
వైతరిణి ఎలా ఉంటుంది?
జీవులు ఆయువు తీరిన తర్వాత తాను చేసిన పాపపుణ్యాలను బట్టి స్వర్గనరకాలకు వెళతారని విశ్వాసం. అలా నరకానికి వెళ్లే క్రమంలో వైతరణి అనే నదిని దాటవలసి వుంటుందని కూడా కొన్ని పురాణాలలో ఉంటుంది. ఇంతకీ ఆ వైతరణీ నది ఎలా ఉంటుందో చూద్దామా...
వైతరణీనది వంద యోజనాల వెడల్పుతో ఉంటుంది. అందులో చిక్కని రక్తం. దానితో పాటు చీము కూడా.
మహా జలచరాలు. భరించలేనంత దుర్వాసన. ఎన్ని దీనాలాపనలు చేసినా, పాపి చేసిన పాపాలకు ఫలితం అక్కడ అనుభవించాల్సిందే. అందు కనే మరణించిన వారి సంతానం భువిపై వారి పేరు మీద గోదానం చేస్తారు. గోదానం చేస్తే వైతరిణి నదిని సులభంగా దాటగలరని శ్రీమహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి తెలియచెప్పినట్లు గరుడ పురాణంలో తెలుస్తుంది.