Rajamandry
-
రాజమండ్రిలో దివ్యాంగులకు నాట్స్ చేయూత
దివ్యాంగులకు చేయూత అందించడంలో నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి అన్నారు. రాజమండ్రిలో దివ్యాంగులైన సునీత, ఏసులు స్వయం ఉపాధి పొందేందుకు కావాల్సిన సహకారాన్ని నాట్స్ అందించిందని తెలిపారు. దివ్యాంగ దంపతులు సునీత, ఏసుల చేత కిరాణా దుకాణాన్ని హోఫ్ ఫర్ స్పందనతో కలిసి పెట్టించారు. ఈ దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులకు నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను బాపు నూతి వివరించారు. హోప్ ఫర్ స్పందన దివ్యాంగుల కోసం చేస్తున్న కృషిలో నాట్స్ కూడా కీలక పాత్ర పోషించడం తమకు దక్కిన అదృష్టమని బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!) -
ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు : మంత్రి రోజా
-
రాజమండ్రిలో అట్టహాసంగా క్రిస్మస్ వేడుకలు
-
సాంకేతిక సమస్యతో గాలిలో చక్కర్లు కొట్టిన విమానం
సాక్షి, బెంగళూరు/రేణిగుంట: రాజమండ్రి నుంచి తిరుపతికి వచ్చిన ఇండిగో విమానం సాంకేతిక కారణాల దృష్ట్యా ఇక్కడ ల్యాండింగ్ చేయకుండా గాల్లోనే చక్కర్లు కొట్టించి.. చివరకు అత్యవసరంగా బెంగళూరుకు మళ్లించారు. అందులోని ప్రయాణికులు సుమారు 4 గంటలపాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ విమానంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుతోపాటు మొత్తం 70 మంది ప్రయాణికులున్నారు. వివరాల్లోకి వెళితే... రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి 70మంది ప్రయాణికులతో మంగళవారం ఉదయం 9.20 గంటలకు ఇండిగో విమానం బయల్దేరింది. 10.30 గంటలకు ఇక్కడ ల్యాండ్ అయి.. 11.15 గంటలకు తిరిగి రాజమండ్రి వెళ్లాల్సి ఉంది. కాసేపట్లో రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందనుకుంటున్న సమయంలో పైలట్ చాలాసేపు విమానాన్ని రేణిగుంట చుట్టుపక్కల గాల్లోనే తిప్పారు. ల్యాండింగ్‌కు సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించిన పైలట్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. ప్రయాణికులకు మాత్రం మబ్బుల వల్ల ల్యాండింగ్‌కు ఇబ్బందిగా మారిందని, దీనికితోడు ఫ్యూయెల్ కూడా అయిపోతోందని, విమానాన్ని బెంగళూరుకు అత్యవసరంగా మళ్లిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరు విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యాక దాని డోర్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులంతా నాలుగు గంటలపాటు విమానంలోనే నిరీక్షించారు. తిరుపతిలో దిగాల్సిన ప్రయాణికులను మధ్యాహ్నం ఒంటిగంటకు బెంగళూరు విమానాశ్రయంలో వదిలేయడంతో అక్కడ నుంచి వారంతా అవస్థలు పడి రోడ్డు మార్గాన తిరుపతికి బయల్దేరారు. సాంకేతిక సమస్యను నిపుణులు పరిష్కరించడంతో అక్కడే వేచి ఉన్న కొంతమంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2.10 గంటలకు ఈ విమానం రేణిగుంటకు చేరుకుంది. కాగా, ఈ విమానం తిరుపతిలో ప్రయాణికులను ఎక్కించుకుని రాజమండ్రి చేరుకుని అక్కడ నుంచి రేణిగుంట మీదుగా మధురైకు సాయంత్రం 4.30గంటలకు వెళ్లాల్సి ఉంది. అనూహ్య పరిణామంతో మధురైకు విమాన సర్వీసును ఇండిగో యాజమాన్యం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇండిగోపై కేసు వేస్తా: రోజా ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో ఫోన్లో మాట్లాడుతూ.. సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టుకు తీసుకువచ్చామని విమాన సిబ్బంది చెప్పారన్నారు. సాంకేతిక సిబ్బంది పరిశీలించిన అనంతరం విమానాన్ని తిరుపతికి పంపుతామని తెలిపారన్నారు. టికెట్‌కు అదనంగా రూ.5 వేలు అడిగారని, ఇండిగో యాజమాన్యంపై కేసు వేస్తానని రోజా అన్నారు. -
టీడీపీలో ‘గోరంట్ల’ కలకలం: చంద్రబాబును కలవనని ప్రకటన
సాక్షి, తూర్పుగోదావరి: తెలుగుదేశం పార్టీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం కలకలం రేపింది. పార్టీలోని అంతర్గత వర్గ విభేదాలు ఆయన ప్రకటనతో ఒక్కసారిగా తారస్థాయికి చేరుకున్నాయి. ఆయన త్వరలో టీడీపీకి రాజీనామా చేస్తారనే వార్తలు గురువారం గుప్పుమన్నాయి. పార్టీలో సీనియర్ అయిన బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను చంద్రబాబును కలవను. నేను ఒంటరివాడిని. చంద్రబాబును నా వద్దకు వచ్చిన నాయకులు వెళ్లి కలుస్తారు. పార్టీ మనుగడ కోసమే ఇదంతా చేస్తున్నా. నేను ఏ నిర్ణయం తీసుకున్నా బహిరంగంగా మీకే చెబుతా. పార్టీ నిర్వహణలోని లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యం’ అని తెలిపారు. ఇటీవల తన వర్గాన్ని అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన చెందారు. తన వ్యతిరేక వర్గం ఆదిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంపై విచారం వ్యక్తం చేశారు. చదవండి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి గాయం -
రామ్‌చరణ్‌ను చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కతున్నసినిమా ఆచార్య. ఇందులో రామ్‌చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్లో చిరంజీవి, రామచరణ్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ షూటింగ్‌ను రామ్‌చరణ్ పూర్తి చేసుకున్నారు. 20 రోజుల షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ పయనమయ్యాడు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకున్న రామ్‌చరణ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. చెర్రీతో కలిసి సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా, రామ్‌చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. మరోవైపు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. చదవండి : (మూవీలో చరణ్ అన్న అలా చేయమని చెప్పాడు: వైష్ణవ్) (#pspkrana షూటింగ్ సెట్.. ఫొటో లీక్) -
మైనర్ అత్యాచారం కేసులో నిందితుల అరెస్టు
సాక్షి, తూర్పుగోదావరి: మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితులను అరెస్టు చేశామని రాజమండ్రి అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్‌పేయ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో 13 మందిని నిందితులుగా గుర్తించామని అందులో 12 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఉద్యోగం పేరుతో మైనర్ బాలికను అనిత అనే యువతి ట్రాప్ చేసిందని ఎస్పీ పేర్కొన్నారు. (చదవండి: బాలికపై సామూహిక అత్యాచారం) నిందితులపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని నిందితులలో నలుగురు ఆటో డ్రైవర్లు ఉన్నారని తెలిపారు. నిందితులలో ఒకరే మైనర్ కాగా నిందితులకు కరోనా పాజిటీవ్ ఉన్నట్లు వెల్లడించారు. అమ్మాయిలను నమ్మి ఎవరితోనూ పంపవద్దని తల్లిద్రండ్రులకు సూచించారు. ఇక కోరుకొండ పోలీసు స్టేషన్ కేసు నమోదు చేయలేదనే ఆరోపణలపై విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. (చదవండి: వేధింపులు తాళలేక మైనర్ ఆత్మహత్య) -
పిఠాపురంలో కరోనా కలకలం
పిఠాపురం: పట్టణంలోని ఒక యువకుడు కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరిన 24 గంటలు గడవక ముందే అదే ప్రాంతంలో మరో వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. దీంతో పిఠాపురంలో అధికారులు హై ఎలర్ట్ ప్రకటించారు. పిఠాపురం తారకరామానగర్‌లో నివాసముంటున్న ఒక వ్యక్తి తెలంగాణలోని మంచిర్యాలలో కూలి పనికి వెళ్లి, గత నెల 22 తిరిగి పిఠాపురం చేరుకున్నాడు. ఇప్పటికే రెడ్‌జోన్‌లో ఉన్న ఆ ప్రాంత ప్రజలకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా మంచిర్యాల నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అతడిని రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులు ఇద్దరిని, పక్కింటిలోని ఆరుగురిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఇంటిని, ఆ ప్రాంతాన్ని పరిశీలించి హై ఎలర్ట్ ప్రకటించారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ ఆర్డీఓ చిన్నికృష్ణ పర్యవేక్షణలో పిఠాపురం ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి డాక్టర్ విజయశేఖర్, సీఐ బి.అప్పారావు, ఎస్సై అబ్దుల్ నబీ పరిస్థితిని సమీక్షించారు. క్వారంటైన్‌కు మరో తొమ్మిది మంది పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కలిసి మంచిర్యాల పనికి వెళ్లిన గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చేబ్రోలుకు చెందిన తొమ్మిది మందిని తాటిపర్తి హైస్కూల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌కు అధికారులు తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ మంచిర్యాల వెళ్లి వచ్చిన వారితో పాటు వారి బంధువులు తదితర 75 మందికి కరోనా పరీక్షలు చేశారు. 31 మంది రక్తనమూనాల సేకరణ శంఖవరం: కత్తిపూడిలో శనివారం 31 మంది రక్తనమూనాలు సేకరించినట్లు వైద్యుడు పి.రవికుమార్ తెలిపారు. పిఠాపురంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తి పని కోసం తెలంగాణలోని మంచిర్యాలకు కత్తిపూడికి చెందిన 30 మందితో వెళ్లాడు. దీంతో వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కత్తిపూడిలోని రెడ్‌జోన్ ప్రాంతాన్ని సందర్శించారు. రాజమహేంద్రవరంలో మరో ఐదుగురికి పాజిటివ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో శనివారం రాత్రి ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నగరంలోని మంగళవారపుపేటలో శుక్రవారం 28 ఏళ్ల మహిళకు పాజిటివ్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఆమెతో కాంటాక్ట్ అయిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో శనివారం ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారిని రాజానగరం జీఎస్ఎల్ కోవిడ్–19 జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరందరూ మంగళవారపుపేట, కొత్తపేటకు చెందినవారు. కేసులు పెరగడంతో కలెక్టర్ డి.మురళీధరరెడ్డి హుటాహుటిన రాజమహేంద్రవరం చేరుకుని పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. పాజిటివ్ కేసులు వచ్చిన మంగళవారపుపేట, కొత్తపేటలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఆ రెండు ప్రాంతాలకు వెళ్లే మార్గాలన్నింటినీ బారికేడ్లతో మూసివేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
‘క్రిమి చిన్నదైనా పెద్ద సైన్యంతో పోరాడాలి’
సాక్షి, రాజమండ్రి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. నగరాలు, పట్టణాల్లో నిత్యావసర వస్తువులు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. 'కరోనా కేసులు ప్రస్తుతం పెరుగుతున్నాయి. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా నగరాల్లో పాజిటివ్ కేసులు పెరుగుదల ఎక్కువగా ఉంది. అవసరమైన మేరకు వ్యవసాయ సంబంధిత సరకుల రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనమంతా కచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. క్రిమి చిన్నదైనా పెద్ద సైన్యంతో మనం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరమైన వారికి రాజమండ్రి లాంటి నగరాల్లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సంస్థలను సమన్వయ పరిచి అవసరమైన వారికి సదుపాయాలు అందించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలి. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లలో ప్రాసెసింగ్ సిబ్బంది మధ్య కూడా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆహారం లేకుండా ఎవరూ ఇబ్బందిపడకూడదని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కరోనా కారణంగా ఏప్రిల్ 4న ప్రతి పేద కుటుంబానికి రూ.1000 అందజేస్తాం' అని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. -
రాజమండ్రిలో సంక్రాంతి సంబరాలు
-
రాజమండ్రిలో టూరిజం ఇన్వెస్టర్స్ సమావేశం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో పర్యాటక శాఖ అధ్వర్యంలో టూరిజం ఇన్వెస్టర్స్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్సీ సోమువీర్రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో 45శాతం దేశాలు టూరిజం మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని అన్నారు. అలాగే టూరిజానికి అవకాశం ఉన్న పలు ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి భద్రతకు ప్రాధాన్యం కల్పించాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈ క్రమంలో పర్యాటక ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. సీతానగరం మండలంలో ఉన్న రామవరపు ఆవను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అన్నారు. అలాగే కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద రోప్‌వే ఏర్పాటు చేస్తే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందరని, దీంత టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. స్టార్హోటల్లో మద్యం ధరలు అధికంగా ఉన్నందువల్ల టూరిజంపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ సోమువీర్రాజు మాట్లాడుతూ.. ఆత్రేయపురం పరిధిలో ఉన్న పిచ్చుకలను 10కోట్లతో రిసార్ట్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయవచ్చనునని తెలిపారు. -
కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి
సాక్షి, రాజమండ్రి: స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌పై యువకులు దాడి చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సంచలన సృష్టించింది. సీతానగరం, కోరుకొండ పోలీస్ స్టేషన్లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావు గురువారం మోటారు సైకిల్‌పై వెళ్తుండగా ఆనంద్ నగర్ ఆటో స్టాండ్ వద్దకు వచ్చేసరికి వెనుక వైపు నుంచి మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గరు యువకులు అతడి మైటారు సైకిల్‌ను ఢీ కొట్టారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ ఆ యువకుల మోటార్ సైకిల్ నంబర్‌ను సెల్ఫోన్లో ఫోటోలు తీస్తుండగా వారు అతనితో ఘర్షణకు దిగారు. అంతటితో ఆగకుండా యువకులు కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. కత్తులతో వీరంగా సృష్టించారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం తనపై దాడి జరిగినట్టుగా కానిస్టేబుల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో త్రీటౌన్ పోలీసులు అక్కడికి చేరకుని ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన యువకులు పరారీలో ఉన్నారు. త్వరలోనే వారందరినీ అరెస్ట్ చేస్తామని ఎస్ఐ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ కానిస్టేబుల్‌కు చికిత్స అందిస్తున్నారు. -
వరద గోదారి..
జిల్లావాసులను కంటిమీద కునుకులేకుండా గోదావరి వరద భయపెడుతోంది. వరద ఉధృతి మరోసారి పెరగడంతో శుక్రవారం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు మళ్లీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనసీమ, ఏజెన్సీ మండలాల్లో వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రధానంగా కోనసీమలోని పి. గన్నవరం, రాజోలు, అయిన విల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అల్లవరం మండలాల్లోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాక్షి, రాజమహేంద్రవరం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మళ్లీ గోదావరికి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద సాయంత్రం ఆరుగంటలకు నీటి మట్టం 47.50 అడుగులకు చేరుకుంది. కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని సుమారు 20 గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. శబరి నది పొంగి ప్రవహిస్తుండటంతో చింతూరు మండలంలో వరుసగా మూడో రోజు కూడా 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ముంపునకు గురైన గ్రామాల్లో అధికారులు లాంచీల ద్వారా నిత్యాసవసరాలు అందజేస్తున్నారు. దేవీపట్నం మండలంలోని తొయ్యేరు, పూడిపల్లి తదితర 36 గ్రామాలు వరుసగా ఎనిమిదో రోజు కూడా వరద రోజుల తరబడి ముంపులో ఉండడంతో ముంపుతో ఇళ్లు కూలిపోతాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 15 అడుగులకు చేరుకుంది. 14,59,068 క్యూసెక్కులు సముద్రంలోకి విడిచిపెట్టారు. కోనసీమలో... కోనసీమలో వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధగౌతమి నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఉద్యానవన పంటలు ఇప్పటికే ముంపుతో తీవ్రంగా నష్టపోయాయి. మామిడికుదురు మండలంలో ఇద్దరు వరద ఉధృతికి గోదావరిలో కొట్టుకుపోగా, ఏజెన్సీలో ఓ మహిళ వాగులో పడి మృతి చెందింది. పాశర్లపూడి కరకట్ట దిగువన ఉన్న అప్పనపల్లి కాజ్‌వేపై నడుచుకుంటూ అప్పనపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా వరద ఉధృతిలో ముగ్గురు కొట్టుకుపోగా షేక్ వజీర్‌ను స్థానిక యువకుడు లంకే ఏసు, కానిస్టేబుల్ పెద్దిరెడి సూరిబాబు రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. కాకినాడ రూరల్ మండలం రేపూరుకు చెందిన సమీర్‌బాషా(23), పెదపట్నంకు చెందిన షేక్ రెహ్మాన్ అలియాస్ నానీ(17) గోదావరి మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని సాంఘిక సంక్షేమశాఖా మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. మృతుల కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రంపచోడవరం ఏజెన్సీలోని అడ్డతీగల మండలం కొచ్చావారివీధి వద్ద జర్తా భద్రమ్మ అనే మహిళ మడేరువాగులో పడి మృతి చెందింది. సీతానగరం మండలం బొబ్బిల్లంక వద్ద గోదావరిలో లాంచీ విద్యుత్ తీగలు తగిలి నిలిచిపోయింది. గొల్లప్రోలు చౌటకాలువ, గడ్డ కాలువలు జోరుగా ప్రవహిస్తున్నాయి. గొల్లప్రోలు స్వరంపేటకు వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే తూము ముంపునకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో 30 లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కూనవరం: గోదావరి, శబరి వరదనీటి కారణంగా కూనవరంలో 20.39 మీటర్ల మూడో ప్రమాద హెచ్చరికకు వరదనీరు చేరింది. దీని కారణంగా కూనవరం, వీఆర్‌పురం మండలాల నడుమగల వంతెనను ఆనుకుని వరదనీరు ప్రవహిస్తోంది. రహదారుల పైకి వరదనీరు చేరడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు : శబరినది వరద కారణంగా మండలంలోని చట్టి, వీరాపురం, చిడుమూరు వద్ద జాతీయ రహదారి–30 ఇంకా ముంపులోనే ఉండడడంతో ఆంధ్రా నుంచి తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వాహనాలు భారీసంఖ్యలో ఎక్కడికక్కడే నిలిచిపోయి రాకపోకలు బందయ్యాయి. కుయిగూరు వద్ద జాతీయ రహదారి–326 ముంపునకు గురికావడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం ప్రాంతంలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. 36 గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి. రాజమహేంద్రవరం రూరల్‌లో కూడా ముంపు ప్రభావం ఉంది. మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలో వ్యవసాయ క్షేత్రాలు దాదాపు నీట మునిగాయి. అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం బోడసకుర్రురు, దేవర్లంకర, పల్లిపాలెం, కంసాల మామిడి ప్రాంతాలలో 120 ఇళ్లు నీటమునిగాయి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పల్లిపాలెంలో 62 ఇళ్ళు, 44 ఇళ్ళు లోతట్టు ప్రాంతాల్లో జలమయయ్యాయి. రామచంద్రపురం నియోజకవర్గంలోని కె.గంగవరంలో ముంపులో కోటిపల్లి మత్స్యకార కాలనీలో 250 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలను నీళ్లు ముంచెత్తుతున్నాయి. కొత్తపేట–కేదార్లంక, వాడపాలెం–నారాయణలంక మధ్య ఉన్న తొగరుపాయ వంతెనల పై వరకూ వరద నీరు వచ్చి చేరింది. రావులపాలెం మండలంలోని ఊబలంక శివారు తోకలంకకు మూలస్థాన అగ్రహారం లంక పొలాలకు మధ్య, చొప్పెల్ల–వాడపల్లి లంకకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లో గోదావరి వరద శుక్రవారం ఉదయానికి భద్రాచలం వద్ద 48 అడుగుల రెండో ప్రమాద హెచ్చరికకు చేరుకుని మధ్యాహ్నం నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. దీంతో భద్రాచలం నుంచి కూనవరం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని మురుమూరు, నందిగామ, రాయనిపేట, వీరాయిగూడెం గ్రామాల్లో రహదారులపై వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల ప్రత్తిచేలు, వరి నారుమళ్లు, పెసర పంటలు నీటమునిగాయి. వీఆర్‌పురం: గోదావరి, శబరినది వరదనీరు కారణంగా శ్రీరామగిరి, వడ్డిగూడెం, చింతరేవుపల్లి గ్రామాల్లో పలు ఇళ్లు నీటమునిగాయి. రహదారులపైకి నీరు చేరడంతో మండలంలోని 20 గ్రామాలకు గత 10 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. -
తెలుగు కథపై చెదరని ‘ఛాయ’
అబ్బూరి ఛాయాదేవిగారు వెళ్లిపోయారు. ఆమె నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడే మాటలిక ఎన్నటికీ వినపడవు అనుకుంటే చాలా విచారంగా ఉంది. కానీ, జీవించటంలోనూ, మరణించటంలోనూ తన మార్గాన్ని తాను ఎంచుకున్న మనిషి. మనం విచారించటాన్ని ఆమె ఇష్టపడరు. ఏదో ఒక జోక్ వేసి నవ్విస్తారు. తెలుగు సాహిత్యంలో, అందునా స్త్రీవాద సాహిత్యంలో ఆమె చెరగని సంతకం. ఆమె వ్యక్తిత్వం, మేథస్సు, హాస్య చతురత, సునిశిత దృష్టి, సాహిత్య కళారంగాల పట్ల ఆమెకున్న గాఢానురక్తి–ఇవన్నీ ఆమెను ఒక ప్రత్యేక స్థానంలో నిలబెడతాయి. 1933 అక్టోబర్ 3న రాజమండ్రిలో జన్మించిన ఛాయాదేవిగారు తన పందొమ్మిదవ ఏట మొదటి కథ ‘అనుబంధం’ రాశారు. ఆ తర్వాత మరెన్నో కథల పంట పండించారు. చిన్నతనంలో కట్టుబాట్లతో కూడిన సంప్రదాయ జీవిత నేపథ్యం ఆమెది. ఆ నేపథ్యపు నీడ నుంచి తప్పించుకుని ఒక స్వతంత్ర ఆలోచనాపరురాలిగా తనను తాను మలచుకునేందుకు ఆమె తనదైన ఒక మార్గాన్ని, ఒక జీవన శైలిని అలవరచుకున్నారు. నిజాం కాలేజీలో చదివారు. అబ్బూరి రామ కృష్టారావుగారి అబ్బాయి అబ్బూరి వరద రాజేశ్వరరావుగారితో వివాహం జరిగాక లైబ్రరీ సైన్స్‌మీద ఆసక్తి కలిగిందేమో–ఆ చదువూ చదివి న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో డిప్యూటీ లైబ్రేరియన్‌గా పనిచేశారు. పని చేయటమంటే ఛాయాదేవిగారి పద్ధతిలోనే. పర్ఫెక్ట్గా. తను చేసే ఏ పనైనా శ్రద్ధగా, దాని గురించిన పూర్తి అవగాహనతో, కళాత్మకంగా చేయడం ఆమె పద్ధతి. ఆ లైబ్రరీలో తన అనుభవాల గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. ఆమె నవ్వుతూ సింపుల్‌గా చెబుతుంటే ఇంత సాదా సీదాగా కనిపించే ఈమె ఎంత మేథావో కదా అనిపిస్తుంది. 1982లో ఢిల్లీలో ఆ ఉద్యోగం వదలి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు దంపతులిద్దరూ. అప్పటికే ఛాయాదేవిగారు చరిత్రలో నిలిచి పోయే సాహిత్య కృషి చేశారు. 1954లోనే ‘కవిత’ అనే పేరుతో కవిత్వం కోసం పెట్టిన పత్రికలకు సంపాదకత్వం వహించారు. అది రెండు సంచికలే వచ్చినా.. అటువంటి పత్రికలకు ఒక ఒరవడి పెట్టింది. ‘అనగా అనగా’ అంటూ పిల్లల కోసం ప్రపంచ దేశాల జానపద కథలను సంకలనం చేశారు. 1956లో ‘మోడర్న్ తెలుగు పొయెట్రీ’ ఆంగ్లానువాద సంకలనానికి సంపాదకురాలిగా ఉన్నారు. ఈ మధ్యలో కథలు రాస్తూనే ఉన్నారు. వారిల్లు ఒక సాహితీ చర్చా కేంద్రంగా, నాటకరంగ కార్యగోష్టిశాల వలే నడుస్తూ ఉండేది. పెద్ద రచయితలందరూ ఆమె ఆతిథ్యం స్వీకరించినవారే. ఆమె వారి గురించి చెప్పే హాస్య కథలు రికార్డు చేయడానికి ఆమె అనుమతించలేదుగానీ, అదొక మంచి చరిత్ర పుస్తకమయ్యేది. ఆమె కథా సంకలనం చాలా ఆలస్యంగా 1991లో వచ్చింది. ‘బోన్సాయ్ బతుకులు’ 1974లో ఆమె రాశారు. అప్పటికీ స్త్రీవాదం, విమెన్స్ స్టడీస్, జండర్ దృక్పథం గురించి మాటలు కూడా మొదలు కాలేదు. కానీ స్త్రీల శక్తులన్నిటినీ బోన్సాయ్ మొక్కల్లా కత్తిరించి కుంచింప చేస్తున్నారని, అందంగా వుంటే, ఇంట్లో సురక్షితంగా పెరిగితే చాలని కుటుంబం చేసే అదుపు వల్ల పెద్ద వృక్షంలా ఎదిగి నలుగురికి నీడనివ్వగల స్త్రీ తానే పరాధీన అయిపోతోందని చెప్పి ఎంత కనువిప్పు కలిగించారో. 1991లో ‘అబ్బూరి ఛాయాదేవి కథలు’ పేరుతో కథా సంకలనం వచ్చాక అది స్త్రీలు తప్పనిసరిగా చదవాల్సిన కథ అయ్యింది. అనేక భాషల్లోకి అనువాదమైంది. కళాశాలల్లో పాఠ్యభాగమైంది. మన రాష్ట్రంలోనే కాదు. కర్ణాటకలో కూడా. జండర్ గురించి అర్థం చేయించాలంటే ఆ ఒక్క కథ చదివిస్తే చాలు. ‘సుఖాంతం’ కథ జనప్రియమైన కథ అయింది. ఆ కథ కూడా స్త్రీల అనంతమైన ఇంటిచాకిరి గురించే. నిద్రకు కరువైన జీవితాల గురించిన వేదన కథంతా పరుచుకుని, సుఖ నిద్ర కోసం శాశ్వత నిద్రనాశ్రయించిన ఒక స్త్రీ మన మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంది. చాలా కథలు సున్నితమైన హాస్యంతో చురకలు పెడతాయి. ఉద్యోగ ధర్మం, భార్యా ధర్మం మధ్య నలిగే స్త్రీలు, ఆఫీసుల్లో లైంగిక వేధింపులకు గురై సతమతమవుతూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేందుకు పోరాడే స్త్రీలు–ఇలా అనేకానేకమంది మధ్యతరగతి స్త్రీలు, వారి ఆరాటాలు మనకు అర్థమవుతాయి. స్వతంత్ర జీవన కాంక్ష స్త్రీలలో బలంగా ఉం టుంది. దానిని సంహరించే వ్యతిరేక శక్తులతో వారు జీవితాంతం ఏదో ఒక రకమైన పోరాటం చేయవలసే ఉంటుంది. సంసారాలు నిలబెట్టుకుంటూనే, బాంధవ్యాలను తెగగొట్టుకోకుండానే, సున్నితంగానే నిలబడాలి పోరాటంలో. ఇది చాలా కష్టం. ఏదో ఒక ఆయుధం పుచ్చుకుని ప్రత్యక్షంగా కదనరంగంలోకి దూకడమే సులువు.. విజయమో, వీర స్వర్గమో తెలిసిపోతుంది. మధ్యతరగతి స్త్రీలు అస్వతంత్రత, స్వతంత్రతల మధ్య బంతిలా తిరుగుతూ, కిందపడిపోకుండా, ఎవరి చేతికీ చిక్కకుండా తమను తాము కాపాడుకునే సాము గారడీ చాలా కష్టం. ఆ కష్టాలను తన సున్నితమైన శైలిలో మనల్ని ఎక్కువ కష్టపెట్టకుండా రాస్తారు అబ్బూరి ఛాయాదేవి. ‘తన మార్గం’ కథ చూడండి. వృద్ధాప్యంలో ఎంత ఆనందముంటుందో తెలుస్తుంది. ఒంటరిగా పార్కుకెళ్లి పిడతకింది పప్పు కొనుక్కు తినడంలో జీవితపు రుచి ఎలా ఊరుతుందో అర్థమవుతుంది. ‘పరిధి దాటిన వేళ’ కథలో కూడా అంతే–ఒక వయసు మళ్లిన స్త్రీ మందులు కొనుక్కొచ్చుకుందామని, దగ్గరే కదాని ఎవరితో చెప్పకుండా బైటికి వెళ్లటం కుటుంబంలో ఎంత అలజడికి కారణమవుతుందో రాశారామె. ఏ వయసు పరిధులు, లక్ష్మణరేఖలు ఆ వయసుకి ఎలా ఆపరేట్ అవుతాయో,అదంతా ఎంత సహజంగా జరి గిపోతుందో ఆమె కథలు చదివితే అర్థమైపోతాయి. కథలు రాయటంతోనే తన సాహిత్య పాత్రను పరిమితం చేసుకోలేదావిడ. ఒక సాహితీ కార్యకర్తగా ఎన్నో పనులు చేశారు. అలా చేస్తున్నానని ఎవరికీ అనిపించనివ్వకుండా చేశారు. అది ఆమె మార్గం. ఆమె పద్ధతి. సాహిత్య ఎకాడమీకి ఒక కథా సంకలనాన్ని తన సంపాదకత్వంలో తీసుకొచ్చి ఇచ్చారు. ఎన్నో సాహితీ సభలలో మంచి ఉపన్యాసాలు చేశారు. కొన్నేళ్లపాటు ఛాయాదేవిగారు లేకుండా జరిగిన సాహితీ సభలు అరుదు. ఐతే వేదిక మీద తప్ప సభలో కూర్చునేతత్వం కాదు ఆమెది. ప్రతి సభకూ హుందాగా వచ్చేవారు. ఆ సభకు గౌరవం తెచ్చే వారు. ‘ఉదయం’ వార పత్రికలో, ‘భూమిక’ మాసపత్రికలో కాలమ్స్ రాశారు. తన తండ్రిగారి గురించిన వస్తువుతో ‘మృత్యుంజయ’ రాశారు. అనేక సాహితీ వ్యాసాలు రాశారు. ఆమె మంచి కళాకారిణి. పనికిరానివని పక్కనపడేసే వస్తువులతో బొమ్మలు చేయటం ఆమె ప్రత్యేక విద్య. ఎంత కళాత్మకంగా ఉండేవో అవి. ఇంట్లో వాడకుండా ఉన్న చాటలో భారతంలోని వ్యక్తుల్ని నిలిపి ‘చాట భారతం’ చేశారు. స్నేహితులకు, పరిచయస్తులకు, పిల్లలకు వాటిని కానుకగా ఇచ్చేవారు. ఆ విద్య గురించి ‘బొమ్మలు చేయడం’ అనే పుస్తకం ప్రచురించారు. ఆమె జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని బాగా అర్థం చేసుకుని ఆచరించారు. ఆయన వివిధ సందర్భాలలో చేసే ప్రసంగాలలో స్త్రీలకు ఉపయోగపడే విషయాలను తీసుకుని ‘స్త్రీల జీవితాలు–జిడ్డు కృష్ణమూర్తి’అనే పుస్తకం రాశారు. ఆ తత్వం, జీవితంపట్ల ఆపేక్షతో కూడిన నిర్లి్లప్తత ఆమెకు బాగా పట్టుబ డ్డాయి. వరద రాజేశ్వరరావుగారు 1992లో అను కుంటా మరణించారు. 1986 నుంచీ ఆమె నేనూ మంచి స్నేహితులమయ్యాం. నేను వెళ్లేసరికి సాయం త్రం ఏడుదాటింది. ఆయనను తీసుకెళ్లారు. ఛాయాదేవిగారు ఎలా ఉన్నారో, ఆమె దుఃఖంలో ఉంటారు, ఎలా ఓదార్చాలి అనుకుంటూ వెళ్లాను. ఆమె మామూలుగా చిరునవ్వుతో వచ్చి కూర్చుని ఆ రోజు అదంతా ఎలా జరిగిందో అతి మామూలుగా తన ధోరణిలో చెబుతుంటే నేను ఆశ్చర్యపోయాను. మర ణాన్ని, అందునా ఆప్తుల మరణాన్ని అలా ధైర్యంగా, హుందాగా ఎదుర్కొని ఎదుటివారి మనసులను తేలికజేయగల సాహసియైన స్త్రీని నేను నా జీవితంలో మొదటిసారి చూశాను. ఆ సంఘటనతో నేను చాలా నేర్చుకున్నాను. ఆ విషయంలో ఆమె ఆలోచనల లోతుని అర్థం చేసుకోలేని వాళ్ల ప్రవర్తన గురించి ఆమె ఒక హాస్య కథ కూడా రాశారు. సంవత్సరన్నరలో ఆమె ఎంతో శ్రమపడి, తన సమయాన్నంతా, హృదయాన్నంతా పెట్టి వరద రాజేశ్వరరావుగారి సమస్త రచనల సంకలనం ‘వరద స్మృతి’ ఎంతో అందంగా ముద్రించారు. సహచరుడిపట్ల ప్రేమను ఆయనను చిరంజీవిగా చేసే పనిలో ఆమె వ్యక్తం చేశారు. ఆ పుస్తకం అనేక విషయాలలో విలువైనది. సాహిత్య చరిత్రలో ముఖ్యమైనది. ఆమె ఆ పనికి పూనుకోకపోతే చాలా లోటు మిగిలేది. తన తోటి రచయిత్రులతో, తనకంటే చిన్నవారితో ఆమె కలిసిపోయే తీరు అపూర్వం. తనకు నచ్చిన కథల గురించి ఆయా రచయిత్రులతో మాట్లాడి ఆనంద పెట్టేవారు. ఆమె నుంచి ఎంత నేర్చుకున్నా ఆమె మరణాన్ని నిర్లిప్తంగా తీసుకోలేక పోతున్నాను. చాలా వెలితిగా ఉంది. దానిని పూరించుకోటానికి ఆమె చూపిన మార్గం ఉందనే ధీమా. ఆమె చేసిన కృషికి తగిన గుర్తింపు కూడా వచ్చిందనే అనిపిస్తుంది. అనేక అవార్డులు, సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. అజోవిభో కందాళం వారి అవార్డు వచ్చినప్పుడు బాపట్లలో రచయిత్రులం ఎంతోమందిమి వెళ్లి ప్రేమాభిమానాలతో మాట్లా డాం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆమె అందుకున్న సందర్భంలో అస్మిత ఏర్పాటు చేసిన సభకు ఎంతమందో వచ్చి సంతోషపడ్డారు. రచయిత్రులమైతే ఆ అవార్డు మాకే వచ్చినంత సంతోషించాం. ఇంతమంది హృదయాల్లో ఇంత ప్రేమ నింపి, స్త్రీల జీవితాలకు వెలుగు చూపే కథలు రాసి, సాహిత్య చరిత్రలో నిలిచే పుస్తకాలను కూర్చి ప్రచురించిన అబ్బూరి ఛాయాదేవి గారు ఎక్కడికి వెళ్తారు? తెలుగు సాహిత్యంతో సహజీవనం చేస్తున్నారు. ఓల్గా వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి -
ఆ 2500 కోట్లు ఏం చేశారు: వైఎస్ షర్మిల
సాక్షి, రాజమండ్రి: అవినీతి, అక్రమాలకు, వెన్నుపోటుకు మారుపేరు చంద్రబాబు నాయుడుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని, ఎన్నికల వేళ పసుపు కుంకుమ పేరుతో మహిళలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. డ్వాక్రా రుణాలు, రైతు రుణామాఫీ చేస్తానని చంద్రబాబు తొలిసంతకం పెట్టారని.. కానీ ఇప్పటికి వరకు ఎలాంటి రుణాలు మాఫీచేయ్యలేదని మండిపడ్డారు. వనజాక్షీ అనే మహిళా ఉద్యోగినిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టుపట్టుకుని కొడితే ఆయనపై ఏం చర్యలు తీసుకున్నారని షర్మిల ప్రశ్నించారు. అంగన్వాడి వర్కర్లు జీతాలు పెంచమని ధర్నా చేస్తే.. వారిపై లాఠిచీర్జ్ చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో మహిళలకు ఏలాంటి రక్షణ లేదన్నారు. గత 40 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌లోని ధవళేశ్వరం బస్టాండ్ సెంటర్ వైఎస్ షర్మిల రోడ్ షోను నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజమండ్రి రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల వీర్రాజును, ఎంపీ అభ్యర్థి మార్గని భరత్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతిలో ఒక్క పర్మినెంట్ భవనం కూడా నిర్మించలేదని, అలాంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఎలా ఇస్తారని పేర్కొన్నారు. అమరావతి నిర్మానానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2500 కోట్లు ఇచ్చినట్లు చెబుతోందని.. ఆ డబ్బుంతా ఏం చేశారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టిన అసమర్ధుడు చంద్రబాబని, ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అని అన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసిఉండి.. ఇప్పుడు కాంగ్రెస్‌తో జట్టు కట్టారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ పాలనలో జరిగిన అవినీతి గత 40 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని మాజీ సీఎస్ అజయ్ కల్లం చెప్పినట్లు ఆమె గుర్తుచేశారు. ‘‘దివంగత వైఎస్సార్ హయాంలో రైతులు, పేదలు, మహిళలు సంతోషంగా ఉన్నారు. విద్యార్థులను ఉచితంగా చదవించారు. ఎవ్వరికీ సాధ్యం కాని సంక్షేమ పథకాలను అమలు చేసి రికార్డు సృష్టించిన నాయకుడు వైఎస్సార్. పార్టీలకు అతీతంగా అందరినీ ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం, కొంతమందికే లబ్ధిచేకూరింది. గత ఎన్నికల సమయంలో జాబు రావలంటే బాబు రావాలన్నారు.. కానీ ఆయన కుమారుడు లోకేష్ మాత్రమే మంత్రి పదవి వచ్చింది. ఏ ఒక్కరికీ ఉద్యోగం దొరకలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటారు. రైతులకు ప్రతి మేలో రూ.12500 ఇస్తారు. పెన్షన్ పెంచుతారు. పిల్లల్ని బడికి పంపిన తల్లికి ఏడాదికి రూ. 15000 అందిస్తారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తారు.’’ అని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్‌సీపీతోనే బీసీలు బలోపేతం
67ఏళ్ల రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ చరిత్రలో తొలిసారి బీసీలకు అవకాశం ఇచ్చిన పార్టీ వైఎస్సార్సీపీ. యువకుడు, విద్యావంతుడు మార్గాని భరత్‌రామ్ బరిలో నిలిచారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రశ్న : ఎంపీ టికెట్ దక్కడంపై కామెంట్? భరత్: అరుదైన అవకాశాన్ని వైఎస్సార్సీపీ నాకు కల్పించింది. రాష్ట్రంలో 41 అసెంబ్లీ, ఏడు ఎంపీ స్థానాలు బీసీలకు ఇచ్చిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ. ఇది వైఎస్ జగన్ ఘనత. బీసీలను టీడీపీ ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేసింది. ప్రశ్న : ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఎలా ఉంది? భరత్ : చాలా అదృష్టంగా భావిస్తున్నా. యువతకు ప్రతినిధిగా ఉంటా. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తా. రాజమండ్రి ప్రాంతాన్ని టూరిజం, స్పోర్ట్స్, ఇండస్ట్రియల్ హబ్‌లుగా మారుస్తా. ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తా. ప్రశ్న : ప్రజా స్పందన ఎలా ఉంది? భరత్ : అద్భుతంగా ఉంది. ప్రజలు వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రశ్న : ఎంపీ అయితే మీ కార్యాచరణ? భరత్ : రాజమండ్రి పార్లమెంటరీ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించా. గోదావరి చెంతనే ఉన్నా.. అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. పరిష్కారానికి కృషి చేస్తా. రాజమండ్రిలో ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తా. గోదావరి పరిరక్షణకు చర్యలు తీసుకుంటా. ప్రశ్న : హేవలాక్ బ్రిడ్జి పర్యాటకాభివృద్దిపై ? భరత్ : హేవలాక్ బ్రిడ్జిని పాదచారుల వంతెనగా మార్పు చేస్తున్నట్లు ఎంపీ మురళీమోహన్ ప్రకటించారు. ఏమీ జరగలేదు. పర్యాటకంగా బ్రిడ్జిని అభివృద్ధి చేసేందుకు యత్నిస్తా. ప్రశ్న : సినీ రంగంలోకి వెళ్లి ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? భరత్ : ప్రజలందరికీ సేవ చేసే అకకాశం ప్రజాప్రతినిధిగా దక్కుతుందనే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రశ్న: విజయావకాశాలెలా ఉన్నాయి? భరత్: రాజమండ్రి ఎంపీ స్థానంతోపాటు అన్ని అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం, ఆయన ప్రకటించిన నవరత్నాలే గెలిపిస్తాయి. -
రాజమండ్రి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా రౌతు సూర్యప్రకాష్‌రావు నామినేషన్
-
యువ శక్తి రాజమండ్రి
-
రాజమండ్రి ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, రాజమండ్రి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై ఆచార్య యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు తెలుగు భాషా ద్రోహి అని మండిపడ్డారు. తెలుగు భాషను ఉద్ధరిస్తానని ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదని విమర్శించారు. గోదావరి పుష్కరాల ఆఖరు రోజున రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ హామీని నెరవేర్చకుండా రాజమండ్రి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాజమండ్రి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ద్రోహి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సాంస్కృతిక పీఠానికి సంబంధించిన భూములను అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవడానికి అవసరమైతే రాజమండ్రిలో ఆమరణ దీక్ష చేపడతానని ఆయన అన్నారు. -
రాజమండ్రిలో నిన్ను నమ్మం బాబూ కార్యక్రమం
-
హెచ్ఐవీ లేకున్నా ఉన్నట్లు రిపోర్టు
సాక్షి, రాజమండ్రి : ఓ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చేరిన ఓ గర్భిణీ మహిళకు హెచ్ఐవీ లేకున్నా ఉందంటూ వైద్యులు రిపోర్టు ఇచ్చారు. ఊహించని రిపోర్టు రావడంతో బాధిత కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఐతే వైద్యుల రిపోర్టుపై నమ్మకం లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లో మరోసారి పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో మహిళకు హెచ్ఐవీ లేనట్లు తేలింది. దీంతో ఊపిరి పీల్చుకున్న మహిళ.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ బాధిత కుటుంబం ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగింది. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఇలా ఎంతమందికి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారో అంటూ ఆసుపత్రి వర్గాలపై మండిపడుతున్నారు. కాగా ఘటనతో రోగులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే తీవ్ర భయాందోళనకు గురైతున్నారు. -
రాజమండ్రి : గుడిసెలో భారీ పేలుడు ముగ్గురు మృతి
-
వైఎస్ జగన్‌ను కలిసిన రాజమండ్రి కాపు యువత
-
‘నిజాలు చెప్తున్నామనే మాపై దాడులు’
సాక్షి, రాజమండ్రి : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పైసా కూడా బాకీ లేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం రాష్ట్రానికి సంబంధం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కేవలం సమన్వయకర్త మాత్రమేనని కన్నా అన్నారు. పోలవరాన్ని కేంద్రం గడువులోగా నిర్మించి తీరుతుందని ఆయన చెప్పారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏంటని బీజేపీ నేత ప్రశ్నించారు. నిజాలు చెప్తున్నామనే మా పై దాడులు చేస్తున్నారని కన్నా ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు గుండె లాంటిది.. అలాంటిది రాజకీయాల కోసం గుండెను పిసికేయవద్దని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. -
రాజమండ్రి ఎయిర్పోర్ట్: కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణను 65 సంవత్సరాలకు పెంచింది. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన 10 ఎకరాల భూమిని బదలాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వామపక్ష ప్రభావిత జిల్లాలకు రూ 3వేల కోట్ల సాయం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల పోలీస్ ఆధునీకరణకు రూ 100 కోట్ల కేటాయింపుకు పచ్చజెండా ఊపింది. ఇక దేశవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు రూ 25వేల60 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
తూర్పుగోదావరి(కడియం): ఎదురెదురుగా వస్తున్న కంటైనర్, సెప్టిక్ క్లీనింగ్ ట్యాంకర్ ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఈ సంఘటన కడియం మండలం వేమగిరి గట్టుపై ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సెప్టిక్ క్లీనింగ్ ట్యాంకర్లో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా రాజమండ్రికి చెందినవారని సమాచారం. -
ఏపీలో ఒక్కరోజే 45 లక్షల మంది పుణ్యస్నానం
రాజమండ్రి : గోదావరి పుష్కరాల చివరి రోజైన శనివారం నాడు ఉభయగోదావరి జిల్లాల పుష్కర ఘాట్లు భక్తుల తాకిడితో పోటెత్తాయి. పన్నెండవ రోజు పుష్కరాలు ముగిసిపోతాయి కనుక కేవలం ఈ ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్‌లో 45.5 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఏపీలో మొత్తంగా 4.5 కోట్లకు పైగా భక్తులు పుష్కరాలకు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు సహా ఇతర ఘాట్లలో కూడా బాగా రద్దీ కనిపించింది. ఈ పుష్కరాలకు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా అధిక సంఖ్యలో తరలిరావడం విశేషం. -
వంద దాటినోళ్లూ ఊయలలో బిడ్డలే..
పుష్కరఘాట్ (రాజమండ్రి): నిండు నూరేళ్లు దాటిన పండు ముదుసలుల నుంచి పొత్తిళ్లలోని పాపాయిల వరకూ అందరినీ తన ఒడిలో బిడ్డల్లా చల్లగా లాలిస్తున్న ఆ గోదారమ్మ.. తన గుండెల్లో నిండుతున్న ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తుంది? బహుశా.. అలల మిలమిలలే ఆ తల్లి చెక్కిళ్ల సంతోషపు తళుకులేమో! మంగళవారం పుష్కరఘాట్‌లో 9వ సారి గోదావరి పుష్కరస్నానం చేసిన అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరానికి చెందిన 103 ఏళ్ల నరిమెళ్ల కోటేశ్వరరావును, 8వసారి పుష్కరస్నానం చేసిన శ్రీకాకుళం జిల్లా మందగోడికి చెందిన బత్తుల లక్ష్మివేణిని చిత్రాల్లో చూడొచ్చు. -
మెట్టే శిఖరం పెట్టయినా...
వీఐపీ ఘాట్ (రాజమండ్రి) : పుష్కర గోదావరి ఒడికి.. కోట్ల మంది చెంగుచెంగున, చకచకా, బిరబిరా, బిలబిలా చేరుతున్నారు. అయితే.. ఆ అమ్మ చెంతకు చేరేవారిలో రెక్కలు తెగిన పక్షుల్లాంటి వారూ ఉంటున్నారు. శరీరం సహకరించకపోయినా, పన్నెండేళ్ల పండుగలో పాలు పంచుకోవాలి, గోదారి నీటిని తలదాల్చుకోవాలన్న సంకల్పమే ఎందరినో నది దరికి రప్పిస్తోంది. మంగళవారం వీఐపీ ఘాట్‌లోకి దేకుతూనే దిగి పుణ్యస్నానం అనంతరం తిరిగి అలాగే ఒడ్డెక్కుతున్న యువతిని చిత్రంలో చూడొచ్చు. -
పోలీసుల వైఖరితో పురోహితుల మనస్తాపం..
పుష్కరఘాట్ (రాజమండ్రి): పుష్కరఘాట్‌లో పోలీసులు అవలంబిస్తున్న వైఖరికి పురోహితులు తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. పుష్కరాల్లో తీర్థవిధులు నిర్విహించే పురోహితులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. భక్తులు తెల్లవారుజాము నుంచి బారులు తీరుతుండటంతో అప్పటి నుంచి పురోహితులు తీర్థవిధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పుష్కరఘాట్‌లో తీర్థవిధులు నిర్వహిస్తున్న పురోహితులు మధ్యలో అల్పాహారం కోసం, ఇతర పనుల నిమిత్తం ఘాట్ నుంచి బయటకు వెళ్లి తిరిగి వస్తుంటే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పురోహితులు కూడా అందరిలాగా క్యూలోనే రావాలని ఆంక్షలు విధిస్తున్నారు. దీనిపై వీరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాల్లో మిగిలిన నాలుగు రోజులైనా తమపై ఆంక్షలు లేకుండా చూడాలని కోరుతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నాం బయటకు వెళ్లి ఘాట్‌లోకి తిరిగి వచ్చేటప్పు డు క్యూలో వేచి ఉండా ల్సి వస్తోంది. సాధారణ భక్తులతో పాటు క్యూలోనే రావాలని ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాము. - లట్టాల కృష్ణప్రసాద్, పురోహితుడు, సీతానగరం మాకూ సడలింపు ఇవ్వాలి ఈ విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం మాకు గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. పుష్కర విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఇచ్చినట్టే మాకూ సడలింపు ఇవ్వాలి. - ఎ.రంగారావు, పురోహితుడు, విశాఖపట్నం -
‘పర్సు’ రాముడు
కొవ్వూరు (వీఐపీ ఘాట్): ఇతని పేరు జమ్ము మురళీకృష్ణ. విజయనగరం నుంచి మిత్రులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించేందుకు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు వీఐపీ ఘాట్‌కు చేరుకున్నాడు. మిత్రులంతా వారి దుస్తులు, ఫోన్లు, వాచీలు, పర్సులు, జేబులో డబ్బులు భద్రంగా చూసే బాధ్యత ఇతనికి అప్పగించారు. ముందుగా పుష్కర స్నానం చేసి వచ్చి మిత్రుల పర్సులన్నింటినీ పట్టుకుని ఇలా భద్రంగా చూస్తున్నాడు. -
విశ్వనాథ పలుకు.. విరుల తేనె చినుకు
కిన్నెరసాని వచ్చిందమ్మా.. వెన్నెల పైటేసి.. మరిచి పోలేని పాట. విశ్వనాథ కవితలై లోతు కైతల ఊటలై వచ్చినవి కిన్నెరసాని పాటలు. భూమ్మీద మూడువంతుల నీరు ఒకవంతు మాత్రమే నేల ఉంది కదా. పుడమి తల్లి బిడ్డలమైన మన తనువుల్లో మూడువంతుల రక్తం, ఒకవంతు ఎముకలూ ఉన్నాయి. పాట గానరసమై మన రక్తంలో ప్రవేశించి ప్రవహిస్తుంది. హృదయాణువుల్ని కదుపుతుంది. విశ్వనాథ సత్యనారాయణ ఒకవైపు ‘పాషాణ పాకి’ అని శ్రీశ్రీచే చెప్పబడ్డ కవి. సర్వసాహితీ ప్రక్రియల్లో శిఖరాయమాన రచనలు చేసిన దిట్ట శ్రీమద్రామాయణ కల్ప వృక్షం వంటి ప్రౌఢ పద్య కావ్య నిర్మాత విశ్వనాథ జానపదుని అవతారమెత్తి జానపద పాటలా అన్నంతగా కిన్నెరసాని పాటల్ని తెలుగు పలుకుబడి అనే అందచందాల వేదికపై గాయకుడై గానం చేశా రు. ఆధునిక సమాజానికి ఆయన భావజాలం అవసరం లేదుగాని.. ఆయన కవిత్వ ఇంద్రజాల ఉన్నత ప్రదర్శనలు అందరికీ అవసరమే. అలాంటి కవితా ప్రదర్శన కిన్నెరసాని పాటలు, సాహిత్య సభల్లో ఆయన రామాయణ కల్పవృక్ష పద్యాలు వినిపించడానికి వస్తే మాకు కిన్నెరసాని పాటలు వినిపించండి అని ప్రజలు కోరేవారంటేనే వారెవ్వా ఆ పాటల మజా గ్రహించవచ్చు. లయబద్ధ పదాలు సుళ్లు తిరుగుతాయి. భావాలు ఎక్కడికో తీసుకుపోతాయి. వాక్యాలు రసరమ్యాలౌతాయి. పాఠకుడు లేక శ్రోత గోదావరిని సంగమించే కిన్నెరగా మారి పోయే రసస్థితి. గోదావరి జాలి గుండె గూడులు కదలి/ సాదుకిన్నెరకెదురుపోయీ/ ఆమె-లోదిగులు తరగ చేదోయీ. ఇలా సాగుతుందా కిన్నెరసానిని గోదారి ఆ ప్యాయంగా తనలో కలవడానికి ఆహ్వానిస్తుంది. గోదావరి పేద గుండె లోతులు కలిగి.../ గోదావరి జాలిగుండె ప్రేగులు తడిసి.../ గోదావరి ఎడ ద కోసలను కోతపడి../ గోదావరి దేవి కోసమనసులో వొరసి/ కిన్నెరసానిని పిలిస్తే ఆమె వచ్చి కలుస్తుంది. ఆదుకొను, పాదుకొను, తలిరుమల్లికలు, పొలుచుటలు/ కోరగించుటలో ఇటువంటి తెలుగు మాటల ప్రయోగాల్లో కిన్నెరసాని గోదావరిలో కలిసిపోతుంది. గోదావరి దేవి గొప్ప వంశపు రాణి అని, ఆమె ఏమ న్నా కాదనేందుకు వీల్లేదని, అసలు ఆమె కాదంటే ఏ పనీ చేయరాదని భావించింది కిన్నెరసాని నీటిదొరసానిగా. గోదావరి కిన్నెర కలసిపోయాక సమ్మేళనమైన జలం. గోదావరి నీరు కూడి కిన్నెర నీరు/ఏది ఏదో తెలియనంతగా మారిపోయిందట. గోదావరి దేవిని కిన్నెరసాని కూడిన తర్వాత కిన్నెరసానికి దిగులే లేదట. ఏదైనా దిగులున్న ఎడదలున్న వారెవరైనా కిన్నెరసాని పాటలు చదువుతుంటే, పాడుకుంటే ఆనందం అర్ణవమవుతుంది వేవేల వర్ణాల వర్ణనా శోభతో. -సన్నిధానం నరసింహశర్మ -
అదిరింది బొమ్మాళి
రాజమండ్రి రూరల్ : బైకులు పాడైతే ఎవరైనా ఏం చేస్తారు?. అమ్మేసి మరొకటి కొంటారు. ఇద్దరు శిల్పులు మాత్రం అలాంటి బైకుల్ని విడదీస్తారు. విడి భాగాలు, నట్లతో అద్భుతమైన బొమ్మలను తయారు చేస్తారు. వారి చేతుల్లో ఒంటెలు, సింహాలు, ఎద్దులు, గుర్రాలు.. ఒకటేమిటి ఎన్నో కళాఖండాలు ఊపిరి పోసుకున్నాయి. వాళ్లే తెనాలికి చెందిన సూర్య శిల్ప శాల శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర . వీరు రూపొందించిన శిల్పాలను బొమ్మూరు సెంటర్లో మంజీర యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్నారు. మైనంతో చేసిన శిల్పాల్లో సజీవత్వం తొణికిసలాడుతోంది. మైనంతో చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శన పుష్కర భక్తుల నుంచి మంచి స్పందన వస్తోందని మంజీర యువజన సంఘాధ్యక్షుడు ముద్దాల అను తెలిపారు. -
హెల్ప్‌లైన్‌కు ఫోన్ల ప్రవాహం
సాక్షి, రాజమండ్రి: పుష్కర యాత్రికుల కోసం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు ఫోన్లు వెల్లువలా వస్తున్నాయి. ప్రారంభమైన రోజు నుంచి వేలాదిమంది సమాచారం కోసం హెల్ప్‌లైన్ నెంబరు 12890కు ఫోన్ చేస్తున్నారు. నిత్యం 1800 నుంచి 2వేల కాల్స్ వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 30 శాతం తప్పిపోయిన వారి గురించిన కాల్స్ ఉంటున్నాయి. పుష్కర, కోటిలింగాల ఘాట్‌కు ప్రతిరోజూ వచ్చే వేల కుటుంబాల్లో చాలామంది తప్పిపోతున్నారు. ఆయా కుటుంబాలకు చెందినవారు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి వారి గురించి అడుగుతున్నారు. హెల్ప్‌లైన్ సెంటర్ పుష్కర ఘాట్ల కంట్రోల్ రూముల నుంచి తప్పిపోయిన వారి వివరాలు సేకరించి తమకు ఫోన్లు చేస్తున్న వారికి వివరాలు అందిస్తోంది. ఘాట్లకు వెళ్లే రూట్లు, వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రికి ఎలా రావాలి, రైళ్లు, బస్సు సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు చాలామంది హెల్ప్‌లైన్‌కు ఫోన్లు చేస్తున్నారు. దొంగతనాలు, క్యూలైన్లలో ఇబ్బందులు, ఘాట్లలో సమస్యల గురించి కాల్స్ వస్తున్నాయి. ఒక్క రోజే హెల్ప్‌లైన్‌కు 2,500 కాల్స్ వరకూ వచ్చాయి. హెల్ప్‌లైన్ నిర్వాహకులు ఫిర్యాదులు, సమస్యలను ఆయా శాఖలకు పంపుతున్నారు. పుష్కరఘాట్ ఎదుట ఉన్న భవనంలోని సెంట్రల్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్‌కు 20 ఫోన్‌లైన్లను అనుసంధానం చేశారు. రాజమండ్రి రైజింగ్స్ పేరుతో కొందరు యువకులు నడిపే స్వచ్ఛంద సంస్థ ఈ హెల్ప్‌లైన్ సెంటర్‌ను నడుపుతోంది. ప్రభుత్వ సాయంతో ఈ సెంటర్‌ను ఈ సంస్థే నిర్వహిస్తోంది. 26 మంది వలంటీర్లు మూడు షిఫ్టులుగా 24 గంటలు పని చేస్తున్నారు. -
డూడూ బసవన్న.. కూడు కావాలన్నా
సాక్షి, రాజమండ్రి : సంక్రాంతికి సందడి చేసే బసవన్నకు బువ్వ కరువైంది. పుష్కరాల్లో యజమానితో పాటు యాచిస్తోంది. కుమారీ టాకీస్ ఎదురుగా ఈ దృశ్యం కనిపిం చింది. ‘ఇప్పుడెవరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేమెలా బతకాల. మా కష్టసుఖాల్లో బసవన్నే తోడు. అందుకే ఇలాంటి పండగల్లో మాతోపాటే ఇలా’.. అని వాపోయాడు దాని యజమాని. వెజి‘ట్రబుల్స్’ కాతేరు (రాజమండ్రి రూరల్) : పుష్కరాల సందర్భంగా కూరగాయలకు మంచి డిమాండ్ ఏర్పడింది. పిండ ప్రదాన సమయంలో పురోహితులకు దానం చేసేందుకు భక్తులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. మార్కెటింగ్‌శాఖ మొబైల్రైతు బజార్లను ఏర్పాటు చేసినా భక్తులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. -
‘తండ్రి’తో ‘తొండపు వేలుపు’
వలంధర్‌ఘాట్ (నరసాపురం) : పుష్కరం కోట్లమందికి ముక్తిక్రతువు అయితే.. కొందరికి భుక్తికి తెరువు. రాజమండ్రి నుంచి నరసాపురం వచ్చిన మురళి, సునీల్ ఇలా శివుడు, విఘ్నేశ్వరుడి వేషధారణతో పుష్కరఘాట్ల వద్ద సంచరిస్తూ, యాత్రికుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. వారిచ్చే చిల్లరను గోదారమ్మ కానుకగా దాచుకుంటున్నారు. ‘గణపతి శాస్త్రీ’య స్నానం పుష్కరఘాట్ (రాజమండ్రి): పుష్కరస్నానం చేసేందుకు ఒక పద్ధతి ఉంటుంది. వేదవిహితమైన ఆ పద్ధతి ఎలా ఉంటుందన్నది సామర్లకోటకు చెందిన చింతామణి గణపతిశాస్త్రి ఆధ్వర్యంలో 50 మంది శిష్యబృందం మంగళవారం ఉదయం పుష్కరఘాట్‌లో అందరికీ తెలియజేశారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య వారు చేసిన స్నానం భక్తులను ఆకట్టుకుంది. -
రాజమండ్రిలో భక్తుల కిటకిట
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పుష్కరఘాట్ల వద్ద భక్తుల రద్దీ అలాగే కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో వేలాది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. నిన్నటితో పోల్చిచూస్తే ఈ రోజు కోటిలింగాల ఘాట్ లో భక్తుల రద్దీ కొంచెం తక్కువగా కనిపించింది. వారాంతం కావడంతో భక్తులు తమ కుటుంబసభ్యులతో కలిసి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చారు. అయితే రాజమండ్రి ప్రధాన బస్ స్టాప్ వద్దకు కాకుండా నేరుగా పుష్కర ఘాట్లకు వెళ్లాలని భక్తులను అధికారులు కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజమండ్రిలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
ఉదార గోదారి..
వీఐపీ ఘాట్ (రాజమండ్రి ) : అడగందే అమ్మయినా పెట్టదంటారు. అడగకుండానే దప్పిక తీర్చే అపురూపమైన అమ్మ లాంటిది గోదావరి. ఆ తల్లికి జరిగే పెద్దపండుగలో ఆ ఔదార్యమూ వరదలెత్తుతోంది. పుష్కర కాలంలో ప్రతి దినమూ ఇవీ దానాలని శాస్త్రం నిర్దేశించింది. వాటి మాటేమో గానీ.. బాటల పక్కన పాతగుడ్డలు పరిచీ, బొచ్చెలు సాచీ అర్థించే వారిపైన యాత్రికుల కారుణ్యం దండిగానే వర్షిస్తోంది. పుష్కరాల సందర్భంగా యాచకులను ఘాట్ల దరికి రానివ్వద్దని ఓ మంత్రి గారు సెలవిచ్చినా.. పాపం వివిధ జిల్లాల నుంచి 10 వేల మంది యాచకులు రాజమండ్రి వచ్చినట్టు అంచనా. పారే నదిలో మునకేస్తేనే కాదు.. సాచే చేతిలో తోచినది వేసినా పుణ్యమే కదా! గోదారమ్మను కోరినవి ఇమ్మని అర్థించడమే కాదు.. నోరు తెరిచి అర్థించే వారి మొరను మన్నించడమూ పుణ్యమే కదా! -
ఓపిక సన్నగిల్లినా.. మంత్రాల్లో మిన్నే..
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : వయసు మీద పడింది. ఓపిక సన్నగిల్లింది. అయినా వారి వాక్కు దృఢంగానే ఉంది. మంత్రోచ్చరణ స్వచ్ఛంగానే ఉంది. పుష్కర తీర్థవిధులను నిర్వర్తింపజేసే పురోహితుల్లో పండు వృద్ధులూ ఉన్నారు. పన్నెండేళ్లకోసారి వచ్చే ఈ పుణ్యతరుణంలో ‘పుణ్యం..పురుషార్థం’ అంటూ వారు వయసులో ఉన్న సాటి పురోహితులతో పోటీ పడుతూ వారికి దీటుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కోటిలింగాలఘాట్లో చేతికర్ర ఊతంతో నిలబడి సంకల్పం చెప్పిస్తున్న వృద్ధ పురోహితుడే అందుకు నిదర్శనం. -
కూర్చుంటే రూ.157.. నిల్చుంటే 100..
రాజమండ్రి సిటీ / రైల్వే స్టేషన్: యాత్రికుల రద్దీని అనుసరించి ఆర్టీసీ అధికారులు పుష్కర భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాజమండ్రి డిపో నుంచి విశాఖ వైపు అవసరమైన బస్సులు ఏర్పాటు చేయలేక చేతులెత్తేసిన అధికారులు వినూత్న ప్రయోగం చేశారు. విశాఖపట్నం వరకూ బస్ టికెట్ రూ. 157 వసూలు చేస్తుండగా నిలబడి వెళ్లే ప్రయాణికులకు ధర రూ.వందగా ప్రకటిస్తూ ఫ్లెక్సీలు ఆర్టీసీ డిపో ఆవరణలో అప్పటికప్పడు ఏర్పాటు చేశారు. దీనిని చూసిన ప్రయాణికులు ఇదేం విడ్డూరం అంటూ విస్తుపోయారు. -
కేరాఫ్ అడ్రస్ శివుడు..
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోటిలింగాల ఘాట్‌లో కొత్తగా నిర్మించిన భారీ మహాశివుని విగ్రహం పుష్కర భక్తులకు అండగా ఉంది. ఎవరెక్కడున్నా నేనిక్కడున్నా అంటు శివుని విగ్రహాన్ని బండగుర్తుగా చెప్పుకుంటున్నారు. తప్పిపోయిన వారు సైతం శివుని విగ్రహం దగ్గరకు రమ్మంటున్నారు. ఇలా పుష్కరాలకు వచ్చి తప్పిపోయిన వారికి, తమ బంధువులకు తాము ఎక్కడున్నది తెలిపేందుకు శివుడి విగ్రహాన్ని కేరాఫ్ అడ్రస్ గా చెబుతున్నారు. -
అమ్మాయే అమ్మైంది...
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : అమ్మాయే తన అమ్మకు అమ్మగా మారిన ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దర్శనమిచ్చింది. తల్లీబిడ్డల పుష్కర స్నానం పూర్తయింది. తల్లి బిడ్డకు తలదువ్వి జడ వేసింది. ఆ తల్లి తన జడ తానే అల్లుకోగలదు. కానీ, జనసమ్మర్దంలో అందుకు వీలు కాకపోవడంతో అమ్మాయే అమ్మ డ్యూటీ చేస్తూ తల్లికి ఇలా జడ అల్లింది. -
12 గంటలుంటే ఒక రోజున్నట్టే..!
రాజమండ్రి/కొవ్వూరు : లాడ్జీల్లో వసతి 12 గంటలకు కుదించారు. రుసుము మాత్రం 24 గంటలకు వసూలు చేస్తున్నారు. కొంతమంది 12 గంటలకు సైతం రుసుము పెంచేస్తున్నారు. ఆటోల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వారు చెప్పిందే ధర.. లేకుంటే నడిచి వెళ్లాల్సిందే. మంచినీటి వాటర్ ప్యాకెట్ సైతం అవసరాన్ని బట్టి రూ.2 నుంచి రూ.4 పలుకుతోంది. రోడ్డు పక్కన తోపుడు బళ్లపై ప్లేటు ఇడ్లీ రూ.20 పలుకుతోంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సుల చార్జీలు సైతం రెట్టింపయ్యాయి. రాజమండ్రిలో పుష్కర స్నానం చేసి కోటిపల్లి, అంతర్వేది, కుండలేశ్వరం వంటి ఘాట్లు, అన్నవరం, ద్రాక్షారామం వంటి ఆలయాలకు వెళ్లాలన్నా కార్ల అద్దె రెట్టింపైంది. రాజమండ్రి నుంచి అన్నవరం సాధారణ రోజుల్లో కారు అద్దె దాని స్థాయిని బట్టి డ్రాపిం గ్‌కు రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు ఉండగా, ఇప్పుడు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఉంది. బంధువుల ఇళ్లకు పయనం దీంతో హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర నగరాల నుంచి వచ్చేవారు జిల్లాలోని పల్లెల్లో సమీప బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. బంధుత్వాలు లేని వారు కాకినాడ, మండపేట, అమలాపురం వంటి ప్రాంతాల్లో లాడ్జిలు, హోటళ్లలో ఉంటున్నారు. వీరి రాకతో కాకినాడ, రావులపాలెం, కొత్తపేట, అనపర్తి, జగ్గంపేట వంటి మేజర్ గ్రామాలు, రిసార్టులున్న అల్లవరం మండలం ఓడలరేవు, మలికిపురం మండలం దిండి, మురమళ్ల లాంటి చిన్న గ్రామాల్లో సైతం లాడ్జిలు కిటకిటలాడుతున్నాయి. -
శివయ్యా.. నీకెన్నాళ్లీ కోటింగ్
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : తూర్పుగోదావరి జిల్లా కోటిలింగాల ఘాట్ లో ఏర్పాటు చేసిన భారీ ఈశ్వరుడు విగ్రహానికి ఇంకా మోక్షం లభించలేదు. పుష్కరాల నాలుగో రోజైన శుక్రవారం కూడా శివుని విగ్రహానికి మెరుగులు దిద్దుతూనే ఉన్నారు. ఇంకెప్పటికీ ఈ పనులు పూర్తిచేస్తారో వేచిచూడాల్సిందే మరి.. అలలపై ‘మెయిల్’ తెప్ప.. పుష్కర కల్చరల్ (కొవ్వూరు) : భారతీయ సంస్కృతిలో మరణానంతరం వారి ఆత్మీయులు నిర్వర్తించే విధులెన్నో! వాటిలో ఒకటే మైలతెప్ప. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏడాదిలోపు వారి ఆత్మశాంతి కోసం నదిలో మైలతెప్ప వదల డం రివాజు. పుష్కరాల సందర్భంగా.. వెదురు కర్రముక్కలతో తయారుచేసిన తెప్పలాంటి దానిపై దీపాలు ఉంచి పసుపు, కుంకుమలు వేసి నదిలో వదిలే వారి సంఖ్య ఎక్కువే. ఆ తెప్ప అలలపై ఊగుతూ అలా పయనించిపోతుంటే.. పైలోకంలో ఉన్న తమ వారికి గోదారి ద్వారా ‘మెయిల్’ (సందేశం) పంపుతున్నట్టుంటుంది. -
వీఐపీ ఘాట్‌లో ఇలా చేస్తే మేలు
వీఐపీ ఘాట్ (రాజమండ్రి) : పుష్కర ఘాట్‌లో చోటు చేసుకున్న దుర్ఘటనతో వీఐపీ ఘాట్‌లో సాధారణ యాత్రికులకు కూడా అనుమతిస్తున్నారు. కానీ అధికారులు వీఐపీ కోణంలో బందోబస్తు చేయడంతో ఇబ్బందులు ఎదురౌతున్నా యి. వీఐపీ ఘాట్ నాలుగు విభాగాలుగా ఉంది. వీఐపీలు వచ్చే సమయంలో మైకుల్లో ఘాట్‌లో ఉన్న యాత్రికులను స్నానాలు ముగించుకుని త్వరగా రావాలని పదేపదే హెచ్చరిస్తున్నారు. తొందరగా స్నానాలు ముగించే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ ఘాట్‌లో కేవలం వీఐపీల కోసం ఒక విభాగాన్ని పూర్తిగా కేటాయించి, మిగిలిన మూడు విభాగాలను సాధారణ యాత్రికులకు కేటాయిస్తే మేలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
చిల్లర.. ఓ బంగారు కోడిపెట్ట!
రాజమండ్రి: పేరుకది చిల్లర వ్యాపారమే కానీ డబ్బు నుంచి డబ్బును పొదిగి లాభాలు కురిపించే బంగారుకోడి పెట్ట! అందుకేనేమో చిల్లరను శ్రీమహాలక్ష్మి రూపమంటారు. గోదావరి పుష్కరాల పుణ్యమాని వ్యాపారులకు చిల్లర.. లాభాలను కొల్లగొట్టే మార్గంగా మారింది. నిత్యం లక్షల్లో వివిధ జిల్లాల నుంచి తరలివస్తోన్న భక్తులు నిర్వహించే పూజాదికాలకు చిల్లర అవసరం. దీన్ని ఆసరగా తీసుకుని లాభాలు సంపాదిస్తున్నారు కొందరు వ్యాపారులు. రూ.వందకు రూ.పది కమీషన్ తీసుకుని చిల్లర ఇస్తున్నారు. ఘాట్ల వద్ద, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల సమీపంలో నాణేలు కమీషన్ ప్రాతిపదికపై అందిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం భక్తులకు దగ్గరవడానికి నాణేలు అందిస్తున్నాయి. రిజర్వ్‌బ్యాంక్ నుంచి ఆర్డర్లు రప్పించుకుని రోజుకు రూ.2లక్షల వరకు సరఫరా చేస్తున్నాయి. ఒక్క బ్యాంకులే పుష్కరాలు ముగిసేలోగా రూ.40లక్షల వరకు చిల్లర నాణేలు భక్తులు అందించనున్నాయి. అటు ప్రైవేటు వ్యాపారులు అనధికారికంగా స్టాళ్లు ఏరా్పాటు చేసుకుని చిల్లర వ్యాపారం చేస్తున్నారు. ఈ విధంగా ప్రైవేటు చిల్లర వ్యాపారులు ఇప్పటివరకు రూ.5 లక్షల వరకు వ్యాపారం చేశారని అంచనా. పుష్కరాలు ముగిసే సరికి చిల్లర నాణేలను సుమారుగా రూ.20 లక్షలకు పైగా సరఫరా చేయాలని అంచనా వేసుకున్నారు. -
ఏమి ‘టీ’ బాధ
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పుష్కరాలకు అశేషంగా తరలివస్తున్న లక్షలాది భక్తులకు వసతుల లేమి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. ఉపవాసాలు ఉండి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు మండుటెండలోనే కూర్చొని టీ తాగడం, అల్పాహారాలు భుజించడం వల్ల అసహనానికి గురవుతున్నారు. -
‘రోజ్’మండ్రి
సాక్షి, రాజమండ్రి : రోజ్ మిల్క్..ఇదేంటనుకుంటున్నారా..రాజమండ్రి పుష్కరాలకు వచ్చే భక్తులు స్నానాలు చేశాక ఈ పానీయం తాగి హాయిగా సేదదీరుతున్నారు. రాష్ట్రంలో రోజ్‌మిల్క్‌కు రాజమండ్రి పేరొందింది. నల్లమందు సందుకు సమీపంలోనూ, కోటగుమ్మంకు దగ్గరలోను ఉన్న రెండు దుకాణాలు ఎన్నో ఏళ్ల నుంచి రోజ్‌మిల్క్‌ను నాణ్యమైన రుచితో విక్రయిస్తున్నాయి. మంచి రుచి ఉండే ఈ మిల్క్ దుకాణాలు పలు స్నాన ఘాట్లకు దగ్గరగా ఉండడంతో యాత్రికులు పోటెత్తుతున్నారు. గ్లాస్ రూ.30 కావడంతో ఒకటి లేదా రెండేసి తాగుతున్నారు. చాలాకాలం తర్వాత వ్యాపారానికి విపరీతమైన గిరాకీ ఉండడంతో నిర్వాహకులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అధికారులు, పుష్కరాల బందోబస్తు, పర్యవేక్షణకు వచ్చిన ప్రభుత్వ సిబ్బంది ఈ రోజ్‌మిల్క్‌ను సేవించడంతోపాటు తమ పై అధికారులకు ప్యాక్ చేసి తీసుకువెళ్తున్నట్టు నిర్వాహకులు వివరించారు. -
'నేను నటుడిని కాదయ్యా బాబు..'
వీఐపీ ఘాట్ (రాజమండ్రి) : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని వీఐపీ ఘాట్‌లో ఓ చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వర్థమాన నటుడు షఫీని పోలిన ఓ వ్యక్తి ఘాట్ వద్ద కనిపించాడు. దీంతో భక్తులంతా ఆయన సినీ నటుడనుకుని ఆసక్తిగా పలకరించారు. చివరకు మీడియా ప్రతినిధులు కూడా వెళ్లి ఫొటోలు తీశారు. ఇంతలో కొందరు ఆయన్ని పలకరిస్తూ ‘ఖడ్గం, ఛత్రపతి’ సినీమాలలో మీరు నటించారు కదా? అని ప్రశ్నించగా ఆయన బదులిస్తూ ‘నటుడిని కాదయ్యా బాబు, సీఎం చంద్రబాబుకి ఓఎస్డీని. నా పేరు వెంకయ్యచౌదరి’ అంటూ వెళ్లిపోయారు. -
పుష్కర ఘాట్లలో నై..‘ఫై’
రాజమండ్రి (తూర్పుగోదావరి) : ప్రధాన పుష్కర ఘాట్లలో ఉచిత వైఫై సేవలందిస్తామని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. నిజమేననుకుని పుష్కర భక్తులు సంబరపడిపోయారు. కానీ ఎక్కడా ఈ సేవలు అందుబాటులోకి రాలేదు సరికదా ఫోన్లో మాట్లాడితే తరచూ కట్ అయిపోతోంది. అమలు చేయలేనప్పుడు ఇలాంటి ప్రకటనలెందుకని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇది తమను తప్పుదోవ పట్టించడమేనంటున్నారు. -
మెట్టెక్కితే గట్టెక్కినట్టే..
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : పుష్కర స్నానం కోసం లక్షలాదిమంది ఘాట్లకు తరలి వస్తున్నారు. కానీ వృద్ధులు మెట్లెక్కలేక అవస్థలు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోటిలింగాల ఘాట్‌లో పుష్కర స్నానానికి వచ్చిన వృద్ధులు మెట్లు ఎక్కడానికి పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వీరికి ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మిస్తే ఉపయోగకరంగా ఉండేదని భక్తులంటున్నారు. -
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
వీఐపీ ఘాట్ (రాజమండ్రి) : రెండు కాళ్లూ చచ్చుబడిపోయిన స్నేహితుడిని పుష్కరస్నానం చేయించేందుకు వీపుపై మోసుకుని ఘాట్ వద్దకు వచ్చాడు ఓ స్నేహితుడు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటి గ్రామానికి చెందిన రామకృష్ణ, శివయ్య చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వీరిలో రామకృష్ణ వికలాంగుడు. వారిద్దరూ పుష్కరస్నానం కోసం బస్సులో రాజమండ్రి వచ్చారు. అనంతరం వీఐపీ ఘాట్ వరకు రామకృష్ణను మిత్రుడు శివయ్య తన వీపుపై మోసుకుంటూ వచ్చి పుష్కరస్నానం చేయించాడు. స్నేహితుని పుష్కర స్నానానికి అన్నివిధాల సహకరించి, మిత్రుడు రామకృష్ణ పుణ్యస్నాన కోరికను తీర్చాడు. -
పుష్కర ఘాట్ లో పురోహితుడి నిజాయితీ
వీఐపీఘాట్ (రాజమండ్రి) : స్థానిక వీఐపీ ఘాట్‌లో తనకు దొరికిన పర్సును రాజమండ్రి మార్కండేయస్వామి ఆలయ పూజారి కంట్రోల్ రూమ్‌లో ఉన్న పోలీసులకు అప్పగించాడు. అంతవరకు తమ వస్తువులు పోయాయి అంటూ ఫిర్యాదు చేసే వారినే చూసిన పోలీసులు అతడి నిజాయితీని మెచ్చుకున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మన వద్ద ఉన్న సొమ్ములను దొంగలు తస్కరిస్తే పరిస్థితి ఎలావుంటుందో తనను అనుభవం ఉందంటూ కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వెళ్లిన సమయంలో బ్యాగ్‌ని పోగొట్టుకుని తిరిగి వచ్చేందుకు సొమ్ములు లేక, ఇతరులను అడగలేక పడిన ఇబ్బందులను వివరించాడు. -
పుష్కరాల్లో వైఎస్ఆర్ ఫౌండేషన్ సేవలు
-
వెలగనీకుమా ఈ దీపం...
కోటిలింగాలఘాట్ (రాజమండ్రి) : దీపం ఆర్పడం అమంగళమని అంతా భావిస్తారు. కానీ పుష్కర ఘాట్లలో మాత్రం దీపాలు ఆర్పడం కూడా సేవే అవుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కోటిలింగాలఘాట్ లో ఈ దీపాలు ఆర్పడం మనం గమనించవచ్చు. వాలంటీర్లు చేస్తున్న ఈ పని ఖచ్చితంగా సేవే అవుతోంది. ఎలా అంటే, పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులు గోదావరిలో వదిలేందుకు దీపాలు వెలిగించి ఘాట్ల మెట్లపై విడిచి పెడుతున్నారు. వీటివల్ల రద్దీ ఘాట్ల మెట్లపై రాకపోకలు సాగించే భక్తులు ప్రమాదాలకు గురవుతున్నారు. పుష్కర ఘాట్ల వద్ద వాలంటీర్లు ఈ విషయాన్ని గుర్తించి భక్తులు వెలిగించి వదిలేసిన దీపాలను ఆర్పి తొలగిస్తున్నారు. ఈ విధంగా పరోక్షంగా ప్రమాదాలను నివారిస్తున్నారు. -
కోటిలింగాలు ఎక్కడ ?
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : ఇక్కడ కోటిలింగాలు ఉన్నాయంటకదా.. ఎక్కడున్నాయి బాబూ అంటూ కోటిలింగాల రేవుకు పుణ్యస్నానాలకు వచ్చిన అనేక మంది యాత్రికులు ఆసక్తిగా ప్రశ్నించారు. ఈ రేవులో కోటి లింగాలున్నాయని, అందువల్లే ఈ రేవుకు ఈ పేరు వచ్చిందని నానుడి ఉండడంతో అందరూ వాటిని చూసేందుకు ఉత్సుకత కనబరిచారు. అయితే అవి ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియక పోవడం.. ఎక్కడా కనిపించకపోవడంతో వాటి కోసం ఆరా తీశారు. తీరా కోటిలింగాలు లేవని తెలియడంతో ఒకింత నిరాశకు గురయ్యారు. రేవుకు ఆ పేరు ఎందుకొచ్చిందంటే! కుమార సంభవ సమయంలో రాక్షసులమీద శివుని స్వేద బిందువులు పడడంతో ఆ రాక్షసులందరూ శివలింగాలుగా మారిపోయారని పురాణాలు చెబుతున్నాయి. ఆ శివలింగాలన్నీ గోదావరి జన్మస్థానమైన నాశిక్ నుంచి వరుసగా ప్రతిష్టించుకుంటూ రాగా.. రాజమండ్రి కోటిలింగాలరేవు వద్దకు వచ్చేసరికి ఒక లింగం తక్కువ రావడంతో ఆ శివలింగాన్ని కాశీ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించడంతో కోటిలింగాలు పూర్తయ్యాయి. దీంతో ఈ రేవుకు కోటిలింగాలుగా పేరొచ్చిందని, ఇక్కడ ఉమా కోటిలింగేశ్వరస్వామిగా శివుడు పూజలందుకుంటున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే పూర్వం నుంచి కోటిలింగాల రేవుగా ప్రసిద్ధి చెందడంతో భక్తులు ఈ ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అప్పట్లో ప్రతిష్టించిన కోటి శివలింగాలు కాలక్రమేణా గోదావరిలో కలిసిపోవడంతో ఎవరికీ కనిపించవని చరిత్రకారులు చెబుతున్నారు. కోటిలింగాలను చూద్దామని వచ్చా ఇక్కడ కోటిలింగాలుంటాయనుకుని వచ్చా. వాటిని ఓ సారి చూసి తరిద్దామనుకున్నా. కానీ ఇక్కడ కోటిలింగాలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదంటున్నారు. ఇది కొంత నిరాశ కలిగించింది. - ఎ.సుబ్బారావు, ఒంగోలు అది చరిత్ర మాత్రమే కోటిలింగాలు అనేది చరిత్రలో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కోటిలింగాలు కనిపించవు. చాలా మందికి ఈ విషయం తెలియక ఇక్కడ కోటిలింగాలు ఉన్నాయనుకుంటారు. - జి.సుబ్రహ్మణ్యం, ఉమా కోటిలింగేశ్వరస్వామి దేవస్థాన ఈఓ -
పుష్కరాల్లో పలువురి చేతివాటం
రాజమండ్రి : పుణ్య స్నానం చేయడానికి పవిత్ర గోదావరిలో మునిగింది ఓ మహిళ..పైకి లేచి చూసే సరికి ఆమె మెడలోని 10 కాసుల బంగారం మాయం..అయ్యో..అయ్యో..అంటూ నీటిలో వెదికినా ఫలితం శూన్యం.. జారి పడిపోయింటాయనుకున్నారంతా.. కానీ అక్కడ జరిగింది వేరు. మరో సంఘటన చూస్తే.. పాత సోమాలమ్మగుడి ప్రాంతానికి చెందిన కుడుపూడి వెంకట ఆంజనేయులు బుధవారం ఉదయం 11 గంటలకు బ్యాంకులో రూ.1.45 లక్షలు డిపాజిట్ చేయడం కోసం గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న స్టేట్ బ్యాంకు శాఖకు వెళ్లారు. డబ్బులు లెక్కిస్తుండగా బ్యాంకు చలానా ఫారం ఎలా పూర్తి చేయాలంటూ అడిగాడు ఓ అపరిచితుడు. అతడికి ఆంజనేయులు సమాధానం చెబుతుండగా వెనుక నుంచి వచ్చిన మరో వ్యక్తి డబ్బుల సంచి లాక్కులి పారిపోయాడు. వెంబడించినా ప్రయోజనం లేదు. అప్పటికే ఆ దొంగలిద్దరూ పుష్కర యాత్రికుల్లో కలిసిపోయారు. పుష్కరాల్లో భద్రత కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అడుగడుగునా సీసీ కెమెరాలు చేసి, పోలీసులను ఉంచింది. అయినా దొంగతనాలను నిలువరించలేకపోతోంది. -
ఆఖరికి మృతదేహాలనూ వదలలేదు..
మాయమైన 60 కాసుల బంగారం కంబాలచెరువు (రాజమండ్రి) : గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మృతదేహాలను తరలించే ప్రక్రియలో వారి శరీరంపై నున్న సుమారు 60 కాసుల బంగారం మాయమైంది. అంబులెన్స్‌ల్లో పలు దఫాలుగా వస్తున్న మృతదేహాలను ఆస్పత్రి మార్చురీ వద్ద దింపే ప్రక్రియలో కొందరు సాయం చేస్తున్నట్టు నటించి బంగారాన్ని తస్కరించారు. పోస్టుమార్టం చేసేందుకు మృతదేహాల శరీరంపై నున్న ఆభరణాలను ఆస్పత్రి సిబ్బంది తీసి వారి కుటుంబసభ్యులకు ఇచ్చేస్తారు. ఈ క్రమంలో కొందరు బయట వ్యక్తులు అక్కడకు వచ్చి మృతదేహాలను దింపే సమయంలో వారి చేతికి పని చెప్పారు. తొక్కిసలాటలో మృతిచెందిన నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన బొమ్మిశెట్టి అనసూయమ్మ మృతదేహాన్ని వారి కుమారులు తీసుకెళ్లేందుకు వచ్చారు. ఆ సమయంలో శరీరంపై నున్న బంగారు ఆభరణాలు కనిపించకపోయేసరికి అక్కడి సిబ్బందిని అడిగారు. వారు తమకు తెలియదని చెప్పారు. తన తల్లి శరీరంపై ఏడు కాసుల బంగారు ఆభరణాలు ఉంటాయని, అవి ఏమైపోయాయో తెలియవని అక్కడే ఉన్న ‘సాక్షి’ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. 27 మందీ ఊపిరాడకే చనిపోయారు పుష్కరాల ప్రత్యేక వైద్యాధికారి నాయక్ వెల్లడి రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 27 మందీ కేవలం ఊపిరాడకే మృతి చెందారు. దీనిలో మృతి చెందిన వారిపై పలు విషయాలు తెలుసుకునేందుకు వెళ్లిన ‘సాక్షి’తో ఆయన బుధవారం మాట్లాడారు. ఒక్కసారిగా జనం రద్దీ పెరిగిపోయి ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయిందన్నారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో కొందరు కిందపడిపోగా, మరికొందరు జనం మధ్యలో గట్టిగా నలిగిపోయారన్నారు. 26 మంది ఘటనా స్థలంలో చనిపోయారన్నారు. ఊపిరాడక ఆస్పత్రికి 51 మంది రాగా, వారిలో ఒకరు మృతి చెందారన్నారు. మిగిలిన వారందరికీ మెరుగైన వైద్య సేవలందించి ఇళ్లకు పంపామన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తమ వైద్యాధికారి డీసీహెచ్ఎస్ షాలినీదేవి ఆ ప్రాంతంలో ఉన్నారని, సంఘటనను చూసి తనకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వైద్యులను అప్రమత్తం చేశామన్నారు. కొందరిని ఘటనా స్థలానికి, మరికొందరిని ఆస్పత్రి వద్ద ఉంచామన్నారు. -
పుష్కరాల ట్విట్టర్ ఖాతాలో ప్రముఖులు వీరే..
రాజమండ్రి : గోదావరి పుష్కరాల మెయిన్ మీడియా సెంటర్ ట్విట్టర్ ఖాతాలోకి చేరుకున్న ప్రముఖుల జాబితా బుధవారంనాటికి వందకు చేరింది. ట్విట్టర్లో గోదావరి నది, తీరప్రాంత జీవన వైవిధ్యం, రాజమండ్రి వద్ద గోదావరి ప్రభావం, 2003 గోదావరి పుష్కరాల ఆకర్షణీయమైన చిత్రాలకు ఇచ్చిన వ్యాఖ్యానాలు పలువురి దృష్టిని ఆకర్షించాయి. ట్విట్టర్లో జీపీఎంఎంసీ 2015, ఫేస్బుక్లో జీపీఎంఎంసీఆర్జెవై పేరుతో ఇవి అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఫేస్బుక్లో తెలుగు పోస్టుల కారణంగా ఎక్కువమంది తెలుగువారు చూస్తూ స్పందిస్తూండగా, ఆంగ్లంలో ఉండే ట్విట్టర్‌ను దేశ విదేశాలవారు ఫాలో అవుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్ మొదలైన రోజే సభ్యునిగా చేరగా, దలైలామా, సుబ్రహ్మణ్యస్వామి, అరవింద్ కేజ్రీవాల్, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, మక్తార్ అబ్బాస్ నక్వి, అమిత్‌షా, కిరణ్‌బేడీ, సచిన్ టెండూల్కర్, అజేయ్ మాకెన్, నేషనల్ జియోగ్రఫిక్ చానల్, ఎన్.రామ్ (ది హిందూ), జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్, ఆమిర్‌ఖాన్, నాగార్జున అక్కినేని, పవన్ కళ్యాన్, మహేష్‌బాబు, రామ్‌గోపాల్‌వర్మ, రాజమౌళి, ఏఆర్ రెహమాన్, శృతిహాసన్, దగ్గుబాటి రానా వంటివారు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ వంటి పాపులర్ వ్యక్తులకు సుమారు 50 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నందున రాజమండ్రి పుష్కరాల గురించి వీరందరికీ సమాచారం అందుతుందని వీటిని నిర్వహిస్తున్న సమాచార శాఖ అధికారి జాన్సన్ చోరగుడి తెలిపారు. కాగా ఇప్పటివరకూ ఈ ఖాతాను 113 మందికి పైగా ఫేస్బుక్ ఖాతాలో అనుసరిస్తున్నారని, పుష్కరాలు ముగిసేలోగా ఈ సంఖ్య ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతుందనే ఆశాభావంతో ఉన్నామని ఆయన అన్నారు. -
తొలిరోజు వరదలా.. మరునాడు వెలవెలా
ప్రతిమెట్టూ.. ఓ ఊరిపెట్టుగా, మొత్తం స్నానఘట్టం చూస్తే.. ఓ పట్టణమే తరలి వచ్చిందా అన్నట్టుగా కిక్కిరిసిపోయింది కోటిలింగాల ఘాట్. ఆసేతు శీతాచల పర్యంతం మరే జీవనది తీరానా లేనంత భారీ ఘాట్‌గా పరిగణిస్తున్న ఈ రేవు.. పుష్కరాల రెండో రోజైన బుధవారం భక్తజన పారావారమే అయింది. అయితే అది ఉదయం మాత్రమే. పుష్కర ఘాట్ దుర్ఘటనతో రాజమండ్రి నగరంలో భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. జిల్లాలోని మిగిలిన ఘాట్లలోనూ గణనీయంగా భక్తులు నదీస్నానం ఆచరించారు. బోసిపోయిన పుష్కర ఘాట్ తొక్కిసలాట మరణాల ప్రభావం రెండో రోజు రాజమహేంద్రికి తగ్గిన భక్తులు రాజమండ్రి : పావన వాహిని మహాపర్వం తొలిరోజైన మంగళవారం రాజమండ్రికి జనవాహిని ఉప్పెనై ఉరికి వచ్చింది. గోదావరి స్నానరేవులతోపాటు, నగరంలోని ప్రతి వీధీ.. ప్రతి రహదారీ.. జనప్రవాహాన్ని తలపించాయి. వాహనాలతో కిక్కిరిసిపోయాయి. చివరికి జాతీయ రహదారిపై కూడా వెల్లువై వచ్చిన వాహనాలతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే, దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి రాజమండ్రిలో బుధవారం కనిపించింది. తొలి రోజు పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాట.. 27 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన నేపథ్యంలో నగరానికి భక్తుల తాకిడి గణనీయంగా తగ్గింది. భక్తజనవెల్లువ గోదావరి పల్లెతీరాలకు తరలిపోయింది. అయితే ప్రభుత్వం మాత్రం పుష్కర స్నానాలు చేసేవారి సంఖ్యను అధికం చేసి చూపించేందుకు సిద్ధమవుతోంది. పుష్కర ఘాట్ ఘటన నేపథ్యంలో పుష్కర స్నానాలకు రాజమండ్రి రావాలంటేనే భక్తజనం భయపడే పరిస్థితి ఏర్పడింది. మంగళవారం పుష్కరాలకు జనం పోటెత్తారు. ఘాట్లవద్ద బారులు తీరారు. పుష్కరాల ఆరంభ ముహూర్తానికన్నా ముందే భక్తులు పుష్కర, వీఐపీ ఘాట్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్నానాలు చేశారు. చివరకు చిన్నచిన్న ఘాట్లలో సైతం భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. అయితే ఒక్క రోజులోనే పరిస్థితి తల్లకిందులైంది. పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృత్యువాత పడడంతో నగరానికి వచ్చేందుకు జనం వెనుకంజ వేశారు. విషాద ఘటన జరిగిన పుష్కర ఘాట్‌లోనే కాకుండా మిగిలిన ఘాట్ల వద్ద కూడా జనం తగ్గారు. పుష్కర ఘటనకు తోడు ఘాట్ల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, ఘాట్లకు రావాలంటే కిలోమీటర్ల మేర నడిచి రావాల్సి ఉండడం, వేసవిని తలపించే ఎండ.. ఆపై అమావాస్య కావడం భక్తుల సంఖ్య తగ్గడానికి కారణమైంది. అయితే భక్తులు అధికంగా హాజరైనట్టు ప్రభుత్వం అంకెలు ఎక్కువ చేసి చూపిస్తోంది. జిల్లావ్యాప్తంగా 17.29 లక్షల మంది భక్తులు స్నానం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఆ పరిస్థితి మాత్రం లేదు. దేశంలోనే అతి పెద్దదిగా చెబుతున్న కోటిలింగాల ఘాట్‌కు తొలి రోజు 4.20 లక్షల మంది భక్తులు రాగా, గురువారం రెండు లక్షలలోపే భక్తులు వచ్చారు. రాజమండ్రి గ్రామీణ ప్రాంతాల్లో అధికార లెక్కల ప్రకారం సుమారు రెండు లక్షల మంది భక్తులు స్నానం చేయగా, రెండో రోజు ఏకంగా నాలుగు లక్షల మందికి పైగా స్నానాలు చేశారు. ఒక్క కోటిపల్లి ఘాట్‌లోనే 1.50 లక్షల మంది స్నానాలు చేసినట్టు అంచనా. కాట్రేనికోన, అయినవిల్లి, సోంపల్లి, అప్పనపల్లి, అంతర్వేది ఘాట్ల వద్ద సైతం భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. అయితే అధికారుల లెక్కలకు, స్నానాలు చేస్తున్నవారి సంఖ్యకు పొంతన ఉండడంలేదన్న విమర్శలున్నాయి. గ్రామీణ ప్రాంతంలో పుష్కర స్నానాలు చేసేవారి సంఖ్యను తగ్గించి. రాజమండ్రి నగరంలో స్నానాలు చేసేవారి సంఖ్యను పెంచి చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్కర ఘాట్ వెలవెల పుష్కరాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పుష్కర ఘాట్. 2003లో ఇక్కడ అత్యధికంగా 63.34 లక్షల మంది భక్తులు స్నానం చేశారు. ఇక్కడ పుష్కర స్నానం చేస్తేనే అధిక పుణ్యమని భక్తుల నమ్మకం. అటువంటి పుష్కర ఘాట్‌ను చూసి భక్తులు ఇప్పుడు భయపడుతున్నారు. పుష్కర ఆరంభం రోజైన మంగళవారం ఈ ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి 27 మంది మృత్యువాత పడడంతో ఈ ఘాట్‌కు వెళ్లేందుకు భక్తులు వెనకాడుతున్నారు. ఇక్కడ పుష్కరాల తొలి రోజు అత్యధికంగా 1.40 లక్షల మంది స్నానాలు చేయగా, బుధవారం మాత్రం వారి సంఖ్య లక్షకు లోపే ఉందని అంచనా. రాజమండ్రి వచ్చే భక్తులను పోలీసులు ముందు జాగ్రత్తగా పుష్కర ఘాట్‌వైపు కాకుండా, ఇతర ఘాట్లవైపు మళ్లించారు. భక్తులు సైతం అటు వెళ్లే సాహసం చేయలేకపోయారు. దీంతో ఈ ఘాట్ చాలాసేపు వెలవెలబోతూ కనిపించింది. అధికారుల తప్పుడు లెక్కలు పుష్కర ఘాట్ సంఘటనను తక్కువ చేసి చూపించేందుకు, ఈ ఘటనతో సంబంధం లేకుండా భక్తులు అధిక సంఖ్యలో రాజమండ్రి తరలివస్తున్నట్టు చెప్పుకునేందుకు ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రయత్నిస్తోంది. రాజమండ్రిలో పుష్కర ఘాట్‌తోపాటు మిగిలిన ఘాట్ల వద్ద భక్తజనం లేకున్నా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చినట్టు ప్రభుత్వం చూపిస్తోంది. తొలి రోజు మంగళవారం తొక్కిసలాట జరిగిన తరువాత కూడా పుష్కర ఘాట్‌కు భక్తుల తాకిడి అధికంగానే ఉంది. అయితే బుధవారం మాత్రం ఉదయం కొద్దిగా జనసంచారం కనిపించినా, మధ్యాహ్నం 11 గంటల నుంచి భక్తుల రాక అంతంతమాత్రంగానే ఉంది. బారికేడ్లు, ఘాట్లు ఖాళీగా కనిపించాయి. మంగళవారం ఈ ఘాట్‌లో 1.40 లక్షల మంది స్నానాలు చేశారని ప్రకటించిన ప్రభుత్వం, బుధవారం ఏకంగా రెండు లక్షల మంది స్నానాలు చేసినట్టు చెప్పడం విడ్డూరం. మరోపక్క కోటిలింగాల ఘాట్ కూడా మధ్యాహ్నం ఖాళీగా కనిపించింది. కానీ ఇక్కడ ఏకంగా 7.64 లక్షల మంది స్నానం చేసినట్టు ప్రభుత్వం చెప్పుకొస్తోంది. మంగళవారం ఘాట్ కిటకిటలాడిన సమయంలో ఇక్కడ 4.20 లక్షల మంది ఉన్నారని చెప్పి, జనం లేని రోజున రెట్టింపు సంఖ్యలో జనం వచ్చినట్టు చెప్పడం విచిత్రం. అసలు యాత్రికుల సంచారం పెద్దగా లేని గౌతమ ఘాట్‌లో ఏకంగా 1.19 లక్షల మంది స్నానాలకు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. పుష్కర ఘాట్ ఘటనను నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాజమండ్రి నగరంలో స్నానాలు చేసేవారి సంఖ్యను పెంచి చూపించేందుకు ప్రభుత్వం తాపత్రయపడడం విమర్శలకు తావిస్తోంది. -
అయ్యప్ప సన్నిధిలోజననేత జగన్
సాక్షి, రాజమండ్రి :పవిత్ర గోదావరి తీరంలోని ప్రసిద్ధ శ్రీ ధర్మశాస్తా ఆధ్యాత్మిక కేంద్రాన్ని (అయ్యప్పస్వామి ఆలయం) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం నుంచి రోడ్ కం రైల్వే వంతెన మీదుగా రాజమండ్రి చేరుకున్న ఆయన సరస్వతి ఘాట్ (వీఐపీ ఘాట్) పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకున్నారు. శబరిమలైలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని తలపించేలా రాతిశిలలతో మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. పుష్కరాల సందర్భంగా ఈ ఆలయాన్ని దర్శించుకున్న జగన్మోహన్రెడ్డికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. డాక్టర్ ఎస్.చంద్రమౌళిస్వామి ఆధ్వర్యంలో పలువురు వేద పండితులు వేదమంత్రోచ్ఛరణలతో జగన్మోహన్రెడ్డికి గులాబీలు, అక్షతలతో ఆశీర్వచనాలు పలికారు. సంప్రదాయ తలపాగాలో.. స్వామివారి పట్టువస్త్రంతో చంద్రమౌళిస్వామి అలంకరించిన సంప్రదాయక తలపాగాలో జగన్మోహన్రెడ్డి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బంగారు పూత పూసిన అయ్యప్పస్వామి పెండెంట్స్‌ను ఆయనకు అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని విఘ్నేశ్వరుడు, సువర్చలాదేవి, ఆంజనేయస్వామి, వ్యాఘ్రేశ్వరుడు సుబ్ర హ్మణ్య స్వామివార్లను కూడా దర్శించుకున్న జగన్.. అయ్యప్ప 18 మెట్ల పీఠాన్ని దర్శించుకుని స్వయంగా దీపారాధన చేశారు. అనంతరం కొద్దిసేపు కూర్చున్నారు. ఆలయంలో నిత్యాన్నదానాన్ని పరిశీలించారు. ఆలయ నిర్మాణం, విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన రాజమండ్రికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలన్న సంకల్పంతో దివంగత జక్కంపూడి ఈ ఆలయాన్ని నిర్మించారని ఆలయ చైర్పర్సన్ జక్కంపూడి విజయలక్ష్మి వివరించారు. యాత్రికులకు పలకరింపు ఆలయానికి వచ్చిన పుష్కర యాత్రికులను జగన్ పలకరించారు. ప్రతి ఒక్కరినీ ఎక్కడ నుంచి వచ్చారు? పుష్కర స్నానం చేశారా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అని ఆరా తీశారు. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు జగన్‌ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. ప్రతి ఒక్కరూ కరచాలనం చేస్తూ సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. గర్భగుడిలో జగన్ సంప్రదాయబద్ధంగా పూజలు చేయడాన్ని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. భక్తులతోపాటు వేద పండితులు, ఆలయ సిబ్బంది కూడా జననేతను చూసేందుకు ఆసక్తి చూపారు. ఆలయానికి వచ్చిన జగన్‌కు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు చల్లా శంకర్రావు, పోలసపల్లి హనుమంతరావు, కేశవరాజు స్వాగతం పలికారు. పట్టువస్త్రాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిత్యాన్నదాన వంటశాలను పరిశీలించి క్యూలైన్లో నిలుచున్న భక్తులతో ముచ్చటించారు. గోదారమ్మకు చీర, పసుపు, కుంకుమ, పువ్వులు జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా జక్కంపూడి విజయలక్ష్మి సమర్పించారు. సుమారు 45 నిమిషాలపాటు ఆలయంలో గడిపిన అనంతరం జగన్మోహన్రెడ్డి నేరుగా మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని విమానంలో హైదరాబాద్ పయనమయ్యారు. ఆయన వెంట ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్, రాష్ర్ట కార్యదర్శులు జక్కం పూడి రాజా, కర్రి పాపారాయుడు, సుంకర చిన్ని, తాడి విజయభాస్కరరెడ్డి, యువజన విభాగం రాష్ర్ట కార్యదర్శి గుర్రం గౌతమ్, పార్టీ కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, ఆకుల వీర్రాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, రాష్ర్ట యువజన విభాగం కార్యదర్శి వాసిరెడ్డి జమీల్, రాజమండ్రి నగరపాలక సంస్థలో పార్టీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు ఆర్వీవీ సత్యనారాయణచౌదరి ఉన్నారు. -
బస్సులు లేక భక్తుల పాట్లు..
రాజమండ్రి/ కొవ్వూరు : అమావాస్య కావడంతో 5 లక్షల మందికి పైగా పుష్కర స్నానాలకు వచ్చినట్లు అధికారులు అంచనావేశారు. అయినప్పటికీ, యాత్రికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులు సరిపోలేదు. 50 అదపపు బస్సులు ఏర్పాటుచేసినా భక్తులకు సరిపోకపోవడంతో కాలినడక తప్పలేదు. గోదావరి పుష్కరాల రెండో రోజు అమావస్య కావడంతో భక్తుల తాకిడి కొంత మేరకు తగ్గినట్లు కనిపిస్తోంది. ఎండలు మండుతున్నప్పటికీ గంటల పాటు ఘాట్ వద్ద ఉండి పిండ ప్రదానాలు నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 300 ఉచిత బస్సులు తొలిరోజు ఏ ఒక్కటీ అందుబాటులో లేకపోగా, రెండోరోజు మాత్రం బస్సుల కొరతతో భక్తులు పుష్కర ఘాట్లకు వెళ్లడానికి నానా అవస్థలు పడ్డట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో రెండోరోజు భక్తుల తాకిడి కొంత మేరకు తగ్గింది. -
తమ బంధువుల జాడకోసం..
నిరీక్షిస్తున్న కుటుంబసభ్యులు ఘాట్ల వద్ద చెల్లాచెదురైన భక్తులు కానరాని కంట్రోల్ రూమ్‌లు సాక్షి , రాజమండ్రి/ పుష్కరఘాట్ : గోదావరి పుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో అధికారులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పుష్కర స్నానానికి లక్షలాది మంది వస్తారని తెలిసినా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం చెందింది. అన్ని ఘాట్ల వద్ద ఊహించని విధంగా భక్తుల తాకిడి పెరిగిపోవడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన అనేక మంది తమ వారి ఆచూకీ కోల్పోయి విషాదంలో మునిగిపోయారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన 18 ఘాట్లలోనూ అదే దుస్థితి. చివరకు తమ బంధువుల జాడ తెలుసుకోవడం కోసం బాధితులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసుల నుంచి సహకారం కరువైంది. కంట్రోల్ రూంకు వెళ్లి సమాచారం ఇవ్వాలని ప్రయత్నం చేసినా తగినన్ని ఘాట్ల వద్ద అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో తెలియక వందలాది మంది భక్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ముఖ్యంగా పుష్కర ఘాట్ వద్ద పరిస్థితి మరీ దారుణం. చిన్నపిల్లలతో వచ్చిన వారి పరిస్థితి మరీ ఘోరం. తప్పిపోయిన వారిని పసిగట్టి ఒకచోటకు చేర్చడంలో పోలీసు శాఖ పూర్తిగా విఫలమైంది. పూర్తిస్థాయిలో ఎక్కడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయలేదు. గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రిలో 18 ఘాట్లను ఏర్పాటు చేయగా అన్ని చోట్లా ఇదే సమస్య. మంగళవారం ఉదయం పుష్కరాల ప్రారంభం నేపథ్యంలో ఉదయం 8 గంటల లోపు సుమారు వెయ్యి మంది తప్పిపోయారు. వారిని కుటుంబ సభ్యుల దగ్గరకు చేర్చేందుకు అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో ఒకరి కోసం ఒకరు వెదుకులాట ప్రారంభించి అష్టకష్టాలు పడ్డారు. కొందరు తమ వారిని చేరుకోగా, మరి కొందరు ఎక్కడికి వెళ్లిపోయారో కూడా తెలియని పరిస్థితి. పుష్కరఘాట్‌లో మూడేళ్ల బాలుడు ఒంటరిగా తిరుగుతుండడాన్ని ఓ భక్తుడు గమనించి చేరదీశాడు. అతడిని సెంట్రల్ కాల్ సెంటర్‌కు తీసుకువచ్చాడు. ఆ బాలుడు తన పేరు గౌతమ్ అని, తన తండ్రి పేరు ఈశ్వర్, తల్లి సుమతి అని చెప్పాడు. విషయాన్ని మైకులో అనౌన్స్ చేశారు. అయినా ఎవరూ స్పందించలేదు. దీంతో ఆ బాలుడి దుఃఖానికి అంతులేకుండా పోయింది. తన తల్లిదండ్రులు కనిపించక ఆ బాలుడు, బాలుడు ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు నరకయాతన అనుభవించారు. పుష్కర సిబ్బంది మైకులో అనౌన్స్ చేసినా బాలుడి తల్లిదండ్రులకు విషయం చేరలేదు. -
బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. విజయవాడ పర్యటనను సగంలోనే ముగించుకుని హుటాహుటిన రాజమండ్రి వెళ్లిన ఆయన.. అక్కడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఓదార్చారు. పుష్కరానికి వచ్చి మృతిచెందిన భక్తుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన భక్తులను ఆయన పరామర్శించారు. యాత్రికుల మృతి విషయాన్ని తెలుసుకున్న ఆయన హుటాహుటిన రాజమండ్రికి చేరుకున్నారు. రాజమండ్రి కోటిలింగాల రేవు పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి 27 మంది మృతిచెందడంతో పాటు మరికొంత మంది గాయపడిన విషయం తెలిసిందే. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని తక్షణం అందజేయాలని, క్షతగాత్రులకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని ఆయన కోరారు. -
లారీ ఢీకొని యువకుడు మృతి
రాజమండ్రి రూరల్: లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్తానికుల కధనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి... మండలంలోని లాలా చెరువు సమీపంలోని స్పిన్నింగా మిల్లు వద్ద బత్తిన నగర్ కు చెందిన సూరిబాబు(23) రోడ్డు పక్కన నడుస్తుండగా లారీ ఢీకొట్టింది. బాధితుడి పై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారైయ్యాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరిలించారు. కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలింపు చేపట్టారు. -
విమానాశ్రయ సమాచారం
మధురపూడి : రాజమండ్రి నుంచి 9 కిలో మీటర్ల దూరంలో విమానాశ్రయం ఉంది. మధురపూడి-హైదరాబాద్‌ల మధ్య రోజూ జెట్ ఎయిర్వేస్ రెండు,స్పైస్ జెట్ రెండు వంతున మొత్తం నాలుగు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రతి మంగళవారం స్పైస్‌జెట్ రెండో సర్వీసు ఉండదు. ఈ రెండు రోజుల్లో మూడు విమానాలు మాత్రమే కొనసాగుతాయి. రాకపోకల సమయాలు జెట్ ఎయిర్వేస్ * మొదటి సర్వీసు మధురపూడి-హైదరాబాద్ ఉదయం 10.30 గంటలకు వచ్చి, తిరిగి 10.55 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతుంది. * రెండో సర్వీసు మధురపూడి-హైదరాబాద్ మధ్యాహ్నం 2.20 గంటలకు వచ్చి, తిరిగి 2.45 గంటలకు హైదరాబాద్ బయలు దేరుతుంది. * జెట్‌ఎయిర్‌వేస్ కాల్ సెంటర్ నెం. 04039893333), విమానాశ్రయంలో జెట్ ఎయిర్వేస్ కార్యాలయం నెం. 08832007866. స్పైస్ జెట్ * మొదటి సర్వీసు మధురపూడి-హైదరాబాద్ మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చి, తిరిగి 12.55 గంటలకు హైదరాబాద్ వెళుతుంది. * రెండో సర్వీసు మధురపూడి-హైదరాబాద్ సాయంత్రం 3.20 గంటలకు వచ్చి, సాయంత్రం 3.45 గంటలకు హైదరాబాద్ వెళుతుంది. * టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు * కాల్ సెంటర్ నం. 09871803333. * విమానాశ్రయంలో అథారిటీ కార్యాలయం నం. 0883-2007838. -
విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన ఉపాధ్యాయుడు!
అధ్యాపకుడికి దేహశుద్ధి కంబాలచెరువు (రాజమండ్రి) : విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన అధ్యాపకుడికి ఆమె బంధువులు దేహశుద్ధి చేసిన సంఘటన రాజమండ్రి ఆర్యాపురంలోని ప్రగతి కళాశాలలో శనివారం చోటుచేసుకుంది. బాధిత విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మల్లయ్యపేటకు చెందిన బి.తేజశ్రీ అదే కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఆమె తరగతి గదిలో తన స్నేహితులతో మాట్లాడుతోంది. దీనిని చూసిన కామర్స్ అధ్యాపకుడు కల్యాణ్ ఆమెను పిలిచి చితకబాదాడు. విద్యార్థిని అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టాడు. కళాశాల విడిచిపెట్టిన తర్వాత ఇంటికెళ్లిన ఆమె ఈ విషయాన్ని తన తండ్రి రాంబాబుకు తెలిపింది. అతడితో పాటు బంధువులు కళాశాలకు వెళ్లి ఈ సంఘటనపై అధ్యాపకుడిని నిలదీశారు. అతడిని త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి.. పోలీసులకు సంఘటనను వివరించారు. దీనిపై మాట్లాడుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చంటూ కళాశాల ప్రిన్సిపాల్ మురళి నచ్చజెప్పాడు. దీంతో బాధితురాలి బంధువులు శనివారం ఉదయం కళాశాలకు చేరుకుని.. ఆ అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అధ్యాపకుడికి దేహశుద్ధి చేశారు. రాజమండ్రి అన్ఎయిడెడ్ కళాశాలల అసోసియేషన్(రూకా) నాయకులు అక్కడకు చేరుకుని, ఆందోళనకారులతో మాట్లాడారు. బాధిత విద్యార్థినిని వేరే కళాశాలకు మార్పు చేసి, రెండేళ్లపాటు విద్యాఖర్చులు భరిస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి కారకుడైన అధ్యాపకుడిని విధుల్లోంచి తొలగించారు. -
వారంతే... మారరంతే!
కోటగుమ్మం(రాజమండ్రి) : అనారోగ్యంతో ఉన్న ఖైదీలను ఎస్కార్ట్ పోలీసుల సహాయంతో వ్యాన్‌లో తీసుకువెళ్లాలని నిబంధనలున్నా, జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి ఖైదీలు తప్పించుకున్న సందర్భాలూ అనేకం. తాజాగా ఈనెల 14వ తేదీ ఆదివారం అనారోగ్యంతో ఉన్న రిమాండ్ ఖైదీని రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా హాస్పిటల్లో బాత్ రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పి పరారైన సంగతి తెలిసిందే. సంఘటనలో ఎస్కార్ట్‌గా ఉన్న ఇద్దరు జైలు గార్డులు పి. సత్యనారాయణ, రమణలు సస్పెండ్ అయ్యారు. అయినా అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఈ చిత్రం. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఒకే సారి 12 మంది ఖైదీలను చేతులకు బేడీలు వేసి హాస్పిటల్‌కు తరలించారు. పకడ్బంధీగా పోలీసు వ్యాన్‌లో ఖైదీలనుతరలించవలసిన అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు విమర్శలకు దారితీస్తోంది. ** -
చి‘వరి’కి తప్పని చినుకు దెబ్బ
దేవీపట్నంమండలం ఇందుకూరుపేటలో ధాన్యం బస్తాలను నీటిలో నుంచి బయటకు తెచ్చుకుంటున్న రైతులు అమలాపురం, న్యూస్‌లైన్ : జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఏజెన్సీతోపాటు, మెట్టలోని తుని, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడగా, జగ్గంపేట, కాకినాడ, పిఠాపురం, మండపేటలతోపాటు కోనసీమలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మండుతున్న ఎండలతో విలవిలలాడుతున్న సామాన్యులు వర్షంతో సేదతీరినా.. అకాలంగా విరుచుకుపడ్డ చినుకులు వరి, మామిడి, జీడిమామిడి రైతులను నష్టపరిచాయి. మెట్టలోని కాకినాడ, పిఠాపురం, జగ్గంపేట ప్రాంతాల్లో మామిడి, జీడి మామిడి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో పది రోజులు ఉంటే కోతలు దాదాపు పూర్తయ్యేవి. ఈ సమయంలో కురిసిన వర్షం వల్ల పక్వానికి వచ్చిన మామిడి, జీడిమామిడి కాయలు రాలిపోయాయి. అసలే ఈ ఏడాది దిగుబడి పడిపోయిందని, ఆశపడ్డ లాభాలు రాకపోయినా.. వచ్చిదానితోనే తృప్తి పడదామనుకుంటే.. అకాలవర్షం మరికొంత దెబ్బ తీసిందని రైతులు వాపోతున్నారు. వర్షం కురిసినా.. దానికి ఈదురుగాలులు తోడు కాపోవడం కొంతలో కొంత నయమని, అదే జరిగితే కుదేలైపోయే వారమని అంటున్నారు. ఆశలు రాల్చిన ‘1010’ వంగడం గోదావరి డెల్టాలతోపాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ), ఏలేరు ప్రాజెక్టుల పరిధిలో రబీ సాగు ఆలస్యమైన శివారు ప్రాంతాల్లో అకాల వర్షం వల్ల రైతులు నష్టపోనున్నారు. మెట్టతోపాటు, డెల్టాలో రబీ వరి కోతలు 80 శాతం పూర్తయినా.. సాగు ఆలస్యంగా ఆరంభించిన అమలాపురం, ముమ్మిడివరం, కరప, పిఠాపురం, కాకినాడ, జగ్గంపేట సబ్ డివిజన్లలో సుమారు 70 వేల ఎకరాల్లో కోతలు పూర్తి కాలేదు. మరో 50 వేల ఎకరాల్లో పంట పనల మీద, పొలం గట్ల మీద రాశులుగా ఉంది. వర్షానికి పనలు, రాశులు తడవడంతో రైతులకు ఎంతోకొంత నష్టం తప్పదు. రబీలో ఈ ప్రాంత రైతులు ఎక్కువగా 1010 సన్నరకాలు సాగు చేశారు. కోతలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ రకం పైరులో కొద్దిపాటి గాలి, వర్షానికే కంకుల నుంచి ధాన్యం నేల రాలుతుంటుంది. రోజంతా అడపాదడపా పెద్దపెద్ద జడులు పడిన చోట ధాన్యం రాలుడు ఎక్కువగా ఉంటుందని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. కాగా ‘ఒక్కరోజు కురిసిన వర్షం వల్ల పెద్దగా నష్టం ఉండదు. వర్షాలు ఇలాగే కొనసాగి పనల మీద ఉన్న చేలు ముంపుబారిన పడితే మాత్రం నష్టం తీవ్రత పెరుగుతుంది’ అని అమలాపురం ఏడీఏ ఎం.ఎస్.సి.భాస్కరరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వర్షానికి తడిసిన పనలను, ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలని రైతులకు సూచించారు. -
ఏ పార్టీ ఆహ్వానించినా రాజమండ్రి నుంచి పోటీ: సహస్ర చిత్ర నటుడు అలీ
చెన్నై: ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సహస్ర చిత్ర హాస్య నటుడు అలీ చెప్పారు. 1000 చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకళాసుధ అసోసియేషన్ ఆదివారం అలీని సాఫల్య అవార్డుతో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఇక్కడకు వచ్చిన అలీ విలేకరులతో మాట్లాడుతూ ఏ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చినా రాజమండ్రి నుంచి పోటీచేస్తానని చెప్పారు. అలీ రాజకీయాలలోకి రావడానికి గత కొంతకాలంగా ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టంలేదు. ఏ పార్టీ నుంచైనా సొంత ప్రాంతమైన రాజమండ్రి నుంచే పోటీ చేయాలన్న కోరిక అలీకి బలంగా ఉంది. -
‘పనికట్టు’ విద్య
‘పనికట్టు’ విద్య రాజమండ్రి కార్పొరేషన్,: ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు భ్రమింపజేసే విద్యను ‘కనికట్టు’ అంటారు. మరి.. అవసరం ఉన్నా, లేకపోయినా రూ.కోట్లతో పనులు చేయించడాన్ని ‘పనికట్టు’ అనొచ్చేమో. కనికట్టు చేసే వారు ప్రదర్శన ముగిశాక ప్రేక్షకులను అభ్యర్థించి రూపాయో, రెండో తీసుకుంటారు. అయితే రాజమండ్రి నగర పాలక సంస్థలోని ‘పనికట్టు’ విద్యాపారంగతులు దర్జాగా పర్సంటేజీలు దండుకుంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి, దాంతో పాటు అలాగే ఎన్నికల కోడ్ వెలువడక ముందే.. గతంలో మంజూరైన నిధులను ‘ఎలాగోలా’ ఖర్చు చేయాల్సిన తొందరను తమకు అనుకూలంగా మలచుకున్న అధికారులు ఓ ప్రజా ప్రతినిధి అండదండలతో వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే నగరంలో ఎక్కడ పడితే అక్కడ, అవసరంతో నిమిత్తం లేకుండా ‘అభివృద్ధి’ పనులు జరిగిపోతున్నాయి. ఇటీవలే ఇక్కడి నుంచి స్థానచలనం పొందిన ఓ ఉన్నతాధికారి ‘గోదావరి తీరాన ఉండగానే తన ‘సిరి’ని పండించుకోవాలని టెండర్లు పిలిచి, తానుండగానే పనులు కట్టబెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం సుమారు రూ.27 కోట్ల(ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సహా)తో పనులు జరిగిపోతున్నాయి. అవసరమైన చోట, అవసరమైన పనులు జరిగితే వేలెత్తి చూపే పనేలేదు. అయితే కేవలం ఓ ప్రజాప్రతినిధి, స్థానచలనం పొందిన ఉన్నతాధికారీ పర్సంటేజీల కోసం అవసరం లేని పనులు కూడా హడావుడిగా చేయించేస్తున్నారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి, కల్వర్టుల నిర్మాణం తదితర పనులు నగరంలోని ప్రతి డివిజన్లో జరుగుతున్నాయి. అయితే పనుల్లోనాణ్యత లోపిస్తోందని, ఎక్కడా అవసరం మేరకు పనులు జరగడం లేదని స్థానికులు అంటున్నారు. అవసరం లేని చోట పూర్తిస్థాయిలో బీటీ రోడ్లు నిర్మిస్తున్నారని, పటిష్టంగా ఉన్న డ్రైనేజీలను తవ్వేసి, వాటిని వెడల్పు చేస్తూ అభివృద్ధి చేస్తున్నట్టు భ్రమింపజేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లు ‘రింగైనట్టు’ తెలిసినా.. ప్రజాధనం ‘బూడిదలో పోసిన పన్నీరు’ అయితేనేం.. సదరు ప్రజా ప్రతినిధి, అధికారి తమ పర్సంటేజీలే పరమార్థం అనుకున్నారు. ఆ ప్రజాప్రతినిధికి 10 శాతం, స్థాన చలనం పొందిన అధికారికి ఒక శాతం, ఇతర అధికారులకు 2 శాతం చొప్పున కాంట్రాక్టర్లు చెల్లించినట్టు సమాచారం. పనులను లాటరీ వేసుకున్నారు.. ఈ పనులను దక్కించుకునేందుకు నగరంలోని కాంట్రాక్టర్లంతా ‘ఒక్కటై’ బయటి వారికి అవకాశం లేకుండా చేశారు. దీని కోసం చాలా రోజులు కసరత్తు చేసినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేయాలి. అయితే కోట్ల రూపాయల పనులను దక్కించుకునేందుకు రింగైన కాంట్రాక్టర్లు ఏర్పాటు చేసుకున్న సంఘం పేరుతో ఆన్లైన్ ద్వారా టెండర్లు వేసి, తరువాత పనులను లాటరీ పద్ధతిలో పంచేసుకున్నారు. దీనిలో ప్రజాప్రతినిధి ‘హస్తం’తో పాటు స్థానచలనం పొందిన అధికారి, ఇంజనీరింగ్ విభాగం అధికారుల సహకారం ఉన్నట్టు సమాచారం. ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా బయటి వారు కూడా టెండర్లు వేస్తే ఎవరు తక్కువకు వేస్తే వారికే పనులు దక్కేవి. దీంతో నగరపాలక సంస్థ సొమ్ము చాలా వరకూ ఆదా అయ్యేది. కానీ ఇక్కడి కాంట్రాక్టర్లంతా కుమ్మక్కయి, కొత్త వారెవరూ టెండర్లు వేయకుండా ఫోన్ల ద్వారా బెదిరించినట్టు సమాచారం. తదుపరి ఎవరి వాటాలు వారికి ముట్టజెప్పినందునే.. పనుల్లో నాణ్యత అణుమాత్రం లేకపోయినా ఎవరూ వీసమెత్తు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రూపాయీ సద్వినియోగం అయ్యేలా చూసి, నగరాభివృద్ధికి దోహదపడాల్సిన వారే అలాంటి ‘మంచి ఆలోచనలను’ గోదాట్లో కలిపేసి.. తాము మాత్రం డబ్బు మూటలు నింపుకుంటున్నారన్న మాట. -
ఉప్పొంగిన ప్రజాభిమానం - ముందుకు కదలలేకపోతున్న జగన్
-
ఉప్పొంగిన ప్రజాభిమానం
రాజమండ్రి: ప్రజాభిమానం ఉప్పొంగటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ముందుకు కదలలేకపోతున్నారు. జగన్ వస్తున్నట్లు తెలిసి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో మధురపూడి విమానాశ్రయం వద్దకు తరలి వచ్చారు. విమానాశ్రయం వద్ద జగన్‌కు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా జగన్‌ను చూసేందుకు జనం తరలి రావడంతో విమానాశ్రయం నుంచి రాజమండ్రి వరకు ట్రాఫిక్ జాం అయింది. మదురపూడి విమానాశ్రయం నుంచి రాజమండ్రి పది కిలో మీటర్లు రావడానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. దారి పొడువునా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అభిమానుల తాకిడితో ఆయన కాన్వాయి ముందుకు కదలలేని పరిస్థితి. రాజమండ్రి కంబాల చెరువు జంక్షన్‌కు చేరుకున్న జగన్ దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అక్కడ భారీ స్థాయిలో గుమ్మిగూడిన జనంను ఉద్దేశించి కొద్దిసేపు మాత్రమే ప్రసంగించారు. ప్రసంగించాలని జనం కోరారు. అయితే తాను ఒక పెళ్లికి వెళుతున్నానని, మళ్లీ ఇక్కడికి వస్తానని వారికి నచ్చజెప్పారు. జగన్ ప్రసంగం చివరలో జై తెలుగు తల్లీ - జై సమైక్యాంధ్ర - జోహార్ వైఎస్ఆర్ - జోహార జక్కంపూడి అని నినదించారు. జనం జై జగన్, జై జగన్... అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. -
మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి కన్నుమూత
రాజమండ్రి : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే అంగిటపల్లి చిన ఎరుకల రెడ్డి (ఏసీవై రెడ్డి) అనారోగ్యంతో మృతి చెందారు. ఏసీవై రెడ్డి వయస్సు 80 సంవత్సరాలు. కిడ్నీవ్యాధితో 15 రోజుల క్రితం ఓ ప్రై వేట్ ఆస్పత్రిలో చేరిన ఆయనను రెండు రోజుల క్రితం ఇంటికి తరలించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు. ఏసీవై రెడ్డి రాష్ట్ర డ్రెయినేజీ బోర్డు చైర్మన్‌గా, రాజమండ్రి మునిసిపల్ కౌన్సిల్ చైర్మన్‌గా, రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా పనిచేశారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా కూడా సేవలు అందించారు. 1989లో కాంగ్రెస్ టికెట్‌పై రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
గోదావరిలో మార్మోగిన సమైక్య నినాదాలు
రాజమండ్రి: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లాలో సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వివిధ రకాలు ఆందోళనలు, నిరసన, ధర్నాలతో జిల్లా దద్దరిల్లుతోంది. సమైక్యాంధ్ర వర్థిలాలి అంటూ సమైక్యవాదులు రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో వినూత్న నిరసన చేపట్టారు. నడుంలోతు నీళ్లలోకి దిగి సమైక్య నినాదాలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బొమ్మూరు జాతీయరహదారిపై మాజీ సర్పంచ్ మత్యే్సటి ప్రసాద్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి విద్యార్ధులకు బూట్లు పాలిష్ చేస్తూ నిరసన తెలిపారు. మోరంపూడి జాతీయరహదారిపై యుటిఎఫ్ రూరల్ మండలశాఖ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు 30వరోజుకు చేరుకున్నాయి. సమైక్యాంధ్ర క్రై స్తవ జేఏసి అధ్యక్షలు డాక్టర్ రెవ.మత్తాబత్తుల విజయకుమార్, ప్రధానకార్యదర్శి టివి వర్తమానికులు సువార్తరాజులు ఆధ్వర్యంలో క్రై స్తవులు మోరంపూడి సెంటర్లో శాంతి ర్యాలీ, చేపట్టారు. 16వ నెంబరు జాతీయ రహదారిపై సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. -
ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య
రాజమండ్రి: రాజమండ్రిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులతోపాటు వారి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నాను. కోనసీమలోని అంబాజీపేటకు చెందిన వీరు నగరంలోని హోటల్ ఆనంద్ రీజెన్సీలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.