విశ్వాసం లేని వ్యక్తి కేసీఆర్
- కాంగ్రెస్‌కు నష్టం జరిగినా సోనియా తెలంగాణ ఇచ్చారు
- స్వార్థం లేకుండా పనిచేసింది జేఏసీ ఒక్కటే..
- కేంద్ర మంత్రి బలరాంనాయక్
- కాంగ్రెస్‌లో చేరిన మానుకోట జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : తెలంగాణలో విశ్వాసం లేని వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనని కేంద్రమంత్రి బలరాంనాయక్ తీవ్రంగా విమర్శించారు. మహబూబాబాద్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ డోలి సత్యనారాయణ, నాయకులు పిల్లి సుధాకర్, కళాకారుల జేఏసీ కన్వీనర్ కంబాలపల్లి సత్యనారాయణ, కుల సంఘాల జేఏసీ కన్వీనర్ గుంజె హన్మంతు, వడు ప్సా నాయకుడు గుండోజు దేవేందర్, బుర్ర గోవర్ధన్, నలమాససాయి, బత్తులకృష్ణ, బిక్షపతి, వాహెద్, సోహె ల్, ఖాజా, గాంధీ వెంకన్నతోపాటు పలువురు జేఏసీ, టీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం మాజీ మంత్రి రెడ్యానాయక్, ఎమ్మెల్యే మాలోతు కవిత సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్భంగా మానుకోటలోని వీఆర్‌ఎన్ గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బలరాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఏ స్వార్థం లేకుండా ఉద్యమించింది జేఏసీ ఒక్కటేనని కొనియాడారు. అయితే, కేసీఆర్ మాత్రం ఆది నుంచి స్వార్థంతో వ్యవహరించారని, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు.
వారిది కుటుంబ పునర్నిర్మాణం
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం పదవిపై ప్రేమ ఉండడం వల్లే ముందు చెప్పినట్లు కాంగ్రెస్‌లో విలీనం కావడం లేదని మాజీ మంత్రి రెడ్యానాయక్ అన్నారు. కేసీఆర్ పునర్నిర్మాణం కోసం కాకుండా కుటుంబ పునర్నిర్మాణం కోసం కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంతో ధైర్యంగా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, ఇప్పుడు ఇవ్వకుంటే మరో వందేళ్లయినా రాష్ర్టం ఏర్పడేది కాదన్నారు. కాంగ్రెస్‌లో చేరిన డోలి సత్యనారాయణకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.
మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. ఆ వెంట నే మానుకోటను జిల్లాకు ఏర్పాటుచేస్తామని రెడ్యా తెలి పారు. ఎమ్మెల్యే మాలోతు కవిత మాట్లాడుతూ సోని యాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇవ్వ డం వల్లే జేఏసీ బాధ్యులు కాంగ్రెస్‌లో చేరారని, వారికి రుణపడి ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరిన డోలి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవడానికే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు.
టీఆర్‌ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు మనస్తాపం కలిగించామని, డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి టీఆర్‌ఎస్ లో చేరి పార్టీ టిక్కెట్ తెచ్చుకున్నారని, ఇప్పుడు ఆమె తెలంగాణ కోసం ఉద్యమించినట్లుగా భావించాలా అని ప్రశ్నించారు. అలా గే, మానుకోటకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు ఇటీవలి ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని, ఇందులో కోట్లాది రూపాయ లు చేతులు మారాయని ఆరోపించారు.
తొలుత జేఏసీ నాయకులు ర్యాలీగా వీఆర్‌ఎన్ గార్డెన్‌సకు చేరుకోగా.. సమావేశంలో అమరవీరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో నాయకులు మహేందర్‌రెడ్డి, పర్కాల శ్రీనివాసరెడ్డి, దేవరం ప్రకాష్‌రెడ్డి, కాటా భాస్కర్, మల్గిరెడ్డి సుధ, ముత్యం వెంకన్న, వెన్నం లక్ష్మారెడ్డి, కైరంకొండ యాదగిరి, మూలగుండ్ల వెంకన్న, భూక్య ప్రవీణ్‌నాయక్, బాలు నాయక్, అయూబ్ తదితరులు పాల్గొన్నారు.