ఆత్మవిశ్వాసం
అద్భుతాలు జరగడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం అక్కర్లేదు. కాస్త ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. అలీన ఆ ఆత్మవిశ్వాసంతో సాధించిన అద్భుతం...మిట్టీ కేఫ్. ఆఫీసుల నుంచి రెస్టారెంట్‌ల వరకు దివ్యాంగులకు సరిౖయెన సౌకర్యాలు లేని పరిస్థితి. ‘నేను ఉద్యోగం చేస్తాను’ అని అడిగితే ‘సారీ’ చెప్పే పరిస్థితి.
ఇది తెలిసి కూడా దివ్యాంగులను ఉద్యోగులుగా, ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా చూడాలని కల కన్నది అలీనా అలమ్. ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఆమె మొదలుపెట్టిన ‘మిట్టీ కేఫ్’ ఆ తరువాత కాలంలో అద్భుతం సృష్టించింది. ‘మిట్టి కేఫ్’ అనేది ఇప్పుడు ఒక కేఫ్ బ్రాండ్ మాత్రమే కాదు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిధ్వనించే బ్రాండ్...
దివ్యాంగుల కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘సమర్థన’ ట్రస్ట్‌లో ఇంటర్న్‌షిప్ ్ర΄ోగ్రామ్ చేస్తున్న రోజుల్లో ‘మిట్టీ కేఫ్’ ఆలోచన ఆలీనా అలమ్‌కు వచ్చింది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన కలను సాకారం చేసుకోవడానికి ‘మిట్టీ కేఫ్’ మంచి ఆలోచన అనుకుంది.
‘పెళ్లి చేసుకో లేదా ఉద్యోగం చెయ్’ అన్నారు తల్లిదండ్రులు. అలీనా మాత్రం సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దారిలో నడక మొదలు పెట్టింది. దివ్యాంగుల కోసం, దివ్యాంగుల చేత నడుస్తున్న ‘మిట్టీ కేఫ్’లు సక్సెస్ అయ్యాయి.
‘మన దేశంలోని లక్షలాది మంది దివ్యాంగులు సమాన అవకాశాల కోసం, ఆర్థికంగా సొంతకాళ్ల మీద నిలబడడం కోసం ఎదురుచూస్తున్నారు. సమస్య అనేది వారి సామర్థ్యం గురించి కాదు. సమస్య మనం చూసే దృష్టి కోణంలో ఉంది. వారి గురించి మనకు ఎన్నో అ΄ోహలు ఉంటాయి. చిన్న చూపు ఉంది. ఈ పరిస్థితి పూర్తిగా మారి΄ోవాలి’ అంటున్న అలీన ‘మిట్టీ కేఫ్’ ద్వారా ఎంతోమంది దివ్యాంగులకు ఉ΄ాధితో΄ాటూ ఆత్మస్థైర్యాన్నీ ఇచ్చింది.
దాతలు ఇచ్చిన విరాళాలతో‘మిట్టీ కేఫ్’ మొదలైంది. ‘సంకల్పం మంచిదైతే సహాయపడడానికి సమాజం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అన్నట్లు ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమాని కేఫ్‌కు సంబంధించిన ΄ోస్టర్‌లను ఉచితంగా ముద్రించి ఇచ్చాడు.
దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘మిట్టీ కేఫ్’లను తీర్చిదిద్దారు. దృష్టి లోపం ఉన్నవారు బిల్లింగ్ చేయడానికి వీలుగా బిల్లింగ్ సిస్టమ్‌లో ఆడియో ఫీచర్ ఉంది. మెనూ బ్రెయిలీ లిపిలో ఉంటుంది. వినికిడి లోపం ఉన్న, మూగ ఉద్యోగులు కస్టమర్‌లతో కమ్యూనికేట్ చేయడానికి ప్లకార్డులు కూడా ఉంటాయి.
హుబ్లీలోని చిన్న షెడ్‌లో మొదలైన ‘మిట్టీ కేఫ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. దేశవ్యాప్తంగా ఎయిర్΄ోర్ట్స్, పెద్ద కంపెనీలు, బ్యాంకులు... మొదలైన వాటిలో 46 ‘మిట్టీ కేఫ్’లు నడుస్తున్నాయి. గత సంవత్సరం సుప్రీంకోర్టు ్ర΄ాంగణం, రాష్ట్రపతి భవన్, ఐఐఎం–బెంగళూరులో ‘మిట్టీ కేఫ్’లను ్ర΄ారంభించారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని విమాన్రాశయాలు, మెట్రో, రైల్వే స్టేషన్‌లలో ‘మిట్టీ కేఫ్’ లు ఏర్పాటు చేయనున్నారు.
‘కరేజ్’ ‘మ్యాజిక్’ అనే మాటలు అలీన నోటి నుంచి తరచుగా వినిపిస్తుంటాయి. ‘ధైర్యం’ ఉన్న చోటే ఊహించని అద్భుతాలు, మ్యాజిక్‌లు జరుగుతాయి. ‘మిట్టీ కేఫ్’ రూపంలో అద్భుతం సృష్టించడానికి అలీనాలోని ధైర్యమే కారణం. ఆమెకు బాగా ఇష్టమైన కొటేషన్...
‘ఎక్కడ దయాగుణం ఉంటుందో...
అక్కడ మంచితనం ఉంటుంది.
ఎక్కడ మంచితనం ఉంటుందో...
అక్కడ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది’
‘మనం మాత్రం ఏం చేయగలం’ అనుకునే నిరాశావాదులకు అలీన ఆలమ్ విజయం కనువిప్పు లాంటిది. కొత్త దారి చూపే కాంతి కిరణంలాంటిది. ‘మిట్టీ కేఫ్’లో పనిచేసిన దివ్యాంగ ఉద్యోగులలో కొందరు సొంతంగా ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా రాణించడం మరో మంచి విజయం.
Comments
Please login to add a commentAdd a comment