
అప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు!
జీవితంలో దేన్నీ అంత సులువుగా వదులుకోకూడదని చాలామంది బలంగా ఫిక్స్ అవుతారు. నయనతార ఈ కోవకే వస్తారు. మరీ సాధ్యం కానివి వదులుకుంటారు తప్ప చాలావరకూ అన్నింటినీ సాధించేస్తారు. అది సినిమాలైనా.. వ్యక్తిగత విషయాలైనా. నయనతారకు తన మీద తనకు నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకం, హార్డ్‌వర్కే నన్ను నడిపిస్తున్నాయని ఆమె అంటున్నారు.
ఇంకా ఆత్మవిశ్వాసం గురించి నయనతార మాట్లాడుతూ - ‘‘బతికినంత కాలం ధైర్యంగా, హాయిగా బతకాలంటే ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. మనం ఏ విధంగా ఉన్నామనే దాన్నిబట్టే ఎదుటి వ్యక్తులు మన గురించి ఓ అంచనాకు వచ్చేస్తారు. ఆత్మన్యూనతా భావంతో కనిపిస్తే.. ఎదుటి వ్యక్తులు మనల్ని ఇంకా తగ్గించడానికి ట్రై చేసే అవకాశం ఉంది. ఆ చాన్స్ వాళ్లకు ఇవ్వకూడదంటే మనం ఆత్మవిశ్వాసంతో కనిపించాలి.
ఎవరికీ తక్కువ కాదన్నట్లుగానే కనిపించాలి... ప్రవర్తించాలి. అలాగే అహంభావానికీ, ఆత్మవిశ్వాసానికీ తేడా తెలుసుకోవాలి. మన తీరు తిన్నగా ఉంటే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు’’ అన్నారు. నయనతార మాటలు చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి కదూ!