Prime Ministers post
-
PM Narendra Modi: మూడోసారీ మేమే...
న్యూఢిల్లీ: వరుసగా మూడో పర్యాయం ప్రధాని పదవిని చేపడతానని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. తమ మూడో పర్యాయంలో మెరుగైన వృద్ధిరేటుతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు. 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారనే నీతి ఆయోగ్ నివేదికను ప్రస్తావిస్తూ భారత్ తప్పకుండా పేదరిక నిర్మూలన సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టినపుడు భారత్ ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా... ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు. -
రాజవంశీకురాలు పోటీ చేయడమేమిటి?
బ్యాంకాక్ : తన సోదరి ఉబోల్ రతన(67) ప్రధాని పదవికి పోటీ చేస్తాననడం పట్ల థాయ్లాండ్ రాజు మహా వజ్రలాంగ్కోర్న్ విముఖత వ్యక్తం చేశారు. రాచరిక సంప్రదాయాలకు విరుద్ధంగా ఓ రాజవంశీకురాలు ఎన్నికల్లో పోటీ చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘ రాజు, రాజవంశీకులు రాజకీయాలకు అతీతం. రాజవంశీకులను రాజకీయ వ్యవస్థలో భాగస్వాములు చేయాలనుకోవడం రాచ, థాయ్ సంప్రదాయాలకు విరుద్ధం. ఇలా చేయడం సరైంది కాదు. రాచరికాన్ని, ప్రతిష్టను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక యువరాణిగా ప్రజలకు ఆమె అందించిన సేవలు ఆదర్శనీయం’ అంటూ ఉబోల్ రతనను ప్రశంసిస్తూ, ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన పార్టీని విమర్శిస్తూ రాయల్ గెజిట్ను విడుదల చేశారు. కాగా థాయ్లాండ్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఉబోల్ రతన శుక్రవారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. థాయ్ మాజీ ప్రధాని థక్షిన్ షినవ్రతకు చెందిన ‘థాయ్ రక్ష చార్త్ పార్టీ’ తరఫున పోటీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో ఇన్నాళ్లుగా విజయం తమదే అన్న విశ్వాసంతో ఉన్న సైనిక పాలకుల్లో ఆందోళన మొదలైంది. అయితే రతన తన నిర్ణయం ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాయల్గెజిట్ వెలువడటం గమనార్హం. ఇక 1972లో అమెరికా దేశస్తుడు పీటర్ జెన్సెన్ను వివాహం చేసుకున్న రతన, రాచరిక గౌరవాలను వదులుకున్నారు. ఏకైక కొడుకు మరణం, భర్తతో విడాకులు తర్వాత రాచ కుటుంబ సభ్యురాలిగానే కొనసాగుతున్నారు. -
‘ప్రధాని’ రేసులో థాయ్ యువరాణి
బ్యాంకాక్: థాయ్లాండ్ ప్రధాన మంత్రి పదవికి జరిగే ఎన్నికల బరిలో ఉంటానని యువరాణి ఉబోల్ రతన ప్రకటించారు. థాయ్ రాజు మహా వజ్రాలంగ్కోర్న్ సోదరి అయిన రతన..మాజీ ప్రధాని థక్షిన్ షినవ్రతకు చెందిన థాయ్ రక్ష చార్త్ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు తెలిపారు. ‘పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఉబోల్ రతన అభ్యర్థిత్వాన్ని ఖాయం చేశాం’ అని థాయ్ రక్ష చార్త్ పార్టీ నేత ప్రీచాపొల్ పొంగ్పనిచ్ తెలిపారు. 1972లో అమెరికా దేశస్తుడు పీటర్ జెన్సెన్ను వివాహం చేసుకున్న రతన, రాచరిక గౌరవాలను వదులుకున్నారు. ఏకైక కొడుకు మరణం, భర్తతో విడాకులు తర్వాత రాచ కుటుంబ సభ్యురాలిగానే కొనసాగుతున్నారు. గెలుపు తమదే అనే ధీమాతో ఉన్న సైనిక పాలకులకు రతన నిర్ణయం శరాఘాతంగా మారింది. -
నేపాల్ పీఠంపై ప్రచండ!
కఠ్మాండు: నేపాల్ మావోయిస్టు పార్టీ చీఫ్ ప్రచండ రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారు. నేడు ప్రధాని పదవికి ఎన్నిక జరగనుండగా చివరి నిమిషంలో సీపీఎన్-యూఎంఎల్ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో ప్రచండ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మధేసి ప్రాంత పార్టీల నుంచి కీలక మద్దతు లభించడంతో మంగళవారం ఆయన నామినేషన్ వేశారు. ప్రచండ అభ్యర్థిత్వాన్ని నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ) నేత దేవ్బా ప్రతిపాదించగా మావోయిస్టు నేత మహరా బలపరిచారు. కొత్త ప్రభుత్వానికి మధేసి పార్టీలు మద్దతిచ్చేలా, మావోయిస్టు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయి. 595 మంది సభ్యులున్న పార్లమెంట్లో మధేసీ పార్టీల బలం 42 మంది. ప్రభుత్వంలోనూ చేరతామని ఇవి సంకేతాలిచ్చాయి. మావోయిస్టు పార్టీ మద్దతు వాపసుతో యూఎంఎల్ నేత ఓలి ప్రధాని పదవికి గతవారం రాజీనామా చేశారు.