hard work
-
రూ.1,700తో అమెరికా వెళ్లి రూ.16,400 కోట్లు సంపాదన
దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలమని ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్ సర్దానా నిరూపించారు. ఢిల్లీలో ప్రభుత్వం నిర్మించిన ఒక చిన్న ఇంట్లో ఉంటూ జీవనం సాగించిన సర్దానా వ్యాపారంలో ఎదిగి యునైటెడ్ స్టేట్స్లో బిలియనీర్‌గా స్థిరపడ్డారు. జేబులో కేవలం 100 డాలర్ల(సర్దానా అమెరికా వెళ్లే సమయానికి విలువ రూ.1700)తో అమెరికాలో అడుగుపెట్టిన ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ఏకంగా రెండు బిలియన్ డాలర్ల(ప్రస్తుతం రూ.16,490 కోట్లు) నికర సంపదని సృష్టించారు. రాజ్ సర్దానా జీవిత ప్రయాణం ఎంతోమంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.ఢిల్లీలో జీవితం ప్రారంభం..1947 విభజన తర్వాత భారతదేశానికి వలస వచ్చిన పంజాబీ తల్లిదండ్రులకు 1960లో సర్దానా జన్మించారు. న్యూఢిల్లీలోని ప్రభుత్వ గృహంలో పెరిగారు. ఎలాంటి సదుపాయాలు లేని సాధారణ జీవితం సాగించారు. ‘నా తల్లిదండ్రులు నా ఎదుగుదలకు అలుపెరగని కృషి చేశారు. ఎన్నో విలువలు నేర్పించారు. నాకు, నా సోదరుడికి నాణ్యమైన విద్యను అందించడానికి చాలా కష్టపడ్డారు’ అని అథారిటీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్దానా గుర్తు చేసుకున్నారు.అమెరికాకు తరలివెళ్లి..సర్దానా 1981లో జార్జియా టెక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి యునైటెడ్ స్టేట్స్కు వెళ్లారు. అమెరికా వెళ్లే సమయానికి తన వద్ద కేవలం 100 డాలర్లు(ప్రస్తుతం దాని విలువ రూ.8,500) ఉన్నాయి. పొట్టకూటికోసం కాలేజీ క్యాంటీన్లో పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ సంపాదించగా వచ్చిన డబ్బుతోనే చదువు పూర్తిచేశాడు. గ్రాడ్యుయేషన్ తరువాత సర్దానా హెచ్-1 వీసా (నేటి హెచ్-1 బీ వీసా) పొంది హౌమెట్ ఏరోస్పేస్లో కెరియర్ ప్రారంభించారు.కెరియర్లో ఒడిదొడుకులు1987 నాటికి సర్దానా తోమహాక్ క్షిపణి ఇంజిన్లను తయారు చేసే టెలీడైన్ సీఏఈ అనే సంస్థలో ప్రతిష్ఠాత్మక ఉద్యోగంలో చేరాడు. అయితే 1990లో ప్రచ్ఛన్న యుద్ధం(యూఎస్-సోవియట్ యూనియర్ మధ్య యుద్ధం) ముగియడంతో క్షిపణి ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో సర్దానా ఉద్యోగం కోల్పోయారు. ‘అప్పటికే నేను తనఖాతో ఇల్లు కొన్నాను. ఆరు నెలల కుమార్తె ఉంది. నా తల్లిదండ్రులు కూడా నాతో నివసిస్తున్నారు. ఆ సమయంలో నా కుటుంబాన్ని పోషించడానికి ఆదాయం లేదు’ అని సర్దానా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలో ఆర్థిక అనిశ్చితి ఎదుర్కొన్న ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని పారిశ్రామికవేత్తగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే తన వద్ద ఉన్న పొదుపు 25,000 డాలర్లు(ఇప్పటి విలువ రూ.21.86 లక్షలు)తో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు.ఇదీ చదవండి: ఆకాశవీధిలో పెరిగిన ప్రయాణికులుఇన్నోవా సొల్యూషన్స్ఐటీ సేవలకు భవిష్యత్తులో గిరాకీ ఉంటుందని గ్రహించిన రాజ్ తరువాతి కాలంలో కొన్ని ఐటీ సంస్థలను కొనుగోలు చేసి ఇన్నోవా సొల్యూషన్స్ అనే ఐటీ సేవల సంస్థను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇన్నోవా సొల్యూషన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 50,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. సర్దానా సంస్థల నికర విలువ రెండు బిలియన్ డాలర్లు(రూ.16 వేల కోట్లు)గా ఉంది. ఢిల్లీలోని ప్రభుత్వ గృహంలో నివసించి కేవలం జేబులో 100 డాలర్లతో అమెరికా వెళ్లిన సర్దానా ప్రస్తుతం బిలియనీర్‌గా ఎదిగి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. -
మా తరానికి విద్యా ప్రదాత సీఎం జగన్
సాక్షి, అమరావతి, నెట్వర్క్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మా మాటలను ప్రపంచమంతా ఆసక్తిగా ఆలకించిందంటే మన విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల పుణ్యమే! చెట్ల కింద సాగే వానాకాలం చదువులను సంస్కరణల బాట పట్టించిన సీఎం జగన్ సర్దే ఆ గొప్పతనమంతా! చదువులతోటే పేదరికాన్ని ఎదిరిద్దామన్న ఆయన పిలుపు అక్షర సత్యం! విద్యారంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే అత్యుత్తమ ఫలితాలను సాధించవచ్చో దేశానికే మార్గ నిర్దేశం చేశారు. ప్రతిభతో రాణిస్తున్న పేదింటి బిడ్డలకు దక్కిన అరుదైన గౌరవమిది. ఐరాస, వరల్డ్ బ్యాంక్ వేదికగా అంతర్జాతీయ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించడం.. ఎన్నడూ రాష్ట్రం దాటని మేం ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో కాలు మోపడం.. కాణీ ఖర్చు లేకుండా విదేశాలకు వెళ్లి రావడం.. ఇదంతా ఇంకా నమ్మశక్యంగా లేదు!.. ఇదీ నిరుపేద కుటుంబాల్లో జన్మించి అంతర్జాతీయ వేదికలపై అందరినీ ఆకట్టుకున్న 10 మంది విద్యార్థుల మనోగతం. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 45 లక్షల మంది విద్యార్థులకు ప్రతినిధులుగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వీరంతా సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు అమెరికాలో పర్యటించి వివిధ వేదికలపై తమ గళాన్ని సగర్వంగా వినిపించారు. ప్రభుత్వ బడి నుంచి ఐఎంఎఫ్‌కు.. ఎకరం పొలంతో పాటు కేబుల్ ఆపరేటింగ్ పనులు చేసుకునే రైతు బిడ్డనైన నాకు 190 దేశాలకు సభ్యత్వమున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో మాట్లాడే అవకాశం దక్కడం నిజంగా అదృష్టమే. అది సీఎం జగన్ సర్ తెచ్చిన విద్యా సంస్కరణల ఫలితమే. మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానాన్ని అగ్రరాజ్యం ప్రతినిధులకు వివరించడం చాలా సంతోషంగా ఉంది. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, షూలు, నాణ్యమైన పోషకాహారం, ట్యాబ్‌లు, కార్పొరేట్ స్థాయిలో పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని తెలియచేశా. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుబ్రమణ్యన్ మాలో ఎంతో స్ఫూర్తి నింపారు. ఏ స్థాయికి ఎదిగినా మన మూలాలను మరువకూడదని, రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ఖండాతరాలకు విస్తరింపజేయాలని నిర్ణయించుకున్నా. పేద పిల్లలకు జగనన్న ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకునే బాధ్యత విద్యార్థులపైనే ఉంది. – వంజివాకం యోగీశ్వర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నరసింగాపురం, తిరుపతి జిల్లా ఎన్నడూ చూడని సదుపాయాలు.. మా బిడ్డలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాం. గతంలో ఎన్నడూ చూడని సదుపాయాలను సీఎం జగన్ ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రభుత్వ విద్యావ్యవస్థలో అద్భుతమైన సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. – నాగరాజు, విజయ (యోగీశ్వర్ తల్లిదండ్రులు, అక్క) నిజంగా.. నేనేనా! ఐరాస, వరల్డ్ బ్యాంకుల్లో ప్రసంగించింది నేనేనా అని ఆశ్చర్యంగా ఉంది. అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించడాన్ని కూడా నమ్మలేకున్నా. సోషల్ పుస్తకంలో ఫొటో మాత్రమే చూసిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఒక రోజంతా ఉన్నాం. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఎకో అంబాసిడర్ కార్యక్రమంలో పాల్గొని ఇతర దేశాల విద్యార్థులతో ముచ్చటించి వారి సంస్కృతిని తెలుసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, పథకాలను వివరించాం. ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు–నేడు, జగనన్న విద్యాదీవెన, గోరుముద్ద తదితర పథకాల అమలు తీరుతోపాటు బడుల్లో తాగునీరు, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్స్, ల్యాబ్స్‌తో పాటు జగనన్న కానుక కింద స్కూల్ యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు, షూలు ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఇవ్వడంపై వరల్డ్ బ్యాంక్, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారులతో మాట్లాడాం. నయాగరా వాటర్ ఫాల్స్ చూశాం. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, 2001లో కూలిపోయిన ట్విన్ టవర్స్ చరిత్ర తెలుసుకున్నా. – అల్లం రిషితారెడ్డి, కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాల, విజయనగరం ఇంత గుర్తింపు ప్రభుత్వ చలవే.. గతంలో మా ఇద్దరు అమ్మాయిలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించాం. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాం. ఇద్దరికీ నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు వచ్చాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే చదివించి ఉంటే ఇంత గుర్తింపు లభించేది కాదు. – ఉదయలక్ష్మి, రామకృష్ణారెడ్డి (రిషితారెడ్డి తల్లిదండ్రులు) విద్యా సంస్కరణల అమలుతో.. మా అమ్మ ఫాతిమా వ్యవసాయ కూలీ. మాలాంటి పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో అమెరికా వెళ్లి అంతర్జాతీయ వేదికలపై ప్రసగించే అవకాశాన్ని సీఎం జగన్ సర్ కల్పించారు. అమెరికాలో 15 రోజుల పర్యటనలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. విద్యాపరంగా ఎలాంటి సంస్కరణలు అమలుపరిస్తే దేశం అభివృద్ధి చెందుతుందో ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాడు–నేడు, విద్యాకానుక, డిజిటల్ బోధన, గోరుముద్ద, అమ్మఒడి లాంటి పథకాలను మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేకంగా స్వేచ్ఛ పథకాన్ని అమలు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతోంది. – షేక్ అమ్మాజాన్, ఏపీ ఆర్ఎస్, వేంపల్లి, శ్రీసత్యసాయి జిల్లా పేద కుటుంబాలకు విద్యా ప్రదాత ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్ది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న సీఎం జగన్ మా తరంలో పేద కుటుంబాలకు విద్యా ప్రదాతగా నిలిచిపోతారు. మన రాష్ట్రంలో తెచ్చిన విద్యా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఐరాస వేదికగా వీటిని చాటిచెప్పాం. ఈ పర్యటనను కలలో కూడా ఊహించలేదు. మాలాంటి పేద విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రోత్సహించి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం వల్లే ఈ అవకాశం లభించింది. రెండు వారాల పాటు ఎందరో ప్రముఖులతో చర్చించడం గర్వంగా ఉంది. – మోతుకూరి చంద్రలేఖ, కేజీబీవీ, ఎటపాక, ఏఎస్ఆర్ జిల్లా ధీమాగా చదువులు.. కేజీబీవీలో చదువుకున్న నా బిడ్డకు ఈ అవకాశాన్ని కల్పిం చిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. ఈ ప్రభుత్వం వచ్చాక నాలాంటి తండ్రులకు పిల్లల చదువులపై బెంగ పోయింది. డబ్బున్న వారు, ఉద్యోగాలు చేసేవారు కూడా ఇప్పుడు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు ఆసక్తి చూపడం విద్యా సంస్కరణల పుణ్యమే. – రామారావు, ఆటో డ్రైవర్ (చంద్రలేఖ తండ్రి) ప్రపంచానికి చాటి చెప్పా.. మా నాన్న దస్తగిరి లారీ డ్రైవర్. అమ్మ రామలక్ష్మి రజక వృత్తిలో ఉంది. పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు అమెరికా వెళ్లి అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించే అవకాశాన్ని సీఎం జగన్ కల్పిం చారు. ఈ పర్యటన జీవితాంతం గుర్తుంటుంది. న్యూయార్క్‌లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రపంచానికి తెలియచేశా. నాడు– నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించా. ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు ఎంతో మెరుగయ్యాయి. టాయిలెట్ల శుభ్రతతో పాటు బాలికలకు ప్రత్యేకంగా న్యాప్కిన్ల వాడకంపై అవగాహన కల్పించడం, అమ్మఒడి పథకంతో స్కూళ్లలో డ్రాప్‌అవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ అంశాలను ఐరాస ప్రతినిధులకు వివరించా. మన దేశ ఆర్థి క వ్యవస్థలో యువత భాగస్వామ్యంపై ప్రసంగించా. ఐఐటీ గ్రాడ్యుయేట్స్‌లో చాలా మంది స్టార్టప్‌లు ప్రారంభించి ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని చెప్పా. – చాకలి రాజేశ్వరి, ఏపీ మోడల్ స్కూల్, నంద్యాల పక్క ఊరు వెళ్లాలన్నా చార్జీల గురించి ఆలోచించే మాకు.. కాకినాడ జిల్లా తీరప్రాంత గ్రామమైన రమణక్కపేటలో నిరుపేద ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కుటుంబంలో జన్మించిన నాకు అంతర్జాతీయ వేదికపై ప్రసంగించేలా సీఎం జగన్ సార్ గొప్ప అవకాశాన్ని కల్పించారు. నాన్న సింహాచలం సెక్యూరిటీ గార్డు కాగా అమ్మ శాంతి గృహిణి. నేను, చెల్లి, తమ్ముడు.. ఇదీ మా కుటుంబం. నాన్న కొద్దిపాటి సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తూ మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. పక్క ఊరు వెళ్లాలన్నా చార్జీల గురించి ఆలోచించే కుటుంబం నుంచి వచ్చిన నేను అమెరికా వెళ్లానంటే అది జగన్ సార్ విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పుల పుణ్యమే. విద్యతోనే అన్నీ సాధ్యమవుతాయని సీఎం సార్ చెబుతుంటారు. అది నిజమే. అందుకు నేనే నిదర్శనం. సాధారణ విద్యార్థులను ప్రభుత్వ ప్రతినిధులుగా అమెరికా పంపించి సీఎం జగన్ సర్ చరిత్ర సృష్టించారు. భవిష్యత్‌లో ఐఏఎస్ అయ్యి సీఎం జగన్ సార్ ఆశయ సాధనకు కృషిచేస్తా. రాష్ట్రంలోని విద్యా సంస్కరణలు విదేశాల్లో సైతం గుర్తింపు పొందాయి. కొలంబియా యూనివర్సిటీలో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గౌరవప్రదమైన జీవనోపాధులపై వివరించడం ఆనందంగా ఉంది. – దడాల జ్యోత్స్న, సాంఘిక సంక్షేమ గురుకులపాఠశాల,వెంకటాపురం, కాకినాడ జిల్లా మరపురాని అనుభూతి.. ఐరాస, కొలంబియా యూనివర్సిటీల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నా. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలపై మాట్లాడటం మరపురాని అనుభూతి. మా జీవితాన్ని మలుచుకునేందుకు ఈ పర్యటన ఎంతో స్ఫూర్తినిచ్చింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేం. విద్యా వ్యవస్థలో తెచ్చిన సంస్కరణలను సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. – పసుపులేటి గాయత్రి, జడ్పీహెచ్ఎస్, వట్లూరు, పెదపాడు మండలం, ఏలూరు జిల్లా ఎంతో నేర్చుకున్నాం.. నాకు ఇంత అరుదైన అవకాశం జగన్ మామయ్య పాలనలో దక్కడం, అందుకు ప్రభుత్వ పాఠశాలలు వేదిక కావడం ఎన్నటికీ మర్చిపోలేను. సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు జరిగిన విదేశీ విజ్ఞాన యాత్రలో ఐరాస జనరల్ అసెంబ్లీ హాల్ని సందర్శించాం. కొలంబియా యూనివర్సిటీలో ఎకో ఎంబాసిడర్ ప్రోగ్రాంలో పాల్గొన్నాం. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ట్విన్ టవర్స్ కూలిన చోటు, నయాగరా జలపాతం ఇలా వివిధ ప్రాంతాలను సందర్శించి అక్కడి సంస్కృతిపై అవగాహన పెంచుకున్నాం. విదేశీ విద్యార్థులతో ముచ్చటించడం కొత్త అనుభూతిని కలిగించింది. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఆర్థి క విషయాలు, అంతర్జాతీయ ఆర్థి క అవసరాలు, ఆర్థిక పరిపుష్టికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తదితర అంశాలను నేర్చుకున్నాం. అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్‌ను సందర్శించే అవకాశం రావడం మరపురాని అనుభూతి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో 12 శాతం విద్యపై ఖర్చు చేయటాన్ని బట్టి చదువులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. – జి.గణేష్ అంజన సాయి, వల్లూరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా గిరిజన బిడ్డకు గర్వకారణం.. మాది కురుపాం మండలం కొండబారిడి గిరిజన గ్రామం. కుటుంబ కారణాలతో తల్లిదండ్రులు విడిపోయారు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా. ఏసీ బస్సు అంటే ఏమిటో కూడా తెలియదు. గతంలో ఓసారి విశాఖపట్నం, మరోసారి సైన్స్ ఎగ్జిబిషన్ కోసం విజయవాడ వెళ్లా. అలాంటిది మన రాష్ట్ర ప్రతినిధిగా విమానం ఎక్కి ఏకంగా అమెరికా వెళ్లి రావడం కలగానే ఉంది. మన విద్యా సంస్కరణలు, సంక్షేమ పథకాలను ఐరాస, యూఎస్ స్టేట్ అధికారులకు వివరించా. ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్యా విధానంతో విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనాలను కొలంబియా యూనివర్సిటీలో జరిగిన సదస్సులో తెలియచేశా. వివిధ దేశాల విద్యార్థులతో మాట్లాడి భిన్న సంస్కృతులను తెలుసుకునే అవకాశాన్ని కల్పిం చిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు. – సామల మనస్విని, కేజీబీవీ, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, మన్యం జిల్లా ప్రభుత్వ స్కూళ్ల విశిష్టతను చాటిచెప్పాం.. నాన్న సోమనాథ్, అమ్మ గంగమ్మ వ్యవసాయ కూలీలు. పేద కుటుంబాల నుంచి వచ్చిన మేం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిం చిన సదుపాయాలు, విశిష్టతను ప్రపంచానికి తెలియచేశాం. విద్యారంగంలో మన రాష్ట్రం ఏ స్థాయిలో రాణిస్తోందో చాటాం. ఈ పర్యటనలో చాలా విషయాలు నేర్చుకున్నా. యూఎన్వో హెడ్ క్వార్టర్స్, ఐఎంఎఫ్ సమావేశంలో ప్రసంగించడం మరచిపోలేని అనుభూతి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, నయగారా ఫాల్స్, మ్యూజియం, వైట్‌హౌస్ లాంటి ప్రదేశాలను సందర్శించడం మాలాంటి వారికి అసాధ్యం. సీఎం జగన్ సర్ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించి బాగా చదువుకోమని ప్రోత్సహిస్తున్నారు. ప్రతిభ చాటిన మాకు మరువలేని అవకాశాన్ని కల్పిం చారు. చదువుల్లో రాణించే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అంతర్జాతీయ సదస్సులకు ఎంపిక చేయడం దేశంలో ఇదే ప్రథమం. – మాల శివలింగమ్మ, కేజీబీవీ, ఆదోని, కర్నూలు జిల్లా -
ఢిల్లీ డిక్లరేషన్ వెనక కఠోర శ్రమ వీరిదే..
ఢిల్లీ: ఢిల్లీ డిక్లరేషన్‌పై ప్రపంచ దేశాలు ఏకాభిప్రాయం సాధించడం వెనుక జీ20 షేర్పాల నిరంతరం కష్టం దాగి ఉంది. ఉక్రెయిన్ అంశంపై ఏకాభిప్రాయానికి రావడానికి 200 గంటలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 డ్రాఫ్ట్‌లు అవసరమయ్యాయి. నిరంతరాయంగా పనిచేసిన తన బృంద సభ్యులను జీ20 షేర్పా అమితాబ్ కాంత్ ప్రశంసించారు. 'ఢిల్లీ డిక్లరేషన్‌లో క్లిష్టమైన అంశం ఉక్రెయిన-రష్యా యుద్ధం. ఈ భౌగోళిక అంశంపై ఏకాభిప్రాయానికి రావడానికి 200 గంటలు 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 డ్రాఫ్టులు అవసరమయ్యాయి. ఈ పనంతా ఇద్దరు అధికారులు చేశారు' అని అమితాబ్ కాంత్ తన బృంద సభ్యులను మెచ్చుకున్నారు. The most complex part of the entire #G20 was to bring consensus on the geopolitical paras (Russia-Ukraine). This was done over 200 hours of non -stop negotiations, 300 bilateral meetings, 15 drafts. In this, I was greatly assisted by two brilliant officers - @NagNaidu08 & @eenamg pic.twitter.com/l8bOEFPP37 — Amitabh Kant (@amitabhk87) September 10, 2023 ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరంగా దేశాధినేతల మధ్య భిన్నాభిప్రాయాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంశాలు వివాదాస్పదంగా ఉన్న సమయంలో జీ20ని నిర్వహించి, తీర్మాణాలపై ఏకాభిప్రాయం కుదర్చడం గొప్ప విజయంగా భావించవచ్చు. ఢిల్లీ డిక్లరేషన్ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందగానే ప్రధాని మోదీ ప్రశంసనీయంగా ప్రకటించారు. షేర్పాలు, సంబంధిత మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. 'భారత్ జీ20కి అధ్యక్షత వహించేప్పుడే డిక్లరేషన్ అందరినీ కలుపుకుని, నిర్ణయాత్మకంగా, ఆచరణాత్మక దిశలో ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. డిక్లరేషన్‌లో మొత్తం 83 పేరాలు ఉన్నాయి. అందులో ఎనిమిది పేరాలు భౌగోళిక అంశాలు ఉన్నాయి. అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం విశేషం' అని అమితాబ్ కాంత్ అన్నారు. ఢిల్లీ డిక్లరేషన్ ఏకాభిప్రాయం కుదరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కోసం నిరంతరం పనిచేసిన షేర్పాలను ఆయన ప్రశంసించారు. ఇదీ చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే.. -
జిమ్ మారో జిమ్.. షార్ట్‌కట్స్ ఉండవ్.. చెమటలు కక్కాల్సిందే!
భారత స్టార్ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ ఈ ఏడాది జులైలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ పూర్తి దృష్టి బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలపైనే ఉంది. దీని కోసం ఆమె చెమటలు కక్కుతోంది తన కసరత్తుల వీడియో ను మేరీ కోమ్ సోషల్ మీడియా యాప్ కూ లో షేర్ చేసింది, విజయానికి కృషి మాత్రమే అవసరమని రాసింది. షార్ట్‌కట్ పద్ధతిలో ప్రయత్నించినా ఫలితం ఉండదని కష్టపడి పనిచేయాల్సిందే అంటోంది. బాక్సింగ్ ప్రాక్టీస్ తర్వాత, మేరీ కోమ్ మధ్యాహ్నం జిమ్‌కి వెళుతుంది. పుష్-అప్స్ సిట్-అప్లు, అలాగే హెవీ వెయిట్ లిఫ్టింగ్ వంటి బాడీ వెయిట్ వ్యాయామాలతో కండరాలను బలంగా ఉంచుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగిస్తుంది. Koo App Do or do not. There is no try. There is no shortcuts. Only HARD WORK. View attached media content - M C Mary Kom (@mcmarykom) 10 May 2022 -
ప్రతిరోజూ మొదటి రోజే: సమంత
కష్టపడి పని చేయాలి కానీ పనిలో సౌకర్యం కోరుకుంటే అది మన వృత్తికి ప్రమాదం అవుతుందంటారు. సమంత కూడా ఈ మాటే అంటున్నారు. కథానాయికగా పదకొండేళ్లు పూర్తి చేసుకున్నారామె. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ – ‘‘హార్డ్‌వర్క్‌కి ప్రత్యామ్నాయం లేదు. ఈ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. పనిలో సౌకర్యాన్ని వెతుక్కోకూడదు. అందుకే పదకొండేళ్లుగా నేను షూటింగ్‌కి వెళ్లే ప్రతిరోజునీ నా మొదటి రోజు అనుకునే వెళతాను. అదే తపన, నేర్చుకోవాలనే పట్టుదల, అదే ఎనర్జీతో పని చేస్తాను. ఈ తపన, పట్టుదల, ఎనర్జీయే నటిగా నా ఎదుగుదలకు దోహదపడ్డాయి. వీటివల్లే ఇన్నేళ్లుగా సినిమాల్లో ఉండగలుగుతున్నాను’’ అన్నారు. -
బ్రేక్ తీసుకోకుండా పనిచేస్తున్నారా..?
లండన్ : ఉద్యోగులు కష్టించి పనిచేస్తే ప్రమోషన్లు, వేతనాల పెంపు వాటంతటవే వచ్చేస్తాయని చెబుతుంటారు. అయితే ఒళ్లు అలిసేలా పనిచేస్తే ప్రమోషన్ల సంగతి అటుంచి కెరీర్‌కూ, ఆరోగ్యానికీ అది ప్రమాదకరమని తాజా అథ్యయనం వెల్లడించింది. ఉద్యోగ బాధ్యతల్లో అదనపు శ్రమతో పనిచేసేవారు అనారోగ్యాలకు గురికావడంతో పాటు ఉద్యోగ భద్రత లేకపోవడం, ప్రమోషన్లు దక్కలేదనే అసంతృప్తిలో కూరుకుపోతున్నారని యూనివర్సిటీ ఆఫ్ లండన్, ఈఎస్సీపీ యూరప్ బిజినెస్ స్కూల్ చేపట్టిన అథ్యయనం పేర్కొంది. యాజమాన్యాలు ఉద్యోగులను ఒత్తిడి నుంచి విముక్తి కల్పిస్తూ వారికి అనువైన సమయాల్లో పనిచేసే వెసులుబాటు కల్పిస్తే మెరుగైన ఉత్పాదకత, ఉద్యోగుల నుంచి కంపెనీ పట్ల ఆదరణ పెరుగుతాయని అథ్యయనం తేల్చిచెప్పింది. 36 ఐరోపా దేశాలకు చెందిన 52,000 మంది ఉద్యోగులను రెండు దశాబ్దాల పాటు పరిశోధక బృందం పరిశీలించిన మీదట ఈ వివరాలు వెల్లడించింది. పని తీవ్రత, డెడ్లైన్లు వంటివి ఉద్యోగుల పనితీరును దెబ్బతీస్తున్నాయని అథ్యయన రచయిత డాక్టర్ ఆర్గ్యో అస్తోకి చెప్పారు. పనితీవ్రత పని నాణ్యతను కూడా ప్రభావితం చేస్తోందని ఫలితంగా ఉద్యోగులు ఎంత కష్టపడినా ప్రమోషన్లు దక్కడం లేదని అథ్యయనం స్పష్టం చేసింది. పనితీవ్రతను, అధిక పనిగంటలను నివారిస్తేనే మెరుగైన ఫలితాలు లభిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. చాలా వృత్తుల్లో ఎక్కువ పనిచేసేందుకు సిబ్బంది మధ్యలో విరామం తీసుకోవడాన్ని విస్మరిస్తారని, అయితే బ్రేక్స్ తీసుకోవాలని తాము వారికి సూచిస్తామన్నారు. విరామం లేకుండా పనిచేస్తే ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. -
వారమంటే....వడ్డింపే
పారిస్ : కష్టపడి పనిచేస్తే ఎవరికైనా జీతం పెరుగుతుంది లేదా ప్రమోషన్ వస్తుంది...కానీ ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తికి జరిమానా పడింది. అదేంటి కష్టపడి పనిచేస్తే.. జరిమానా ఎందుకు విధించారు అనుకుంటున్నారా? ఫ్రాన్స్‌లో అంతేనట. వివరాల్లోకి వెళ్తే ఫ్రాన్స్‌లో ప్రతి ఒక్కరూ వారానికి ఆరు రోజులు మాత్రమే పనిచేయాలి. కచ్చితంగా ఒక రోజు సెలవు తీసుకోవాలి. సొంతంగా వ్యాపారం చేసుకునే వారికీ ఇదే నియమం వర్తిస్తోంది. అయితే ఈ నియమం పాటించని బేకరీ యజమాని సెడ్రిక్ వైవ్రికి అక్కడి ప్రభుత్వం 3వేల యూరోల జరిమానా విధించింది. వెవ్రి పారిస్‌కు 120 మైళ్ల దూరాన ఉన్న లూసిగ్ని సర్ బార్స్‌లో లెక్ బెకరీని నిర్వహిస్తున్నాడు. రాబోయే వేసవి రద్ధీ దృష్టా ముందుగానే పెద్ద మొత్తంలో క్రిసాంట్స్, బగెట్స్ని తయారు చేసి పెట్టుకోవాలని భావించాడు. అందుకోసం వారంలో ఏడురోజుల పాటు పనిచేయడం ప్రారంభించాడు. కానీ అక్కడి స్థానిక చట్టాల ప్రకారం చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కూడా వారంలో ఆరు రోజులు మాత్రమే పనిచేయాలి. ఈ చట్టాన్ని రోజువారి వేతనం కోసం పనిచేసే కూలీలకు ఒక రోజు పని ఒత్తిడి నుంచి విముక్తి కల్పించడానికి, శ్రమ దోపిడి నుంచి కాపాడటం కోసం రూపొందించారు. సాధరణంగా బేకరిల్లో పని మొత్తం రాత్రిపూటే జరుగుతుంది. యజమానుల పని ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. అందుకని యజమానులు వారంలో ఏడు రోజులు పని చేస్తానంటే అందుకు అక్కడి చట్టాలు ఒప్పుకోవు. ఈ నియమాన్ని ఉల్లంఘించినందుకే వైవ్రీకి జరిమానా విధించింది అక్కడి ప్రభుత్వం. దీనిపై టౌన్ మేయర్ క్రిస్టియాన్ బ్రాన్లే స్పందిస్తూ... ‘వేసవిలో వచ్చే సందర్శకులే మాకు ప్రధాన ఆదాయ వనరు. ఒక్క రోజు వ్యాపారాన్ని మూసివేస్తే మాకు వచ్చే లాభాలు తగ్గిపోతాయి. ఇలాంటి చట్టాలన్నీ మా వ్యాపారాలకు ఆటంకంగా మారాయి’ అని అన్నారు. ఇక్కడి ప్రజలు కూడా వైవ్రీకే మద్దతు ఇస్తున్నారు. వారంలో ఏడు రోజులు పనిచేయాలనే వైవ్రీ వాదనను సమర్థిస్తూ దాదాపు 500 మంది సంతకాలు చేశారు. అయినప్పటికీ వైవ్రీ జరిమాన చెల్లించాల్సి వచ్చింది. -
డ్యూటీ వేయాలా.. రూ. వెయ్యి కొట్టు
ఏడాది క్రితం సీఎం చంద్రబాబుబందోబస్తుకు వెళ్ళిన హోంగార్డుకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి.ఆ హోంగార్డుకు ఆసుపత్రి ఖర్చు ఏకంగా రూ.2 లక్షల వరకు అయ్యింది.అటు ప్రభుత్వం గానీ.. ఇటు సంక్షేమసంఘం కానీ రూపాయి ఇవ్వలేదు.. అరకొరజీతాలతో బాధలు పడే ఆ కుటుంబంఅష్టకష్టాలు పడింది.విధులు నిర్వర్తిస్తూ ఒక హోంగార్డుమరణించాడు. అంత్యక్రియల ఖర్చులకు రూ.వెయ్యి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మూడు నెలలకు అన్ని విచారణలు చేసి రూ.15 వేలు ప్రభుత్వం నుంచి అందించారు. కుటుంబ యజమాని మరణంతో ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోయింది.. పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : రోజంతా రోడ్డుపై నిలబడి విధులు నిర్వర్తించాలి. పోలీస్ శాఖలోని సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తున్నా హోంగార్డుల కుటుంబాలకు వెతల బతుకులే. శాంతిభద్రతల పరిరక్షణలోనూ, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా ఏది జరి గినా అందరికంటే ముందు విధుల్లో ఉండేది హోంగార్డులే. ఎండావానా.. దుమ్మూధూళిని లెక్కచేయకుండా పోలీస్ సిబ్బందితో సమానంగా ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నా అరకొర జీతాలే. పనిచేస్తేనే రోజువారీ వేతనం చెల్లించే పరిస్థితి ఉంది. రోడ్డు ప్రమాదం జరిగినా.. మరణించినా ప్రభుత్వం నుంచి ఆదుకునే అవకాశం లేదు. ఇక జిల్లా కార్యాలయం అంతా అవినీతిలో కూరుకుపోయింది. ప్రతిపనికీ రేటు నిర్ణయించి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మహిళా సిబ్బంది బాధలు వర్ణణాతీతంగా మారాయని ఆవేదన చెందుతున్నారు. అధికారులతోపాటు కార్యాలయంలోని హోంగార్డులు సైతం మహిళలను అన్ని రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఉన్నతాధికారులకు చెప్పుకున్నా న్యాయం జరిగే పరిస్థితి లేదని వాపోతున్నారు. సొమ్ము చెల్లించుకుంటేనే హోంగార్డులు వివిధ శాఖల్లో డ్యూటీలు వేయాలంటే సొమ్ములు చెల్లించుకోవాల్సిందేనంట. రూ.వెయ్యి కొడితే తప్ప డ్యూటీలు వేయని దుస్థితి నెలకొంది. హోంగార్డులకు సంబంధించిన జిల్లా కార్యాలయంలో ఏ పని చేయాలన్నా సొమ్ము ముట్టనిదే పని ముందుకు వెళ్ళదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 873 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. వీరంతా ఆర్టీసీ, రవాణాశాఖ, ఎఫ్‌సీఐ, సబ్‌జైలు, పవర్‌ప్లాంట్ ఇలా ఇతర శాఖలు, ప్రైవేటు సంస్థల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్టీఓ కార్యాలయంలో డ్యూటీకి డిమాండ్ ఉంది. ఇక్కడ విధుల్లో వేయాలంటే రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ ఇచ్చుకోవాల్సిందే. ఆర్టీసీ, ఎఫ్‌సీఐ, ద్వారకాతిరుమల ఆలయం ఇలా కొన్ని శాఖల్లో రూ.500 నుంచి రూ.1000 సమర్పించుకోవాలి. ఇక రవాణా శాఖలో పనిచేస్తున్న హోంగార్డులకు గత నాలుగు నెలలుగా వేతనాలే ఇవ్వలేదు. ప్రమాదంలో మరణిస్తే హోంగార్డులు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే మట్టి ఖర్చులకు రూ.5 వేలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. కానీ జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మరణిస్తే కేవలం రూ.1000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మిగిలిన సొమ్ము లెక్కలు చెప్పే పరిస్థితి లేకపోగా, అడిగే అవకాశం హోంగార్డులకు లేకుండా పోయింది. ఆ శాఖలోని అధికారులే సొమ్ములు మింగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బీమా సొమ్ముకు సైతం హోంగార్డుల వేతనాల్లోంచే కోతలు వేసి మరీ చెల్లించే దుస్థితి ఉంది. మూడు నెలల అనంతరం విచారణలు చేసి మరో రూ.15 వేలు కుటుంబానికి అందజేస్తారు. టీడీపీ ప్రభుత్వం చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హోంగార్డులను రెగ్యులర్ చేస్తామంటూ ప్రకటించింది. కానీ రెగ్యులర్ కాదు కదా..రోజువారీ వేతనం సైతం పెంచేందుకు చర్యలు తీసుకోలేదని హోంగార్డులు ఆవేదన చెందుతున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో హోంగార్డుల రోజువారీ వేతనాన్ని రూ.400 నుంచి రూ.675 కు పెంచారు. బందోబస్తుకు వెళితే అదనంగా రూ.200 చెల్లిస్తున్నారు. హోంగార్డులకు ఆరోగ్య కార్డులు, మెటర్నరీ లీవులు, ప్యాటర్నిటీ సెలవులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఏపీలో మాత్రం హోంగార్డులకు అదనపు విధులకు వారి సొంత ఖర్చులతోనే వెళ్ళాల్సి వస్తోంది. గతంలో ఏఆర్ అధికారులు వాహనాల్లో తీసుకువెళ్ళగా ప్రస్తుతం ప్రయాణ ఖర్చులు వారే భరించాల్సి వస్తోంది. -
శ్రామిక విప్లవం
జీవన కాలమ్ ‘ఉదయం’ పత్రిక నడిపే రోజుల్లో రోజంతా మద్రాసులో పనిచేసి సాయంకాలం విమానంలో– ప్రతీరోజూ విధిగా హైదరాబాదు ప్రయాణం చేసేవారు. ఏమిటీ కమిట్మెంట్. ఎందుకీ కమిట్మెంట్ అంటే.. పని ఆయనకు ప్రాణవాయువు. నా 54 సంవత్సరాల సినీ జీవితంలో దాసరి లాగా శ్రమించిన, ఆ శ్రమని సత్ఫలితాలుగా మలిచిన వ్యక్తిని చూడలేదు. ఆయన అనూహ్యమైన శ్రామిక విప్లవం అంటాను నేను. ఒక దశలో ఇటు అక్కినేని, అటు ఎన్టీఆర్ వారి షూటింగుకి వీజీపీ కాటేజీలలో ఉండటం నాకు తెలుసు. అక్కినేని షూటింగు అయ్యాక, ఎన్టీఆర్‌కి పిలుపు వెళ్లేది. ఇద్దరి చిత్రాలకూ సమగ్రమైన న్యాయం చేసి ఇద్దరి అభిమానులనూ అలరించిన ఘనత దాసరిగారిది. జబుల్లా రోడ్లో ఎన్టీఆర్ ఇంటికి ఎదురుగా దాసరి ఇల్లు. ఎప్పుడూ పెళ్లివారిల్లులాగా సందడిగా ఉండేది. రాత్రి అయితే మరీనూ. దాదాపు 40 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేసేవారు. అందరి చేతుల్లోనూ టేప్ రికార్డర్లు. ఎందుకు? దాసరిగారు పిలిచినప్పుడు పరిగెత్తుకువెళ్తే –డైలాగులు– మాట్లాడేవారు. ఎవరి సినిమా? ఏ సీను? ఎవరు పాత్రలు? కథ ఏమిటి? అన్నీ దాసరిగారి మస్తిష్కంలో ఉండేవి. వీరుకాక మేకప్మాన్లు, చిన్న చిన్న నటీనటులు, కాస్ట్యూమ్స్ వారు– అందరికీ మించి నిర్మాతలు. అదొక సర్కస్. ఈ పద్మవ్యూహంలోకి ఏ రాత్రికో నాలాంటివారిని తీసుకెళ్లేవారు. ఎందుకు? కథ చెప్పడానికి. నేను ఆయనతో అనేవాడిని: ‘‘బయట సమూహాన్ని, మనుషుల్నీ చూస్తూ, మీతో ఇలా మాట్లాడటం నేరం చేసినట్టు అనిపిస్తోంద’’ని. ఆయన నిర్మలంగా నవ్వేవారు. ఇన్ని ఒత్తిడుల మధ్య ఎంతో తీరుబాటుగా, పవిత్రంగా, హాయిగా కనిపించేవారు. ఓసారి ఆయనకి కథ చెప్పడానికి– కేవలం కథ చెప్పడానికి– ఆయనతో – అసిస్టెంట్ల బృందంతో తిరువనంతపురం రైలులో వెళ్లాను. ఆయన ఎదుటి బెర్తుపై పడుకున్నారు. ఓ రాత్రికి తెలివొచ్చినట్టుంది. ఎవరో అసిస్టెంటుని పిలి చారు. టేప్ రికార్డర్ ఆయన నోటి దగ్గరకు వచ్చింది. డైలాగులు చెప్పారు. అంతే. మళ్లీ నిద్రపోయారు. ఇదేమిటి? చర్చలేదా? నేను ఆయన చిత్రాలు ఎన్నింటిలోనో ప్రధాన పాత్రలు చేశాను. ఆయన టేపు రికార్డర్లో ‘చెప్పిన’ డైలాగులకు పొల్లుకూడా మారదు! అదీ ఆయన ఏకాగ్రత. అంతకుమించి– పది చిత్రాల అరలు మెదడులో వేర్వేరుగా, గొప్పగా, భద్రంగా నిక్షిప్తమయి ఉంటాయి. ఎవరీ అసిస్టెంట్ డైరెక్టర్లు? రాబోయే కాలంలో కనీసం పాతిక సంవత్సరాలు తెలుగు చలన చిత్రసీమని ఏలిన ఉద్దండులు– కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, రాజాచంద్ర, రేలంగి నరసింహారావు, ఎస్.ఎస్. రవి చంద్ర, దుర్గా నాగేశ్వరరావు, ధవళ సత్యం, నందం హరి శ్చంద్రరావు, డిమిట్ రావు, రమణబాబు, అనిల్, ఎమ్మనేని ప్రభాకర్, రాధాకృష్ణ– ఇలాగ. వీరందరితోనూ నేను పనిచేశాను. ఒక్కొక్కరూ–ఒక్కొక్క శిఖరం. ‘ఉదయం’ పత్రిక నడిపే రోజుల్లో రోజంతా మద్రాస్‌లో పనిచేసి సాయంకాలం విమానంలో–ప్రతీరోజూ విధిగా హైదరాబాద్ ప్రయాణం చేసేవారు. ఎన్నోసార్లు మేమిద్దరం కలిశాం. ఏమిటీ కమిట్మెంట్. అంతకుమించి–ఎందుకీ కమిట్మెంట్? సమాధానం నాకు తెలుసు–పని ఆయనకు ప్రాణవాయువు. ఒత్తిడి ఆయన మెదడు రిలాక్స్ కావడానికి సాధన. ఈ ఒత్తిళ్లలోనే ఒక సర్దార్ పాపారాయుడు, ఒక ప్రేమాభిషేకం, ఒక రాములమ్మ–అనూహ్యం! చిన్న చిన్న కళాకారుల్ని నెత్తికి ఎత్తుకునేవారు. చిన్న చిన్న టెక్నీషియన్లకు ఊపిరి పోసేవారు. ఆ రోజుల్లో బడ్జెట్ సినిమాలకు మార్గాన్ని సుగమం చేసింది ఆయనే. మోహన్‌బాబు, అన్నపూర్ణ, నారాయణమూర్తి వంటి నటులు తమదైన ఫోకస్‌ని సాధించింది ఆ కార్ఖానాలోనే. దాసరితో నా బంధుత్వం ఆయన హైస్కూలు రోజుల్నుంచి. నా షష్టిపూర్తి సంచికకి ఆయన రాసిన వ్యాసంలో మొదటి పేరా.. ‘‘ఆయన్ని చూడ్డానికంటే ముందు నేను ఆయన్ని చదివాను. ఆయన సృష్టించిన పాత్రని నా ఒంటికి తగిలించుకున్నాను. ఉత్తమ నటుడిగా బహుమతిని పొందాను.. ఆ నాటిక ‘అనంతం’. ఆయన అరుదైన మిత్రుడు, అమూల్యమైన హితుడు’’. వ్యక్తిగా ఏ చిన్న వ్యక్తిలో, నిర్మాతలో, దర్శకునిలో ‘మెరుపు’ని చూసినా నెత్తికెత్తుకుని– పదిమందికి తెలిపే పెద్ద దిక్కు. పరిశ్రమలో ఏ సమస్యకయినా– ముందు నిలిచే మొండి ధైర్యం. ఇక్కడినుంచి సరాసరి ఢిల్లీ చేరి కేంద్రమంత్రిగా పదవి నెరపుకు రావటం మరో పెద్ద అంగ. ఆఖరుసారి దర్శకమిత్రులు క్రిష్ పెళ్లిలో అక్షింతలు వేసి లిఫ్టు ఎక్కాను. దాసరీ ఎక్కారు. లిఫ్టు కిందకి దిగే లోపున ఆయన తృప్తిగా చెప్పిన విషయం– ‘‘ఈమధ్య ఎనిమిది కిలోల బరువు తగ్గాను మారుతీరావుగారూ’’ అన్నారు. నవ్వాను. ‘‘తగ్గాలి. మీ కోసం కాదు. మా కోసం’’ అన్నాను. ఇద్దరం విడిపోయాం. దాసరి ‘శ్రమ’లో విజయాన్ని ఏరుకున్న పధికుడు. ప్రతి విజయానికీ హృదయాన్ని విశాలం చేసుకున్న ‘మనిషి’. చాలామందికి గురువు, మార్గదర్శి. మహా దర్శకుడు. కానీ.. కానీ.. అందరికీ–నడిచే ఉద్యమం. ఒక తరం సినీ ప్రపంచాన్ని మిరుమిట్లు గొలిపిన ఆకాశం. గొల్లపూడి మారుతీరావు -
శ్రమించండి.. సాధించండి
’గ్రూప్స్’ అభ్యర్థులకు నిపుణుల సూచన గ్రూప్2, 3 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ’సాక్షి’ మీడియా గ్రూప్, రాజూస్ ఐఏఎస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఏలూరులో నిర్వహించిన అవగాహన సదస్సు విజయవంతమైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు హాజరై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పరీక్షలకు ఎలా సిద్ధపడాలి, ఏయే సబ్జెక్టులపై దృష్టి సారించాలనే విషయమై ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రొఫెసర్లు. సబ్జెక్ట్ నిపుణులు అవగాహన కల్పించారు. పుస్తకాల ఎంపికపై సగం విజయం ఆధారపడి ఉంటుందని, బట్టీ విధానం పనికిరాదని, విశ్లేషణాత్మక దృష్టితో చదవాలని, ప్రాధాన్యతాంశాలను గుర్తించాలని సూచించారు. కఠోర శ్రమ, కసితో చదివితే గ్రూప్-1, 2, 3 ఉద్యోగాలు సాధించడం ఏమంత కష్టం కాదని, సమయపాలన, ప్రత్యేక ప్రణాళిక, నిరంతర సాధన, శిక్షణ తోడైతే విజయం ఖాయం అని వక్తలు ఉద్బోధించారు. శనివారం ‘సాక్షి’ దినపత్రిక ‘రాజూస్’ ఐఏఎస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు ఆర్ఆర్పేటలో రాజూస్ అకాడమీలో గ్రూప్స్ అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన సబ్జెక్ట్ నిపుణులు, ప్రొఫెసర్లు, అధికారులు తమ ప్రసంగాల ద్వారా ఉద్యోగార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. -ఏలూరు సిటీ /ఆర్‌ఆర్‌పేట/మెట్రో సదస్సుకు రాజూస్ అకాడమీ డైరెక్టర్ రత్నరాజు అధ్యక్షత వహించగా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎస్ఏ ఖాదర్, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ వి.బ్రహ్మానందరెడ్డి, సర్ సీఆర్ఆర్ పీజీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ ఎల్.వెంకటేశ్వరరావు, పీజీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ తేరా రాజేష్, ఇంగ్లిష్ విబాగాధిపతి ఎంఎస్సీ సోఫియా, ఏలూరు టూటౌన్ సీఐ ఉడతా బంగార్రాజు హాజరయ్యారు. గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రిపరేషన్‌పై అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా ప్రిలిమినరీ మోడల్ పేపర్‌ను అందజేశారు. అభ్యర్థులు ఏ విధంగా పరీక్షలకు సిద్ధమవ్వాలి, ప్రణాళికలు ఎలా రూపొందించుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేశారు. అంతేకాదు తాము ఉద్యోగాలు సాధించే నాటికి, నేడు ఉన్న సామాజిక పరిస్థితులను బేరీజు వేస్తూ వివరణాత్మక సందేశాలను అందించారు. సదస్సుకు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ‘సాక్షి’ అభినందనీయం ‘సాక్షి’ దినపత్రిక సామాజిక బాధ్యతలో భాగంగా ఉద్యోగార్థులకు ఇటువంటి అవగాహన సదస్సులు నిర్వహించటం అభినందనీయమని ఆర్ఐవో ఖాదర్ అన్నారు. ఈ సదస్సు ద్వారా అభ్యర్థుల్లో భయాన్ని పోగొట్టి స్ఫూర్తిని నింపిందన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు తాజా వార్తాల సమాచారం అందించటమే కాకుండా యువతకు, విద్యార్థులకు ప్రయోజనం కలిగించేలా ‘భవిత’ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లు, మెటీరియల్స్, నిపుణుల విశ్లేషణలు ఇస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. యువత కేవలం గ్రూప్స్ ఉద్యోగాలకే పరిమితం కాకూడదన్నారు. రోజూ అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడుతుంటాయని, వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ప్రిపేరవ్వాలని సూచించారు. సదస్సుకు హాజరైన గ్రూప్్స అభ్యర్థులు మాట్లాడుతూ ‘సాక్షి’ నిర్వహించిన ఈ అవగాహన సదస్సు తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కృతజ్ఞతలు తెలిపారు. ఇతరులకన్నా మీరేమీ తక్కువ కాదు చాలామందిలో తాము సాధించగలమా అనే సందేహం ఉంటుంది. అటువంటి వారందరూ ఇతరులకన్నా తామేమీ తక్కువ కాదు అనే విషయాన్ని గుర్తించాలి. సివిల్స్, గ్రూపులు సాధించిన వారు కాస్త ఎక్కువ కష్టపడతారు. అలాంటి కష్టం మీరు కూడా పడితే మీ లక్ష్యాలు సాధించడం చాలా సులభం. అన్నింటికంటే ముఖ్యంగా సమాజంలో ఇతరులకంటే ఉన్నతంగా జీవించాలనే లక్ష్యం ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే తమ లక్ష్యాలు సాధించగలుగుతారు. స్వామి వివేకానంద చెప్పినట్టు అందరూ ఉక్కు నరాలు, ఇనుపకండరాలు కలిగి ఉండాలి. ఫొటో నంబర్ 504 -పి.రత్నరాజు, రాజూస్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ పుస్తకాల ఎంపికతోనే సగం విజయం ఉద్యోగార్థులు తాము ఏ ఉద్యోగానికి సన్నద్ధమౌతున్నారో, దానికి ఏ పుస్తకాలు అవసరమౌతాయో సరిగ్గా ఎంచుకుంటే సగం విజయం సాధించినట్టే. ఉద్యోగం రాకపోతే జీవితం లేదు, సమాజంలో తలెత్తుకు తిరగలేం అనే కసితో చదవాలి. కోరికలను సాఫల్యం చేసుకునే చిత్తశుద్ధి ఉండాలి. మీలో ఉన్న శక్తిని మీరే గుర్తించాలి. సమాజంతో సంబంధంలేకుండా ఎక్కువ సమయం చదువుపై దృష్టి కేంద్రీకరిస్తే ఉద్యోగం మీ పాదాక్రాంతమౌతుంది. ఫొటో నంబర్ 505 : -ఎస్ఏ ఖాదర్, ఆర్ఐవో బట్టీ విధానం పనికిరాదు ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధాన సవాలుగా నిలుస్తోంది. చదువులో ఎంత గొప్ప ప్రతిభ కనబరిచినా భావ వ్యక్తీకరణలో వెనుకబడడం వల్ల అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతున్నారు. వాటిని మరింతగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. మీ తెలివితేటలు భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే విధంగా మీరు అభివృద్ధి సాధించాలి. బట్టీ పట్టే విధానం నేటి రోజుల్లో అస్సలు పనికి రావడం లేదు. రాత్రి 10 గంటల తరువాత నుంచి చదివితే అప్పటి ప్రశాంత వాతావరణానికి చదివింది మెదడులో నాటుకుపోతుంది. ఫొటో నంబర్ 506 : -వి.బ్రహ్మనందరెడ్డి, ఎస్ఎస్ఏ పీవో కోచింగ్ తప్పనిసరి ఏదో ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలని సరిపెట్టుకోవద్దు. పెద్దపెద్ద ఉద్యోగాలు సాధించాలనే ఉన్నత లక్ష్యాల వైపు పయనించండి. మీకు ఉద్యోగం తప్పనిసరి ఐతే ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలి. మనకు తెలియని సబ్జెక్టుపై పట్టు సాధించాలంటే కోచింగ్ ఉండాలి. సాఫ్ట్‌వేర్‌లో జీతాలు ఎక్కువని చాలామంది వాటిపై ఆకర్షితులౌతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా జీతాలు అధికం. పైగా ఉద్యోగ భద్రత ఎక్కువ. ఒక్కసారి కోచింగ్ తీసుకుని వదిలేయవద్దు ఉద్యోగం సాధించే వరకూ కోచింగ్ తీసుకుంటూనే ఉండండి. ఫొటో నం : 507 : -ఉడతా బంగార్రాజు, టూటౌన్ సీఐ విశ్లేషణాత్మకత అవసరం ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారు తాము ఏ పుస్తకం చదివినా ఏ సబ్జెక్ట్ చదివినా అందులో విశ్లేషణాత్మకతను జోడించండి. అటువంటప్పుడే ఒక ప్రశ్నను ఏ కోణంలో అడిగినా జవాబు ఇవ్వడం సులభతరమౌతుంది. ఉద్యోగాలు ఉన్నాయి. కానీ వాటిని చేరుకోవడానికి దగ్గర మార్గాలు లేవని తెలుసుకోవాలి. ఆలోచించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకండి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో ప్రపంచం కుగ్రామమైంది. మీ అరచేతిలోనే సమాచారమంతా అందుబాటులో ఉంటోంది, దానిని సద్వినియోగం చేసుకోండి. ఫొటో నం : 508 : -ఎల్.వెంకటేశ్వరరావు, సీఆర్ఆర్ పీజీ కాలేజీ, అసోసియేట్ ప్రొఫెసర్ ప్రాధాన్యతాంశాలను గుర్తించండి పరీక్షల్లో వచ్చే ప్రాధాన్యతాంశాలను గుర్తించడం అభ్యర్థులకు ముఖ్యం. సిగ్గు, బిడియం, భయాలను ఈ సమయంలోనే విడిచిపెట్టండి. మిమ్మల్ని మీరు మార్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న ఇతర అభ్యర్థులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోండి. వారి ద్వారా మరింత జ్ఞాన సముపార్జన సాధ్యమౌతుంది. సబ్జెక్టుపై చర్చిస్తే దానిపై మనకు తెలియని సందేహాలకు సమాధానలు దొరికే అవకాశముంది. మనసును ప్రశాంతంగా ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే లక్ష్యం సాధించవచ్చు. ఫొటో నం 509 : -డాక్టర్ తేరా రాజేష్, సీఆర్ఆర్ పీజీ కాలేజ్ ఫ్రొఫెసర్ సందేహాలను నివృత్తి చేసుకోండి కోచింగ్ సెంటర్లలో అధ్యాపకులు చెప్పే విషయాలు నిశితంగా గ్రహించండి. ఎటువంటి సందేహాన్నైనా అడిగి తెలుసుకోండి. పక్కవాళ్లు నవ్వుతారనే భావన ముందుగా మీలోంచి తొలగించుకోండి. 99 శాతం కష్టపడేవాళ్లే ఏదైనా సాధించగలుగుతారు. మీలో కూడా నైపుణ్యం ఉంది. దానిని మీరే మరింత మెరుగుపరుచుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం అవసరం. దానిపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. మీ తరువాత తరాలకు మీరు రోల్ మోడల్‌గా ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఫొటో నం 510 : -ఎంఎస్సీ సోఫియా, సీఆర్ఆర్ పీజీ కాలేజ్, ఇంగ్లిష్ విభాగాధిపతి ప్రశ్న- జవాబు ప్రశ్న : ఇంజనీరింగ్ విద్యార్థి గ్రూప్స్‌కు ఎలా సిద్ధపడాలి? వి.నిఖిత, గ్రూప్స్ అభ్యర్థి, ఏలూరు నిపుణుల జవాబు : బీటెక్ చదివిన విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై ఎక్కువ అవగాహన ఉంటుంది. అయితే పోటీ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. వీటిని అంచనా వేసుకుని నిపుణుల సలహాలతో సిద్ధపడితే విజయం తథ్యం. ప్రశ్న : నెగిటివ్ మార్కుల విధానాన్ని ఎలా అధిగమించాలి టిఎస్ఎస్కె పవన్, గ్రూప్స్ విద్యార్థి నిపుణుల జవాబు : నూతన గ్రూప్స్ విధానంలో మైనస్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే విద్యార్థి సరైన జవాబును గుర్తించి మాత్రమే ఆన్సర్ చేయాలి. అంచనాతో జవాబును గుర్తించే విధానాన్ని మానుకోవాలి. గ్రూప్-2 పరీక్షల్లో ఈ నెగిటివ్ విధానం లేదు. గ్రూప్-1లో మాత్రమే నూతనంగా ప్రవేశపెట్టారు. ప్రశ్న : పోలీస్ పరీక్షలకు, గ్రూప్స్‌కు తేడా ఏమిటి? అనిత, గృహిణి, గ్రూప్స్ అభ్యర్థిని నిపుణుల జవాబు : పోలీస్ పరీక్షలకు చేస్తున్న ఫిజికల్ ఈవెంట్స్‌కు కాస్త పోటీ పరీక్షల సిలబస్‌ను జోడిస్తే తప్పక విజయం సాధించవచ్చు. అలాగే పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుని, ఫిజికల్ పరీక్షలకు శిక్షణ తీసుకోకుంటే పోలీస్ ఉద్యోగం సాధించడం కష్టం. రెండు అంశాలపైనా దృష్టిసారిస్తే విజయం సాధించవచ్చు. ప్రశ్న : తక్కువ సమయంలో విజయం సాధించడం ఎలా? ఎన్.సుస్మిత, గ్రూప్స్ అభ్యర్థిని నిపుణుల జవాబు : సమయం తక్కువ ఉన్నందున గ్రూప్స్ అభ్యర్థులు ప్రస్తుతం పూర్తిగా ప్రిలిమినరీపైనే దృష్టి కేంద్రీకరించాలి. మెయిన్స్ సిలబస్‌పై ప్రిలిమ్స్ అయిన మరుక్షణం దృష్టి సారించాలి. ప్రశ్న : ఎగ్జామ్‌లో సమయాన్ని ఎలా కేటాయించాలి? వెంకటేశ్వరరావు, గ్రూప్స్ విద్యార్థి, చోడవరం, నల్లజర్ల నిపుణుల జవాబు : గ్రూప్స్ ప్రిలిమ్్స ఎగ్జామ్ పేపర్లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో బిట్‌కు 30 సెకన్ల నుంచి ఒక నిమిషం కేటాయిస్తే సమయం సరిపోతుంది. లేకుంటే చివరిలో తీవ్ర గందరగోళంగా ఉండి ఏ ప్రశ్నకూ సరైన సమాధానం గుర్తించలేం. పోటీ పరీక్షల్లో సమయ పాలన అనేది చాలా ముఖ్యం. -
దీపావళి వెలుగుల వెనుక చీకటి బతుకులు
-
విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి
రెంటచింతల: దశాబ్దాలుగా నిరాదరణకు గురైన విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ సింహాద్రి కనకాచారి అన్నారు. సోమవారం ఆయన విశ్వబ్రాహ్మణుల సమావేశంలో మాట్లాడుతూ 5 వృత్తులతో జీవితాలను కొనసాగించేది ఒక్క విశ్వబ్రాహ్మణులేనని, వారు ఉమ్మడి రాష్ట్రంలో 60 లక్షల మంది ఉండగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల నుంచి 30 లక్షల మంది ఉన్నారన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుకు గురైన విశ్వబ్రాహ్మణులకు 2015–16లో రూ. 19 కోట్లను, 2016–17కిగానూ రూ. 22 కోట్లను ప్రభుత్వం కేటాయిందన్నారు. సొసైటీగా ఏర్పడితే విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని తమ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కృష్ణానది పుష్కరాలలో భాగంగా సత్రశాలలో పుణ్యస్నానాలు ఆచరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లా అధ్యక్షులు కొమరిగిరి కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు చిలకపాటి బ్రహ్మయ్య పాల్గొన్నారు. -
అప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు!
జీవితంలో దేన్నీ అంత సులువుగా వదులుకోకూడదని చాలామంది బలంగా ఫిక్స్ అవుతారు. నయనతార ఈ కోవకే వస్తారు. మరీ సాధ్యం కానివి వదులుకుంటారు తప్ప చాలావరకూ అన్నింటినీ సాధించేస్తారు. అది సినిమాలైనా.. వ్యక్తిగత విషయాలైనా. నయనతారకు తన మీద తనకు నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకం, హార్డ్‌వర్కే నన్ను నడిపిస్తున్నాయని ఆమె అంటున్నారు. ఇంకా ఆత్మవిశ్వాసం గురించి నయనతార మాట్లాడుతూ - ‘‘బతికినంత కాలం ధైర్యంగా, హాయిగా బతకాలంటే ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. మనం ఏ విధంగా ఉన్నామనే దాన్నిబట్టే ఎదుటి వ్యక్తులు మన గురించి ఓ అంచనాకు వచ్చేస్తారు. ఆత్మన్యూనతా భావంతో కనిపిస్తే.. ఎదుటి వ్యక్తులు మనల్ని ఇంకా తగ్గించడానికి ట్రై చేసే అవకాశం ఉంది. ఆ చాన్స్ వాళ్లకు ఇవ్వకూడదంటే మనం ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. ఎవరికీ తక్కువ కాదన్నట్లుగానే కనిపించాలి... ప్రవర్తించాలి. అలాగే అహంభావానికీ, ఆత్మవిశ్వాసానికీ తేడా తెలుసుకోవాలి. మన తీరు తిన్నగా ఉంటే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు’’ అన్నారు. నయనతార మాటలు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి కదూ! -
కష్టంలోనే ఆనందం
మంత్రాలయం రూరల్/కౌతాళం (కర్నూలు): ఖరీఫ్ సీజన్ మొదలై నెల రోజులు గడిచిపోయినా చినుకు జాడ కరువైంది. పనులు లేకపోవడం... పనిచేసే చేతులతో ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేని కొందరు కర్నూలు జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో కాడెద్దులుగా మారి పొలాలను దుక్కిదున్నతున్నారు. మంత్రాలయం మండలం రచ్చుమర్రి గ్రామానికి చెందిన..రమేష్, ఉరుకుందు మంగళవారం తెల్లవారుజామున 3 నుంచి 7 గంటల వరకు ఆరెకరాల పొలాన్ని దుక్కిదున్నారు. అలాగే కౌతాళం మండలం పొదలకుంట గ్రామానికి చెందిన సిద్దప్ప, బుడదొడ్డిలు... తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10గంటల వరకు మూడు ఎకరాల్లో నాగలితో దుక్కిదున్నారు. ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం కన్నా పొలంలో ఇలా పనిచేయడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. -
ఆ నరకమే హాయిగా అనిపించింది!
‘‘గ్లామర్ పాత్రలకే పరిమితమైపోతే నాకు నేనే బోర్ కొట్టేస్తాను. దాంతో పాటే ప్రేక్షకులకూ బోర్ కొట్టేస్తాను. అందుకే విభిన్నంగా ఉండే పాత్రకు అవకాశం వస్తే.. ఎంతైనా కష్టపడటానికి నేను రెడీ’’ అని తాప్సీ చెప్పారు. అన్నట్లుగానే ‘ముని 3’ కోసం బాగా కష్టపడుతున్నారామె. ఈ చిత్రం కోసం తీసిన ఓ సన్నివేశం కోసం తొమ్మిది గంటల పాటు ఆమె నీళ్లల్లో ఉండాల్సి వచ్చింది. రెండు రోజుల్లో తీద్దామని దర్శకుడు లారెన్స్ అన్నప్పటికీ ఒకే రోజులో తీస్తేనే ఎమోషన్ సరిగ్గా పండుతుందని తొమ్మిది గంటలు నీళ్లల్లో ఉన్నారట. ఫలితంగా నీటిలోంచి బయటికొచ్చేసరికి తాప్సీ ఒళ్లంతా నానిపోయిందట. అయినా తేలిగ్గా తీసుకున్నానని తాప్సీ అంటున్నారు. ఇంకా ఈ చిత్రం కోసం చేసిన మరో క్లిష్టమైన సన్నివేశం గురించి తాప్సీ చెబుతూ -‘‘చెన్నయ్ బీచ్‌లో ఈ యాక్షన్ సీన్ చేశాం. బీచ్‌లోని ఇసుకలో నన్ను ఈడ్చుకెళ్లేట్లు సీన్ అన్నమాట. ఇసుక, చిన్న చిన్న రాళ్లతో నా వళ్లు హూనం అయిపోయింది. ఈ ఫైట్‌ని మూడు రోజులు చేశాం. నరకం కనిపించింది. కానీ, ఆ నరకమే హాయిగా అనిపించింది. ఎందుకంటే, నటిగా పూర్తి సంతృప్తి లభించింది’’ అని చెప్పారు. -
నేనో టాస్క్ మాస్టర్ని!
హార్డ్ వర్క్ చేస్తాను.. చేయిస్తాను పిల్లలూ వెన్నెల్లో ఆడుకోండి 2024 వరకు నా ప్రభుత్వానికి ఢోకాలేదు: ప్రధాని మోడీ న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక వినూత్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. భావి భారత పౌరుల భావనలను అర్థం చేసుకునేందుకు వారిలో ఒకడిగా మారారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. పిల్లల్లో పిల్లాడిలా కలసిపోయారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. చలోక్తులు విసురుతూ నవ్వులు పంచారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘మోడీ సర్’గా మారారు. విద్యారంగానికి సంబంధించినంతవరకు బాలికావిద్య తన అత్యంత ప్రాథమ్యాంశమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. డ్రాపౌట్లను తగ్గించేందుకు బాలికల ఇళ్లకు దగ్గరలో పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరానన్నారు. అన్ని పాఠశాలల్లో టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని మానెక్షా ఆడిటోరియంలో ఎంపికచేసిన వెయ్యిమంది విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని, అనంతరం దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని ఇచ్చిన సమాధానాలను దాదాపు అన్ని స్కూళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. తానొక టాస్క్ మాస్టర్‌నని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. ‘నేనొక పని రాక్షసుడిని. చాలా హార్డ్ వర్క్ చేస్తాను. ఇతరులతోనూ చేయిస్తాను’ అన్నారు. దేశంలో విద్యారంగ ప్రాముఖ్యత పెరుగుతోందని, అదేసమయంలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోందని ప్రధాని అన్నారు. అందువల్ల చదువుకున్నవారంతా బోధనను ఒక ఉద్యమంలా చేపట్టి జాతి నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. బోధనలో సాంకేతిక సౌకర్యాల్ని ఉపాధ్యాయులు ఉపయోగించుకోవాలని, అలా చేయకపోతే సామాజిక నేరంగా పరిగణిస్తామని మోడీ హెచ్చరించారు. పాఠ్యపుస్తకాలు, టీవీ, కంప్యూటర్లలో పిల్లల జీవితం నలిగిపోవద్దని, జీవితంలో ఆటపాటలు ఉండాలన్నారు. గూగుల్‌లో సమాచారం లభిస్తుంది కానీ.. జ్ఞానం లభించదని వ్యాఖ్యానించారు. అంతకుముందు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ప్రధాని నివాళులర్పించారు. కాగా, తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మోడీ ప్రసంగ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. కేరళలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని చానెల్లో కూడా ఆ కార్యక్రమం ప్రసారం చేయలేదు. గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. టీచర్లు కొవ్వొత్తుల్లాంటి వారని, ప్రతిఫలాపేక్ష లేకుండా తాము కాలిపోతూ వెలుగులను వెదజల్లుతారన్నారు. విద్యార్థులతో ప్రధాని ముఖాముఖి మణిపూర్‌కు చెందిన ఒక విద్యార్థి తాను ప్రధాని కావాలంటే ఏం చేయాలని అడగ్గా.. .‘నువ్వు తప్పకుండా అవుతావు. ప్రజల విశ్వాసాన్ని, ప్రేమను పొందిన ఎవరైనా అవుతారు. మరో పదేళ్ల పాటు నా ప్రభుత్వమే ఉంటుంది. అప్పటివరకు నాకు భయంలేదు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కా. నీ ప్రమాణానికి నన్నుపిలువు’ అని నవ్వారు. బాల్యాన్ని కోల్పోకండి. పఠనాభిలాషను పెంచుకోండి. పరిశుభ్రతపై దృష్టి పెట్టండి. నైపుణ్యాలను పెంచుకోండి. వ్యక్తిత్వాన్ని రూపొందించుకోండి. విద్యుత్ పొదుపు, జల సంరక్షణ కూడా దేశసేవయే. మీరు ఇంట్లో చేసే విద్యుత్ పొదుపుతో బిల్లు తగ్గడమే కాదు, ఒక పేదవాడింట్లో దీపం వెలుగుతుంది. దీపాలార్పేసి పున్నమి రాత్రుల్ని ఆస్వాదించండి. {పధాని అవుతానని నేనెన్నడూ అనుకోలేదు. నా కుటుంబ నేపథ్యం అలాంటిది. స్కూల్ లీడర్‌గా కూడా నేనెన్నడూ పోటీ చేయలేదు. జపాన్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాఠశాలను శుభ్రం చేసుకుంటారు. విద్యార్ధి దశలో అల్లరి పనులు చేయని వారుంటారా..? నేనూ చేశా.పెళ్లిలో సన్నాయి వాయించే వ్యక్తి ముందుకు వెళ్లి చింతకాయ చూపించేవాళ్లం. ఆయన నోరూరి వాయించేవాడు కాదు. పక్కపక్కనిల్చున్నవారి దుస్తులను కలిపి పిన్ను కొట్టేవాళ్లం. తల్లి తన పిల్లల్ని చూసినట్లుగా.. ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ ఒకేరకంగా చూడాలి. వివక్ష ప్రదర్శించకూడదు.వాతావరణం మారలేదు.. మనమే. మన అలవాట్లు మారాయి. ప్రకృతితో పోరాడుతున్నాం. అందువల్లే మన పర్యావరణం నాశనమైంది. ప్రకృతిని ప్రేమించండి. {పధాని అయిన తరువాత జాగ్రత్తగా ప్రసంగించాల్సి వస్తోంది. నా మాటల వల్ల దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లకూడదు కదా! {పధాని కావడం వల్ల వ్యక్తిగతంగా నాలో ఏ మార్పు లేదు. బాధ్యత మాత్రం పెరిగింది. నన్ను నేను ఇంకా ఆవిష్కరించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు నేనెవరో నేను తెలుసుకోలేకపోయాను.టెక్నాలజీ విద్యార్ధుల వరకు చేరాలి. ఇంటర్నెట్, బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీ ద్వారా కొత్త విషయాలపై అధ్యయనంఅలవాటవుతుంది.ప్రతీ విద్యార్ధి శుభకార్యాలకు టీచరును పిలవాలి.