విశ్వాసం అంటే అందరితో పోల్చుకోవడం కాదు.. | Taapsee Pannu Decodes What Is Confidence With Her New Pic | Sakshi
Sakshi News home page

విశ్వాసం అంటే అందరితో పోల్చుకోవడం కాదు..

Published Mon, Jan 4 2021 11:46 AM | Last Updated on Mon, Jan 4 2021 12:09 PM

Taapsee Pannu Decodes What Is Confidence With Her New Pic - Sakshi

ముంబై: అందం, స్టైల్‌, ఫ్యాషన్‌లో ఆటిట్యూడ్‌ను ప్రదర్శించడంలో హీరోయిన్‌ తాప్పీ పన్నుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తన సొంత నిర్ణయాల ప్రకారం సినిమాలను, పాత్రలను ఎంపిక చేసుకుంటూ విజయవంతంగా దూసుకుపోతున్నారామె. ఈ క్రమంలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికి ఆత్మవిశ్వాసంతో ముందుకువెళుతున్న తాప్పీ తాజాగా విశ్వాసం అంటే ఎంటో వివరించారు. సినిమా సెట్స్‌లోపి తన ఫొటో షూట్‌కు సంబంధించిన ఓ ఫొటోను తాప్సీ ఆదివారం సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. బూడిద రంగు మ్యాక్సీ టాప్, కర్లీ హేర్ స్టైల్‌‌, రౌండ్‌ బ్లాక్‌ సన్‌గ్లాస్‌ ధరించిన ఆమె ఈ ఫొటోలో  ఫ్యాషన్‌గా ఉన్న ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ కాన్ఫిడెన్స్‌ అంటే ఏంటో నిర్వచించారు. (చదవండి: ఆ ‌నియమం పెట్టుకున్నా : హీరోయిన్‌ తాప్సీ)

‘విశ్వాసం అంటే అందరికంటే నేను గొప్ప అంటూ ఆలోచించుకుంటూ మీ గదిలో వెళ్లడం కాదు.. మొదట మిమ్మిల్ని మీరు ఎవరితో పోల్చుకోకపోవడమే విశ్వాసం’ అంటూ హ్యాపీ సండే అనే హ్యాష్‌ ట్యాగ్‌ను‌ జత చేశారు. ఇక తన పోస్టు చూసిన తాప్పీ అభిమానులు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేగాక తాప్పీ బాయ్‌ఫ్రెండ్‌ మాతియాస్‌ బోయ్..‌ కళ్లలో హర్ట్‌ సింబల్‌ ఉన్న ఎమోజీలతో తన స్పందనను తెలిపాడు. కాగా ప్రస్తుతం తాప్పీ ‘రష్మి రాకెట్’‌ షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  స్పోర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ ఇటీవల రాంచిలో జరిగింది. ఇందులో తాప్సీ గుజరాతి అథ్లేట్‌ రష్మిగా లీడ్‌రోల్‌ పోషిస్తున్నారు. అంతేగాక ‘రష్మి రాకేట్’‌తో పాటు ‘హసీన్‌ దిల్‌రూబా’, ‘లూప్‌ లపేటా’ వంటి సినిమాల్లో కూడా ఆమె నటిస్తున్నారు. (చదవండి: నీకు అది మాత్రం కనబడదు కదా: తాప్సీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement