
వెల్లివిరిసే ఆత్మీయత
రమజాన్ కాంతులు
ఆత్మీయతాభావం వెల్లివిరిసే రమజాన్ మాసం ముఖ్యంగా ఆత్మక్షాళన మాసం. మనల్ని మనం ఆధ్యాత్మికతకు పునరంకితం చే సుకునే మాసం. వ్యక్తి జీవన విధానంలో చైతన్యాన్ని ప్రేరేపించే మాసం. క్రమశిక్షణను నేర్పే మాసం. ఈ మాసంలో దైవప్రసన్నతను భక్తుడు తనివితీరా గ్రోలుతాడు. తన ఆరాధనలచే దేవుని కరుణాకటాక్షాలను మెండుగా పొందుతాడు. విశ్వమానవ సౌభ్రాతృత్వం ఎల్లెడలా వెల్లివిరుస్తుంది. అందరిలో పరస్పరం ఆత్మీయతాభావం కలుగుతుంది.
దైవంపై విశ్వాసం ద్విగుణీకృతమవుతుంది. పవిత్ర ఖుర్ ఆన్ అవతరింపంబడిన మాసం ఇది. స్థితిపరులు నిరుపేదలకు దానధర్మాలు చేస్తారు. ఈ మాసం ఆద్యంతం దైవానుగ్రహాలు వర్షింపబడతాయి. పుణ్యకార్యాలపట్ల ఆకాంక్ష, పాపకార్యాల పట్ల వైముఖ్యం కలుగుతుంది. «ధనికులు ఈ మాసంలో పేదలకు జకాత్, ఫిత్రా, సదకా వంటి దానధర్మాలు నిర్వర్తిస్తారు.
– షేఖ్ అబ్దుల్ హఖ్