Poverty alleviation
-
అసమానతల భారతం
ప్రపంచం ముందుకు పోతోంది... దేశం శరవేగంతో సాగిపోతోంది... అని పాలకులు భుజాలు ఎగరేస్తున్న వేళ కళ్ళు తిరిగే గణాంకాల లెక్క ఇది. అభివృద్ధి, ఆర్థిక పురోగతిలో కొందరు అంతెత్తున ఉంటే, అనేకులు అధఃపాతాళంలోనే ఉన్నారని తేలింది. భారతదేశంలో ఆదాయం, సంపదల్లో అస మానతలు గడచిన శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా తారస్థాయికి చేరాయని ‘వరల్డ్ ఇనీక్వా లిటీ ల్యాబ్’ అధ్యయన పత్రం వెల్లడించింది. నోబెల్ బహుమతి గ్రహీత థామస్ పికెట్టీ సహా నలుగురు ప్రసిద్ధ ఆర్థికవేత్తలు రూపొందించిన ఈ పత్రం ప్రపంచంలో అసమానత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని తెలిపింది. ఆదాయ అసమానతలో మన దేశం దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికాలను సైతం వెనక్కి నెట్టేసింది. బ్రిటీషు పాలనలో కన్నా ఇప్పుడే భారత్‌లో అసమానతలు ఎక్కువయ్యా యట. ఇది ఆందోళన రేపుతోంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. ‘భారతదేశ ఆదాయం, సంపదల్లో అసమానత 1922 – 2023: బిలియనీర్ల రాజ్య ఆవిర్భావం’ అనే ఈ పత్రం అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. 2000ల నుంచి దేశంలో అసమానతలు తారాపథానికి దూసుకుపోయాయి. ప్రస్తుతం దేశ సంపదలో 40 శాతం పైగా కేవలం ఆర్థిక బలసంపన్నులైన అగ్రశ్రేణి 1 శాతం మంది దగ్గరే పోగుబడింది. దేశ ఆదాయం లెక్కన చూస్తే 22.6 శాతం ఈ కొందరి వద్దే ఉంది. ఇక, కింది 50 శాతం జనాభా జాతీయ ఆదాయం మాత్రం 15 శాతమే. వెరసి, గడచిన ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేనట్టు అత్యధిక స్థాయిలో ఒకేచోట సంపద పోగుబడుతోంది. మరో ముఖ్య విషయమేమంటే, భారత్‌లో ఆర్థిక సమాచార నాణ్యత అంతంతే గనక వాస్తవిక అసమానతా స్థాయులతో పోలిస్తే పత్రంలో పేర్కొన్న అంచనాలు ఇంకా తక్కువేనట. పైనున్న వర్గాలు పైపైకి పోతుంటే, కింది వర్గాలు ఇంకా కిందకు పోయేలా ఆర్థిక అసమానతలు పెరగడం ఆందోళన రేపుతోంది. సమాజంలో అశాంతి, అస్థిరత పెచ్చరిల్లే ముప్పుంది. ఇలాంటి అంతర్జాతీయ నివేదికలే కాదు దేశంలోని స్థానిక నివేదికలు సైతం అసమానతల్ని పట్టిచూపుతున్నాయి. కర్ణాటకలోని ప్రగతివాద బృందాల సమ్మేళనమైన ‘బహుత్వ కర్ణాటక’ సైతం దేశంలో, ముఖ్యంగా కన్నడ సీమలో పెరుగుతున్న ఆదాయ అసమానతల్నీ, ఉపాధి రంగంలోని ఆందోళనకరమైన ధోరణుల్నీ ఈ మధ్యే తన నివేదికలో వివరించింది. ఆర్థికాభివృద్ధి, ఉపాధి వృద్ధి, ఆదాయ సమానత అంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ‘గ్యారెంటీ’ ప్రకటనలకూ, క్షేత్రస్థాయి వాస్తవాలకూ మధ్య ఉన్న అంతరాన్ని వెల్లడించింది. నిజానికి, కేంద్రంలోని ప్రస్తుత పాలకులు పదేళ్ళ క్రితం అభివృద్ధి, ఆర్థిక సంస్కరణల అజెండాతో గద్దెనెక్కారు. తమ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.4 శాతం వంతున వృద్ధి చెందిందనీ, ముఖ్యంగా 2023లో ఆఖరి మూడు నెలల్లో అత్యంత వేగంగా ఈ పురోగతి సాగిందనీ వారు జబ్బలు చరుస్తున్నారు. అయితే, వారు అధికారంలో ఉన్న ఈ రెండుసార్లలోనే బీద, గొప్ప తేడా బాగా పెరిగిందనేది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ. పైపెచ్చు, ఢిల్లీ సర్కార్ శతకోటీశ్వరులకు సన్నిహితంగా మెలుగుతోందని ఆరోపణలు సరేసరి. గమనిస్తే 1991నాటి ఆర్థిక సరళీకరణ ఆసరాగా దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరిగింది. 1991లో వారి సంఖ్య కేవలం 1 కాగా, 2022 నాటికి 162కు పెరిగిందని ఫోర్బ్స్ పత్రిక కథనం. పికెట్టీ తాజా పత్రం ఫోర్బ్స్తో పాటు పలు పత్రికలనూ, ఇతర అధ్యయనాలనూ ఉటంకించింది. అవన్నీ దేశంలో ధనికులకూ, గ్రామీణ నిరుపేదలకూ మధ్య అంతరం పెరుగుతోందని నిర్ధారిస్తున్నాయి. అయితే, ప్రపంచంలో అసమానత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటనే మాట సత్యదూరమనే వారూ లేకపోలేదు. పికెట్టీ అధ్యయన విధానం పారదర్శకంగా లేదనీ, అసమానతల్ని పెంచి చూపేలా ఫోర్బ్స్ వగైరా నుంచి సంపన్నుల జాబితాలను ఎంచుకుంటున్నారనీ దశాబ్ద కాలంగా విమర్శకుల అభ్యంతరం. అయితే ఎంత ఎక్కువనే మాట పక్కనపెడితే... దేశంలో ఆర్థిక అసమానతలు ఇప్పటికీ గణనీయంగా ఉన్నాయనేది ఎవరూ కాదనలేనిది. వాటిని తగ్గించడానికి ప్రయత్నించడమే కర్తవ్యం. దారిద్య్రాన్ని తగ్గించడానికి వీలుగా వృద్ధిపై పెట్టడం వల్ల ఇటు ఆదాయ, సంపదల్లో అసమాన తలు పెరిగినప్పటికీ అదే పంథాను అనుసరించాలా అన్నది మరో ప్రాథమిక ప్రశ్న. 1960 – 80ల మధ్య పై శ్రేణిలోని 10 శాతంతో పోలిస్తే, దిగువనున్న 90 శాతం మంది గణనీయంగా వృద్ధి సాధించారు. ఆర్థికసరళీకరణ అనంతరం మాత్రం మిగతా జనాభా కన్నా అగ్రశ్రేణి వర్గమే పైకెదిగింది. ఇక, 2014–2022 నడుమ దిగువ 50 శాతంతో పోలిస్తే, మధ్య 40 శాతం జనాభా వృద్ధి నిదానించింది. అగ్రస్థాయి 10 శాతం వారి పురోగతేమో ఆపలేని వేగం అందుకుంది. ధనిక, పేద తేడాకు ఇది ప్రధాన కారణం. మొత్తానికి గత దశాబ్దిన్నరలోనే అసమానతలు హెచ్చాయనేది నిర్వివాదాంశం. శతకోటీశ్వరుల సంఖ్య పెరిగిందనే వాస్తవాన్ని గుర్తిస్తే... ఆర్థిక వ్యత్యాసాల్ని చక్కదిద్దడానికి తాజా పత్ర రచయితలు చేసిన కొన్ని విధాన సూచనల్ని కొట్టిపారేయలేం. సంపద పంపిణీ దృష్ట్యా చూస్తే, పేదలతో పోలిస్తే ధనికులు తక్కువ పన్నులు కట్టే ఇప్పటి విధానంలో మార్పు తేవాలి. ఆదాయం, సంపదలు రెంటినీ పరిగణించేలా పన్ను షెడ్యూల్‌ను పునర్వ్యవస్థీకరించి, భారత్‌లోని బిలియనీర్ల పైన సూపర్ ట్యాక్స్ విధించాలని వారు సూచిస్తున్నారు. అలాగే, బీదాగొప్ప తేడాల్ని తగ్గించేందుకు వ్యూహాత్మక దీర్ఘకాలిక విధానాలపై దృష్టి సారించాలి. స్వల్పకాలిక వరాల కన్నా సుస్థిర, దీర్ఘకాల దారిద్య్ర నిర్మూలన పథకరచన సాగించాలి. సంక్లిష్టమైన ఈ వృద్ధి, దారిద్య్రం, ఆర్థిక అసమానత లాంటి అంశాలపై మరింత లోతైన అధ్యయనం చేయాలి. ప్రజాస్వామ్య భారతం ధనికస్వామ్యంగా మారితేనే కష్టం, నష్టం. -
PM Narendra Modi: మూడోసారీ మేమే...
న్యూఢిల్లీ: వరుసగా మూడో పర్యాయం ప్రధాని పదవిని చేపడతానని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. తమ మూడో పర్యాయంలో మెరుగైన వృద్ధిరేటుతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు. 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారనే నీతి ఆయోగ్ నివేదికను ప్రస్తావిస్తూ భారత్ తప్పకుండా పేదరిక నిర్మూలన సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టినపుడు భారత్ ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా... ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు. -
ఆర్థిక అసమానతల తగ్గింపు కన్నా పేదరిక నిర్మూలనకే ప్రాధాన్యం
ప్రపంచంలో ఇంకా సూటిగా చెప్పాలంటే భారతదేశంలో పేదరికం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుతున్న నేపథ్యంలో అదే సమయంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ఇప్పుడు చర్చ కేంద్రీకృతమౌతోంది. దేశంలో దారిద్య్రం మాయమౌతున్న క్రమంలో ప్రజల్లో ఆర్థిక వ్యత్యాసాలు వృద్ధి చెందడం అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తుందని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కిందటి దశాబ్దంలో (2011–2021) ఇండియాలో వరుసగా 2014, 2015లో అనావృష్టి పీడించింది. 2020 - 22 మధ్య కొవిడ్-19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఫలితంగా పేదరిక నిర్మూలక లక్ష్యం అనుకున్నంతగా ముందుకు సాగలేదు. సదుద్దేశంతో అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) దశాబ్దం చివర్లో ఆర్థిక వ్యవస్థను కొంత ఇబ్బంది పెట్టినా తర్వాత ఆర్థికరంగం తిరిగి ప్రగతిపథంలో పయనించింది. ఇప్పుడు పారిశ్రామిక దేశాల్లో మాదిరిగానే ఇండియాలో కూడా ఆర్థిక అసమానతలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయనే మాటలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. గత మూడు దశాబ్దాల్లో ఆర్థిక ప్రపంచీకరణ వల్ల అత్యధిక దేశాల్లో పేదరికం గణనీయంగా తగ్గింది. పూర్వం వర్ధమాన దేశంగా ముద్రపడిన ఇండియాలో దారిద్య్రం మున్నెన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో అంతరించింది. కాని, కొవిడ్ మహమ్మారి ఫలితంగా ప్రపంచంలో ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని ప్రపంచ ఆర్థిక అసమానత నివేదిక–2022 వెల్లడించింది. 1990ల మధ్య నుంచీ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఒక శాతం జనాభా ప్రపంచంలో 38 శాతం సంపదను తమ చేతుల్లోకి తెచ్చుకోగలిగారు. 2020 తర్వాత ఇదే ధోరణి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. పేదరిక నిర్మూలనే మొదటి లక్ష్యం కావాలి, అసమానతలు తర్వాత రూపుమాపవచ్చు! అయితే, ఆర్థిక అసమానతలు రూపుమాపడం కన్నా ఇండియాకు పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ఉండాలని నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అరవింద్ పనగఢియా ఇటీవల ఓ ఇంగ్లిష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘అసలు ఆర్థిక అసమానతలు ప్రతి దేశంలో ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే నేను ఎక్కువగా పట్టించుకునేది అక్కడ ఇంకా పూర్తిగా తొలగిపోని పేదరికం. నా లెక్క ప్రకారం దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు ఆందోళన కలిగించే స్థాయిలో కనపడడం లేదు. వాస్తవానికి 2021 - 22 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (ఏటా చేసే శ్రామికశక్తులపై అధ్యయనం) చూస్తే భారత్‌లో అసమానతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) నగర ప్రాంతాల్లో కేంద్రీకృతమవ్వడం వల్ల ఆర్థిక సంక్షోభాల ప్రభావం ఆ కాలంలో రవాణా, నిర్మాణ రంగాలపై పడింది. దీంతో ధనికవర్గంపై ఇది ప్రతికూల ప్రభావం చూపింది. ఆర్థిక వ్యత్యాసాలు దీని వల్ల కొద్దిగా తగ్గాయి,’ అని పనగఢియా ఈ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. మొదట దారిద్య్రం బాగా తగ్గిపోయి పూర్వపు పేదల ఆదాయాలు పెరిగితే, ఆర్థిక అసమానతలను తర్వాత రూపుమాపడం కష్టమేమీ కాదనేది అత్యధిక ఆర్థికవేత్తల అభిప్రాయంగా కనిపిస్తోంది. అదీగాక, ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా ఆసియా ఖండం మారుతున్న నేపథ్యంలో భారతదేశానికి అనేక ఆర్థిక అవకాశాలు చేతికందుతున్నాయి. తయారీ, సేవల రంగంలో ఇండియాలో ఉత్పత్తి, ఎగుమతులు పెంచడానికి కొత్త పరిస్థితులు దోహదం చేస్తున్నాయి. (ఇదీ చదవండి: బంగారం కొనుగోళ్లకు డాలర్‌కు సంబంధమేంటి?) దేశంలో సంపద సృష్టించే కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ద్వారా పేదరికం మరింత తగ్గించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వాలు, ఆర్థికవేత్తలు–ఆర్థిక అసమానతలపై కన్నా దారిద్య్ర నిర్మూలనపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం ద్వారా మన లక్ష్యాన్ని సాధించవచ్చు. పేదరికం లేని నవభారతాన్ని నిర్మించవచ్చు. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
పేదరికంపై సాంకేతికాస్త్రం: మోదీ
బెంగళూరు: పేదరిక నిర్మూలనకు సాంకేతికతను తిరుగులేని అస్త్రంగా భారత్ ఉపయోగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆసియాలో అతి పెద్ద టెక్నాలజీ ఈవెంట్ అయిన 25వ బెంగళూరు టెక్ సమిట్ (బీటీఎస్)ను ఉద్దేశించి ఇండొనేసియాలోని బాలి నుంచి బుధవారం ఆయన వీడియో సందేశమిచ్చారు. భారత్‌లో చిరకాలం పాటు వేళ్లూనుకుని పోయిన అధికార అలసత్వాన్ని తమ హయాంలో నిర్మూలించామన్నారు. ‘‘భారత ప్రగతి ప్రస్థానంలో కొన్నేళ్లుగా అన్ని అంశాలూ అద్భుతంగా కలిసొస్తున్నాయి. ఆరోగ్యం, మేనేజ్మెంట్, ఫైనాన్స్ వంటి అన్ని రంగాల్లోనూ అంతర్జాతీయంగా భారతీయులు సారథ్య స్థానాల్లో రాణిస్తున్నారు. మాతో కలిసి పని చేసేకుందకు మీకిదే స్వాగతం’’ అని ఇన్వెస్టర్లనుద్దేశించి వ్యాఖ్యానించారు. గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్‌లో 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది 40 స్థానానికి ఎగబాకిందన్నారు. ‘భారత్‌లో గత ఎనిమిదేళ్లలో స్మార్ట్ఫోన్లు 15 కోట్ల నుంచి 75 కోట్లకు పెరిగాయి’ అని చెప్పుకొచ్చారు. -
పేదరికంపై ఆసియా పసిఫిక్ పోరాటానికి కరోనా ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో పేదరిక నిర్మూలన పోరాటానికి కోవిడ్–19 పెద్ద సవాలుగా నిలిచిందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తన తాజా నివేదికలో పేర్కొంది. కరోనా కష్టకాలం లేకపోతే 2020లోనే ఈ ప్రాంతం తీవ్ర పేదరిక సమస్య నుంచి బయటపడి, స్థిరత్వం సాధించేదని విశ్లేషించింది. నిర్దేశించుకున్నట్లు 2022లో కాకుండా 2020లోనే ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు రోజుకు 1.90 డాలర్ల (రూ.152) కంటే తక్కువతో జీవించే పరిస్థితి నుంచి కోలుకుని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుని ఉండేవాళ్లని మనీలా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ నివేదిక అభిప్రాయపడింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న మెజారిటీ ప్రజలు ఆర్థికంగా మరింత క్లిష్టతను ఎదుర్కొనవచ్చని అంచనావేసింది. ఏడీబీలో మొత్తం 68 సభ్యదేశాలు ఉండగా, ఇందులో 49 ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన దేశాలు ఉన్నాయి. తన కీలక ఇండికేటర్ల ప్రాతిపదికన ఏడీబీ విడుదల చేసిన నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► 2022లో ఈ ప్రాంతం తీవ్ర పేదరికం నుంచి బయటపడుతుందని కోవిడ్–19 పేరు వినపడకముందు అంచనావేయడం జరిగింది. చాలా మంచి ప్రజలు రోజుకు 1.90 డాలర్లకన్నా ఎక్కువ సంపాదిస్తారని, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని భావించారు. పరిస్థితి ఎంత ఆశాజనకంగా కనిపించిందంటే 2020లోనే లక్ష్యాన్ని ఆసియా పసిఫిక్ సాధించగలదన్న ధీమా ఏర్పడింది. అయితే ఈ పరిస్థితికి కోవిడ్–19 దెబ్బకొట్టింది. కరోనా నేపథ్యంలో చాలామంది ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయి. 2022 సగం పూర్తయినా, మెజారిటీ ప్రజాలు ఇంకా 1.90 డాలర్లకన్నా తక్కువ సంపాదనతోనే జీవనం వెల్లదీస్తున్నారు. ► ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ పురోగతి అసమానంగా ఉంది. దీర్ఘకాలిక సవాళ్లు కొనసాగుతూనే ఉంటాయి. ► ఆహార భద్రత, ఆరోగ్య సేవలు, విద్యా రంగాల్లో పురోగతి కనిపించడం లేదు. ► ప్రతి ఒక్కరికీ మరింతంగా సమాన ఆర్థిక అవకాశాలను అలాగే ఎక్కువ క్రియాశీలతను అందించడానికి ఈ ప్రాంతంలోని ప్రభుత్వాలు పటిష్ట చర్యలను, సమగ్ర విధానాలను తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. ► ఆసియా పసిఫిక్‌లో తీవ్ర పేదరికం 2030 నాటికి 1 శాతం కంటే తక్కువగా ఉంటుందని అంచనా. దాదాపు 25 శాతం జనాభా కనీసం మధ్యతరగతి స్థితికి చేరుకోవచ్చు. అంటే ఆయా వర్గం ప్రజలు రోజుకు 15 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం/వినియోగ సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు. అయితే ఇందుకు మొబిలిటీలో అవరోధాలు, ఇతర అనిశ్చితులు ఎదురుకాకుండా ఉండాలి. ► అభివృద్ధి చెందుతున్న ఆసియా ప్రస్తుతం స్టాగ్ఫ్లేషన్ (ధరల తీవ్రత, వృద్ధి మందగమన) సమస్యలను ఎదుర్కొంటోంది. భౌగోళిక ఉద్రిక్తతలు ఆహార భద్రతకు సవాళ్లను సృష్టించడంతోపాటు ఇంధన ధరల తీవ్రతకు కారణమవుతున్నాయి. -
శతమానం భారతి: పేదరిక నిర్మూలన
దేశంలో ఎంతగా సంపన్నులు ఉన్నారో, అంతగా పేదలూ ఉన్నారు. అంటే దీనర్థం రాజూ పేద సమాన సంఖ్యలో ఉన్నారని కాదు. అమెరికా, చైనాల తర్వాత భారత్‌లోనే ఎక్కువ మంది శత కోటీశ్వరులు ఉన్నట్లుగా, ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యంత పేదరికం అనుభవిస్తున్న వారు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారు. ఏది ఎలా ఉన్నా.. స్వాతంత్య్రానంతరం ఆర్థికపరమైన ఈ అసమానతలు క్రమంగా పెరుగుతూ ఉండటమే ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆర్థిక స్థిరత్వంతో పాటే అసమానతలూ తగ్గించడానికి భారత్ ప్రయత్నిస్తున్న మాటైతే కాదనలేనిది. ఇటీవలి కాలంలో భారత్‌లో ఆర్థిక అసమానతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 1947 తర్వాతి కాలంలో ఆర్థిక సామాజిక రంగాలలో పేదరికం తగ్గిన మాట వాస్తవమే అయినా.. ధనికులు మరింత ధనికులు కావడం, పేదలు మరింతగా పేదరికానికి చేరుకోవడం అన్నదీ కాదన లేని సత్యం. ఇదంతా ఎలా జరుగుతుందో చూడండి. అభివృద్ధి ప్రారంభ దశల్లో కొత్తగా వచ్చే అవకాశాలను ఉపయోగించుకుని లబ్ది పొందడం ధనవంతులకే సాధ్యం అవుతుంది. మరోవైపు, నైపుణ్యం లేని కార్మికులు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల వారి వేతనాలలో కోత పడి అసమానతలు పెరుగుతాయి. వచ్చే ఇరవై ఐదేళ్లలో ఒక విధానంగా అసమానతల్ని తగ్గించుకుంటూ పోతే కనుక.. భారత్‌లోని పేదరికం తగ్గుముఖం పడుతుంది. అందుబాటులో ఉన్న తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న వారు 69 కోట్ల మంది. వారిలో 20 శాతానికి పైగా భారత్‌లోనే ఉన్నారు! -
‘మీటూ’కి కొత్త వెర్షన్!
‘నేను కూడా’ (మీటూ) అంటూ లైంగిక వేధింపుల బాధితులు ధైర్యంగా బయటికొచ్చి చెప్పుకోవడం ఒక ఉద్యమంలా నాలుగేళ్ల క్రితమే మొదలైంది. ఎప్పుడో జరిగినదానికి ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని నిందితులు ఆక్రోశించినా.. ‘ఎప్పుడు జరిగితేనేం.. జరిగిందా లేదా?’ అని కోర్టులు కూడా బాధిత మహిళలకు అండగా ఉండటంతో పదీ పదిహేనేళ్ల క్రితం తమపై జరిగిన లైంగిక వేధింపులపైన కూడా ఇప్పుడు మహిళలు పోరాడగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక చైనా మహిళ తన బాస్‌తో మరో పదేళ్ల తర్వాత కాకుండా.. అక్కడికక్కడే, అప్పటికప్పుడే తేల్చేసుకోవడంతో ‘మీటూ’కి ఒక కొత్త ఉద్యమరూపం వచ్చినట్లయింది. పని చేసే చోట మహిళలపై వేధింపులు చైనాలో అయినా ఒకటే, ఇండియాలో అయినా ఒకటే. కనుక ఇది చైనా స్టోరీ అని పక్కన పడేసేందుకు లేదు. అక్కడి హైలాంగ్జియాన్ ప్రావిన్స్ లో ‘పేదరిక నిర్మూలన ప్రభుత్వ కార్యాలయం’ ఒకటి ఉంది. ఆ కార్యాలయ అధికారి వాంగ్. ఆయనే తన సిబ్బంది అందరికీ బాస్. ఝౌ అనే యువతి కూడా అక్కడ పని చేస్తోంది. ఝౌ అనేది ఆమె ఇంటి పేరు. వారిద్దరి అసలు పేర్లను బయట పెట్టవద్దని ప్రభుత్వం అక్కడి వార్తా సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. జరిగిందేమిటో ఇప్పటికే పది లక్షల మందికి పైగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో చూశారు కనుక వారి పేర్లతో పట్టింపు ఎవరికి ఉంటుంది! మొత్తానికి విషయం ఏమిటంటే బాస్ తన కింది మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించాడు. దాంతో అతడిని ప్రభుత్వం ఉద్యోగంలోంచి తొలగించింది. ఆ మధ్యలో ఏం జరిగిందన్నది మొత్తం 14 నిముషాల వీడియోగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభుత్వం మాత్రం వాంగ్ని ‘లైఫ్ డిసిప్లిన్ కారణాల వల్ల’ తీసేస్తున్నట్లు ప్రకటించింది కానీ విషయం అది కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఒక మహిళను వేధించిన కారణంగా ఒక అధికారిని తీసివేయవలసి వచ్చింది అని బహిరంగం గా ఒప్పుకోవడం చైనా ప్రభుత్వానికి పరువు తక్కువ. అందుకే డిసిప్లిన్ అనే మాటతో సరిపెట్టేసింది. ∙∙ వాంగ్ మొదట ఝౌ కు టెక్స్ట్ మెసేజ్ పంపడంతో ఇదంతా ఆరంభమైంది. అది అభ్యంతరకరమైన మెసేజ్. ఝౌ కూడా మెసేజ్‌తోనే అతనిని ఖండించవచ్చు. కానీ అలా చేస్తే మెసేజ్‌లతో సాగదీస్తాడని భయపడి, నేరుగా వెళ్లి చెప్పింది.. ‘బాస్, నాకు ఇలాంటివి నచ్చవు’ అని. అలా చెప్పి, ఇలా తన సీట్లోకి వచ్చేసరికి మళ్లొక మెసేజ్! బాస్ తన క్యాబిన్లో తను ఉండేవాడు, అక్కడి నుంచి మెసేజ్‌ల రూపంలో ఈమె ఫోన్లోకి వచ్చేసేవాడు. కొన్నాళ్లుగా ఇలా జరుగుతోంది. చివరికి విసుగెత్తిపోయిన ఝౌ.. నేరుగా అతడి క్యాబిన్లోకి వెళ్లింది. మామూలుగా వెళ్లలేదు. చేత్తో తుడుపు కర్రను తీసుకెళ్లింది. ‘‘నీకెంత చెప్పినా బుద్ధి లేదురా వెధవా..’అని ఆ కర్రతో ముఖం మీద, భుజం మీద బాది బాది వదిలింది. అతడేం మాట్లాడలేదు. కుర్చీలోంచి కదల్లేదు. ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఝౌ అతడి టేబుల్ మీద ఉన్న సామగ్రినంతా విసిరిపారేసింది. అతడిపై ముఖంపై నీళ్లు కొట్టింది. తుడుచుకుంటున్నాడు, మళ్లీ ఆమెనే చూస్తున్నాడు. పద్నాలుగు నిముషాలు పాటు ఝౌ అతడిని తిడుతూనే, కొడుతూనే ఉంది. ఆ మనిషి చలించలేదు. మధ్య మధ్య ఝౌ, అతడు తనకు ఎలాంటి మెసేజ్‌లు పంపుతున్నాడో ఎవరికో ఫోన్ చేసి చెబుతోంది. ఆఫీస్ స్టాఫ్ ఎవరూ బాస్‌కి సపోర్ట్‌గా ఆమెను అడ్డుకోలేదు. ఒకరెవరో వీడియో షూట్ చేస్తూ ఉన్నారు. వీడియో పూర్తయ్యేసరికి అతడి పనీ అయిపోయింది. నిరుత్తరుడై, నిమిత్తమాత్రుడై అలా కూర్చుండిపోయాడు. ‘సారీ’ అనలేదు, ‘నేననలా చెయ్యలేదు’ అనీ అనలేదు. పైగా ‘అదంతా జోక్’ అని తుడిచేసుకున్నాడు. కానీ ప్రభుత్వం అతడిని సీరియస్‌గా తీసుకుని సీట్లోంచి తొలగించింది. తుడిచే కర్రతో బాస్‌ను కొడుతున్న ఝౌ (వీడియో క్లిప్స్) -
పేదరిక నిర్మూలనకు ఉన్నఏకైక పరిష్కారం చదువే..
-
నోబెల్ వేడుక: ధోతి ధరించి.. భారతీయత ఉట్టిపడేలా!
స్టాక్‌హోమ్: ఇండో-అమెరికన్ ఆర్థికవేత్త అభిజిత్ వినాయక్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తేర్ డఫ్లోతోపాటు సహోద్యోగి మైఖేల్ క్రెమెర్ 2019 ఏడాదికిగాను ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిని అందుకున్నారు. అట్టహాసంగా జరిగిన నోబెల్ పురస్కార ప్రదానోత్సవానికి అభిజిత్ దంపతులు భారతీయత ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. ప్రపంచ పేదరిక నిర్మూలనకు ప్రయోగాత్మక విధానంలో విస్తృతమైన పరిశోధన చేసినందుకుగాను వారికి నోబెల్ అవార్డు వరించింది. వారి పరిశోధన ఆర్థిక శాస్త్ర రంగాన్ని పునర్నిర్వచించేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. Watch Abhijit Banerjee, Esther Duflo and Michael Kremer receive their medals and diplomas at the #NobelPrize award ceremony today. Congratulations! They were awarded the 2019 Prize in Economic Sciences “for their experimental approach to alleviating global poverty.” pic.twitter.com/c3ltP7EXcF — The Nobel Prize (@NobelPrize) December 10, 2019 పేదరిక నిర్మూలనకు ఈ త్రయం చేసిన కృషికిగాను మంగళవారం స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఆ దేశ రాజు కార్ల్- 16 గుస్తాఫ్ నుంచి అవార్డు అందుకొన్నారు. ఈ వేడుకలో భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ ధోతితోపాటు బ్లాక్ కలర్ బంద్‌గాల కోటు ధరించి భారతీయ సంప్రదాయ వేషాధారణలో అందరినీ ఆకర్షించారు. ఆయన భార్య ఎస్తేర్ డఫ్లో సైతం నీలి రంగు చీర ధరించి నోబెల్‌ను అందుకున్నారు. ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ అందుకున్న ఈ ముగ్గురు ఆర్థికవేత్తలకు పతకాలతో పాటు రూ. 6.7 కోట్లను (9 మిలియన్ల స్వీడిష్ క్రోనాలు) బహుమతిగా పొందారు. ముంబైలో జన్మించిన బెనర్జీ.. అమర్త్యసేన్ తరువాత ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న భారతీయ సంతతికి చెందిన రెండవ ఆర్థికవేత్తగా చరిత్రలోకి ఎక్కారు. నోబెల్ బహుమతి అందుకున్న అమర్త్య సేన్, అభిజిత్ బెనర్జీ .. కోల్‌కతా ప్రెసిడెన్సీ కళాశాలలో విద్యను అభ్యసించడం గమనార్హం. అభిజిత్ బెనర్జీ, భార్య ఎస్తేర్ డఫ్లోలు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఎంఐటీ) ఎకనామిక్స్ ప్రొఫెసర్లుగా విధులు నిర్వర్తిస్తుండగా.. క్రెమెర్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. భారతదేశంలో గ్రామీణ సమస్యలను పరిష్కరించడానికి కనీస హామీ పథకంతో పాటు పలు సలహాలు సూచించారు. చదవండి: అభిజిత్ ‘నోబెల్’ వెలుగు నీడలు -
ప్రతి ఒక్కరికీ సాధికారతే లక్ష్యం
న్యూఢిల్లీ: రెండోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ రోడ్‌మ్యాప్‌ను రాష్ట్రపతి కోవింద్ ఆవిష్కరించారు. 2014లో ప్రారంభమైన నిరంతర, నిరాటంక అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రజలు గట్టి తీర్పునిచ్చారని చెప్పారు. భారత ప్రజాస్వామ్య విశ్వసనీయతను ఈ సాధారణ ఎన్నికలు పెంపొందించాయన్నారు. రికార్డు స్థాయిలో 61 కోట్ల మంది ప్రజలు ఓటేశారని, వీరిలో మహిళలే ఎక్కువ శాతం ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో 2022 నాటికి నవభారతాన్ని నిర్మించేలా ప్రతి ఒక్కరికీ సాధికారతను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజలకు సాధికారత కల్పించడం ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం పేదలకు నివాస, ఆరోగ్యపరమైన సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. గురువారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి కోవింద్ సుమారు గంటసేపు ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం దేశానికి జమిలి ఎన్నికలు అవసరమని అన్నారు. ఎప్పుడూ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుండటం అభివృద్ధి కార్యక్రమాల వేగం, కొనసాగింపుపై ప్రభావం చూపిస్తోందన్నారు. అందువల్ల ఎంపీలందరూ ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’అనే అభివృద్ధి కాముక ప్రతిపాదనపై గట్టిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నానన్నారు. లోక్‌సభలో సగం మంది ఎంపీలు కొత్తగా ఎన్నికైన వారు కావడం, మునుపెన్నడూ లేనివిధంగా 78 మంది మహిళా ఎంపీలుండటం నవభారత దృశ్యాన్ని మన ముందు ఉంచుతోందన్నారు. భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు దేశ భద్రతకు ప్రభుత్వం అత్యంత అధిక ప్రాధాన్యతను ఇస్తోందంటూ మెరుపు దాడులను, పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులను రాష్ట్రపతి ప్రస్తావించారు. తొలుత మెరుపుదాడులతో, ఆ తర్వాత పుల్వామా దాడి నేపథ్యంలో సరిహద్దు పొడవునా ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడుల ద్వారా ప్రభుత్వం ఈ విషయంలో తన ఉద్దేశాన్ని, సామర్థ్యాన్ని చాటి చెప్పిందన్నారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరికి ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయన్నారు. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం ఇందుకు నిదర్శనమన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు సురక్షితమైన, ప్రశాంత వాతావరణం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. రైతు సంక్షేమానికి చర్యలు నవభారత నిర్మాణం సాధన దిశగా 21 రోజుల్లోనే ప్రభుత్వం.. రైతులు, సైనికులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, సమాజంలోని ఇతర వర్గాలు లక్ష్యంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. రైతులు, చిరు వ్యాపారులకు పింఛను పథకాలు ప్రారంభించేందుకు, రైతులందరికీ రూ.6 వేల ఇన్పుట్ సబ్సిడీ వర్తింపజేసేందుకు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రానున్న సంవత్సరాల్లో రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా గత ఐదేళ్లలో పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సాంఘిక దురాచారాల నిర్మూలన మహిళలకు సమాన హక్కులు కల్పించేలా ట్రిపుల్ తలాక్, నికా హలాల వంటి సాంఘిక దురాచారాల నిర్మూలనలో ప్రభుత్వం చిత్తశుద్ధిని రాష్ట్రపతి నొక్కి చెప్పారు. అవినీతిపై ఉక్కుపాదం మోపే విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు నల్లధన వ్యతిరేక కార్యాచరణను వేగంగా ముందుకు తీసుకువెళతామన్నారు. గత రెండేళ్లలో 4 లక్షల 25 వేల కంపెనీ డైరెక్టరపై అనర్హత వేటు వేశామని, 3 లక్షల 50 వేల అనుమానాస్పద కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వారి వివరాలన్నీ ప్రస్తుతం దేశానికి అందుతున్నాయని చెప్పారు. అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తుందన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థ విధానాన్ని, స్ఫూర్తిని బలోపేతం చేసేలా దేశ ప్రయోజనాల సాధనకు తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకుని పోతోందని చెప్పారు. ప్రసంగం సైడ్‌లైట్స్ ► ప్రసంగ సమయంలో కావేరీ జలాల సమస్యను తీర్చాలంటూ డీఎంకే పార్టీ సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేశారు. ► రాష్ట్రపతి ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ను, రఫేల్ అంశం గురించి ప్రసంగిస్తున్నపుడు ఎన్డీయే సభ్యులు చప్పట్లు చరిచారు. ► ప్రసంగసమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌సహా పలువురు ఎంపీలు మొబైల్ ఉపయోగించడం కెమెరాల కంటపడింది. ► రాష్ట్రపతి వెళ్లిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీల సభ్యులు పలువురు రాహుల్‌గాంధీని కలిశారు. సెంట్రల్ హాల్ నుంచి బయటకు వస్తూ సోనియా గాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పలకరించుకున్నారు. కోవింద్ ఏడాదిలో ఇది రెండోసారి రాష్ట్రపతి కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. క్రీమ్ కలర్ జోధ్‌పురి సూట్ (బంద్గలా) ధరించిన కోవింద్ అశ్విక దళం ముందూ వెనుకా నడుస్తుండగా బగ్గీలో కాకుండా కార్లో పార్లమెంటు ఆవరణకు చేరుకున్నారు. అంతకుముందు తన వ్యక్తిగత అంగరక్షకుల (పీబీజీ) గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి భవనం వెలుపల అశ్విక దళం (పీబీజీ) రాష్ట్రపతి వెంట ఉండటం అరుదుగా కన్పిస్తుంది. సాధారణంగా ఏడాదిలో మూడుసార్లు రాజధాని వాసులకు ఈ దృశ్యం కనువిందు చేస్తుంది. ఈ ఏడాది ఇలా జరగడం నాల్గోసారి. -
కాంగ్రెస్ హఠావో.. గరీబీ హఠావో
సుందర్‌గఢ్/సోనెపూర్: ఎన్నికల సమయంలో ప్రతిసారి కాంగ్రెస్ పేదరికాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీని వదిలించుకోనంత కాలం పేదరిక నిర్మూలన సాధ్యం కాదని అన్నారు. ఒడిశాలోని సుందర్‌గఢ్, సోనెపూర్లలో శనివారం ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ సర్కారు సమర్థవంతమైన విధానాలను అవలంబించడంలో విఫలమైందని, అందుకే ఇంకా ఒడిశాలో చాలా మంది పేదరికంలోనే మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి బీజేపీని గెలిపిస్తే రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటుందని, ఫలితంగా డబుల్ ఇంజిన్ వేగంతో ఒడిశా దూసుకుపోతుందని అన్నారు. పన్ను భారం పెంచుతుంది.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సామాన్యుల నడ్డి విరగ్గొట్టేలా ఉన్నాయని మోదీ అన్నారు. ఆ హామీలు కావాలంటే పన్నులు పెంచాలని, అది అంతిమంగా సామన్యులపై భారం పెంచుతుందని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలైతే చౌక ధరల దుకాణం ద్వారా పేదలకు అందుతున్న సరుకులు ప్రియం అవుతాయి. పేదరికాన్ని నిర్మూలిస్తామని చెబుతూ కాంగ్రెస్ రాజకీయంగా ప్రయోజనం పొందుతోంది. కాంగ్రెస్ తొలగిపోతే పేదరికం దానంతట అదే పోతుంది. పేదరికాన్ని నిర్మూలిస్తామని కాంగ్రెస్ చాన్నాళ్లుగా నినాదాలిచ్చినా, ఈ దిశగా ఒక్క చర్య కూడా చేపట్టలేదు’ అని అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేడీలు పేదరికాన్ని రాజకీయ ఆయుధంగా మలచుకోవడంతో ఒడిశాలో మావోయిస్టుల ప్రాబల్యం పెరిగిందని అన్నారు. కార్యకర్తల స్వేదఫలితం బీజేపీ బీజేపీ 39వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పారు. కార్యకర్తల శ్వేదం, శ్రమతోనే బీజేపీ ఏర్పడిందని, వారసత్వం, డబ్బుకు పార్టీలో చోటులేదని అన్నారు. ‘ప్రజాస్వామ్య విలువలు, దేశభక్తితోనే బీజేపీ దృఢంగా మారింది. సాటి భారతీయులకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందు వరసలో ఉంది. మనం చేపట్టిన అభివృద్ధి పనులతో దేశం నలుమూలలా ప్రజాభిమానం సంపాదించుకున్నాం’ అని ట్వీట్ చేశారు. -
పేదరిక నిర్మూలనకు వృద్ధి రేటు పెరగాలి
న్యూఢిల్లీ: పేదరిక నిర్మూలనకు, అభివృద్ధి ఫలాలు పేదలకు అందేందుకు అధిక వృద్ధి రేటు తప్పనిసరి అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఢిల్లీలో జరిగిన సేవింగ్స్ అండ్ రిటైల్ బ్యాంక్స్ 25వ ప్రపంచ కాంగ్రెస్ సదస్సులో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికంటూ అభివృద్ధి ప్రయోజనాల స్వచ్ఛందంగా వేచి చూడటం మనలాంటి ఆకాంక్షలతో కూడిన సమాజానికి సరిపోదు. దానికి మనలాంటి ఆర్థిక వ్యవస్థలకు అధిక వృద్ధి రేటు కావాలి. అధిక శాతం ప్రజలను పేదరికం నుంచి బయటపడేసేందుకు, వారి జీవన ప్రమాణాల ఉన్నతికి అభివృద్ధిని ఓ సాధనంగా వినియోగించుకోవాలి. అదే సమయంలో, అభివృద్ధి, ప్రగతి ఫలాలు కొందరికే లబ్ధి కలిగిస్తూ, చాలా మందిని దీనికి దూరంగా ఉంచుతున్న ప్రమాదాల పట్ల స్పృహతోనే ఉన్నాం’’ అని జైట్లీ వివరించారు. వృద్ధి తాలూకూ ప్రభావం అందరినీ చేరుకునేందుకు సమయం పడుతుందన్నారు. 2014 నుంచి మోదీ సర్కారు చేపట్టిన ఆర్థిక సేవల విస్తృతిపై మాట్లాడుతూ... ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద ప్రభుత్వ రంగ బ్యాంకులు 33 కోట్ల ఖాతాలను ప్రారంభించాయని చెప్పారు. జీరో బ్యాలన్స్ ఖాతాల్లో ప్రజలు డిపాజిట్లు చేయడం మొదలెట్టారని, ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా కల్పించామని తెలియజేశారు. మన దేశంలో ప్రధానంగా బీమా, పెన్షన్ సదుపాయాలు అందరికీ లేకపోవడంతో... చౌక ప్రీమియానికే బీమా సదుపాయం కల్పించామన్నారు. ప్రమాద బీమా కింద 14.1 కోట్ల మంది, జీవిత బీమా పథకం కింద 5.5 కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు తెలిపారు. తక్కువ ప్రీమియం పెన్షన్ పాలసీ అటల్ పెన్షన్ యోజనను కూడా తీసుకొచ్చినట్టు చెప్పారు. రుణ సదుపాయం లేని వారిని దృష్టిలో ఉంచుకుని ముద్రా పథకాన్ని తీసుకొచ్చామన్నారు. లిక్విడిటీ సమస్య వ్యవస్థాపరం కాదు: బ్యాంకర్లు లిక్విడిటీ కొరత వ్యవస్థాపరమైన సమస్య కాదని ప్రముఖ బ్యాంకర్లు స్పష్టంచేశారు. రోలోవర్‌కు సంబంధించి అన్ని ఎన్బీఎఫ్సీ కంపెనీలూ చెల్లింపులను చేయగలవని ఎస్బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్ చెప్పారు. సేవింగ్స్ అండ్ రిటైల్ బ్యాంక్స్ ప్రపంచ 25వ కాంగ్రెస్ సదస్సుకు హాజరైన సందర్భంగా పలువురు బ్యాంకింగ్ రంగ నిపుణులు లిక్విడిటీపై స్పందించారు. నాబార్డ్ చైర్మన్ హెచ్‌కే భన్వాలా మాట్లాడుతూ... లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. ‘‘కొన్ని సంస్థలు బ్యాంకుల నుంచి స్వల్పకాల రుణాలను తీసుకుని వాటిని కస్టమర్లకు దీర్ఘకాలిక రుణాలుగా ఇవ్వటం వల్ల వాటికి సంబంధించి పెద్ద సమస్య ఏదీ లేదు. అదో సమస్యే కానీ, వ్యవస్థాగత సమస్య కాదు’’ అని పేర్కొన్నారు. ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో లిక్విడిటీపై ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్నో బ్యాంకులతో పాటు, నాబార్డ్ సైతం ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సహకారం అందిస్తోందని భన్వాలా చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి తమకు రూ.15,000 కోట్ల ఎక్స్పోజర్ ఉందన్నారు. ‘‘మా మొత్తం రూ.4.80 లక్షల కోట్ల ఆస్తుల్లో రూ.15,000 కోట్లు అన్నవి చాలా స్వల్పం. వీటికి సంబంధించి రిస్క్ లేదు. ఏ ఎగవేత కూడా మాకు ఎదురు కాలేదు. రుణం తీసుకున్న ప్రతీ సంస్థ చెల్లింపులు చేస్తూనే ఉంది’’ అని భన్వాలా వివరించారు. -
రోడ్లకు మోక్షమెప్పుడో..!
► మిషన్ అంత్యోదయ పథకంతో సమగ్రాభివృద్ధి ► పేదరిక నిర్మూలనే లక్ష్యం ► జిల్లాలో 33 గ్రామాలు ఎంపిక బాగా వెనుకబడిన పల్లెలకు మహర్దశ రానుంది. ఇలాంటి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ అంత్యోదయ పథకానికి శ్రీకారం చుట్టింది. విద్య, వైద్యం, తాగునీరు, మరుగుదొడ్లు, పాఠశాలల్లో వంటషెడ్లు, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించనుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను వివిధ శాఖల సమన్వయంతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఆసిఫాబాద్: జిల్లాలోని 15 మండలాల్లో 173 గ్రామపంచాయతీలు, 431 రెవె న్యూ గ్రామాలున్నాయి. వీటిలో 5,15,812 జానాభా ఉండగా, 4,28,828 మంది, 83.14శాతం జ నాభా గ్రామీణ జనాభా ఉంది. జిల్లాలో అభివృద్ధిలో వెనుక బడిన 33 గ్రామాలను మిషన్ అంత్యోదయ పథకం కింద ఎంపిక చేశారు. జాతిపి త మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అక్టోబర్ 2, 2019 నాటికి అన్ని రంగాల్లో పూర్తిస్థాయి ప్రగతి సాధించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో మండల స్థాయిలో ఎంపీడీవోల ఆధ్వర్యంలో సర్వే చేపట్టి వెనుకబడిన గ్రామాలను గుర్తించి మిషన్ అంత్యోదయ కింద ఎంపిక చేశారు. అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. ఈ నిధులతో ఎంపికైన గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీటితోపాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా.. పల్లెల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మిషన్ అంత్యోదయ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, ఆదర్శ గ్రామాలు, వివాదరహిత, నేరరహిత గ్రామాలు, ఉత్తమ గ్రామపంచాయతీలతోపాటు ఎనిమిది అంశాలను పరిగణలోకి తీసుకొని మిషన్ అంత్యోదయ పథకంలో గ్రామాల ఎంపికకు ప్రాధాన్యత ఇచ్చారు. 2019 అక్టోబర్, 2 మహాత్మాగాంధీ జయంతి నాటికి 50 వేల గ్రామాల్లో పేదరికాన్ని నిర్మూలన చేయడమే ప్రధాన ఉద్దేశం. మహిళలు ఎదిగేందుకు ఆర్థికంగా చేయూత నివ్వడం, పల్లెల్లో ప్రతీ కుటుంబంలోని మహిళలు పొదుపు సంఘాల్లో చేర్పించడం, నిరుపేద యువతీ, యువకులకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇందుకోసం అవసరమైతే ఉపాధి హామీ నిధులు మళ్లించనున్నారు. గ్రామసభల ద్వారా మౌలిక వసతులు గుర్తించి, అవసరమున్న నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. మంజూరైన నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయి. అన్నిశాఖల సమన్వయంతో అభివృద్ధి జిల్లాలో ప్రస్తుతం అ న్ని శాఖల ద్వారా అ భివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను సమన్వయంతో పూర్తిగా అమలు చేయాల్సి ఉంటుంది. ఉపాధిహామీ పనులు, పాఠశాలల్లో మౌలి క వసతులు, వంటషెడ్లు, మరుగుదొడ్లు, గొర్రెల పెంపకానికి షెడ్ల నిర్మాణం, విద్య, వైద్యం, పారిశుధ్య పనులను మిషన్ అంత్యోదయ కింద చేపడతాం. – శంకర్, డీఆర్డీవో, ఆసిఫాబాద్ -
వేల ఆకాశాల సూర్యుడు
ఒక ఆకాశం... ఒక సూర్యుడు... ఇంతవరకే మనం చూసింది. వేయి ఆకాశాలు... ఒక సూర్యుడు.. ఇప్పుడు మనం చూడబోతున్నది! ఒక్కో ఆశా ఒక్కో ఆకాశం అనుకుంటే వేల ఆకాశాలలో ప్రకాశిస్తున్న సూర్యుడు... అచ్యుత సామంత! సూర్యుడు జీవశక్తిని ప్రసాదిస్తున్నట్లే.. ఈ ఒడిశా సూర్యుడు... వేల మంది గిరిజన బాలబాలికలకు బతుకు శక్తిని ఇస్తున్నాడు. చేరదీసి, ‘చదువుముద్ద’ పెట్టి... ఆశయాల దారులు పరుస్తున్నాడు. గిరులలో వెన్నెల్లు కురిపిస్తున్నాడు. ఆ కుర్రాడికి అప్పటికింకా నాలుగేళ్లే. ఓ రోజు అమ్మ భోరున ఏడుస్తోంది. బంధుమిత్రులు ఓదారుస్తున్నారు. అన్న, అక్క చెల్లెళ్లు ఆరుగురూ బిత్తరపోయి చూస్తున్నారు. ఎదురుగా చలనం లేకుండా తండ్రి! ఏం జరుగుతోందో తెలియదు... ఏదో జరిగిందని మాత్రం తెలుస్తోంది. రోజులు గడిచాయి. అమ్మ పల్లెటూరికి చేరింది. తోబుట్టువులు ఒక్కొక్కరూ ఒక్కో బంధువు ఇంట్లో చేరిపోయారు. పూరి గుడిసెలో అమ్మ, తను, చిట్టి చెల్లెలు! అంతే! బడికి తీసుకెళతానన్న నాన్న ఎంతకీ రాడు. ఓ పూట తింటే ఇంకోపూట పస్తు... కట్టుకునే బట్ట అరకొరే. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితి. ఈ పరిస్థితులే... అచ్యుత సామంత మనీషిగా ఎదిగేందుకు ప్రేరణయ్యాయి. ఆ సంకల్పం ఎంత బలమైందంటే... పాతికేళ్లు తిరక్కుండానే ఒడిశాలో చదువుకు అడ్రస్‌గా మారేంత! కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్... కుప్తంగా కిస్! మనలో చాలామంది ఈ పేరు కూడా విని ఉండం. కానీ ఈ దేశ రాష్ట్రపతులు మొదలుకొని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వరకూ... ముఖ్యమంత్రులు, దేశాధ్యక్షులు, సినీతారలు. క్రీడాకారులు... ఒక్కరనేమిటి... సమాజంలోని అన్ని వర్గాల వారికీ ఇప్పుడు ఇదో పర్యాటక స్థలం. చదువు అనేది పేదరిక నిర్మూలనకు ఎలా ఉపయోగపడుతుందో ఈ పాఠశాలను చూసి తెలుసుకోవాలని ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థ ప్రపంచానికి చెబుతోందంటే...ఈ పాఠశాల ప్రాముఖ్యత అర్థమవుతుంది. 1993– 94లో డాక్టర్ అచ్యుత సామంత స్థాపించిన ఈ విద్యాలయం ఎన్నో రకాలుగా ప్రత్యేకమైంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులున్న పాఠశాలగా రికార్డు సృష్టించింది ఇది. ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లలోని దాదాపు 62 గిరిజన తెగల బాలబాలికలు ఇక్కడ కేజీ నుంచి పీజీ వరకూ ఉచితంగా విద్యనభ్యసిస్తున్నారు. దాదాపు 80 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న కిస్ పూర్తిగా రెసిడెన్షియల్ కూడా. గిరిజన భాషల్లోనే ఓనమాలు నేర్పించడంతో మొదలయ్యే కిస్ విద్యాభ్యాసం ఆ తరువాత నెమ్మదిగా సంప్రదాయ క్లాస్‌రూమ్‌లకు మారుతుంది. ఇందుకోసం 62 గిరిజన తెగలకు చెందిన 18 భాషల్లో ప్రత్యేకమైన సిలబస్ సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కలలోనైనా ఊహించలేనన్ని సౌకర్యాలు. వేళకి ఇంత అన్నం వండిపెట్టేందుకు అత్యాధునిక సౌరశక్తి, విద్యాలయం మొత్తం వెలుగులు నింపేందుకు ఎల్ఈడీ బల్బులు, స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రెండు ఆర్వో ప్లాంట్లు ఉన్నాయి దీంట్లో. పిల్లలకు జబ్బు చేస్తే వైద్యమందించేందుకు 200 పడకల ఆసుపత్రి కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పిల్లల మాసిన గుడ్డలు ఉతకడానికి అత్యాధునికమైన వాషింగ్ మెషీన్లు, డ్రయ్యర్లు ఉన్నాయి. ఇంకో విశేషం ఏమిటంటే... ఇక్కడ పిల్లలు తమ యూనిఫాం తామే కుట్టుకుంటారు. చదువు నేర్చుకుంటూనే... డబ్బులు సంపాదించుకునేందుకు కూడా కిస్‌లో ఏర్పాట్లు ఉన్నాయి. పచ్చళ్ల తయారీ, సంప్రదాయ గిరిజన కళలు... పెయింటింగ్, బొమ్మల తయారీ, వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇలా తయారైన వస్తువులను మార్కెట్లో విక్రయించి... వచ్చిన లాభాల్లో సగం పిల్లల ఖాతాల్లో జమవేస్తారు. ఆటలకీ, క్రీడలకీ అత్యాధునికమైన ఆటస్థలం, సదుపాయాలతో పాటు ఒక జూడో శిక్షణా విభాగం కూడా ఉంది. మొత్తం పాఠశాలకీ, హాస్టలుకీ అన్నిటికీ కలిపి 1087 మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు ఉచితం... ఎలా సాధ్యమైంది? ఒకరా ఇద్దరా... దాదాపు పాతికవేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అంటే ఆషామాషీ కాదు కదా? బోలెడంత డబ్బు అవసరమవుతుంది. మరి అచ్యుత సామంత ఒక్కడే ఇంత మొత్తాన్ని ఎలా తెచ్చిపెట్టగలుగుతున్నాడు? అన్న ప్రశ్న వస్తే... కిస్ కంటే ఏడాది ముందు ప్రారంభమైన కళింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్టియ్రల్ టెక్నాలజీ... క్లుప్తంగా కిట్ గురించి చెప్పుకోవాలి. ఉత్కళ యూనివర్శిటీ నుంచి రసాయన శాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన తరువాత అచ్యుత సామంత కొన్నేళ్లపాటు ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశాడు. కట్టు పేదరికం నుంచి లెక్చరర్ స్థాయికి ఎదిగినా... జీవితం ఇక సాఫీగానే సాగిపోతుందని కచ్చితంగా తెలిసినా అచ్యుత సామంతలో ఏదో వెలితి. ఏదో చేయాలన్న తపన. ఈ ఆలోచనలతోనే చేతిలో ఉన్న ఐదువేల రూపాయల మొత్తంతో ఓ రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకున్నాడు ఆయన. వృత్తివిద్యా కోర్సులు నేర్పే కిట్ అందులోనే మొదలైంది. బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు నిరాకరించడంతో బంధువులు, స్నేహితుల వద్ద చేబదుళ్లు తీసుకుని కీట్‌ను నడపటం మొదలుపెట్టాడు. ఒకదశలో రూ.15 లక్షల అప్పులు చెల్లించమని అందరూ ఒత్తిడి తీసుకువస్తే చచ్చిపోదామన్న ఆలోచన కూడా అచ్యుతలో మెదిలిందట. అయితే విధి చాలా బలీయమైందని అంటారు కదా... ఓ బ్యాంకు ఈయనకు పాతిక లక్షలు అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఆ తరువాత అచ్యుత వెనుదిరిగి చూసుకోలేదు. కిట్‌ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందుకు తగ్గట్టుగానే కిట్ ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి చేరింది. కిట్‌కు ఇప్పుడు 300 ఎకరాల విశాలమైన సొంత క్యాంపస్ ఉంది. దేశ విదేశాలకు చెందిన 25 వేల మంది విద్యార్థులిప్పుడు అక్కడ వేర్వేరు కోర్సులు చేస్తున్నారు. కిట్ విజయవంతం కావడం కిస్కు వరంగా మారింది. ఎందుకంటే కిట్‌లో వచ్చే ఫీజులో కొంతభాగం కిస్ ఫౌండేషన్‌కు వెళుతుంది. అంతేకాదు... ఇక్కడి బోధన, బోధనేతర సిబ్బంది కూడా తమ జీతాల్లోంచి నెలనెల మూడు శాతం మొత్తాన్ని కిస్ నిర్వహణ కోసం విరాళంగా అందజేస్తారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ తన వంతు సాయం అందిస్తూంటే... ఒడిశా ప్రభుత్వం నిరుపయోగంగా పడి ఉన్న ఇండస్టియ్రల్ ఎస్టేట్ భూముల్ని కీట్ క్యాంపస్ ఏర్పాటుకు ఇచ్చింది. కిట్... కిస్ రెండూ నా సంతానం.. అట్టడుగు వర్గాల పిల్లలకు విద్యనందివ్వడం... అంధుడికి చూపునివ్వడంతో సమానమని విశ్వసించే డాక్టర్ అచ్యుత సామంత తన జీవితాన్ని మొత్తం కిట్, కిస్ల కోసం ధారపోశాడంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. పెళ్లి చేసుకుంటే తన జీవితంలో కొంత సమయాన్ని కుటుంబం కోసం వెచ్చించాల్సి వస్తుందని అవివాహితుడిగానే మిగిలిపోయాడు. అంతేకాదు... తనకంటూ ఏ రకమైన ఆస్తిపాస్తులు ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే దాదాపు పదివేల కోట్ల రూపాయల విలువైన విద్యాసంస్థలకు అధిపతి అయినప్పటికీ అన్ని ఆస్తులు కిస్ ఫౌండేషన్ పేరుమీదే ఉన్నాయి. సంస్థ యజమానిగా అచ్యుత తీసుకుంటున్న గౌరవ వేతనం ఇప్పుడు నెలకు రూ.30 వేలు మాత్రమే. ఇప్పటికీ రెండు గదుల అద్దెఇంట్లో ఉంటున్నారు. అచ్యుత సామంతను మీ లక్ష్యమేమిటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే... ఇంకో మూడేళ్లలో అంటే 2020 నాటికి ఒడిశాలోని 30 జిల్లాల్లో 30 కిస్ శాఖలను, అలాగే దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఒక్కో కిస్ శాఖను స్థాపించాలంటారు. మరింత మంది గిరిపుత్రులను పేదరికం ఊబి నుంచి బయటకు తీసుకురావచ్చు... అంటారాయన. – గిళియార్ గోపాలకృష్ణ మయ్యా ఉప్పుడు బియ్యం చేసి... నూక తిన్నారు! డాక్టర్ అచ్యుత సామంత 1965లో జమ్షెడ్పూర్లో జన్మించారు. కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న తండ్రి 1969లో ఓ రైలు ప్రమాదంలో మరణించారు. తండ్రి మరణం తరువాత తల్లి స్వగ్రామమైన కటక్ జిల్లా కలరాబంకా వెళ్లిపోయాడు. ఊరంతా తిరిగి ఎండుటాకులు ఏరుకు రావడం... మిగిలిన సమయాల్లో ఇరుగుపొరుగు పిల్లలతో కలిసి బలాదూరు తిరగడం ఇదీ చిన్నప్పటి అచ్యుత సామంత దినచర్య. ఒక రోజు స్కూల్ వద్ద గోల చేస్తూ ఆడుకుంటూంటే హెడ్మాస్టర్ చెవి మెలేశాడు. ఆనక అచ్యుత కుటుంబం పరిస్థితి తెలుసుకుని చలించిపోయాడు. స్కూల్లో చేరతావా? అని అడిగి పలక బలపం కొనిచ్చి అక్షరాలు దిద్దించాడు. సాయంత్రం ఇల్లిల్లూ తిరిగి వడ్లు సేకరించడం... వాటిని ఉప్పుడు బియ్యంగా మార్చడం మొదలుపెట్టాడు. ఈ శ్రమకు కొంత కూలీ దక్కేది. నూక రూపంలో ఇంట్లోకి తిండిగింజలూ చేరేవి. కష్టాలను ఎదుర్కొంటూ ఉత్కళ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ చేశారు సామంత. ►1993– 94లో డాక్టర్ అచ్యుత సామంత స్థాపించిన ఈ విద్యాలయం... ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులున్న పాఠశాలగా రికార్డు సృష్టించింది. 62 గిరిజన తెగల బాలబాలికలు కేజీ నుంచి పీజీ వరకూ ఉచితంగా విద్యనభ్యసిస్తున్నారు. ►ఇందులో గిరిజన భాషల్లోనే ఓనమాలు నేర్పిస్తారు. ఆ తరువాత నెమ్మదిగా సంప్రదాయ క్లాస్‌రూమ్‌లకు మారుతుంది. ఇందుకోసం 62 గిరిజన తెగలకు చెందిన 18 భాషల్లో ప్రత్యేకమైన సిలబస్ తయారు చేశారు. ►చదువుతోపాటు దుస్తులు కుట్టడం, పచ్చళ్ల తయారీ, పెయింటింగ్, బొమ్మల తయారీలో కూడా శిక్షణ ఇస్తారు. ►చేతిలో ఉన్న ఐదువేల రూపాయలతో రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకుని కిట్‌ను ప్రారంభించారు. బంధువులు, స్నేహితుల వద్ద చేబదుళ్లు తీసుకుని కీట్‌ను నడపటం మొదలుపెట్టాడు. ►ఒకదశలో రూ.15 లక్షల అప్పులు చెల్లించాల్సిన ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోదామనుకున్నారు. అయితే విధి చాలా బలీయమైంది. ఓ బ్యాంకు పాతిక లక్షలు అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఆ తరువాత అచ్యుత వెనుదిరిగి చూసుకోలేదు. -
రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు
కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తాం: ఆర్. కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో వెనుకబాటుకు గురైన వర్గాలే రిజర్వేషన్లకు అర్హులని తెలుగుదేశం ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య అన్నారు. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదని, ఈ విషయాన్ని జాతీయ కమిషన్లు కూడా స్పష్టం చేశాయని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ అర్థరహితమని, వారిని చేరిస్తే స్వాతంత్య్రానికి పూర్వం నుంచి వెనుకబాటుకు గురైన కులాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లకు మద్దతు కూడగట్టేందుకు హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో ఆర్. కృష్ణయ్య ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగే ఈ ఆందోళనలకు భారీఎత్తున బీసీలు తరలివస్తున్నట్లు చెప్పారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
ఉపగ్రహ చిత్రాలతో పేదరిక నిర్మూలన
వాషింగ్టన్: పేదల్ని గుర్తించి ఆదుకోవడం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలకు ప్రయాసతో కూడిన విషయం. ఆఫ్రికా ఖండలోనైతే మరింత కష్టం... ఈ సమస్యకు అమెరికాలోని స్టాన్‌ఫోర్ట్ శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొన్నారు. ఉపగ్ర హ చిత్రాల సాయంతో ప్రత్యేక కంప్యూటర్ పోగ్రాం ఉపయోగించి పేదల ప్రాంతాల్ని గుర్తించే విధానాన్ని ఆవిష్కరించారు. అత్యంత సూక్ష్మ స్థాయి ఉపగ్రహ చిత్రాలతో పాటు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఈ విధానంలో వినియోగిస్తారు. ఆఫ్రికాలోని ఐదు దేశాల్లో పేదల్ని గుర్తించే లక్ష్యంతో దీనికి రూపకల్పన చేశారు. కేవలం పగటి పూట ఉపగ్రహ చిత్రాలతో సరైన సమాచారం కష్టమని, రాత్రి సమయంలో తీసే చిత్రాలు కూడా ముఖ్యమని స్టాన్‌ఫోర్ట్ స్కూలు ఆఫ్ ఇంజనీరింగ్ పరిశోధన విద్యార్థి నీల్ జీన్ చెప్పారు. రాత్రి పూట ప్రకాశంగా కన్పించే ప్రాంతాలు ఎక్కువ అభివృద్ధి చెందినవని, దాని ఆధారంగా కూడా పేద ప్రాంతాల్ని గుర్తిస్తామన్నారు. -
పేదరిక నిర్మూలన ఆర్థికాభివృద్ధిలో భాగమే
సబ్సిడీల కోత అందుకు పరిష్కారం కాదు: ప్రొఫెసర్ జయతీ ఘోష్ సాక్షి, హైదరాబాద్: కార్పొరేటు సంస్థల విస్తృతి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని, కేవలం రుణ మాఫీలు రైతాంగాన్ని ఆదుకోలేవని, పేదరిక నిర్మూలన ఆర్థికాభివృద్ధిలో భాగమేనని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ జయతీ ఘోష్ అన్నారు. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్, స్కూల్ ఆఫ్ సోషల్ స్టడీస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమెను సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ సెమినార్‌కు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలుకరించింది. వ్యవసాయ రంగం సంక్షోభానికి ప్రత్యామ్నాయం? నూతన ఆర్థిక విధానాల పర్యవసానమే వ్యవసాయ రంగ సంక్షోభం. కార్పొరేట్ సంస్థల విస్తృతి ఈ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. వ్యవసాయ రంగానికి భారత్‌లో సమగ్ర విధానం లేదు. కార్పొరేట్ శక్తులు దీన్ని శాసిస్తున్నంత కాలం ఈ సంక్షోభం నుంచి బయటపడలేం. దశాబ్దాలుగా ఈ రంగాన్ని అలక్ష్యం చేయడం వల్లే ఇప్పుడు రైతులు, దళితులు, స్త్రీలను ఉపాధి మొదలు అన్ని అవకాశాలకూ దూరం చేస్తోంది. రైతు ఆత్మహత్యలకు పరిష్కారమేమిటి? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజోపయోగమైన వ్యవసాయ విధానాన్ని అనుసరించాలి. కేవలం రుణమాఫీలు రైతాంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయలేవు. తాత్కాలిక ప్రయోజనం మాత్రమే అందిస్తాయి. అవి కూడా వ్యవసాయ కూలీలకు వర్తించనీయడం లేదు. అలాగే రైతుల ఆత్మహత్యల అంచనాలోనే ప్రభుత్వం తప్పుడు విధానాలను అనుసరిస్తోంది. కౌలుదారులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. రాజధాని పేరుతో ప్రజల భూములను లాగేసుకోవడాన్ని ఎలా చూడాలి? పంటపొలాలను, అందులోనూ మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి లాగేసుకోవడం దుర్మార్గం. నష్టపరిహారంగా మార్కెట్ రేట్ ఒక్కటే ఇస్తే సరిపోదు. దానికి మూడు రెట్లు అధిక ధరను ప్రభుత్వం చెల్లించాలి. అలాగే వారికి అర్బన్ ల్యాండ్ ధరలు ఇవ్వాలి. పరిశ్రమల వల్ల గానీ, ప్రాజెక్టుల వల్లగానీ నిర్వాసితులైన వారికి ఉపాధి అవకాశం యివ్వాలి. ఏ రంగంలో నిర్వాసితులైనా మొదట దాని ప్రభావం స్త్రీలపైనే ఉంటుంది. ముందుగా ఉపాధి కోల్పోయేది స్త్రీలే. కుటుంబ భారమంతా వారిపైనే పడుతుంది. ఏపీలో కూడా జరుగుతున్నదిదే. వ్యవసాయ రంగంలో స్త్రీ-పురుష అసమానతలను ఎలా అర్థం చేసుకోవాలి? కార్పొరేట్స్ గుప్పిట్లోనే మన ఆర్థిక రంగం బందీ అయింది. విద్య, ఉద్యోగం అన్నింటినీ ప్రైవేటు పరం చేసేశారు. ఉద్యోగాల కోసం ఒత్తిడి ఎక్కువై... వేతనాల్లో అంతరాలు, లింగ వివక్ష పెరిగాయి. వ్యవసాయ రంగంలో వేతనాల్లో ఈ రోజుకీ అసమానతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పెంచి పోషిస్తోన్న ప్రైవేటు రంగాన్ని ప్రశ్నించే వారెవరు? ప్రైవేటీకరణ క్రమేణా ప్రజల హక్కులను హరించివేస్తోంది. జీఎస్టీపై మీ అభిప్రాయం? బహుళ జాతి కంపెనీలను సంతృప్తి పరచడానికీ, వారిమెప్పు పొందడానికీ మాత్రమే జీఎస్టీని తెచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా ఈ విధానం లేదు. పేదరిక నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలు? పేదరిక నిర్మూలన సామాజిక బాధ్యత. ప్రభుత్వం క్రమేణా సామాజిక బాధ్యత నుంచి వైదొలగుతోంది. వేలకోట్ల రూపాయలు బడా పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇస్తూ, సాధారణ, పేద ప్రజానీకానికి ఇచ్చే సబ్సిడీలకు కోత పెడుతోంది. ఉపాధి దొరకక, ఉద్యోగ భద్రత లేక కార్మికులు వేతన భరోసాలేని కూలీలుగా మారుతున్నారు. ప్రధానంగా స్త్రీలు పనిలేనివారవుతున్నారు. ఆశా వర్కర్లకిచ్చే జీతం రూ.1,500 నుంచి రూ.3,500 లోపు. ఉపాధి హామీకింద పనిచేసే వారికి నెలల తరబడి జీతాలుండవు. ఈ పథకాన్నీ ప్రభుత్వం వదిలించుకోవాలని చూస్తోంది. పేదరిక నిర్మూలన ఆర్థికాభివృద్ధిలో భాగమే.. ఆర్థికాభివృద్ధికి ఆటంకం కాదు. ఈ విషయాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. -
పట్టణీకరణతోనే పేదరిక నిర్మూలన
స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పుణెలో 14 ప్రాజెక్టులకు శ్రీకారం నగరాల్ని వేగంగా అభివృద్ధి చేయడం మన బాధ్యత నగరాభివృద్ధిలో ప్రజా ప్రాతినిధ్యం పెరగాలి: మోదీ పుణే: పేదరిక నిర్మూలనకు పట్టణీకరణ ఒక అవకాశమని, అది సమస్య కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్మార్ట్ సిటీల పథకంలో భాగంగా పుణేలో శనివారం ఆయన 14 ప్రాజెక్టులనుప్రారంభించారు. ఇతర స్మార్ట్ నగరాలకు సంబంధించి 69 పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఒకప్పుడు పట్టణీకరణను సమస్యగా భావించేవారని, తాను అలా అనుకోవడం లేదన్నారు. ‘ఆర్థిక రంగానికి చెందిన వారు నగరాలను అభివృద్ధి కేంద్రాలుగా భావిస్తారు. పేదరికాన్ని రూపుమాపే సామర్థ్యం వేటికైనా ఉన్నాయంటే అవి నగరాలు మాత్రమే. అందుకే ప్రజలు వెనుకబడ్డ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వెళ్తూ అవకాశాలు అందుకుంటున్నారు. వీలైనంతమేర పేదరికాన్ని రూపుమాపడానికి నగరాల్ని బలోపేతం చేయడం ఇప్పుడు మన బాధ్యత.. ఇది తక్కువ సమయంలో జరగాలి. అభివృద్ధి కోసం కొత్త మార్గాల్ని జతచేయాలి. అదేమీ కష్టమైన పని కాదు, సాధ్యమే’ అని మోదీ చెప్పారు. అభివృద్ధిలో ప్రజా ప్రాతినిధ్యం కీలకం నగరాల అభివృద్ధి కోసం సమగ్ర, ఒకదాని కొకటి అనుసంధానమైన, లక్ష్య శుద్ధితో కూడిన విధానాన్ని అవలంబించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిలో ప్రజా ప్రాతినిధ్యం కీలకమని... నగరాల్లో నివసించే ప్రజలే వారి ప్రాంతాల్ని ఎలా అభివృద్ధి చేయాలో నిర్ణయించాలన్నారు. వాటిని ఢిల్లీలోని నేతలు తీసుకోకూడదని చెప్పారు. స్మార్ట్ సిటీస్ అభివృద్ధి ప్రణాళిక నిర్ణయాల్లో ప్రజా భాగస్వామ్యం పెరగాలని పిలుపునిచ్చారు. నగరాల్ని అభివృద్ధికి ఆధునిక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు తీవ్ర పోటీ అవసరమని గుర్తుచేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని తిరోగమనంలో నడిపించాయని, తమ ప్రభుత్వం ప్రగతి కోసం కొత్త మార్గాల్ని అన్వేషిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. ‘స్మార్ట్ సిటీస్‌ను అలంకారంగా కాకుండా పేద ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించే మిషన్‌గా చూడాలి. సమగ్ర పద్దతిలో నగర ప్రాంత పేదలకు ఇళ్లు కల్పించడం మొదలైనవి ఇందులో భాగం. స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా నాణ్యమైన పాలన, ప్రజా సేవల కోసం డిజిటల్ సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలి. స్మార్ట్ సిటీస్ పై 25 లక్షలకు పైగా ప్రజలు అంకితభావంతో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నగరాభివృద్ధికి గత ప్రభుత్వాల హయాంలో ఖర్చుపెట్టలేదు. భారత్ కన్నా వెనకాల స్వాతంత్య్రం సంపాదించుకున్న దేశాలు తక్కువ సమయంలో మనల్ని దాటి వెళ్లిపోయాయి. 125 కోట్ల మంది ప్రజల బలాల్ని మంచి పని కోసం వాడితే... వాళ్ల నైపుణ్యాల్ని ఉపయోగిస్తే... అద్భుతాలు చేయగలరు. అప్పుడు ప్రభుత్వాల అవసరం ఉండదు... ప్రపంచం తనంతట తాను ముందుకు దూసుకుపోతుంది’ అని మోదీ చెప్పారు. ప్రధానిని కలసిన బాలిక.. ప్రధాని కార్యాలయం సాయంతో గుండె ఆపరేషన్ చేయించుకున్న ఆరేళ్ల బాలిక వైశాలి.. ప్రధాని మోదీని పుణేలో కలుసుకుంది. వైశాలిని కలుసుకున్న ఫొటోల్ని మోదీ ట్వీటర్లో పోస్టు చేశారు. దేశ చరిత్రలోనే ఇదొక మలుపు: వెంకయ్య నాయుడు శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ... గతంలో కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎదురుచూసేదని, ఇప్పుడు ఆలోచనల్ని అందించే వారి కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. శుభ్రత పాటించాలంటూ ప్రజల్ని కోరడం అనే ఆలోచన వల్లే స్వచ్ఛ్ భారత్ విజయవంతమైందన్నారు. పట్టణ ప్రాంతాల్లో వ ర్థ్యాల నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా మేక్ యువర్ సిటీ స్మార్ట్ పోటీని ప్రారంభించారు. నగరాల్లో రోడ్లు, కూడళ్లు, బహిరంగ స్థలాల నమూనాల్ని ప్రజలు ఈ పోటీ ద్వారా పంచుకోవచ్చు. కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... దేశ చరిత్రలో ఇదొక మలుపు అని, ప్రధాని ప్రారంభించిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు నగర పునరుజ్జీవనంలో తొలి అడుగు అని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో స్మార్ట్ సిటీస్ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్ సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రులు బాబు సుప్రియో, ప్రకాశ్ జవదేకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కంప్యూటర్లతో కాదు కోళ్లతో..
పేదరిక నిర్మూలనకు బిల్‌గేట్స్ పరిష్కారం వాషింగ్టన్: పేదరిక నిర్మూలనకు కంప్యూటర్లు పనికిరావని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తెలిపారు. ప్రపంచంలోని పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కంప్యూటర్లు, ఇంటర్నెట్తో పనిలేదని.. వారు (పేదలు) కోళ్లు పెంచుకుంటే సరిపోతుందని గేట్స్నోట్స్.కామ్‌లో ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్, హీఫర్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి ఆఫ్రికాలోని సహారా ఎడారి దక్షిణ ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలకు లక్ష కోళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంతంలో మేలురకం కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించటం వల్ల ఇక్కడి ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచవచ్చని బిల్‌గేట్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కేవలం 5 శాతం మంది మాత్రమే కోళ్ల పెంపకాన్ని చేపడుతున్నారని దీన్ని 30 శాతానికి పెంచటమే తమ లక్ష్యమని బిల్‌గేట్స్ పేర్కొన్నారు. ‘కోళ్ల పెంపకానికి చాలా తక్కువ మొత్తమే ఖర్చవుతుంది. కానీ ఇవి చాలా వేగంగా గుడ్లను, చికెన్‌ను ఇస్తాయి. దీని వల్ల ఆదాయం తద్వారా మహిళా సాధికారత పెరుగుతాయి’ అన్నారు. ఈ డబ్బును మహిళలు తిరిగి పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. -
మీ సహకారంతోనే సాధ్యం
ప్రజల అండతోనే పేదరిక నిర్మూలన: మోదీ * బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతోంది * గరీబీ హఠావోకు ఎంచుకున్న మార్గం సరికాదు * ‘రెండేళ్ల’ సందర్భంగా ఒడిశాలో భారీ సభ బాలాసోర్ (ఒడిశా): దేశంలో పేదరిక నిర్మూలన సాధించేందుకు ప్రజల సహకారం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని గమనించాలన్న మోదీ.. ఒడిశాతోపాటు వివిధ రాష్ట్రాల్లో రాజకీయ మార్పు జరగాలన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఒడిశాలోని బాలాసోర్‌లో గురువారం ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. గరీబీ హఠావో అనే నినాదాన్నిచ్చిన ఇందిరాగాంధీపై విమర్శలు చేశారు. ‘గత 40-50 ఏళ్లుగా దేశంలో గరీబీ హఠావో నినాదాన్ని వింటూనే వస్తున్నాం. ఈ నినాదాన్నిచ్చిన వారి ఉద్దేశాలు చెడుగా ఉండకపోవచ్చు. కానీ.. పేదరికం, నిరుద్యోగం విషయంలో వీరు చేపట్టిన ఏ పనులూ ఫలితాన్నివ్వలేదు. వారు ఎంచుకున్న మార్గం సరిగా లేకపోవటమే ఇందుకు కారణం’ అని మోదీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అభివృద్ధికి పర్యాయపదంగా మారిందన్నారు. తను ప్రజలకు జవాబుదారీనన్న మోదీ.. ఎప్పుడైనా నవీన్ పట్నాయక్ (ఒడిశా సీఎం) ప్రజలకు లెక్కలుచెప్పారా? అనిప్రశ్నించారు. ‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని గమనించండి. వాటితో పోలిస్తే ఒడిశా చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ కూడా బీజేపీకి అధికారమివ్వండి’ అని ప్రధాని తెలిపారు. దేశంలో తూర్పు ప్రాంతం కంటే పశ్చిమప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందిందోప్రజలు ఆలోచించాలన్నారు. రుణాలపై పేదల ‘ముద్ర’: చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఉద్దేశించిన ముద్ర పథకం విజయవంతమైందన్న ప్రధాని.. రుణాలను తిరిగి చెల్లించటం ద్వారా పేదలు తమ విశాల హృదయాన్ని చాటుకుంటున్నారన్నారు. ఈ పథకం కింద పేదలకు రూ.50 వేల నుంచి 10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. కాగా, ‘రెండేళ్ల’ ప్రచారంలో భాగంగా.. బీజేపీ ఢిల్లీ విభాగం మోదీ రథాలను ప్రారంభించింది. 5 వేల కొత్త ఐటీఐలు న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోటిన్నర మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే ఐఐటీల సామర్థ్యాన్ని మరో ఆరు లక్షలు పెంచాలని, 5 వేల కొత్త ఐటీఐలను ఏర్పాటుచేయాలని సంకల్పించింది. ఈమేరకు గురువారమిక్కడ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన జాతీయ నైపుణ్య అభివృద్ధి మిషన్ గవర్నింగ్ కౌన్సిల్ తొలి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్ అవసరాలను గుర్తించి సరైన నైపుణ్య శిక్షణ ఇవ్వాలని మోదీ చెప్పారు.ఐఐటీల సామర్థాన్ని ప్రస్తుతమున్న 18.5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. -
పేదరిక నిర్మూలనకే ‘ముద్ర’
చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు రుణాలు: వెంకయ్య నాయుడు సాక్షి, హైదరాబాద్: నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడే నిరుద్యోగులను స్వయంఉపాధి వైపు నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. పేదరిక నిర్మూలనతోపాటు యువత, చిరు వ్యాపారులు, చేతివృత్తులవారికి తోడ్పాటు అందించేందుకు ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర (మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ) యోజన పథకం ప్రచార కార్యక్రమాన్ని వెంకయ్య నాయుడు శుక్రవారమిక్కడ ప్రారంభించి, లబ్ధిదారులకు రుణపత్రాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న పరిశ్రమలతోపాటు వ్యాపారులు, చేతివృత్తులవారిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి ఉపాధి అవకాశాలు పెంపొందించాలని ప్రధాని మోదీ భావించారని, అందులో భాగంగానే ముద్ర యోజనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ముద్ర పథకానికి ఆర్బీఐ రూ. 20 వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు అర్హులైనవారికి రుణాలు మంజూరు చే స్తారన్నారు. అక్టోబర్ 2 వరకు ఈ పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. రుణాల మంజూరులో రాజకీయ జోక్యం కూడా ఉండదని చెప్పారు. రుణాల చెల్లింపులో పేదలే ముందుంటారని, మహిళా పొదుపు సంఘాలు తీసుకున్న రుణాలను 98 శాతం తిరిగి చెల్లించడమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలు, వ్యాపారులే బ్యాంకులకు బకాయిదారులుగా ఉన్నారని తెలిపారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, పీహెచ్డీ చదివినవారు ఫ్యూన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి బాధాకరమన్నారు. దేశంలో 4 కోట్ల మంది ఎంప్లాయీమెంట్ ఎక్స్ఛేంజ్లలో నమోదు చేసుకొని ఎదురు చూస్తున్నారన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కె. లక్ష్మణ్, జి. కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలనకే ‘తెలంగాణ పల్లె ప్రగతి’
దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది పదేళ్లలో మీరు చేయని అభివృద్ధి మేం చేస్తున్నాం.. మీకేంటి నొప్పి? కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు కౌడిపల్లిలో తెలంగాణ పల్లెప్రగతి ప్రారంభించిన మంత్రులు కౌడిపల్లి: పేదరిక నిర్మూలనకే ప్రభుత్వం తెలంగాణ పల్లెప్రగతి పథకం ప్రారంభించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కె.తారకరామారావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత పదేళ్లలో చేయని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందని, ఫలితంగా దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. శనివారం మెదక్ జిల్లా కౌడిపల్లిలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిని వచ్చే ఐదేళ్లలో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పల్లెప్రగతి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రపంచ బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం రూ.642 కోట్లతో రాష్ట్రంలోని 150 మండలాల్లో పేదలకు, ఇతరులకు జీవనోపాధి కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 4.20 లక్షల స్వయం సహా యక సంఘాలు రూ. ఐదు వేల కోట్లు రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తున్నారని, దేశంలోనే ఇంత ఎక్కువసంఖ్యలో మహిళలకు ఏ రాష్ట్రం రుణాలు ఇవ్వడం లేదన్నారు. గ్రామాల్లో ‘పల్లె సమగ్ర సేవాకేంద్రాలు’ ఏర్పాటుచేసి అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, దేశం కళ్లులేని కబోదులు: హరీశ్ కాంగ్రెస్, టీడీపీ నాయకలు కళ్లులేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డి, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లిదయాకర్‌రావులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా? అన్నారు. ఈ అభివృద్ధి మాటున తామెక్కడ గల్లంతవుతామనే భయం వారిదని ఆయన ఎద్దేవా చేశారు. స్త్రీల సంపాదనతోనే అభివృద్ధి: పోచారం గ్రామాల్లో మహిళల సంపాదన బాగుంటేనే కుటుంబం వృద్ధి చెందుతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పల్లెప్రగతితో మహిళలకు బాగా లబ్ధి చేకూరుస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రేమండ్‌పీటర్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు పరమేశ్, శాఖశెట్టి వినయ్‌కుమార్, సెర్ప్ సీఈవో మురళి, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. అఖండజ్యోతిలా గ్రామజ్యోతి నర్సాపూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం.. వారం పది రోజుల కోసం చేస్తున్నది కాదనీ, అఖండ జ్యోతిలా ఎల్లప్పుడూ వెలుగొందాలనే లక్ష్యంతో రూపొందించిన కార్యక్రమమని రాష్ర్ట పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శనివారం ఆయన నర్సాపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు, పారిశ్రామిక విధానాలకు దేశంలో మంచి గుర్తింపు లభిస్తోందన్నారు. గ్రామప్రజల భాగస్వామ్యంతో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకే గ్రామజ్యోతి చేపట్టినట్లు కేటీఆర్ చెప్పారు. 150 మండలాల్లో పల్లెప్రగతి అమలు రాష్ట్రంలో పల్లెప్రగతి పథకాన్ని 150 మండలాల్లో అమలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రూ.652 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో రెండున్నర లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల కంటే మెదక్ జిల్లా పన్నుల వసూలులో ప్రథమ స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ కితాబునిచ్చారు. -
నేటి నుంచి ‘పల్లెప్రగతి’
కౌడిపల్లిలో పైలాన్‌ను ఆవిష్కరించనున్న కేటీఆర్ కార్యక్రమం అమలుకు 150 మండలాల ఎంపిక పేదల జీవనోపాధి కోసం రూ. 642 కోట్లు హైదరాబాద్: రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఏర్పాటు చేసిన ‘పల్లె ప్రగతి’ పైలాన్‌ను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారకరామారావు శనివారం ఆవిష్కరించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఐదేళ్లపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు రూ. 450 కోట్ల ఆర్థిక సాయం అందించనుండగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 192 కోట్లు (మొత్తంగా రూ. 642 కోట్లు) వెచ్చించనున్నారు. తొలి విడ తగా రాష్ట్రంలో వెనుకబడిన 150 మండలాలను ఎంపిక చేసిన అధికారులు ఆయా ప్రాంతాల్లో పేద వర్గాలకు జీవనోపాధి కల్పించడం, వారిని మానవ వనరుల అభివృద్ధికి చేరువ చేయడం, సామాజిక హక్కులు కల్పించడం వంటి కార్యక్రమాలను చేపడతారు. ఎంపిక చేసిన మండలాల్లో చిన్న, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో వాల్యూ చైన్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్, డిజిటల్ లోకల్ గవర్నమెంట్, ఐసీటీ-టీఏ భాగస్వామ్యం, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ సపోర్టు కార్యక్రమాలను నిర్వహించనుంది. ప్రాజెక్టును అమలు చేసేందుకు ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ, అమలు, సమీక్ష, పథకం నిర్వహణ కమిటీ లు సెర్ప్ అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తాయి. లక్ష్యాలు ఇవీ.. ఎంపిక చేసిన మండలాల్లో 2.5 లక్షల మంది పేద వ్యవసాయదారుల జీవనోపాధి, ఆదాయాన్ని పెంపొందించడం 2.5 లక్షల కుటుంబాలకు సరైన ఆరోగ్యం, పౌష్టికాహారం, పరిశుభ్రత వంటి అంశాల్లో మానవ వనరుల అభివృద్ధి ఐదు లక్షల కుటుంబాలకు ప్రభుత్వ వ్యవస్థ ద్వారా మెరుగైన అవకాశాలు కల్పించడం ఆసరా, ఉపాధి హామీ వంటి పథకాల్లో లబ్ధిదారుల నమోదు, నగదు చెల్లింపుల ద్వారా సామాజిక భద్రత హక్కు కల్పించడం -
పేదరిక నిర్మూలనే లక్ష్యం: చంద్రబాబు
* కర్నూలులో స్వాతంత్య్ర దిన వేడుకల్లో సీఎం చంద్రబాబు * త్వరలో డీఎస్సీ.. ఇకపై ఏటా నోటిఫికేషన్ కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పేదరిక నిర్మూలనే లక్ష్యమని, ఆర్థిక అసమానతలు లేని, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దిన తొలి వేడుకలను శుక్రవారం కర్నూలులోని ఏపీఎస్పీ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ దళాల (కంటింజెంట్ల) నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రాజధానిని రాష్ట్రానికి మధ్యలోనే ఏర్పాటు చేసినా, స్వాతంత్య్ర వేడుకులను ఏటా ఒక్కో జిల్లాలో నిర్వహిస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్త టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేస్తాం. విశాఖ, తిరుపతి, విజయవాడలను మెగాసిటీలుగా, జిల్లాకొకటి చొప్పున 13 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తాం. 14 విమానాశ్రయాలు, 14 పోర్టులు అభివృద్ధి చేస్తాం. అక్టోబర్ 2 నుంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఆరోగ్యశ్రీ పేరును ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’గా మార్చి చికిత్స గరిష్ట పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచుతాం. వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను 7 గంటల విద్యుత్ 9 గంటలకు పెంచుతాం. అక్టోబర్ 2 నుంచి ఇళ్లకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాను అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులకు హెల్త్ కార్డులు ఇస్తాం. చికిత్స గరిష్ట పరిమితి రూ. 2లక్షలుగా నిర్ధారించాం. వచ్చే నెల 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. పోలవరం ప్రాజెక్టును నాలుగైదేళ్లలో పూర్తి చేస్తాం. రాయలసీమను విత్తన రాజధానిగా, పరిశ్రమల హబ్‌గా మారుస్తాం. కర్నూలు - ప్యాపిలి - పోరుమామిళ్ల - కృష్ణపట్నం, కర్నూలు - నంద్యాల - గిద్దలూరు - గుంటూరు మధ్య 6 లేన్ల రోడ్లు నిర్మిస్తాం. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఇకపై ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తాం. కర్నూలుపై వరాల జల్లు... కేంద్రం ప్రకటించిన 100 స్మార్ట్ సిటీల్లో తొలి నగరంగా కర్నూలును అభివృద్ధి చేస్తాం. నగరానికి సమీపంలోని ఓర్వకల్లు వద్ద 30 వేల ఎకరాల భూమిలో పారిశ్రామిక నగరం ఏర్పాటు. మాన్యుఫాక్చరింగ్, హార్డ్‌వేర్, ఐటీ పరిశ్రమల ఏర్పాటు. అక్కడే విమానాశ్రయం నిర్మాణం. తుంగభద్ర నదిపై సి.బెళగల్ మండలం గుండ్రేవుల వద్ద 22 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తాం. నంద్యాలలోని వ్యవసాయ కళాశాలను డీమ్డ్ యూనివర్సిటీగా మారుస్తాం. నిమ్స్ తరహాలో ‘రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్’ను అభివృద్ధి చేస్తాం. ఎవరూ ఊహించనిది జరిగింది:బాబు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో టీడీపీ గెలిచి అధికారం చేపడుతుందని ఏవరూ ఊహించలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి దానికీ ఓ టైం ఉంటుందని, ఎన్నికల్లో అలా తనకు టైం కలిసొచ్చిందని అన్నారు. తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని, అప్పటివరకు హైదరాబాద్‌లోనే ఉంటానని చెప్పారు. స్వాతంత్య్ర దిన వేడుకల అనంతరం కర్నూలులో కొందరు విలేకరులకు ఏర్పాటు చేసిన తేనీటి విందులో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాజధాని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీకంటే ఆంధ్రప్రదేశ్‌పై తనకే ఎక్కువ అవగాహన ఉందని చంద్రబాబు తెలిపారు. విజయవాడ, గుంటూరు మధ్యనే రాజధాని ఉంటుందని, భూముల సేకరణ పెద్ద సమస్యకాదని చెప్పారు.