confidence
-
Mitti Cafe: అలీన అద్భుత దీపం...
అద్భుతాలు జరగడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం అక్కర్లేదు. కాస్త ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. అలీన ఆ ఆత్మవిశ్వాసంతో సాధించిన అద్భుతం...మిట్టీ కేఫ్. ఆఫీసుల నుంచి రెస్టారెంట్ల వరకు దివ్యాంగులకు సరిౖయెన సౌకర్యాలు లేని పరిస్థితి. ‘నేను ఉద్యోగం చేస్తాను’ అని అడిగితే ‘సారీ’ చెప్పే పరిస్థితి. ఇది తెలిసి కూడా దివ్యాంగులను ఉద్యోగులుగా, ఎంటర్ప్రెన్యూర్లుగా చూడాలని కల కన్నది అలీనా అలమ్. ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఆమె మొదలుపెట్టిన ‘మిట్టీ కేఫ్’ ఆ తరువాత కాలంలో అద్భుతం సృష్టించింది. ‘మిట్టి కేఫ్’ అనేది ఇప్పుడు ఒక కేఫ్ బ్రాండ్ మాత్రమే కాదు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిధ్వనించే బ్రాండ్...దివ్యాంగుల కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘సమర్థన’ ట్రస్ట్‌లో ఇంటర్న్‌షిప్ ్ర΄ోగ్రామ్ చేస్తున్న రోజుల్లో ‘మిట్టీ కేఫ్’ ఆలోచన ఆలీనా అలమ్‌కు వచ్చింది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన కలను సాకారం చేసుకోవడానికి ‘మిట్టీ కేఫ్’ మంచి ఆలోచన అనుకుంది.‘పెళ్లి చేసుకో లేదా ఉద్యోగం చెయ్’ అన్నారు తల్లిదండ్రులు. అలీనా మాత్రం సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దారిలో నడక మొదలు పెట్టింది. దివ్యాంగుల కోసం, దివ్యాంగుల చేత నడుస్తున్న ‘మిట్టీ కేఫ్’లు సక్సెస్ అయ్యాయి.‘మన దేశంలోని లక్షలాది మంది దివ్యాంగులు సమాన అవకాశాల కోసం, ఆర్థికంగా సొంతకాళ్ల మీద నిలబడడం కోసం ఎదురుచూస్తున్నారు. సమస్య అనేది వారి సామర్థ్యం గురించి కాదు. సమస్య మనం చూసే దృష్టి కోణంలో ఉంది. వారి గురించి మనకు ఎన్నో అ΄ోహలు ఉంటాయి. చిన్న చూపు ఉంది. ఈ పరిస్థితి పూర్తిగా మారి΄ోవాలి’ అంటున్న అలీన ‘మిట్టీ కేఫ్’ ద్వారా ఎంతోమంది దివ్యాంగులకు ఉ΄ాధితో΄ాటూ ఆత్మస్థైర్యాన్నీ ఇచ్చింది.దాతలు ఇచ్చిన విరాళాలతో‘మిట్టీ కేఫ్’ మొదలైంది. ‘సంకల్పం మంచిదైతే సహాయపడడానికి సమాజం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అన్నట్లు ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమాని కేఫ్‌కు సంబంధించిన ΄ోస్టర్లను ఉచితంగా ముద్రించి ఇచ్చాడు.దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘మిట్టీ కేఫ్’లను తీర్చిదిద్దారు. దృష్టి లోపం ఉన్నవారు బిల్లింగ్ చేయడానికి వీలుగా బిల్లింగ్ సిస్టమ్‌లో ఆడియో ఫీచర్ ఉంది. మెనూ బ్రెయిలీ లిపిలో ఉంటుంది. వినికిడి లోపం ఉన్న, మూగ ఉద్యోగులు కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడానికి ప్లకార్డులు కూడా ఉంటాయి.హుబ్లీలోని చిన్న షెడ్లో మొదలైన ‘మిట్టీ కేఫ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. దేశవ్యాప్తంగా ఎయిర్΄ోర్ట్స్, పెద్ద కంపెనీలు, బ్యాంకులు... మొదలైన వాటిలో 46 ‘మిట్టీ కేఫ్’లు నడుస్తున్నాయి. గత సంవత్సరం సుప్రీంకోర్టు ్ర΄ాంగణం, రాష్ట్రపతి భవన్, ఐఐఎం–బెంగళూరులో ‘మిట్టీ కేఫ్’లను ్ర΄ారంభించారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని విమాన్రాశయాలు, మెట్రో, రైల్వే స్టేషన్లలో ‘మిట్టీ కేఫ్’ లు ఏర్పాటు చేయనున్నారు.‘కరేజ్’ ‘మ్యాజిక్’ అనే మాటలు అలీన నోటి నుంచి తరచుగా వినిపిస్తుంటాయి. ‘ధైర్యం’ ఉన్న చోటే ఊహించని అద్భుతాలు, మ్యాజిక్‌లు జరుగుతాయి. ‘మిట్టీ కేఫ్’ రూపంలో అద్భుతం సృష్టించడానికి అలీనాలోని ధైర్యమే కారణం. ఆమెకు బాగా ఇష్టమైన కొటేషన్...‘ఎక్కడ దయాగుణం ఉంటుందో... అక్కడ మంచితనం ఉంటుంది.ఎక్కడ మంచితనం ఉంటుందో... అక్కడ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది’‘మనం మాత్రం ఏం చేయగలం’ అనుకునే నిరాశావాదులకు అలీన ఆలమ్ విజయం కనువిప్పు లాంటిది. కొత్త దారి చూపే కాంతి కిరణంలాంటిది. ‘మిట్టీ కేఫ్’లో పనిచేసిన దివ్యాంగ ఉద్యోగులలో కొందరు సొంతంగా ఎంటర్ప్రెన్యూర్లుగా రాణించడం మరో మంచి విజయం. -
రెండోసారి కూడా మన ప్రభుత్వమే..
-
Anantha Nageswaran: ఆర్థిక వ్యవస్థపై విశ్వాస పునరుద్ధరణ
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్లో విశ్వాస పునరుద్ధరణ నెలకొందని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఇందుకుగాను ఆయన ‘యానిమల్ స్పిరిట్స్’ అనే పదాలను వినియోగించారు. పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాల్లో ఇన్వెస్టర్ విశ్వాస పునరుద్ధరణ భావాన్ని వ్యక్తీకరించడానికి ప్రముఖ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ‘యానిమల్ స్పిరిట్స్’ అనే పదాలను వినియోగించారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడుల పురోగతి స్పష్టంగా ప్రతిబింబిస్తున్నట్లు నాగేశ్వరన్ వెల్లడించారు. ‘‘ఆర్థిక వ్యవస్థపై విశ్వాస పునరుద్ధరణ జరిగింది. లేకపోతే, భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వద్ద ఎలా వృద్ధి చెందుతుంది? అలాగే మీరు పర్చేజింగ్ మేనేజర్ల ఇండెక్స్, తయారీ, సేవల సూచీల పురోగతి స్టాక్ మార్కెట్ పనితీరును చూడండి. స్థూల దేశీయోత్పత్తి అంకెల్లో సానుకూలంగా కనిపిస్తున్నాయి’’ అని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఇంకా ఆయన ఏమి చెప్పారంటే... ► ప్రైవేట్ రంగంలో లిస్టెడ్ కంపెనీలు తమ మూలధన వ్యయాలను ప్రారంభించాయని, కొత్త ప్రాజెక్ట్ ప్రకటనలనూ చేస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డేటా పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన మధ్యంతర బడ్జెట్లో ఇదే విషయాన్ని వెల్లడించారు. ► ఇక స్థూల, నికర మార్కెట్ రుణాలు 2024–25లో వరుసగా రూ.14.13 లక్షల కోట్లు, రూ.11.75 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్ తెలిపింది. ఈ రెండు సంఖ్యలూ 2023–24 తో పోలి్చతే తక్కువే కావడం గమనార్హం. ప్రభుత్వం తక్కువ రుణాలను తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున రుణాల లభ్యత సులభతరం అవుతుందని ఆర్థికమంత్రి తన మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో విశ్లేషించారు. ► ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నేపథ్యంలో స్టీల్, సిమెంట్, పెట్రోలియం వంటి కొన్ని రంగాలలో ఇటీ వలి కాలంలో ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకున్నాయి. ► 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి అంచనాల నేపథ్యంలో రుణాలకు సంబంధించి అటు కార్పొరేట్, ఇటు బ్యాంకింగ్ రంగాల బ్యాలెన్స్ షీట్లు రెండూ కొంత ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ► కోవిడ్ నేపథ్యంలో రుణ భారాలను తగ్గించుకోడానికి తమ అసెట్స్‌ను సైతం విక్రయించిన కంపెనీలు, తాజా సానుకూల ఆర్థిక వాతావరణం నేపథ్యంలో రుణ సమీకరణ, వ్యాపార విస్తరణలపై దృష్టి సారించాయి. బ్యాంకింగ్ మూలధన నిష్పత్తి పటిష్టం.. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ తెలిపిన సమాచారం ప్రకారం, 15 శాతం సగటు మూలధన నిష్పత్తి (క్యాపిటల్ అడిక్వసీ రేషియో)తో బ్యాంకుల ఫైనాన్షియల్ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగిసే సమయానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) 16.85 శాతంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్యాపిటల్ అడిక్వసీ రేషియో అత్యధికంగా ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 16.80 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 16.13 క్యాపిటల్ అడిక్వసీ రేషియోను కలిగిఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం 253 శాతం వృద్ధితో (రూ. 2,223 కోట్లు) అత్యధిక త్రైమాసిక నికర లాభం వృద్ధిని సాధించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 62 శాతం వృద్ధితో (రూ. 1,870 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 60 శాతం పెరుగుదలతో (రూ. 3,590 కోట్లు) తరువాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. -
ముఖ స్తుతి
పొగడ్తకి పొంగిపోని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మనుషులే కాదు దేవతలు కూడా పొగిడితే ఉబ్బి తబ్బిబ్బై పోతారు. పొగడ్త వినగానే డోపమైన్ అనే హార్మోను విడుదల అవుతుంది. అందుకే దైవాన్ని ఇష్టదైవాన్ని అష్టోత్తరాలు, సహస్రనామాలతో కీర్తిస్తూ ఉంటారు. మానవులు, దేవతలు మాత్రమే కాదు. జంతువులు కూడా పొగిడితే సంతోషిస్తాయి. పెంపుడు జంతువులున్నవారికి ఇది అనుభవమే. పొగడ్తలు మనిషిని ప్రోత్సహించే వరకు ఉపయోగ పడతాయి. నిజంగా ప్రతిభ ఉన్నవారికి చిన్న మెప్పుదల ఉత్సాహాన్ని ఇస్తుంది. తాము చేస్తున్నది మంచిదే అయినా సాటివారి ఆమోదముద్ర తమ పని మీద నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పొగడ్తలో కొంచెం అయినా నిజం ఉంటుంది. ముఖస్తుతిలో అంటే ఎదురుగా పొగడటంలో నిజం ఉండే అవకాశం తక్కువ. మెరమెచ్చుల కోసం లేనిపోనివి అపాదించి చెప్పటం ముఖస్తుతి. ఆ సంగతి అంటున్నవారికి, వింటున్నవారికి తెలుసు. అయినా ఇష్టం లేనట్టు ముఖం పెట్టి వింటూనే ఉంటారు. లోలోపల సంతోషంగానే ఉంటుంది. ఎటువంటి వారికైనా తమని మెచ్చుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. ‘‘మీ లాగా పొగడ్తలు ఇష్టపడని వారు చాల గొప్పవాళ్ళు. అందుకే మీరంటే నాకు ఎంతో అభిమానం.’’ అంటే బోల్తాపడరా? చిన్నపిల్లల దగ్గర నుండి, దేవతల వరకు. ముఖస్తుతిని ఆశించి, ఆనందించే వారు సాధారణంగా నష్టపోతూ ఉంటారు. తనకి అపాదించబడిన గుణాలు తనలో ఉన్నాయేమో నని భ్రమ పడుతూ ఉంటారు. ఆ భ్రమ వల్ల దానిని నిజం చేయాలనే తాపత్రయంలో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. దాని వల్ల కలిగే దుష్ఫలితాలు ఏవిధంగా ఉంటాయో గమనించ వచ్చు. ఉదాహరణకి: మన్మథుడు, శల్యుడు. ఇంద్రుడు మన్మథుణ్ణి పిలిపించి అతడి సామర్థ్యాన్ని పొగుడుతాడు. అతడు ఉబ్బి తబ్బిబ్బు అయిపోయి ‘‘నేను ఎంతటి వారినైనా ప్రలోభపెట్ట గలను – శివుడైనా సరే!’’ అంటాడు. ఇంద్రుడికి కావలసింది అదే! అంతే! ఇరుక్కుపోయాడు. శరీరాన్ని కోల్పోయాడు. శల్యుణ్ణి దుర్యోధనాదులు పొగిడి కర్ణుడి రథసారథిగా ఒప్పించారు. ససేమిరా, నేను సారథ్యం చేయట మేమిటి? అని భీష్మించుకున్న శల్యుడు తనని కృష్ణుడితో సమానమని పోల్చగానే ఆ పొగడ్తల మాయాజాలంలో పడి రథసారథ్యం చేశాడు. ములగచెట్టు ఎక్కించటం అని చమత్కారంగా అంటూ ఉంటారు. ఆ కొమ్మ పుటుక్కున విరిగిపోతుంది. ముఖస్తుతి చేసే వారు ఎదుట పొగిడినా, వెనుక విమర్శిస్తూ ఉంటారు. పైగా పొగడ్తలకి పడిపోయారని చులకనగా మాట్లాడుతారు. ఈ ఆయుధం కొన్ని మారులు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ‘‘నా బంగారుకొండ మంచివాడు. చక్కగా అన్నం తిని నిద్రపోతాడు.’’ అంటుంది తల్లి. వాడు అన్నం తినటానికి పేచీ పెడతాడని ఒక పట్టాన నిద్రపోడని ఆ తల్లికి తెలుసు. వినగా, వినగా ఆ లక్షణాలు కొడుకులో పెంపొందుతాయేమోననే ఆశతో ఆ విధంగా పొగుడుతుంది. ఒక రాజుకి ఒక కన్ను లేదు. తన చిత్రాన్ని అందంగా వేసిన వారికి బహుమతి ప్రకటించాడు. ఒక చిత్రకారుడికి ఆ బహుమతి దక్కింది. రాజు విల్లు ఎక్కుపెట్టి లక్ష్యం వైపు చూడటానికి ఒక కన్ను మూసినట్టు వేశాడు. పొగడటానికి అబద్ధాలు చెప్పనక్కర లేదు. సాధారణంగా ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి లేని సద్గుణాలని అపాదించి ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించేదే ముఖస్తుతి. పిల్లికి బిచ్చం పెట్టని వాణ్ణి దానకర్ణుడని, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేని వాణ్ణి బృహస్పతి అని పొగడటం ముఖస్తుతి కాక మరేమిటి? ముఖస్తుతికి అలవాటు పడిన వారు విమర్శను అంగీకరించ లేరు. ఆత్మవిమర్శ అసలే ఉండదు. తాము చేసింది సరైనదే అనే మొండిపట్టు ఉంటుంది. పొరపాట్లని సరిదిద్దుకునే లక్షణం ఉండదు కనుక నాశాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మహత్కార్యాలు చేయటానికి ఈ పొగడ్త ప్రేరకం అవుతుంది. ఉదాహరణకి హనుమ. – డా.ఎన్.అనంత లక్ష్మి -
PM Narendra Modi: మూడోసారీ మేమే...
న్యూఢిల్లీ: వరుసగా మూడో పర్యాయం ప్రధాని పదవిని చేపడతానని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. తమ మూడో పర్యాయంలో మెరుగైన వృద్ధిరేటుతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు. 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారనే నీతి ఆయోగ్ నివేదికను ప్రస్తావిస్తూ భారత్ తప్పకుండా పేదరిక నిర్మూలన సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టినపుడు భారత్ ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా... ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు. -
గన్ షాట్: వచ్చే ఎన్నికల్లో జగన్ తుఫాన్ ఎలా ఉండబోతోంది ..!
-
SOMA BANIK: ఆరోగ్యమే ఆత్మవిశ్వాసం
ఓ భారతీయ యువతీ! తెల్లగా ఉండడమే అందానికి కొలమానం అని ఎవరు నిర్దేశించారు? అందంగా ఉన్న వాళ్లే విజేతలవుతారని నీకు ఎవరు చెప్పారు? ఆత్మవిశ్వాసానికి తెల్లగా ఉండడమే గీటురాయి అనే సూత్రం ఎలా వచ్చింది? మీ రెజ్యూమెలో మార్కులతో రాని ఆత్మవిశ్వాసం అందంతో వస్తుందా? నీకు ఉద్యోగం తెచ్చేది నువ్వు సాధించుకున్న మార్కులే... తెల్లదనం కాదు. తెల్లదనమే అందమనే అపోహ కాస్మెటిక్ మార్కెట్ సృష్టించిన మాయాజాలం. ఈ మాయాజాలం ఇప్పుడు భారతీయ మహిళల ఆరోగ్యాన్ని హరిస్తోంది. అరగంట ఎండను తాళలేకపోతే సమానత్వ పోరాటంలో మహిళ స్థానమెక్కడ? భారతీయ మహిళలు ఆరోగ్యం కోసం చేసే ఖర్చు కంటే అందంగా కనిపించడం కోసం చేసే ఖర్చే ఎక్కువగా ఉంటోంది. భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిణామాలకు ఇది తొలి సంకేతం. వైటెనింగ్ క్రీమ్‌లు వాడుతున్న వాళ్లను ముంబయిలో ఓ సంస్థ ప్రశ్నించినప్పుడు ‘తెల్లగా ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉంటాననే ఉద్దేశం తో ఫెయిర్నెస్క్రీమ్ని వాడుతున్నాను’ అని కొందరు బదులిచ్చారు. ఇంకా... ‘మా ఇంట్లో వాళ్లు, స్నేహితులు ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడమని చెప్పారు, వాడినప్పుడు బావున్నానని చెప్పారు. అందుకే కంటిన్యూ చేస్తున్నాను... అని, సినిమా వాళ్లు, యాడ్‌లో ఈ క్రీమ్‌లు వాడినందువల్లనే అందంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. కాబట్టి నేను కూడా అలా కనిపించడం కోసం వాడుతున్నాను’... ఇలాంటి సమాధానాలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే... కోల్‌కతాకు చెందిన సోమా బానిక్ చేదు అనుభవం ఇలా ఉంది. ∙∙ అది 2003, సోమా బానిక్కి పద్నాలుగేళ్లు. అప్పుడు సోమా బానిక్ తల్లితో ఓ పక్కింటావిడ అన్న మాటలు ఆ అమ్మాయి జీవితం మీద తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపించాయి. ‘చర్మాన్ని తెల్లబరచడానికి మార్కెట్లో అన్ని క్రీమ్‌లున్నాయి కదా! మీ అమ్మాయికి ప్రయత్నించండి. కొత్తగా ఫలానా క్రీమ్ వచ్చింది. మంచి ఫలితం ఉంటోందట’ అని వైటెనింగ్ క్రీమ్ పేరు కూడా చెప్పిందా పక్కింటావిడ. తెల్లగా ఉంటేనే విజేతలవుతారా! ఒక అమ్మాయి విజేతగా నిలవడానికి దగ్గర దారి తెల్లగా ఉండడమే అన్నంతగా కాస్మెటిక్ కంపెనీలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న రోజులవి. క్రీమ్‌ని వాడడం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే స్కూల్లో ఫ్రెండ్స్ సోమా చర్మంలో వచ్చిన మార్పును గుర్తించడం, ప్రశంసించడం మొదలైంది. రెండు నెలలు గడిచేటప్పటికి అసలు సమస్య మొదలైంది. ఎండలోకి వెళ్తే చర్మం చిరచిరలాడడం, మంట, దద్దుర్లు రావడం మొదలైంది. వైటెనింగ్ క్రీమ్ వాడేవాళ్లు ఇలాంటి మార్పును స్వచ్ఛందంగా స్వాగతిస్తారు. చర్మం తెల్లగా అయ్యే క్రమంలో ఇలాగే ఉంటుందని తమకు తాముగా సమాధానం చెప్పుకుంటారు. సోమా కూడా అందుకు మినహాయింపు కాలేకపోయింది. ఓ రోజు... క్రీమ్ రాసుకోవడం మరిచిపోయింది. స్కూలుకు వెళ్లిన కొద్ది గంటలకే ఆమె గడ్డం మీద చిన్న మచ్చలా మొదలై మొటిమలా తేలింది. ఇక క్రమం తప్పకుండా క్రీమ్ రాస్తూ ఏడాది పాటు కొనసాగించింది. చెంపల మీద మొదలైన సన్నని వెంట్రుకలు ముఖమంతా రావడాన్ని గమనించిందామె. ఇప్పుడామె వయసు 33. కోల్‌కతాలో స్టేట్గవర్నమెంట్ ఉద్యోగిని. ఇప్పుడామె భర్త ఎపిలేటర్ సహాయంతో ముఖం మీది వెంట్రుకలను తొలగించడంలో సహాయం చేస్తున్నాడు. ఇవన్నీ సోమా బానిక్ తన బ్లాగ్‌లో రాసుకున్న వివరాలు. ఈ లక్షణాలను విశ్లేషించిన డెర్మటాలజిస్టులందరూ ముక్తకంఠంతో చెప్పిన మాట ఒక్కటే... ‘చర్మం తెల్లగా మారడానికి ఆమె వాడిన వైటెనింగ్ క్రీమ్‌లో ఉన్న స్టిరాయిడ్స్ కారణం’ అని. అది కూడా దీర్ఘకాలం వాడడం వల్ల వెంట్రుకల వంటి సమస్యకు దారి తీసిందనీ. రంగు మార్చే క్రీమ్‌లు లేవు! చర్మం రంగును క్రీమ్‌లతో మార్చడం సాధ్యమయ్యే పని కాదన్నారు బెంగళూరుకు చెందిన డెర్మటాలజిస్ట్ ప్రియాంక రెడ్డి. ‘‘డెర్మటాలజీలో ఎంతటి అధునాతనమైన యంత్రాలు, ఔషధాలు వచ్చాయంటే... కోటి రూపాయల మెషినరీ కూడా ఉంది. కానీ చర్మాన్ని తెల్లబరిచే యంత్రం కానీ ఔషధం తయారు కాలేదు, కాదు కూడా. ఎందుకంటే చర్మం రంగు జన్యుపరంగా నిర్ణయమవుతుంది. అలా నిర్ణయమైన చర్మాన్ని ఆరోగ్యకరంగా మార్చడానికి వీలుంటుంది. గ్లూమింగ్తోపాటు చర్మం మెరుపుతో కాంతులీనేటట్లు చేసే ట్రీట్మెంట్లున్నాయి. కానీ తెల్లబరిచే ట్రీట్మెంట్లు లేవు. అది ఆరోగ్యకరం కాదు కూడా. కొంతమంది హీరోయిన్లను ఉదాహరణ గా చూపిస్తూ ఉంటారు. కానీ అది మేకప్, కెమెరా టెక్నిక్స్, ఎడిటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే వాళ్లు ఆరోగ్యకరమైన ట్రీట్మెంట్లు చేయించుకుంటారు తప్ప స్టిరాయిడ్స్, హైడ్రోక్వైనోన్లు ఉండే వైటెనింగ్ క్రీమ్‌ల జోలికి వెళ్లరు. చర్మ సంరక్షణలో ఆరోగ్యకరమైన పద్ధతులనే అవలంబిస్తారు’’ అని చెప్పారామె. స్కిన్ వైటెనింగ్, లైటెనింగ్ వంటి హానికారకమైన డ్రగ్స్ మీద ఆంక్షలు విధించాలని 2017లో ఐఏడివీఎల్ (ఇండియన్ అసోసిÄేæషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్ వెనెరియాలజిస్ట్) ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేసింది. నిషేధిత ఔషధాలు మార్కెట్లో యధేచ్ఛగా లభించడం మనదేశంలో జరుగుతున్న అరాచకమే. ‘అప్పియరెన్స్‌లో ఏముంది’ అని చెప్పడం సులువే, కానీ సమాజం అప్పియరెన్స్నే ప్రధానంగా చూస్తూ తోటివారిని న్యూనతకు గురి చేస్తూనే ఉంటుంది. సమాజం ఆలోచన మారి తీరాల్సిందేనన్నారు ప్రియాంక. అసలు ఈ తెల్లదనపు మాయకు ఆజ్యం పోసింది మన ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ అంటే ఆశ్చర్యం కలగక మానదు. రవివర్మ చిత్రలేఖనాన్ని డచ్ చిత్రకారుడి దగ్గర నేర్చుకోవడం... మన భారతీయ మహిళల మీద ఈ స్థాయిలో తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపించింది. ఆయన చిత్రించిన బొమ్మల్లో చాలా వరకు తెల్లగా యూరోపియన్ స్కిన్‌టోన్‌తో ఉంటాయి. ఆ బొమ్మల క్యాలెండర్లు దాదాపుగా అన్ని ఇళ్లకూ చేరాయి. అందంగా ఉండడం అంటే చర్మం తెల్లగా ఉండాలనే అపోహ కూడా ఇంటి గోడల నుంచి మెదడుకు దారి తీసింది. సమాజం ఈ అపోహ నుంచి బయటపడాలంటే మేధోవికసితమైన ఉద్యమం ఒకటి మౌనంగానే అయినా మొదలు కావాలి. అప్పుడు వైటెనింగ్, లైటెనింగ్ క్రీమ్‌ల మార్కెట్ మనదేశం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమిస్తుంది. ఆరోగ్యమే అందం వైటెనింగ్ క్రీమ్‌లను రెండు నుంచి మూడు నెలలు వాడినప్పటి నుంచి చర్మం పలుచబడడం, ఎర్రబారడం మొదలవుతుంది. ఎంతగా అంటే.. రక్తనాళాలు కనిపించేటంతగా పలుచబడుతుంది. ఆపేయగానే మొటిమలు, పిగ్మెంటేషన్ (మంగు) మొదలవుతాయి. దీర్ఘకాలం వాడితే చర్మం మీద వెంట్రుకలు మొదలవుతాయి. చర్మ సంరక్షణకు సాధారణంగా అవసరమయ్యేవి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫేస్ వాష్‌లు మాత్రమే. అంతకు మించి ఏ అవసరం ఏర్పడినా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాల్సిందే. చర్మతత్వాన్ని స్వయంగా పరిశీలించి, సమస్యను, వయసును దృష్టిలో పెట్టుకుని క్రీమ్ లేదా లోషన్లను వాడాల్సి ఉంటుంది. తెల్లదనం కోసం ఖర్చు పెట్టడం వృథా ప్రయాస మాత్రమే. పొల్యూషన్ చర్మానికి హాని కలిగిస్తుంది. కాబట్టి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దేహం ఆరోగ్యంగా ఉంటే చర్మం కూడా కాంతులీనుతుంది. మంచి ఆహారం, తగినంత నిద్ర, నీరు తీసుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. అలాగే ఎక్సర్సైజ్ చేసి చెమట ద్వారా మలినాలు బయటకు పంపించడం కూడా చర్మానికి మెరుపునిస్తుంది. – డాక్టర్ ప్రియాంక రెడ్డి, మెడికల్ డైరెక్టర్, డీఎన్ఏ స్కిన్ క్లినిక్, బెంగళూరు – వాకా మంజులారెడ్డి -
Sheroes Hangout: ఆత్మబలమే అసలైన అందం... ఆనందం
ఆ కేఫ్ వేడివేడి చాయ్‌లకు మాత్రమే ఫేమస్ కాదు. వేడి, వేడి చర్చలకు కూడా. ఎక్కడో ఏదో దిగులుగా ఉందా? అంతా శూన్యం అనిపిస్తుందా? అయితే అటు పదండి. దేశవ్యాప్తంగా ఎంతోమంది యాసిడ్ బాధిత మహిళలకు అంతులేని ధైర్యాన్ని ఇచ్చిన శ్రేయాస్ హ్యాంగవుట్ కేఫ్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది... ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని ‘శ్రేయాస్ హ్యాంగవుట్’ కేవలం రుచుల కేఫ్ మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసం లేనివారికి అంతులేని ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చే వేదిక. అభాగ్యుల కన్నీటిని తుడిచే చల్లని హస్తం. ఆపదలో ఉన్నవారికి చేయూత ఇచ్చి ముందడుగు వేయించే ఆత్మీయ మిత్రురాలు. యాసిడ్ ఎటాక్ సర్వైవర్స్ ఈ కేఫ్‌ను నడుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది యాసిడ్ బాధిత మహిళలకు స్ఫూర్తి ఇచ్చిన ‘శ్రేయాస్ హ్యాంగవుట్’ తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. ప్రముఖ బ్యూటీ చైన్ సెలూన్ ‘నెచురల్స్’తో కలిసి యాసిడ్ బాధిత మహిళలకు ప్రొఫెషనల్ బ్యూటీ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా ఈ కోర్స్ చేయడానికి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, వారు సొంతంగా బ్యూటీపార్లర్ ప్రారంభించడానికి అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అయిదు మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. వారిలో ఒకరు ఫరాఖాన్. ఒకప్పుడు ఆమెకు మేకప్ వేసుకోవడం అంటే ఎంతో ఇష్టం. అయితే భర్త యాసిడ్ దాడి చేసిన తరువాత అద్దంలోకి చూడాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. ‘అందరు మహిళలలాగే నాకు కూడా అలంకరణ అంటే చాలా ఇష్టం. శుభకార్యాలకు వెళ్లడానికి ముందు ఎంతో హడావిడి చేసేదాన్ని. నా భర్త చేసిన దుర్మార్గం వల్ల మేకప్ అనే మాట వినబడగానే కన్నీళ్లు ధారలు కట్టేవి. అద్దం చూడడానికి భయమేసేది. ఇలాంటి నా మానసిక ధోరణిలో పూర్తిగా మార్పు తీసుకువచ్చి నన్ను బలమైన మహిళగా నిలబెట్టింది శ్రేయాస్. పూర్వంలాగే ఇప్పుడు నేను మేకప్ విషయంలో శ్రద్ధ చూపుతున్నాను. ఏ తప్పు చేశానని భయపడాలి? ఎవరికి భయపడాలి!’ అంటుంది ఫరాఖాన్. 28 సంవత్సరాల కుంతి సోని డిమాండ్ ఉన్న నెయిల్ ఆర్ట్‌లో శిక్షణ తీసుకుంది. ఒక సినిమా కోసం బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణెతో కలిసి పనిచేసింది. ‘యాసిడ్ బాధితులకు ఉపాధి దొరకడం ఒక ఎల్తైతే, అందమైన ఆనంద జీవితం మరో ఎత్తు. యాసిడ్ బాధితురాలైన నేను మేకప్ వేసుకుంటే నలుగురు చులకనగా మాట్లాడతారేమో...అనే భావనతో చాలామంది అలంకరణ అనే అందమైన సంతోషాన్ని తమ ప్రపంచం నుంచి దూరం చేసుకుంటున్నారు. అలాంటి వారికి శ్రేయాస్ కొత్త ధైర్యాన్ని ఇచ్చింది’ అంటుంది సోని. ఘాజిపూర్కు చెందిన రూపాలి విశ్వకర్మ సినిమా రంగంలో మేకప్–ఆర్టిస్ట్ కావాలని బలంగా అనుకుంటుంది. కొన్ని ప్రాంతీయ చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు వేసిన రుపాలి ఆర్టిస్ట్‌గా నిలదొక్కుకోకముందే ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె ఒక కన్ను పూర్తిగా దెబ్బతింది. ఆమె రంగుల కల నల్లగా మసక బారింది. ఒకప్పుడు కళ్లముందు సుందర భవిష్యత్ చిత్రపటం తప్ప మరేది కనిపించేది కాదు. దాడి తరువాత ఎటుచూసినా దుఃఖసముద్రమే! ‘బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు ఇంటివాళ్ల నుంచి కూడా నన్ను పట్టించుకోని నిర్లక్ష్య ధోరణి ఎదురైంది. ఒక మూలన కూర్చొని జీవితాన్ని వెళ్లదీయి అన్నట్లుగా ఉండేవి వారి మాటలు. అయితే శ్రేయాస్‌తో పరిచయం అయిన తరువాత నాలో ధైర్యం పెరిగింది. మరుగున పడిన కలలు మళ్లీ ఊపిరి పోసుకున్నాయి. నేను మేకప్–ఆర్టిస్ట్‌గా రాణించడం మాత్రమే కాదు, ధైర్యం లోపించి దారి కనిపించని యువతులకు ధైర్యం ఇవ్వాలనుకుంటున్నాను’ అంటుంది రుపాలి. శ్రేయాస్ సరికొత్త ముందడుగు ద్వారా ‘అలంకరణ, అందం అనేవి మనకు సంబంధించిన మాటలు కావు’ అనే దుఃఖపూరిత నిరాశానిస్పృహలకు కాలం చెల్లుతుంది. ‘ఆత్మబలమే అసలైన అందం, ఆనందం’ అనుకునే కొత్త కాలం ఒకటి వస్తుంది. -
భారతీయులు ఆత్మ విశ్వాసం కోల్పోరు
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత కఠిన పరిస్థితులు ఎదురైనా సరే భారతీయులు ఆత్మవిశ్వాసం కోల్పోరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ మేరకు సంపూర్ణ శక్తియుక్తులతోపాటు అకుంఠిత దీక్షతో కరోనా సవాలును అధిగమించగలరని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు సరైన అవగాహన కల్పించడంతోపాటు పారిశుద్ధ్యం, పరిశుభ్రత దిశగా పంచాయతీ పాలన మండళ్లు తగు చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ కోరారు. ‘‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’’(పీఎం–కిసాన్) పథకం కింద ప్రధాని మోదీ శుక్రవారం 9.50 కోట్ల మందికి పైగా రైతులకు 8వ విడతగా రూ.20,667 కోట్లను విడుదల చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ పీఎం–కిసాన్ కింద ఇప్పటి వరకు 1.35 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని పలువురు రైతులతో కాసేపు ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో 170 మంది ఆదివాసీ రైతులకు వ్యవసాయంలో మార్గదర్శనం చేస్తున్న ఎన్.వెన్నూరమ్మ కృషిని ప్రధాని అభినందించారు. ‘‘ఈ పథకం కింద పశ్చిమ బెంగాల్ రైతులు 7.03 లక్షల మంది తొలిసారి లబ్ధి పొందనున్నారు. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల్లో కూడా ఆహార ధాన్యాలు, ఉద్యాన పంటలను రికార్డు స్థాయిలో పండించిన రైతుల కృషి అభినందనీయం. వారికి శ్రమకు ఫలితం దక్కేవిధంగా ప్రభుత్వం కూడా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో పంటల కొనుగోళ్లలో ఏటా కొత్త రికార్డులు çసృష్టిస్తోంది. ‘ఎంఎస్పీ’తో ధాన్యం సేకరణలో కొత్త రికార్డు నెలకొనగా, గోధుమ కొనుగోళ్లు కూడా కొత్త రికార్డుల దిశగా సాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకూ ‘ఎంఎస్పీ’తో కొనుగోళ్లు 10 శాతం అదనంగా నమోదయ్యాయి. వ్యవసాయంలో కొత్త సాధనాలు, సరికొత్త మార్గాలను రైతులకు చేరువ చేయడం కోసం ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కూడా ఇందులో భాగమే. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ‘కిసాన్ క్రెడిట్ కార్డు’ల గడువును పొడిగించనున్నాం. తదనుగుణంగా వాయిదాల చెల్లింపు గడువును జూన్ 30దాకా పెంచే వీలుంటుంది. శతాబ్దానికోసారి దాపురించే మహమ్మారి మన కళ్లకు కనిపించని శత్రువులా నేడు ప్రపంచానికి సవాళ్లు విసురుతోంది. కోవిడ్–19 మహమ్మారిపై ప్రభుత్వం సర్వశక్తులూ కూడదీసుకుని పోరాడుతోంది. ప్రజల కష్టాలు తీర్చడానికి భరోసా ఇస్తూ ప్రభుత్వంలోని అన్ని శాఖలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి’అని ప్రధాని తెలిపారు. కాగా, పశ్చిమబెంగాల్ రైతుల బ్యాంకు ఖాతాల్లో మొట్టమొదటి సారిగా పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలు జమ అయ్యాయి. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ కేంద్రం, బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య విభేదాల కారణంగా ఆ రాష్ట్ర రైతులకు ఈ పథకం అమలు కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలను మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. అందరూ టీకా వేయించుకోండి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విజృంభించడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి 2.60 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుందని తెలిపారు. వేగంగా కోవిడ్ టీకా వేసే దిశగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని ప్రధాని అన్నారు. ‘ప్రతి ఒక్కరూ పేరు నమోదు చేసుకుని, టీకా వేయించుకోవాలి. టీకా వేసిన తర్వాత కూడా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్ నియంత్రణ విధానాలను తప్పనిసరిగా కొనసాగించాలి. కరోనాపై పోరాటంలో ఈ టీకా అత్యంత కీలక ఆయుధం, దీనివల్ల తీవ్ర ముప్పు తప్పుతుంది’’అని ప్రధాని తెలిపారు. -
ప్రపంచ ఎకానమీ రికవరీపై ఒపెక్ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ మున్ముందు రికవరీ బాటన పయనిస్తుందని చమురు ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్) అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న నెలల్లో క్రమంగా చమురు ఉత్పత్తి పెంపునకు తన మిత్రదేశాలతో కలిసి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం మే నుంచి జూలై వరకూ మొత్తంగా రోజుకు 2 మిలియన్ బ్యారళ్లకుపైగా అదనపు ఉత్పత్తి జరగనుంది. దీని ప్రకారం ఉత్పత్తి మే నెల్లో రోజుకు 3,50,000 బ్యారళ్ల అదనపు ఉత్పత్తి జరుగుతుంది. జూన్ నెల్లో అదనపు ఉత్పత్తి కూడా ఇదే స్థాయిలో రోజుకు 3,50,000 బ్యారళ్లు జరుగుతుంది. జూలైలో రోజుకు 4,00,000 బ్యారళ్ల అదనపు ఉత్పత్తి అవుతుంది. దీనికితోడు సౌదీ అరేబియా రోజుకు అదనంగా ఒక మిలియన్ బ్యారళ్ల చమురు ఉత్పత్తి జరపనుంది. మార్చిలో ఒపెక్ తన ఉత్పత్తిని రోజుకు 3,00,000 బ్యారళ్ల మేర అదనంగా పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో రోజుకు సగటు ఉత్పత్తి 25.33 మిలియన్ బ్యారళ్లకు చేరింది. (ఐటీ కంపెనీల తాజా సవాల్ ఏంటంటే?) గత మార్చి సమా వేశం తరహాలోనే సరఫరాల విషయంలో ఒపెక్ జాగరూకతతో వ్యవహరించింది. ఉత్పత్తి లక్ష్యా లను భారీగా పెంచకపోవడం వల్ల స్వల్ప కాల వ్యవధిలో ధరల స్థిరీకరణ జరగవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థల రికవరీ బాగుంటుందని, ఈ నేపథ్యంలో క్రూడ్ డిమాండ్ భారీగా పెరుగుతుందని ఒపెక్ దేశాలు భావిస్తున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతి, ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకుల ఉద్దీపన చర్యలు గ్లోబల్ ఎకానమీ వృద్ధికి బాటలువేస్తాయని ఒపెక్ దేశాలు అంచనా వేస్తున్నాయి. మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారి అమెరికా రిఫైనరీలు భారీగా క్రూడ్ ప్రాసెసింగ్ చేసిన విషయాన్ని సంబంధిత వర్గాలు ప్రస్తావించాయి. -
విశ్వాసం అంటే అందరితో పోల్చుకోవడం కాదు..
ముంబై: అందం, స్టైల్, ఫ్యాషన్‌లో ఆటిట్యూడ్‌ను ప్రదర్శించడంలో హీరోయిన్ తాప్పీ పన్నుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తన సొంత నిర్ణయాల ప్రకారం సినిమాలను, పాత్రలను ఎంపిక చేసుకుంటూ విజయవంతంగా దూసుకుపోతున్నారామె. ఈ క్రమంలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికి ఆత్మవిశ్వాసంతో ముందుకువెళుతున్న తాప్పీ తాజాగా విశ్వాసం అంటే ఎంటో వివరించారు. సినిమా సెట్స్లోపి తన ఫొటో షూట్‌కు సంబంధించిన ఓ ఫొటోను తాప్సీ ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. బూడిద రంగు మ్యాక్సీ టాప్, కర్లీ హేర్ స్టైల్, రౌండ్ బ్లాక్ సన్‌గ్లాస్ ధరించిన ఆమె ఈ ఫొటోలో ఫ్యాషన్‌గా ఉన్న ఈ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ కాన్ఫిడెన్స్ అంటే ఏంటో నిర్వచించారు. (చదవండి: ఆ నియమం పెట్టుకున్నా : హీరోయిన్ తాప్సీ) ‘విశ్వాసం అంటే అందరికంటే నేను గొప్ప అంటూ ఆలోచించుకుంటూ మీ గదిలో వెళ్లడం కాదు.. మొదట మిమ్మిల్ని మీరు ఎవరితో పోల్చుకోకపోవడమే విశ్వాసం’ అంటూ హ్యాపీ సండే అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. ఇక తన పోస్టు చూసిన తాప్పీ అభిమానులు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేగాక తాప్పీ బాయ్‌ఫ్రెండ్ మాతియాస్ బోయ్.. కళ్లలో హర్ట్ సింబల్ ఉన్న ఎమోజీలతో తన స్పందనను తెలిపాడు. కాగా ప్రస్తుతం తాప్పీ ‘రష్మి రాకెట్’ షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఇటీవల రాంచిలో జరిగింది. ఇందులో తాప్సీ గుజరాతి అథ్లేట్ రష్మిగా లీడ్‌రోల్ పోషిస్తున్నారు. అంతేగాక ‘రష్మి రాకేట్’తో పాటు ‘హసీన్ దిల్రూబా’, ‘లూప్ లపేటా’ వంటి సినిమాల్లో కూడా ఆమె నటిస్తున్నారు. (చదవండి: నీకు అది మాత్రం కనబడదు కదా: తాప్సీ) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) -
వినియోగ విశ్వాసం బలోపేతంతోనే వృద్ధి
ముంబై: ఆర్థికాభివృద్ధి అంశంలో వినియోగదారుని విశ్వాసం, మనోభావాలే కీలక పాత్ర పోషిస్తాయని ఫిక్కీ ప్రెసిడెంట్, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ అంశాల్లో బలహీనత నెలకొందని ఆమె అన్నారు. వినియోగ విశ్వాసం పటిష్టతే ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. ఈ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ జరిగిన ఒక గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా జరిగిన చర్చ గోష్టిలో ఆర్థిక అనిశ్చిత పరిస్థితిపై ఆమె మాట్లాడారు. ఆమె ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► కరోనా మహమ్మారి ప్రేరిత అంశాలతో దాదాపు 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. పూర్తి అనిశ్చితి, భయాందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక పురోగతికి ప్రభుత్వం నుంచి మరింత వ్యయాలు అవసరం. ► కరోనా ముందటి పరిస్థితితో పోల్చితే ఉత్పత్తి ప్రస్తుతం 60 నుంచి 70 శాతం స్థాయికి చేరిందని కర్మాగారాల నుంచి వార్తలు వస్తున్నాయి. రుణ లభ్యత బాగుంది. ఎగుమతులు దారిలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిమాండ్ పెంపు పరిస్థితులపై ఆలోచించాలి. ఎందుకంటే వినియోగదారు విశ్వాసం ఇంకా బలహీనంగానే ఉంది. వారి మనోభావాలు మెరుగుపడకుండా వృద్ధిని మళ్లీ పట్టాలపైకి ఎక్కించడం అసాధ్యం. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష నగదు బదలాయింపులు మరింత జరగాలి. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వృద్ధిలో ప్రత్యక్ష నగదు బదలాయింపు ఎంతో కీలకమవుతుంది. ► ఫిక్కీ ఇప్పటికే ప్రభుత్వానికి కన్జూమర్ వోచర్ విధానాన్ని సిఫారసు చేసింది. ప్రభుత్వం వ్యయాల కింద 30 నుంచి 50 శాతం డిస్కౌంట్‌తో కన్జూమర్ వోచర్ విధానాన్ని అమలు చేయడం వల్ల వ్యవస్థలో డిమాండ్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. ► విధానాన్ని ఇకమీదట ఏ మాత్రం అనుసరించకూడదు. పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొనాలి. ఏ విభాగంలోనూ ఇకపై లాక్డౌన్ నిబంధనలను ఏ మాత్రం అమలు చేయకూడదు. ► వేదాంతా గ్రూప్ సీఈఓ సునీల్ దుగ్గల్, టాటా మోటార్స్ సీఈఓ బషెక్, యాక్సెంచర్ సీఈఓ పీయూష్ సింగ్ తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. వారి అభిప్రాయాలను చూస్తే... ద్రవ్యోల్బణంపై ఆందోళన అక్కర్లేదు వృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కించే విషయానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందనక్కర్లేదు. ఎకానమీలోకి మరింత నగదు లభ్యత జరిగేలా చూడ్డం ఇప్పడు ముఖ్యం. ముఖ్యంగా మౌలిక రంగంలో వ్యయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనితోపాటు కార్మిక సంస్కరణల విషయంలో కూడా ప్రభుత్వం ముందడుగు వేయాలి. పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. – సునీల్ దుగ్గల్, సీఈఓ, వేదాంతా గ్రూప్ డిమాండ్ పటిష్టతకు మరో 9 నెలలు ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ విభాగంలో డిమాండ్ ఊరటకలిగించే స్థాయిలో మెరుగుపడింది. అయితే అన్ని విభా గాల్లో డిమాండ్ పూర్తి పునరుత్తేజానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది. – పీయూష్ సింగ్, సీనియన్ ఎండీ, యాక్సెంచర్ ఆటో... పన్ను రాయితీలు కావాలి కరోనా ప్రేరిత అంశాలతో ఆటో పరిశ్రమ దారుణంగా దెబ్బతింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రంగం 2010–11 స్థాయికి క్షీణిస్తుందన్నది అంచనా. పన్ను రాయితీలు ఈ రంగానికి తక్షణ అవసరం. – బషెక్, ఎండీ, సీఈఓ, టాటా మోటార్స్ -
విశ్వసనీయతను మళ్లీ తెస్తాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి విశ్వసనీయతను తీసుకు వచ్చి, పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందు వచ్చే లా చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మాట చెబితే దానిపై నమ్మకం ఏర్పడేలా చేస్తానన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు రాయితీల రూపంలో బకాయి పడిన మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం చెల్లించేందుకు రీస్టార్ట్ ప్యాకేజీని ప్రక టించింది. అందులో భాగంగా మే లో తొలి విడతగా రూ.450 కోట్లు చెల్లించింది. రెండో విడతగా సీఎం వైఎస్ జగన్ సోమవారం రూ.512.35 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. -
గుడ్డి గుర్రం
సింహపురి రాజ్యాన్ని రుషికేశవ మహారాజు పరిపాలిస్తున్నాడు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నాడంటే ఎవరూ ఎదురు చెప్పకూడదు, ’ఔను’ అనాలి. చాలా మొండిఘటం. అయినా రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు. తనకు ఒక గుర్రం వుంది. చాలా ఏళ్ల తరబడి దానిపైనే ప్రయాణం సాగిస్తున్నాడు. గుర్రానికి వయసు పైబడింది. సేనాధిపతి కేశవుడికి గుర్రం మార్చమని చాలా సార్లు చెప్పాడు రాజు. ‘‘సేనాధిపతి... నేను స్వారీ చేస్తున్న గుర్రానికి వయసు ముదిరినది.. పైగా చీకటి పడే సమయానికి కళ్లు కనిపించవు.. గుడ్డిదైపోయింది. జోరు తగ్గిపోయింది. ఈ గుర్రాన్ని పాకలోనే కట్టేసి వేరే గుర్రాన్ని తెప్పించండి’’ అని చాలా సార్లు సేనాధిపతికి చెప్పి చూశాడు రాజు. ‘‘మహారాజా.. నీకు పట్టాభిషేకం జరిగినప్పటి నుంచి ఈ గుర్రం నిన్ను మోస్తూనే వుంది, ఇప్పుడు వయసు అయిపోయిందని వద్దనుకోవడం రాజధర్మం కాదు, వయసు మీద పడిందని మన బరువు బాధ్యతలు మోసిన తల్లిదండ్రులను వద్దనుకుంటామా, ఇది అంతే మహారాజా’’ అంటూ సేనాధిపతి గుర్రాన్ని మార్చడానికి ఒప్పుకోలేదు. ‘‘సేనాధిపతి.. పొంతన లేకుండా మాట్లాడుతున్నావు. గుర్రానికి వయసు మాత్రమే పైబడి వుంటే ఇలా ఆలోచించేవాణ్ణి కాదు. గుడ్డిది అయింది, పైగా సమరానికైనా సంబరానికైనా పనికి రాకుండా పోయింది, తల్లిదండ్రులతో పోలిక ఏమిటి?’’ రాజుగారి కంఠంలో కాస్త కటువుదనం కనిపించింది, ‘‘వయసు మీద పడినప్పుడే మహారాజా.. చూపు కూడా మందగిస్తుంది. కన్నవారు మన బాధ్యతను మోస్తున్నట్టే గుర్రం కూడా మీ బరువును మోస్తూ మీరు అనుకున్న గమ్యానికి చేరుస్తోంది. ఇందులో తారతమ్యం ఏమున్నది మహారాజా..’’ తమాయించుకుంటూ అన్నాడు సేనాధిపతి. ‘‘మీరు ఎన్నైనా చెప్పండి ఈ గుడ్డి గుర్రంపై నేను స్వారీ చేయలేను. వెంటనే గుర్రం మార్చండి’’ ఈసారి హెచ్చరిక జారీ చేసినట్టుగా అన్నాడు మహారాజు. ‘‘చిత్తం ప్రభు.. కాకపోతే చిన్న మనవి’’ అన్నాడు సేనాధిపతి. ‘‘చెప్పండి’’ అన్నాడు మహారాజు. ‘‘ఇప్పుడు మనం వెళుతున్న వేటకు ప్రస్తుతం ఈ గుర్రాన్నే ఉపయోగించండి. తరువాత వెళ్ళే వేటకు మరో గుర్రం సిద్ధం చేస్తాను’’ అన్నాడు సేనాధిపతి. ‘‘అటులనే కానివ్వండి’’ అంటూ మందిరంలోకి వెళ్ళాడు రుషికేశవ మహారాజు. రాజుకు వేటాడడం అంటే చాలా ఇష్టం, వేటకు వెళ్లిన ప్రతిసారి ఇలా వెనుకబడిపోవటం తనకు నచ్చలేదు, పరివారం చక్కగా వేటాడి విజయం సాధిస్తున్నారు, ఆ ఆనందం తనకు దక్కక పోవడానికి కారణం గుడ్డి గుర్రం. సేనాధిపతి మాత్రం గుర్రం విషయంలో వాయిదాలు వేస్తూ వెళుతున్నాడు. రాజు గుడ్డి గుర్రాన్నే స్వారీ చేయాలనే సేనాధిపతి యొక్క కోరిక వెనుక ఆంతర్యం ఏమిటో రాజుకు అర్థం కాలేదు. తన మాట ప్రకారమే ముందుకు వెళుతున్నాడు. పైగా రాజుకు వేట అంటే చాలా ఇష్టం ఒక మాసంలోనే రెండు సార్లు వేటకు వెళ్ళాల్సిందే.. ఒక రోజు తన పరివారంతో అడవికి వేట కోసం వెళ్ళాడు రాజు, పరివారమంతా ముందు వెళుతుంటే రాజు గుర్రం బాగా వెనుకబడింది, ముందుగా వెళ్లిన సేనాధిపతి రాజు రాకకోసం చెట్టు కింద కూర్చుని వున్నాడు. కాసేపటి తరువాత రాజు రానే వచ్చాడు. సత్తువ లేని గుర్రం కాబట్టే బాగా వెనుక పడ్డాడని తనపై కోపంగా వున్న రాజును గమనించాడు సేనాధిపతి, ‘‘సేనాధిపతి.. నీ గుర్రాన్ని నాకు ఇవ్వు. నువ్వు ఎలాగూ స్వారీలో నేర్పరివికాబట్టి ఈ గుడ్డి గుర్రాన్ని దారికి తెచ్చుకోగలవు’’ అంటూ అడిగాడు రాజు. సేనాధిపతి గట్టిగా నవ్వి ‘‘మహారాజా.. ఈరోజు చీకటి పడేవరకు దీనిపైనే పయనించండి. మీకు నచ్చకపోతే నా గుర్రం మీకిచ్చి మీ గుడ్డి గుర్రాన్ని నేనే తీసుకుంటాను’’ అన్నాడు సేనాధిపతి, వేట మొదలు పెట్టారు.. పరివారం మొత్తం అరణ్యాన్ని చుట్టు్టముట్టారు. పగలంతా తలా ఓ దిక్కు వెళ్లి వేటాడుతున్నారు, మధ్యాహ్నం దాటిపోయింది, రాజుగారి దగ్గర ఒక్క మనిషి కూడా లేడు. చీకటి పడుతోంది పరివారమంతా సేనాధిపతి మాట ప్రకారం రాజ్యానికి చేరుకున్నారు. రాజు మాత్రం అడవిలోనే నిలిచిపోయాడు. అది దట్టమైన అడవి కావడంతో వచ్చిన దారి మరచిపోయాడు. పైగా గుర్రం గుడ్డిది. ఎంతటి రాజైనా ఈ పరిస్థితుల్లో భయపడక తప్పదు. చాలా దూరం వచ్చేసినట్టు వున్నాడు. తను వచ్చింది తూరుపు ముఖం నుంచి కానీ అక్కడకు వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోయింది. తన పరివారం కనిపిస్తారేమో అని దిక్కులు చూస్తున్నాడు రాజు. వాళ్ళ అలికిడి ఎక్కడా వినపడలేదు. గుర్రాన్ని దారి మళ్ళిస్తున్నాడు. అది మాట వినలేదు. వేరే మార్గం వైపు లాగుతోంది. కాలి గిట్టలు పదే పదే నేలకేసి కొడుతోంది. గుర్రాన్ని ఎంత అదిలిస్తున్నా అది దక్షిణం వైపు దారికే అడుగులు కదుపుతున్నది. ఆకాశంలో క్రమేపి చీకటి అలముకుంది, ఇక ప్రయోజనం లేదని గుర్రం లాగుతున్న వైపే పయనం సాగించాడు. అది మెల్లగా అడుగులు వేస్తూనే ఎట్టకేలకు రాజుని రాజ్యానికి చేర్చింది. ఆశ్చర్యబోయాడు రాజు. ‘‘మహారాజా.. గుర్రం మార్చుకుందామా’’ అడిగాడు రాజుకు ఎదురేగిన సేనాధిపతి. ‘‘అవసరం లేదు సేనాధిపతి.. నా గుర్రం గుడ్డిదైనా దానికి వున్న ఆత్మవిశ్వాసం గుడ్డిది కాదు. మనిషి ఆత్మవిశ్వాసంతో బాటు ఏకాగ్రత కోల్పోతాడు కాబట్టే దారి మరచిపోతాడు. ఏ జంతువుకైనా ఏకాగ్రత వుంది కాబట్టే వచ్చిన దారి మరచిపోదు, దీన్ని బట్టి మనిషి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంపై నమ్మకం పెంచుకోవాలి, నువ్వు గుర్రం గుడ్డిదైనా ఎందుకు మార్చలేదో అర్థమైంది’’ అంటూ రాజు సేనాధిపతిని మెచ్చుకున్నాడు. ∙ -
విశ్వాసి హృదయ సింహాసనం దేవునిదే!!
‘నన్ను వెంబడించాలనుకునేవాడు, తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి.. తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునే వాడు దాన్ని పోగొట్టుకొంటాడు, నా కోసం ప్రాణాన్ని పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు’ అంటూ యేసుప్రభువు శిష్యులకు తన కొత్తనిబంధన విశ్వాస మార్గాన్ని ఒకరోజు ఉపదేశించాడు. స్వార్థం, స్వాభిమానం, స్వనీతి, స్వలాభం, ’నేను’, ‘నా’ అనే ‘స్వీయత’నంతా వదిలేసుకోవడం విశ్వాసంలో ఒక ప్రధానమైన భాగమైతే, ఇవన్నీ పోగా మిగిలిన తన సిలువను విశ్వాసి తానే మోస్తూ ప్రభువును వెంబడించడం మరో ముఖ్యమైన భాగం!! విశ్వాసి ఇలా ప్రభువు కోసం పాటుపడుతూ తన ప్రాణాన్ని దక్కించుకోగలుగుతాడని, అలా కాకుండా తనను తానే నమ్ముకొని, తన సిలువను తాను మోయనివాడు లోక ప్రలోభాల్లో పడి తన ప్రాణాన్ని పోగొట్టుకొంటాడని ప్రభువు అన్నాడు. క్రీస్తును వెంబడించే క్రైస్తవ మార్గంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు న్నాయి, దేవుడిచ్చే శాంతిసమాధానాలున్నాయి. కాని లోకమిచ్చే ఆనందం, వినోదానికి అవి పూర్తిగా అతీతమైనవి. తనను యెరూషలేములో సిలువ వేయబోతున్నారంటూ మూడున్నరేళ్ల తర్వాత ప్రభువు ప్రకటించినపుడే తామెన్నుకు న్నది విలక్షణమార్గమని, పోగొట్టుకోవడమే ఈ మార్గ రహస్యమని శిష్యులకు బోధపడింది. ఇక ఇస్కరియోతు అనే శిష్యుడైతే, ఇదంతా విని యే సుతో విభేదించి, ముప్పై వెండినాణేల ప్రలోభానికి యూదులకు యేసును అమ్మేసి, తనది లాభసాటి బేరమనుకున్నాడు. కాని ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఉరేసుకొని ప్రాణాలు పోగొట్టుకొని యేసు మాటలు సత్యమైనవని రుజువు చేశాడు. ఆనాడు ఏదెను తోటలో ఆదాము, హవ్వలకు కూడా పోగొట్టుకోవడం, పొందడం అనే అనుభవాల నేపథ్యం అర్థం కాలేదు. దేవుడు వారిద్దరినీ సృష్టించడానికి మునుపే మంచి విషయాలతో లోకాన్ని నింపి సృష్టించి వారికిచ్చాడు. అయితే వారి హృదయాంతర్యంలోని సింహాసనాన్ని మాత్రం తనకే ప్రత్యేకించాలని ప్రభువు కోరుకుంటే, ఆదాము, హవ్వ లోకాన్నంతా తమ హృదయంలోకి చేర్చుకొని, ఆజ్ఞాతిక్రమం అనే పాపానికి పాల్పడి దేవుణ్ణి ఆ సింహాసనం నుండి దించి బయటికి పంపేశారు. అదీ అక్కడ జరిగిన నిజమైన విషాదం. అయితే ఆదాము, హవ్వ ఎక్కడ విఫలమయ్యారో అక్కడే, కొన్నేళ్ల తర్వాత వారి వారసుడు, విశ్వాసులకు జనకుడైన అబ్రాహాము దైవాజ్ఞ పాలనే శిరోధార్యమని భావించి గెలుపొందాడు. అబ్రాహాము జీవితమంతా దేవుని ఆజ్ఞల ప్రకారమే, అంటే అన్నీ పోగొట్టుకొంటూ సాగింది. నీ వాళ్ళందరినీ వదిలేసి నేను చూపే కొత్త ప్రాంతానికి వెళ్ళమంటే, తనకు ప్రాణప్రదమైనవన్నీ వదిలేసి ప్రభువే సర్వస్వమనుకొని ఆయన వెళ్ళాడు. చివరికి కడువృద్ధాప్యంలో కలిగిన ఏకైక కుమారుడైన ఇస్సాకును కూడా తనకు బలివ్వమని దేవుడు ఆదేశిస్తే, అందుకు కూడా అతను ఆనందంగా సిద్ధమయ్యాడు. విశ్వాస పరీక్షలో అబ్రాహాము నెగ్గినట్టు ప్రకటించాడు దేవుడు. ఇదీ ప్రభువానాడు బోధించిన విశ్వాస మార్గం. –రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ ఈమెయిల్:prabhukirant@gmail.com -
మున్సిపోల్స్‌లో కాంగి‘రేస్’
సాక్షి, జనగామ : పంచాయతీ నుంచి ప్రాదేశిక ఎన్నికల వరకు, శాసన సభనుంచి లోక్‌సభ ఎన్నికల వరకు జరిగిన వరుస ఎన్నికల్లో ఓటములతో డీలా పడిన కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. బలమైన క్యాడర్‌ను కలిగిన ఆ పార్టీ ప్రస్తుతం మునిసిపాలిటీ ఎన్నికలే టార్గెట్‌గా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతుంది. కాంగ్రెస్ కంచుకోటగా రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన జనగామలో ఆ పార్టీ పట్టు నిలుపుకోవడం కోసం తహతహలాడుతోంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేసి నూతనోత్తేజం నింపడానికి సిద్ధమైంది. ఒకవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సభ్వత్వ నమోదుతో కార్యకర్తలను సమీకరిస్తుండగా కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తోంది. ఈసారైనా కలిసొచ్చేనా? కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు రాజకీయంగా జన్మనిచ్చిన జనగామ ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. నాలుగు దశాబ్దాల పాటు పొన్నాల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘనమైన చరిత్రను సొంతం చేసుకుంది. ముఖ్యంగా జనగామ మునిసిపాలిటీ చరిత్రలో ఆ పార్టీ తిరుగులేని ఆధిక్యతను కనబరిచింది. 1953 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు మినహాయిస్తే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ చైర్మన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. తొలిసారిగా 1987లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోగా రెండోసారి 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ చైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకుంది. మిగిలిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 28 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో విజయం సాధించింది. మరో ఇద్దరు అభ్యర్థులు 1, 2 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ ఇద్దరు అభ్యర్థులు విజయం సాధిస్తే ఏకపక్షంగానే చైర్మన్ స్థానం దక్కి ఉండేది. కానీ అనూహ్యంగా కేవలం ఆరు స్థానాల్లోనే విజయం సాధించిన టీఆర్ఎస్ చైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకుంది. మెజారిటీ కౌన్సిలర్లను గెలుచుకున్నప్పటికీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోక పోవడంలో పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించలేదనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మొదటి నుంచే పక్కా ప్రణాళికను అమలు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. రిజర్వేషన్లలో బీసీ కోటాకు ప్రభుత్వం కోత విధిస్తున్నప్పటికీ పార్టీపరంగా బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీసీ, దళిత, మైనార్టీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ‘పొన్నాల’ మకాం మునిసిపాలిటీ ఎన్నికలు అయ్యే వరకు పొన్నాల లక్ష్మయ్య జిల్లా కేంద్రంలోనే మకాం వేయనున్నారు. ప్రతి వార్డులో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టనున్నారు. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే స్థానిక సమస్యలను ప్రచార అస్త్రాలుగా ఎక్కు పెట్టడానికి రెడీ అవుతున్నారు. వార్డుల వారీగా ఆశావహుల జాబితాను తయారు చేయడం, పార్టీ క్యాడర్‌కు దిశానిర్ధేశం చేయడం, పట్టణ ప్రజలతో మమేకం కావడం వంటి కార్యక్రమాలను చేపట్టడానికి సిద్ధమయ్యారు. మూడు రోజుల పాటు జెండా పండుగలు శనివారం పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో మునిసిపాలిటీ పరిధిలో విస్తృతంగా జెండా పండుగను జరుపనున్నారు. రోజుకు 10 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నారు. పొన్నాలతోపాటు టీపీసీసీ మునిసిపాలిటీ ఎన్నికల పరిశీలకుడు మక్సూద్ అహ్మద్‌తోపాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, ముఖ్యనేతలను ఆయా వార్డుల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘హిందూపురం’లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేద్దాం
హిందూపురం: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలందరూ సైనికులుగా పని చేసి హిందూపురంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేద్దామని వైఎస్సార్సీపీ నాయకులు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, చౌళూరు రామకృష్ణారెడ్డిలు పిలుపునిచ్చారు. స్థానిక ఐఎంఏ హాల్లో బుధవారం వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయం తక్కువగా ఉంది.. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పని చేయాలన్నారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని నాయకులు అన్నారు. టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని వారు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైన గెలుపొందాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారు. బూత్ కన్వీనర్లు ఓటరు జాబితాలను క్షుణంగా పరిశీలించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నవరత్నాల గురించి ఇంటింటికి ప్రచారం చేయాలి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. నవరత్నాలతోనే పేదల భవిష్యత్తు మారుతుందని, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. మహమ్మద్ ఇక్బాల్‌కు స్వాగత ఏర్పాట్లు నేడు వైఎస్సార్సీపీ నేత, రిటైర్డు ఐజీ మహమ్మద్ ఇక్బాల్ హిందుపూరానికి రానున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ నాయకులు కొడికొండ చెక్‌పోస్టు వద్ద మహమ్మద్ ఇక్బాల్‌కు ఘనంగా స్వాగతం పలకనున్నారు. పెద్దఎత్తున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలిరావాలన్నారు. చెక్‌పోస్టు నుంచి ప్రత్యేక వాహనంలో ర్యాలీగా చిలమత్తూరు, లేపాక్షి మండలాల మీదుగా హిందూపురం చేరుకుంటారు. సమావేశంలో మండల కన్వీనర్లు నారాయణస్వామి, శ్రీరాంరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, హిందూపురం పార్లమెంట్ యువజన విభాగ అధ్యక్షుడు ఉపేంద్రరెడ్డి, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, రెహెమాన్ నాయకులు జగన్మోహన్రెడ్డి, రాజారెడ్డి, బసిరెడ్డి, బలరామిరెడ్డి, గోపికృష్ణ,అంజన్‌రెడ్డి, నరిసింహరెడ్డి, పురుషోత్తంరెడ్డి, జనార్థన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిన్ను నువ్వు నమ్ముకో!
సావిత్రీబాయి టెండూల్కర్, రఘునాథ్ టెండూల్కర్ల కుమారుడు బాబూ టెండూల్కర్. బాబు వైద్య విద్య రెండవ సంవత్సరం చదువుతుండగా జ్యోతిషులు అతని జాతక చక్రాన్ని చూశారు. ఆ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా లేవని, ఎంత చదివినా ప్రయోజనం ఉండదని జ్యోతిషులు పెదవి విరిచారు. మరుసటి ఏడాది కష్టపడి చదవనవసరం లేకుండానే పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడని కూడా చెప్పారు. బాబు దిగాలు పడ్డాడు. అప్పట్నుంచి చదవడం మానేసి నిర్లిప్తంగా గడపడం మొదలు పెట్టాడు. కుమారుని వాలకం చూసి సావిత్రీబాయి కలత చెందింది. ఆమె తల్లి మనసు తల్లడిల్లింది. రఘునాథ్ కూడా కొడుకుని చూసి బెంగపెట్టుకున్నాడు. సావిత్రీబాయి ఎన్నో విధాల బాబుకు నచ్చజెప్పచూసి విఫలమైంది. కష్టంలోనూ. సుఖంలోనూ తమ వెన్నంటి ఉండే బాబా వద్దకు వెళ్లింది. కొడుకు పరిస్థితి బాబాకు చెప్పుకుని కంటతడి పెట్టుకుంది. బాబా హృదయం ద్రవించింది. ‘జాతకాలు, జన్మకుండలి పట్టించుకోవద్దు. సాముద్రికాన్ని చూడవద్దు. నాపై విశ్వాసం ఉంచి బుద్ధిగా చదువుకోమను. ఈ సంవత్సరమే అతను పరీక్ష ఉత్తీర్ణుడవుతాడు’ అని బాబా అభయం ఇచ్చారు. సావిత్రీబాయి ఇంటికి తిరిగి వెళ్లి బాబా చెప్పిన మాటలు బాబుకి చెప్పింది. బాబా ఇచ్చిన అభయంతో బాబు ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్నాడు. శ్రద్ధగా చదివాడు. పరీక్షలు బాగా రాశాడు. ఉత్తీర్ణత కూడా సాధించాడు. బాబాపై ఉంచిన విశ్వాసమే బాబును గట్టున పడేసింది. బాబాపై మన విశ్వాసం చెదిరిపోనిదే అయితే మనం సాధించలేనిది ఏమీ లేదు. ‘‘నిన్ను నువ్వు నమ్ముకో. నీలోని భగవంతుడిని నమ్ముకో’’ అనేది బాబా ఉపదేశం. భగవంతుడి కృపను పొందడానికి, సాయిపథంలో నడవడానికి విశ్వాసమే తొలిమెట్టు. గురువులు, ఇష్టదైవాల గురించి చదివి వదిలేయడం కాదు, వారు చెప్పిన దానిని ఆచరించాలి. అదే మనం వారిపై చూపే నిజమైన నమ్మకం. – డా.కుమార్ అన్నవరపు -
బయటికి వచ్చేశారు
ఎక్కడ ఇబ్బంది కలిగినా, భయం అనిపించినా, ఇంటికి రాగానే అన్నీ మరచిపోతాం. ఇల్లు ఒక భరోసా, ఇల్లు ఒక నమ్మకం, ఇల్లు ఒక విశ్వాసం. మరి ఆ ఇంట్లోనే నరకం కనిపిస్తే ఏం చేయాలి? వలెరి, రచెల్, నాన్సీ, విక్టోరియా... ఇల్లు చూస్తే భయపడుతున్న అమ్మాయిలు వీరు. ఇంగ్లండ్, వేల్స్ ప్రాంతాలలో కనీసం 11 లక్షలమంది మహిళలు నిత్యం గృహ హింసకు గురవుతున్నారని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, సంతానం.. ఎవరో ఒకరి కారణంగా వీరు శారీరకంగా, మానసికంగా ఇంట్లో రక్షణ లేకుండా ఉన్నారని సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి. ఈ నలుగురి అనుభవాలను వింటే.. స్త్రీ జీవితం ఎక్కడైనా ఒకేలా ఉందనిపిస్తుంది! వలెరి ఉదయం ఐదు గంటలకే లేచి, ఆయన లేవకముందే పనులన్నీ పూర్తి చేసుకుంటాను. ఆయన కోసం ఇంటిని శుభ్రంగా ఉంచడం కోసం చాలా టైమ్ కేటాయిస్తాను. నాకు రెండుసార్లు వివాహం అయ్యింది. రెండు వివాహాలలోను.. నన్ను నియంత్రించడం, నిరంతరం అసభ్యంగా మాట్లాడుతూ హింసించడం అనుభవం అయ్యాయి. నా మొదటి భర్త చొక్కాకి పొరపాటున మరక ఉండిపోయిందని, నా భర్త నాకు వాతలు పెట్టాడు. నా రెండో భర్త ఉద్యోగానికి బయటకు వెళుతూ, నన్ను మెట్ల మీద నుంచి తోసేశాడు, నేను స్పృహ తప్పి పడిపోయాను. ఇటువంటివి ఎన్నని లెక్కించగలను? నా పిల్లలను దృష్టిలో ఉంచుకుని చాలాకాలం అన్నీ అనుభవించాను. చివరికి నేను ఎందుకూ పనికిరాననే భావన నాలో ఏర్పడింది. ప్రపంచం ఎందుకు ఇలా నడుస్తుందో అర్థం కాదు, సాటి మనిషిని హింసించే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు? కాలం ఎంత మారుతున్నా వారి ఆలోచనలో మాత్రం మార్పు రావడం లేదు. నేనే బయటికి వచ్చేశాను. రచేల్ నా చుట్టూ ఉన్న సంప్రదాయ యూదు కుటుంబాల వారు.. నా భర్త నన్ను హింసించడం కళ్లారా చూశారు. ఒక్కరూ నా వైపు న్యాయం మాట్లాడలేదు. నా గురించి, నా పిల్లలకు సంబంధించిన కుశలప్రశ్నలు అడగలేదు. ఆయన గదిలోనే కనీసం నేల మీద పడుకోవాలన్నా భయమే. నేను వద్దు అనడానికి వీలు లేదు. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆయన బెడ్రూమ్లోకి వెళ్లవలసిందే. ఆయన ఎన్ని విధాలుగా హింసించినా, నేను శుభ్రంగా ముఖం కడుక్కుని, శుభ్రంగా రెడీ అయ్యి, ఏమీ జరగనట్టుగా ప్రవర్తించవలసిందే. ఇలాగే రోజులన్నీ గడిచాయి. కబోర్డ్‌లో డబ్బాల మీద లేబుల్స్ దగ్గర నుంచి అన్నీ ఆయన చెప్పినట్టుగా ఉండాలి. ఆయన కనుసన్నల్లోనే జరగాలి. పదిహేడు సంవత్సరాల తరువాత నేను ఏం కోల్పోయానో తెలుసుకున్నాను. ఇంతకాలం నా గొంతు నేను నొక్కుకున్నానని అర్థం చేసుకున్నాను. నా మీద నాకే అసహ్యం వేసింది. అప్పుడే నాలో శక్తి బయలుదేరింది. నేను ఇంక బాధితురాలిగా ఉండకూడదని నిశ్చయించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. నాన్సీ మొదట్లో నేను చాలా సంబరపడ్డాను. అతను ప్రతిరోజు నాకోసమే వస్తున్నాడని, నన్ను కలుస్తున్నాడని నా తరువాతే తనకి అందరూ అని భావించాను. నేను వేరేవారితో ఉంటే, వెంటనే నాకు మెసేజ్ పెట్టేవాడు. నా మీద తనకి ప్రేమ చాలా ఎక్కువ అనుకున్నాను. అయితే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పినప్పుడు అతనిలో ఎటువంటి భావమూ లేదు. అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. అంతకుముందు ఎన్నడూ నన్ను ఎవ్వరూ కొట్టలేదు. అంతకుముందు ఎన్నడూ లేనంత భయంకరంగా నన్ను హింసించాడు. గట్టిగా తన్నాడు, చెంప మీద కొట్టాడు, చేతులతో బయటకు తోసేశాడు, తల పగలగొట్టాడు. చివరగా నా గొంతు పట్టుకున్నాడు. నేను భయంతో వీధులలోకి పరుగులు తీసి, పబ్లిక్ టాయిలెట్లో దాక్కున్నాను. నన్ను వెంటాడుతూ వెనకే వచ్చాడు. ఆ టాయిలెట్‌కి రెండు దారులు ఉన్నాయనే విషయం నాకు తెలియదు. హమ్మయ్య నేను తప్పించుకున్నాను అనుకునేంతలోనే అతడు నా మీదకు రాబోయాడు. ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులను పిలిచాను. ఇటువంటి విషయాలను మరచిపోవాలన్నా సాధ్యపడదు. కానీ ఎలా తప్పించుకోవాలో మాత్రం తెలుసుకున్నాను. ఆ తరువాత నేను మగవారితో ఒంటరిగా ఉండటం మానేశాను. అందరూ ఒకేలా ఉండరని తెలిసినా కూడా నాలో ఆ భయం పోలేదు. విక్టోరియా నేను ఇద్దరు మగవారి కారణంగా గృహహింసను అనుభవించాను. నాతో సన్నిహితంగా ఉంటూనే నన్ను హింసించారు వారు. ఆ తరువాత నేను వారి నుంచి దూరంగా వచ్చేశాను. నా మాజీ భర్త మా ఇంటి తలుపులన్నీ మూసేసి, ఆ తరువాత నన్ను, నా కొడుకుని హింసించేవాడు. వాడిని కొట్టకుండా అడ్డుపడేదాన్ని. నా భర్త నా తల మీద సుత్తితో బలంగా కొట్టాడు. 11 సంవత్సరాల నా బిడ్డ నా మాజీ భర్తను ఇంట్లో నుంచి పొమ్మని బయటికి తోసేశాడు. అలా ఆ రోజు నా కొడుకే నన్ను రక్షించాడు. నేను ఆసుపత్రి నుంచి వచ్చాక, నన్ను నేను చంపుకోవాలనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే నా కొడుకు దగ్గర నుంచి నాకు ‘‘అమ్మా! ప్లీజ్, ఇంటికిరా, నాకు నువ్వు కావాలి’’ అని ఒక మెసేజ్ వచ్చింది. నా ప్రయత్నం విరమించుకున్నాను. ఈ రోజుకీ నాకు పీడకలలు వస్తున్నాయి. నిద్రపోతే ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భయం నన్ను విడిచిపెట్టట్లేదు. అందుకే కళ్లు మూసుకోలేకపోతున్నాను. – రోహిణి -
కాన్ఫిడెన్స్ క్వీన్
కె ఫర్ కంగనా. కాదు కాదు కె ఫర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు బాలీవుడ్ జనాలు. కారణం కంగనా రనౌత్ కాన్ఫిడెన్సే. మేటర్ ఏంటంటే.. ఇటీవల కాన్స్ ఫెస్టివల్స్‌లో రెడ్ కార్పెట్‌పై ఫస్ట్ టైమ్ నడిచారు క్వీన్ కంగనా రనౌత్. కానీ కాన్స్ రెడ్ కార్పెట్ మీద కచ్చితంగా నడుస్తాను అని 22 ఏళ్ల వయసులోనే ఊహించారట ఆమె. ఈ విషయం గురించి కంగనా మాట్లాడుతూ – ‘‘22 ఏళ్ల వయసులో సొంతంగా డబ్బు సంపాదిస్తున్న టైమ్‌లో ఫ్రాన్స్ విజిట్ చేయాలనిపించింది. అక్కడ 10 డేస్ స్పెండ్ చేశాను. పెర్ఫ్యూమ్ తయారు చేసే ఫ్యాక్టరీల చుట్టూ తిరిగాను. ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాను. ఆ తర్వాత రెడ్ కార్పెట్ చూడాలనిపించింది. ఆ ప్లేస్‌కు ఒక టూరిస్ట్‌గా వెళ్లాను. ఆ టైమ్‌లో ఎందుకో అనిపించింది ‘రెడ్ కార్పెట్ చూడవసరంలేదు, ఎలాగూ ఏదో రోజు ఆ కార్పెట్ మీద మనం నడుస్తాను’ అని. అలా అనుకున్న వెంటనే వెనక్కి వచ్చేశా’’ అని పేర్కొన్నారు కంగనా. ఇది జరిగిన జస్ట్ 9 ఏళ్లలోనే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై నడిచారీ క్వీన్. ఏదైనా విషయాన్ని కాన్ఫిడెంట్‌గా బిలీవ్ చేస్తే చాలు అయిపోతుంది అనడానికి ఇదో ఉదాహరణ. -
వజ్రంలాంటి విశ్వాసం
అంధుడి మాటలు రాజుగారిలో కొత్త ఆశను రేకెత్తించడంతో అందుకు సరేనన్నారు. ఆ అంధుడు ఆ వజ్రాలను తడిమి చూసి, ఫలానా వజ్రం అసలైనది, ఫలానా వజ్రం నకిలీదని వెంటనే తేల్చి చెప్పాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా రాజుగారు ఎంతో ఉత్సాహంగా సభా వ్యవహారాలను ప్రారంభించారు. అంతలో ఒక వ్యక్తి రాజదర్బారులో ప్రత్యక్షమయ్యాడు. ‘‘నా దగ్గర అమూల్యమైన రెండు వజ్రాలున్నాయి అందులో ఏది అసలైనదో, ఏది నకిలీదో తెలుసుకునేందుకు నేను తిరగని సంస్థానమంటూ లేదు, చేరని రాజ్యమంటూ లేదు. మీరేమైనా పసిగట్టగలరా’’ అని ప్రశ్నించాడు. రాజుగారు ఆ రెండు వజ్రాలను చేతిలోకి తీసుకొని ‘‘ఈ రెండూ ఒకేలా ఉన్నాయిగా’’ అన్నారు ఆశ్చర్యంగా. దానికి ఆ వ్యక్తి ‘‘ఇందులో ఒకటి వెలకట్టలేని వజ్రం. రెండోది గాజుది. మీ కొలువులో ఉన్న వారిలో ఎవరైనా, ఇందులో అసలు వజ్రాన్ని పసిగడితే ఆ వజ్రాన్ని నేను కానుకగా అందిస్తాను. కనుక్కోలేకపోతే ఆ వజ్రానికి తగ్గ మూల్యం చెల్లించాలి’’ అని సవాల్ విసరాడు. రాజుగారు, మంత్రులు, ఇతర అధికారులు ఆ వజ్రాన్ని చేతిలో తీసుకుని ఎంత పరిశీలించినా వారికి అర్థం గాక తీవ్ర నిరాశ చెందారు. ఈ విషయం ఆ రాజ్యంలోని ఒక పుట్టుగుడ్డి చెవిలోనూ పడింది. తెలిసిన వారి సహాయంతో రాజదర్బారుకు చేరుకున్న ఆ అంధుడు రాజుగారితో ‘‘అయ్యా! నేను అసలు వజ్రాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తాను. నాకో అవకాశం కల్పించండి’’ అని వేడుకున్నాడు. అంధుడి మాటలు రాజుగారిలో కొత్త ఆశను రేకెత్తించడంతో అందుకు సరేనన్నారు. ఆ అంధుడు ఆ వజ్రాలను తడిమి చూసి, ఫలానా వజ్రం అసలైనది, ఫలానా వజ్రం నకిలీదని వెంటనే తేల్చి చెప్పాడు. వజ్రాన్ని తెచ్చిన వ్యక్తి ఖంగుతిన్నాడు. షరతు ప్రకారం వజ్రం రాజుగారి సొంతమయ్యింది. కళ్లు లేకపోయినా అసలు వజ్రాన్ని కనిపెట్టిన అంధుడిని అభినందించారు అందరూ. ఎలా కనిపెట్టగలిగావంటూ అంధుడిపై ప్రశ్నల వర్షం కురిపించసాగారు. ‘ఈ రెండు వజ్రాల్లో ఒకటి వేడిగా ఉంది. ఒకటి చల్లగా ఉంది. ఎండకి వేడెక్కిన వజ్రం నకిలీదని పసిగట్టాను’ అని చెప్పాడు ఆ అంధుడు. అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అసలైన విశ్వాసులు నకిలీ వజ్రంలా వేడెక్కరు. అసలు వజ్రంలా ప్రశాంతంగా ఉంటారు. -
దృఢమైన మనసు
ఓ భగవంతుడా! కష్టాలకు భయపడి పారిపోకుండా వాటిని ఎదుర్కొనగలిగే ధైర్యాన్ని నాకు ప్రసాదించు. ఆపదలు వచ్చినప్పుడు నన్ను రక్షించమని నేను ప్రార్థించడం లేదు. కానీ వాటిని ఎదుర్కొనటానికి కావలసిన శక్తిని ప్రసాదించమని మాత్రం నిన్ను వేడుకుంటున్నాను. కష్టాలలో నేను కొట్టుకుపోతున్నప్పుడు నాకు సాంత్వన చేకూర్చమని నేను నిన్ను వేడుకోవడం లేదు. నా కష్టాలనే కుసుమాలుగా మార్చి, వాటిని నీ పాదాల చెంత ఉంచి, కష్టం వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని తగిన విజయం సాధించగలిగే శక్తిని నాకు ప్రసాదించు అని వేడుకొంటున్నాను. ఈ విధంగా ఎవరైనా ప్రార్థిస్తారా అసలు? అలాంటి వారు ఉంటారా? ఉంటే భగవంతుడు వారి కోరికను తీరుస్తాడా? ఇదంతా ఏదో వ్యక్తిత్వ వికాస పాఠంలా కనిపిస్తోంది కానీ, ప్రార్థనలా ఉందా? ఉన్నట్టే ఉంది. ఎందుకంటే, కొన్ని వేల ఏళ్ల కిందటే ‘‘నేను నిన్ను మరచిపోకుండా ఉండాలంటే, నాకు కావలసింది సుఖాలు, సంపదలు కాదు, కష్టాలు, కడగండ్లే. కాబట్టి ఓ కృష్ణా! నీవు నాకు అనుక్షణం గుర్తుకు వచ్చేలా నాకు ఎప్పుడూ ఏదో ఒక కష్టాన్ని ఇస్తూ ఉండు’’ అని కుంతీదేవి తన మేనల్లుడైన శ్రీ కృష్ణుని ప్రార్థించిందట. నిజంగా ఎంత గొప్ప ప్రార్థనో కదా! ప్రార్థన అనేకంటే, ఎంత దృఢమైన మనసో కదా! అనుకోవాలి. ఎందుకంటే, భగవంతుడి మీద మనకు ఉన్న విశ్వాసం ఆయన్ని ‘అవి కావాలి, ఇవి కావాలి’ అని కోరుకునే యాచనగా కాదు, శక్తిగా మారాలి. మనస్సు బలహీనతకు గురి కాకుండా ఉండేంత శక్తిమంతంగా ఉండాలి. – డి.వి.ఆర్. -
అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
-
ఆచరణలో కనిపించేదే ఆసలు విశ్వాసం!!
‘కనిపించడు కాని మా వాడు భలే భక్తిపరుడు తెలుసా?’ లాంటి వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. పైకి పొంగిపోతున్నట్టుండే భక్తితో సమస్యలేమో కాని, నిజమైన భక్తి విశ్వాసికి జీవితంలో కనిపించి తీరాలి. బబులోను చెరలో మగ్గుతున్నా తమ దేవుణ్ణి, దేవుని విధి విధానాలను మర్చిపోలేని భక్తి యూదులది, ముఖ్యంగా దానియేలు, అతని ముగ్గురు స్నేహితులది. వారి అచంచలమైన భక్తిశ్రద్ధలు చూసి అసూయపడ్డ శత్రువులు ఎలాగైనా వారిని నాశనం చేయడానికి కుట్రపన్నారు. యూదులు పరలోకమందున్న దేవునికి తప్ప మరొకరికి సాగిలపడరు. అందువల్ల బబులోను సామ్రాజ్యంలోని ప్రజలు, ప్రముఖులెవరూ ముప్ఫైరోజులపాటు చక్రవర్తి దర్యావేషుకు తప్ప మరే వ్యక్తికైనా సాగిలపడరాదని, విన్నపాలు సమర్చించరాదని ఒక శాససం చేశాడు. ఎంతో తెలివైనవాడిగా ప్రసిద్ధి పొందిన దానియేలును అప్పటికే చక్రవర్తి తన సంస్థానంలో అత్యున్నత స్థానంలో నియమించాడు. అదీ వారి అసూయకు ప్రధాన కారణం. ఇలాంటి శాసనం గురించి తెలిసి కూడా దానియేలు రోజుకు మూడుసార్లు యథాప్రకారం దేవుని ప్రార్థించాడు. శాసనోల్లంఘనకుగాను రాజుగారికిష్టం లేకున్నా శిక్షగా దానియేలును సింహాలున్న గుహలో పడదోశారు. కాని దానియేలును దేవుడు సింహాల గుహలో కూడా క్షేమంగా కాపాడుతాడని నమ్మకమున్న చక్రవర్తి మరునాడే అక్కడికెళ్లి ‘నిత్యమూ నీవు సేవిస్తున్న జీవము కలిగిన నీ దేవుడు నిన్ను రక్షించాడా?’ అని అడిగితే, ‘అవును రాజా: నన్ను రక్షించాడని దానియేలు జవాబిచ్చాడు. చక్రవర్తి వెంటనే అతన్ని బయటకి రప్పించి, అతని మీద కుట్ర చేసిన వారందరినీ సింహాల గుహలో వేశాడు. మేము రహస్య విశ్వాలసుమంటారు కొందరు. ‘రహస్యభక్తి’ అనేది క్రైస్తవమే కాదు. క్రైస్తవ సుగుణమైన సాహసం, క్షమాపణ, ప్రేమ, పేదలు నిరాశ్రయుల పక్షంగా పోరాడేందుకు తెగింపు సమాజానికి వారి జీవితాల్లో కొట్టవచ్చినట్లు కనిపించాలి. ఉద్యమాలు, విప్లవాలు క్రైస్తవ విధానం కాదు. కాని దేవుని పక్షంగా నిరుపేదలు, నిర్భాగ్యుల కోసం నిలబడేందుకు విప్లవాలు తేవాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రతి క్రైస్తవుడూ తన వ్యక్తిగత కుటుంబ బాధ్యతగా చేపట్టాలి. అలాంటి నిస్వార్థసేవే క్రైస్తవాన్ని ఒక విశిష్టమైన జీవన విధానంగా తీర్చిదిద్దింది. నిస్వార్థమైన త్యాగపూరితమైన సేవ క్రైస్తవానికి పర్యాయపదంగా నిలబెట్టింది. -
మూఢనమ్మకమా? గాఢవిశ్వాసమా?
సెల్ఫ్‌చెక్ సృృష్టి రహస్యాన్ని ఛేదించటానికి అనేక సంవత్సరాల శాస్త్రవేత్తల కృషికి ప్రయోగరూపం బిగ్‌బ్యాంగ్. ఒకవైపు మానవుని ఆయుష్షు పెంచటానికి రకరకాల ప్రయోగాలు, పరిశోధనలు, గ్రహాలపై నివాసానికి ప్రయత్నాలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు, విజయాలు చోటు చేసుకుంటుంటే ఇంకోవైపు మూఢ నమ్మకాలతో జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసుకొనే వారు ఎందరో ఉన్నారు. వీరు అపోహలతో, అనుమానాలతో విలువైన కాలాన్ని వృథా చేసుకుంటుంటారు. మీలో కూడ మూఢ నమ్మకాలకు స్థానం ఉందా? ఇది తెలుసుకోవాలంటే ఈ సెల్ఫ్చెక్ని టిక్ చేయండి. 1. మీ నమ్మకాలను మూఢనమ్మకాలుగా పిలవటం మీకిష్టం లేదు. ఎ. అవును బి. కాదు 2. ప్రయాణ సమయాల్లో పిల్లి, కుక్క లాంటి జంతువులో మరేదో ఎదురొస్తే మీ ప్రయాణాన్ని కాసేపు వాయిదా వేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. మీ ఆచారాలవల్ల అమూల్యమైన సమయం వృథా అవుతోందన్న సత్యాన్ని గ్రహించలేరు. ఎ. అవును బి. కాదు 4. అదృష్టం, దురదృష్టాలను బలంగా నమ్ముతారు. ఎ. అవును బి. కాదు 5. అమావాస్య రోజుల్లో ప్రయాణాలను వాయిదా వేయటానికి గట్టిగా ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 6. ‘పెళ్లికి ముందే జీవితభాగస్వామిని చూడటం, మాట్లాడటం చాలా తప్పు.’ ఈ భావనతో మీరు ఏకీభవిస్తారు. ఎ. అవును బి. కాదు 7. నక్కలు, కుక్కలు అరిస్తే అరిష్టాలు జరుగుతాయని నమ్ముతారు. ఎ. అవును బి. కాదు 8. మంచి జరుగుతుందన్న నమ్మకంతో బలులను సమర్థిస్తారు. ఎ. అవును బి. కాదు 9. చేతబడి, బాణామతి లాంటి ఆచారాల వల్ల అనుకున్నది సాధించగలమని వాదిస్తారు. ఎ. అవును బి. కాదు 10. హేతువాదులంటే మీకు గిట్టదు. మీ ఆచారాలకు ఎవరైనా అడ్డువస్తే అసలు సహించలేరు. ఎ. అవును బి. కాదు మీరు టిక్ పెట్టిన సమాధానాలలో ‘ఎ’లు 7 దాటితే మీలో మూఢనమ్మకాలకు స్థానం ఉందని అర్థం. లేనిపోని భయాలు, అపోహలకు పెద్దపీట వేస్తూ వాస్తవాలను గ్రహించలేరు. ఇందులో చదువుకున్న వారూ ఉండొచ్చు. ఇలాంటి ఆచారాల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. కొన్నిసార్లు ప్రాణాలే పోవచ్చు. కాబట్టి ఇటువంటి నమ్మకాలను వెంటనే వదిలివేయాలి. వీలైనంత ఎక్కువగా శాస్త్రీయదృక్పథాన్ని పెంచుకోవాలి. ‘బి’ లు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీరు మూఢాచారాలకు దూరంగా ఉంటారు. నిర్థారణలేని విషయాలను పక్కకు తోస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు.