
న్యూఢిల్లీ: వరుసగా మూడో పర్యాయం ప్రధాని పదవిని చేపడతానని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. తమ మూడో పర్యాయంలో మెరుగైన వృద్ధిరేటుతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు.
13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారనే నీతి ఆయోగ్ నివేదికను ప్రస్తావిస్తూ భారత్ తప్పకుండా పేదరిక నిర్మూలన సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టినపుడు భారత్ ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా... ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు.