ఘజియాబాద్: ఇటీవలి కాలంలో గుండెపోటు కారణంగా ఎంతో మంది అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వర్కవుట్ చేస్తూ సడెన్‌గా కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ కాలేజీ యువకుడు జిమ్‌లో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. గజియాబాద్‌కు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సిద్దార్థ్ కుమార్ సింగ్(19) అనే యువకుడు శనివారం జిమ్‌కు వెళ్లి వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా.. సడెన్‌గా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో, అక్కడే ఉన్న జిమ్‌లో మరో ఇద్దరు వ్యక్తులు సింగ్ దగ్గరకు వచ్చి అతడిని పైకి లేపే ప్రయత్నం చేశారు. అనంతరం, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సింగ్ పరిశీలించిన వైద్యులు.. సిద్ధార్థ్ అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు.
A 19 years old boy died while running on trademill in the gym at #Ghaziabad #gym #Running pic.twitter.com/jsOa0aA3C3
— Gulshan Nandaa (@Gulshann_nandaa) September 16, 2023
ఇక, జిమ్‌లో సిద్దార్థ్ మృతిచెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగ్ మృతితో పేరెంట్స్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక, సిద్ధార్ధ్ వారి పేరెంట్స్‌కు ఒక్కడే కుమారుడు. సిద్ధార్థ్ తన తండ్రితో ఘజియాబాద్‌లో ఉంటుండగా.. అతని తల్లి బీహార్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. సింగ్ మృతికి 10 నిమిషాల ముందే తన తల్లితో మాట్లాడాడు. ఇంతలోనే ఇలా జరగడంతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఇది కూడా చదవండి: భిక్షమెత్తుకొని పొట్టనింపుకునేది.. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్‌గా సూపర్ క్రేజ్
Comments
Please login to add a commentAdd a comment