మంత్రాలయం రూరల్/కౌతాళం (కర్నూలు): ఖరీఫ్ సీజన్ మొదలై నెల రోజులు గడిచిపోయినా చినుకు జాడ కరువైంది. పనులు లేకపోవడం... పనిచేసే చేతులతో ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేని కొందరు కర్నూలు జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో కాడెద్దులుగా మారి పొలాలను దుక్కిదున్నతున్నారు. మంత్రాలయం మండలం రచ్చుమర్రి గ్రామానికి చెందిన..రమేష్, ఉరుకుందు మంగళవారం తెల్లవారుజామున 3 నుంచి 7 గంటల వరకు ఆరెకరాల పొలాన్ని దుక్కిదున్నారు.
అలాగే కౌతాళం మండలం పొదలకుంట గ్రామానికి చెందిన సిద్దప్ప, బుడదొడ్డిలు... తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10గంటల వరకు మూడు ఎకరాల్లో నాగలితో దుక్కిదున్నారు. ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం కన్నా పొలంలో ఇలా పనిచేయడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.