపల్లి నుంచి కేశవపట్నానికి పశువుల లోడుతో వెళ్తున్న లారీ కొట్టుకుపోయింది. ఆ లారీలో మొత్తం పది మంది ఉండగా డ్రై వర్ అబ్దుల్ ఘనితో పాటు మరొకరు మృతి చెందినట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఆ ఘటన నుంచి మల్లేశం, ఎల్లయ్య, సుదర్శనం, మొగిలి.. ప్రాణాలతో బయటపడగా మరో నలుగురి ఆచూకీ దొరకలేదు. గల్లంతయిన వారిలో శంకరపట్నంకు చెందిన లారీ యజమాని ఎండి దౌలత్ ఖాన్, అతని సోదరుడు, పశువుల వ్యాపారి ముగ్ధుంఖాన్, పశువుల కాపరి కటికె శంకర్, మరొకరు కల్లెపెల్లి వెంకటస్వామిలు ఉన్నారు. ఆ ప్రమాద ఘటన క్రైమ్ నంబర్ 160/89 గా నమోదు అయ్యింది. ప్రమాదం జరిగిన మరుసటి రోజు క్రేన్ సహాయంతో లారీని బయటికి తీసే ప్రయత్నం చేసినా, కొంతభాగం మాత్రమే బయటకు వచ్చింది. గల్లంతయిన వారి ఆచూకీ మాత్రం దొరకలేదు. ఆ నలుగురి కోసం, లారీ కోసం కుటుంబ సభ్యులు రోజుల తరబడి వెతికినా ఫలితం కనిపించలేదు. దాంతో ఆ అవశేషాలు కాలగర్భంలో కలిసిపోయాయి. వస్తారని ఎదురుచూపులు సంతకు వెళ్లొస్తామని ఇంటి బయటకు వెళ్లారు. పని ముగించుకుని ఇంటికి చేరాల్సిన వారు తిరిగి ఇంటికి చేరుకోలేదు. తమ వాళ్లు ప్రయాణించిన లారీ ముంచెత్తిన వరదల్లో కొట్టుకు పోయిందన్న వార్త కుటుంబసభ్యుల గుండెలు బరువెక్కేలా చేసినా, బతికే ఉంటారన్న ఆశను కూడ ఎక్కడో మినుకుమినుకుమంటూ ఉంది. ఆ ఆశతోనే వారు ఏళ్ల తరబడి నిరీక్షించారు. ఏడాది... రెండేళ్లు.. ఐదేళ్లు.. పదేళ్లు.. పాతికేళ్లు.. ఇలా ఎన్నేళ్లు చూసినా కాలం మాత్రం జవాబు చెప్పలేదు. చివరకు మూడు దశాబ్దాలు ముగిసిపోయే సమయంలో ఆ నాలుగు కుటుంబాలకు అసలు నిజం తెలిసింది తమ వాళ్లు లేరని! కాల క్రమంలో ఇంటి పెద్దలు అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. జీవితాలు చెల్లాచెదురయ్యాయి. ఇప్పుడీ నిజం తెలిశాక బరువెక్కిన గుండెలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రోడ్డున పడిన ఖాన్ల కుటుంబాలు కరీంనగర్ జిల్లా శంకరపట్నంకు చెందిన జహీరాబేగం కుమారులు ముగ్ధుంఖాన్, దౌలత్ ఖాన్లు. దౌలత్ ఖాన్ గల్లంతయిన లారీ ఓనర్. అతని అన్న ముగ్ధుంఖాన్ పశువుల వ్యాపారి. ఇద్దరూ పెద్దపల్లి పశువుల సంతలో పశువులు కొనుగోలు చేసి లారీలో సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరగా మార్గమధ్యలో జరిగిన ఈ ప్రమాదంలోనే గల్లంతయ్యారు. ముగ్ధుంఖాన్ కు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఘటన తర్వాత కుటుంబ పెద్ద ఆచూకీ లేక అనేక అవస్థలు పడుతున్న వీరికి.. కొడుకు మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. బతికున్నప్పుడు పది మందికి ఉపాధి, పట్టెడన్నం పెట్టిన దౌలత్‌ఖాన్ కుటుంబం ఇప్పడు దీనావస్థలో.. నిర్మాణంలో ఉన్న ఇల్లు మధ్యలోనే ఆగిపోయి శిధిలావస్థకు చేరుకుంది. ఉండడానికి ఇల్లు సైతం లేక పక్కింట్లో అద్దెకు ఉంటూ కూలీపనితో పూట గడుపుకుంటున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఇద్దరు కూతుళ్లకు తల్లి కూలి పని చేసి పెళ్లిళ్లు చేస్తే.. వారిలో ఓ బిడ్డ భర్త సైతం మృతి చెందారు. విధి తమ పాలిట శాపంగా మారందని ఆ కుటుంబం ఇప్పుడు పుట్టెడు దుఃఖంతో రోజులు గడుపుతోంది. శంకర్ గల్లంతు.. కుటుంబం ఛిన్నాభిన్నం వరదల్లో కొట్టుకుపోయిన లారీలో గల్లంతైన కరీంనగర్ కు చెందిన మరోవ్యక్తి లింగపల్లి శంకర్. శంకర్ కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు కాగా, శంకర్ ఆచూకీలేక అతని భార్య మనోవేదనతో ప్రాణాలు కోల్పోయింది. తండ్రి అడ్రస్ లేక, తల్లికానరాని లోకాలకు వెళ్లడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. వారిని బంధువులు చేరదీయడంతో తలోచోట పెరిగి పెద్దవారయ్యారు. పెళ్లిళ్లూ అయ్యాయి. తవ్వకాల్లో లారీ ఆనవాళ్లు బయటపడ్డాయని తెలియడంతో కూతుళ్లు, కొడుకు ఇరుకుల్లకు చేరుకున్నారు. అస్థికలు కనిపించాయి. వెంకటస్వామి ఇంట.. విషాదమే అంతా.. కల్లెపల్లి వెంకటస్వామి ఇంట అంతా విషాదమే. వెంకటస్వామికి భార్య ఐదుగురు కూతుళ్లు, ఐదుగురు కొడుకులు. ఇద్దరు కొడుకులు తండ్రి పై బెంగతో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ పెద్ద గల్లంతై ఆచూకీ లేకపోవడంతో ఉన్న ఇల్లు అమ్మి, కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించింది వెంకటస్వామి భార్య రూతమ్మ. వెంకటస్వామి పశువుల వ్యాపారి కావడంతో అప్పట్లో ఆ కుటుంబం కాస్త స్థోమత ఉన్నదే అయినప్పటికి ఇరుకుల్ల ఘటనతో చిన్నాభిన్నమై పుట్టెడు కష్టాలను అనుభవిస్తోంది. కదిలిస్తే కన్నీటి పర్యంతమవుతూ ‘‘ఆ రోజు సంతకు పోయిండు.. అంతే ఇంక తిరిగిరాలేదు’’ అని ఆవేదన చెందుతోంది. మేమూ బతుకుతమని అనుకోలేదు ఇరుకుల్లలో లారీ కొట్టుకుపోయిన దాంట్లో మేమూ కూడా బతుకుతమనుకోలేదు. పెద్దపల్లి అంగడిలో లారీ లోడ్ చేసుకుని వచ్చేసరికి దాదాపు సాయంత్రం 6 గంటలైంది. వర్షం బాగా వస్తోంది. వంతెనపై నుంచి వరదపోతుంది. మా ముందు కారు, చేతక్ ఉన్నాయి. లారీ క్యాబిన్లో మొత్తం పది మందిమి ఉన్నాం. మధ్యలోకి పోయేసరికి వరద ఎక్కువై లారీ కొట్టుకు పోయింది. నాతోపాటు ఎల్లయ్య, సుదర్శనం, మొగిలి వాగులో ఈదుకుంటూ కష్టంగా బయటపడ్డం. – మల్లేశం, ప్రత్యక్షసాక్షి, కేశవపట్నం, కరీంనగర్ జిల్లా ఇరవైతొమ్మిదేండ్ల నుంచి చూస్తనే ఉన్నం మా ఆయన ఎప్పుడొస్తడా అని ఇరవై తొమ్మిదేండ్ల నుంచి చూస్తున్నం. బాబాలు చెప్తరంటే ఐదారు వేల రూపాయలు ఖర్చు పెట్టి అట్ల చెప్పించుకున్నం. అంతా వెతికినం. కానీ మా ఆయన జాడ తెలువలే... కోర్టులెంబడి పొమ్మంటే అట్ల పోయినం. అధికారుల దగ్గరికి తిరిగినం. ఏం పత్తా దొరకలే. చివరకు మొన్న వాగులో తవ్వకాల్లో ఎల్లినయంటే పోయినం.. పుర్రెలు దొరికినయ్. – గౌసియా బేగం, ముగ్ధుం ఖాన్ భార్య అమ్మా అంగడికి పోయత్తమని పోయిండ్రు.. ఇగ రాలేదు అమ్మా అంగడిపోయత్తమని పోయిండ్రు... పొద్దుగూకే దాక చూసినా రాకపోతే ఏడ్చుడూ మొదలు పెట్టినా నా కొడుకులేరని. అప్పటికే ఓ కొడుక్కు ముగ్గురు పిల్లలు, ఇంకో కొడుక్కు ఒక్కలు. మరుసటి రోజు ఒకరొచ్చి వాగుల కొట్టుకుపోయిండ్రని చెప్పిన్రు. ఆ రోజు నుంచి ఇప్పటికీ కూడా నా కొడుకులు వత్తరని తెల్లందాకా, పొద్దుందాక ఎదురుచూస్తున్న. ఇప్పుడు బొక్కలు తేలినయ్ అని చెప్పిన్రు. మా బతుకులు ఆగమైపోయినయ్. – జహీరాబేగం, దౌలత్, ముగ్ధుంఖాన్ల తల్లి ఆధారం పోయింది.. ఆగమై పోయినం మా ఆయన అంగడికని పోయిండు.. అటే పోయిండు. వాగులో లారీ బోర్లపడి చనిపోయిండని చెప్పిండ్రు గానీ శవమైతే అప్పుడు దొరకలే. ఐదుగురు ఆడపిల్లలు, ఐదుగురు మగ పిల్లలు సంతానం. వారంతా చిన్నపిల్లలు కావడం వల్ల పెద్దదిక్కు లేక ఎటూ తిరగలే.. ఇద్దరు పిల్లలు తండ్రి మనాది పెట్టుకుని చచ్చిపోయిండ్రు. మిగిలిన పొల్లగండ్లను కొంగుపట్టి అడుక్కుంటూ, కూలీ కైకిలి చేసి సాదుకున్న. ఇప్పుడు కూడా కూలీ కైకిలి చేసుకునే బతుకుతున్నం. – కల్లెపెల్లి రూతమ్మ, వెంకటస్వామి భార్య మా నాన్న చనిపోయినప్పుడు చిన్న పిల్లలం మా నాన్న కటికె శంకర్ ఇరుకుల్ల వాగులో లారీ బోల్తాపడి చనిపోయినపుడు నేను చిన్నదాన్ని. నాతోపాటు చెల్లి, తమ్ముడున్నారు. అపుడు శవం కూడా దొరుకలేదు. నాన్న పోయిన రంధితో ఏడాదికే అమ్మ కూడా చనిపోయింది. దీంతో మా బంధువులు చేరదీయడంతో ఈ స్థాయిలో ఉన్నాము. వాగులో లారీ బయటకు వచ్చిందని తెలిస్తే వచ్చాము. కొన్ని ఎముకలు దొరికితే వాటిలో మా నాన్నవి ఉంటాయని అనుకున్నాము. – సరిత, కటికె శంకర్ పెద్దకూతురు – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
ముగ్గురిని బలిగొన్న నిర్లక్ష్యం
అంతసేపు ఆనందంగా గడిపారు. సరిగ్గా 15 నిమిషాల్లో ఇల్లు చేరుతామనుకున్నారు.. అంతలోనే రోడ్డుప్రమాదం వారింట విషాదాన్ని నింపింది. గుడిహత్నూర్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గుడిహత్నూర్(బోథ్) : మండల కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. పోలీసులు, మృతుడి మిత్రులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌కు చెందిన స య్యద్ అహ్మద్ (43) గత కొన్ని సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. తరుచూ ముప్కాల్‌లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో మంగళవారం భార్య ఫర్హానాబేగం, కొడుకు సయ్యద్ ఉమర్ (9) కూతురు మహదియాతోపాటు డ్రైవర్ బిలాల్ (22) ఎర్టీగా వాహనంలో ముప్కాల్‌లో ఉన్న కుటుంబ సభ్యులను కలిసి తిరుగు ప్రయాణంలో నిర్మల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఆదిలాబాద్‌కు బయలు దేరారు. మండల కేంద్రం దాటిన తర్వాత తెలంగాణ దాబా వద్ద హైవే స్పీడ్ ట్రాక్‌పై ఓ లారీ టైరు పగలడంతో ఆగి ఉంది. ఇది గమనించని కారు డ్రైవర్ లారీని రాత్రి 11 గంటల సమయంలో ఢీకొట్టాడు. ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ముందు సీట్లో కూర్చున్న తండ్రీకొడుకులు సయ్యద్ అహ్మద్, సయ్యద్ ఉమర్, డ్రైవర్ బిలాల్ అక్కడికక్కడే మృతి చెందారు. భార్య ఫర్హానాబేగం, కూతురు మహదియాకు తీవ్రగాయాలయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించి క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరాల్సిన ఓ కుటుంబం ప్రమాదానికి గురికావడం వీరిలో తండ్రీకొడుకులు చనిపోవడం..మృతుడి భార్య, కూతురు తీవ్రంగా గాయపడడంతో సన్నిహితులు, కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.కిరణ్‌కుమార్ తెలిపారు. నిర్లక్ష్యమే నిండు ప్రాణాలు తీసింది హైవేపై నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన హైవే పెట్రోలింగ్‌తోపాటు సదరు హైవే నిర్వహణ సంస్థ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమైంది. లారీ టైరు పేలి మరమ్మతు కోసం గంటల తరబడి హైవే స్పీడ్ ట్రాక్‌పై నిలిచి ఉంది. వెంటనే ప్రమాద సూచికలు ఏర్పాటు చేయడంలో ఆయా అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో పాటులారీ డ్రైవర్ కనీసం ఇండికేటర్లు, ఇతరాత్ర ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో లారీ చీకట్లో కనిపించలేదు. కారు డ్రైవరు సైతం అతివేగంగా ఉండడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కంటే ముందే పలువురు లారీ చీకట్లో కనిపించక వాహనాన్ని అదుపు చేసుకొని ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. ఇరువురి నిర్లక్ష్యం మూడు ప్రాణాలను తీసింది. -
ఖమ్మం టు జమ్మికుంట
జమ్మికుంట: ఒక రైతుకు లారీ పత్తి పండిందంటే ఎవరైనా నమ్ముతారా.. అసలుకు నమ్మరు.. అకాల వర్షాలతో పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ట్రాలీల్లో తప్ప లారీ నిండా పత్తి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలోనూ జమ్మికుంట పత్తి మార్కెట్‌కు శుక్రవారం ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తులు లారీ పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. మార్కెట్‌కు వచ్చిన రైతులంతా పత్తి లారీని చూసి వామ్మో ఇంత పంట పండిందా అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు. గ్రామాల్లో రైతుల వద్ద నేరుగా తక్కువ ధరలు చెల్లించి అదే పత్తిని ఎక్కువ ధరలకు మార్కెట్లోకి అమ్మకానికి తీసుకొచ్చారనేది తెలుసుకోలేకపోయారు. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు లారీల్లో పత్తి రాక మొదలైందంటే చాలు దళారులంతా గ్రామాల్లో మాయమాటలు చెప్పుతూ తక్కువ ధరలకు కొనుగోలు దందా చేపట్టినట్లు తెలిసిపోతోంది. జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌కు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ జిల్లా, వరంగల్ రూరల్. ఖమ్మం, మహబుబ్‌నగర్ జిల్లాల నుంచి ప్రతీ సీజన్లో దళారులంతా గ్రామాల్లో ఇళ్ల వద్ద కాంటాలు పెట్టి రైతుల వద్ద క్వింటాల్ పత్తికి రూ.3000 నుంచి 3300 వరకు ధరలు చెల్లించి దందా సాగిస్తుంటారు. తూకాల్లో భారీగా మోసాలకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం అకాల వర్షాలతో అల్లాడుతున్న పత్తి రైతులు చేతికి వచ్చిన పత్తిని మార్కెట్లో తక్కువ ధరలకు అమ్మకాలు జరుపుకుంటున్నారనే ప్రచారం రైతుల్లో మొదలు కావడంతో దళారులు రంగంలోకి దిగి రైతులను మరింత ముంచేందుకు కొనుగోళ్లు షూరు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన దళారులు సైతం గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఇళ్ల ముందు వ్యాపారం సాగిస్తూ లారీల కొద్ది పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ట్రేడర్స్ లైసెన్స్ ఉంటే తప్ప ఎక్కడా రైతుల వద్ద పత్తి కొనుగోలు చేపట్టవద్దనే నిబంధనలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. రైతు రూపంలో మార్కెట్లోకి అడుగు పెడుతుండడం విశేషం. -
పండుగ వేళ.. మృత్యు హేల
► లారీని ఢీకొట్టిన ఆటో.. ఆరుగురు దుర్మరణం ► మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ సమీపంలో ఘటన మక్తల్: ఎదురుగా వస్తున్న ఓ లారీని ఆటో ఢీకొట్టడంతో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. మక్తల్ మండలం మాదన్ పల్లికి చెందిన చిన్నకురుమయ్య ఆటో నడుపు తూ జీవనం సాగిస్తున్నాడు.ఆదివారం సంత కావడంతో ఆటోలో 18 మంది ప్రయాణి కులను ఎక్కించుకొని మక్తల్ నుంచి తిరిగి వస్తుండగా.. కాచ్వార్ సమీపంలో ఓ గొర్రెను తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొ ట్టాడు. దీంతో ఆటో డ్రైవర్ చిన్న కురుమయ్య (30)తోపాటు మాదన్‌పల్లికి చెందిన రాములు (65), హన్మంతు(50), జక్లేర్‌కు చెందిన వెంకటయ్య(50) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జయమ్మ, చంద్రమ్మ మహబూ బ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గాయపడిన దత్తుశ్రీలు మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందు తోంది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వా సుపత్రికి తరలించారు. ఆటోలో డ్రైవర్ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిం చుకోవడంతోపాటు నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. -
టోల్‌ప్లాజాపైకి దూసుకెళ్లిన లారీ
కామారెడ్డి: వేగంగా వెళ్తున్న లారీ ముందు టైరు పేలడంతో అదుపుతప్పి టోల్‌ప్లాజా లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన భిక్నూర్ టోల్ ప్లాజా వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. లారీ టైర్ పేలడంతో అదుపుతప్పిన లారీ టోల్‌ప్లాజాలోని స్టాల్స్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టోల్ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
లారీ,బైక్ ఢీ : యువకుడికి తీవ్రగాయాలు
యాచారం: లారీ, బైక్ ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం చింతుల్ల గ్రామానికి చెందిన ఎదటి నవీన్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఉపవాస దీక్ష విరమించేందుకు కావాల్సిన పండ్లకొనుగోలుకు తన బైక్‌పై యాచారం వెళు్తన్నారు. మార్గ మధ్యలో యాచారం– చౌదర్పల్లి గ్రా మాల మధ్య మలుపు వద్ద యాచారం నుంచి చౌదర్‌పల్లికి వస్తున్న లారీ నవీన్ కుమార్ బైకును బలంగా ఢీకొట్టడంలో నవీన్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. నవీన్ కుమార్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. సీఐ మదన్ మోహన్ రెడ్డిని సంప్రదించగా ప్రమాదం వాస్తవమేకానీ ఫిర్యాదు అందలేదన్నారు. -
చక్కెర విక్రయాల్లో చేదు లేదట..!
• 400 బస్తాల లోడ్‌తో ‘పేట’కు చేరుకున్న చక్కెర లారీ • నామమాత్రంగా పరిశీలించిన వదిలేసిన అధికారులు నారాయణపేట : స్థానిక పాతగంజ్‌కు గురువారం 400 బస్తాల చక్కెర లోడ్‌తో లారీ చేరుకుంది. ఇందులో 200 క్వింటాళ్ల విలువ చేసే 400 చక్కెర బస్తాలున్నాయి. సంక్రాంతి పండుగ రావడంతో భారీస్థాయిలో కొనుగోళ్లు జరుగుతాయనే వ్యాపార ఏజెన్సీ నిర్వాహకులు పుండలీక చక్కెరను కర్ణాటకలోని బిజాపూర్ నుంచి తెప్పించుకున్నారు. అక్రమంగా పెద్దఎత్తున చక్కెర క్రయవిక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు కాళప్ప, జనార్దన్ అక్కడికి చేరుకుని.. లారీలో ఉన్న చక్కరను పరిశీలించి వాటికి సంబంధించిన బిల్లులను తీసుకున్నారు. అయితే అందులోని వివరాలు వారికి అర్థం కాకపోవడంతో విషయాన్ని ఇన్చార్జ్ తహసీల్దార్ ప్రమీలకు అందజేశారు. అంతలోపే ఆ విషయం సబ్‌కలెక్టర్‌కు అందినట్లు తెలుస్తోంది. దీంతో రెవెన్యూ అధికారులు ఆ బిల్లులను తీసుకెళ్లి సబ్‌కలెక్టర్ కృష్ణాదిత్యాకు చూపించడంతో పూర్తిస్థాయిలో పరిశీలించి వ్యాపారులతో విచారణ చేపట్టాలని వారికి సూ చించారు. బిల్లులను పరిశీలించిన తర్వాత అందులో వే బిల్లులు తప్పా అన్నీ సక్రమంగానే ఉన్నాయని రెవెన్యూ అధికారులు ధృవీకరించి లారీని వదిలిపెట్టారు. అసలు చక్కెర ఇంత పెద్దమొత్తంలో నారాయణపేటలో క్రయవిక్రయాలు జరుగుతుంటే అమ్మక పన్ను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక నుంచి చక్కెరను దిగుమతి చేసుకున్న తెలంగాణకు కట్టాల్సిన పన్నులు కట్టారో లేదోనని అధికారులు పరిశీలించలేకపోయారు. వారిS అవగాహన లోపంతో ఉన్న బిల్లులను చూసి అవే కరెక్టు అని వ్యాపారులు చెప్పడంతో తల ఊపి పట్టుకున్న లారీని వదిలేశారు. ఆ వ్యాపారి మాత్రం వచ్చిన చక్కెర బస్తాలను గంటల వ్యవధిలోనే విక్రయించడం కొసమెరుపు. -
చెట్టును ఢీకొని ఆగిన లారీ
నాచారం గుట్ట(వర్గల్): రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ డ్రైవర్ లేకుండానే పల్లం వైపు పరుగులు తీసి మూడు కార్లను తాకుతూ చెట్టును ఢీకొట్టిన సంఘటన ఆదివారం వర్గల్ మండలం నాచారం గుట్ట పుణ్యక్షేత్రం ఎదుట జరిగింది. ముక్కోటి ఏకాదశి రోజున ఈ ఘటన జరగగా ఆ సమయంలో భక్తులు రోడ్డు మీద లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో తూప్రాన్ వైపు నుంచి గజ్వేల్ వైపు మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ వెళుతోంది. డ్రైవర్ నాచారం గుట్ట వద్దకు రాగానే టీ తాగేందుకు వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపేశాడు. ఇంజన్ ఆఫ్ చేసి హŸటల్లోకి వెళ్లాడు. అతడి దిగిన వెంటనే లారీ మెల్లమెల్లగా ముందుకు కదిలింది. దీన్ని డ్రైవర్ గమనించలేదు. కొద్దిసేపటికే అది పల్లం వైపు ముందుకు సాగింది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన ఇన్నోవా, స్విఫ్ట్, వ్యాగనార్ కార్లను తాకుతూ ముందుకు వెళ్లింది. అక్కడే ఉన్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. లారీ తగలడంతో వాహనాలు కొంత మేర దెబ్బతిన్నాయి. డ్రైవర్ లేకుండానే లారీ దూసుకొస్తున్న సమయంలో రోడ్డు మీద భక్తులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గౌరారం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందలేదని ఎస్సై శ్రీధర్ తెలిపారు. -
బిస్కెట్ల లారీ దగ్ధం
గుత్తి రూరల్: అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని శ్రీకష్ణదేవరాయ (ఎస్కేడీ) ఇంజనీరింగ్ కళాశాల వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున బిస్కెట్ల లారీ దగ్ధమైంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. లారీ నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు బిస్కెట్ల లోడుతో వెళుతోంది. గుత్తి శివారుకు రాగానే బ్యాటరీల వద్ద మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. పది కిలోమీటర్ల వరకూ అలాగే వెళ్లడంతో మంటలు వ్యాపించి.. బిస్కెట్ డబ్బాలు కాలిపోయాయి. మంటలు లారీ టైర్లకు కూడా పాకాయి. వెనుక వచ్చిన లారీ డ్రైవర్లు కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై లారీని అపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మంటలు భారీగా చెలరేగాయి. బిసెట్లన్నీ బూడిదయ్యాయి. -
అనంతలో బిస్కెట్ల లోడ్ లారీ దగ్ధం
-
వాగులో బోల్తాపడిన లారీ
మద్నూర్ : పెద్ద ఎక్లార గేటు సమీపంలోని రాజుల్లా వాగులో ఓ లారీ బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి మద్నూర్ వైపునకు వస్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి వాగులో బోల్తాపడిందని పేర్కొన్నారు. సంగారెడ్డి నుంచి నాందేడ్ వరకు ఉన్న జాతీయ రహదారిపై గల కల్వర్టులు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఈ రహదారిని వెడల్పు చేసినప్పటికీ కల్వర్టులు మాత్రం అలాగే ఉన్నాయన్నారు. ఈ కల్వర్టులు ఒకేసారి ఒక్క వాహనమే వెళ్లడానికి అనువుగా ఉన్నాయని, ఎదురుగా ఎదైనా వాహనం వస్తే వాటిని తప్పించబోయి వాగులో పడిపోతున్నాయని పేర్కొన్నారు. కల్వర్టులను వెడల్పు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
అల్లుడిని చూసేందుకు వచ్చి దుర్మరణం
నిజామాబాద్ క్రైం: అనారోగ్యానికి గురైన అల్లుడిని చూసేందుకు వచ్చిన అత్తను వేగంగా దూసుకొచ్చిన లారీ చిదిమేసింది. ఈ ఘటన ఒకటో టౌన్ ఠాణా పరిధిలోని అర్సపల్లి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌వో రవీందర్ కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం కుంట గల్లీకి చెందిన సాబేరా బేగం (60) కూతురు నిజామాబాద్ ఆటోనగర్‌లో ఉంటోంది. అల్లుడి ఆరోగ్యం బాగా లేకపోవడంతో చూసేందుకని సాజీరాబేగం ఆదివారం భైంసా నుంచి బస్సులో బయల్దేరింది. అర్సపల్లికి రాగానే ఆమె బస్సు దిగింది. అయితే, బస్సు వెనుకాలే ఉన్న లారీ (ఎంహెచ్ 26 ఏడీ 0878) అర్సపల్లి బైపాస్ వైపు వెళ్లేందుకు మలిగింది. ఈ క్రమంలో అది గమనించని సాజీరా బేగం లారీ వెనుక చక్రాల కింద పడిపోయింది. తల పగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది గమనించిన స్థానికులు లారీని ధ్వంసం చేసేందుకు యత్నించగా, అక్కడే వన్‌టౌన్ పోలీసు బూత్ సిబ్బంది వారిని నిలువరించారు. లారీ డ్రైవర్ సాయినాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, మృతురాలి వద్ద లభించిన ఫోన్లో ఉన్న నెంబర్ల ఆధారంగా ఆటోనగర్‌లో ఉంటున్న మనువడు షేక్ జావేద్‌కు సమాచారమిచ్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ అక్కడకు చేరుకున్నారు. ఎస్సై తలాలిక్ ఖాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడి మృతి
వర్ధన్నపేట టౌన్ : అతివేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో గురువారం జరిగింది. వర్ధన్నపేట ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శివరాత్రి కొమురయ్య(60) తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకోవడానికి ఇంటి నుంచి బయల్దేరాడు. అంబేద్కర్ సెంటర్ సమీపంలో వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిని దాటుతున్న క్రమంలో కోదాడ నుంచి సిమెంట్ లోడుతో వరంగల్ వైపునకు వెళుతున్న లారీ అతివేగంగా వస్తూ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో వెనుక లారీ టైర్ల కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య వెంకటమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కూతు రు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
గుంటూరు ఈస్ట్: లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ద్విచక్రవాహనం పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ట్రాఫిక్ ఎస్హెచ్ఓ ఆర్.సురేష్ బాబు తెలిపిన వివరాలు... గుంటూరు ఆర్ అగ్రహారం 5/5 లో నివసించే మల్లెల సుబ్బయ్య స్టీల్ షాపులో గుమస్తాగా జీవనం సాగిస్తుంటాడు. శుక్రవారం కన్యకాపరమేశ్వరి దేవస్థానం వైపు నుంచి కోనేరు రోడ్డులో నల్ల చెరువు వైపునకు ఇతను ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. నీళ్ల ట్యాంకుల వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వస్తున్న ఏపీఎస్ 7255 లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్బయ్య కింద పడిపోగా లారీ చక్రం అతని తలపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలిసిన అతని భార్య మల్లే కోటేశ్వరి ఇద్దరు చిన్న పిల్లలు, బంధువులు సంఘటనాస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ట్రాఫిక్పోలీసులు మృత దేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రై వర్ పఠాన్ బాలీసాహెద్ పరారయ్యాడు. -
లారీ - బైక్ ఢీ ఒకరు మృతి
-
పోలీస్ జీపును ఢీ కొన్న లారీ
కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు..చేయి తొలగింపు స్వలంగా గాయపడిన ఏఎస్ఐ, హోంగార్డు సత్తుపల్లి : పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్జీపును మంగళవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని లారీ ఢీకొన్న సంఘటనలో ఒక కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరు స్వలంగా గాయపడ్డారు. సీఐ పి.రాజేంద్రప్రసాద్ కథనం ప్రకారం..మండల పరిధిలోని తాళ్లమడ గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ జీపును గుర్తు తెలియని లారీ సైడ్ నుంచి వేగంగా ఢీకొని వెళ్లింది. దీంతో కానిస్టేబుల్ ఉమర్ కుడిచేయి నుజ్జునుజ్జు అయ్యి మాంసం ముద్దలు జీపులో పడ్డాయి. దీంతో జీపు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. జీపులో ఉన్న ఏఎస్సై రాజుకు తలకు గాయమైంది. హోంగార్డు కె.అశోక్ చేయి విరిగింది. విషయం తెలుసుకున్న సీఐ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం ఉమర్‌ను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చేయి తొలగించారు. ఏఎస్సై రాజు, హోంగార్డు అశోక్‌కు చికిత్స నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సరిహద్దు జిల్లాలకు సమాచారం అందించారు. గాయపడిన ఉమర్ చేయి తొలగించాల్సి రావడంతో పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉమర్‌కు వివాద రహితుడిగా మంచిపేరు ఉంది. ఐడీ పార్టీ కానిస్టేబుల్‌గా క్రైం కేసుల్లో చురుగ్గా వ్యవహరించి పలు మార్లు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. -
పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లిన బొగ్గులారీ
♦ వేంసూరులో ముగ్గురు వృద్ధుల్ని బలిగొన్న లారీ అతివేగం ♦ అరటిపండ్ల పాకలోకి దూసుకెళ్లడంతో దుర్ఘటన పింఛన్ రెన్యువల్ జిరాక్స్‌ల కోసం వచ్చిన ఓ వృద్ధురాలు..పొట్ట కూటికోసం అరటి పండ్లు అమ్ముకునే వృద్ధుడు, పండ్లు కోనేందుకు వచ్చిన మరో పెద్దాయనను లారీ మృత్యువు రూపంలో దూసుకొచ్చి బలిగొంది. ప్రమాద స్థలిలో రక్తపు మద్దలు...ఛిద్రమైన శరీరాలను చూసి..అంతా అయ్యో.. ఎంత ఘోరం జరిగిందే..అని బాధ పడ్డారు. తీరని విషాదంతో మృతుల కుటుంబాల వారు బోరున విలపించారు. తీరని విషాదం.. అనుకొని దుర్ఘటనతో ఇంటి పెద్ద దిక్కులను కోల్పోవటంతో మృతుల కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. మృతుడు ఎండీ మహబూబ్ అలీ (60)కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అరటి పండ్లు కొనేందుకు వచ్చిన కంకటి కృష్ణమూర్తి(65)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కోట నాగరత్నం(68)కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఎమ్మెల్యేలు సండ్ర, జలగం ఫోన్లో పరామర్శ.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావులు ఫోన్ చేసి సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వేంసూరు: బొగ్గులోడుతో సత్తుపల్లి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ బుధవారం సాయంత్రం వేంసూరు సెంటర్లో రోడ్డు పక్కన పాకలో నిర్వహిస్తున్న అరటిపండ్ల దుకాణంలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ముగ్గురు వృద్ధులు దుర్మరణం చెందారు. అరటి పండ్లు విక్రయిస్తున్న ఎండీ.మహబూబ్ అలీ (60), కొనేందుకొచ్చిన కంకటి కృష్ణమూర్తి(65), పింఛన్ రెన్యువల్ జిరాక్స్‌ల కోసం వెళ్లి వస్తూ అక్కడ ఆగిన కోట నాగరత్నం(68) అక్కడికక్కడే చనిపోయారు. మృతులంతా వేంసూరు వాసులే. వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొని దుకాణం పక్కనే ఉన్న ఆంజనేయస్వామి గుడి ప్రాంగణం మీదుగా మరో హోటల్ వద్దకు వెళ్లి ఆగింది. ఆ సమయంలో హోటల్ మూసి ఉండడం, ఆలయం వద్ద ఎవరూ లేకపోవడంతో మరో ప్రమాదం తప్పింది. లారీ దూసుకెళ్లడంతో మహబూబ్ అలీ, నాగరత్నం శరీరాలు ఛిద్రమయ్యాయి. తీవ్రంగా గాయపడిన కంకాటి కృష్ణమూర్తిని సత్తుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. లారీ డ్రైవర్ కొత్తపల్లి నరసింహారావుకు కూడా తీవ్ర గాయాలు కావడంతో సత్తుపల్లికి తరలించారు. భీతవాహ ఘటన.. లారీ ముందు భాగం తుక్కుతుక్కుగా మారి..శిథిలాల్లో మహబూబ్అలీ మృతదేహం చిక్కుకుంది. పోలీసులు బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమై..క్రేన్ ద్వారా లారీని పైకిలేపి డెడ్‌బాడీని బయటకు తీశారు. ప్రధాన రోడ్డు వెంట..ఈ భీతవాహ సంఘటనతో వేంసూరులో విషాధ చాయాలు నెలకొన్నాయి. వందలాది మంది ప్రమాదస్థలికి చేరుకొని..అయ్యో..పాపం అంటూ బాధ పడ్డారు. సీఐ రాజిరెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ గోవిందరావు పరిశీలించారు. ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ప్రధాని నివాసంలో పిల్లి లొల్లి!
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన డేవిడ్ కామెరాన్ పెట్టేబెడా సర్దుకొని అధికారిక నివాసాన్ని వీడారు. కానీ, ఆయనతోపాటు డౌనింగ్ స్ట్రీట్ లోని ప్రధాని నివాసానికి వచ్చిన పిల్లి ల్యారీ మాత్రం అక్కడే తిష్టవేయబోతున్నది. కామెరాన్ వెళ్లిపోతున్న నేపథ్యంలో ఆయనతోపాటు ఈ పిల్లిని కూడా బయటకు పంపిస్తారని మొదట భావించారు. అయితే, ఈ పిల్లిని బయటకు పంపించడం లేదని తాజాగా ప్రధాని కార్యాలయం అధికారులు స్పష్టం చేశారు. కొత్త ప్రధానిగా థెరిసా మే హయాంలోనూ 'చీఫ్ మౌసర్'గా ల్యారీ సేవలందింబోతున్నదని వెల్లడించారు. డౌనింగ్ స్ట్రీట్ లోని క్యాబినెట్ కార్యాలయం ఉన్న నంబర్ 10 వద్ద తోక ఊపుకుంటూ కనిపిస్తూ ల్యారీ టీవీల్లో, మీడియాలో బాగా ఫేమస్ అయింది. నంబర్ 10 బ్లాకులో నల్ల ఎలుకల బెడద ఎక్కువగా ఉండటం, లైవ్ టీవీ కార్యక్రమం వస్తున్న సమయంలోనూ బ్యాక్ గ్రౌండ్ లో ఎలుకలు తమ పని తాము చేస్తూ చికాకు పరుస్తుండటంతో 2011లో లండన్ లోని కుక్కలు, పిల్లుల సంరక్షణ సంస్థ నుంచి ల్యారీ అనే పిల్లిని తీసుకొచ్చారు. ఇది అనతికాలంలోనే ఎలుకలను పట్టడంలో తన కర్తవ్యాన్ని గొప్పగా నిర్వహించింది. ప్రధాని నివాసం సహా నంబర్ 10 బ్లాకులో ఎలుకలను తరిమికొట్టింది. దీని సేవలను మెచ్చుకుంటూ తొలిసారి దీనికి సివిల్ సర్వెంట్ క్యాట్ గా గుర్తింపు ఇచ్చి.. 'చీఫ్ మౌసర్'గా కామెరాన్ హయాంలో నియమించారు. కామెరాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోవడంతో ఆయన హయాంలో 'చీఫ్ మౌసర్'గా నియామకమైన ఈ పిల్లి ఉద్యోగం కూడా ఊడుతుందని అనుకున్నప్పటికీ దీని సేవలను థెరిసా హయాంలో కూడా వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. దీంతో డౌన్ స్ట్రీట్ లో అధికారిక నివాసాల్లో ఇకముందు కూడా తన దర్జాను ఒలుకబోస్తూ ఈ పిల్లి విధుల నిర్వహించనుంది. -
ఓరి దేవుడా..
♦ 45 మందితో పొలతల క్షేత్రానికి బయలు దేరిన లారీ ♦ గువ్వల చెరువు ఘాట్‌లో బ్రేక్ ఫెయిల్ ♦ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన వైనం ♦ ఐదుగురు దుర్మరణం.. 40 మందికి తీవ్రగాయాలు ♦ ఘటన గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ‘అమ్మో.. నాయనో.. ఒరే చిన్నోడా ఎక్కడరా.. కిందకు దూకరా.. ఓరి దేవుడా.. ఇలా చేశావెందుకయ్యా.. కాపాడు స్వామీ..’ అంటూ ఆర్తనాదాలు, రక్షించండంటూ కేకలతో గువ్వల చెరువు ఘాట్ మారుమోగింది. ‘స్పీడ్ బ్రేకర్ వద్ద ఒక్కసారిగా ఎగిరి పడిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకునేలోపే లారీ లోయలోకి పల్టీలు కొట్టింది. ఆ క్షణంలోనే ముగ్గురు విగతజీవులయ్యారు. తలలు పగిలి కొందరు, చేతులు.. కాళ్లు విరిగి మరికొందరు, మూగ దెబ్బలతో ఇంకొందరు విలవిల్లాడిపోయారు. మా బాధ వర్ణణాతీతం. లారీ పల్టీలు కొడుతుంటే ఒక్కరు కూడా బతకరనుకున్నా’మంటూ క్షతగాత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. చింతకొమ్మదిన్నె : బ్రేకులు ఫెయిలయ్యి లారీ అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం కడ ప-రాయచోటి రహదారిలోని గువ్వలచెర్వు ఘాట్‌లో చోటుచేసుకుంది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘాట్ దద్దరిల్లింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. చిన్నమండెం ఏపీజీబీలో మేనేజర్‌గా పనిచేస్తున్న లక్కిరెడ్డిపల్లె మండలం నల్లగుట్టపల్లె గ్రామానికి చెందిన కోటి మల్లికార్జున్‌నాయుడు తన కుమార్తె మైథిలి (11 నెలలు) పుట్టు వెంట్రుకలను తీయించే వేడుకను పొలతల క్షేత్రంలో నిర్వహించాలనుకున్నారు. బంధు మిత్రులతో కలిసి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు నల్లగుట్టపల్లె నుంచి లారీ(ఏపీ04 టి 2765)లో బయలు దేరారు. ఉదయం 7 గంటలకు గువ్వల చెరువులో లారీని ఆపి అందరూ టీ తాగారు. 7.30 గంటలకు లారీ మూడవ ఘాట్ (కడపవైపు) వద్దకు చేరుకునే సరికి ఉన్నట్లుండి వేగం పెరిగింది. స్పీడ్ బ్రేకర్ వద్ద కూడా ఆగక పోవడంతో లారీలో ఉన్న వారు కేకలు వేశారు. లోపల ఉన్న వారు ఏమైందంటూ డ్రైవర్‌ను ప్రశ్నించారు. ‘బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఏం చేయాలో తెలియడం లేద’న్నాడు. లారీని కొండ వైపు మళ్లించాలని లోపల ఉన్న వారు చెప్పేలోగానే లోయవైపు దూసుకుపోయింది. పల్టీలు కొడుతూ 100 అడుగుల లోయలో పడిపోయింది. లారీలో ఉన్న వారు ఎగిరి పడ్డారు. కేకలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. లక్కిరెడ్డిపల్లె మండలం చించర్ల గ్రామానికి చెందిన డి.చిన్నయ్య (40), నల్లగుట్టపల్లెకు చెందిన గుంటా మల్లమ్మ(60), అనంతపురం జిల్లా తలుపుల మండలం నిగిడి గ్రామానికి చెందిన గుండె మధుసూదన్‌నాయుడు (42) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను 108, ఇతర వాహనాల్లో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్కిరెడ్డిపల్లె మండలం బి.ఎర్రగుడి గ్రామానికి చెందిన చిన్న గంగయ్య (60), కట్టా నారాయణ (60) మృతి చెందాడు. డ్రైవర్ ప్రక్కనే క్యాబిన్లో కూర్చొన్న మల్లికార్జున్నాయుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని రాయవేలూరుకు తరలించారు. ఘటనా స్థలాన్ని కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, రూరల్ సీఐ వెంకట శివారెడ్డి, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, లక్కిరెడ్డిపల్లె జెడ్పీటీసీ సభ్యుడు సుదర్శన్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. బాధితులను రిమ్స్‌కు తరలించడానికి సహకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డితోపాటు స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు ప్రమాద విషయం ఫోన్లో వివరించారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లాలో రాయచోటి నుంచి కడపకు వెళ్లే దారిలో గువ్వలచెరువు ఘాట్ చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. ఇక్కడ ప్రమాదాలను నివారించాలని ఎన్నోమార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని విమర్శిం చారు. ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఇందుకు రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు స్పందించి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. బతుకుతానని అనుకోలేదు లారీ అదుపు తప్పిన సమయంలో డ్రైవర్ పక్కనే కూర్చొని ఉన్నాను. అతి వేగంగా వెళుతున్న వాహనాన్ని అదుపు చేయమని డ్రైవర్‌ను కోరాం. బ్రేకులు పడలేదంటూ డ్రైవర్ చేతులెత్తేయడంతో కొండవైపుకు లారీని తిప్పాలని కోరాం. అయితే ఆయన లోయ వైపునకు లారీని తీసుకెళ్లాడు. లోయలో లారీ పల్టీలు కొడుతూ కిందకు దూసుకుపోతున్న క్షణంలో ఇక బతుకుతానని అనుకోలేదు. పల్టీలు కొడుతున్న సమయంలోనే క్యాబిన్ లోంచి ఎగిరి బయటపడ్డాను. - గంగాధర్, నల్లగుట్టపల్లె ఏమైందో తెలియలేదు ఒక్క సారిగా కుదుపు రావడంతో లారీలో వెనుక వైపు కూర్చొన్న మాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. క్షణాల్లో లాలీ పల్టీలు కొడుతూ లోయలోకి దూసుకుపోయింది. ఒకరి మీద ఒకరం కిందా, మీద పడుతూ చెల్లా చెదురయ్యాం. అందరికీ రక్త గాయాలయ్యాయి. నేను చిన్నపాటి గాయాలతో బయటపడ్డాను. - రెడ్డికృష్ణ, నల్లగుట్టపల్లె -
దారి కాచిన మృత్యువు
♦ దైవ దర్శనానికి వెళ్తూ ఇద్దరు మహిళల మృతి ♦ మరొకరి పరిస్థితి విషమం పదిహేను మందికి గాయాలు ♦ అందరిదీ ఒకే కుటుంబం.. న్యూ హుమ్నాపూర్ వద్ద దుర్ఘటన ♦ ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ ఇద్దరు మహిళల మృతి పుల్కల్: దైవ దర్శనానికి వెళుతున్న భక్తులకు ఓ లారీ మృత్యు రూపంలో ప్రాణాలు హరించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు చనిపోగా మరో 15 మంది గాయపడ్డారు. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో పుల్కల్ మండలం న్యూ హూమ్నపూర్ వద్ద జరిగిన ప్రమాదానికి సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి మండలం మామిడిపల్లి గ్రామ పంచాయతీ గొల్లగూడెం తండాకు చెందిన కిమ్యా తోపాటు ఆయన బంధువులు కుమార్, చందర్, మాన్సింగ్, శ్రీను మరి కొందరు ఏడపాయల దుర్గామాత జాతరకు మంగళవారం తెల్లవారుజామున ట్రాక్టర్లో బయల్దేరారు. హూమ్నపూరం వద్ద ముందు వెళుతున్న ఓవర్ టేక్ చేయబోగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో కిమ్యా భార్య కేలి (45), భూలీ బాయి(42) అక్కడికక్కడే మృతి చెందారు. అమ్మవారి కోసం తీసుకెళుతున్న మేక కూడా చనిపోయింది. మరో 13 మందికి గాయలు కావడంతో 108లో సంగారెడ్డి సమీపంలోని ఎంఎన్ఆర్ అసుపత్రికి తరలించారు. మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.ట్రాక్టర్‌ను లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఆలయానికి వెళుతున్న వారి సామగ్రి చెల్లాచెదరుగా పడ్డాయి. ఒకరి పరిస్థితి విషమం సంగారెడ్డి రూరల్: పుల్కల్ మండలం హూమ్నపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 13 మందిని సంగారెడ్డి మండలం ఎంఎన్ఆర్ ఆసుపత్రి తరలించారు. వారిలో చెంద్రి బాయి తలకు బలమైన గాయాలు తగలడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో కిమ్యా నడుము విరగగామాలీ బాయికి చేయి విరిగింది. అనీత, సంగీత,బుజ్జి, రవీందర్, వాల్యా, శివకు గాయాలయ్యాయి. చిన్నారులు చంద్ర కిషోర్ కుడికాలు విరిగింది. హారిక, కిశోర్, సాత్వీక్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు మహిళలు మృతి చెందడంతో వారి గ్రామం గొల్లాగుడెం తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణ అంత విషాదంగా కనిపించింది. -
క్యాట్‌ఫిష్ లారీ పట్టివేత
కైకలూరు : కేంద్ర ప్రభుత్వం నిషేధించిన క్యాట్‌ఫిష్ సాగు కొల్లేరు గ్రామాల్లో యథేచ్ఛగా కొనసాగుతోంది. కైకలూరు మండలం శృంగవరప్పాడు నుంచి కర్ణాటక రాష్ట్రానికి రవాణా అవుతోన్న లారీని పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దుల్లో అటవీశాఖ అధికారులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. చటాకాయి గ్రామానికి చెందిన లారీ లోపల టార్ఫాలిన్ కవర్లో నీటిని పోసి 8 టన్నుల చేపలను తరలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.4 లక్షలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. శృంగవరప్పాడుకు చెందిన డాబా శ్రీను, సైదు దుర్గాంజనేయులుకి చెందిన సరకుగా భావించిన అధికారులు విచారణ సాగిస్తున్నారు. లారీ డ్రైవర్ తాతారావును అదుపులోకి తీసుకున్నారు. లారీని కైకలూరు అటవీశాఖ కార్యాలయం వద్ద ఉంచారు. ఆ సమయంలో చటాకాయికి చెందిన బలే కల్యాణం రాముడు నుంచి వివరాలు సేకరించారు. అటవీశాఖ డీఆర్వో జి.ఈశ్వరరావు నేతృత్వంలో సిబ్బంది రాజేష్, లాజర్, సతీష్, దీనబాబు, నరేష్, కిరణ్ దాడిలో పాల్గొన్నారు. ఫిషరీష్, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించి పట్టుకున్న క్వాట్ఫిష్ను పర్యావరణం దెబ్బతినకుండా పూడ్చుతామని డీఆర్వో తెలిపారు. మంత్రి చెప్పినా మార్పు లేదు సాక్షిత్తూ స్థానిక ఎమ్మెల్యే, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తన నియోజకవర్గంలో అనారోగ్యకర క్యాట్‌ఫిష్ చేపల రవాణాను అడ్డుకోవాలని పదే పదే చెబుతున్నా అధికారుల్లో చలనం లేదు. నిత్యం క్యాట్‌ఫిష్ రవాణా గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
అనంతపల్లి (నల్లజర్ల రూరల్) : నల్లజర్ల మండలం అనంతపల్లి శివారు సంజీవపురం పెట్రోలు బంక్ వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. బస్సు కుడి భాగం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనలో భీమడోలుకు చెందిన యర్రంశెట్టి వెంకట గౌరీకుమారికి గాయాలయ్యాయి. ఆమెను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి కోళ్లపెంటను యర్నగూడెం తీసుకువచ్చిన లారీ తిరుగు ప్రయాణంలో అనంతపల్లి పెట్రోల్ బంక్ వద్ద ఏలూరు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసి అదుపు తప్పి కుడివైపు దూసుకు పోయింది. లారీ బస్సును ఎడమవైపునకు ఈడ్చుకుపోయి చెట్టును ఢీకొని ఆగిపోయింది. బస్సులో 35 మంది ఉన్నారు. వారు పోలీసులు పోలీసులకు సమాచారం అందించారు. లారీ ఆయిల్ ట్యాంక్ పగిలిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది. అంటుకుంటే మంటలు చెలరేగి బంక్‌తో సహా తగలిబడి అతి పెద్ద ప్రమాదం జరిగేది. లారీ డ్రైవరు గవిర్ని సతీష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కొవ్వూరు డీఎస్సీ వెంకటేశ్వరరావుప్రమాద వివరాలను బస్సు డ్రైవర్ సింగిరెడ్డి చంద్రశేఖర్ నుంచి అడిగి తెలుసుకున్నారు. ఎస్సై నాయక్ కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరగలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. రోడ్డు మీద వెళుతున్న యువకుడిని వేగంగావచ్చిన లారీ ఢీ కొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బల్కంపేట వద్ద లారీ బీభత్సం- ఒకరి మృతి
సనత్‌నగర్ పరిధిలోని బల్కంపేట-బాలానగర్ ప్లైఓవర్ వద్ద ఆదివారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. లారీ బ్రేకులు ఫెయిలవ్వటంతో వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి సంఘటనాస్థలంలోనే మృతిచెందగా..14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో పలువాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో చాలాసేపు అక్కడ ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి కేసు నమోదు చేసుకునిదర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీ - యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ఈ ఘనట చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో బుధవారం జరిగింది. రోడ్డు దాటడానికి ప్రయత్నించిన గుర్తుతెలియని (20) యువకుడిని లారీ ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు లారీని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
లారీ ఢీకొని వృద్ధుడి మృతి
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన భువనగిరి పట్టణంలో బుధవారం ఉదయం జరిగింది. భువనగిరి పట్టణంలోని కుమ్మరి బస్తీకి చెందిన తాడూరు యాదగిరి (58) బుధవారం ఉదయం తన వ్యవసాయ భావి వద్దకు వెళుతున్నాడు. ఈ క్రమంలో బావి వద్ద ఉన్న బైపాస్ రోడ్డును దాటుతుండగా... ఇండియన్ ఆయిల్ లారీ ఢీ కొట్టింది. దాంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసునకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
నెల్లూరుజిల్లా కావలి మండలం గౌరవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్ ను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
దూసుకొచ్చిన మృత్యువు
రైల్వే రెండు గేట్లను ఢీకొట్టి ఆటోపైకి వెళ్లిన లారీ ఆరుగురికి గాయాలు ఆటోడ్రైవర్ మృతి కైకలూరు /మండవల్లి : రైల్వే గేటు పడటంతో ఆగిన ఆటో పైకి ఎదురుగా ఉన్న రెండు గేట్లను ఢీకొని మరీ లారీ దూసుకొచ్చిన ఘటన సోమవారం రాత్రి మండవల్లి మండలం భైరవపట్నం గేటు వద్ద జరిగింది. గుడివాడ నుంచి కైకలూరుకు ఆరుగురు ప్రయాణికులతో వస్తున్న ఆటో భైరవపట్నం రైల్వేగేటు పడటంతో ఆగింది. ఇంతలో కైకలూరు వైపు నుంచి బియ్యం లోడుతో వస్తున్న లారీ డ్రైవర్ రెండు గేట్లను గుద్ది మరీ ఎదురుగా ఉన్న ఆటోని ఢీకొట్టింది. అదే వేగంతో రైల్వే గేటు వద్ద ద్విచక్ర వాహనంతో కైకలూరు రావడానికి నిలిచి ఉన్న చలమలశెట్టి గంగాధర్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని సరస్వతి, లీలారాణి, మందా మోజేష్, చింతయ్య, మోహనరావులతో పాటు ఆటో డ్రైవర్ రవికి గాయాల య్యాయి. వీరిలో ఆటోడ్రైవర్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించినా ఫలితం లేకపోయింది. అతను ప్రాణాలు కోల్పోయాడు. క్షతగాత్రులకు కైకలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ఘటన జరిగిందని సమాచారం. ఇదే రైల్వేగేటు వద్ద ఇటువంటి ఘటన ఏడాది క్రితం జరిగింది. అప్పుడు కూడా లారీ రెండు గేట్లను ఢీకొని ఓ మహిళ ప్రాణాలను బలితీసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఎర్రగొండపాళెంకు చెందిన కృష్ణ(35) భార్య పుట్టినింటిలో ఉండడంతో చూసేందుకు బుధవారం మాచర్ల వచ్చాడు. ఆర్టీవో కార్యాలయం వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కృష్ణ భార్య ప్రస్తుతం గర్భవతి. భార్యా పిల్లలను చూసేందుకు వచ్చి మృత్యువాత పడడంతో పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని నక్కలదిన్నె వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. డ్రైవర్‌గా పనిచేసే భూక్యా బాలాజీ నాయక్(36) ఆదివారం రోడ్డుపై వెళుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దాంతో తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మదనపల్లె రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ తీగలు తాకి కాలిపోయిన లారీ
విద్యుత్ హైటెన్షెన్ వైర్లు తాకి లారీ కాలిపోయిన ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని 63వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఉరవకొండకు గాలిమరల టవర్స్ లోడ్‌తో వెళ్తున్న లారీ గుత్తి శివారుకు చేరుకోగానే రోడ్డు పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో మంటలు ఎగిసిపడి లారీకి అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో లారీ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. డ్రైవర్ చిన్నదురైకు తీవ్రగాయాలయ్యాయి. అగ్నిప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. డ్రైవర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురికి గాయాలు
అదుపుతప్పిన ఓ లారీ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో శనివారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వినుకొండ నుంచి అద్దంకి వైపు వెళుతున్న లారీ మార్కెట్ యార్డ్ ప్రాంతంలో మూలమలుపు వద్ద అదుపుతప్పడంతో పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి బయట పడుకున్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఇల్లు ధ్వంసం అయింది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. -
లారీకి రూ.10 వేలు
ఇసుక మాఫియా దోపిడీ క్వారీలో టన్నుకు రూ.320 రవాణాతో కలిపి రూ.448 అమ్మేది మాత్రం రూ.800 దోపిడీపై అధికారుల ఉదాసీనత వరంగల్ : నిర్మాణ రంగాన్ని జిల్లాలో ఇసుక మాఫియా శాసిస్తోంది. ఇల్లు కట్టే వారికి జిల్లా కేంద్రంలోని ఇసుక వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ క్వారీల్లో వ్యాపారులు తెచ్చే ఇసుక ధరలకు, వినియోగదారులకు వీరు విక్రయించే ధరలకు మధ్య ఎక్కడా పొంతన కుదరడం లేదు. ప్రభుత్వం క్వారీల్లో విక్రయించే ఇసుకకు మాత్రమే నిర్ణీత ధర నిర్ణయించింది. వ్యాపారులు వినియోగదారులకు ఇసుకను అమ్మే ధరను ఖరారు చేసే విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు. వ్యాపారుల ఇష్టారాజ్యం భవన నిర్మాణాలు వరంగల్ నగరంలో అధికంగా జరుగుతుంటారుు. రోజు దాదాపు 500 లారీల ఇసుక వస్తోంది. గోదావరి పుష్కరాల కారణంగా జిల్లాలోని ఏటూరు ప్రభుత్వ క్వారీలో ఇసుక తీయడం లేదు. దీంతో కరీంనగర్ జిల్లాలోని మానేరు ఇసుక మాత్రమే వస్తోంది. వర్షాలు లేకపోవడంతో నిర్మాణ రంగం జోరు సాగుతోంది. దీన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. ఇసుక అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలోని నదుల్లో ఇసుక క్వారీలను నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివద్ధి సంస్థ(టీఎస్ఎండీసీ) ఈ క్వారీల బాధ్యతలు చూస్తోంది. నదుల్లో తీసిన ఇసుకను టీఎస్ఎండీసీ టన్నుకు రూ.320(క్యూబిక్ మీటరు రూ.550) చొప్పున వ్యాపారులకు విక్రయిస్తుంది. లారీల్లో లోడింగ్ పరిమాణాన్ని బట్టి ఇసుక క్వారీల్లో ధర రెండు రకాలుగా ఉంది. 13.5 క్యూబిక్ మీటర్ల(21 టన్నులు)కు రూ.7,425... 10.5 క్యూబిక్ మీటర్ల(18 టన్నులు)కు రూ.5,775గా నిర్ణయించారు. డిమాండ్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం ఇదే ధరతో వ్యాపారులకు ఇసుకను సరఫరా చేస్తుంది. ప్రభుత్వ ధరకు రవాణా ఖర్చులతో కలిపి వ్యాపారులు దీన్ని వినియోగదారులకు విక్రయించాల్సి ఉంటుంది. ఇసుక రవాణా చేసే లారీలకు సంబంధించి లీటరు డీజిల్‌కు రెండు నుంచి మూడు కిలో మీటర్లు ప్రయాణిస్తాయి. ఇలా డీజిల్, ఇసుక ధర కలిపి వినియోగదారులకు ఇసుకను విక్రయించాల్సిన వ్యాపారులు ఇష్టమొచ్చినట్లుగా ధరలు ఖరారు చేసి దోచుకుంటున్నారు. మానేరు ఇసుక క్వారీ నుంచి జిల్లా కేంద్రానికి 60 కిలో మీటర్లు ఉంటోంది. ఇసుకను జిల్లా కేంద్రానికి తెచ్చేందుకు లారీ రవాణాకు అయ్యే డీజిల్, డ్రైవర్, కూలీల ఖర్చులు కలిపి గరిష్టంగా రూ.1800లకు మించదు. ఇలా 21 టన్నుల ఇసుక ధర, రవాణా ఖర్చులు కలిపి రూ.9,425 అవుతాయి. ఈ మొత్తాన్ని బట్టి చూస్తే వ్యాపారులకు టన్ను ఇసుక కేవలం రూ.448కి మాత్రమే వస్తోంది. వ్యాపారులు మాత్రం ఇదే ఇసుకను టన్నుకు రూ.800 తక్కువగా అమ్మడం లేదు. డిమాండ్‌ను బట్టి కొందరు వ్యాపారులు టన్నుకు రూ.1000 వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగిన వారికి డిమాండ్ బాగా ఉందని.. తీసుకుంటే తీసుకోండి లేకుంటే లేదు అని గద్దిస్తున్నారు. ఇలా టన్ను ఇసుకను రూ.448 చొప్పున తెస్తూ రూ.800లకు విక్రయించే వ్యాపారులకు ఒక్కో లారీ లోడ్‌కు రూ.7,375 చొప్పున లాభం వస్తోంది. ఇసుక వ్యాపారుల్లో ఎక్కువ మంది, ముఖ్యంగా మానేరు ఇసుక తెస్తున్న వ్యాపారులు.. ప్రభుత్వం ఇచ్చే వేబిల్ కంటే రెట్టింపు స్థాయిలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వీరు 18 టన్నులకు వేబిల్ డబ్బులు చెల్లించి 30కిపైగా టన్నులు తెస్తున్నారు. వేబిల్ ప్రకారం ఇసుకను తెచ్చే వారికే ఒక్కో లారీ లోడ్‌కు రూ.8 వేల నుంచి 10 వేలకు వరకు ఆదాయం వస్తోంది. వేబిల్ కంటే ఎక్కువ లోడ్ తెచ్చేవారికి ఈ ఆదాయం రెండుమూడు రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఇలా వ్యాపారులకు వచ్చే ఆదాయం అంతా... వినియోగదారులను దోపిడీ చేస్తున్నట్లుగానే ఉంటోంది. ప్రభుత్వానికి తక్కువ డబ్బు ఇస్తూ రెట్టింపు స్థాయిలో లాభం ఆర్జిస్తున్న వ్యాపారుల దోపిడీని అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై ఆరోపణలు వస్తున్నాయి -
లారీ, బైక్ ఢీ : ఇద్దరికి తీవ్రగాయూలు
నేలకొండపల్లి : బైక్‌ను లారీ ఢీకొని ఇద్దరు గాయపడిన సంఘటన మండల కేంద్రంలోని కట్టలమ్మ చెరువు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు కాగా లారీ పల్టీ కొట్టింది. ప్రత్యక్ష సాక్షి కథనం... ఏపీ, గుంటూరు జిల్లాలోని గుడ్లవల్లేరు గ్రామానికి చెందిన షేక్ సుభాన్, కృష్ణ జిల్లాలోని పెనుగ్రంచిపోలుకు చెందిన షేక్ జానీపాషా బైక్ పై గురువార ం ఖమ్మం బయలుదేరారు. మండల కేంద్రంలోని కట్టలమ్మ చెరువు దాటుతుండుగా ఖమ్మం నుంచి కోదాడ వస్తున్న బొగ్గు లారీ ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న సుభాన్, జానీ పాషాలు కిందపడి పోయారు.ఈ క్రమంలో లారీ పల్టీ కొట్టి పొలాలలో పడి పోయింది. బైక్ మాత్రం నుజ్జునుజ్జరుుంది. దీంతో బైక్‌పై ఉన్న సుభాన్, జానీ పాషా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా అరగంట వరకు 108 సంఘటన స్థలానికి రాలేదు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ కానిస్టేబుల్ శంకర్రావు సంఘటన స్థలానిన సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.దేవేందర్‌రావు తెలిపారు. -
పెళ్లింట చావు బాజా
శ్రీకాకుళం రూరల్: మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సిన ఇంట చావు బాజా మోగింది. వివాహానికి వస్తున్న వారిలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నాలుగేళ్ల చిన్నారితో సహా తల్లీ కూడా గాయపడడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే మండలంలోని లంకాం గ్రామానికి చెందిన తట్ట నీలకంఠం (48) తమ్ముడు కుమారుడుకు బుధవారం రాత్రి వివాహం. దీంతో పోలాకి మండలం ఈదులవలసలో ఉంటున్న నీలకంఠం కుమార్తె గొండు ఊర్మిల, మనుమరాలు వైష్ణవీ (నాలుగు నెలల చిన్నారి)ని ఆటోలో బుధవారం వివాహం కోసం లంకాం తీసుకొని వస్తున్నాడు. ఇంతలో సిలగాం సింగువలస ఎఫ్‌సీఐ గొడౌన్ కూడలిలో ఎదురుగా వస్తున్న బీఎంపీఎస్ పార్శిల్ సర్వీసు లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో నీలకంఠం అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు ఉన్న ఆయన కుమార్తె ఊర్మిల, మనుమరాలు వైష్ణవితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న లంకాం గ్రామానికి చెందిన తేజేశ్వరావు అనేవ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 వాహనంలో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి వైష్ణవి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖకు వైద్యులు రిఫర్ చేశారు. ఊర్మిల తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుడి కాలు విరిగిపోయింది. శోక సముద్రంలో పెళ్లిల్లు ప్రమాదం విషయం తెలుసుకున్న నీలకంఠం కుటుంబం తీవ్ర విషాదానికి గురైంది. పెళ్లి సందడితో కళకళలాడాల్సిన లంకాంలోని నీలకంఠం తమ్ముడు ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి సమీపంలో ప్రమాదం జరగడంతో విషయం తెలుసుకుని లంకాం గ్రామస్తులంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిన్నారి వైష్ణవి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో అందరూ కంటతడిపెట్టారు. నీలకంఠం మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. రూరల్ ఎస్సై ఎం.శ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు
బల్లికురవ : ముందు వెళుతున్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలో మండలంలోని వైదన గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీహరిరావు కథనం మేరకు కందకూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న కేఎంబీటీ ట్రావెలర్స్బస్సు వేగంగా వెళుతూ ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కందకూరుకు చెందిన పర్రె సంధ్య, ఆమె కుమారుడు వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ముందు భాగంలో కూర్చోవడంతో గాయాల పాలయ్యారు. మిగిలిన వారు క్షేమంగా ఉన్నారు. క్షతగాత్రులు నరసరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రమా దం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం
మదనపల్లె రూరల్: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో శుక్రవారం ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. పట్టణంలోని సంజీవరాయుని ఆస్పత్రి వీధిలో ఉంటున్న వ్యాపారి మావిళ్ల శేఖర్‌ప్రసాద్‌రెడ్డి, సుభాషిణి దంపతుల కుమారుడు తేజారెడ్డి(21) చెన్నైలో బీటెక్ చదువుతున్నాడు. అతని తమ్ముడు చందూరెడ్డి(18) ఇంటి వద్దే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వీరిద్దరూ శుక్రవారం పుంగనూరు మండలం ఈడిగపల్లెలో బంధువుల గృహ ప్రవేశానికి మదనపల్లె నుంచి ద్విచక్ర వాహనంలో బయల్దేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వలసపల్లె సమీపంలో మదనపల్లె నుంచి వేగంగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తేజారెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చందూరెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బిడ్డ మరణవార్త తెలియగానే ఆసుపత్రికి వచ్చిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువుల ఆర్తనాదాలతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
బండి మీద బండి.. రైలింజనండీ
రైలు పట్టాలపై వెళ్లాల్సిన రైలింజన్ ఒక్కసారిగా లారీ పైన చూసేవారికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి దృశ్యమే మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో గురువారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఓ రైలింజన్‌ను లారీ ట్రాలీలో రాయిచూర్ వైపు దేవరకద్ర మీదుగా తరలించారు. దీంతో పట్టాలపై వెళ్లాల్సిన రైలింజన్ లారీ ట్రాలీపై వెళ్తుండడంతో ఈ దృశ్యాన్ని గ్రామస్తులు, ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా గమనించారు. ఆ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. - దేవరకద్ర రూరల్ -
లారీ ఢీకొని యువకుడు మృతి
రాజమండ్రి రూరల్: లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్తానికుల కధనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి... మండలంలోని లాలా చెరువు సమీపంలోని స్పిన్నింగా మిల్లు వద్ద బత్తిన నగర్ కు చెందిన సూరిబాబు(23) రోడ్డు పక్కన నడుస్తుండగా లారీ ఢీకొట్టింది. బాధితుడి పై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారైయ్యాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరిలించారు. కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలింపు చేపట్టారు. -
పుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన లారీ, ఇద్దరు మృతి
విజయవాడ: విజయవాడ భవానీపురంలో శనివారం తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్ డౌన్ అయిన లారీని స్టార్ట్ చేసే క్రమంలో అదుపుతప్పి పుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన విజయవాడ నగరంలో భవానిపురంలో రావిచెట్టు సెంటర్ వద్ద శనివారం తెల్లవారు జామున 2 గంటలకు జరిగింది. వివరాలు.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు స్క్రాఫ్ లోడుతో వెళ్తున్న లారీ భవానిపురం రావిచెట్టు సెంటర్ వద్దకు రాగానే బ్రేక్ డౌన్ అయింది. రోడ్డుపై ఉన్న లారీని తొలగించడానికి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో క్రేన్ డ్రైవర్(హోంగార్డు), లారీ డ్రైవరు, క్లీనర్‌ను లారీని తోయమని కోరి తాను లారీని స్టార్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు లారీని హోంగార్డు అదుపుచేయలేకపోమడంతో అదుపుతప్పి పుట్‌పాత్ పైకి దూసుకుపోయింది. దీంతో పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న గుర్తు తెలియని బిచ్చగాళ్లు పురుషుడు(55), ఒక మహిళ(50) మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదే హలను పోస్ట్‌మార్టం కోసం జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ, ఓల్వో బస్సు ఢీ
-
లారీ, ఓల్వో బస్సు ఢీ: ఒకరికి గాయాలు
నల్లగొండ :కట్టంగూర్ లో శుక్రవారం ఉదయం ఓల్వో బస్సు, లారీ ఢీకొన్నాయి. వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు హైదరాబాద్ వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు. -
విశాఖలో దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ
విశాఖపట్నం: ఆనందపురం జంక్షన్ వద్ద ఒక దుకాణంలోకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు దుకాణాలుతో పాటు ఒక ఆటో కూడా ధ్వంసం అయింది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కోల్‌సిటీ : గోదావరిఖనిలో సంక్రాంతి పండుగ పూట గురువారం కతుబోజుల సత్యం (45) రోడ్డు ప్రమాదంలో మృతిచెందన సంఘటన విషాదం నింపింది. ట్రాఫిక్ పోలీసుల కథనం... వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇసిపేట గ్రామానికి చెందిన సత్యంకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వడ్రంగి పని చేసుకునే సత్యం బతుకుదెరువు కోసం 25 సంవత్సరాల క్రితం ఆదిలాబాద్ జిల్లా మందమర్రి 3వ జోన్‌కు వలస వచ్చాడు. సొంత ఇల్లు కూడా లేని సత్యం అతికష్టం మీద పెద్ద కూతురు అనూషకు ఈనెల 30న పెళ్లి నిర్వహించడానికి ముహుర్తం పెట్టుకున్నారు. పెళ్లి కూడా ఓదెల మండలం గుంపుల గ్రామంలోని అత్తగారింట్లో చేయడానికి ఏర్పాట్లు చేశారు. అత్తగారింట్లో లగ్గంకోటు వెయ్యడానికి రెండు పెళ్లి పీటలను బైక్‌కు కట్టుకున్న సత్యం గురువారం గుంపులకు బయలుదేరాడు. మార్గమధ్యలో బైక్‌లో పెట్రోల్ పోయించడానికి గోదావరిఖని గంగానగర్‌లోని పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. పెట్రోల్ పోయించుకున్న అనంతరం రాజీవ్హ్రదారి ఫ్లైఓవర్‌పైకి మూల తిరుగుతుండగా ఎదురుగా కర్రల లోడ్‌తో వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యం తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం వరంగల్ జిల్లాలోని మొగుళ్లపల్లికి తరలించారు. పెళ్లింట విషాదం అలుముకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. తలకొరివిపెట్టిన చిన్న కూతురు... సత్యం మృతదేహం చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. ‘ఎంత కష్టమైనా బిడ్డ పెండ్లి చేస్తనంటివి గద సత్తెన్న.. బిడ్డ పెండ్లి చెయ్యకుంటనే పోతివా సత్తన్న..’అంటూ విల పించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. తండ్రి శవయాత్రలో చిన్న కూతురు శిరీష అగ్గిపట్టి నడుస్తుంటే ఊరంతా కన్నీరుపెట్టింది. -
ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
లారీ, ఆటో ఢీకొని ఆరుగురి మృతి కడెం: ఆదిలాబాద్ జిల్లా కడెం మండల కేంద్రం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని లంబాడితండా వద్ద నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై ఆటోను లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన బర్ల లచ్చవ్వ, ఆమె అక్క కూతుళ్లు గంటి శైలజ (22), ఏనుగుల గంగామణి (17)తో పాటు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం జిల్లెడుకుంటకు చెందిన ఆత్రం బాపూరావు(52), టేకం సందూర్బాయి(41), టేకం గిరిజాబాయి(46), టేకం కమలాబాయి(63)లు ఆటోలో ప్రయాణిస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో కడెం దాటి లంబాడితండా క్రాసింగ్ వద్దకు రాగా, ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొంది. దీంతో శైలజ, గంగామణి, ఆత్రం బాపూరావు, టేకం సందూర్బాయిలు అక్కడికక్కడే చనిపోయారు. టేకం గిరిజాబాయి, టేకం కమలాబాయి, బర్ల లచ్చవ్వకు తీవ్ర గాయాలు కాగా.. వారిని ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో గిరిజాబాయి, కమలాబాయి చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ఇద్దరు ప్రయాణికులు మడావి బాలు, పెద్ది రాజు, డ్రైవర్ శారూఖ్ చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనలో ఆటో నుజ్జునుజ్జయ్యింది. -
ఆగిన రవాణా
నగరంలో పగలు గూడ్స వాహనాలు సంచరించరాదంటూ ప్రభుత్వ ఉత్తర్వులు గూడ్స్ వాహనాల యజమానులు, డైవర్ల ధర్నా ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశీలిస్తామన్న హోం మంత్రి జార్జ నిర్ణయం మార్చుకోకుంటే ఆందోళన తప్పదని హెచ్చరిక బెంగళూరు : సరుకు రవాణా వాహనాలు నగరంలోకి ప్రవేశించరాదని రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లారీ, టెంపో యజమానులు, డ్రైవర్లు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం బెంగళూరులోని టౌన్ హాల్ ఎదుట ఫెడరేషన్ ఆఫ్ గూడ్స ట్రక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళన కారులు మాట్లాడుతూ... ఉదయం ఆరు నుం చి రాత్రి పది గంటల వరకు సరుకు రవాణా వా హనాలు నగరంలో సంచరించకూడదంటూ గత ఏడాది డిసెంబర్ 16న ప్రభుత్వం ఉత్తర్వులు జా రీ చేసిందని గుర్తు చేశారు. అంతకు ముందే 12 టన్నులు, 7 టన్నుల సరుకులు తీసుకువచ్చే వా హనాలను నగరంలో సంచరించడాన్ని నిషేధిం చారని తెలిపారు. తిరిగి మూడు టన్నుల సరుకు లు రవాణా చేసే వాహనాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, దీని వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడే అవకాశముందని ఆం దోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయంతో టెం పోలపై ఆధారపడిన వారి బతుకు దుర్భరమవుతోందని అన్నారు. నగరంలో 60 వేల మంది సరుకు రవాణా చేసే వాహనాలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. బెంగళూరు నగరంలో ఇండ్రస్టియల్ ఏరియాలు, కూరగాయల మార్కెట్లు, ఆహారపదార్థాలు తయారు చేసే సంస్థలు ఉన్నాయని, వీటికి సరుకు రవాణా చేసే వాహనాలు వెళ్లకపోతే అయా ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు పని లేకుండా పోతోందని అన్నారు. ఆర్టీఓ చట్టం ప్రకారం 7 టన్నుల సామర్థ్యం ఉన్న గూడ్స్ వాహనాలు నగరంలో సంచరించరాదన్న నియమాలు ఉన్నాయని తెలిపారు. అయితే ట్రాఫిక్ పోలీసలుఉ అనవసరంగా గూడ్స వాహనాలను నిలిపి సిగ్నల్ జంప్, ఓవర్ లోడ్, నోపార్కింగ్ స్థలంలో నిలిపారంటూ వేధిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. మూడు టన్నుల సామర్థ్యంతో ఉన్న వాహనాలను నగరంలో సంచరించేందుకు అనుమతించాలని కోరారు. కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు పరిశీలిస్తున్నాం : జార్జ ఎక్కువ టన్నుల సరుకు తీసుకు వస్తున్న వాహనాలు నగరంలో సంచరించ రాదన్న ప్రభుత్వ ఉత్తర్వులపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర హోం శాఖ మంత్రి జార్జ్ అన్నారు. సోమవారం గూడ్స్ వాహనాల యజమానులు, వివిధ సంఘాల నాయకులతో ఆయన సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రవాణ శాఖ మంత్రి, అధికారులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తరువాత లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు షణ్ముగప్ప, నాయకుడు సంపత్రామన్ మాట్లాడుతూ... డిమాండ్ల పరిష్కారానికి మంత్రి జార్జ సానుకూలంగా స్పందించారని, ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపి వేసి ఆందోళనను తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. -
పేదల బియ్యం పట్టివేత
బనగానపల్లె టౌన్ : పేదల బియ్యూన్ని అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్ అధికారుల బృందం దాడులు చేసింది. బియ్యూన్ని తరలిస్తున్న లారీ సహా వాటి ముందు పెలైట్‌గా బయలుదేరిన కారును అధికారులు సీజ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.4.50 లక్షలు విలువ చేసే మొత్తం 170 క్వింటాళ్ల బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ డీఎస్పీ విల్సన్ కథనం ప్రకారం... దొరికిందిలా... డోన్ సమీపంలోని చిగురుమాను వద్ద బుధవారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయూనికి వచ్చిన లారీని ఆపి తనిఖీ చేశారు. డ్రైవర్‌ను ఆరా తీయగా...అవి రేషన్ బియ్యం అని తెలిపాడు. బనగానపల్లెలోని యోగిశ్వర రైస్ మిల్ యూజమానికి చెందిన లారీగా గుర్తించారు. అందులోని బియ్యం బస్తాలన్నీ అక్రమంగా నల్లబజారుకు తరలిస్తున్నట్లు పసిగట్టారు. లారీ సహా సరుకును సీజ్ చేశారు. ఇండికా కారు కూడా... లారీకి ముందు అధికారుల కదలికలను గుర్తిస్తూ.. అలర్ట్ చేసేందుకు వీలుగా పెలైట్ వాహనంగా కారు బయలుదేరింది. అందులో మహమ్మద్ రఫితుల్లాబేగ్, సునీల్ అనే వ్యక్తులు ఉండగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. రేషన్ బియ్యూన్ని కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్నట్లు సదరు వ్యాపారి అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. వ్యాపారిపై గతంలోనూ రెండు కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. దాడుల్లో విజిలెన్స్ ఏసీ సుబ్బారెడ్డి, ఏజీ జాన్, స్థానిక రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
స్కూల్ బస్సును ఢీకొన్న లారీ
పటాన్చెరు రూరల్ : ఆగి ఉన్న స్కూల్ బస్సును లారీ వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు, డ్రైవర్ గాయపడ్డారు. ఈ సం ఘటన మండలం పరిధిలోని ముత్తంగి చౌరస్తా వద్ద సోమవారం చోటు చేసుకుం ది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇస్నాపూర్ కు చెందిన త్రివేణి పాఠశాల బస్సు సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో 20 మంది విద్యార్థులను ఇళ్లకు చేర్చేందుకు బయలుదేరింది. అయితే ముత్తంగి గ్రామంలోకి వెళ్లేందుకు జాతీయ ర హదారిపై యూటర్న్ చేయాల్సి ఉండ గా .. లారీ వస్తుండడంతో వాహనాన్ని ఆపా డు. ఈ సమయంలో వెనుక నుంచి వస్తు న్న ఇసుక లారీ విద్యార్థులున్న బస్సును ఢీకొంది. వెనువెంటనే ఆ స్కూల్ బస్సు ప్రధాన రహదారిలో వెళుతున్న రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో స్కూల్ బస్ డ్రైవర్ జహంగీర్‌కు కాలు విరగ్గా.. బస్సులో ఉన్న పో చారానికి చెందిన విద్యార్థు లు అభిషేక్‌సింగ్, దీక్షిత్‌ల తలలకు గాయాలయ్యాయి. మిగిలిన విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయపడ్డారు.విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రిలో చికిత్సలు చే యించారు. కాగా ఈ సమయంలో రోడ్డు పై కిలోమీటర్ వరకు వాహనాలు ఆగిపోవడంతో పోలీసులుట్రాఫిక్ను క్లియర్ చేశా రు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఎం ఈఓ ప్రవీణ విద్యార్థుల ఇళ్లకువెళ్లి విద్యార్థుల క్షేమసమాచారాన్ని తెలుసుకున్నారు. -
అర్ధరాత్రి తాండూరులో లారీ బీభత్సం
తాండూరు: లారీ అదుపు తప్పి రోడ్డు మీద అడ్డదిడ్డంగా ప్రయాణించి కాసేపు కలకలం సృష్టించింది. ఆ మార్గంలో వాహనచోదకులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చివరకు ఓ ఆటోను ఢీకొట్టిన లారీ అదే వేగంతో వెళ్లి పాఠశాల గేటును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ఆటోలోని నలుగురు గాయపడ్డారు. తాండూరు అర్భన్ ఎస్ఐ నాగార్జున కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ(కెఏ.39-5278) హైదరాబాద్ నుంచి తాండూరుకు సిమెంట్ లోడింగ్‌తో బుధవారం బయలుదేరింది. రాత్రి సుమారు 11గంటల సమయంలో తాండూరు పట్టణానికి ఈ లారీ చేరుకుంది. అయితే తాగిన మత్తులో డ్రైవర్ రవీందర్ లారీని అతి వేగంగా అజాగ్రత్తగా నడిపాడు. దీంతో లారీ రోడ్డు మీద అటూఇటూ తిరుగుతూ విలియంమూన్ చౌరస్తా నుంచి పోలీసుస్టేషన్ సమీపం వరకు వచ్చింది. ఈక్రమంలో లారీని చూసిన వాహనదారులు ముందు జాగ్రత్త పడి పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. చివరకు పోలీసుస్టేషన్ సమీపానికి రాగానే ముందుగా వెళుతున్న ఆటో ట్రాలీని లారీ ఢీకొట్టింది. అనంతరం అదే వేగంతో సమీపంలోని శివం గ్రామర్ స్కూల్ గేటును ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదానికి గురైన ఆటోలో సెల్ టవర్లకు బ్యాటరీలు ఏర్పాటు చేసి రిలయన్స్ టెక్నికల్ సిబ్బంది ఉన్నారు. వారిలో తాండూరులోని గాంధీనగర్‌కు చెందిన అనిల్‌కుమార్(19), హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన అనారాజ్(26)లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్వన్నకట్టకు చెందిన అరవింద్‌కుమార్, ఆటో డ్రైవర్ శివారెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ నాగార్జున సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై సంఘటన రాత్రి సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే చాలా మంది ప్రాణాలు పోయేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ శివారెడ్డి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ రవీందర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ముగ్గురు మిత్రుల విషాదాంతం
లారీని ఢీకొన్న కారు డోన్ సమీపంలోని అమకతాడు వద్ద ఘటన టోల్‌ప్లాజా వద్ద స్పీడ్ బ్రేకర్లే కారణం ఘటనా స్థలిలోనే ముగ్గురి దుర్మరణం 20 రోజుల కూతురిని చూసేందుకు స్నేహితులతో వెళ్తుండగా ప్రమాదం మృతులంతా చిత్తూరు జిల్లావాసులు జీవనోపాధికి బెంగళూరులో నివాసం డోన్‌టౌన్/క్రిష్ణగిరి: కర్నూలు జిల్లా డోన్ పోలీసు సర్కిల్ పరిధిలోని అమకతాడు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో చిత్తూరు జిల్లావాసులు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ శ్రీహరి తెలిపిన మేరకు.. చిత్తూరు పట్టణానికి చెందిన జగదీష్, అమర్నాథ్రెడ్డి, రాజేష్ కొన్నేళ్లుగా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. జగదీష్ చిత్తూరు, బెంగళూరు, బళ్లారి తదితర ప్రాంతాల్లో గ్రానైట్, ఇతర మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. అమర్నాథ్రెడ్డి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. రాజేష్ హోటల్ క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జగదీష్‌కు హైదరాబాద్‌కు చెందిన మీనాకుమారితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. 20 రోజుల క్రితం పాప జన్మించడంతో చూసొచ్చేందుకు ఆదివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అమర్నాథ్రెడ్డికి చెందిన డస్టర్ కారు(కేఈ 51 ఎండీ 4707)లో రాజేష్‌తో కలసి బయలుదేరారు. డోన్ మండల పరిధిలోని అమకతాడు టోల్‌ప్లాజా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ప్రమాదంలో జగదీష్(35), అమర్నాథ్రెడ్డి(35), రాజేష్(35) అక్కడికక్కడే మృతిచెందారు. టోల్‌గేటు వద్దనున్న స్పీడు బ్రేకర్లే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆ ప్రాంతంలో లైట్లు లేకపోవడంతో కూరగాయల లారీ స్పీడ్ బ్రేకర్లను దాటుతుండగా.. వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతుడు అమర్నాథ్రెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా పాకాల తాలూకా మద్దినాయునిపల్లె. నాలుగేళ్ల క్రితం చంద్రగిరికి చెందిన కీర్తితో వివాహమైంది. ఈ దంపతులకు ఇరువురు సంతానం. క్యాటరింగ్ చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచిన బెంగళూరుకు చెందిన రాజేష్ మృతితో ఆయన తండ్రి పద్మనాభరెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. త్వరలో పెళ్లి చేయాలని భావి స్తున్న తరుణంలో చోటు చేసుకున్న ప్రమాదంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ డేగల ప్రభాకర్ పరిశీలించారు. టోల్‌ప్లాజా గన్‌మన్ సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీహరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీకొని బీటెక్ విద్యార్థిని దుర్మరణం
మియాపూర్: ద్విచక్రవాహనాన్ని స్టార్ట్ చేస్తే కాలేదు... దీంతో ఇంజిన్ వైపు వంగి చూస్తున్న బీటెక్ విద్యార్థినిని అంతలోనే వెనుకనుంచి దూసుకొచ్చి ఇసుక లారీ బలిగొంది. ఈ హృదయ విదారక ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కొండగట్టు గ్రామానికి చెందిన మౌనిక (18) నగరంలోని మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ ఫైనల్ చదువుతూ మియాపూర్ హెచ్ఎంసీ స్వర్ణపురికాలనీలోని పెద్దన్నాన ఇంట్లో ఉంటోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు తమ ఇంటి ముందు ఉన్న రోడ్డుపై తన ద్విచక్రవాహనాన్ని నిలిపి స్టార్ట్ చేయగా స్టార్ట్ కాలేదు. దీంతో ఆమె ద్విచక్ర వాహనాన్ని వంగి పరిశీలిస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. తీవ్రగాయాలకు గురైన మౌనికను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా... చికిత్సపొందుతూ రాత్రి 8.30కి మృతి చెందింది. పోలీసులు స్వగ్రామంలో ఉన్న మౌనిక తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ముగ్గురిని బలిగొన్న డ్రైవర్ నిద్రమత్తు
వర్ధన్నపేట రూరల్ : డ్రైవర్ నిద్రమత్తు ఘోర ప్రమాదానికి దారితీసింది. వేగంగా వెళుతున్న బొలెరో వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన వర్ధన్నపేట శివారు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై రవీందర్ కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన బొంగు వెంకట్రాం, రాధమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు సోమేశ్వర్రావు(30) బీఎస్ బ్రదర్స్ ఇంజినీరింగ్ వర్క్స్ నిర్వహిస్తూ పవర్ప్లాంట్లలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సమీపంలో నిర్మిస్తున్న ఎన్టీపీసీ పవర్‌ప్లాంట్ పనులు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఇటీవల పనులను ప్రారంభించారు. ఆ పనులను పర్యవేక్షించడానికి బీటెక్ పూర్తి చేసి తన వద్ద సూపర్వైజర్గా పనిచేస్తున్న వెప్పర్తి పుణ్యరాజు(23), డ్రైవర్ గరిగెబాటి నాగభూషణం(25), అడిగిబోయిన మనోహర్‌తో కలిసి బొలెరో వాహనంలో మండపేట నుంచి మంచిర్యాలకు ఆదివారం అర్ధరాత్రి బయల్దేరారు. దూరప్రయాణం కావడంతో ఖమ్మం సమీపంలో వాహనం ఆపి కాసేపు నిద్రించారు. సోమవారం ఉదయంలోగా మంచిర్యాలకు చేరుకోవాలనే ఆతృతతో నిద్రమత్తులోనే బయల్దేరారు. ఈ క్రమంలో వర్ధన్నపేట శివారు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో రోడ్డుపక్కన నిలిచి ఉన్న లారీని బొలెరో వాహనం వేగంగా ఢీకొంది. ప్రమాదంలో సోమేశ్వర్రావు, పుణ్యరాజు, నాగభూషణం అక్కడికక్కడే మృతిచెందగా, మనోహర్ గాయాలతో ప్రాణాలతో బయట పడ్డాడు. అతడిని హుటాహుటిన 108లో వర్ధన్నపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పంచనామా చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్సై వివరించారు. వారం రోజుల క్రితమే వాహనం కొనుగోలు పవర్ ప్లాంట్లలో కాంట్రాక్టర్‌గా పనులు చేస్తున్న సోమేశ్వర్రావు మండపేట నుంచి మంచిర్యాలకు దూరప్రయాణం కావడ ంతో వారం రోజుల క్రితమే బొలెరో వాహనాన్ని కొనుగోలు చేశారు. ఆ వాహనం వెనకభాగంలో వెల్డింగ్ మిషన్, రెండు గ్యాస్ సిలండర్లను వేసుకుని మంచిర్యాలకు బయల్దేరి ప్రమాదానికి గురయ్యారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు సంఘటన స్థలాన్ని వరంగల్ అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు మామునూరు డీఎస్పీ సురేష్‌కుమార్‌తో కలిసిపరిశీలించారు. మృతుల వివరాలు తెలుసుకున్నారు. నిద్రమత్తులో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగిందని ఎస్పీ తెలిపారు. -
నెత్తురోడిన రహదారి
ఆటోను ఢీకొట్టిన లారీ ముగ్గురు మృతి, ఏడుగురికి గాయాలు తమ్ముడికి వైద్యం చేయిద్దామని తోడు వచ్చిన అన్న....అంతలోనే అనంతలోకాల్లో కలిసిపోయాడు. ఆటో నడిపే డ్రైవర్‌కు భుక్తినిచ్చే వాహనమే మృత్యువాహనమైంది. కాసేపట్లో గ్రామానికి చేరుకోవాల్సిన వృద్ధురాలు...ఆస్పత్రిలో అసువులు బాసింది. స్థానిక బైపాస్ రోడ్డు జంక్షన్లో శనివారం జరిగిన దుర్ఘటన ముగ్గురిని బలితీసుకుంది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న లారీ అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వెళుతున్న ఆటోను ఢీకొని నుజ్జునుజ్జు చేసింది. అనకాపల్లి రూరల్: ఆటోను లారీ ఢీకొన్న దుర్ఘటనలో కొండా యశ్వం త్ (10) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో నడుపుతున్న డ్రైవర్ సహా మరో వృద్ధురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. వివరాలివి. కె.లక్ష్మి అనే మహిళ తన పది నెలల కుమారుడు నిషాం త్‌కు వైద్యానికి అనకాపల్లి వెళుతూ తోడుగా అక్క కొడుకు యశ్వంత్‌ను తీసుకెళ్లింది. నిషాంత్‌కు వైద్యం చేయించి స్వగ్రామం తిమ్మరాజుపేట వెళ్లేందుకు అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆటో ఎక్కారు. ఇదే ఆటోలో కృష్ణాపురం, తిమ్మరాజుపేట, మడుతూరు, హరిపాలెం, అచ్యుతాపురం గ్రామాలకు వెళ్లేవారు కూడా ఎక్కారు. ప్రయాణించిన కొద్ది నిమిషాలకే పూడిమడక రోడ్డు ైబైపాస్ జంక్షన్ వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణాపురానికి చెందిన ఆటోడ్రైవర్ ఎం. మారుతీరావు(54) తలకు బలమైన గాయమైంది. ఇదే గ్రామానికి చెందిన కె. వరాలమ్మ(55) రెండుకాళ్లు, చేయి తెగిపడిపోయాయి. అచ్యుతాపురానికి చెందిన ఎస్. కృష్ణ తలకు బలమైన గాయాలయ్యాయి. వారిని స్థానికులు అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ మారుతీరావు, వరాలమ్మ చనిపోయారు. కాగా హరిపాలేనికి చెందిన బి. సుశీల, జి. సరోజిని, మడుతూరుకు చెందిన బి. గణేశ్వరి అనకాపల్లి వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరిని అనకాపల్లిలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన యశ్వంత్ పిన్ని, ఆమె పది నెలల కొడుకు నిషాంత్ పట్టణంలోని తల్లీపిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యశ్వంత్ తండ్రి చెట్ల నుంచి కొబ్బరికాయలు తీసే కార్మికుడు. తల్లి బ్రాండెక్స్లో ఉద్యోగి. వీరికి 12 ఏళ్ల మరో పాప ఉంది. కేసును పట్టణ ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సును ఢీకొన్న లారీ
పెద్దాపురం రూరల్ / కాకినాడ క్రైం :ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొ న్న సంఘటనలో ఓ సొసైటీ ఉద్యోగి మరణించ గా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఏడీబీ రోడ్డులోని పుట్టగొడుగుల ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం.. రాజమండ్రి నుంచి కాకినాడ వస్తున్న ఆర్టీసీ బస్సును ఏడీబీ రోడ్డులో ఓ లారీ అదుపుతప్పి ఢీకొంది. బస్సు వెనుక సీటులో కూర్చున్న ఏడు గురికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులను పెద్దాపురం ఏరి యా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిలో ఆరుగురికి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో రం గంపేట సొసైటీ గుమస్తా వట్టికూటి వీరవెంకట రమణారావు (50) మరణించాడు. ఇంజనీరింగ్ విద్యార్థులు హెచ్.మోహన్, మురళీకృష్ణ, జి.మోహన్, ఆకాశపు మణిసాయి కుమార్, కాకినాడకు చెందిన మచ్చ వినయ్‌కుమార్, ఎస్.మల్లికార్జున్, లారీ డ్రైవర్ వాసంశెట్టి కృష్ణ పెద్దాపురం, కాకినాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పెద్దాపురం సీఐ నాగేశ్వరరావు, ఎస్సై శివకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. శుభకార్యం పిలుపునకు వెళ్తూ.. రంగంపేట : ఈ నెల 23న తమ్ముడి కుమార్తె శుభకార్యం విషయమై చెల్లెలిని ఆహ్వానించడానికి విశాఖపట్నం వెళుతూ రమణారావు మరణిం చాడు. అతడికి భార్య అనంతలక్ష్మి, కుమారులు మణికంఠ, వీరదుర్గాప్రసాద్, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయగా, మణికంఠ మచిలీపట్నంలోను, వీరదుర్గాప్రసాద్ గైట్ కళాశాలలోను చదువుతున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
హాలియా: మండలంలోని ఇబ్రహీంపేట శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ భోజ్యనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన గాడిపర్తి మురళీ(48) ఆదివారం ఉదయం ఇంటి నుంచి పొలం వద్దకు వెళ్తున్నాడు. ఇబ్రహీంపేట శివారులో రోడ్డు దాటుతుండగా నల్లగొండ నుంచి హాలియా వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొట్టింది. తీవ్రగాయాలైన మురళీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూ తుళ్లు ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలిని పరిశీ లించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చౌటుప్పల్: ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలి పి న వివరాల ప్రకారం కృష్ణా జిల్లా నందిగామ నుంచి హైదరాబాద్‌కు ఇనుప లోడుతో వెళ్తున్న లారీ చౌటుప్పల్ మండలం ఎల్లగిరి క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు పక్క న ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగర్‌కు చెందిన క్లీనర్ పాములపర్తి కోటేశ్వర్రావు(52) అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పూసల యేసు(30), కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన కూలి ఖాజా(36) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలాని కెళ్లి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ భూపతి గట్టుమల్లు తెలిపారు. -
పాణమున్నా.. బొమ్మే!
విధి వెక్కిరించింది. ఆ కుటుంబం వెన్ను విరిచింది. రెక్కలొచ్చిన కొడుకు.. తన రెక్కల కష్టంతో తన పేద కుటుంబాన్ని కొంతైనా ఆదుకోవాలని భావిస్తే.. అతన్ని రెక్కలు విరిచి జీవచ్ఛవాన్ని చేసింది. మంచానికి కట్టి పడేసింది. లారీ రూపంలో విధి జరిపిన దాడిలో చెట్టంత కొడుకు మృత్యుముఖంలోకి వెళ్లాడు. తల్లడిల్లిన తల్లిదండ్రులు దాతల కరుణతో కొడుకు ప్రాణాలు నిలపగలిగారు గానీ.. అతన్ని మంచం నుంచి దించలేకపోయారు. లక్షల రూపాయలు పెట్టి చికిత్స చేయించడం తమ తలకు మించిన పని అని రోదిస్తున్నారు. పాలకొండ రూరల్: 2014, జనవరి 12.. ఓ కుర్రాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో ఒక లారీ భూతంలా దూసుకొచ్చి అతని పైనుంచి వెళ్లిపోయింది. అంతే పనికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆ కుర్రాడు ఆస్పత్రిపాలయ్యాడు. దాంతో ఆ కుటుంబం కష్టాలు ప్రారంభమయ్యాయి. పాలకొండ పట్టణం గురువుగారి వీధికి చెందిన సోమరిపేట దుర్గారావుది నిరుపేద కుటుంబం. కులవృత్తిపైనే ఆధారపడిన ఆయన రెక్కల కష్టంతో కొడుకు శివప్రసాద్‌ను ఉన్నత చదువులు చెప్పించాలన్న లక్ష్యంతో డిగ్రీ వరకు చదివించాడు. ఇంతకాలం తన చదువు కోసం అష్టకష్టాలు పడిన తండ్రికి కొంతైన చేదోడువాదోడుగా ఉందామన్న ఉద్దేశంతో శివప్రసాద్ మరింత ఉన్నత చదువులకు ప్రయత్నిస్తూనే స్థానిక బట్టల షాపులో పనిలో చేరాడు. తానొకటి తలస్తే.. దైవం మరొకటి తలచినట్లు.. జనవరి 12న పని చేస్తున్న దుకాణానికి వెళుతున్న అతన్ని వెనుక నుంచి వచ్చిన లారీ పైనుంచి దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో పడిన కొడుకును రక్షించికోవడానికి తల్లిదండ్రులు నానా అవస్థలు పడ్డారు. దాతల సాయంతో లక్ష రూపాయలకుపైగా వైద్య చికిత్సలకు ఖర్చు చేసి ప్రాణాలు నిలబెట్టగలిగారు. మంచం మీదే అన్నీ.. ప్రాణమైతే దక్కింది గానీ.. లేచి నిలబడ లేక, నడవలేక శివ జీవచ్ఛావంలా మారాడు. మంచానికే పరిమితమయ్యాడు. ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు కొన్ని నెలలుగా మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం వెన్ను విరిగినట్టయింది. చికిత్సకు ఇప్పటికే దాతల సాయంతోపాటు చేతిలో ఉన్న డబ్బంతా కరిగిపోయింది. కదలలేని స్థితిలో ఉన్న కొడుక్కి సపర్యలతో పాటు అన్ని అవసరాలు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వారు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. శివను తిరిగి ఆరోగ్యవంతుడిగా నిలబెట్టడానికి అవసరమైన చికిత్స కోసం వైద్యులను ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, దానికి రూ.6 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వారు చెబ్బడంతో తల్లిదండ్రులు కుంగిపోయారు. కులవృత్తి, కూలి పనులు చేస్తే తప్ప కడుపు నిండని స్థితిలో అంత సొమ్ము ఎక్కడి నుంచి తేగలమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగని కొడుకు దుస్థితి చూడలేక కన్నీరుమున్నీరవుతున్నారు. మనస్సున్న మారాజులు స్పందించి ఆర్థికంగా చేయూతనిస్తే కొడుకు జీవితంతోపాటు.. తమ కుటుంబాన్ని నిలబెట్టినవారవుతారని ఆశగా ప్రార్థిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం
రెండు లారీలు ఢీ చెళ్లకెర రూరల్ : శుక్రవారం తెల్లవారు జామున శ్రీరంగపట్టణం-బీదర్ రాష్ట్ర ప్రధాన రహదారిలో రెండు లారీల ఢీకొన్నరోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. ప్లాస్టిక్ సంచులను నింపుకుని చెళ్లకెర నుంచి బళ్లారి వైపు వెళుతున్న లారీ, బళ్లారి నుంచి హిరియూరు వైపు వస్తున్న బియ్యం లోడ్ లారీ ఎదురెదురుగా అతివేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు ప్లాస్టిక్ సంచుల లారీ వంతెన పైనుంచి రెయిలింగ్‌ను ఢీకొని కిందకు పడింది. రెండు లారీల ముందు భాగం నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో మొళకాల్మూరు తాలూకా దేవసముద్ర గ్రామానికి చెందిన మంజునాథ్ (35), గాదిలింగప్ప(40), రాయచూరు జిల్లాకు చెందిన ఖలీల్‌బాషా(30), కబీర్(35), రుక్ముద్దీన్(33) మరణించారు. తీవ్ర గాయాలైన సాదిక్‌బాషాను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. తళకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ రవికుమార్, అడిషనల్ ఎస్పీ శాంతకుమార్, డీఎస్పీ శేఖరప్ప,సీఐ సమీవుల్లా పరిశీలించారు. అమావాస్య అంటే భయం.. భయం ప్రతి నెల అమావాస్య ముందు లేదా వెనుక రోజు తళకు, గిరణిక్రాస్‌ల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో జనం వణికిపోతున్నారు. శుక్రవారం మళ్లీ అమావాస్య రోజునే ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు ఈ ప్రాంతంలో ైబె కుల్లో ప్రయాణించేందుకు భయపడుతున్నారు. -
ఇంటిలోకి దూసుకెళ్లిన లారీ
కోవెలకుంట్ల : సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఇంటిలోకి దూసుకెళ్లడంతో హరికిషన్‌రెడ్డి(13) మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని కోవెలకుంట్ల- బనగానపల్లె ఆర్అండ్బీ రహదారిలో ఆదివారి అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. శివ స్పోర్స్ యజమాని సుబ్బారెడ్డి ఆర్అండ్బీ రహదారి పక్కన ఉన్న ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి కుటుంబ సమేతంగా భోజనం చేసి వరండాలో మంచాలు వేసుకుని నిద్రకు ఉపక్రమించారు. బనగానపల్లె వైపు నుంచి సిమెంట్ బస్తాల లోడ్‌తో వస్తున్న టీఎన్ 23 బీఎఫ్ 8592 అను నంబర్ గల లారీ కోవెలకుంట్లవైపు అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి సుబ్బారెడ్డి ఇంటిలోకి దూసుకొచ్చింది. దీంతో రెండు మంచాలపై నిద్రిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులపై ఇంటి గోడ రాళ్లు, దంతెలు విరిగి పడటంతోపాటు లారీ రెండు మంచాలను నుజ్జునుజ్జు చేసింది. సుబ్బారెడ్డి కుమారుడు హరి కిషన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా ఆయనతో పాటు భార్య కవిత, మరో కుమారుడు రఘురామిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. లారీ ఇంటిలోకి దూసుకెళ్లడం, పెద్ద శబ్ధం రావడం, క్షతగాత్రులు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు హుటాహుటినా అక్కడికి చేరుకుని గోడ రాళ్లు, దంతెలను తొలగించి అందులో ఇరుక్కపోయిన వారిని బయటకు తీశారు. అప్పటికే హరికిషన్‌రెడ్డి మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 వాహనంలో కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుబ్బారెడ్డి భార్య, కుమారుడికి స్థానిక ఆసుపత్రిలో ప్రాథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా వాహనాన్ని నడపడంతోనే ఈ దారుణం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలం నుంచి లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. ఈ సంఘటనతో కోవెలకుంట్లలో విషాదం నెలకొంది. మృతి చెందిన హరికిషన్‌రెడ్డి జిల్లా మిల్క్‌డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డికి మనవడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్బరాయుడు పేర్కొన్నారు. -
నిద్రిస్తున్న కార్మికులపై దూసుకెళ్లిన లారీ
ముగ్గురు బీహార్‌వాసుల మృతి సుల్తానాబాద్ : లారీ క్లీనర్ నిర్లక్ష్యం మూడు నిండుప్రాణాలను బలిగొంది. రివర్స్‌లో వచ్చిన లారీ నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లడంతో వారు మృత్యువాతపడ్డారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో శనివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. బీహార్ రాష్ట్రం మస్తాపూర్ జిల్లా రోసేరా మండలం కల్యాణ్‌పూర్‌కు చెందిన 15 మంది కార్మికులు వారం క్రితం రైస్‌మిల్లులో పనిచేసేందుకు వచ్చారు. శుక్రవారం పని ముగిసిన తర్వాత భోజనాలు చేసి మిల్లు ఆవరణలో అందరూ ఒకే చోట వరుసగా పడుకున్నారు. అర్ధరాత్రి 2.15 గంటల ప్రాంతంలో మేడిపల్లిలోని ఐకేపీ సెంటర్ నుంచి ఓ లారీ మిల్లుకు ధాన్యం తీసుకొచ్చింది. హనుమాన్ దీక్ష స్వీకరించిన డ్రైవర్ మాలవితరణకు వెళ్లగా, క్లీనర్ సాయిలుకు లారీని అప్పగించాడు. అతడు నిద్రిస్తున్న కార్మికులను గమనించకుండా లారీని రివర్స్ తీసుకోవడంతో వెనుక చక్రాల కింద నలిగి దీప్‌సదా(20), శ్యాంసుందర్ సదా(25), సుకేందర్‌సదా(22) మృతిచెందారు. -
లారీ, ఆర్టీసీ బస్సు ఢీ
రంగంపేట, న్యూస్‌లైన్ :ఏడీబీ రోడ్డుపై రంగంపేట ఎస్టీకాలనీలోని రైస్‌మిల్లు ఎదురుగా శనివారం ఉదయం సుమారు 8 గంటలకు లారీ, ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కుడికాలు విరిగిపోగా, బస్సులోని 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కాకినాడ నుంచి రాజమండ్రి వస్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు, రాజమండ్రి నుంచి పెద్దాపురం వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ వైపు భాగం నుజ్జునుజ్జయ్యింది. కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం ముజ్జెనపల్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గంటా రాంబాబు కుడికాలు రెండుచోట్ల విరిగిపోయింది. ఎడమకాలికి స్వల్పగాయమైంది. అతడు సుమారు గంటకు పైగా లారీ కేబిన్‌లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు. లారీ క్లీనర్ స్వల్పగాయంతో బయటపడ్డాడు. రంగంపేట ఎస్సై ఆర్.అంకారావు సంఘటన స్థలానికి చేరుకుని ప్రొక్లెయిన్‌తో లారీడ్రైవర్‌ను బయటకు తీయించి, 108 వాహనంలో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే లారీకి అతుక్కుపోయిన ఆర్టీసీ బస్సును కూడా ప్రొక్లెయిన్ సాయంతో విడదీశారు. గాయాలపాలైన ప్రయాణికులను రాజమండ్రి, కాకినాడ, పెద్దాపురం ఆస్పత్రులకు త రలించారు. బస్సు డ్రైవర్ కాకినాడ డిపోకు చెందిన కొండా కోదండ రాముడుతో పాటు ప్రయాణికులు కాకినాడకు చెందిన గవర్చంద్జైన్, ద్రాక్షారపు వీర్రాజు,నూకరత్నం, వీరనరేష్, పొన్నాడ వెంకట సూర్యగణేష్, నాగమణి, వాడపల్లి తేజశ్రీ, శేషసత్యరాగవేణి తదితరులకు స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆర్టీసీ డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూ బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు చె బుతున్నారు. -
రెప్పపాటులో పెనువిషాదం
తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం లారీ, బస్సు డ్రైవర్లతో పాటు మహిళ దుర్మరణం రాజమండ్రి , న్యూస్‌లైన్ : అర్ధరాత్రి... బస్సులోని ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉన్నారు. డ్రైవర్‌కు నిద్రమత్తు ఆపుకోలేక రెప్పవాల్చాడు.. ఆ రెప్పపాటు కాలంలోనే ఆపద ముంచుకొచ్చింది. డివైడర్ పైనుంచి దూసుకుపోయిన బస్సు రోడ్డుకు అవతలివైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. 16వ నంబర్ జాతీయ రహదారిపై తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లా కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుంచి 36 మంది ప్రయాణికులతో భద్రాచలం బయలుదేరింది. మురారి గ్రంథాలయం సమీపానికి వచ్చేసరికి ఆర్టీసీ బస్ డ్రైవర్ కునికిపాటుకు లోనయ్యాడు. అతడు రెప్పవాలడంతో బస్సు అదుపు తప్పి డివైడర్ పైనుంచి రోడ్డు అవతలివైపు దూసుకెళ్లింది. పంచదార లోడుతో విశాఖపట్నం వైపు వెళుతున్న లారీని అతి వేగంగా ఢీకొంది. లారీ ముందు భాగంలోకి బస్సు డ్రైవర్ క్యాబిన్ వరకు దూసుకుపోవడంతో రెండు వాహనాలు నుజ్జయ్యాయి. ఏం జరిగిందో కూడా తెలియని బస్సు ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ముందు నుంచి బస్సు దిగే దారిలేకపోవడంతో అందరూ లోపలే చిక్కుకుపోయారు. గ్రామస్తులు, హైవే నిర్వహణ సిబ్బంది వెనుక అద్దాలను పగులగొట్టి ప్రయాణికులను బయటకు లాగారు. లారీని నడుపుతున్న క్లీనర్ అట్టా రోణిరాజు (22) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్, ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మూడు 108 అంబులెన్సుల్లోను, ఒక రాజకీయ పార్టీ ప్రచార వాహనంలోనూ రాజానగరం జీఎస్‌ఎల్‌కు, రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కశింకోటకు చెందిన పొనకంపల్లి రమ్యకృష్ణ (25) బుధవారం ఉదయం మృతిచెందింది. ఖమ్మంలోని అత్తింటికి వెళ్లేందుకు ఆమె ఈ బస్సు ఎక్కింది. అలాగే ఆర్టీసీ బస్ డ్రైవర్ సులేమాన్ బేగ్‌ను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుంటే మార్గమధ్యంలో మృతి చెందాడు. పెద్దాపురం సీఐ నాగేశ్వరరావు, జగ్గంపేట ఎస్సై సురేష్‌బాబు, సిబ్బంది, హైవే మెయింటెనెన్స్ సిబ్బంది, గ్రామస్తులు సంఘటన స్థలం వద్ద సహాయ కార్యక్రమాలు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం
ఓ మెడికల్ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయూలు ఆగి ఉన్న లారీని కారుఢీకొనడంతో ప్రమాదం మరో ఇద్దరికి స్వల్ప గాయాలు బాధితులంతా వైద్య విద్యార్థులే మడికొండ/ఎంజీఎం, న్యూస్‌లైన్ : సరదాగా ఐదుగురు మెడికల్ విద్యార్థులు కలిసి విహారానికి బయల్దేరగా వారి ప్రయూణం విషాదంతమైంది. ఆగి ఉన్న లారీని ఢీకొని ఓ మెడికల్ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన వరంగల్ నగర శివారు మడికొండ పెట్రోల్‌పంప్ వద్ద సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు, క్షతగాత్రుల కథనం ప్రకారం... వరంగల్ కాశిబుగ్గకు చెందిన వైద్యులు డాక్టర్ టి.భాస్కర్, శోభారాణి దంపతుల కుమార్తె చైతన్యశ్రీ(24), ఎంజీఎం యూరాలజిస్టు డాక్టర్ సురేందర్ కుమార్తె పూజిత, జనగామ వ్యాపారవేత్త నర్సింహారెడ్డి కుమార్తె సుష్మ, దుబాయ్‌కి చెందిన నజియా కరీంనగర్ జిల్లా ప్రతిమ మెడికల్ కళాశాలలో హౌస్‌సర్జన్ నాలుగో సంవత్సరం పూర్తి చేశారు. వీరంతా ఆదివారం వరంగల్ కేఎంసీ, నిట్‌లో నిర్వహించిన మెడికల్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం అంతా కలిసి హన్మకొండ హంటర్‌రోడ్డులోని వనవిజ్ఞాన కేంద్రం(జూ పార్కు)కు వెళ్లారు. అరుుతే జూ పార్క్ మూసి ఉండడంతో హైదరాబాద్‌కు వెళ్దామని బయల్దేరారు. కారు మడికొండలోని పెట్రోల్‌పంప్ సమీపంలోకి రాగానే డ్రైవింగ్ చేస్తున్న చైతన్యశ్రీ తమ్ముడు ఉదయ్‌రాజ్ షూ క్లచ్, గేర్ మధ్య ఇరుక్కుంది. దీంతో కాలిని పైకి తీసే క్రమంలో కారు అదుపుతప్పి అక్కడే ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో చైతన్యశ్రీ అక్కడి కక్కడే కారులో మృతిచెందగా పూజిత, నజియా తీవ్రంగా గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. మృతురాలు చైతన్యశ్రీ ఎడమ చేయి పూర్తిగా తెగి దూరంగా పడిపోయింది. మడికొండ సీఐ నందిరాంనాయక్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో, ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి పంపించారు. ప్రమాద స్థలాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్‌కు అంత రాయం ఏర్పడడంలో పోలీసులు వన్‌వేలో వాహనాలను పంపించారు. స్వల్పగాయాలైన సుష్మ, హృదయ్‌రాజ్ నుంచి సీఐ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమచారమిచ్చారు. అతివేగమే ప్రమాదానికి కారణమా.. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనం వెనుకాలే వస్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఆగిపోయారు. ప్రమాద సమయంలో కారు వేగం 120 స్పీడ్‌తో ఉన్నట్లు తెలుస్తోందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉదయ్‌రాజ్ కాకతీయ మెడికల్ కళాశాలలో(కేఎంసీ)లో సెకండయరీ చేస్తున్నాడు. బాధితులను డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్, ఆర్ఎంఓ నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తోపాటు పెద్దఎత్తున వైద్యులు తరలివచ్చి పరామర్శించారు. -
పెళ్లికెళ్తుండగా ప్రమాదం
గదగ్(బళ్లారి), న్యూస్‌లైన్ : రహదారి నెత్తరోడింది. వరుడితో కలిసి ఆనందోత్సాహాల మధ్య వివాహానికి బయల్దేరిన వారిలో కొంతమందిని దారి మధ్యలోనే వృుత్యువు కబలించింది. మరికొందరిని క్షతగాత్రులగా మార్చింది. గదగ్ జిల్లా ముండరగి తాలూకా డంబళ్ గ్రామ శివార్లలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. పెళ్లి కుమారుడితో సహా 20 మంది గాయపడ్డారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు... బళ్లారి జిల్లా హడగలి తాలూకా కందగల్లపుర గ్రామంలో బుధవారం సామూహిక వివాహాలు తలపెట్టారు. డంబళ్ గ్రామానికి చెందిన పెళ్లికుమారుడు నీలకంఠ , మల్లమ్మ సామూహిక వివాహాల్లో ఒక్కటయ్యేందుకు పేర్లు నమోదు చేయించుకున్నారు. ఈ మేరకు పెళ్లి కుమారుడు, అతని సమీప బంధువులు బుధవారం ఉదయం ట్రాక్టర్లో వివాహ వేదిక వద్దకు బయల్దేరారు వాహనం గ్రామ శివార్లు దాటి డంబళ-మేవుండి జాతీయ రహదారిపైకి చేరగానే గదగ్ వైపు నుంచి వచ్చిన లారీ ఆ ట్రాక్టర్‌ను వెనుకవైపు నుంచి వేగంగా ఢీకొంది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్నవారందరూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. రోణ తాలూకా అబ్బిగేరి గ్రామానికి చెందిన ప్రశాంత్ కెంగార్(6), సజ్జన్ కెంగార్(2), హడగలి తాలూకా మాగళ గ్రామానికి చెందిన సంజన సంకమ్మనవర్, సుదీప్(6), గదగ్ జిల్లా నాగసముద్ర గ్రామానికి చెందిన రేణుకా(26), ముత్తప్ప(30), రేణుకా(22), కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకా మంగళూరు గ్రామానికి చెందిన హనుమంతప్ప పూజార్(35), అన్నపూర్ణ(35), మరొక గుర్తు తెలియని బాలుడు ఘటనా స్థలంలోనే మరణించారు. గాయపడిన 20 మందిని డంబళ్ ఆస్పత్రి, గదగ్ జిల్లా ఆస్పత్రి, హుబ్లీ కిమ్స్ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరగ్గానే లారీ డ్రైవర్, క్లీనర్ ఉడాయించారు. శిరహట్టి ఎమ్మెల్యే రామకృష్ణ దొడ్డమని, రోణ ఎమ్మెల్యే బీఎస్ పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులకు చికిత్స వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందని, వృుతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి పరిహార నిధి నుంచి తగిన పరిహారం అందించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఎస్డీ శరణప్ప, జిల్లాధికారి ఎన్ఎస్ ప్రసన్నకుమార్ తదితరులు పరిశీలించారు. లారీని వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనపై ముండరగి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో 8 మంది దుర్మరణం
= షేర్ ఆటోను ఢీకొన్న లారీ = ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సహా 8 మంది మృతి = లారీ డ్రైవర్ ఓవర్టేక్ చేసేందుకు యత్నించడం వల్లే ఘటన బెంగళూరు, న్యూస్‌లైన్ : లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సహా ఎనిమిది మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఈ ఘోర ఉదంతం ఆదివారం బీజాపుర జిల్లా, దేవరహిప్పగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీదర్- శ్రీరంగ పట్టణం జాతీయ రహదారిలోని బడేనహళ్లి గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... సింధగి తాలుకా దేవరహిప్పగి నుంచి 13 మంది షేర్ ఆటోలో సింధగికి బయల్దేరారు. బడేనహళ్లి వద్ద ఎదురుగా వచ్చిన లారీని దానివెనుకే వస్తున్న మరో లారీ డ్రైవర్ ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించి అదుపు తప్పి ఆటోను ఢీకొట్టాడు. దీంతో లారీ, ఆటో రోడ్డు పక్క పల్లంలోకి దూసుకెళ్లి బోల్తా పడ్డాయి. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న దేవరహిప్పగిరి గ్రామానికి చెందిన నబిలాల్ ఇమామ్‌సాబ్ (55), ఖాజాబీ (45), లతీఫ్ నబిసాబ్ (20) (వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు), కానిస్టేబుల్ బసవరాజ్ (40), గంగాబాయి (45), రక్షిత (8), దౌలత్ (10)తోపాటు మరొకరు వృుతి చెందగా మరో ఐదుగరు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను, మృతదేహాలను సింధగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ ఉడాయించారని, ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఔటర్‌పై మృత్యుఘోష
=మృత్యు మార్గంగా ఔటర్ రింగ్‌రోడ్డు =తుక్కుగూడ వద్ద ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం =మృతులంతా మహారాష్ట్ర వాసులు =ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఘటన =పొగమంచే ప్రమాదానికి కారణమని అనుమానం =సూచిక బోర్డులు లేకపోవడమే కారణం! =నియంత్రణ లోపం.. పర్యవేక్షణ కరువు =ఈ ఏడాది ఇప్పటికి 65 మంది బలి సాక్షి, సిటీబ్యూరో: రహదారులు నెత్తురోడుతున్నాయి. ప్రత్యేకించి ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాణాలు తోడేస్తోంది. ఈ రోడ్డెక్కితే బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన దుస్థితి. ప్రాణాలకు భద్రత, భరోసా లేకుండాపోతోంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా రెప్పపాటులో మృత్యువాత పడే పరిస్థితి నెలకొంది. రోజుకో ప్రమాదంతో ఔటర్ రక్తసిక్తమవుతోంది. శుక్రవారం ఉదయం తుక్కుగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రయాణికుల్లో భయాన్ని రెట్టింపు చేసింది. మహారాష్ట్ర భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు ఘట నా స్థలంలోనే మృత్యుఒడికి చేరుకోగా, నలుగురు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. ఉసురుతీస్తున్న ఉదాసీనత ప్రభుత్వ విభాగాల ఉదాసీనత ప్రమాదాల రూపంలో ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్ఆర్)ను నిత్యం రక్తసిక్తం చేస్తున్నాయి. పలువురు ప్రముఖులతో సహా అనేక మందికి గుండెకోతను మిగుల్చుతున్నాయి. ఈ మార్గం నిర్వహణ సక్రమంగా లేకపోవడం, నెలలు గడుస్తున్నా భద్రత చర్యల అంశం కొలిక్కిరాకపోవడంతో ఓఆర్ఆర్పై నిషేధిత వాహనాలు, సర్వీస్ రోడ్లపై జంతువులు రాజ్యమేలుతూ ప్రాణాలు హరిస్తున్నాయి. ఇక, కుర్రకారు క్రేజీగా ఓఆర్ఆర్కు వెళ్తూ మృత్యువును కౌగిలించుకుంటున్నారు. ప్రస్తుతానికి సిద్ధమైన ఓఆర్ఆర్ మార్గంలో 12 కూడళ్లు మృత్యు కేంద్రాలుగా మారాయి. ప్రస్తుతం పటాన్చెరు నుంచి శంషాబాద్ మీదుగా పెద్ద అంబర్‌పేట వరకు 85.5 కిమీ మేర ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయింది. దీంతో ఈ మార్గంలో హెచ్ఎండీఏ దశల వారీగా వాహనాల రాకపోకల్ని అనుమతించింది. ఇంకా కొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్నా ఆ విషయాన్ని తెలిపే సూచికలు లేవు. అడ్డదిడ్డంగా అక్రమ పార్కింగ్స్ నిర్వహిస్తున్నా పట్టించునే వారే కరవయ్యారు. గత మూడేళ్లలో ఔటర్‌పై 137 ప్రమాదాలు జరగగా, 173 మంది దుర్మరణం పాలయ్యారు. ఒక్క ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు 65 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. పొగమంచే ప్రాణాలు తీసిందా? మహారాష్ట్రకు చెందిన తొమ్మిది మందితో కూడిన బృందం గురువారం బాంద్రా జిల్లా తిరోడా తాలుకా భూత్నాథ్ నుంచి తిరుపతికి బయల్దేరింది. శుక్రవారం తెల్లవారుజామున వీరు ఔటర్‌పైకి చేరుకున్నారు. ముంబై జాతీయ రహదారిలో వచ్చిన వీరు పటాన్చెరు వద్ద ఔటర్ రింగురోడ్డు ఎక్కారు. శంషాబాద్‌లో ఔటర్ దిగి బెంగళూరు హైవే మీదుగా వెళ్లాలి. కానీ పొరపాటున ఔటర్‌రింగ్ రోడ్డు మీదుగా అలాగే ముందుకు దాదాపు 15 కిలోమీటర్లు వచ్చేశారు. తుక్కుగూడ దగ్గర ఔటర్ దిగే వీలున్నా గమనించలేకపోయారు. ఈ క్రమంలోనే వేగంగా వెళ్తున్న వీరి వాహనం తుక్కుగూడ - రావిర్యాల మధ్యలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో వాహనం ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. శంషాబాద్, పహడీషరీఫ్ పోలీసులు, తుక్కుగూడ, రావిర్యాల గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి పొగమంచే కారణమని పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పొగమంచు దట్టంగా అలుముకుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. రోడ్డుపై ఎక్కడా సరైన సూచిక బోర్డులు లేవు. దీంతోనే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ఎక్కాల్సిన, దిగాల్సిన చోట బోర్డులు లేక వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. ప్రాణాపాయస్థితిలో క్షతగాత్రులు ప్రమాదంలో గాయపడిన నలుగురు క్షతగాత్రులను 108 వాహనంలో ఎల్బీనగర్ యశోదరానగర్లోని మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో తలకు తీవ్ర గాయమైన యుగంధర్‌ను అపోలోకు తీసుకెళ్లారు. ప్రభాబాయి తుంటి, చాతి, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలి పారు. సుఖ్‌దేవ్‌కు పక్కటెముకలు విరిగాయి. ఊపిరితిత్తుల్లో గాయాలు కావడంతో శ్వాస కష్టంగా తీసుకుంటున్నాడు. డ్రైవర్ మనోజ్ తలకు, కుడిచేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద బాధితులు షాక్‌కు గురయ్యారని ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. చలి తీవ్రంగా ఉండడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, ఐసీయూలో ఉంచి వెంటిలెటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
ద్రాక్షారామ, న్యూస్‌లైన్ : అదుపుతప్పిన లారీ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రామచంద్రపురం మండలం అంబికపల్లి అగ్రహారం వద్ద శనివారం ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రయాణికులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కాకినాడ నుంచి రామచంద్రపురం వైపు వస్తోంది. అదే సమయంలో రామచంద్రపురం వైపు నుంచి కాకినాడకు వెళుతున్న సుద్ద లోడు లారీ అంబికపల్లి అగ్రహారం వద్దకు వచ్చేసరికి అదుపుతప్పింది. ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. బస్సులో ప్రయాణిస్తున్న 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108లో రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో యానాం, ద్రాక్షారామ, రామచంద్రపురం, కాకినాడ, ఆలమూరు మండలం గుమ్మిలేరు ప్రాంతాలకు చెందిన కె.గోపాలకృష్ణ, పి.ఉదయప్రవీణ , టీఎస్ దీక్షితులు, పిల్లి సత్యనారాయణ, సలాది శ్రీరామారావు, వడ్డీ గంగారావు, శీలమంతుల రాఘవ, శీలమంతుల రాంబాబు, పెచ్చెట్టి సర్వేసు. డి.రాజేష్, సూరంపూడి లోవరాజు, లారీ డ్రైవర్ ముదిగొండ యాదయ్య ఉన్నారు. వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. రామచంద్రపురం సీఐ ఎం.వెంకటేశ్వర్లు క్షతగాత్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. రామచంద్రపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
దోసకాయలపల్లి (మధురపూడి), న్యూస్‌లైన్ : చుట్టుపుచూపుగా అత్తవారింటికి వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కోరుకొండ మండలంలోని బూరుగుపూడి గేట్-దోసకాయలపల్లి రోడ్డులో సోమవారం ఊక లారీ ఢీకొన్న సంఘటనలో ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి చెందిన రాపా శ్రీను (30) చనిపోయాడు. కోరుకొండ ఎస్సై బి.వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. శ్రీను తన భార్యాబిడ్డలతో ఆదివారం దోసకాయలపల్లిలోని అత్తవారింటికి వచ్చాడు. సోమవారం మధ్యాహ్నం ఓ శుభకార్యంలో పాల్గొని, భార్యాబిడ్డలతో సొంత ఊరికి వెళ్లాల్సి ఉంది. ఇలాఉండగా సోమవారం ఉదయం ఓ యువకుడితో కలిసి మోటార్ బైక్‌పై శ్రీను కోరుకొండ వచ్చాడు. తిరిగి దోసకాయలపల్లికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. బైక్‌పై ఉన్న యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడగా, శ్రీను పైనుంచి లారీ వెనుక చక్రాలు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కూలీ పని చేసే శ్రీను చుట్టుపుచూపుగా వచ్చి.. తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో దోసకాయలపల్లిలోని అత్తవారిల్లు విషాదంలో మునిగిపోయింది. కోరుకొండ ఎస్సై బి.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బైకును ఢీకొన్న లారీ: యువకుడికి గాయాలు
తాండూరు రూరల్, న్యూస్‌లైన్:ఎదరుగా వస్తున్న లారీ బైకును ఢీకొనడంతో ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని చంద్రవంచ గేటు సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. చంద్రవంచ గ్రామానికి చెందిన అఖిలేశ్వర్‌రెడ్డి(20) కర్ణాటక సమీపంలోని సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుడు. ఆదివారం అతడు బైకుపై కరన్‌కోట్ నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. చంద్రవంచ గేటు సమీపంలో ఎదురుగా వస్తు న్న పెన్నా సిమెంట్ కంపెనీకి చెంది న లారీ అతడి బైకును ఢీకొంది. దీంతో కిందపడిపోయిన అఖిలేశ్వర్‌రెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికు లు చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుం బీకులు అతడిని నగరంలోని ఉస్మానియాకు తీసుకెళ్లారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
ఘోర రోడ్డు ప్రమాదం
కొణకంచి క్రాస్‌రోడ్స్(పెనుగంచిప్రోలు), న్యూస్‌లైన్ : మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొణకంచి క్రాస్‌రోడ్స్ వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. నందిగామ వైపు నుంచి జగ్గయ్యపేటకు 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటో, జగ్గయ్యపేట వైపు నుంచి కొణకంచి గ్రామంలోకి వెళ్లేందుకు రోడ్డును క్రాస్ చేస్తున్న లారీ మధ్యలోకి దూసుకుపోయి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలో ఆటోలో ప్రయాణిస్తున్న నందిగామకు చెందిన చవట వీరభద్రరావు(69)అనే వ్యాపారి తలకాయ పగిలి మృతి చెందాడు. అలాగే నందిగామ మండలం ఐతవరంకు చెందిన సూరబోయిన పద్మ, సాయికృష్ణ, లింగబోయిన వెంకటేశ్వరరావు, చుండు హనుమంతరావు, సుబ్బారావు, సామ్రాజ్యమ్మ, జగ్గయ్యపేట మండలం గౌరవరానికి చెందిన పఠాన్ నాగుల్‌మీరా, తిరుపతికి చెందిన దొండపాటి నారాయణమూర్తితో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదేళ్ల సాయితో పాటు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరభద్రరావు మృతదేహాన్ని నందిగామ ఆస్పత్రికి పోస్టుమార్టమ్ కోసం తరలించగా, స్థానిక ఎస్ఐ ఏ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొని దంపతులు మృతి
జగిత్యాల, న్యూస్‌లైన్ :శుభకార్యానికి వెళ్లి సంతోషంగా ఇంటికి తిరుగుపయణమైన భార్యభర్తలను మృత్యువు కబలించింది. ద్విచక్రవాహనంపై వస్తూ ఆగి ఉన్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరి గింది. ఈ ఘటనలో దంపతులు చనిపోగా.. వారి మనవరాలు గాయపడింది. మేడిపల్లి మండలం కట్లెకుంట గ్రామానికి చెందిన ఉప్పులూరి గంగరాజం(50), అతడి భార్య రాజవ్వ(48) జగిత్యాల మండలం పొలాస గ్రామంలోని బంధువుల ఇంట్లో మంగళవా రం జరిగిన శుభ కార్యానికి హాజరయ్యారు. తమ మనవరాలు సాత్వికతో కలిసి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. జగిత్యాల-నిజామాబాద్ రోడ్డులో రిలయన్స్ పెట్రోల్‌బంకు సమీపంలో అగి ఉన్న లారీని ఢీకొట్టా రు. గంగరాజం, ఆతడి భార్య రాజవ్వ అక్కడిక్కడే మృతి చెందారు. సాత్వికకు గాయాలు కాగా, ఆమెను కరీంనగర్ కు తరలించారు. వీరి వెనుకే బైక్‌పై వస్తున్న కుమారుడు వెంకటేశ్ బంధువులకు సమాచారం అందించాడు. సీఐ కిరణ్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. లారీలో షాబాదు రాళ్లుండగా.. డ్రైవర్ కనిపించలేదు. గంగరాజం గల్ఫ్ దేశాలకు వెళ్తూ.. వస్తుంటారు. ఆయన ఇటీవలే స్వగ్రామానికి వచ్చినట్లు తెలిసింది.