వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
పిట్లం, న్యూస్‌లైన్:
ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన స్వామి వివేకానందను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఆలె భాస్కర్ అన్నారు. పిట్లంలోని బాలుర ఉన్నతపాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివేకానంద 150 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఏబీవీపీ నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులను ప్రదానం చేశారు. ఆలె భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశ విశిష్టతను తెలిపింది వివేకానందుడేనన్నారు.
ఆయన మాటలే స్ఫూర్తిగా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అంతకు ముందు వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో తహశీల్దార్ ఖాద్రీ, ఎస్సైలు ప్రశాంత్, సతీశ్‌రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ షేక్‌సలాం, ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్‌రెడ్డి, ఏబీవీపీ, కిసాన్‌మోర్చ నాయకులు రవికుమార్, భాస్కర్‌యాదవ్, ఉదయ్, తానాజీ, రాకేశ్, శివ, వేణుగోపాల్ పాల్గొన్నారు.
అన్నం బాగా లేదని ఆందోళన
Published Fri, Dec 13 2013 2:19 AM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM
Advertisement
Advertisement