
భారత స్టార్ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ ఈ ఏడాది జులైలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ పూర్తి దృష్టి బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలపైనే ఉంది. దీని కోసం ఆమె చెమటలు కక్కుతోంది తన కసరత్తుల వీడియో ను మేరీ కోమ్ సోషల్ మీడియా యాప్ కూ లో షేర్ చేసింది, విజయానికి కృషి మాత్రమే అవసరమని రాసింది.
షార్ట్‌కట్ పద్ధతిలో ప్రయత్నించినా ఫలితం ఉండదని కష్టపడి పనిచేయాల్సిందే అంటోంది. బాక్సింగ్ ప్రాక్టీస్ తర్వాత, మేరీ కోమ్ మధ్యాహ్నం జిమ్‌కి వెళుతుంది. పుష్-అప్స్ సిట్-అప్‌లు, అలాగే హెవీ వెయిట్ లిఫ్టింగ్ వంటి బాడీ వెయిట్ వ్యాయామాలతో కండరాలను బలంగా ఉంచుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment