ఉపగ్రహ చిత్రాలతో పేదరిక నిర్మూలన
వాషింగ్టన్: పేదల్ని గుర్తించి ఆదుకోవడం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలకు ప్రయాసతో కూడిన విషయం. ఆఫ్రికా ఖండలోనైతే మరింత కష్టం... ఈ సమస్యకు అమెరికాలోని స్టాన్‌ఫోర్ట్ శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొన్నారు. ఉపగ్ర హ చిత్రాల సాయంతో ప్రత్యేక కంప్యూటర్ పోగ్రాం ఉపయోగించి పేదల ప్రాంతాల్ని గుర్తించే విధానాన్ని ఆవిష్కరించారు. అత్యంత సూక్ష్మ స్థాయి ఉపగ్రహ చిత్రాలతో పాటు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఈ విధానంలో వినియోగిస్తారు. ఆఫ్రికాలోని ఐదు దేశాల్లో పేదల్ని గుర్తించే లక్ష్యంతో దీనికి రూపకల్పన చేశారు.
కేవలం పగటి పూట ఉపగ్రహ చిత్రాలతో సరైన సమాచారం కష్టమని, రాత్రి సమయంలో తీసే చిత్రాలు కూడా ముఖ్యమని స్టాన్‌ఫోర్ట్ స్కూలు ఆఫ్ ఇంజనీరింగ్ పరిశోధన విద్యార్థి నీల్ జీన్ చెప్పారు. రాత్రి పూట ప్రకాశంగా కన్పించే ప్రాంతాలు ఎక్కువ అభివృద్ధి చెందినవని, దాని ఆధారంగా కూడా పేద ప్రాంతాల్ని గుర్తిస్తామన్నారు.