రాజమండ్రిలో దివ్యాంగులకు నాట్స్ చేయూత NATS Helping To Disabled People In Rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో దివ్యాంగులకు నాట్స్ చేయూత

Published Fri, May 31 2024 6:34 PM | Last Updated on Fri, May 31 2024 7:02 PM

NATS Helping To Disabled People In Rajahmundry

దివ్యాంగులకు చేయూత అందించడంలో నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి అన్నారు. రాజమండ్రిలో దివ్యాంగులైన సునీత, ఏసులు స్వయం ఉపాధి పొందేందుకు కావాల్సిన సహకారాన్ని నాట్స్ అందించిందని తెలిపారు. దివ్యాంగ దంపతులు సునీత, ఏసుల చేత కిరాణా దుకాణాన్ని హోఫ్ ఫర్ స్పందనతో కలిసి పెట్టించారు. 

ఈ దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులకు నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను బాపు నూతి వివరించారు. హోప్ ఫర్ స్పందన దివ్యాంగుల కోసం చేస్తున్న కృషిలో నాట్స్ కూడా కీలక పాత్ర పోషించడం తమకు దక్కిన అదృష్టమని బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

(చదవండి: పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement