
లారీ ఢీకొని యువకుడు మృతి
రాజమండ్రి రూరల్: లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్తానికుల కధనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి... మండలంలోని లాలా చెరువు సమీపంలోని స్పిన్నింగా మిల్లు వద్ద బత్తిన నగర్ కు చెందిన సూరిబాబు(23) రోడ్డు పక్కన నడుస్తుండగా లారీ ఢీకొట్టింది.
బాధితుడి పై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారైయ్యాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరిలించారు. కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలింపు చేపట్టారు.