
మెట్టెక్కితే గట్టెక్కినట్టే..
కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : పుష్కర స్నానం కోసం లక్షలాదిమంది ఘాట్లకు తరలి వస్తున్నారు. కానీ వృద్ధులు మెట్లెక్కలేక అవస్థలు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోటిలింగాల ఘాట్‌లో పుష్కర స్నానానికి వచ్చిన వృద్ధులు మెట్లు ఎక్కడానికి పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వీరికి ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మిస్తే ఉపయోగకరంగా ఉండేదని భక్తులంటున్నారు.