Disabled people
-
Mitti Cafe: అలీన అద్భుత దీపం...
అద్భుతాలు జరగడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం అక్కర్లేదు. కాస్త ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. అలీన ఆ ఆత్మవిశ్వాసంతో సాధించిన అద్భుతం...మిట్టీ కేఫ్. ఆఫీసుల నుంచి రెస్టారెంట్ల వరకు దివ్యాంగులకు సరిౖయెన సౌకర్యాలు లేని పరిస్థితి. ‘నేను ఉద్యోగం చేస్తాను’ అని అడిగితే ‘సారీ’ చెప్పే పరిస్థితి. ఇది తెలిసి కూడా దివ్యాంగులను ఉద్యోగులుగా, ఎంటర్ప్రెన్యూర్లుగా చూడాలని కల కన్నది అలీనా అలమ్. ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఆమె మొదలుపెట్టిన ‘మిట్టీ కేఫ్’ ఆ తరువాత కాలంలో అద్భుతం సృష్టించింది. ‘మిట్టి కేఫ్’ అనేది ఇప్పుడు ఒక కేఫ్ బ్రాండ్ మాత్రమే కాదు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిధ్వనించే బ్రాండ్...దివ్యాంగుల కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘సమర్థన’ ట్రస్ట్‌లో ఇంటర్న్‌షిప్ ్ర΄ోగ్రామ్ చేస్తున్న రోజుల్లో ‘మిట్టీ కేఫ్’ ఆలోచన ఆలీనా అలమ్‌కు వచ్చింది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన కలను సాకారం చేసుకోవడానికి ‘మిట్టీ కేఫ్’ మంచి ఆలోచన అనుకుంది.‘పెళ్లి చేసుకో లేదా ఉద్యోగం చెయ్’ అన్నారు తల్లిదండ్రులు. అలీనా మాత్రం సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దారిలో నడక మొదలు పెట్టింది. దివ్యాంగుల కోసం, దివ్యాంగుల చేత నడుస్తున్న ‘మిట్టీ కేఫ్’లు సక్సెస్ అయ్యాయి.‘మన దేశంలోని లక్షలాది మంది దివ్యాంగులు సమాన అవకాశాల కోసం, ఆర్థికంగా సొంతకాళ్ల మీద నిలబడడం కోసం ఎదురుచూస్తున్నారు. సమస్య అనేది వారి సామర్థ్యం గురించి కాదు. సమస్య మనం చూసే దృష్టి కోణంలో ఉంది. వారి గురించి మనకు ఎన్నో అ΄ోహలు ఉంటాయి. చిన్న చూపు ఉంది. ఈ పరిస్థితి పూర్తిగా మారి΄ోవాలి’ అంటున్న అలీన ‘మిట్టీ కేఫ్’ ద్వారా ఎంతోమంది దివ్యాంగులకు ఉ΄ాధితో΄ాటూ ఆత్మస్థైర్యాన్నీ ఇచ్చింది.దాతలు ఇచ్చిన విరాళాలతో‘మిట్టీ కేఫ్’ మొదలైంది. ‘సంకల్పం మంచిదైతే సహాయపడడానికి సమాజం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అన్నట్లు ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమాని కేఫ్‌కు సంబంధించిన ΄ోస్టర్లను ఉచితంగా ముద్రించి ఇచ్చాడు.దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘మిట్టీ కేఫ్’లను తీర్చిదిద్దారు. దృష్టి లోపం ఉన్నవారు బిల్లింగ్ చేయడానికి వీలుగా బిల్లింగ్ సిస్టమ్‌లో ఆడియో ఫీచర్ ఉంది. మెనూ బ్రెయిలీ లిపిలో ఉంటుంది. వినికిడి లోపం ఉన్న, మూగ ఉద్యోగులు కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడానికి ప్లకార్డులు కూడా ఉంటాయి.హుబ్లీలోని చిన్న షెడ్లో మొదలైన ‘మిట్టీ కేఫ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. దేశవ్యాప్తంగా ఎయిర్΄ోర్ట్స్, పెద్ద కంపెనీలు, బ్యాంకులు... మొదలైన వాటిలో 46 ‘మిట్టీ కేఫ్’లు నడుస్తున్నాయి. గత సంవత్సరం సుప్రీంకోర్టు ్ర΄ాంగణం, రాష్ట్రపతి భవన్, ఐఐఎం–బెంగళూరులో ‘మిట్టీ కేఫ్’లను ్ర΄ారంభించారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని విమాన్రాశయాలు, మెట్రో, రైల్వే స్టేషన్లలో ‘మిట్టీ కేఫ్’ లు ఏర్పాటు చేయనున్నారు.‘కరేజ్’ ‘మ్యాజిక్’ అనే మాటలు అలీన నోటి నుంచి తరచుగా వినిపిస్తుంటాయి. ‘ధైర్యం’ ఉన్న చోటే ఊహించని అద్భుతాలు, మ్యాజిక్‌లు జరుగుతాయి. ‘మిట్టీ కేఫ్’ రూపంలో అద్భుతం సృష్టించడానికి అలీనాలోని ధైర్యమే కారణం. ఆమెకు బాగా ఇష్టమైన కొటేషన్...‘ఎక్కడ దయాగుణం ఉంటుందో... అక్కడ మంచితనం ఉంటుంది.ఎక్కడ మంచితనం ఉంటుందో... అక్కడ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది’‘మనం మాత్రం ఏం చేయగలం’ అనుకునే నిరాశావాదులకు అలీన ఆలమ్ విజయం కనువిప్పు లాంటిది. కొత్త దారి చూపే కాంతి కిరణంలాంటిది. ‘మిట్టీ కేఫ్’లో పనిచేసిన దివ్యాంగ ఉద్యోగులలో కొందరు సొంతంగా ఎంటర్ప్రెన్యూర్లుగా రాణించడం మరో మంచి విజయం. -
రాజమండ్రిలో దివ్యాంగులకు నాట్స్ చేయూత
దివ్యాంగులకు చేయూత అందించడంలో నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి అన్నారు. రాజమండ్రిలో దివ్యాంగులైన సునీత, ఏసులు స్వయం ఉపాధి పొందేందుకు కావాల్సిన సహకారాన్ని నాట్స్ అందించిందని తెలిపారు. దివ్యాంగ దంపతులు సునీత, ఏసుల చేత కిరాణా దుకాణాన్ని హోఫ్ ఫర్ స్పందనతో కలిసి పెట్టించారు. ఈ దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులకు నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను బాపు నూతి వివరించారు. హోప్ ఫర్ స్పందన దివ్యాంగుల కోసం చేస్తున్న కృషిలో నాట్స్ కూడా కీలక పాత్ర పోషించడం తమకు దక్కిన అదృష్టమని బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!) -
సదరం స్లాట్ల విడుదల
సాక్షి, అమరావతి: దివ్యాంగులు సదరం సర్టీఫికెట్లు పొందేందుకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్నవారికి ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులకు సదరం ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సదరం సర్టీఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. గత ఏడాది జూలై నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా స్లాట్ బుకింగ్ చేసుకుని స్క్రీనింగ్‌కు హాజరయ్యే అవకాశం కల్పించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించేవారు. దీంతో అప్పట్లో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్ బుకింగ్‌లకు అవకాశం కల్పించింది. ఆస్పత్రుల సంఖ్యను కూడా 173కు పెంచింది. 2022–23 సంవత్సరంలో 96,439 మందికి సదరం సర్టిఫికెట్లను ఇచ్చింది. -
మన దేశంలో దివ్యాంగులకు అనువైన ఇల్లు ఉందా..?
అద్దెకు ఎన్నో ఇళ్లు, ఫ్లాట్లు ఉంటాయి కదా అనిపించవచ్చు. కాని వీల్‌చైర్‌లో మాత్రమే జీవనం గడిపేవారికి ఆ ఇళ్లేవీ పనికి రావు. బెంగళూరులో ఐటి ఇండస్ట్రీలో పని చేస్తున్న మృణ్మయి తను నివసించడానికి బెంగళూరులో తగిన ఫ్లాటే దొరకడం లేదని ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ విశేషంగా చాలామంది దృష్టిని ఆకర్షించింది. లిఫ్ట్‌లో అడుగు పెట్టడం దగ్గరి నుంచి బాత్రూమ్ల వరకూ ప్రతిదీ వీల్‌చైర్‌కు వీల్లేనివేనని ఆమె తెలిపింది. ఆమె మాత్రమే కాదు సాధారణ వ్యక్తులకు జబ్బు చేస్తే వీల్‌చైర్‌లో ఆస్పత్రికి వెళ్లిరావడం కూడా దుర్లభమే. మన నిర్మాణ పద్ధతుల్లో మానవీయత రాదా? ‘అందరికీ అందుబాటు’ (యాక్సెసెబిలిటీ టు ఆల్) అనే మాట వినడానికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు. కాని అది ఆచరణ యోగ్యం కావడం ఇంచుమించు అసాధ్యంగా ఉంది మన దేశంలో. ‘మా ఇంటికి రండి’ అని ఆహ్వానిస్తే అందరూ ఆ ఆహ్వానాన్ని మన్నించగలరా? మన ఇల్లు దివ్యాంగుల రాకపోకలకు అనువుగా ఉందా? నివసించే ఫ్లాట్స్‌లో సులభంగా వీల్‌చైర్‌తో ప్రవేశించడం సాధ్యమవుతుందా? కట్టుకున్న ఇళ్ల మెయిన్గేట్నైనా వీల్‌చైర్ దాటగలదా? అందరూ మెట్లు వాడగలరని, మెట్లు ఉంటే సరిపోతుందని ఇప్పటికీ భావిస్తున్నామంటే యాక్సెసెబిలిటీ టు ఆల్ హక్కును నిరాకరిస్తున్నట్టే. ర్యాంప్‌లు కట్టి దివ్యాంగుల రాకపోకలను అన్ని ప్రయివేటు, పబ్లిక్ ప్లేసుల్లో సులభం చేసినప్పుడే మెరుగైన సమాజాన్ని ఏర్పాటుచేసుకున్నట్టు. ఇల్లు కావాలి బెంగళూరులో అమేజాన్‌లో పనిచేస్తున్న మృణ్మయి‘నాకు ఇల్లు కావాలి. కాని అలాంటి ఇల్లు దొరకడం లేదు’ అని ‘ఎక్స్’ (ట్విటర్)లో తాజాగా పెట్టిన పోస్టు దివ్యాంగుల ఘోషను మరోసారి బయటపెట్టింది. ‘నేను ఇన్నాళ్లు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను. అందులో ర్యాంప్‌లు ఉన్నాయి. నా మోటర్డ్ వీల్‌చైర్‌తో కిందకు రావడం మళ్లీ ఫ్లాట్‌లోకి వెళ్లడం సులభంగా ఉంటుంది. ఫ్లాట్‌లో కూడా ఎలాంటి ఇబ్బందీ లేదు. కాని ఇప్పుడు మా ఫ్లాట్ ఓనర్ ఏవో కారణాల రీత్యా ఖాళీ చేయమన్నాడు. అప్పటి నుంచి తగిన ఫ్లాట్ కోసం ఎంతో వెతుకుతున్నాను. కాని వీల్‌చైర్‌తో రాకపోకలు సాగించేలా ఒక్క ఫ్లాట్ కూడా లేదని తెలపడానికి చింతిస్తున్నాను’ అని ఆమె రాసుకొచ్చింది. అన్ని చోట్లా మెట్లే చాలా ఫ్లాట్లలో లిఫ్ట్ దగ్గర మెట్లు ఉండటం ఒక సమస్యగా మృణ్మయి చెప్పింది. అంటే ఒకటో రెండో మెట్లు ఎక్కి లిఫ్ట్ ఎక్కాలి. కొన్ని లిఫ్ట్‌లు చాలా చిన్నవిగా ఉంటాయి. వీల్‌చైర్‌తో ప్రవేశించి లోపల దానిని తిప్పుకుని డోర్ వైపుకు ముఖం పెట్టడం కష్టం. ‘అపార్ట్‌మెంట్స్‌లో చాలా ఫ్లాట్లకు గడప అడ్డంగా ఉంటుంది. వీల్‌చైర్‌తో దాటలేము. దాటినా అన్ని ఫ్లాట్లలో బాత్రూమ్లు ఒక మెట్టు ఎత్తులో ఎందుకు కడతారో అర్థం కాదు. నేను వీల్చైర్తోటే బాత్రూమ్లోకి వెళ్లి స్నానం చేయాలి. కాని సింకో, టాయిలెట్ సీటో అడ్డంగా ఉంటుంది. అదీగాక బాత్రూమ్ ద్వారాలు మరీ సన్నగా పెడతారు. నా వీల్‌చైర్‌తో అడుగుపెట్టాలంటే అవి కనీసం 25 అంగుళాల వెడల్పు ఉండాలి. అలా ఉండవు’ అంటుంది మృణ్మయి. ‘మరో సమస్య ఏమిటంటే... ఇలా వీల్‌చైర్‌కు అనువుగా ఉన్న ఫ్లాట్లకు రెంట్ ఎక్కువ అడుగుతున్నారు. 25 వేల రూపాయల ఫ్లాట్ 40 వేలు చెబుతున్నారు’ అందామె. యాక్సిడెంట్ వల్ల మృణ్మయి అందరిలా హుషారుగా తిరిగే అమ్మాయి. కాని 2011లో జరిగిన కారు ప్రమాదం వల్ల ఆమెకు స్పైనల్ కార్డు ఇంజూరీ జరిగింది. సర్జరీ చేసినా రెండు భుజాల కింద ప్రాంతమంతా అధీనాన్ని కోల్పోయింది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మోటర్డ్ వీల్‌చైర్ ద్వారా ఆమె మామూలు జీవనం గడపడానికి ప్రయత్నిస్తోంది. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. ఆఫీస్ పని కోసం డిక్టేషన్ సాఫ్ట్వేర్ వాడతాను. వేళ్ల మీద అధీనం ఉంది కాబట్టి టచ్ స్క్రీన్ ఉపయోగిస్తాను. కాని నాకూ తిరగాలని ఉంటుంది. బయటికొస్తే రెస్టరెంట్‌కు కూడా పోలేను. ప్రతి రెస్టరెంట్కూ మెట్లు ఎక్కి వెళ్లాలి. ఎక్కడా ర్యాంప్‌లు ఉండవు. కాళ్లు చేతులు సక్రమంగా ఉన్నవారికే ప్రవేశం అన్నట్టుగా మన నిర్మాణాలు ఉంటాయి. సినిమా హాళ్లు చెప్పే పనే లేదు. టాక్సీ సర్వీసులు కూడా వీల్‌చైర్ ఫ్రెండ్లీ కావు. అందుకే మాలో చాలామంది యాక్సెసబిలిటీ యాక్టివిస్ట్లుగా మారి సమాజంలో చైతన్యం కలిగించడానికి ప్రయత్నిస్తుంటాం’ అని తెలిపింది మృణ్మయి. ‘ఎక్స్’లో మృణ్మయి పెట్టిన పోస్ట్‌కు చాలామంది స్పందించారు. నిజంగా మీ ఇబ్బంది మీరు చెప్తుంటే తెలుస్తోంది అని చాలామంది చెప్పారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆఫీసులు, పార్కులు, హాస్పిటళ్లు, విద్యా సంస్థలు.. ఇలా ప్రతిదీ దివ్యాంగుల రాకపోకలకు అనువుగా మారడం, మార్చడం తప్పనిసరి. వాటిని వాడేది ఒకరిద్దరైనా ఆ ఒకరిద్దరి హక్కును నిరాకరించే అధికారం మనకు లేదు. (చదవండి: ఎవరికి వారే.. మహిళా‘మణులే’! ) -
తల్లడిల్లుతున్న తల్లి.. పిల్లలిద్దరూ దివ్యాంగులే
జన్మనిచ్చిన పిల్లలకు కష్టం వస్తే ఆ తల్లి బాధలు వర్ణనాతీతం.. వారి బాధలు చూసినప్పుడల్లా పేగు బంధం తల్లిడిల్లిపోతుంది.. ఓ వైపు ఆస్పత్రిలో చేరిన భర్త ఏమయ్యాడో తెలియదు.. మరో వైపు ఉన్న ఇద్దరు పిల్లలు దివ్యాంగులు కావడంతో ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. ఇదీ ఓ మాతృమూర్తి భారతి దీన గాథ.. తాండూరు రూరల్: మండలంలోని ఓగిపూర్‌కు చెందిన కుర్వ భారతి, పాండు దంపతులు. భారతిని బషీరాబాద్ మండలం నవాంద్గీ గ్రామానికి చెందిన పాండుకు ఇచ్చి వివాహం చేశారు. ఐదేళ్ల నుంచి భర్త కనిపించడం లేదు. దీంతో భారతి తల్లిగారి ఊరు ఓగిపూర్‌లో ఉంటోంది. ఈమెకు కూతురు అర్చన(13), కొడుకు మల్లేష్(9) ఉన్నారు. ఐదేళ్లు వచ్చే వరకు ఇద్దరూ బాగానే ఉండేవారు. ఆ తర్వాత ఒక్క సారిగా జ్వరం వచ్చి నడవలేని స్థితికి చేరారు. పిల్లల్లో ఎదుగుదల లోపించిందని తల్లి ఆవేదన చెందుతోంది. లివర్ సంబంధిత వ్యాధిలో బాధపడుతున్న భర్త పాండును లాక్ డౌన్‌కు ముందు ఆస్పత్రిలో చేర్పించింది. అప్పటి నుంచి ఇంటికి రాలేదని, ఉన్నడో.. చనిపోయాడో తెలియడం లేదని భారతి బోరున విలపిస్తోంది. ప్రస్తుతం పిల్లలిద్దరిని తన తల్లి ఎల్లమ్మ వద్ద ఉంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. దివ్యాంగులైన పిల్లలకు పింఛన్ వస్తే కొంత మేలు జరుగుతుందని భావిస్తోంది. పింఛను మంజూరు కావాలంటే సదరం సర్టిఫికెట్ తప్పని సరి అని అధికారులు చెప్పడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి తన ఇద్దరు పిల్లలకు సదరం సర్టిఫికెట్ ఇప్పించి పెన్షన్ వచ్చేలా చూడాలనిభారతిదీనంగా వేడుకుంటోంది. -
దివ్యాంగుల కోసం పరీక్షలు రాస్తుంది.. ఇప్పటికే వెయ్యికి పైగా..
విద్యార్థికి పరీక్షే కీలకం.అది రాయలేని పరిస్థితి ఉంటే?దివ్యాంగులు అయి ఉంటే?సహాయకులు కావాలి.కానీ పరీక్ష రాసి పెట్టడానికి అందరూ పనికి రారు. అందుకు ఎంతో ఓర్పు, సహనం, సేవాభావం కావాలి.బెంగళూరుకు చెందిన పుష్ప అలాంటి విద్యార్థుల కోసందాదాపు వేయికి పైగా పరీక్షలు రాసింది. ఆమె పరిచయం. బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల పుష్ప ఎన్ ఎం ఇప్పటికి 1086 పరీక్షలు రాసింది. ఆమె కోసం కాదు. దివ్యాంగుల కోసం, కలం పట్టుకునే వీలు లేని కండరాల సమస్య ఉన్నవారి కోసం, పరీక్షల ముందు యాక్సిండెంట్లకు గురయ్యి రాసే వీలు లేని వారి కోసం... ఆమె పరీక్షలు రాస్తూనే ఉంది. ఇంకా రాయాలనే అనుకుంటోంది. ‘ఒక దివ్యాంగ పిల్లవాడికి మీరు పరీక్ష రాసిపెట్టండి. రిజల్ట్స్ వచ్చి ఆ పరీక్ష పాసయ్యాక ఆ పిల్లవాడి కళ్లల్లో కనిపించే కృతజ్ఞతకు మీరు విలువ కట్టలేరు’ అంటుంది పుష్ప. 2007లో అనుకోకుండా ఆ రోజు పుష్ప రోజూ వెళ్లే బస్సులో కాకుండా నడిచి ఇంటికి వెళ్లాలనుకుంది. ఆ నడకే ఆమె జీవితాన్ని మార్చింది. దారిలో ఒక అంధ కుర్రవాడు రోడ్డు దాటించమని సహాయం అడిగాడు. పుష్ప రోడ్డు దాటిస్తూ మాట కలిపింది. ఆ కుర్రవాడు వచ్చే నెలలో ఎస్ఎస్ఎల్సి పరీక్షలు రాయనున్నాడు.‘నాకు మీరు పరీక్షలు రాసి పెడతారా?’ అని అడిగాడు. పుష్ప ఆలోచనలో పడింది. ‘మీలాంటి వాళ్లు మా కోసం ముందుకొస్తే మేము మా జీవితంలో ముందుకెళతాం’ అని ఆ అబ్బాయి అన్నాడు. ఆ మాట ఆమె మీద చాలా ప్రభావం ఏర్పరిచింది. ‘అప్పటి వరకూ నా జీవితానికి అర్థమేమిటా అనే ఆలోచన ఉండేది. ఆ క్షణాన ఇలాంటి వారికి సాయం చేయడానికే పుట్టానేమో అనుకున్నాను’ అంటుంది పుష్ప. అంత సులభం కాదు దివ్యాంగులకు, అంధులకు,సెరిబ్రల్ పాల్సీ.. డౌన్ సిండ్రోమ్... డిస్లెక్సియ వంటి బుద్ధిమాంద్యం సమస్యలు ఉన్నవారు పరీక్షలు రాయాలంటే వారికి లేఖకులుగా ఉండటం అంత సామాన్యం కాదు. ‘ముందు మీకు ఓపిక ఉండాలి. వాళ్లు ప్రశ్నను మళ్లీ మళ్లీ చదివి వినిపించమంటారు. ఒక్కోసారి నేను ఒక ప్రశ్నను ముప్పై నలభైసార్లు చదివి వినిపించిన సందర్భాలున్నాయి. అలాగే మీకు శ్రద్ధగా వినే శక్తి ఉండాలి. జవాబు చెప్పే పిల్లలు కొందరు మరీ నెమ్మదిగా, కొందరు మరీ వేగంగా చెప్తారు. అర్థం చేసుకుని రాయాలి. వారు రాసే సబ్జెక్ట్‌లు మీరు చదివినవి కావు. అందుకని కూడా మీరు జవాబులను పూర్తిగా అర్థం చేసుకుంటూ రాయాల్సి వస్తుంది. మనల్ని పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి గ్రామర్ వంటివాటిల్లో చిన్న సాయం చేయొచ్చు కానీ మన తెలివి వారికి అందివ్వలేం. నిజాయితీ ముఖ్యం’ అంటుంది పుష్ప. ఆమె ఇప్పటి వరకూ పది, ఇంటర్, డిగ్రీ, పిహెచ్డి, బ్యాంకు పరీక్షలు... ఇలాంటివి ఎన్నో రాసి పెట్టింది. అడిగిన వెంటనే సెలవు పుష్ప బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంది. లేఖకురాలిగా ఆమెకు ఉన్న డిమాండ్‌ను చూసి ఐటి కంపెనీ ధారాళంగా సెలవులు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఇది మంచి పనే అని మెచ్చుకుంటోంది. పుష్ప ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తెలుగు, తమిళ భాషల్లోని విద్యార్థుల కోసం పరీక్షలు రాసి పెడుతోంది. ఇలాంటి విద్యార్థుల కోసమే తెలుగు, తమిళ భాషలను షార్ట్ టర్మ్ కోర్సులు చేసి నేర్చుకుంది. ‘నా బాల్యంలో మా నాన్న రోజు కూలీగా ఉండేవాడు. ఆయనకు ప్రమాదం జరిగి మంచాన పడితే మంచి మనసున్న వారి సాయంతో చదువుకున్నాను. ఇప్పుడు ఆ బాకీని ఇలా తీర్చుకుంటున్నాను’ అంటుంది పుష్ప.ఇంత అద్భుతమైన సేవ చేస్తున్నది కాబట్టే 2019లో నాటి రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి పురస్కార్ అందుకుంది. -
దివ్యాంగులను ఆదుకుంటున్న వైఎస్ జగన్ ప్రభుత్వం
-
దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ (ఏపీడీఏఎస్‌సీఏసీ) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. 70 శాతంపైగా వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులు. కనీసం పదో తరగతి పాసవ్వాలి. రూ.3లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలి. లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వారికి సొంత వాహనం ఉండకూడదు. గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు. గతంలో దరఖాస్తు చేసినప్పటికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రం, ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ ధ్రువపత్రం, ఎస్సీ, ఎస్టీ అయితే కుల ధ్రువీకరణపత్రం, దివ్యాంగుల పూర్తి ఫొటోను పాస్‌పోర్టు సైజులో ఉన్నది దరఖాస్తుతోపాటు ఏపీడీఏఎస్‌సీఏసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఇదీ చదవండి: జగనన్న విద్యా కానుక.. 'ఇక మరింత మెరుగ్గా' -
ఎన్నో ఆలోచనలు రేకెత్తించిన టెడ్–ఎక్స్!
సాక్షి, హైదరాబాద్: సమాజంలో దివ్యాంగులకూ సమాన అవకాశాలు కల్పించడమెలా? కుక్కలు మనకు నేర్పే పాఠాలు ఏమిటి? మనలాంటి సామాన్యులు తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ఏం చేయాలి? పామాయిల్కూ మనకొస్తున్న జబ్బులకూ సంబంధం ఏమైనా ఉందా? ఇలాంటి పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నానికి ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన టెడ్–ఎక్స్ కార్యక్రమం వేదికగా నిలిచింది. కొత్త ఆలోచనలను పంచుకునే వేదికగా దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన ‘‘టెడ్ టాక్స్’’అనుబంధ కార్యక్రమమే ఈ టెడ్–ఎక్స్! హైదరాబాద్‌లోనూ చాలా ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా తాజాగా ఆదివారం 14 మంది వక్తలతో ఇది సందడిగా జరిగింది. ‘రైజింగ్’అన్న ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక సవాళ్లను అధిగమించి.. విజయం సాధించిన వారు తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకున్నారు. ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ సాబూ సిరిల్, భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన హైదరాబాదీ ఆర్.శ్రీధర్, ఓ ప్రమాదంలో రెండు కాళ్లూ.. ఒక చెయ్యి కోల్పోయినా స్థైర్యం కోల్పోకుండా ఫిట్నెస్ ట్రెయినర్‌గా ఎదిగిన టింకేశ్ కౌశిక్ వంటి వారు ఈ కార్యక్రమంలో తాము పడ్డ కష్టాలు.. వాటిని ఎదుర్కొన్న తీరును వివరించారు. అంతేకాదు.. కుక్కలతో కార్పొరేట్ ఉద్యోగులకు పాఠాలు నేర్పించే శిరీన్ మర్చంట్, కేదార్నాథ్ ఆలయం వద్ద ప్లాస్టిక్ చెత్త సమస్యను పరిహరించేందుకు వినూత్నమైన ఆలోచనతో ఓ ప్రయోగం చేసి సత్ఫలితం సాధించిన ‘రీసైకిల్’వ్యవస్థాపకుడు అభయ్ దేశ్‌పాండే, చక్రాల కుర్చీలకు పరిమితమైన దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై స్క్వాడ్రన్ లీడర్ అభయ్ ప్రతాప్ సింగ్‌లు కూడా ప్రసంగించి ఆయా అంశాల్లో తాము చేసిన పనులను వివరించారు. చౌక పామాయిల్ వాడకం వల్ల మన ఆరోగ్యానికి కలుగుతున్న హాని.. పర్యావరణానికి జరుగుతున్న నష్టం వంటి అంశాలపై మాట్లాడిన న్యూయార్క్ జర్నలిస్ట్ జోసిలీన్ సి జుకర్మాన్ ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మదర్స్ డే: మమతల కోవెల..సేవే ‘సాధన’
సాధారణ పిల్లలతో పోలిస్తే intellectual disability(మేధో వైకల్యం) పిల్లలకి చాలాచాలా ప్రేమ కావాలి. ఆదరణ కావాలి. అలాగే ఇలాంటి పిల్లల విషయంలో తండ్రులతో పోలిస్తే తల్లులే ఎక్కువ బాధ్యత తీసుకుంటారు. స్పీచ్ థెరపీ అని, ఫిజియో థెరపీ అంటూ నానా కష్టాలు పడుతూ చాలా జాగ్రత్తగా వాళ్లని ఆసుపత్రులకు తీసుకెడుతున్న తల్లులు చాలామంది మన కంట పడతారు కదా? మరి అలాంటి పిల్లల్ని దాదాపు 148 మందిని అక్కున చేర్చుకుని ఆదరిస్తోంది సాధన హోం.. మెంటల్లీ చాలెంజ్డ్ కిడ్స్ కోసం ఎలాంటి వసతులు ఉన్నాయి. మానవతకు ప్రతీకగా నిలుస్తూ ఎంతో మంది జీవితాల్లో అమ్మగా వెలుగులు నింపుతున్న సురేఖ రెడ్డిని సాక్షి.కామ్ పలకరించింది. అసలు ఈ హోం ఏర్పాటు వెనక ఉన్న ఉద్ధేశ్యం ఏంటో తెలుసుకుందాం రండి. ఇక్కడ పిల్లల రోజువారీ అవసరాలకు అనుగుణంగా, శిక్షణ ఇస్తున్నారు. వారిలోని స్పెషల్ స్కిల్స్ గుర్తించి ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తారు. నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో లాంగ్వేజ్, స్పీచ్ థెరపీ, ఫిజియో థెరపీ, లాంటివి కూడా ఉంటాయి. ఇక్కడున్న టీచర్స్ పిల్లల్నందరినీ ప్రత్యేక శ్రద్ధగా, అపురూంగా చూసుకుంటారు. మరోవిధంగా చెప్పాలంటే దేవుని బిడ్డలా భావిస్తారు. అంతేకాదు సంగీతం, డాన్సింగ్, సింగింగ్, ఫైన్ ఆర్ట్స్ , కంప్యూటర్ స్కిల్స్ లాంటివి నేర్పిస్తారు. వారిలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు, తమ జీవితాన్ని వారు స్వయంగా లీడ్ చేసేలా తీర్చి దిద్దుతారు. అలాగే వృద్ధుల కోసం కూడా ఇక్కడ ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాడు చేయడం విశేషం. ఈ సేవలకు గాను సాధనం హోం అనేక అవార్డులు, రివార్డులు గెల్చుకుంది. త్యాగానికైనా, ధైర్యానికైనా అమ్మ తరువాతే ఎవరైనా ఇల్లయినా, ఆఫీసైనా ఒంటిచేత్తో నడిపించే ‘బాహుబలి’ కష్టమొచ్చినా.. కన్నీరొచ్చినా ఏ మాత్రం వెరువని ధీశాలి అమ్మ అయితే ఒక చిన్న మాట ఈ ఒక్కరోజు అమ్మను తలచుకుని, ఒక పువ్వో, ఒక ముద్దో, ఒక హగ్గో ఇచ్చేస్తే సరిపోతుందా? ఎట్టి పరిస్థితుల్లోను కాదు. అయితే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా అమ్మను తీసుకోకుండా.. అమ్మ చాకిరీకి, త్యాగానికి విలువ ఇచ్చి.. హార్ట్‌ఫుల్‌గా అమ్మను ప్రేమించాలి. ఆమె మనసుకు కష్టం కలిగినపుడు నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి.. అచ్చం అమ్మలాగా.. మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ విషెస్ అందిస్తోంది. -
ఇంట్లో వీల్‌చైర్‌లా... బయట స్కూటీలా
IIT Madras Created: దివ్యాంగులు ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవరో ఒకరి తోడు ఉండాల్సిందే. అలాంటి వారి కోసం ఐఐటీ మద్రాస్ తయారు చేసిన బ్యాటరీ వాహనం ఎంతో ఉపయోగపడుతోంది. దానిని ఇంట్లో వీల్ చైర్‌లా..బయటకు వెళ్తే స్కూటీలాగా వాడొచ్చు. ఎవరి సహాయం లేకుండా ఒక్కరే ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఒక్కరే దానిని అటాచ్ చేసుకునేలా, తొలగించుకునేలా తయారు చేశారు. (చదవండి: హ్యాట్సాఫ్ సార్!... హీరోలా రక్షించారు!) నాలుగు గంటలు చార్జ్ చేస్తే ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్‌కు చెందిన శ్రావణ్ పద్నాలుగు సంవత్సరాల క్రితం ప్రమాదంలో నడవలేని స్థితికి చేరుకున్నాడు. అప్పటినుంచి ఎవరైనా తోడుంటేనే బయటకు వచ్చాడు. కానీ ఈ వెహికిల్ సహాయంతో ఒక్కడే బయటకు రాగలుగుతున్నాడు. కాగా, దీని ఖరీదు రూ.95,000. దీన్ని శ్రావణ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టు చెబుతున్నాడు. – బి.శివ ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
కదలలేని వాళ్ల కోసం.. ‘ఒరిహిమి’ అవతార్ రోబోలు
మిమ్మల్ని రోజంతా ఒక గదిలో బంధించి, సమయానికి తిండి, నీళ్లు, అవసరమైన మందులు మాత్రమే అందిస్తే ఎలా అనిపిస్తుంది? ఎటూ వెళ్లలేక, కనీసం మాట్లాడేవాళ్లూ లేక చాలా ఇబ్బందిగా ఉంటుందంటారా! ఇలా కేవలం ఒకరోజు కాకుండా వారాలు, నెలల తరబడి ఉంచితేనో? నరకయాతనే కదా?! ఏదైనా ప్రమాదంలో గాయపడో, వెన్నుపూస దెబ్బతినో, వయసైపోయో కదలలేక మంచానికే పరిమితమైన వాళ్ల పరిస్థితీ ఇదే. వేళకు కావలసినవి అందుతున్నా మాట్లాడేవాళ్లు లేక, చేయడానికి పనిలేక వాళ్లు పడే యాతన చెప్పలేనిది. ఇలాంటి వారి బాధలు కాస్తయినా దూరం చేసేలా రోబోల తయారీ సంస్థ, జపాన్‌లోని ప్రఖ్యాత ఒరిల్యాబ్స్ ఓ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. కదలలేకపోయినవారికీ కొలువు కల్పిస్తోంది. తద్వారా వారిలో ఒంటరితనాన్ని దూరం చేస్తూ మేమున్నాముంటూ అండగా నిలుస్తోంది. మంచానికే పరిమితమైనా కళ్లు, చేతి వేళ్ల కొనలు, పెదవులు కాస్తంత కదిలించగలిగిన వారికి సహాయం అందించేలా ‘ఒరిహిమి’ అవతార్ రోబోలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మక కేఫ్.. మిగిలిన రోబోలకు భిన్నంగా ఉండే ఒరిహిమి.. అచ్చం మనిషిలానే స్పందిస్తుంది. ఈ రోబోలతో ప్రయోగాత్మకంగా రెండేళ్ల కిందట ‘అవతార్ కేఫ్ డాన్ వెర్షన్ బీటా’ కేఫ్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో అతిథులు కూర్చొనే ప్రతి టేబుల్‌పైనా ఓ చిన్నపాటి ఒరిహిమి రోబో ఉంటుంది. దీని ద్వారా వాళ్లు కావాల్సినవి ఆర్డర్ ఇస్తారు. ఈ ఆర్డర్స్‌ను ఎక్కడో దూరాన కదలలేనిస్థితిలో మంచంమీద ఉండే కొంతమంది తమ ఎదురుగా ఉండే స్క్రీన్ మీద చూస్తూ నోట్ చేసుకొంటారు. తర్వాత వీరు ఈ ఆర్డర్స్‌ను కేఫ్‌లో ఉండే ఒరిహిమి–డి అనే పెద్ద రోబోలకు పాస్ చేస్తారు. మంచంమీద కదలలేని స్థితిలో ఉంటూ ఆర్డర్లను తీసుకునేవారిని పైలెట్లు అంటారు. వీరి ఆజ్ఞలను అనుసరించి ఒరిహిమి–డి రోబోలు కస్టమర్లకు వారు కోరుకున్నవి ట్రేల ద్వారా తీసుకెళ్లి ఇస్తాయి. కస్టమర్లు కావాలనుకుంటే టేబుల్ మీద ఉన్న ‘ఒరిహిమి’ చిన్న రోబో ద్వారా నేరుగా పైలెట్లతో మాట్లాడొచ్చు. వారి బాధలను పంచుకొని ఒంటరితనాన్ని దూరం చేసేలా సాంత్వన కలిగించొచ్చు. దీనికోసం ‘ఒరిహిమి’ కళ్లలో ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ నిక్షిప్తం చేశారు. కస్టమర్లు ఇచ్చే ఆర్డర్లు తీసుకోవడానికి, వాళ్లతో మాట్లాడడానికి పైలెట్ల మంచంపైన ఓ ప్రత్యేక పరికరం ద్వారా కంప్యూటర్ స్క్రీన్‌ను అమర్చుతారు. పైలెట్లు ఆ స్క్రీన్‌ను చూస్తూ ఆర్డర్స్ తీసుకోవడం, తిరిగి పాస్ చేయడం, కస్టమర్లతో మాట్లాడడం చేయొచ్చు. పైలెట్లుగా పనిచేయగలిగే వారిని ఒరిల్యాబ్స్ సంస్థే ఎంపిక చేసుకొంటుంది. ‘అవతార్ కేఫ్ డాన్ వెర్షన్ బీటా’ను ఇప్పటివరకూ ఐదువేల మందికి పైగా కస్టమర్లు సందర్శించినట్లు ఒరిల్యాబ్స్ చెబుతోంది. ప్రస్తుతం టోక్యోలోని ఓటెమచిలో ఉన్న ఈ ప్రయోగాత్మక కేఫ్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. రాబోయే జూన్‌లో టోక్యోలోనే మరోచోట ఈ కేఫ్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. మనిషి ఒంటరితనాన్ని సాంకేతికతతో దూరం చేసేందుకే తమ సంస్థ ఆవిర్భవించిందని చెప్పే ఒరిల్యాబ్స్ ఆ ప్రయత్నంలో ‘ఒరిహిమి’ ద్వారా కొంతమేర విజయం సాధించినట్లే కనిపిస్తోంది. చదవండి: ప్లాస్టిక్ వస్త్రాలు.. ఈ వనితల వినూత్న ఆలోచన -
మీ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్
సాక్షి, హైదరాబాద్: ‘ఆత్మవిశ్వాసం, చొరవ, సమర్థతతో వైకల్యాన్ని అధిగమించి సమాజానికి ఆదర్శంగా నిలిచిన మీ అందరికీ నా సెల్యూట్. మిమ్మల్ని ప్రశంసించడానికి నా దగ్గర మాటల్లేవు. మీ ప్రతిభతో మీరు అద్భుతాలు సాధిస్తున్నారు’అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దివ్యాంగులపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆమె మాట్లాడారు. రాజ్‌భవన్‌లో దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడం ఇదే తొలిసారని జాతీయ పురస్కార గ్రహీతలైన పలువురు దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేశారు. అంధత్వాన్ని జయించి గత 18 ఏళ్లుగా సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తున్న చంద్రాసుప్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
దివ్యాంగ ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలి
సాక్షి,ఇందూరు(నిజామాబాద్ అర్బన్): అర్హత గల దివ్యాంగులను ఓటరుగా నమోదు చేయడానికి క్షేత్ర స్థాయిలో అధికారులతో పాటుగా స్వయం సహాయక సంఘాలు, ఆయా స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం దివ్యాంగ ఓ టర్లు, పోలింగ్ సిబ్బంది అంశాలపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికల సందర్భంగా దివ్యాంగులకు పోలింగ్ కేం ద్రాల్లో ప్రత్యేక వసతులతో పాటుగా వీల్చైర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. స్థానికంగా ఎన్ని వీల్చైర్లు లభ్యమవుతాయో పరిశీలన చేయాలని, అదనంగా అవసరమైన వాటికి టెండరు పిలిచి సమకూర్చడం జరుగుతుందన్నారు. పోలింగ్ సి బ్బంది అదనంగా 20 శాతం సిబ్బంది రిజర్వుగా ఉండాలన్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ రా మ్మోహన్ రావు మాట్లాడుతూ.. దివ్యాంగులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో 15,800 దివ్యాంగ ఓటర్లు ఉన్నారని సీఈవోకు తెలిపారు. ఇంకా అర్హత గల వారికి ఓటర్లుగా న మోదు చేయడానికి క్షేత్రస్థాయి అధికారులకు ఆదే శాలు జారీ చేసినట్లు చెప్పారు. 985 వీల్చైర్లు అవసరం ఉంటాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్‌తో పాటు డీఆర్వో అంజయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగుల సదుపాయాలపై చర్యలు తీసుకోవాలి సాక్షి, కామారెడ్డి (నిజామాబాద్): దివ్యాంగులకు అవసరమైన ట్రా న్స్‌పోర్టు, ర్యాంపులను, వీల్చైర్లను పోలింగ్ కేం ద్రాల వద్ద ఏర్పాటు చేయడానికి ఎన్నికల రిటర్నిం గ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. జిల్లా కేంద్రం లోని ఆర్డీవో కార్యాలయం నుంచి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని ఆయా మండలా ల అధికారులతో మాట్లాడారు. డిసెంబర్ 2 లోగా బూత్‌స్థాయి అధికారులు, ఏజెంట్లు, ఫొటో ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేసే విధంగా చూడాలన్నారు. రైట్టు డిసేబుల్ యాక్ట్ ప్రకారం దివ్యాంగులకు స దుపాయాలు కల్పించాలని సుప్రీంకోర్టు, పార్లమెంట్లు సూచిస్తున్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, డీపీవో రాములు, నోడల్ అధికారి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
బతికుండగానే మీ చర్మం ఒలిచేస్తాను
-
‘కూర్చుంటావా లేదా కాళ్లు విరగ్గొట్టాలా..?’
కోల్‌కతా : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బీజేపీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో మరోసారి నోరు జారారు. దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన బాబుల్ ‘మీ కాళ్లు విరగొట్టాలా’ అంటూ అక్కడికి వచ్చిన వారిని బెదిరించాడు. వివరాల ప్రకారం.. అసన్సోల్లో దివ్యాంగులకు వీల్ చైర్లు, ఇతర పరికారాలు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాబుల్ సుప్రీయో అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నారు. ఈ సమయంలో కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తి బయటకు వెళ్లాలని భావించాడు. కానీ సభ నిర్వాహకుడు అతన్ని అడ్డగించి కూర్చోవాల్సిందిగా కోరాడు. దీన్ని గమనించిన బాబుల్ తన ప్రసంగాన్ని ఆపి.. సదరు వ్యక్తితో ‘నీ సమస్య ఏంటీ.. ఎక్కడికి వెళ్తున్నావ్.. కూర్చో, లేదంటే నీ కాళ్లు విరగొట్టి స్ట్రెచర్ మీద పడుకోబెడతాను. నేను ఒక్క మాట చెబితే సెక్యూరిటీ వాళ్లు నీకు తగిన శాస్తి చేస్తారం’టూ సదరు దివ్యాంగున్ని హెచ్చరించారు. దివ్యాంగులు కార్యక్రమానికి వచ్చిన మంత్రి వారినే ఇలా బెదిరించడంతో అక్కడున్న వారు విస్తు పోయారు. అయితే బాబుల్ ఇలా దురుసుగా మాట్లాడటం ఇదే ప్రథమం కాదు. ఈ ఏడాది మార్చిలో శ్రీరామ నవమి ఏర్పాట్లలో భాగంగా అల్లర్లు చెలరేగాయి. అసన్సోలో కూడా ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో అక్కడ పర్యటించిన బాబుల్ సుప్రియో చుట్టూ జనాలు గుమికూడారు. దాంతో సుప్రియో వారి మీద చిరాకు పడుతూ ‘నేను తల్చుకుంటే బతికుండగానే మీ చర్మం ఒలిచేస్తాను’ అంటూ వారిపై మండి పడ్డారు -
ఆరు రోజులు ప్రత్యక్ష నరకం
వాళ్లంతా మానసిక వికలాంగులు. చుట్టూ వరద నీరు ముంచేస్తున్నా ఏం జరుగుతోందో గ్రహించుకోలేని నిస్సహాయులు. ఆరు రోజులు బయట ప్రపంచంలో ఏమవుతోందో తెలీక, తమ ప్రాణాలే ప్రమాదంలో పడ్డాయనే విషయాన్ని తెలుసుకోలేక నీళ్లల్లోనే అలా కాలం గడిపేశారు. చివరికి ఎలాగోలా సహాయబృందాలు వారున్న చోటుకి వెళ్లగలిగాయి. వారి ప్రాణాలు కాపాడాయి. కేరళ తిస్సూరు జిల్లాలోని మురింగూర్ అనే మారుమూల ప్రాంతంలోని మానసిక రోగుల సంరక్షణ కేంద్రంలో 400 మంది వరకు రోగులు ఉంటారు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవారంతా తట్టబుట్ట సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోతే, వరద నీరు మింగేస్తోందని కూడా తెలుసుకోలేని వారంతా అక్కడే ఉండిపోయారు. గుబురుగా ఉండే చెట్ల మాటున ఉండే ఆ కేంద్రం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండడంతో వారి ఆలనాపాలనా పట్టించుకునేవారే లేకపోయారు. అయితే అక్కడ స్థానిక బ్లాక్ పంచాయితీ సభ్యుడు థామస్ మాత్రం ఎంతో బాధ్యతగా వ్యవహరించారు. మొదటి అంతస్తులోకి నీళ్లు వచ్చేయడంతో వాళ్లని జాగ్రత్తగా పై అంతస్తులోకి తరలించారు. ప్రతీరోజూ చిన్న మరబోటులోనే ఆ కేంద్రానికి కొంచెం కొంచెం ఆహార పదార్థాలను తీసుకువెళ్లి వాళ్లకి తినిపించేవారు. అలా ఆరు రోజులు గడిచాక ఎలాగైతేనేం సహాయ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. థామస్ ఆ సహాయ బృందాలకు ఎదురేగి మానసిక వికలాంగుల పరిస్థితిని వివరించారు. కానీ వరదనీరు భారీగా చుట్టుముట్టేయడంతో వారందరినీ తరలించడం చాలా క్లిష్టంగా మారింది. ఆహారం, మందులు లేకపోవడంతో ఇద్దరు మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కూడా కోల్పోయారు. థామస్ సహకారంతో మిగిలిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. తిస్సూర్ జిల్లాలోని ఆ మారుమూల ప్రాంతానికి సహాయ బృందాలు చేరుకోవడం ఇదే ప్రథమం. గతంలో విపత్తులు సంభవించిన సమయంలోనూ అక్కడికి ఎవరూ వెళ్లలేకపోయారు. కానీ ఈ సారి సహాయ బృందాలు మెడలోతు నీళ్లల్లో 3 కి.మీ. నడుచుకుంటూ వెళ్లి మరీ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఆ గ్రామ ప్రజలనే కాదు మానసిక స్థితి సరిగా లేని వారి ప్రాణాలను కాపాడారు. అయితే ఇన్ని రోజులూ వారిని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన థామస్‌ని రియల్ హీరో అంటూ స్థానికులు కొనియాడుతున్నారు. -
వికలాంగుల కోసం ‘ఈజీ మూవ్’
అనారోగ్యం వల్లో లేదా రోడ్డు ప్రమాదం కారణంగానో కొందరు వీల్‌చైర్‌కే పరిమితం అయిపోతుంటారు. అలాంటి వారిని బయటకు తీసుకెళ్లాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. మిగతా వాళ్లలాగా తాము అన్నిచోట్లకూ వెళ్లలేకపోతున్నామని, నాలుగు గోడల మధ్య బందీలుగా మారిపోయామని మానసికంగానూ వారు కుంగిపోతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపుతోంది ‘ఈజీ మూవ్’. వీల్‌చైర్‌కే పరిమితమైన రోగులను అవసరమైన చోటుకు సులభంగా తీసుకెళ్లేందుకు వీల్‌చైర్ ట్యాక్సీలను ఈ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ముంబైలో ఇప్పటికే ఈ ట్యాక్సీలు సేవలందిస్తున్నాయి. ఇప్పటివరకు 7 వేల మంది ఈ సేవలను ఉపయోగించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎలా మొదలైంది...? ఢిల్లీలో 2015లో జరిగిన వికలాంగుల 15వ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్న వారికి వీల్‌చైర్ లిఫ్ట్‌లు, ర్యాంపులు అందుబాటులో లేవు. నిర్వాహకులు మెట్లపై ప్లైవుడ్‌ను మాత్రమే పరిచారు. ఇది ఈజీ మూవ్ సంస్థ కో–ఫౌండర్ రోమియో రవ్వను కదిలించింది. వీల్‌చైర్‌కే పరిమితమైన తన స్నేహితుడి చెల్లెలు ఇతరులకు ఇబ్బంది లేకుండా, ఎవరిపైనా ఆధారపడకుండా కాలేజీకి వెళ్లిరావడం చూశారు. మిగతా వాళ్లకూ ఇలాంటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మరో ఇద్దరితో కలసి ‘ఈజీ మూవ్’ను నెలకొల్పారు. కదలలేని స్థితిలో ఉన్న వాళ్లు గౌరవంగా, హుందాగా అనుకున్న చోటుకు వెళ్లేలా సేవలందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. ఎలాంటి సేవలందిస్తారు...? వీల్‌చైర్‌కే పరిమితమైన రోగులను తరలించేందుకు కార్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా వీల్‌చైర్‌తో సహా కారులోకి వెళ్లిపోవచ్చు. భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కారులో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. డ్రైవర్‌కు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. రోగిని కారులోకి భద్రంగా చేర్చడంతోపాటు అవసరమైన సేవలు అందిస్తారు. ఆసుపత్రి, ఎయిర్‌పోర్టుకు వెళ్లి రావడం, ఆలయాలు, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు తీసుకెళ్తారు. సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లాలన్నా ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ముంబైలో అందుబాటులో ఉన్న వీల్‌చైర్ ట్యాక్సీ సర్వీసును త్వరలో గోవాలోనూ ప్రారంభించనున్నారు. 2019 నాటికి దేశంలోని అన్ని మెట్రో నగరాలకు ఈ సర్వీసును విస్తరింపజేయాలని సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. చార్జీ ఎంత...? ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు బేసిక్ చార్జీ (4 కి.మీ వరకు) రూ. 250గా ఉంది. ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ. 30 వసూలు చేస్తారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రూ. 350 బేసిక్ చార్జీ, ప్రతి కిలోమీటర్‌కు అదనంగా రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు, ఎనిమిది గంటల అద్దెకు కూడా లభిస్తాయి. సొంతకారు ఉన్న వారు తమ కారులో కూడా మార్పులు చేసుకోవాలంటే ఆ సదుపాయమూ ఇక్కడ అందుబాటులో ఉంది. వృద్ధులు, ప్రత్యేక అవసరాలుగల వారు సులభంగా ప్రయాణించేలా కారులో మార్పులు చేస్తారు. -
పింఛన్ల కోసం రోడ్డెక్కిన వృద్దులు,వికలాంగులు
-
‘వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి’
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): వికలాంగులకు రాజకీయాల్లో గ్రామస్థాయి నుంచి చట్టసభల వరకు రిజర్వేషన్లు కల్పించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని న్యూ అంబేద్కర్‌భవన్‌లో వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో సోమ వారం నిర్వహించిన సమావేశంలో ఆమె మా ట్లాడారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా వికలాంగులకు అన్యాయం జరుగుతోందని, సంక్షేమ పథకాల్లో వికలాంగులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. రాజకీయంగా అవకాశం కల్పించడం లేదని, వికలాంగులను ప్రభుత్వా లు చిన్నచూపు చూడడం సరికాదన్నారు. రాష్ట్రం లో 20లక్షల వికలాంగ ఓటర్లున్నారని తెలిపా రు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు చదువుకునే వారికి మోటారు వాహనాలు, ట్యారీ సైకిళ్లు అందించాలన్నారు. ఉపాధి కల్పన శాఖ ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి వివి ధ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. వికలాంగులతో దుర్భాషలాడిన వారిపై అట్రాసిటీ చట్టం తేవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు నారాయణ ఉన్నారు. -
అంత్యోదయ కార్డులు ఇవ్వాలి
గన్‌ఫౌండ్రి: వికలాంగులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహా అన్నారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ పథకం, జి.ఓ.నెంబర్.10లో వికలాంగులకు 3శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా వికలాంగులందరికీ అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలని, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్నారు, 6కిలోల బియ్యం నిబంధనను ఎత్తివేయాలని కోరారు. అనంతరం జేసీ భారతి హోళికేరికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వెంకటేష్, చుక్కయ్య, నాగమణి, శ్రీరాములు, ఆర్.పాండు, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
వికలాంగులకు బస్‌పాసు కౌంటర్
బస్పాసుల అందజేసిన డీఎం హేమంత్‌రావు ఇబ్రహీంపట్నం : వికలాంగులకు బస్‌పాసు కౌంటర్‌ను స్థానిక డీపో మేనేజర్ హేమంత్‌రావు సోమవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి నెల 25, 26 తేదీలల్లో వికలాంగులకు బస్‌పాసులను ఇవ్వానున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం బస్‌స్టాండ్‌లో బస్‌పాస్ కౌంటర్‌ను ఏర్పాటు చేసామని ఈ ఆవకాశాన్ని వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కాళ్ల జంగయ్య మాట్లాడుతూ వికలాంగుల సిటీ బస్సుపాసులను ఇబ్రహీంపట్నంలో తీసుకునేవిధంగా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సహకరించిన మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, డీఎం హేమంత్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు వీరన్న, బీ. చంద్రశేఖర్, విహెచ్పీఎస్ నాయకులు శ్రీనివాస్, రమేష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వికలాంగులకు డీఎం చేతుల మీదుగా బస్‌పాసులను అందజేశారు. -
వారి కోసం త్వరలో ప్రత్యేక సౌకర్యాలు..
ఢిల్లీ: దివ్యాంగుల కోసం 144 ప్రముఖ పర్యాటక స్థలాలలో ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీల్ చైర్లు, బ్యాటరీతో నడిచే బండ్లు, ప్రత్యేక టాయిలెట్లతోపాటు ప్రత్యేక మార్గాలను వారి కోసం ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతలో 50 పర్యాటక స్థలాలలో ఆ సౌకర్యాలను కల్పించనున్నారు. గత డిసెంబరులో ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన 'సుగమ్య భారత్ అభియాన్' పథకంలో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంకల్పించింది. వివిధ రకాలైన వైకల్యంతో వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న సుమారు 50 నుంచి 80 లక్షల మంది సౌకర్యాల లేమి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నది విశ్లేషకుల మాట. కేవలం వారికి తగిన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే పర్యాటక స్థలాలకు వెళ్లే హక్కును కోల్పోతున్నారు. అందరితోపాటు దివ్యాంగులకు కూడా సమాన సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతోనే 'సుగమ్య భారత్ అభియాన్' పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా 2018 జూలై వరకు జాతీయ, రాష్ట్ర ముఖ్య నగరాల్లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో కనీసం 50 శాతం భవనాల్లోనైనా దివ్యాంగులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సాంస్కృతిక శాఖ వెల్లడించింది. కట్టడాల నిర్మాణాన్ని మార్చకుండానే.. వారికి తగిన సౌకర్యాలను కల్పించే దిశగా అడుగులు పడనున్నాయి. తొలివిడతలో తాజ్ మహల్, జగన్నాథ ఆలయం, ఖజురహో, కుతుబ్ మినార్, ఎర్రకోట, హంపి, కోణార్క్ సూర్య దేవాలయం తదితర కట్టడాలను ఎంపిక చేశారు. అలాగే త్వరలోనే ప్రతి పర్యాటక స్థలంలోను సౌర విద్యుత్ వినియోగించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.