‘తండ్రి’తో ‘తొండపు వేలుపు’
వలంధర్‌ఘాట్ (నరసాపురం) : పుష్కరం కోట్లమందికి ముక్తిక్రతువు అయితే.. కొందరికి భుక్తికి తెరువు. రాజమండ్రి నుంచి నరసాపురం వచ్చిన మురళి, సునీల్ ఇలా శివుడు, విఘ్నేశ్వరుడి వేషధారణతో పుష్కరఘాట్ల వద్ద సంచరిస్తూ, యాత్రికుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. వారిచ్చే చిల్లరను గోదారమ్మ కానుకగా దాచుకుంటున్నారు.
‘గణపతి శాస్త్రీ’య స్నానం
పుష్కరఘాట్ (రాజమండ్రి): పుష్కరస్నానం చేసేందుకు ఒక పద్ధతి ఉంటుంది. వేదవిహితమైన ఆ పద్ధతి ఎలా ఉంటుందన్నది సామర్లకోటకు చెందిన చింతామణి గణపతిశాస్త్రి ఆధ్వర్యంలో 50 మంది శిష్యబృందం మంగళవారం ఉదయం పుష్కరఘాట్‌లో అందరికీ తెలియజేశారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య వారు చేసిన స్నానం భక్తులను ఆకట్టుకుంది.